SCERT AP 7th Class Maths Solutions Pdf Chapter 11 సమతల పటాల వైశాల్యాలు InText Questions and Answers.
AP State Syllabus 7th Class Maths Solutions 11th Lesson సమతల పటాల వైశాల్యాలు InText Questions
నీ ప్రగతిని సరిచూసుకో [పేజి నెం. 168]
ప్రశ్న 1.
ఈ క్రింది పట్టికలో ఖాళీలలోని విలువలు కనుగొని పూరించండి.
సాధన.
ప్రశ్న 2.
అను వద్ద గల ఒకే సైజు గల 4 లంబకోణ త్రిభుజాలు కలవు. వాటితో ఒక స్టార్ ను బొమ్మలో కింద చూపిన విధంగా తయారుచేసింది. బొమ్మ స్టార్ వైశాల్యం కనుగొనండి.
సాధన.
లంబకోణ త్రిభుజ భుజాలు a = 5 సెం.మీ., b = 12 సెం.మీ.
ఒక్కొక్క లంబకోణ త్రిభుజ వైశాల్యం = \(\frac{1}{2}\) ab = \(\frac{1}{2}\) × 5 × 12 = 30 చ.సెం.మీ.
∴ బొమ్మ స్టార్ వైశాల్యం = 4 × 30 = 120 చ.సెం.మీ.
అన్వేషిద్దాం [పేజి నెం. 170]
ప్రశ్న 1.
త్రిభుజాకార పొలం ABC మరియు దీర్ఘచతురస్రాకార పొలం EPGH ల వైశాల్యాలు సమానం. దీర్ఘచతురస్రం EFGH యొక్క పొడవు మరియు వెడల్పులు వరుసగా 15 మీ., 10 మీ. ∆ABC యొక్క భూమి 25 మీ. అయితే దాని ఎత్తు కనుగొనండి.
సాధన.
ఇచ్చిన త్రిభుజ భూమి b = 25 మీ.
దీర్ఘ చతురస్ర పొడవు (1) = 15 మీ.
వెడల్పు (b) = 10 మీ.
దీర్ఘచతురస్ర వైశాల్యం = lb = 15 × 10 = 150 చ.మీ.
త్రిభుజ వైశాల్యం = దీర్ఘచతురస్ర వైశాల్యం
\(\frac{1}{2}\) bh = 150
⇒ \(\frac{1}{2}\) × 25 × h = 150
⇒ h = 150 × \(\frac{2}{25}\) = 12 సెం.మీ.
∴ త్రిభుజ ఎత్తు h = 12 సెం.మీ.
ప్రశ్న 2.
కింది పటంలో ఉన్న అన్ని త్రిభుజాల భూమి AB = 12 సెం.మీ. గ్రిలో ఉన్న గడులను లెక్కవేయడం ద్వారా వాటి ఎత్తులను కనుగొని తద్వారా వైశాల్యం కనుగొనండి. మీరు ఏమి గమనించారు ?
సాధన.
గమనించిన అంశాలు:
- త్రిభుజ ఆకారం ఏదైనప్పటికి సమాన భూమి మరియు సమాన ఎత్తుగల త్రిభుజాల వైశాల్యాలు సమానము.
- ఒకే భూమి కలిగి ఒక జత సమాంతర రేఖల మధ్య ఏర్పడే త్రిభుజాల వైశాల్యాలు సమానము.
అన్వేషిద్దాం [పేజి నెం. 176]
ప్రశ్న 1.
పటంలో చూపించిన విధంగా చతురస్రాకారంలో నీలం రంగు టైల్స్ మధ్య 5 సెం.మీ. వెడల్పు కలిగిన తెల్లటి టైల్స్ అమర్చబడ్డాయి. మొత్తం పరచిన స్థలం యొక్క భుజం 150 సెం.మీ. అయితే పరచబడిన తెల్లని టైల్స్ అమరిక యొక్క వైశాల్యం కనుగొనండి.
సాధన.
చతురస్రాకారంలో పరచిన స్థలం యొక్క భుజం = 150 సెం.మీ.
తెల్లటి టైల్స్ తో పరచిన బాట వెడల్పు = 5 సెం.మీ.
EFGH బాట వైశాల్యం
= బాట పొడవు × బాట వెడల్పు
= 150 × 5 = 750 చ.సెం.మీ.
IJKL బాట వైశాల్యం = 750 చ.సెం.మీ. (పై దాని వలె)
ఉమ్మడి బాట MNOP వైశాల్యం = 5 × 5 = 25 చ|| సెం.మీ.
∴ పరచబడిన తెల్లటి టైల్స్ అమరిక వైశాల్యం
= EFGH బాట వైశాల్యం + IJKL బాట వైశాల్యం – ఉమ్మడి బాట MNOP వైశాల్యం
= 750 + 750 – 25 = 1500 – 25
= 1475 చ.సెం.మీ.
ప్రశ్న 2.
80 మీ. భుజంగా గల చతురస్రాకార గడ్డి మైదానం చుట్టూ బయట 2 మీటర్ల వెడల్పు ఉన్న బాట కలదు. బాట వైశాల్యం మరియు ప్రతి చ.మీ. ఇటుకలతో ఫ్లోరింగ్ కు అయ్యే ఖర్చు రూ. 200 అయితే ఫ్లోరింగు అగు మొత్తం ఖర్చు కనుగొనండి.
సాధన.
లోపలి చతురస్రాకార గడ్డి మైదానం భుజం = 80 మీ.
చుట్టూకల బాట వెడల్పు = 2 మీ.
∴ బయటి చతురస్ర భుజం = 80 + 2 + 2 = 84మీ.
బయటి PORS చతురస్ర వైశాల్యం = భుజం × భుజం
= 84 × 84 = 7,056 చ.మీ.
లోపలి ABCD చతురస్ర వైశాల్యం అం అందుకు అంత = 80 × 80 = 6,400 చ.మీ.
∴ చతురస్రాకార పొలం చుట్టూగల బాట వైశాల్యం = బయటి చతురస్ర వైశాల్యం – లోపలి చతురస్ర వైశాల్యం
= 7056 – 6400 = 656 చ.మీ.
చ.మీ.కు ₹ 200 వంతున బాట ఫ్లోరింగ్ కు అవు మొత్తం ఖర్చు = 656 × 200 = ₹ 1,31,200
ఇవి చేయండి కృత్యం [పేజి నెం. 176]
రెండు దీర్ఘచతురస్రాలను తయారుచేయండి. పొడవు 25 సెం.మీ., వెడల్పు 20 సెం.మీ. గల ఒక ఎరుపు రంగు దీర్ఘచతురస్రం, పొడవు 20 సెం.మీ., వెడల్పు 15 సెం.మీ. గల మరియొక ఆకుపచ్చరంగు దీర్ఘచతురస్రం చేసి పెద్ద దీర్ఘచతురస్రంపై మధ్య చిన్న దీర్ఘచతురస్రాన్ని ఉంచండి. తద్వారా, ఆకుపచ్చ రంగు దీర్ఘచతురస్రం చుట్టూ వెలుపల 2.5 సెం.మీ. ఎరుపు రంగు బాట ఏర్పడుతుంది. ఎరుపు రంగు బాట యొక్క వైశాల్యం కనుగొనండి.
సాధన.
ఎరుపురంగు దీర్ఘచతురస్ర వైశాల్యం = 25 × 20 = 500 సెం.మీ.2
ఆకుపచ్చరంగు దీర్ఘచతురస్ర వైశాల్యం = 20 × 15 = 300 సెం.మీ.2
∴ ఎరుపు రంగు బాట యొక్క వైశాల్యం = (ఎరుపు రంగు దీ|| చ||వై) – (ఆకుపచ్చ రంగు దీ||చ||వై)
= 500 – 300 = 200 చ.సెం.మీ.
నీ ప్రగతిని సరిచూసుకో [పేజి నెం. 182]
ప్రశ్న 1.
వృత్తాకార ముగ్గు పరిధి 88 సెం.మీ. అయిన దాని వ్యాసార్ధం మరియు వైశాల్యం కనుగొనుము.
సాధన.
వృత్తాకార ముగ్గు పరిధి = 88 సెం.మీ.
వ్యాసార్ధం (r) = ?
వృత్త వైశాల్యం = ?
వృత్తాకార పరిధి 2πr = 88
⇒ 22 × \(\frac{22}{7}\) × r = 88
⇒ \(\frac{44}{7}\) × r = 88
∴ వ్యాసార్ధం r = 14 సెం.మీ.
వృత్త వైశాల్యం = πr2 = \(\frac{22}{7}\) × 142
∴ వృత్త వైశాల్యం = 616 చ.సెం.మీ.
ప్రశ్న 2.
పటంలో చూపించబడ్డ వృత్తాల యొక్క వైశాల్యాలను లెక్కించండి.
(i)
సాధన.
వృత్త వ్యాసార్ధము (r) = 7 సెం.మీ.
వృత్త వైశాల్యం = πr2 = \(\frac{22}{7}\) × 72
∴ వృత్త వైశాల్యం = 154 చ.సెం.మీ.
(ii)
సాధన.
వృత్త వ్యాసము (d) = 28 సెం.మీ.
వ్యాసార్ధము (r) = \(\frac{28}{2}\) = 14 సెం.మీ.
వృత్త వైశాల్యం = πr2 = \(\frac{22}{7}\) × 142
= 616 చ.సెం.మీ.
(iii)
సాధన.
వృత్త వ్యాసార్ధము (r) = 21 సెం.మీ.
వృత్త వైశాల్యము = πr2 = \(\frac{22}{7}\) × 212
= 1386 చ. సెం.మీ.
అన్వేషిద్దాం [పేజి నెం. 186]
వృత్తాకార గడ్డి మైదానం వ్యాసార్థం 11 మీ. దానిలో కేంద్రం వద్ద ఒక మేకను 4 మీ. పొడవు కలిగిన తాడుతో కట్టిన మేక మేయలేని గడ్డిభూమి వైశాల్యాన్ని కనుగొనండి.
సాధన.
వృత్తాకార గడ్డి మైదాన వ్యాసార్ధం (R) = 11 మీ.
మేక మేయగల వృత్తాకార గడ్డి మైదాన వ్యాసార్ధం (r) = 4 మీ.
(4 మీ. తాడుతో కేంద్రం వద్ద మేకను కట్టారు)
మేక మేయలేని గడ్డి మైదాన వైశాల్యం = (బయటి వృత్త వైశాల్యం – లోపలి వృత్త వైశాల్యం)
వృత్తాకార బాట వైశాల్యం = πR2 – πr2
= π(R2 – r2)
= \(\frac{22}{7}\)(112 – 42)
= \(\frac{22}{7}\) × (121 – 16)
= \(\frac{22}{7}\) × 105 = 330
∴ మేక మేయలేని గడ్డి మైదాన వైశాల్యం = 330 మీ.
తార్కిక విభాగం తార్కిక ప్రశ్నలు (అశాబ్దిక) [పేజి నెం. 192]
ప్రశ్న 1.
ఇమిడియున్న పటాలు : సమస్యా పటం (X) నకు ప్రక్కనే సమాధాన పటాలు (a), (b), (c) & (d) లు ఇవ్వబడినవి. సమస్యాపటంలో ఇవ్వబడిన పటం, ఏ సమాధాన పటంలో ఇమిడి ఉన్నదో గుర్తించండి.
ఉదాహరణ:
సాధన.
(a)
ఉదాహరణలు
ప్రశ్న 1.
ఇచ్చిన త్రిభుజాల వైశాల్యాలు కనుక్కోండి.
సాధన.
(i) ∆ POR లో, భూమి (QR) = 6 సెం.మీ.,
ఎత్తు (PS) = 4 సెం.మీ.
త్రిభుజ వైశాల్యం
∆PQR = \(\frac{1}{2}\) × భూమి × ఎత్తు
= \(\frac{1}{2}\) × QR × PS
= \(\frac{1}{2}\) × 6 × 4 = 12 చ.సెం.మీ.
(ii) ∆LMN లో, భూమి (MN) = 3 సెం.మీ.,
ఎత్తు (LO) = 2 సెం.మీ.
త్రిభుజ వైశాల్యం ∆LMN
= \(\frac{1}{2}\) × భూమి × ఎత్తు
= \(\frac{1}{2}\) × MN × LO
= \(\frac{1}{2}\) × 3 సెం.మీ. × 2 సెం.మీ.
= 3 చ.సెం.మీ.
ప్రశ్న 2.
∆XYZ యొక్క వైశాల్యం 12 చ.సెం.మీ. మరియు ఎత్తు XL = 3 సెం.మీ. అయితే భూమి YZ ని కనుగొనండి.
సాధన.
∆XYZ లో భూమి = YZ,
ఎత్తు XL = 3 సెం.మీ.,
∆XYZ వైశాల్యం = 12 చ.సెం.మీ,
∆XYZ వైశాల్యం = \(\frac{1}{2}\) × భూమి × ఎత్తు
= \(\frac{1}{2}\) × YZ × XL
⇒ 12 = \(\frac{1}{2}\) × YZ × 3
⇒ YZ = 12 × \(\frac{2}{3}\)
కాబట్టి YZ = 8 సెం.మీ.
ప్రశ్న 3.
∆ABC లో AC = 8 సెం.మీ., BC = 4 సెం.మీ. మరియు AE = 5 సెం.మీ.
అయిన (i) AABC వైశాల్యం (ii) BD కనుగొనుము.
సాధన.
(i) ∆ABC లో, భూమి (BC) = 4 సెం.మీ.,
ఎత్తు (AE) = 5 సెం.మీ.
∆ABC వైశాల్యం = \(\frac{1}{2}\) × భూమి × ఎత్తు
= \(\frac{1}{2}\) × 4 × 5
= 10 చ.సెం.మీ.
(ii) ∆BAC లో, భూమి (AC) = 8 సెం.మీ.,
ఎత్తు (BD) = ?
∆BAC వైశాల్యం = 10 చ.సెం.మీ.
∆ BAC వైశాల్యం = \(\frac{1}{2}\) × భూమి × ఎత్తు
i.e. 10 = \(\frac{1}{2}\) × 8 × BD
BD = 10 × \(\frac{2}{8}\) = \(\frac{10}{4}\) = \(\frac{5}{2}\) = 2.5
∴ ఎత్తు (BD) = 2.5 సెం.మీ.
ప్రశ్న 4.
లంబకోణ త్రిభుజం POR లో లంబకోణాలు కలిగిన – భుజాలు 6 సెం.మీ., 6 సెం.మీ., అయిన ఆ త్రిభుజం వైశాల్యం కనుగొనుము.
సాధన.
పద్ధతి – 1: లంబకోణాలు కలిగిన భుజాలు 6 సెం.మీ., 6 సెం.మీ.
లంబకోణ త్రిభుజం యొక్క వైశాల్యం
= \(\frac{1}{2}\) × లంబకోణం గల భుజాల యొక్క లబ్దం.
= \(\frac{1}{2}\) × a × b
= \(\frac{1}{2}\) × 6 × 6 = 6 × 3 = 18 చ.సెం.మీ.
పద్ధతి – 2: గ్రిడ్ ను జాగ్రత్తగా పరిశీలించండి. లంబకోణ త్రిభుజం యొక్క వైశాల్యం చతురస్రం యొక్క వైశాల్యంలో సగం. లంబకోణ త్రిభుజం యొక్క వైశాల్యం
= \(\frac{1}{2}\) × చతురస్ర వైశాల్యం
= \(\frac{1}{2}\) × 6 × 6 = 18 చ.సెం.మీ.
ప్రశ్న 5.
త్రిభుజాకార గడ్డిమైదానం యొక్క భూమి మరియు ఎత్తులు వరుసగా 12 మీ., 7మీ. అయిన గడ్డిమైదానం వైశాల్యంను కనుగొనుము. గడ్డి పరచుటకు ఒక చ.మీ.కు ₹300 చొప్పున మొత్తం ఎంత ఖర్చు అగును?
సాధన.
త్రిభుజాకార గడ్డిమైదానం యొక్క భూమి = 12 మీ.
ఎత్తు = 7 మీ.
త్రిభుజాకార గడ్డి మైదానం యొక్క వైశాల్యం
= \(\frac{1}{2}\) × b × h
= \(\frac{1}{2}\) × 12 × 7
= 6 × 7 = 42 చ.మీ.
గడ్డి మైదానంలో ఒక చ.మీ. గడ్డి వేయడానికి అయ్యే ఖర్చు = ₹ 300
గడ్డి మైదానంలో 42 చ.మీ. గడ్డి వేయడానికి అయ్యే మొత్తం ఖర్చు = ₹ 300 × 42 = ₹ 12,600
ప్రశ్న 6.
దీర్ఘచతురస్రాకార పొలం యొక్క పొడవు మరియు వెడల్పులు వరుసగా 65 మీ., 30 మీ. పొలం బయట చుట్టూ 2.5 మీటర్ల వెడల్పుతో ఒక బాట ఏర్పాటు చేయబడింది. ఆ బాట యొక్క వైశాల్యం కనుగొనండి.
సాధన.
పటంలో ABCD అనేది దీర్ఘచతురస్రాకార పొలం మరియు రంగు ఉన్న ప్రాంతం 2.5 మీ. వెడల్పు కలిగిన బాటను చూపుతుంది. EFGH బయటి దీర్ఘచతురస్రం (బాటతో కలిపిన పొలం).
ABCD పొడవు (AB) = 65 మీ.,
ABCD వెడల్పు (AD) = 30 మీ.,
బాట వెడల్పు = 2.5 మీ.
బాట వైశాల్యం = బయటి దీర్ఘచతురస్రం EFGH
వైశాల్యం – లోపలి దీర్ఘచతురస్రం ABCD వైశాల్యం EFGH పొడవు (EF)
= పొలం పొడవు (AB) + 2 × బాట వెడల్పు
= 65 మీ. + 2 × 2.5 మీ.
= 65 మీ. + 5 మీ. = 70 మీ.
EFGH వెడల్పు (EH)
= పొలం వెడల్పు (AD) + 2 × బాట వెడల్పు
= 30 మీ. + 2 × 2.5 మీ.
= 30 మీ. + 5 మీ. = 35 మీ.
బయటి దీర్ఘచతురస్రం EFGH వైశాల్యం = పొడవు × వెడల్పు
= 70 × 35 = 2450 చ.మీ.
లోపలి దీర్ఘచతురస్రం ABCD వైశాల్యం
= పొడవు × వెడల్పు
= 65 మీ. × 30 మీ. = 1950 చ.మీ.
బాట వైశాల్యం = బయటి దీర్ఘచతురస్రం EFGH వైశాల్యం – లోపలి దీర్ఘచతురస్రం ABCD వైశాల్యం = 2450 చ.మీ. – 1950 చ.మీ. = 500 చ.మీ.
ప్రశ్న 7.
ఒక చతురస్రాకార స్విమ్మింగ్ పూల్ భుజం పొడవు 70 మీ. దాని చుట్టూ బయట 5 మీ. వెడల్పు గల బాట కలదు. ఈ బాట యొక్క వైశాల్యం కనుగొనండి. బాటను టైల్స్ తో పరచటానికి ఒక చ.మీ.నకు రూ. 150 చొప్పున అయ్యే మొత్తం ఖర్చును కనుగొనండి.
సాధన.
WXYZ చతురస్రాకార స్విమ్మింగ్ పూల్ ని చూపిస్తుంది. స్విమ్మింగ్ పూల్ భుజం (WZ) = 70 మీ. స్విమ్మింగ్ పూల్ యొక్క వెలుపలివైపు 5 మీ. వెడల్పు గల బాట కలదు.
PORS బాటతో కల స్విమ్మింగ్ పూల్ బాట వైశాల్యం
= బాటతో కల స్విమ్మింగ్ పూల్ PORS వైశాల్యం – స్విమ్మింగ్ పూల్ WXYZ వైశాల్యం
PS = స్విమ్మింగ్ పూల్ భుజం (WZ) + 2 × (బాట వెడల్పు )
= 70 + 2 × 5 = 70 + 10 = 80మీ.
బాటతో కల స్విమ్మింగ్ పూల్ PORS వైశాల్యం
= (భుజం)2 = (80 మీ)2 = 6400 చ.మీ.
స్విమ్మింగ్ పూల్ WXYZ వైశాల్యం = (భుజం)2
= (70 మీ.)2 = 4900 చ.మీ.
బాట వైశాల్యం = బాటతో కల స్విమ్మింగ్ పూల్ PORS వైశాల్యం – స్విమ్మింగ్ పూల్ WXYZ వైశాల్యం
= 6400 – 4900 = 1500 చ.మీ.
టైల్స్ తో పరచటానికి ఒక చ.మీ.కు అగు ఖర్చు = ₹150
టైల్స్ తో పరచటానికి 150 చ.మీ.లకు అగు ఖర్చు
= ₹150 × 1500
= ₹ 2,25,000
ప్రశ్న 8.
దీర్ఘచతురస్రాకార గడ్డి భూమి పొడవు 55 మీ. మరియు వెడల్పు 45 మీ. వెడల్పు గడ్డి భూమి మధ్యలో 3 మీ. వెడల్పు కలిగిన రెండు మార్గాలు ఒకటి పొడవుకు సమాంతరంగా మరియు మరొకటి వెడల్పుకు సమాంతరంగా ఒకదానికొకటి ఖండించే విధంగా ఉన్నవి. ఆ బాట వైశాల్యం కనుగొనండి.
సాధన.
పటంలో ABCD ఒక దీర్ఘచతురస్రాకార గడ్డిభూమి.
ABCD పొడవు = 55 మీ,
ABCD వెడల్పు = 45 మీ, బాట వెడల్పు = 3 మీ.
EFGH బాట వైశాల్యం = పొడవు × బాట వెడల్పు
= 55 × 3 = 165 చ.మీ.
బాట MNOP వైశాల్యం = వెడల్పు × బాట వెడల్పు = 45 × 3 = 135 చ.మీ.
ఉమ్మడి బాట IJKL వైశాల్యం (రెండు బాటలు కలిసిన ప్రాంతం)
= బాట వెడల్పు × బాట వెడల్పు = 3 × 3 = 9 చ.మీ.
IJKL చతురస్రం రెండు బాటలలో వున్నది అనగా 9 చ.మీ.
రెండు బాటలలో కలదు. కావున ఒకసారి తీసివేస్తాము.
మొత్తం బాట వైశాల్యం = బాట EFGH వైశాల్యం + బాట MNOP వైశాల్యం – ఉమ్మడి బాట IJKL వైశాల్యం
= (165 + 135 – 9) చ.మీ.
= (300 – 9) చ.మీ. = 291 చ.మీ.
ప్రశ్న 9.
వృత్తాకార రంగోలి వ్యాసార్థం 21 సెం.మీ. అయిన దాని వైశాల్యం కనుగొనుము.
సాధన.
రంగోలి వ్యాసార్ధం (r) = 21 సెం.మీ.
వృత్తాకార రంగోలి వైశాల్యం = πr2
= \(\frac{22}{7}\) × 21 × 21 = 1386
∴ వృత్త వైశాల్యం = 1386 చ.సెం.మీ.
ప్రశ్న 10.
28 మీ. వ్యాసం కలిగిన వృత్తాకార కొలను. యొక్క (ఉపరితల) వైశాల్యం కనుగొనండి. (π = \(\frac{22}{7}\))
సాధన.
వృత్తాకార కొలను వ్యాసం (d) = 28 మీ.
వ్యాసార్ధం (r) = \(\frac{28}{2}\) మీ. = 14 మీ.
వృత్తాకార కొలను వైశాల్యం = πr2
= \(\frac{22}{7}\) × 142
= \(\frac{22}{7}\) × 14 × 14
= 22 × 2 × 14 = 616 చ.మీ.
ప్రశ్న 11.
ఒక వృత్తాకార పార్కు లోపల భాగం పిల్లలు ఆడుకోవడానికి, దానిచుట్టూ బయట పెద్దలు నడవడానికి ఇవ్వబడినది. పార్క్ బయటి వ్యాసార్ధం 35 మీ. మరియు నడిచే బాట వెడల్పు 14 మీ. అయిన నడిచే బాట వైశాల్యం కనుగొనుము.
సాధన.
పార్క్ బయటి వ్యాసార్ధం (R) = 35 మీ.
నడిచే బాట యొక్క వెడల్పు = 14 మీ.
ఆడుకునే భాగం యొక్క వ్యాసార్ధం (r) = R – W
= 35 – 14 = 21 మీ.
నడిచే బాట వైశాల్యం = పార్క్ యొక్క వైశాల్యం –
ఆడుకొనే భాగం వైశాల్యం
= πR2 – πr2
= \(\frac{22}{7}\) × 352 – \(\frac{22}{7}\) × 212
= \(\frac{22}{7}\) (352 – 212)
= \(\frac{22}{7}\) (1225 – 441)
= \(\frac{22}{7}\) × 784
= 22 × 112 = 2464 చ.మీ.
ప్రశ్న 12.
10 మీ. వ్యాసార్థం గల వృత్తాకార వాటర్ ఫౌంటైన్ లోపల 3 మీ. ఫౌంటైన్ కొరకు వాడబడెను. మిగిలిన భాగంను సిమెంట్ చేసారు. సిమెంట్ చేసిన భాగం వైశాల్యంను కనుగొనుము. ఒక చ.మీ.కు ₹200 చొప్పున సిమెంట్ చేయుటకు అగు మొత్తం ఖర్చు ఎంత?
సాధన.
మొత్తం నీటి ఫౌంటైన్ (R) వ్యాసార్ధం = 10 మీ.
ఫౌంటైన్ అమర్చిన భాగం యొక్క వ్యాసార్ధం (r) = 3 మీ.
సిమెంట్ చేసిన భాగం వైశాల్యం
= మొత్తం నీటి ఫౌంటైన్ వైశాల్యం – ఫౌంటైన్ అమర్చిన భాగవైశాల్యం
= πR2 – πr2
= \(\frac{22}{7}\) × (10)2 – \(\frac{22}{7}\) × (3)2
= \(\frac{22}{7}\) [(10)2 – (3)2]
= \(\frac{22}{7}\) (100 – 9) చ.మీ.
= \(\frac{22}{7}\) × 91 చ.మీ.
= 22 × 13 = 286 చ.మీ.
ప్రతి చ.మీ.ను సిమెంట్ చేయుటకు అగు ఖర్చు = ₹ 200
286 చ.మీ. లను సిమెంట్ చేయుటకు అగు ఖర్చు = 286 × 200 = ₹ 57,200
సాధనా ప్రశ్నలు, [పేజి నెం. 192]
క్రింద ఇవ్వబడిన ప్రతి ప్రశ్నలో ఒక సమస్యాపటం (X), నాలుగు సమాధాన పటాలు (a), (b), (c) మరియు (d) లు ఇవ్వబడినవి. సమస్యా పటంలో ఇవ్వబడిన ఏ సమాధాన పటంలో పొందుపరచబడినదో గుర్తించి సరైన ఐచ్ఛికాన్ని రాయండి.
ప్రశ్న 1.
సాధన.
a
ప్రశ్న 2.
సాధన.
c
ప్రశ్న 3.
సాధన.
b
ప్రశ్న 4.
సాధన.
a
ప్రశ్న 5.
సాధన.
c
ప్రశ్న 6.
సాధన.
a
ప్రశ్న 7.
సాధన.
b
ప్రశ్న 8.
సాధన.
b
ప్రశ్న 9.
సాధన.
d
ప్రశ్న 10.
సాధన.
b