SCERT AP 7th Class Science Study Material Pdf 10th Lesson మన చుట్టూ జరిగే మార్పులు Textbook Questions and Answers.
AP State Syllabus 7th Class Science 10th Lesson Questions and Answers మన చుట్టూ జరిగే మార్పులు
7th Class Science 10th Lesson మన చుట్టూ జరిగే మార్పులు Textbook Questions and Answers
Improve Your Learning (అభ్యసనాన్ని మెరుగుపరచుకుందాం)
I. ఖాళీలను పూరింపుము.
1. ఏ మార్పులలోనైతే క్రొత్త పదార్థాలు ఏర్పడతాయో వాటిని ………………… అంటారు. (రసాయనిక మార్పు)
2. మెగ్నీషియం + ఆక్సిజన్ → ……….. (మెగ్నీషియం ఆక్సైడ్)
3. పాలు, పెరుగుగా మారడం …………….. మార్పు. (రసాయనిక)
4. తుప్పు పట్టడాన్ని నిరోధించే పద్ధతి ……………. (గాల్వనైజేషన్)
II. సరైన జవాబు సూచించు అక్షరమును బ్రాకెట్లో రాయండి.
1. ఉన్ని దారాలతో స్వెటర్ అల్లడం అనేది ఏ మార్పు?
a) భౌతిక మార్పు
b) రసాయన మార్పు
c) ఉష్ణగ్రాహక చర్య
d) ఉష్ణమోచక చర్య
జవాబు:
a) భౌతిక మార్పు
2. క్రింది వాటిలో రసాయన మార్పు
a) నీరు మేఘాలుగా మారడం
b) చెట్టు పెరగడం
c) ఆవుపేడ నుంచి బయోగ్యాస్ తయారీ
d) మంచు నుండి నీరుగా మారుట
జవాబు:
c) ఆవుపేడ నుంచి బయోగ్యాస్ తయారీ
3. క్రింది వాటిలో ఆవర్తన మార్పు
a) భూకంపాలు
b) ఇంధ్రధనుస్సు ఏర్పడడం
c) సముద్రాలలో అలలు ఏర్పడటం
d) వరం రావడం
జవాబు:
c) సముద్రాలలో అలలు ఏర్పడటం
4. మొక్కలలో జరిగే కిరణజన్య సంయోగక్రియ అనేది
a) భౌతిక మార్పు
b) రసాయనిక మార్పు
c) ద్విగత మార్పు
d) ఏవీకావు
జవాబు:
b) రసాయనిక మార్పు
III. జతపరచండి.
గ్రూపు – A | గ్రూపు – B |
A) వెంట్రుకలు పెరుగుట | 1) రసాయన మార్పు |
B) అద్దం పగులకొట్టుట | 2) ఎసిటిక్ ఆమ్లం |
C) గాల్వనీకరణం | 3) నెమ్మదైన మార్పు |
D) వెనిగర్ | 4) భౌతిక మార్పు |
E) వాతావరణ కాలుష్యం | 5) ఇనుముపై జింక్ పూత పూయడం |
6) వేగవంతమైన మార్పు |
జవాబు:
గ్రూపు – A | గ్రూపు – B |
A) వెంట్రుకలు పెరుగుట | 3) నెమ్మదైన మార్పు |
B) అద్దం పగులకొట్టుట | 4) భౌతిక మార్పు |
C) గాల్వనీకరణం | 5) ఇనుముపై జింక్ పూత పూయడం |
D) వెనిగర్ | 2) ఎసిటిక్ ఆమ్లం |
E) వాతావరణ కాలుష్యం | 1) రసాయన మార్పు |
IV. ఈ క్రింది ప్రశ్నలకు జవాబులు రాయండి.
ప్రశ్న 1.
భౌతిక మరియు రసాయన మార్పులకు తేడాలు తెల్పండి.
జవాబు:
భౌతిక మార్పు | రసాయనిక మార్పు |
1. కొత్త పదార్థాలు ఏర్పడవు. | 1. కొత్త పదార్థాలు ఏర్పడతాయి. |
2. పదార్థ సంఘటనలో మార్పు ఉండదు. | 2. పదార్థ రసాయన సంఘటనం మారుతుంది. |
3. తాత్కాలిక మార్పు. | 3. శాశ్వత మార్పు. |
4. ఇది ద్విగత మార్పు. | 4. ఇది అద్విగత స్వభావం కలది. |
5. పదార్ధం యొక్క ఆకారం, రంగు, స్థితి వంటి భౌతిక ధర్మాలలో మార్పు వస్తుంది. | 5. ఉష్ణం, కాంతి విడుదల కావచ్చు లేదా – గ్రహించవచ్చు. రంగులో మార్పు జరగవచ్చు మరియు ధ్వని ఉత్పత్తి కావచ్చు. |
6. ఉదా : మంచు కరగటం | 6. ఉదా: కాగితం మండటం. |
ప్రశ్న 2.
కొవ్వొత్తులను మండించగా ఏ రకమైన మార్పు జరుగును? అదేవిధమైన చర్యకు ఒక ఉదాహరణ ఇవ్వండి.
జవాబు:
- క్రొవ్వొత్తిని మండించటం ఒక భౌతిక మార్పు,
- క్రొవ్వొత్తిని మండించినపుడు అది కరిగిపోతుంది.
- అనగా పదార్థం ఘనస్థితి నుండి ద్రవస్థితికి మారింది.
- అదేవిధంగా మంచు కరగటం నీరు ఆవిరి కావటం, మొదలైనవి భౌతిక మార్పులు.
ప్రశ్న 3.
స్పటికీకరణ అనగా ఏమి?
జవాబు:
వేడిచేసి గాని, ఆవిరిగా మార్చి కాని, ద్రవాల నుంచి ఘనపదార్థాలను వేరు చేసే ప్రక్రియను స్పటికీకరణ అంటారు.
ఉదా :
- చక్కెర ద్రావణం నుండి చక్కెర స్పటికాలు వేరు చేయటం.
- సముద్ర నీటి నుండి ఉప్పును వేరు చేయటం.
ప్రశ్న 4.
పండుగలప్పుడు టపాసులు కాల్చడం వలన జరిగే పరిణామాలను అంచనా వేయండి.
జవాబు:
- పండుగలప్పుడు టపాసులు కాల్చటం ఒక రసాయనిక చర్య.
- ఈ ప్రక్రియలో అనేక వాయువులు వెలువడతాయి.
- ఇవి పరిసరాలను కలుషితం చేయటంతో పాటు, అనేక ఆరోగ్య సమస్యలను కలుగజేస్తాయి.
- ఈ వాయువుల వలన మనకు కళ్ళమంటలు, శ్వాసకోశ వ్యాధులు వస్తున్నాయి.
- పరిసరాలలోని నీరు, గాలి కలుషితమౌతున్నాయి.
ప్రశ్న 5.
రసాయన మార్పు శాశ్వత మార్పు అని ప్రయోగ పూర్వకంగా నిరూపించండి.
జవాబు:
- ఒక మెగ్నీషియం రిబ్బన్ తీసుకొని కొవ్వొత్తితో వేడిచేస్తే మిరుమిట్లు గొలిపే తెల్లని మెరుపుతో పాటు బూడిద ఏర్పడుతుంది.
మెగ్నీషియం + ఆక్సిజన్ → మెగ్నీషియం ఆక్సైడ్ - ఈ మెగ్నీషియం ఆక్సైడ్ క్రొత్త పదార్థం.
- దీనిని ఏమి చేసినా మెగ్నీషియంగా మార్చలేము.
- ఇలా కొత్త పదార్థాలు ఏర్పడి, తిరిగి వెనుకకు మళ్ళించలేని మార్పులను రసాయనిక మార్పులు అంటారు.
ప్రశ్న 6.
ప్లాస్టిక్ కాలుష్యం పెరగటానికి కారణాలు అంచనా వేయండి.
జవాబు:
- నానాటికి ప్లాస్టిక్ కాలుష్యం భూమి మీద పెరిగిపోతుంది.
- దీనికి విచక్షణారహితంగా మనం ప్లాస్టిక్ వాడటమే కారణం.
- తక్కువ ఖర్చు కోసం ప్లాస్టిక్ వస్తువులు వాడుతున్నాము.
- మార్కెట్ అవసరాల కోసం విపరీతంగా ప్లాస్టిక్ కవర్స్ వాడుతున్నాం.
- ఉపయోగించి పారవేసే వస్తువులను అధికంగా తయారుచేస్తున్నాం.
- ప్లాస్టిక్ బాటిల్, టిన్లు పర్యావరణానికి తీవ్ర నష్టం కల్గిస్తున్నాయి.
- మానవుని యొక్క విచక్షణా రాహిత్యం కూడా ప్లాస్టిక్ వాడకానికి మరొక కారణం.
ప్రశ్న 7.
ప్రకృతిలో ఆవర్తన మార్పుల పాత్రను నీవు ఎలా అభినందిస్తావు?
జవాబు:
- ఒక నిర్ణీత సమయంలో పునరావృతం అయ్యే మార్పులను ఆవర్తన మార్పులు అంటారు.
- రాత్రి పగలు ఏర్పడటం, ఋతువులు ఏర్పడటం, సూర్యోదయం, సూర్యాస్తమయం ఇటువంటి మార్పులకు ఉదాహరణ.
- ఈ ఆవర్తన మార్పుల వలనే ప్రకృతి, జీవ మనుగడ భూమిమీద సాధ్యమౌతున్నాయి.
- రాత్రి – పగలు వలన జీవులు విశ్రమించటానికి, పనిచేయటానికి ఆస్కారం ఏర్పడింది.
- ఋతువుల వలన అందమైన ప్రకృతితో పాటు జీవుల జీవక్రియలు కొనసాగుతున్నాయి.
- నిర్దిష్ట కాలానికి వర్షాలు రావటం వలన వ్యవసాయం సాధ్యమౌతుంది.
- ప్రతి సంవత్సరం మొక్కలు చిగురించటం, పుష్పించటం, కాయలు కాయటం ఆవర్తన మార్పుల వలనే సాధ్యమౌతుంది.
- పౌర్ణమి, అమావాస్యల వలన రాత్రి వెన్నెలను, చంద్రకళను చూడగల్గుతున్నాము.
ప్రశ్న 8.
ఇనుప వస్తువులు తుప్పు పట్టడాన్ని నివారించటానికి కొన్ని పద్ధతులను సూచించండి. (పాఠ్యాంశ ప్రశ్న పేజీ నెం. 129)
జవాబు:
- తేమ సమక్షంలో ఇనుప వస్తువులు గాలితో ఆక్సీకరణం చెంది తుప్పు పడతాయి.
- దీని వలన ఇనుము, ఇనుప వస్తువులు పాడైపోతాయి.
- దీన్ని నివారించటానికి
ఎ) ఇనుప వస్తువులను తేమకు దూరంగా ఉంచాలి.
బి) ఇనుప వస్తువులపై రంగుల పూతలు వేయాలి.
సి) ఇనుము నేరుగా గాలికి తగలకుండా వార్నిష్ పూయాలి.
డి) కదిలే ఇనుప భాగాలలో నూనె కందెన వాడాలి.
ఇ) దుక్క ఇనుము వాడటం వలన తుప్పు పట్టే అవకాశం తగ్గించవచ్చు.
ప్రశ్న 9.
రవి బేకింగ్ సోడా మరియు వెనిగర్‌ను ఉపయోగించి కార్బన్ డై ఆక్సైడ్ ను తయారు చేశాడు. కార్బన్ డై ఆక్సైడ్ సున్నపుతేటను పాలవలే తెల్లగా మార్చింది. ఈ ప్రయోగాన్ని చక్కని పటంగా చిత్రించి భాగాలు గుర్తించండి.
జవాబు:
7th Class Science 10th Lesson మన చుట్టూ జరిగే మార్పులు InText Questions and Answers
7th Class Science Textbook Page No. 109
ప్రశ్న 1.
అరచేతులకు పెట్టుకున్న గోరింటాకు కడిగిన తరువాత ఏ మార్పు గమనించారు?
జవాబు:
గోరింటాకు కడిగిన తరువాత చేతులు ఎర్రగా మారతాయి.
ప్రశ్న 2.
పేపరుపై అచ్చయిన అక్షరాలను తుడపగలమా. ఎందుకు?
జవాబు:
కాగితంపై అచ్చు అయిన అక్షరాలను తుడపలేము.
ప్రశ్న 3.
నీటి పంపిణీ పరికరం ఒకేసారి వేడి, సాధారణ, చల్లని నీటిని ఇస్తున్నది. ఇది సహజమార్పాలేక మానవ మార్పా?
జవాబు:
ఇది మానవ మార్పు.
7th Class Science Textbook Page No. 127
ప్రశ్న 4.
ఎక్కువ కాలం ఆరుబయట ఉన్న ఇనుప సీలలను, గేట్లను, కుర్చీలను, రేకులను గమనించారా? రంగులో ఏదైనా మార్పును గమనించారా?
జవాబు:
ఆ వస్తువులన్నీ తుప్పు పట్టి గోధుమ రంగులోనికి మారతాయి. ఇది రసాయనిక చర్య.
7th Class Science Textbook Page No. 129
ప్రశ్న 5.
సైకిల్, మోటార్ సైకిళ్ళ హ్యాండిల్, రిమ్ములు తుప్పు పడతాయా? ఎందువల్ల పట్టవు?
జవాబు:
కిల్, మోటార్ సైకిల్ హ్యాండిల్స్, రిమ్ములు తుప్పు పట్టవు. వీటిని మిశ్రమ లోహంతో తయారు చేసి పైన నికెల్ పూత పూస్తారు. అందువలన ఇవి గాలితో చర్య పొందవు.
ప్రశ్న 6.
కత్తిరించిన పండ్లు, కూరగాయలలో రంగు మారకుండా మనం ఏం చేయవచ్చు?
జవాబు:
- కత్తిరించిన కూరగాయలు గాలితో ఆక్సీకరణం చెంది రంగు మారతాయి.
- దీనిని నివారించటానికి మనం కోసిన కాయకూరలను నీటిలో వేస్తాము.
- నీటికి కొంచెం ఉప్పు కలిపి ఆక్సీకరణ నివారిస్తాము.
- దీనితోపాటుగా తక్కువ పరిమాణంలో వెనిగర్ లేదా నిమ్మరసం కలపవచ్చు.
ఆలోచించండి – ప్రతిస్పందించండి
7th Class Science Textbook Page No. 127
ప్రశ్న 1.
ఆహారం పాడై వాసన రావడం అనేది ఒక మార్పు, దీనిని రసాయన మార్పు అనవచ్చా?
జవాబు:
- ఆహారం సూక్ష్మజీవులు చేరిక వలన పాడైపోయి వాసన వస్తుంది.
- ఈ ప్రక్రియలో సూక్ష్మజీవులు ఆహారాన్ని విడగొట్టి వాయువులుగా మార్చుతాయి.
- అందువలన పదార్థ సంఘటనం మారి కొత్త పదార్థాలు ఏర్పడతాయి.
- కావున ఇది ఒక రసాయనిక మార్పు.
ప్రశ్న 2.
మొక్కలు కిరణజన్య సంయోగక్రియ ద్వారా తమ ఆహారాన్ని తయారుచేసుకుంటాయి. ఈ మార్పును రసాయన మార్పు అని అనవచ్చా? తరగతిలో చర్చించండి. అభిప్రాయాలు తెలపండి.
జవాబు:
- మొక్కలు, సూర్యరశ్మి ద్వారా నీటిని మరియు కార్బన్ డై ఆక్సైడ్ మేళవించి ఆహారం తయారు చేస్తాయి.
- కిరణజన్య సంయోగక్రియ అవే ఈ ప్రక్రియలో పిండి పదార్థం ఏర్పడుతుంది.
- కొత్త పదార్థం ఏర్పడుతుంది. కావున దీనిని రసాయనిక మార్పు అనవచ్చు.
7th Class Science Textbook Page No. 129
ప్రశ్న 3.
అన్నిరకాల వస్తువులు గాలిలోని ఆక్సిజన్తో చర్య పొందుతాయా?
జవాబు:
లేదు. ఇనుము, రాగి వంటి కొన్ని లోహాలు మాత్రమే ఆక్సిజన్తో చర్య పొంది తుప్పు పడతాయి.
ప్రశ్న 4.
బంగారం మరియు వెండిలను పరిశీలించండి. వాటిని ఆభరణాల రూపంలో మనం ధరిస్తాము. వాటిని ఎక్కువ కాలం పాటు గాలి తగిలేటట్లు ఉంచినప్పటికీ రంగు మారవు. ఎందుకు?
జవాబు:
- బంగారం, వెండి వంటి లోహాలు ఎక్కువ కాలం గాలి తగిలేటట్లు ఉన్నప్పటికి తుప్పు పట్టవు.
- వీటి చర్యాశీలత తక్కువ. కావున ఆక్సిజన్తో చర్యపొందవు.
- అందువలన ఇవి తమ మెరుపును కోల్పోవు.
- కావున వీటిని ఆభరణాల తయారీకి ఉపయోగిస్తారు.
ప్రాజెక్ట్ పనులు
7th Class Science Textbook Page No. 135
ప్రశ్న 1.
పండ్ల మార్కెట్లో కృత్రిమంగా పండ్లను మగ్గబెట్టడానికి సంబంధించిన సమాచారాన్ని సేకరించండి మరియు అది ఉపయోగకరమైనదా లేదా హానికరమైనదా చర్చించండి.
జవాబు:
- పండ్ల మార్కెట్లో కృత్రిమంగా పండ్లను మగ్గబెట్టడానికి, ‘కార్బైడ్’ అనే రసాయనం ఉపయోగిస్తారు.
- ఈ కార్బైడ్ నీటిలో కలిపినపుడు ఇథిలిన్ వాయువును ఉత్పత్తి చేయును.
- ఈ ఇథిలిన్ పండ్లను కృత్రిమంగా పండేటట్లు చేస్తుంది.
- ఈ ప్రక్రియలో కాయ పండినట్లు రంగు మారుతుంది. కాని రసాయనికంగా పక్వానికి రాదు.
- ఇటువంటి పండ్లు తియ్యని రుచిని గాక పుల్లని రుచిని కలిగి ఉంటాయి.
- ఇవి ఆరోగ్యా నికి హానికరము.
- రసాయనాలు, జీర్ణవ్యవస్థను పాడుచేయటంతో పాటు కడుపులో అల్సర్లను కలిగిస్తాయి.
- కావున ఇటువంటి కృత్రిమంగా పండించిన పండ్లను కొనరాదు.
- అంతేగాక పండించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి.
ప్రశ్న 2.
మీరు చెక్కముక్కను కాల్చినప్పుడు వివిధ రకాల మార్పులు జరుగుతాయి. వాటిని విశ్లేషించండి. వచ్చే మార్పును అంచనా వేసి జాబితాను తయారు చేయండి.
a) వాటిలో భౌతిక మార్పులు ఏవైనా ఉన్నాయా?
జవాబు:
చెక్క పరిమాణం, రంగు, ఆకారం మారుతుంది. ఇవన్నీ భౌతిక లక్షణాల మార్పులే.
b) ఆ మార్పులో ఎన్నిరకాల శక్తిరూపాలు విడుదలయ్యాయి?
జవాబు:
కట్టెలోని రసాయనిక శక్తి మండించినపుడు ఉష్ణశక్తి మరియు కాంతిశక్తిగా మారుతుంది.
c) మీరు గుర్తించిన రసాయన మార్పులు ఏవి?
జవాబు:
చెక్క మండి బొగ్గులాగా మారింది. ఇది రసాయనిక మార్పు.
* అవి ఎందుకు జరుగుతాయో వివరించండి.
జవాబు:
చెక్కలోని కర్బన పదార్థం గాలిలోని ఆక్సిజన్తో కలిసి మండించినపుడు కార్బన్ డై ఆక్సైడ్ ను మరియు కర్బన పదార్థం (బొగ్గు)గా మారింది.
కృత్యాలు
కృత్యం – 1
ప్రశ్న 1.
ఒక బెలూన్ తీసుకొని గట్టిగా ఊదండి.
ఎ) దాని ఆకారంలో ఏమైనా మార్పు వచ్చిందా?
జవాబు:
ఆకారం గుండ్రంగా మారింది.
బి) ఇది ఎలా జరిగింది?
జవాబు:
మనం లోపలికి గాలి ఊదటం వలన జరిగింది.
సి) ఇది దానంతట అదే జరిగిందా? లేక ఇతరుల వల్లనా?
జవాబు:
ఇతరుల వలన.
డి) మరి అది ఎలాంటి మార్పు?
జవాబు:
మానవ ప్రమేయ మార్పు.
కృత్యం – 2
ప్రశ్న 2.
క్రింద పట్టికలో ఇవ్వబడిన మార్పులను పరిశీలించండి. వీటిలో ఏవి కొన్ని సెకండ్లలో, కొన్ని నిమిషాలలో, కొన్ని గంటలలో, కొన్ని రోజులలో, కొన్ని సంవత్సరాలలో పూర్తి అవుతాయో రాయండి. దాని ఆధారంగా వేగవంతమైన, నెమ్మదైన మార్పులను వర్గీకరించండి.
జవాబు:
మార్పు | పట్టిన సమయం ఎక్కువ / తక్కువ సమయం | మార్పు రకం వేగవంతం / నెమ్మది |
1. ఆహారం జీర్ణం అవడం | తక్కువ సమయం | వేగవంతం |
2. చిన్న కొవ్వొత్తి పూర్తిగా మండటం | తక్కువ సమయం | వేగవంతం |
3. మెరుపు సంభవించడం | తక్కువ సమయం | వేగవంతం |
4. డామ్ నిర్మించడం | ఎక్కువ సమయం | నెమ్మదైన మార్పు |
5. ఇనుము తుప్పు పట్టడం | ఎక్కువ సమయం | నెమ్మదైన మార్పు |
కృత్యం – 3
ప్రశ్న 3.
ద్విగత చర్యలు అనగానేమి? ప్రయోగాత్మకంగా నిరూపించండి.
జవాబు:
కొత్తగా ఏర్పడిన పదార్థం తిరిగి మొగటి పదార్థంగా మారుటను ద్విగత చర్యలు అంటారు.
ఉదా : మైనం కరుగుట, అయస్కాంతీకరణ.
ప్రయోగం :
- ఒక బీకరులో కొన్ని మంచు ముక్కలు తీసుకొని బర్నర్తో వేడి చేయండి.
- మంచు ముక్కలు నిదానంగా కరిగి నీరుగా మారతాయి.
- ఇప్పడు ఆ నీటిని కొన్ని గంటలపాటు ఫ్రిజ్‌లో ఉంచండి.
- నీరు చల్లబడి తిరిగి మంచుగా మారింది.
- కొత్తగా ఏర్పడిన పదార్థం తిరిగి మొదటి పదార్థంగా ఏర్పడింది. కావున ఇది ద్విగత చర్య.
కృత్యం – 4
ప్రశ్న 4.
అద్విగత చర్య అనగానేమి ? ఉదాహరణతో వివరింపుము.
జవాబు:
ప్రయోగ పరిస్థితులను మార్చినపుడు తిరిగి మొదటి పదార్థాన్ని పొందలేనటువంటి మార్పులను అద్విగత మార్పులు అంటారు.
ఉదా :
దీపావళి టపాసులు మండించటం, పండ్లు పక్వానికి రావటం మొదలైనవి.
ప్రయోగం:
1. ఒక పరీక్షనాళికలో ఒక టీ స్పూన్ వెనిగర్ తీసుకోండి.
2. దానికి కొద్దిగా బేకింగ్ సోడా కలపండి.
3. ఇప్పుడు పరీక్షనాళికలో రసాయన చర్య జరిగి వాయువు ఏర్పడింది.
4. ఈ వాయువును సున్నపు తేటలోనికి పంపండి.
5. అది తెల్లగా పాలవలె మారింది.
6. దీనిని బట్టి విడుదల అయిన వాయువు CO2 అని తెలుస్తుంది.
వెనిగర్ + బేకింగ్ సోడా → CO2 + సోడియం ఎసిటేట్ + నీరు
CO2 + సున్నపు నీరు → కాల్షియం కార్బొనేట్ + నీరు.
పై ప్రయోగ పరిస్థితులను మార్చినపుడు తిరిగి మనం మొదటి పదార్థాలను పొందలేము. అనగా వెనిగర్, బేకింగ్ సోడా ఏర్పడదు. ఇటువంటి రసాయన చర్యలను అద్విగత చర్యలు అంటారు.
ఎ) ఏర్పడిన పదార్థం మొదటి పదార్థం నుంచి వేరుగా ఉందా?
జవాబు:
అవును, ఈ ప్రక్రియలో CO2 మరియు సోడియం ఎసిటేట్ ఏర్పడినవి.
బి) సందర్భ పరిస్థితులు మార్చినపుడు మొదటి పదార్థాన్ని తిరిగి పొందగలిగామా?
జవాబు:
లేదు. తిరిగి మొదటి పదార్థం ఏర్పడదు.
కృత్యం – 5
ప్రశ్న 5.
ఆవర్తన మార్పులు అనగానేమి? ఉదాహరణతో వివరింపుము.
జవాబు:
ఒక నిర్ణీత సమయంలో తిరిగి తిరిగి వచ్చే మార్పులను ఆవర్తన మార్పులు అంటారు.
ఉదా : సూర్యోదయం, సూర్యాస్తమయం, రాత్రి – పగలు ఏర్పడటం.
సహజ మార్పు | పునరావృతం అవడానికి పట్టే సమయం (సుమారుగా) |
1. రాత్రి మరియు పగలు మారటం | 12 గంటలు |
2. చెట్ల ఆకులు రాలిపోవడం | 1 సంవత్సరం |
3. ధృవనక్షత్రం ప్రకాశించటం | 12 గంటలు |
4. ఋతువులు మారటం | 3 నెలలు |
5. పౌర్ణమి ఏర్పడటం | 1 నెల |
కృత్యం – 6
ప్రశ్న 6.
ఒక పొడవైన పరీక్షనాళికలో సగం వరకు నీరు తీసుకోండి. కొద్దికొద్దిగా చక్కెర కలుపుతూ సంతృప్త ద్రావణం తయారు చేయండి. తర్వాత ద్రావణాన్ని వేడిచేస్తూ కొద్ది కొద్దిగా చక్కెర కలపండి. ద్రావణం చక్కెరను కరిగించుకోలేనంత వరకు కలపండి. ద్రావణాన్ని వడపోసి 30 నిమిషాల పాటు వేడి చేయండి.
ఎ) చివరిలో ఏమి మార్పు గమనించారు?
జవాబు:
చివరిలో బిళ్ళల వంటి నిర్మాణాలు కనిపించాయి.
బి) ద్రావణంలో ఏవైనా స్పటికాలను నీవు గమనించావా?
జవాబు:
అవును, స్పటికాలు ఏర్పడినవి.
పరీక్షనాళిక అడుగుభాగంలో పెద్ద పెద్ద చక్కెర స్పటికాలు ఏర్పడడం గమనించవచ్చు. చిన్న చిన్న చక్కెర రేణువులు కలిగి పెద్దపెద్ద చక్కెర స్పటికాలు ఏర్పడతాయి. ఆవిరిగా మార్చి కాని, వేడిచేసి గాని ద్రావణాల నుంచి ఘన పదార్థాలను వేరుచేసే ప్రక్రియను స్పటికీకరణ అంటారు.
సి) మరి ఇది ఏ రకమైన మార్పు?
జవాబు:
ఇది భౌతిక మార్పు, పదార్థ స్థితిలో మార్పు వచ్చింది.
ద్రావణంలో కరగని స్పటికాలను వేడి చేసిగాని, ఆవిరిగా మార్చి గాని ఘన పదార్థాలను వేరుచేసే ప్రక్రియను స్పటికీకరణం అంటారు.
డి) ఇది ఏ రకమైన మార్పో నీవు చెప్పగలవా?
జవాబు:
స్పటికీకరణ ప్రక్రియలో కొత్త పదార్ధం ఏర్పడదు. కాబట్టి ఇది భౌతిక మార్పు.
కృత్యం – 7
ప్రశ్న 7.
ఇక్కడ కొన్ని మార్పులు పట్టికనందు ఇవ్వబడ్డాయి. వాటిని సరియైన వరుస నందు టిక్ (✓) మార్కును ఉంచండి.
జవాబు:
కృత్యం – 8
ప్రశ్న 8.
మెగ్నీషియం రిబ్బన్ తీసుకొని కొవ్వొత్తితో వేడిచేస్తే మిరుమిట్లు గొలిపే తెల్లని మెరుపు కాంతితో పాటు బూడిద ఏర్పడుతుంది.
ఎ) ఏర్పడిన బూడిద, మెగ్నీషియం రిబ్బన్ రెండూ ఒకేలా ఉన్నాయా?
జవాబు:
లేవు. మెగ్నీషియం రిబ్బన్ ప్రకాశవంతంగా ఉండగా, బూడిద తెల్లగా ఉంది.
బి) మెగ్నీషియం రిబ్బన్ లోనూ, బూడిదలోనూ ఉండే అంశాలు ఒకటేనా?
జవాబు:
కాదు, బూడిద గాలిలో ఆక్సీకరణం చెంది కొత్త పదార్థంగా మారింది.
మెగ్నీషియం రిబ్బన్ ను ఆక్సిజన్ సమక్షంలో మండించినప్పుడు మెగ్నీషియం ఆక్సైడ్ బూడిద రూపంలో ఏర్పడింది. ఇది ఒక కొత్త పదార్థం. అదే విధంగా మెగ్నీషియం రిబ్బన్లోని మూలకాలు కూడా మార్పు చెందాయి.
మెగ్నీషియం + ఆక్సిజన్ → మెగ్నీషియం ఆక్సైడ్
మెగ్నీషియం రిబ్బను కాల్చిన తర్వాత ఏర్పడిన బూడిదను సేకరించి కొద్దిగా నీటిలో కలపండి. మరొక కొత్త పదార్థం ఏర్పడింది కదా.
మెగ్నీషియం ఆక్సైడ్ + నీరు → మెగ్నీషియం హైడ్రాక్సైడ్
సి) మీరేం గమనించారు?
జవాబు:
కొత్త పదార్థాలు ఏర్పడటం గమనించాను.
డి) పదార్థాల స్థితిలో ఏదైనా మార్పును పరిశీలించారా?
జవాబు:
అవును.
ఇ) ఏర్పడిన మిశ్రమం ఆమ్లమా, క్షారమా?
జవాబు:
లిట్మస్ పరీక్ష జరిపినపుడు, మిశ్రమము క్షారస్వభావం కల్గి ఉంది.
కృత్యం – 9
ప్రశ్న 9.
పండు/ కూరగాయలు | రంగు మార్పు ఉంటుంది | |
అవును | కాదు | |
1. ఆపిల్ | అవును | |
2. వంకాయ | అవును | |
3. బంగాళాదుంప | అవును | |
4. టమోటా | కాదు | |
5. దోసకాయ | కాదు | |
6. మామిడికాయ | కాదు |
ఎ) పండ్లు లేదా కూరగాయల రంగులలో ఏ మార్పు గమనించారు?
జవాబు:
కొన్ని పండ్లు కోసినపుడు రంగు మారాయి.
బి) ఇటువంటి మార్పు ఎందువల్ల కలిగింది?
జవాబు:
కూరగాయలు వాతావరణంలో గాలితో ఆక్సీకరణం చెందటం వలన గోధుమ రంగు పూత ఏర్పడుతుంది. ఇది రసాయనిక మార్పు.