AP Board 6th Class Maths Solutions Chapter 9 ద్విమితీయ – త్రిమితీయ ఆకారాలు Unit Exercise

AP SCERT 6th Class Maths Textbook Solutions Chapter 9 ద్విమితీయ – త్రిమితీయ ఆకారాలు Unit Exercise Questions and Answers.

AP State Syllabus 6th Class Maths Solutions 9th Lesson ద్విమితీయ – త్రిమితీయ ఆకారాలు Unit Exercise

ప్రశ్న 1.
కింది పట్టికలో ఇవ్వబడిన ఆకారాలకు తగిన ఉదాహరణలివ్వండి.
AP Board 6th Class Maths Solutions Chapter 9 ద్విమితీయ - త్రిమితీయ ఆకారాలు Unit Exercise 1
సాధన.
AP Board 6th Class Maths Solutions Chapter 9 ద్విమితీయ - త్రిమితీయ ఆకారాలు Unit Exercise 2

AP Board 6th Class Maths Solutions Chapter 9 ద్విమితీయ - త్రిమితీయ ఆకారాలు Unit Exercise

ప్రశ్న 2.
కింద ఇవ్వబడిన పటంను పరిశీలించి, ప్రశ్నలకు తగిన సమాధానాలివ్వండి.
AP Board 6th Class Maths Solutions Chapter 9 ద్విమితీయ - త్రిమితీయ ఆకారాలు Unit Exercise 3
(అ) త్రిభుజం పేరేమిటి?
(ఆ) త్రిభుజం భుజాలు, కోణాలు మరియు శీర్షాలను రాయండి.
సాధన.
(అ) ∆PQR.
(ఆ) భుజాలు : \(\overline{\mathrm{PQ}}, \overline{\mathrm{QR}}, \overline{\mathrm{RP}}\).
కోణాలు : \(\angle \mathrm{P}\), \(\angle \mathrm{Q}\), \(\angle \mathrm{R}\) లేదా \(\angle \mathrm{QPR}, \angle \mathrm{PQR}, \angle \mathrm{QRP}\)
శీర్షాలు : P, Q, R.

3. పక్కపటం పరిశీలించి, ఇవ్వబడిన ప్రశ్నలకు జవాబులివ్వండి.
AP Board 6th Class Maths Solutions Chapter 9 ద్విమితీయ - త్రిమితీయ ఆకారాలు Unit Exercise 4

ప్రశ్న(అ)
బహుభుజి పేరేమిటి?
సాధన.
చతుర్భుజం EFGH.

AP Board 6th Class Maths Solutions Chapter 9 ద్విమితీయ - త్రిమితీయ ఆకారాలు Unit Exercise

ప్రశ్న(ఆ)
పక్కభుజాలు మరియు పక్కకోణాల జతలను రాయండి.
సాధన.
పక్క భుజాలు :
(i) \(\overline{\mathrm{EF}}\) కి పక్క భుజాలు \(\overline{\mathrm{EH}}\) మరియు \(\overline{\mathrm{FG}}\).
(ii) \(\overline{\mathrm{FG}}\) కి పక్క భుజాలు \(\overline{\mathrm{EF}}\) మరియు \(\overline{\mathrm{GH}}\).
(iii) \(\overline{\mathrm{GH}}\) కి పక్క భుజాలు \(\overline{\mathrm{FG}}\) మరియు \(\overline{\mathrm{EH}}\).
(iv) \(\overline{\mathrm{EH}}\) కి పక్క భుజాలు \(\overline{\mathrm{EF}}\) మరియు \(\overline{\mathrm{HG}}\).

పక్క కోణాలు :
(i) E కి పక్క కోణాలు \(\angle \mathrm{H}\) మరియు \(\angle \mathrm{F}\).
(ii) F కి పక్క కోణాలు \(\angle \mathrm{E}\) మరియు \(\angle \mathrm{G}\).
(iii) G కి పక్క కోణాలు \(\angle \mathrm{F}\) మరియు \(\angle \mathrm{H}\).
(iv) H కి పక్క కోణాలు \(\angle \mathrm{G}\) మరియు \(\angle \mathrm{E}\).

ప్రశ్న(ఇ)
శీర్షాలు, ఎదుటి భుజాల జతలు, ఎదుటి కోణాల జతలను రాయండి.
సాధన.
శీర్షాలు : E,F,G,H
ఎదుటి భుజాల జతలు :
(i) EF కి GH
(ii) FG కి HE
ఎదుటి కోణాల జతలు : (i) \(\angle \mathrm{E}\), \(\angle \mathrm{G}\)
(ii) \(\angle \mathrm{F}\), \(\angle \mathrm{H}\).

ప్రశ్న 4.
కింది వాక్యాలు సత్యమో, అసత్యమో తెల్పండి.
(అ) వృత్తంలో ఒకే ఒక కేంద్రాన్ని గుర్తించగలం. [ ]
(ఆ) వృత్తంలో అన్ని ‘జ్యా’లు వ్యాసాలు. [ ]
(ఇ) చతురస్రాకార పిరమిడ్, చతురస్రాలు ముఖాలుగా కలిగి ఉంటుంది. [ ]
సాధన.
(అ) సత్యం
(ఆ) అసత్యం
(ఇ) అసత్యం

AP Board 6th Class Maths Solutions Chapter 9 ద్విమితీయ - త్రిమితీయ ఆకారాలు Unit Exercise

ప్రశ్న 5.
దీర్ఘఘనం, సమఘనం, గోళం ఆకారంలో ఉండే నిత్యజీవిత ఉదాహరణలు రాయండి.
సాధన.
దీర్ఘఘనం : ఇటుక, అగ్గిపెట్టె, గణిత పాఠ్యపుస్తకం, రబ్బరు.
సమఘనం : పాచిక, పొడవు, వెడల్పు, ఎత్తు సమానంగా గల అట్టపెట్టె.
గోళం : బంతి, లడ్డు, గోళీలు, గ్లోబు.