AP SCERT 6th Class Maths Textbook Solutions Chapter 9 ద్విమితీయ – త్రిమితీయ ఆకారాలు InText Questions and Answers.
AP State Syllabus 6th Class Maths Solutions 9th Lesson ద్విమితీయ – త్రిమితీయ ఆకారాలు InText Questions
పేజి నెం. 131
1. మీ నోటు పుస్తకంలో 6 వివిధ రకాల బహుభుజుల యొక్క చిత్తు పటాలు గీయండి. ఏ సందర్భంలో బహుభుజి ఏర్పడదు? ఎందుకు ? బహుభుజి ఏర్పడటానికి కావలసిన కనీస భుజాల సంఖ్య ఎంత? కచ్చితంగా మూడు.
సాధన.
పై పటాల నుండి, ఒకటి, రెండు భుజాలతో బహుభుజి ఏర్పడదు. బహుభుజి ఏర్పడాలంటే కనీసం మూడు భుజాలు కావాలి.
నీ ప్రగతిని సరిచూసుకో [పేజి నెం. 133]
పక్కపటం పరిశీలించండి.
1. ∆GHI త్రిభుజానికి అంతరంలో గల బిందువులేవి?
సాధన.
∆GHI కి అంతరంగా గల బిందువులు B, O, A.
2. త్రిభుజం మీద గల బిందువులేవి?
సాధన.
∆GHI మీద గల బిందువులు G, P, H, I, Y.
3. A GHI త్రిభుజానికి బాహ్యంగా గల బిందువులేవి?
సాధన.
∆GHI కి బాహ్యంగా గల బిందువులు M, R, S, X, Z.
పేజి నెం. 137
ప్రశ్న 1.
ఒక దీర్ఘ చతురస్రాకార కాగితాన్ని (పోస్టుకార్డు వంటిది) తీసుకోండి. దాని పొడవు వెంబడి మధ్యకు మడవగా ఒక సగభాగం, మరో సగభాగంతో కచ్చితంగా ఏకీభవించాలి. అయితే ఈ మడత వెంబడి ఏర్పడిన రేఖ సౌష్ఠవ రేఖ అవుతుందా ? ఎందుకు?
సాధన.
అవును. ఎందుకంటే దీర్ఘచతురస్రాకార కాగితం యొక్క రెండు భాగాలు ఒకదానితో ఒకటి సరిగ్గా సమానంగా ఉంటాయి. కాబట్టి, మడత వెంబడి ఏర్పడిన రేఖ సౌష్ఠవ రేఖ.
ప్రశ్న 2.
కాగితం మడతను విప్పి మరల వెడల్పు వెంబడి మధ్యకు మడవండి. ఇప్పుడు ఏర్పడిన రెండవ మడత వెంబడి రేఖ కూడ సౌష్ఠవ రేఖ అవుతుందా ? ఎందుకు ?
సాధన.
అవును. ఎందుకంటే దీర్ఘచతురస్రాకార కాగితం యొక్క రెండు భాగాలు ఒకదానితో ఒకటి సరిగ్గా సమానంగా ఉంటాయి. కాబట్టి, రెండవ మడత వెంబడి ఏర్పడిన రేఖ కూడా సౌష్ఠవ రేఖ.
ప్రశ్న 3.
ఇలా ఏర్పడిన రెండు రేఖలు, సౌష్ఠవ రేఖలని నీవు అనుకుంటున్నావా ! ఎందుకు ?
సాధన.
అవును. ఇలా ఏర్పడిన రెండు రేఖలు సౌష్ఠవ రేఖలు. ఒకటి పొడవు వెంబడి సౌష్ఠవరేఖ మరియు మరొకటి వెడల్పు వెంబడి సౌష్ఠవ రేఖ.
ప్రాజెక్టు [పేజి నెం. 137]
1. మీ పరిసరాలలో లభించే సౌష్ఠవ పటాలను సేకరించండి. అతికించండి.
సాధన.
పేజి నెం. 140
1. కింది వస్తువుల ఆకారాలను గుర్తించి, పట్టికలో రాయండి.
వస్తువు | ఆకారం |
అగ్గిపెట్టె | |
బంతి | |
కొయ్యదూలం | |
పాచిక | |
పుట్టినరోజు టోపి |
సాధన.
వస్తువు | ఆకారం |
అగ్గిపెట్టె | దీర్ఘఘనం |
బంతి | గోళము |
కొయ్యదూలం | స్థూపము |
పాచిక | ఘనం |
పుట్టినరోజు టోపి | శంఖువు |
ఉదాహరణలు
ప్రశ్న 1.
కింది త్రిభుజాన్ని పరిశీలించి, అందులో శీర్షాలు, భుజాలు మరియు కోణాలను రాయండి.
సాధన.
ఇవ్వబడిన ∆ PQR లో
శీర్షాలు : P, Q, R
భుజాలు : \(\overline{\mathrm{PQ}}, \overline{\mathrm{QR}}, \overline{\mathrm{RP}}\)
కోణాలు : \(\angle \mathrm{P}, \angle \mathrm{Q}, \angle \mathrm{R}\).
ప్రశ్న 2.
ఇవ్వబడిన చతుర్భుజం పరిశీలించి, కింది ప్రశ్నలకు జవాబివ్వండి.
1. \(\angle \mathbf{E}\) కు ఆసన్న కోణమేది?
2. \(\angle \mathbf{G}\) కు ఎదురుగా ఉండే కోణమేది?
సాధన.
1. EFGH చతుర్భుజంలో
\(\angle \mathbf{H}\) మరియు \(\angle \mathbf{F}\) అనే కోణాలు \(\angle \mathbf{E}\) కు ఆసన్నకోణాలు.
2. \(\angle \mathbf{G}\) కు ఎదురుగా ఉండే కోణం \(\angle \mathbf{E}\).