SCERT AP 7th Class Science Study Material Pdf 12th Lesson నేల మరియు నీరు Textbook Questions and Answers.
AP State Syllabus 7th Class Science 12th Lesson Questions and Answers నేల మరియు నీరు
7th Class Science 12th Lesson నేల మరియు నీరు Textbook Questions and Answers
Improve Your Learning (అభ్యసనాన్ని మెరుగుపరచుకుందాం)
I. ఖాళీలను పూరింపుము.
1. ఇళ్ళ నుంచి విడుదలయ్యే వ్యర్థ నీటిని ………. అంటారు. (మురుగు నీరు)
2. నేల ఏర్పడడాన్ని తెలిపే శాస్త్రాన్ని …………. అంటారు. (పెడాలజీ)
3. ఆధునిక నీటి శుద్ధి పరికరాల్లో సూక్ష్మజీవులను చంపడానికి క్లోరిన్ వాయువుకు బదులుగా …………….. ను. వాడతారు. (అతినీల లోహిత కిరణాల)
II. సరైన జవాబు సూచించు అక్షరమును బ్రాకెట్ లో రాయండి.
1. మృత్తికలో రాతి కణాలతో పాటు ఉంటుంది.
a) గాలి మరియు నీరు
b) నీరు మరియు మొక్కలు
c) గాలి, నీరు, ఖనిజాలు మరియు సేంద్రియ పదార్థాలు
d) గాలి, నీరు మరియు మొక్కలు
జవాబు:
c) గాలి, నీరు, ఖనిజాలు మరియు సేంద్రియ పదార్థాలు
2. నీటిని నిలుపుకొనే సామర్థ్యం ఈ నేలకు అధికం.
a) ఇసుక నేల
b) బంకమట్టి నేల
c) తేమ నేల
d) ఇ క మరియు తేమల మిశ్రమం
జవాబు:
b) బంకమట్టి నేల తేమ నేల
3. ఈ క్రింది వాటిలో ఏది నీటి కొరతకు కారణం కాదు?
a) పారిశ్రామిక వృథా
b) జనాభా పెరుగుదల
c) భారీ వర్షపాతం
d) నీటి వనరుల నిర్వహణ
జవాబు:
d) నీటి వనరుల నిర్వహణ
III. జతపరచండి.
గ్రూపు – A | గ్రూపు – B |
A) శైథిల్యం | 1) ఎక్కువ నీటిని నిలిపి ఉంచే సామర్థ్యం |
B) బంకమట్టి | 2) నేల పైపొర కొట్టుకొని పోవటం |
C) మృత్తిక క్రమక్షయము | 3) నేల ఏర్పడుట |
D) అడవుల పెంపకం | 4) 1% |
E) మంచి నీరు | 5) మొక్కలను పెంచడం |
6) 99% |
జవాబు:
గ్రూపు – A | గ్రూపు – B |
A) శైథిల్యం | 3) నేల ఏర్పడుట |
B) బంకమట్టి | 1) ఎక్కువ నీటిని నిలిపి ఉంచే సామర్థ్యం |
C) మృత్తిక క్రమక్షయము | 2) నేల పైపొర కొట్టుకొని పోవటం |
D) అడవుల పెంపకం | 5) మొక్కలను పెంచడం |
E) మంచి నీరు | 4) 1% |
IV. ఈ క్రింది ప్రశ్నలకు జవాబులు రాయండి.
ప్రశ్న 1.
ఈ క్రింది పదాలను నిర్వచించండి.
అ) శైథిల్యం
ఆ) ఆక్విఫర్
ఇ) నీటిని పీల్చుకునే స్వభావం (పెర్కొలేషన్)
ఈ) మురుగు నీరు
జవాబు:
అ) శైథిల్యం :
ప్రకృతిలో సహజ కారకాలైన గాలి, నీరు, సూర్యుడు మరియు వాతావరణం యొక్క చర్యల ఫలితంగా క్రమంగా శిలలు పగిలిపోయి సన్నని రేణువులుగా విడిపోయి మృత్తిక ఏర్పడుతుంది. ఈ ప్రక్రియను శైథిల్యం అంటారు.
ఆ) ఆక్సిఫర్ :
సాధారణంగా భూగర్భ జలాలు నీటిమట్టానికి క్రింద గట్టి రాతిపొరల మధ్య నిల్వ చేయబడతాయి. వాటిని ఆక్విఫర్లు అంటారు. బావులు, బోరు బావులు, చేతి పంపులు, ఈ ఆక్విఫర్ నుండే నీటిని పొందుతారు.
ఇ) పెర్కొలేషన్ :
నేల పొరల ద్వారా నీరు క్రిందకు కదలడాన్ని పెర్కొలేషన్ అంటారు. ఇది ఇసుక నేలలకు అధికంగాను బంకమట్టికి తక్కువగాను ఉండును.
ఈ)మురుగు నీరు :
గృహాల నుండి మరియు పరిశ్రమల నుండి వెలువడే వ్యర్థ జలాలను మురుగు నీరు అంటారు. ఇది నేల మరియు నీటి కాలుష్యానికి దారి తీయును.
ప్రశ్న 2.
బంకమట్టి, లోమ్, ఇసుక నేలల మధ్య భేదాలను రాసి, పంటలకు బంకమట్టి నేలలు ఎలా ఉపయోగపడతాయో తెల్పండి.
జవాబు:
బంక మట్టి నేలలలో నీటిని నిలుపుకొనే సామర్థ్యం అత్యధికం. కావున పంటలకు బాగా ఉపయోగపడుతుంది. నీటి ఎద్దడిని తట్టుకోవటానికి, పంటకు అధిక పోషకాలు ఇవ్వడానికి ఈ నేలలు ఉపయుక్తం. పత్తి, మిరప వంటి ఆరుతడి పంటలను, వర్షాధార పంటలను బంకమట్టి నేలలో సులభంగా పండించవచ్చు.
ప్రశ్న 3.
హర్షిత్ తన ఇంటి పరిసరాల్లో అందరు ‘బోరు బావుల’ ద్వారా నీటిని పొందుతున్నారని గమనించాడు. కానీ వర్షపు నీటిని సంరక్షించే చర్యలు ఎవరూ చేయడం లేదు. నీటి మట్టంపై దీర్ఘకాలిక ప్రభావాన్ని అంచనా వేయండి.
జవాబు:
- బోరు బావుల ద్వారా వచ్చే నీరు అంతా భూగర్భజలం.
- వర్షాల వలన ఇంకిన నీరు భూగర్భ జలంగా మారుతుంది.
- కావున భూగర్భ జలం పుష్కలంగా ఉండాలంటే వర్షపు నీటిని సంరక్షించుకోవాలి.
- వర్షపు నీటిని సంరక్షించనట్లయితే క్రమేణా భూగర్భజలం తరిగిపోతుంది.
- బోరు బావులు ఎండిపోతాయి.
- తీవ్ర నీటి కొరత ఏర్పడుతుంది.
- ఆవాసాలు నివాస యోగ్యం కాకుండా పోతాయి.
- కావున వర్షపు నీటిని వినియోగిస్తున్న నీటిని భూమిలోనికి ఇంకింప చేయాలి.
ప్రశ్న 4.
నీకు ఒక ‘సాయిల్ సైంటిస్టుని’ ఇంటర్వ్యూ చేసే అవకాశం వస్తే నేల, భూసార పరీక్షలు, నేల సంరక్షణలు గురించి తెలుసుకునేందుకు ఎటువంటి ప్రశ్నలు అడుగుతావు?
జవాబు:
- నేల ఎలా తయారవుతుంది?
- నేల యొక్క ప్రాధాన్యత ఏమిటి?
- అన్ని ప్రాంతాలలో నేలలు ఒకేరకంగా ఎందుకు ఉండవు?
- నేలలను ఎలా సంరక్షించుకోవాలి?
- నేల కాలుష్యం అంటే ఏమిటి?
- భూసార పరీక్షలు ఎందుకు చేయించాలి?
- నేలను ఎలా సంరక్షించుకోవచ్చు?
- నేల జీవనం అంటే ఏమిటి?
ప్రశ్న 5.
నీ స్నేహితురాలు ‘పెర్కొలేషన్’ రేటుకు సంబంధించిన ఒక ప్రయోగాన్ని నిర్వహించాలని అనుకుంటున్నది. 200మి.లీ. నీరు నేలలో ఇంకడానికి 40 ని. సమయం పడుతుందని ఆమె పరిశీలించింది. ఆ నేలలో పెర్కొలేషన్ రేటును లెక్కించండి మరియు ప్రయోగ విధానాన్ని రాయండి.
జవాబు:
ఉద్దేశం : నేల పెర్కొలేషన్ రేటును లెక్కించుట.
పరికరాలు : వాటర్ బాటిల్ నీరు, కొలజాడి, గడియారం.
విధానం:
- ఒక వాటర్ బాటిల్ తీసుకొని దాని మెడ కిందుగా, 1/4 వంతు వరకు కత్తిరించాలి.
- కత్తిరించిన పై భాగానికి ఉన్న మూతకు చిన్నరంధ్రాలు చేయాలి.
- దీనిని తలక్రిందులుగా మిగిలిన బాటిలకు అమర్చాలి.
- పై భాగాన 100 మి.లీ. మట్టిని తీసుకొని దానిలో 100 మి.లీ. నీటిని పోయాలి.
నీరు పరిశీలన :
మట్టిలో పోసిన నీరు క్రిందకు ప్రయాణించి క్రింద ఉన్న బాటిల్ భాగంలో సేకరించబడుతుంది. నీరు అంత క్రిందకు రావటానికి పట్టిన కాలాన్ని గణించాలి. ఇది నేల పెర్కొలేషన్ సామర్థ్యాన్ని తెలుపుతుంది.
పెర్కొలేషన్ :
నేల పొరల ద్వారా నీరు ఈ క్రింది పొరలకు ప్రయాణించే ధర్మాన్ని పెర్కొలేషన్ అంటారు.
తీసుకొన్న నీటి పరిమాణం = 200 మి.లీ.
ఇంకటానికి పట్టిన కాలం = 40 ని.
పెర్కొ లేషన్ రేటు = 200/40 = 5 మి.లీ/ని.
ఆ నేల యొక్క పెర్కొలేషన్ రేటు 5 మి.లీ./ని.
ప్రశ్న 6.
మనం భూమిని ‘భూమాత’ అని ఎందుకు అంటామో, ఆమె పట్ల నీ ప్రశంసలను, కృతజ్ఞతలను ఎలా తెలియ జేస్తావు?
జవాబు:
- నేల సమస్త జీవరాశికి ఆధారము.
- ఇది మొక్కలకు జన్మనిచ్చి జీవం కొనసాగటానికి ఉపయోగపడుతుంది.
- అందుకే నేలను తల్లిగా భావించి గౌరవిస్తాము.
- నేల లేనిదే మనకు జీవం ఉండదు. అందువలన నేలపట్ల కృతజ్ఞత చూపుతూ నేల ఆరోగ్యాన్ని సంరక్షించుకోవాలి.
- అమ్మ, అవని, నేలతల్లి అని పాటలు రాసి పాడి, నేలపై మన మమకారాన్ని చూపుతున్నాము.
- ఈ కృతజ్ఞత కేవలం మాటలకే పరిమితం కాకుండా చేతలకు రావాలి.
- నేల కాలుష్యంపై అందరు అవగాహన కల్గి నేలకు నష్టం కలిగే చర్యలను విడనాడాలి.
- ప్లాస్టిక్, విష రసాయనాలు వదిలి నేలకు జీర్ణమయ్యే పదార్థాలను మాత్రమే వాడాలి.
ప్రశ్న 7.
మీ అమ్మ ఒక తోటను పెంచాలనుకుంటున్నారు. నీటి వాడకాన్ని తగ్గించడానికి మరియు నేల సారాన్ని మెరుగు పరచడానికి ఆమెకు ఎలాంటి సలహాలు ఇస్తావు?
జవాబు:
నీటి సంరక్షణకు :
- తుంపర పద్ధతి వాడాలి.
- డ్రిప్ సిస్టమ్ వాడటం వలన నీరు ఆదా అవుతుంది.
- నీటి నష్టం తగ్గించటానికి గ్రీన్ మ్యా ట్లు వాడాలి.
- సాయంత్రం వేళలో నీటి సరఫరా చేయాలి.
నేలసారం పెంచటానికి :
- సేంద్రియ వ్యర్థాలను వాడాలి.
- కొబ్బరి పిట్టును నేలకు కలపాలి.
- ఒకేరకమైన మట్టిని కాకుండ మిశ్రమ మట్టిని వాడాలి.
- వర్మీకంపోస్టు ప్రాధాన్యత ఇవ్వాలి.
7th Class Science 12th Lesson నేల మరియు నీరు InText Questions and Answers
7th Class Science Textbook Page No. 167
ప్రశ్న 1.
చెట్లు ఎక్కడ పాతుకొని ఉన్నాయి?
జవాబు:
చెట్లు నేలలో పాతుకొని ఉంటాయి.
7th Class Science Textbook Page No. 169
ప్రశ్న 2.
జంతువులు, మానవులు ఎక్కడ జీవిస్తున్నారు?
జవాబు:
జంతువులు, మానవులు భూమిపై జీవిస్తున్నారు.
ప్రశ్న 3.
భూమి పైన మట్టి లేకపోతే ఏమవుతుంది?
జవాబు:
భూమి పైన మట్టి లేకపోతే జీవం అసాధ్యమవుతుంది.
ప్రశ్న 4.
మొక్కలు ఎక్కడ నుండి పోషకాలను గ్రహిస్తాయి?
జవాబు:
మొక్కలు నేల నుండి పోషకాలను గ్రహిస్తాయి.
ప్రశ్న 5.
వానపాములు, నత్తలు వర్షం సమయంలో కనిపిస్తాయి. ఎందుకు?
జవాబు:
నేల అనేక జీవులకు ఆవాసం, వర్షానికి నేల తడవటం వలన ఇవి బయటకు వస్తాయి.
ప్రశ్న 6.
మృత్తిక ఒక ముఖ్యమైన వనరు. ఎందుకు?
జవాబు:
మానవుడు తన నిత్యావసరాల కోసం నేల (మట్టి)పై ఆధారపడి ఉన్నాడు. నేల అతని జీవనంలో భాగంగా ఉన్నది. కావున భూమిపై జీవించటానికి అవసరమైన నేల ఒక ముఖ్యమైన సహజ వనరు. మట్టి (soil) అనే పదం సోలమ్ అనే లాటిన్ భాష పదం నుండి పుట్టింది. సోలమ్ అనగా మొక్కలు పెరిగే తలము. భూమిపై ఉపరి తలమును మట్టి లేదా మృత్తిక అంటారు. కావున మృత్తిక భూమి నుండి లభించే వనరు. మృత్తికను గూర్చిన శాస్త్రీయ అధ్యయనాన్ని “పెడాలజీ” అంటారు.
7th Class Science Textbook Page No. 171
ప్రశ్న 7.
మృత్తిక మనకు ఎన్ని విధాలుగా ఉపయోగపడుతుంది?
జవాబు:
మొక్కలు, జంతువులకు ఆవాసంగా మాత్రమే కాకుండా, వ్యవసాయానికి, భవనాల నిర్మాణానికి, ఖనిజాలు, గనుల త్రవ్వకానికి, వస్తువులు మరియు పాత్రల తయారీకి (టెర్రకోట, పింగాణీ), బొమ్మలు, విగ్రహాల తయారీకి (షాదూ మట్టి) సౌందర్య సాధనాలు (ముల్తానీ మట్టి)గా మృత్తిక మనకు ఉపయోగపడుతున్నది.
7th Class Science Textbook Page No. 179
ప్రశ్న 8.
మన రాష్ట్రంలో సాధారణంగా ఏ రకమైన నేలలు కనిపిస్తాయి?
జవాబు:
మన రాష్ట్రములో సాధారణంగా నల్లరేగడి, లోమ్, ఇసుక నేలలు కనిపిస్తాయి.
ప్రశ్న 9.
అన్నిరకాల నేలలలో మనం ఒకే పంటను పండించగలమా?
జవాబు:
లేదు. నేలరకం బట్టి పండించే పంట మారుతుంది.
ప్రశ్న 10.
వరి పండటానికి ఏ రకమైన నేల అవసరం?
జవాబు:
వరి పంటకు ఎక్కువ లోమ్ నేలలు, నల్లరేగడి నేలలు అనుకూలం.
ప్రశ్న 11.
నేలకు, పండించే పంటలకు ఏదైనా సంబంధం ఉందా?
జవాబు:
అవును. నేల రకాన్ని బట్టి పండించే పంటలు ఉంటాయి.
7th Class Science Textbook Page No. 181
ప్రశ్న 12.
భూసార పరీక్షలు ఎందుకు నిర్వహిస్తారు?
జవాబు:
భూసార పరీక్షలు నిర్వహించడం ద్వారా పొలంలోని నేలను పంటలకు అనుకూలంగా మార్చవచ్చు. పొలంలోని మట్టిని పరీక్షించాలి అంటే ఒక ప్రత్యేకమైన నిర్దిష్ట విధానంలో మట్టిని సేకరించి పరీక్షించి విశ్లేషించాలి. భూసార పరీక్ష ద్వారా పరీక్షించే అంశాలన్నీ మృత్తిక ఆరోగ్య స్థితిని నిర్ణయిస్తాయి.
సాధారణంగా భూసార పరీక్షల ద్వారా ఈ క్రింది అంశాలను పరీక్షించడం జరుగుతుంది. అవి కార్బన్ వంటి సేంద్రియ పదార్థాలు లోపము, నేలలో అందుబాటులో ఉన్న ఖనిజ లవణాలు – నైట్రోజ్, పాస్పరస్, పొటాషియం , అందుబాటులో ఉన్న సూక్ష్మ పోషకాల స్థాయి, సరిపోని నీటి పారుదల, నేల ఉష్ణోగ్రత, తేమ, నేలలోని కాలుష్యకాలు, నేల యొక్క ఆమ్ల లేదా క్షార స్వభావం (pH) మొదలైనవి.
ప్రశ్న 13.
భూసార పరీక్షల వలన రైతులకు కలిగే ప్రయోజనం ఏమిటి?
జవాబు:
భూసార పరీక్ష:
- రైతుకు తన నేల ఆరోగ్య స్థితిని తెలియజేసి దానిని పెంపొందించుకోవడం కోసం సహాయపడుతుంది.
- నేల నాణ్యత తగ్గిపోవడాన్ని నివారించుటకు సహాయపడుతుంది.
- ఎరువుల వాడకాన్ని తగ్గించటానికి సహాయపడుతుంది.
భూసార పరీక్షలు నిర్వహించడం ద్వారా నేలలోని మొక్కలకు అవసరమైన పోషకాలను సంరక్షించుకుంటూ ఆరోగ్యంగానూ, సారవంతంగానూ మార్చుకోగలము.
7th Class Science Textbook Page No. 183
ప్రశ్న 14.
నేల కోతకు ఇతర కారణాలు ఏమిటి? దాని సంరక్షణ చర్యలు తెలపండి.
జవాబు:
తుఫానులతో పాటు వర్షాలు, వరదలు ప్రణాళికలేని అధిక వ్యవసాయ కార్యక్రమాలు, పశువులను అధికంగా మేపటం, అడవుల నరికివేత, నిర్మాణాల కోసం మరియు గనుల కోసం తవ్వటం లాంటివి నేల కోతకు గురి అవ్వడానికి కారణాలు. నేల కోతకు గురి అవ్వటం వలన నేలపై మృత్తికలోని పోషకాలు కొట్టుకొనిపోతాయి. ఫలితంగా పంట దిగుబడి తగ్గిపోతుంది. కాబట్టి నేల కోతకు గురికాకుండా అరికట్టాలి. నేల నిస్సారం కాకుండా చూడడాన్ని నేల సంరక్షణ అంటారు. కింది చర్యల ద్వారా నేలను సంరక్షించవచ్చు.
- అడవులు నాశనం కాకుండా నియంత్రించటం.
- మునుపు వృక్షాలు లేని ప్రదేశాలలో చెట్లను పెంచడాన్ని అడవుల పెంపకం అంటారు.
- డ్యాములు, రిజర్వాయర్లు గట్లను నిర్మించటం.
- ప్రణాళికాబద్దమైన ఆధునిక వ్యవసాయ పద్ధతులు.
- నేల సారానికి కాపాడే పంట మార్పిడి విధానం.
- చెట్లను కంచెలుగా పెంచి గాలుల ప్రభావాన్ని తగ్గించడం.
- బీడు భూముల్లో పశువుల మేతను అరికట్టడం.
- నేలను మొక్కలు లేకుండా విడిచిపెట్టకుండా ఉండటం.
7th Class Science Textbook Page No. 185
ప్రశ్న 15.
మహాసముద్రాలలోని నీరు త్రాగడానికి, వ్యవసాయానికి పనికి వస్తుందా?
జవాబు:
లేదు. సముద్ర నీరు, వ్యవసాయానికి త్రాగటానికి పనికిరాదు.
ప్రశ్న 16.
మంచినీరు ఎక్కడ నుండి వస్తుంది?
జవాబు:
మంచి నీరు వర్షాల వలన, నదులు, కాలువలు నుండి వస్తుంది.
ప్రశ్న 17.
మంచి నీరు ఎంతశాతం అందుబాటులో ఉంది?
జవాబు:
కేవలం ఒక శాతం మాత్రమే అందుబాటులో ఉంది.
ప్రశ్న 18.
అన్ని ప్రదేశాలలోనూ భూగర్భ జల మట్టం ఒకేలాగా ఉంటుందా?
జవాబు:
భూగర్భ జల మట్టం ఒక ప్రదేశానికి మరో ప్రదేశానికి మారుతూ ఉంటుంది. నది ఒడ్డులోన ఇది ఒక మీటరు కంటే తక్కువ లోతులోనే ఉంటుంది. ఎడారుల వంటి చోట్ల అనేక మీటర్ల లోతులో ఉంటుంది.
7th Class Science Textbook Page No. 187
ప్రశ్న 19.
బావులు ఎండిపోవటానికి కారణం ఏమిటి?
జవాబు:
పారిశ్రామికీకరణ, నగరీకరణ ప్రభావం వలన, జనాభా విస్పోటనం, అడవుల నరికివేత, నీరు ఇంకే ప్రదేశం తగ్గటం, తక్కువ వర్షపాతం వంటి కారణాల వలన బావులు ఎండిపోతున్నాయి.
ప్రశ్న 20.
భూగర్భజలం తగ్గిపోతే ఏమౌతుంది?
జవాబు:
మన ప్రధాన అవసరాలు అయిన త్రాగునీరు వ్యవసాయం కోసం ప్రధానంగా భూగర్భ జలాలపైనే ఆధారపడుతున్నాయి. భూగర్భ జలాలు తగ్గిపోతే తీవ్ర నీటి ఎద్దడి ఏర్పడుతుంది. నీరు లేక జనావాసాలు ఖాళీ చేయటం, వలస వెళ్ళటం, కరువు ఏర్పడటం వంటి విపత్కర పరిస్థితులు ఎదురుపడతాయి.
7th Class Science Textbook Page No. 189
ప్రశ్న 21.
నీటి నిర్వహణ ఎందుకు అవసరం?
జవాబు:
- నీరు భూమిపై చాలా తక్కువగా లభించే వనరు.
- ఇది జీవనానికి తప్పనిసరి.
- కావున ఉన్న నీటిని సక్రమంగా వాడుకోగల్గినపుడే మనం జీవించగలం.
- దీనికోసం సక్రమమైన నీటి నిర్వహణ అవసరం.
ప్రశ్న 22.
నీటిని త్రాగునీటిగా ఎలా మార్చుతాము?
జవాబు:
- గడ్డకట్టించటం
- అవక్షేపీకరణ
- వడపోత
- క్రిమిసంహరణ వంటి పద్ధతులలో నీటిని త్రాగునీటిగా మార్చుతాము.
ఆలోచించండి – ప్రతిస్పందించండి
7th Class Science Textbook Page No. 171
ప్రశ్న 1.
రోడ్డు నిర్మాణం కోసం పెద్ద పెద్ద రాళ్ళను, చిన్న ముక్కలుగా చేయడాన్ని చూసి ఉంటారు. దీనిని శైథిల్యం అంటారా? ఎందుకు?
జవాబు:
- వాతావరణ చర్యల ఫలితంగా శిలలు సన్నని రేణువులుగా మారి మృత్తికగా ఏర్పడే ప్రక్రియను శైథిల్యం అంటారు.
- ఈ ప్రక్రియ వేల సంవత్సరాలపాటు జరుగుతుంది.
- రోడ్ల నిర్మాణానికి రాళ్ళు పగులకొట్టే ప్రక్రియ శైథిల్యం కాదు.
- ఈ ప్రక్రియలో మృత్తిక ఏర్పడదు. కేవలం రాయి పరిమాణం తగ్గుతుంది.
7th Class Science Textbook Page No. 185
ప్రశ్న 2.
భూమిపై అధిక మొత్తంలో నీరు ఉన్నప్పటికీ ఎందుకని అత్యంత విలువైన వనరుగా పిలుస్తారు?
జవాబు:
- భూమిపై నీరు అధికంగా ఉన్నప్పటికి, అందులో 97% శాతం నీరు సముద్రాలలోని ఉప్పు నీరుగా ఉంది.
- ఈ సముద్ర నీరు త్రాగటానికి, వ్యవసాయానికి పనికిరాదు.
- ఇక మానవ అవసరాలను తీర్చే మంచినీరు కేవలం ఒక్కశాతమే.
- అందువలననే నీరు అత్యంత విలువైన వనరు.
కృత్యాలు, ప్రాజెక్ట్ పనులు
7th Class Science Textbook Page No. 197
ప్రశ్న 1.
మీ ఉపాధ్యాయుడి సహాయంతో మధ్యాహ్న భోజన సమయంలోని వ్యర్థాలను తడి చెత్తను వేరు చేసి మీ పాఠశాల తోట కొరకు వర్మీకంపోస్టును తయారుచేయండి.
జవాబు:
- పాఠశాల ఆవరణలో వెనుక భాగాన 6 × 3 × 3 కొలతతో ఒక గోతిని తవ్వాము.
- ప్రతిరోజు పాఠశాల తడి వ్యర్థాలను ఒక పొరలా గోతిలో వేశాము.
- దానిపైన మరోపొరలా మట్టిని ఎండుటాకులను పరిచి నీళ్ళు చల్లాము.
- ఈ గుంట నిండే నాటికి అడుగు ఉన్న తడిచెత్త అంతా కంపోస్ట్ ఎరువుగా మారింది.
- దీనిని సేకరించి పాఠశాల గార్డెను ఎరువుగా వాడాము.
ప్రశ్న 2.
వాడి పారేసిన ప్లాస్టిక్ బాటిల్స్, రాళ్ళు, మట్టిని ఉపయోగించుకుని “నేల క్షితిజాలను” సూచించే నమూనాలను తయారు చేయండి.
జవాబు:
- ఒక పెద్ద రెండు లీటర్ల బాటిల్ తీసుకొన్నాను.
- దానిలో మొదట కంకరవంటి పెద్ద రాళ్ళను వేశాను. ఇది 5 సెం.మీ. మందాన ఒక పొరలా ఏర్పడి R క్షితిజంను సూచిస్తున్నది.
- దీనిపైన చిన్న రాళ్ళు, ఇసుక పొరను పరిచాను. ఇది C క్షితిజాన్ని సూచిస్తుంది.
- దీనిపైన మెత్తటి మట్టి చల్లాను. ఇది BHతిజాన్ని సూచిస్తుంది.
- దీనిపైన గాఢమైన వర్ణంలో ఉన్న సారవంతమైన మట్టిని పరిచాను. ఇది A క్షితిజాన్ని సూచిస్తుంది.
దీనిపైన ఎండు ఆకులు, పుల్లలు పరిచాను. ఇది 0 క్షితిజాన్ని సూచిస్తున్నది.
కృత్యాలు
కృత్యం – 1
ప్రశ్న 1.
కింది పట్టికలో పేర్కొనబడిన ప్రదేశములను సందర్శించండి. నేలపై 30 సెం.మీ. × 30 సెం.మీ. విస్తీర్ణము గల ప్రదేశము చుట్టూ గీతలు గీయండి. ఈ ఎంచుకున్న విస్తీర్ణంలో 4-6 సెం.మీ. లోతులో గుంతను తవ్వండి. భూతద్దం సహాయంతో జాగ్రత్తగా మట్టిని వెలికితీసి, దానిలోని మొక్కలు, చిన్న జీవులను పరిశీలించండి. మట్టిలో తిరుగుతున్న జీవులకు హాని కలుగకుండా జాగ్రత్త వహించండి. మీరు కనుగొనిన అంశాలను పట్టిక యందు నమోదు చేయండి.
జవాబు:
కృత్యం – 2
ప్రశ్న 2.
ముందుగా ఒక పిడికెడు మట్టిని తీసుకొని దానిని పారదర్శకమైన పాలిథిన్ కవర్ లో వేసి మూతిని గట్టిగా కట్టండి. ఈ కవర్‌ను ఒకటి లేదా రెండు గంటలపాటు సూర్యరశ్మి క్రింద ఉంచండి. రెండు గంటల తరువాత పాలిథిన్ కవర్ యొక్క లోపలి తలంలో నీటి బిందువులను గమనిస్తారు.
ఒక గాజు బీకరును తీసుకొని దానిని ఈ పిడికెడు మట్టితో నింపండి. తరువాత దానిలో నెమ్మదిగా, జాగ్రత్తగా నీటిని పోయండి. మట్టిలో నుండి నీటి బుడగలు రావడం పరిశీలించారా? ఇప్పుడు బీకరును నీటితో నింపి, మట్టిని నీటిని బాగా కలపాలి. తరువాత కొద్దిసేపు అలాగే వదిలివేయాలి.
నీటి ఉపరితలంపై ఏమి కనిపిస్తాయి?
జవాబు:
కర్బన పదార్థాలు, ఎండిన కుళ్లిన పత్రాలు, వేర్లు నీటి పై భాగంలో తేలుతూ ఉంటాయి. చనిపోయిన, కుళ్ళిపోయిన కర్బన పదార్థాలు కలిసిన మట్టినే హ్యూమస్ అంటారు.
ఎ) బీకరు అడుగుభాగంలో నీవేమి గమనించావు?
జవాబు:
బీకరు అడుగు భాగంలో మట్టి, ఇసుక, చిన్న రాళ్ళు కనిపించాయి.
బి) బీకరులో కీటకాలు కానీ, మొక్క భాగాలు కానీ కనిపించాయా?
జవాబు:
అవును. బీకరు అడుగుభాగంలో కీటకాల కాళ్ళు, మొండెం కనిపించాయి.
సి) మీ పరిశీలనలను బట్టి ఏమి నిర్ధారిస్తావు?
జవాబు:
పరిశీలన | నిర్ధారణ |
సంచిలోని నీటి బిందువులు | మట్టి రేణువుల మధ్య నీరు ఉంటుంది. |
నీటిని పోసినప్పుడు వెడలిన గాలి బుడగలు | మట్టి రేణువుల మధ్య గాలి ఉంటుంది. |
నీటిపై ఎండిన మొక్క భాగాలు తేలుట | మట్టిలో సేంద్రియ పదార్థాలు ఉంటాయి. |
బీకరు అడుగు భాగంలో చేరిన మట్టిరేణువులు | మట్టిలో నిరీంద్రియ పదార్థాలు ఉంటాయి. |
కీటకాలు, మొక్క భాగాలు | మట్టిలోని జీవులు. |
కృత్యం – 3
ప్రశ్న 3.
మట్టిలోని రకాలను ఎలా గుర్తిస్తావు?
జవాబు:
ఉద్దేశం : మృత్తికలోని రకములను గుర్తించుట.
ఏమి చేయాలి :
వివిధ ప్రదేశముల నుండి మట్టి నమూనాలను సేకరించి ఒక్కొక్క నమూనా నుండి 25 గ్రాముల మట్టిని తీసుకోండి. అందులోని చెత్తాచెదారాన్ని, గడ్డిని, ఎండిన ఆకులను తొలగించండి. దీనికి కొద్దికొద్దిగా నీటిని చేర్చినొక్కుతూ, బంతిలాగా మార్చడానికి ప్రయత్నించండి. ఇదే విధంగా అన్ని రకాల మట్టి నమూనాలను బంతిలాగా మార్చటానికి ప్రయత్నించాలి. అన్ని మట్టి నమూనాలతో విడివిడిగా ఇలానే చేయండి.
అన్నీ మట్టి నమూనాలను బంతిగా మలచగలిగారో లేదో నమోదు చేయండి.
బంతిగా చేయగలిగిన మట్టి నమూనాలను చదును తలంపై ఉంచి పొడవైన కడ్డీగా చేసేందుకు ప్రయత్నించండి. కడ్డీగా చేసిన మట్టిని విరగకుండా జాగ్రత్తగా రింగు వలే వంచడానికి ప్రయత్నించండి.
ప్రతి దశలోనూ మీ పరిశీలనలను నమోదు చేసి ఆ పరిశీలనలను క్రింది పట్టికలోని అంశాలతో పోల్చి మీ పరిశీలనల గురించి తెలుసుకోండి.
పై పట్టికను బట్టి మట్టిలో రేణువుల పరిమాణాన్ని బట్టి, నేలను ఇసుక, లోమ్ మరియు బంకమట్టి అనే మూడు రకాలుగా వర్గీకరించవచ్చు ఈ మూడు కాకుండా తేలికైన బంకమట్టి బరువైన లోమ్, ఇసుకతో కూడిన లోమ్, ఇలా వివిధ రకాలుగా ఉంటాయి.
కృత్యం – 4
ప్రశ్న 4.
నేల కోతను అర్థం చేసుకొనుటకు నీవు ఏ ప్రయోగం నిర్వహిస్తావు?
జవాబు:
మూడు ప్లాస్టిక్ నీటి బాటిళ్లను నిలువుగా సగభాగానికి చేయవలెను. బాటిల్ లోపల అంతా మట్టితో నింపవలెను. పటంలో చూపిన విధంగా మొలకెత్తిన పెసర విత్తనాలను మొదటి బాటిల్ లో వేసి రోజూ నీటిని పోస్తూ ఉండాలి. రెండవ బాటిల్ నందు మట్టికి ఎండిన ఆకులతో కప్పాలి. మూడవ బాటిల్ లోని మట్టి అలాగే వదిలివేయాలి. వారం రోజులలో మొదటి బాటిల్ లోని విత్తనాలు మొలకెత్తుతాయి. మూడు బాటిళ్ల నుండి పారే నీళ్ళను సేకరించటానికి వాటి వద్ద చిన్న పాత్రలు లేదా అడ్డంగా కోసిన ప్లాస్టిక్ బాటిల్ అమర్చాలి.
ఈ బాటిళ్ళపై భాగము నుండి గాలిని విసరాలి. సమపాళ్ళలో మూడు బాటిళ్ళలోనూ నీటిని పోస్తూ ఉండాలి. ఏ బాటిల్ నుండి గాలి, నీటి ద్వారా తక్కువ మట్టి కొట్టుకుపోతుందో నమోదు చేయండి. అందులో
ఈ కృత్యం ద్వారా గాలి మరియు నీటి ద్వారా నేలపై పొర కోతకు గురి అవుతుంది. అయితే మొక్కలు నేల కోతను అరికడతాయి అని నిర్ధారించవచ్చు.
కృత్యం – 5
ప్రశ్న 5.
మీ గ్రామ సమీపంలోని నిర్మాణాలు మరియు పరిశ్రమల పెరుగుదల కారణంగా మీ ప్రదేశంలోని భూగర్భ జల మట్టంలో కలిగిన మార్పులను గూర్చి మీ ఇంటిలోని పెద్దలను అడిగి తెలుసుకోండి. మీ తరగతిలో చర్చించండి.
జవాబు:
వర్షపు నీరు భూమిలోకి ఇంకుట ద్వారా సహజంగా భూగర్భజలం పునరుద్ధరించబడి ఉంటుంది. అయితే అది పునరుద్ధరింపబడుతున్న దాని కంటే అత్యంత వేగంగా మనం ఉపయోగించడం వలన తగ్గిపోతుంది. భూగర్భ జల మట్టం తగ్గిపోవడానికి గల కొన్ని కారణాలు. జనాభా విస్ఫోటనం, పారిశ్రామికీకరణ, వ్యవసాయ కార్యక్రమాలు, . అడవుల నరికివేత, నీరు ఇంకే ప్రదేశంలో తగ్గుదల, తక్కువ వర్షపాతం.