SCERT AP 6th Class Maths Solutions Chapter 3 గ.సా.కా – క.సా.గు Ex 3.7 Textbook Exercise Questions and Answers.
AP State Syllabus 6th Class Maths Solutions 3rd Lesson గ.సా.కా – క.సా.గు Exercise 3.7
ప్రశ్న 1.
ఈ కింది సంఖ్యల క.సా.గు, గ.సా.భాలను కనుక్కోండి.
అ) 15, 24
ఆ) 8, 25
ఇ) 12, 48
ఈ) 30, 48
వాటి మధ్య గల సంబంధాన్ని సరిచూడండి.
సాధన.
అ) 15, 24
15, 24 ల క.సా.గు = 3 × 5 × 8 = 120
15, 24 ల గ.సా.భా = 3
క.సా.గు × గ.సా.భా = 120 × 3 = 360
15, 24 ల లబ్దం = 15 × 24 = 360
∴ క.సా.గు మరియు గ.సా.భాల లబ్దం = ఆ రెండు సంఖ్యల లబ్దం
ఆ) 8, 25
8, 25 ల క.సా.గు = 2 × 4 × 5 × 5 = 200
8, 25 ల గ.సా.భా = 1
క.సా.గు × గ.సా.భా = 200 × 1 = 200
8, 25 ల లబ్దం = 8 × 25 = 200
∴ క.సా.గు × గ.సా.భా = ఆ రెండు సంఖ్యల లబ్దము
ఇ) 12, 48
12, 48 ల క.సా.గు = 2 × 2 × 2 × 2 × 3 × 1 × 1 = 48
12, 48 ల గ.సా.భా = 12
క.సా.గు × గ.సా.భా = 48 × 12 = 576
12, 48 ల లబ్దం = 12 × 48 = 576
∴ క.సా.గు × గ.సా.భా = ఆ రెండు సంఖ్యల లబ్దం
ఈ) 30, 48
30, 48 ల క.సా.గు = 2 × 3 × 5 × 8 = 240
30, 48 ల గ.సా.భా = 6
క.సా.గు × గ.సా.భా = 6 × 240 = 1440
ఆ రెండు సంఖ్యల లబ్దం = 48 × 30 = 1440
∴ క.సా.గు × గ.సా.భా = ఆ రెండు సంఖ్యల లబ్దం
ప్రశ్న 2.
రెండు సంఖ్యల క.సా.గు 290 మరియు వాటి లబ్దం 7250, అయిన వాటి గ.సా.భా ఎంత?
సాధన.
రెండు సంఖ్యల క.సా.గు = 290
రెండు సంఖ్యల లబ్దం = 7250
వాటి గ.సా.భా = ?
క.సా.గు × గ.సా.భా = రెండు సంఖ్యల లబ్దం
∴ రెండు సంఖ్యల గ.సా.భా = 25
ప్రశ్న 3.
రెండు సంఖ్యల లబ్దం 3276. వాటి గ.సా.భా 6, అయిన వాటి క.సా.గు ఎంత?
సాధన.
రెండు సంఖ్యల లబ్దం = 3276
ఆ రెండు సంఖ్యల గ.సా.భా = 6
వాటి క.సా.గు = ?
ప్రశ్న 4.
రెండు సంఖ్యల గ.సా.భా 6 మరియు వాటి క.సా.గు 36. ఒక సంఖ్య 12, అయిన రెండవ సంఖ్య ఎంత?
సాధన.
రెండు సంఖ్యల గ.సా.భా = 6
ఆ రెండు సంఖ్యల క.సా.గు = 36
ఆ రెండింటి సంఖ్యలలో ఒక సంఖ్య = 12
రెండవ సంఖ్య = ?
∴ రెండవ సంఖ్య = 18
ప్రశ్న 5.
రెండు సంఖ్యల గ.సా.భా 16 మరియు క.సా.గు 384 గా వుండవచ్చా? కారణం రాయండి.
సాధన.
లెక్క ప్రకారం రెండు సంఖ్యల గ.సా.భా = 16
క.సా.గు = 384
క.సా.గు 384 ను గ.సా.భా. 16 నిశ్శేషంగా భాగిస్తున్నది.
కావున రెండు సంఖ్యల గ.సా.భా 16, వాని క.సా.గు 384 గా ఉండవచ్చును.
ప్రశ్న 6.
రెండు సంఖ్యల గ.సా.భా 14 మరియు క.సా.గు 204 గా వుండవచ్చా? కారణం రాయండి.
సాధన.
లెక్క ప్రకారం రెండు సంఖ్యల గ.సా.భా = 14
క.సా.గు = 204
క.సా.గు 204 ను గ.సా.భా 14 నిశ్శేషంగా భాగించడం లేదు.
కావున రెండు సంఖ్యల గ.సా.భా 14 మరియు క.సా.గు 204 గా ఉండదు.