AP Board 6th Class Maths Solutions Chapter 4 పూర్ణసంఖ్యలు Ex 4.1

SCERT AP 6th Class Maths Solutions Chapter 4 పూర్ణసంఖ్యలు Ex 4.1 Textbook Exercise Questions and Answers.

AP State Syllabus 6th Class Maths Solutions 4th Lesson పూర్ణసంఖ్యలు Exercise 4.1

ప్రశ్న 1.
కింది వాక్యాలలో ఏవి సత్యం? ఏవి అసత్యం?
అ) -7 అనేది -6 నకు సంఖ్యారేఖపై కుడివైపున ఉంటుంది.
ఆ) ‘సున్న’ అనేది ధన సంఖ్య.
ఇ) 29 అనేది సున్నకు సంఖ్యారేఖపై కుడివైపున ఉంటుంది.
ఈ) -1 అనేది -2 మరియు 1 అనే పూర్ణసంఖ్యల మధ్య కలదు.
ఉ) -5 మరియు +5 ల మధ్య 9 పూర్ణ సంఖ్యలు కలవు.
సాధన.
అ) అసత్యం
ఆ) అసత్యం
ఇ) సత్యం
ఈ) సత్యం
ఉ) సత్యం

ప్రశ్న 2.
కింది సంఖ్యారేఖను పరిశీలించి, దిగువనివ్వబడిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
AP Board 6th Class Maths Solutions Chapter 4 పూర్ణసంఖ్యలు Ex 4.1 1
అ) -1 నకు అతి దగ్గరలో గల ధనపూర్ణ సంఖ్య ఏది?
ఆ) ‘సున్న’కు ఎడమవైపున ఎన్ని రుణ సంఖ్యలు ఉంటాయి?
ఇ) -3 మరియు 7 మధ్య ఎన్ని పూర్ణ సంఖ్యలు ఉంటాయి?
ఈ) -2 కన్నా చిన్నవైన 3 పూర్ణసంఖ్యలు రాయండి.
ఉ) -2 కన్నా పెద్దవైన 3 పూర్ణ సంఖ్యలు రాయండి.
సాధన.
అ) -1 నకు అతి దగ్గరలో గల ధన పూర్ణ సంఖ్య = 1
ఆ) ‘సున్న’కు ఎడమవైపున -1, -2, -3, -4, -5 రుణసంఖ్యలు కలవు.
రుణసంఖ్యల సంఖ్య = 5
ఇ) -3 మరియు 7 మధ్యగల పూర్ణ సంఖ్యలు = -2, -1, 0, 1, 2, 3, 4, 5, 6.
రుణ పూర్ణ సంఖ్యలు మొత్తం = 9
ఈ) -2 కన్నా చిన్నవైన 3 పూర్ణసంఖ్యలు = -3, -4, -5
ఇవి సున్నకు ఎడమవైపు ఉంటాయి.
ఉ) -2 కన్నా పెద్దవైన 3 పూర్ణసంఖ్యలు = -1, 0, 1
ఇవి సంఖ్యారేఖపై కుడివైపు ఉంటాయి.

AP Board 6th Class Maths Solutions Chapter 4 పూర్ణసంఖ్యలు Ex 4.1

ప్రశ్న 3.
కింది పూర్ణ సంఖ్యలను సంఖ్యారేఖపై గుర్తించండి.
అ) -7 మరియు -2 ల మధ్య పూర్ణ సంఖ్యలు.
ఆ) -2 మరియు 5 ల మధ్య పూర్ణ సంఖ్యలు.
సాధన.
AP Board 6th Class Maths Solutions Chapter 4 పూర్ణసంఖ్యలు Ex 4.1 2