SCERT AP 6th Class Maths Solutions Chapter 3 గ.సా.కా – క.సా.గు Unit Exercise Questions and Answers.
AP State Syllabus 6th Class Maths Solutions 3rd Lesson గ.సా.కా – క.సా.గు Unit Exercise
ప్రశ్న 1.
భాజనీయతా సూత్రం ప్రకారం ఇచ్చిన సంఖ్యలను వర్గీకరించండి.
సాధన.
ప్రశ్న 2.
11 భాజనీయతా సూత్రంను ఉదాహరణతో రాయండి.
సాధన.
11 భాజనీయతా సూత్రము :
సంఖ్యలోని బేసి స్థానాలలోని అంకెల మొత్తం, సరిస్థానాలలోని అంకెల మొత్తంల తేడా ‘0’ లేదా 11 యొక్క గుణిజం అయిన ఆ సంఖ్య 11 చే నిశ్శేషంగా భాగింపబడుతుంది.
ఉదా :
సంఖ్యను తీసుకొందాం.
బేసి స్థానాలలోని అంకెల మొత్తం = 3 + 4 = 7
సరి స్థానాలలోని అంకెల మొత్తం = 4 + 3 = 7
వీని భేదం = 0
బేసి స్థానాలలోని అంకెల మొత్తం, సరిస్థానాలలోని అంకెల మొత్తంల భేదం ‘0’ కావున 3443ను 11 నిశ్శేషంగా భాగిస్తుంది.
ప్రశ్న 3.
సరైన సమాధానంతో పట్టికను పూరించండి.
ఏవైనా రెండు వరుస సంఖ్యల | ఏవైనా రెండు వరుస సరి సంఖ్యల | ఏవైనా రెండు వరుస బేసి సంఖ్యల | |
గ.సా.కా |
సాధన.
ఏవైనా రెండు వరుస సంఖ్యల | ఏవైనా రెండు వరుస సరి సంఖ్యల | ఏవైనా రెండు వరుస బేసి సంఖ్యల | |
గ.సా.కా | 1 | 2 | 1 |
ప్రశ్న 4.
ప్రధాన కారణాంక విభజన పధ్ధతి ద్వారా 70, 105 మరియు 175 ల గ.సా.భాను కనుగొనండి.
సాధన.
ఇచ్చిన సంఖ్యలు = 70, 105, 175
70 = 2 × 5 × 7
105 = 3 × 5 × 7
175 = 5 × 5 × 7
70, 105, 175 ల గ.సా.భా = 5 × 7 = 35
ప్రశ్న 5.
భాగహార పద్ధతి ద్వారా 18, 54, 81 ల యొక్క గ.సా.భాను కనుక్కోండి.
సాధన.
ఇచ్చిన సంఖ్యలు = 18, 54, 81
18, 54 ల గ.సా.భా = 18
8, 81 ల గ.సా.భా = 9
∴ కావున 18, 54, 81 ల గ.సా.భా = 9
ప్రశ్న 6.
రెండు పద్ధతుల ద్వారా 4, 12, 24 ల యొక్క క.సా.గును కనుక్కోండి.
సాధన.
ఇచ్చిన సంఖ్యలు 4, 12, 24
ప్రధాన కారణాంక విభజన పద్ధతిలో క.సా.గు:
4 = 2 × 2
12 = 2 × 2 × 3
24 = 2 × 2 × 2 × 3
భాగహార పద్ధతిలో క.సా.గు:
క.సా.గు = 2 × 2 × 3 × 1 × 1 × 2 = 24
కనీసం రెండు సంఖ్యలలో ఉమ్మడి కారణాంకాలు = 2, 2, 3
మిగిలిన కారణాంకాలు = 2
∴ క.సా.గు = 2 × 2 × 3 × 2 = 24
ప్రశ్న 7.
మూడు రకాల నూనెలు 32 లీటర్లు, 24 లీటర్లు మరియు 48 లీటర్లు పాత్రలో ఉన్నాయి. మూడింటిని కచ్చితంగా కొలవడానికి కావలసిన కొలతపాత్ర యొక్క గరిష్ఠ ఘనపరిమాణం ఎంత?
సాధన.
మూడు రకాల నూనెల పరిమాణం = 32 లీటర్లు, 24 లీటర్లు, 48 లీటర్లు.
మూడింటిని కచ్చితంగా కొలవడానికి కావలసిన పాత్ర యొక్క గరిష్ఠ ఘనపరిమాణం = 32, 24, 48 ల గ.సా.భా
32, 24 ల గ.సా.భా = 8
8 మరియు 48 ల గ.సా.భా = 8
∴ మూడింటిని ఖచ్చితంగా కొలవడానికి కావలసిన కొలత పాత్ర యొక్క గరిష్ఠ ఘనపరిమాణం = 8 లీటర్లు
ప్రశ్న 8.
రెండు సంఖ్యల గ.సా.భా మరియు క.సా.గులు వరుసగా 9 మరియు 54. ఒక సంఖ్య 18 అయిన రెండవ సంఖ్యను కనుక్కోండి.
సాధన.
రెండు సంఖ్యల గ.సా.భా = 9
మరియు క.సా.గు = 54
అందులో ఒక సంఖ్య = 18
రెండవ సంఖ్య = ?
∴ రెండవ సంఖ్య = 27