AP Board 7th Class Science Solutions Chapter 3 జీవులలో పోషణ

SCERT AP 7th Class Science Study Material Pdf 3rd Lesson జీవులలో పోషణ Textbook Questions and Answers.

AP State Syllabus 7th Class Science 3rd Lesson Questions and Answers జీవులలో పోషణ

7th Class Science 3rd Lesson జీవులలో పోషణ Textbook Questions and Answers

Improve Your Learning (అభ్యసనాన్ని మెరుగుపరచుకుందాం)

I. ఖాళీలను పూరింపుము.

1. కిరణజన్య సంయోగక్రియలో ……………… అనే వాయువు విడుదల అవుతుంది. (ఆక్సిజన్)
2. ఆకు ఉపరితలంపై ఉండే చిన్న చిన్న రంధ్రాలు …… (పత్రరంధ్రాలు)
3. ………………. అనేది దంతాల యొక్క బయటి పొర. (ఎనామిల్)

II. సరైన జవాబు సూచించు అక్షరమును బ్రాకెట్ లో రాయండి.

1. గ్రసనిని జీర్ణాశయంతో కలిపి ఉంచే కండరయుతమైన గొట్టం వంటి నిర్మాణం
A) వాయునాళం
B) ఆహారనాళంలో
C) జీర్ణనాళం
D) చిన్నప్రేగు
జవాబు:
C) జీర్ణనాళం

2. కీటకాహారి కాని మొక్క
A) డ్రోసిర
B) నెఫంథీస్
C) యుట్రిక్యులేరియా
D) డాడర్
జవాబు:
D) డాడర్

AP Board 7th Class Science Solutions Chapter 3 జీవులలో పోషణ

3. మొక్కలోని ఆకుపచ్చని వర్ణపదార్థం ఏది?
A) హరితరేణువు
B) పత్రరంధ్రం
C) పత్రహరితం
D) పైవన్నీ
జవాబు:
C) పత్రహరితం

III. జతపరచండి.

గ్రూపు – A గ్రూపు – B
A) స్వయం పోషకాలు 1) పుట్టగొడుగులు
B) పూతికాహారులు 2) మామిడిమొక్క
C) పరాన్న జీవి మొక్క 3) ఆహార రిక్తిక
D) జాంతవ భక్షణ 4) జీర్ణనాళంలో పురుగులు
E) అమీబా 5) మానవులు
6) మలవిసర్జన

జవాబు:

గ్రూపు – A గ్రూపు – B
A) స్వయం పోషకాలు 2) మామిడిమొక్క
B) పూతికాహారులు 1) పుట్టగొడుగులు
C) పరాన్న జీవి మొక్క 4) జీర్ణనాళంలో పురుగులు
D) జాంతవ భక్షణ 5) మానవులు
E) అమీబా 3) ఆహార రిక్తిక

IV. ఈ క్రింది ప్రశ్నలకు జవాబులు రాయండి.

ప్రశ్న 1.
స్వయం పోషణ, పరపోషణ మధ్య భేదాలు తెల్పండి.
జవాబు:

స్వయంపోషణ పరపోషణ
1) ఆహారాన్ని స్వయంగా తయారు చేసుకుంటాయి. 1) ఆహారం కోసం ఇతర జీవులపై ఆధారపడతాయి.
2) సౌరశక్తి నీరు, కార్బన్ డై ఆక్సైడ్ వంటి పదార్థాలు అవసరం. 2) ఎటువంటి పదార్థాలు అవసరము లేదు.
3) పత్రహరితం ఉండటం వలన ఆకుపచ్చగా ఉంటాయి. 3) ఈ జీవులలో పత్రహరితం ఉండదు.
4) స్వయం పోషణ అవలంబించే జీవులను స్వయం పోషకాలు అంటారు. 4) వీటిని పరపోషకాలు అంటారు.
5) ఇవి ఆహార ఉత్పత్తిదారులు. 5) ఇవి ఆహార వినియోగదారులు.
6) ఉదా : మొక్కలు 6) ఉదా : జంతువులు

ప్రశ్న 2.
కిరణజన్య సంయోగక్రియ అనగానేమి? పద సమీకరణం రాయండి.
జవాబు:
ఆకుపచ్చని మొక్కలు సూర్యకాంతి సమక్షంలో పత్రహరితం ‘ ఉపయోగించుకొని కార్బన్ డై ఆక్సెడ్, నీటి నుండి స్వయంగా, ఆహారాన్ని తయారుచేసుకొనే విధానాన్ని ‘కిరణజన్య సంయోగక్రియ’ అంటారు.
AP Board 7th Class Science Solutions Chapter 3 జీవులలో పోషణ 1

ప్రశ్న 3.
వివిధ రకాలయిన దంతాలను వర్ణించి వాటి విధులను తెలపండి.
జవాబు:
మానవుని నోటిలో నాలుగురకాల దంతాలు కలవు. అవి :
1) కుంతకాలు :
వీటిని ముందుపళ్ళు అంటారు. వీటి సంఖ్య 8. ఇవి ఆహారపదార్థాన్ని కొరకటానికి తోడ్పడతాయి.

2) రదనికలు :
వీటిని కోర పళ్ళు లేదా చీల్చు దంతాలు అంటారు. ఇవి ఆహారాన్ని చీల్చటానికి తోడ్పడతాయి. వీటి సంఖ్య 4.

3) చర్వణకాలు :
వీటిని నములు దంతాలు అంటారు. వెడల్పుగా ఉంటాయి. ఆహారం నమలటానికి తోడ్పడతాయి. వీటి సంఖ్య 8.

4) అగ్రచర్వణకాలు :
వీటిని విసురు దంతాలు అంటారు. దవడ చివర భాగంలో ఉంటాయి. వీటి సంఖ్య 12.
AP Board 7th Class Science Solutions Chapter 3 జీAP Board 7th Class Science Solutions Chapter 3 జీవులలో పోషణ 2వులలో పోషణ 2

ప్రశ్న 4.
మొక్క యొక్క ఆకుపచ్చని పత్రాన్ని ఆకుపచ్చని రంగుతో పెయింట్ వేస్తే ఏమవుతుంది?
జవాబు:

  1. మొక్కలు పత్రహరితం కలిగి ఉండటం వలన ఆకుపచ్చ కాంతిలో ఉంటాయి.
  2. ఈ పత్రహరితం తెల్లనికాంతిని గ్రహించి ఆకుపచ్చ రంగును విడుదల చేస్తుంది.
  3. అంటే పత్రం ఆకుపచ్చ రంగును స్వీకరించదు.
  4. దీనికి ఆకుపచ్చ రంగు పెయింట్ వేయటం వలన, ఆకు వలె ఇది ఆకుపచ్చరంగును విడుదలచేస్తుంది.
  5. అందువలన పత్రానికి కాంతి లభించదు. దీని వలన కిరణజన్య సంయోగక్రియ జరగదు.

AP Board 7th Class Science Solutions Chapter 3 జీవులలో పోషణ

ప్రశ్న 5.
“కడుపు ఉబ్బరం” గురించి తెలుసుకోవటానికి నీవు వైద్యుని ఏ ప్రశ్నలు అడుగుతావు?
జవాబు:

  1. కడుపు ఉబ్బరం అంటే ఏమిటి?
  2. కడుపు ఉబ్బరానికి గల కారణం ఏమిటి?
  3. దీనిని ఎలా నివారించుకోవచ్చు?
  4. కడుపు ఉబ్బరం నుండి ఎలా ఉపశమనం పొందుతారు?
  5. కడుపు ఉబ్బరానికి, జీవనశైలికి సంబంధం ఉందా?

ప్రశ్న 6.
ఆకుపచ్చ రంగులో గాక ఇతర రంగులోని పత్రాలు కూడా కిరణజన్యసంయోగక్రియ జరుపుతాయని ఎలా నిరూపించగలవు? (కృత్యం-2)
జవాబు:
ఉద్దేశం :
ఆకుపచ్చగా లేని పత్రాలలో కిరణజన్య సంయోగక్రియ జరుగుతుందో లేదో నిరూపించుట.

కావలసినవి :
ఎరుపు / గోధుమ రంగు పత్రాలు, డ్రాపర్, పరీక్షనాళిక, అయోడిన్ ద్రావణం, నీరు

ఎలా చేయాలి :
కొన్ని ఎరుపు లేదా గోధుమ రంగు పత్రాలు తీసుకోవాలి. వీటికి కొన్ని చుక్కలు నీటిని కలిపి మెత్తని ముద్దలాగా నలపాలి. ఐదారు చుక్కల రసాన్ని పరీక్ష నాళికలో తీసుకొని రెండు చుక్కల అయోడిన్ద్రావణాన్ని కలపాలి. మీ పరిశీలనలను నమోదు చేయండి.

ఏమి గమనించావు :
ఆకుల రసం నీలి నలుపు రంగులోకి మారుతుంది.

ఏమి నేర్చుకున్నావు :
పత్రాలలో పిండి పదార్థం ఉన్నదని తెలుస్తుంది. తద్వారా ఆకుపచ్చగా లేని పత్రాలలో కూడా కిరణజన్య సంయోగక్రియ జరుగుతుందని నిర్ధారించవచ్చును.

ప్రశ్న 7.
మానవ జీర్ణవ్యవస్థ పటం గీచి, భాగాలను గుర్తించండి.
జవాబు:
AP Board 7th Class Science Solutions Chapter 3 జీవులలో పోషణ 3

ప్రశ్న 8.
అమీబా పోషణ విధానం చూపించు ఫ్లోచార్టు గీయండి.
జవాబు:
AP Board 7th Class Science Solutions Chapter 3 జీవులలో పోషణ 4
AP Board 7th Class Science Solutions Chapter 3 జీవులలో పోషణ 5

ప్రశ్న 9.
భూమి ఉపరితలాన్ని శుభ్రం చేయటంలో పూతికాహారుల పాత్రను అభినందించండి.
జవాబు:

  1. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచటంలో పూతికాహారులు కీలకపాత్ర పోషిస్తాయి.
  2. చనిపోయిన పదార్థాల నుండి పోషకాలను గ్రహించటాన్ని పూతికాహార పోషణ అంటారు.
  3. భూమి మీద జీవం కొనసాగటానికి వాటికి పోషకాలను చక్రీయం చేయటం ద్వారా పూతికాహారులు ఎనలేని సేవ చేస్తున్నాయి.
  4. దీనివలన మృత కళేభరాలు కుళ్ళిపోయి భూమిలో కలిసిపోతాయి.
  5. అందువలన మరణించిన జీవులలోని పోషకాలు భూమిని చేరతాయి.

AP Board 7th Class Science Solutions Chapter 3 జీవులలో పోషణ

ప్రశ్న 10.
జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుకొనుటకు నీవు ఏఏ జాగ్రత్తలు తీసుకొంటావు?
జవాబు:
జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుకొనుటకు నేను తీసుకొను జాగ్రత్తలు :

  1. సరళమైన ఆహారం తీసుకొంటాను.
  2. సరిపడినంత నీటిని త్రాగుతాను.
  3. ప్రతిరోజు వ్యాయామం చేస్తాను.
  4. దంతాలను, నోటిని పరిశుభ్రంగా ఉంచుకొంటాను.
  5. పరిశుభ్రమైన ఆహారం తీసుకొంటాను.
  6. ఆకుకూరలు, కూరగాయలు అధికంగా తీసుకొంటాను.
  7. ఆహారంలో పీచుపదార్థం ఉండేటట్లు చూచుకొంటాను.
  8. సంతులిత ఆహారానికి ప్రాధాన్యత ఇస్తాను.
  9. పాల ఉత్పత్తులను బాగా తీసుకొంటాను.
  10. విచక్షణా రహితంగా ఔషధాలు తీసుకోను.

7th Class Science 3rd Lesson జీవులలో పోషణ InText Questions and Answers

7th Class Science Textbook Page No.73

ప్రశ్న 1.
జంతువులు ఆహారాన్ని ఎలా పొందుతాయి?
జవాబు:
జంతువులు మొక్కలను, ఇతర జంతువులను తినటం ద్వారా ఆహారం పొందుతాయి.

ప్రశ్న 2.
మొక్కలు కూడా జీవులే కదా ! వాటికి అవసరమైన ఆహారం ఏమిటి?
జవాబు:
మొక్కలు వాటికి అవసరమైన ఆహారాన్ని గాలి, నీరు నుండి తయారు చేసుకొంటాయి.

ప్రశ్న 3.
మొక్కలు ఆహారాన్ని ఎలా పొందుతాయి?
జవాబు:
మొక్కలు సూర్యరశ్మి సమక్షంలో CO2 మరియు నీటి ద్వారా పత్రహరితంలో ఆహారం తయారు చేసుకొంటాయి.

ప్రశ్న 4.
పుట్టగొడుగులకు అవసరమైన ఆహారం ఏమిటి?
జవాబు:
పుట్టగొడుగులు చనిపోయిన కళేభరాల నుండి పోషకాలను గ్రహిస్తాయి. దీనిని పూతికాహార పోషణ అంటారు.

7th Class Science Textbook Page No.75

ప్రశ్న 5.
పుట్టగొడుగులో ఎటువంటి పోషణ విధానం కనిపిస్తుంది?
జవాబు:
పుట్టగొడుగులో పూతికాహార పోషణ విధానం ఉంటుంది.

ప్రశ్న 6.
జంతువులలో ఎటువంటి పోషణ విధానం ఉంటుంది?
జవాబు:
జంతువులలో ప్రధానంగా ‘జాంతవ భక్షణ’ విధానం ఉంటుంది.

ప్రశ్న 7.
ఆకుపచ్చని మొక్కలు ఆహారాన్ని ఎలా తయారు చేసుకుంటాయి?
జవాబు:
ఆకుపచ్చని మొక్కలు కిరణజన్య సంయోగక్రియ ద్వారా ఆహారం తయారుచేసుకుంటాయి.

AP Board 7th Class Science Solutions Chapter 3 జీవులలో పోషణ

ప్రశ్న 8.
ఆకుపచ్చని మొక్కలలో ఆహారం తయారీకి అవసరమైన ముడిపదార్థాలు ఏమిటి?
జవాబు:
CO2 నీరు, సూర్యరశ్మి మరియు పత్రహరితం.

ప్రశ్న 9.
మొక్కలు ఆహారం తయారు చేయటానికి గ్రహించే వాయువు ఏమిటి?
జవాబు:
ఆక్సిజన్

ప్రశ్న 10.
మొక్కలు తయారుచేసే ఆహారపదార్థము ఏమిటి?
జవాబు:
పిండిపదార్థము

7th Class Science Textbook Page No. 77

ప్రశ్న 11.
మొక్కలలోని ఏ భాగంలో కిరణజన్య సంయోగక్రియ జరుగుతుంది?
జవాబు:
మొక్కలలోని ఆకుపచ్చ భాగాలైన పత్రాలలో కిరణజన్య సంయోగక్రియ జరుగుతుంది.

ప్రశ్న 12.
కిరణజన్య సంయోగక్రియకు కావలసిన కారకాలు పత్రంలోనికి ఎలా చేరతాయి?
జవాబు:
కిరణజన్య సంయోగక్రియకు కావలసిన కారకాలైన CO2 పత్రరంధ్రాల ద్వారా నీరు వేర్లనుండి రవాణా కణజాలం ద్వారా ఆకును చేరతాయి.

ప్రశ్న 13.
ఎరుపు, గోధుమ వర్గాలలో ఉండే ఆకులలో కిరణజన్య సంయోగక్రియ జరుగుతుందా?
జవాబు:
ఆకు ఎరుపు లేదా గోధుమ వర్ణాలలో ఉన్నప్పటికి కిరణజన్య సంయోగక్రియ జరుగుతుంది. వీటిలో ఇతర వర్ణద్రవ్యాలు ఆకుపచ్చ రంగును కప్పివేస్తాయి.

7th Class Science Textbook Page No. 79

ప్రశ్న 14.
కిరణజన్య సంయోగక్రియలో సూర్యకాంతి ఆవశ్యకత ఏమిటి?
జవాబు:

  1. కిరణజన్య సంయోగక్రియకు సూర్యరశ్మి ముఖ్యమైన శక్తి వనరు.
  2. మొక్కలు సౌరశక్తిని గ్రహించి ఆహారం తయారుచేసుకొంటాయి.
  3. జీవులన్నింటికి శక్తి మూలం సూర్యుడు.
  4. ఈ సూర్యకాంతి వలనే అన్ని జీవులకు ఆహారం అందుతుంది.

7th Class Science Textbook Page No.95

ప్రశ్న 15.
మన శరీరంలో జీర్ణక్రియ ఎక్కడ మొదలవుతుంది?
జవాబు:
మన శరీరంలో జీర్ణక్రియ నోటిలో మొదలవుతుంది.

ప్రశ్న 16.
మన శరీరంలో జీర్ణక్రియ ఎక్కడ పూర్తవుతుంది?
జవాబు:
మన శరీరంలో జీర్ణక్రియ పెద్ద ప్రేగుతో పూర్తి అవుతుంది.

AP Board 7th Class Science Solutions Chapter 3 జీవులలో పోషణ

ప్రశ్న 17.
జీర్ణవ్యవస్థలో జీర్ణమైన ఆహారం ఎక్కడ శోషించబడుతుంది?
జవాబు:
జీర్ణ వ్యవస్థలో జీర్ణమైన ఆహారం చిన్న ప్రేగులో శోషించబడుతుంది.

ప్రశ్న 18.
శరీరం నుండి జీర్ణం కాని ఆహారం ఏ భాగం ద్వారా విసర్జించబడుతుంది?
జవాబు:
జీర్ణంకాని ఆహారం పాయువు ద్వారా విసర్జించబడుతుంది.

ఆలోచించండి – ప్రతిస్పందించండి

7th Class Science Textbook Page No.77

ప్రశ్న 1.
ఆకులలోని పిండిపదార్థాన్ని పరీక్షించడానికి అయోడిన్ ద్రావణాన్ని పత్రాలపైన నేరుగా వేయడం వలన ప్రయోగ ఫలితాన్ని రాబట్టుటకు కొన్ని సమస్యలు వున్నాయి. వీటి గురించి ఆలోచించి మీ ఉపాధ్యాయునితో చర్చించండి.
జవాబు:

7th Class Science Textbook Page No. 93

ప్రశ్న 2.
దంతాల ఆరోగ్యానికి ఏ అలవాటును మనం అలవరుచుకోవాలి? ఎందుకు?
జవాబు:
దంతాల ఆరోగ్యానికి మనం అలవర్చుకోవలసిన అలవాట్లు :

  1. ప్రతిరోజు బ్రష్ చేయాలి.
  2. అన్నం తిన్న వెంటనే నీటితో పుక్కిలించాలి.
  3. తీపి పదార్థాల వినియోగం తగ్గించాలి.
  4. ఉదయం, సాయంత్రం రెండు పూటలా బ్రష్ చేయాలి.
  5. కాల్షియం ఎక్కువగా ఉండే ఆహారం తినాలి.
  6. పుచ్చు దంతాలను నిర్లక్ష్యం చేయరాదు.
  7. బలమైన పనులు దంతాలతో చేయరాదు. విరిగే ప్రమాదం ఉంది.
  8. 6 నెలలకు ఒకసారి దంత పరీక్ష చేయించాలి.

ఈ అలవాట్ల వలన దంతాలు ఎక్కువ కాలం ఆరోగ్యంగా ఉంటాయి. దంతాలపై పేరుకొన్న ఆహారపదార్థాలు తొలగించబడి దంతాలు పుచ్చిపోకుండా ఉంటాయి.

ప్రాజెక్ట్ పనులు

7th Class Science Textbook Page No. 101

ప్రశ్న 1.
అందమైన ఆకులను తయారు చేద్దాం. వెడల్పైన ఆకులు గల ఏదైనా కుండీలో పెరిగే మొక్కను తీసుకోండి. మీకు నచ్చిన డిజైన్‌ను కార్డుబోర్డు మీద గీసి కత్తిరించుకోండి. దానికి ఆకును బిగించండి. వారం తరువాత తీసి చూడండి. మీరు కోరుకున్న డిజైన్ ఆకు మీద కనిపిస్తుంది. మీరు అనుసరించిన విధానాన్ని నోటు పుస్తకంలో రాయండి.
జవాబు:

  1. నా పేరు శ్రీను. నేను ‘S’ ఆకారాన్ని అట్టముక్కలో కత్తిరించుకొన్నాను.
  2. ఇంటి ఆవరణలో కుండీలో పెరుగుతున్న ఆకుకు అట్టముక్కను క్లిప్ సహాయంతో బిగించాను.
  3. ఒక వారం రోజులు గడిచిన పిదప అట్టముక్కను తొలగించాను.
  4. ఆశ్చర్యంగా ఆకు మీద ‘S’ అక్షరం ముదురు రంగులో స్పష్టంగా కనిపించింది.

AP Board 7th Class Science Solutions Chapter 3 జీవులలో పోషణ

ప్రశ్న 2.
మీ పరిసరాలలో పెరిగే వివిధ రకాల మొక్కలను గమనించండి. వాటిని స్వయం పోషకాలు, పూతికాహారులు, పరాన్న జీవులు, సహజీవనం జరిపేవి మరియు కీటకాహార మొక్కలుగా వర్గీకరించండి. మీ ఉపాధ్యాయుని సహకారంతో వాటిని మీ పాఠశాల జీవశాస్త్ర ప్రయోగశాలలో స్పెసిమెన్లుగా, భద్రపరచండి.
జవాబు:
మా పరిసరాలలో మొక్కలను పరిశీలించి వాటిని క్రింది విధంగా వర్గీకరించాను.

  1. స్వయం పోషకాలు : మర్రి, రావి, చింత, నేరేడు
  2. పూతికాహారులు : పుట్టగొడుగులు, చెట్ల బూజులు
  3. పరాన్నజీవులు : కస్కుటా
  4. కీటకాహార మొక్కలు : మా పరిసరాలలో ఏమీలేవు
  5. సహజీవనం జరిపేవి : కంది, మినప, పెసర, శనగ

కృత్యాలు

కృత్యం – 1

ప్రశ్న 1.
మీ సొంత పరిశీలనల ఆధారంగా పెద్దవారి నుండి సేకరించిన సమాచారం ఆధారంగా క్రింది పట్టికను పూరించండి.
AP Board 7th Class Science Solutions Chapter 3 జీవులలో పోషణ 6
జవాబు:

జీవిపేరు స్వయంగా ఆహారాన్ని తయారు చేసుకొంటాయి / ఇతర జీవులపై ఆధారపడతాయి స్వయం పోషణ/ పరపోషణ
1. మామిడిచెట్టు స్వయంగా ఆహారాన్ని తయారుచేసుకుంటాయి. స్వయంపోషణ
2. పిల్లి ఇతర జీవులపై ఆధారపడతాయి. పరపోషణ
3. గులాబి మొక్క స్వయంగా ఆహారాన్ని తయారుచేసుకుంటాయి. స్వయం పోషణ
4. పుట్టగొడుగులు ఇతర జీవులపై ఆధారపడతాయి. పరపోషణ
5. జలగ ఇతర జీవులపై ఆధారపడతాయి. పరపోషణ
6. మేక ఇతర జీవులపై ఆధారపడతాయి. పరపోషణ
7. మానవుడు ఇతర జీవులపై ఆధారపడతాయి. పరపోషణ

కృత్యం – 3

ప్రశ్న 2.
కిరణజన్య సంయోగక్రియకు కాంతి అవసరమని ఎలా నిరూపిస్తావు?
జవాబు:
ఉద్దేశం : కిరణజన్య సంయోగక్రియకు కాంతి అవసరమని నిరూపించుట.

కావలసినవి :
కుండీలో పెరుగుచున్న మొక్కలు రెండు, డ్రాపర్, పరీక్షనాళిక, అయోడిన్ ద్రావణం, నీరు

ఎలా చేయాలి :
ఒకే రకానికి చెందిన కుండీలో పెరుగుతున్న రెండు మొక్కలను తీసుకోవాలి. ఒక మొక్కను చీకటిలో (లేక నలుపు రంగు పెట్టెలో) సుమారు 72 గంటలు వుంచాలి. రెండవ దానిని సూర్యరశ్మిలో వుంచాలి. రెండు మొక్కల యొక్క ఆకుల రసాన్ని వేరు వేరుగా సేకరించి కృత్యం 2లో చిత్రంలో చూపిన విధంగా అయోడిన్ పరీక్ష నిర్వహించాలి. మీ పరిశీలనలను నమోదు చేయండి.

ఏమి గమనించావు :
మొదటి మొక్క యొక్క ఆకుల రసంలో రంగు మార్పు కనిపించలేదు. రెండవ మొక్క యొక్క ఆకుల రసం నీలి నలుపురంగులోకి మారింది.

ఏమి నేర్చుకున్నావు :
సూర్యరశ్మిలో వుంచిన మొక్క ఆకులలో పిండి పదార్థం కల్గి వుండటాన్ని బట్టి కిరణజన్య సంయోగక్రియ జరిగినట్లు తెలుస్తుంది. చీకటిలో వుంచిన మొక్క ఆకులలో పిండి పదార్థం తయారు కాలేదు. దీనిని బట్టి కిరణజన్య సంయోగక్రియకు సూర్యరశ్మి అవసరమని తెలుస్తుంది.

AP Board 7th Class Science Solutions Chapter 3 జీవులలో పోషణ

కృత్యం – 4

ప్రశ్న 3.
రొట్టెలో పూతికాహార పోషణను పరిశీలించే విధానం తెలపండి.
జవాబు:
ఉద్దేశం : రొట్టె బూజులో పూతికాహార పోషణను పరిశీలించుట.

కావలసినవి : రొట్టె ముక్క నీరు, జాడీ మరియు భూతద్దం

ఎలా చేయాలి :
రొట్టె ముక్కను జాడీలో తీసుకోవాలి. కొద్దిగా నీటిని రొట్టె ముక్కపై చల్లి జాడీకి మూత పెట్టాలి. కొన్ని రోజుల తరువాత మూతను తీసి గమనించండి. (ఈ కృత్యం చేసేటప్పుడు (ముఖకవచం) చేతి తొడుగులు ధరించండి)

ఏమి గమనించావు :
రొట్టె ముక్క పరిమాణం తగ్గడమే కాకుండా దానిపై దారపు పోగులు వంటి నిర్మాణాలు విస్తరించి వుండటం గమనిస్తావు.

ఏమి నేర్చుకున్నావు :
ఈ దారపు పోగుల వంటి నిర్మాణాలు ఒక విధమైన మొక్కలు. వీటిని శిలీంధ్రాలు అంటారు. వీటిలో పత్రహరితం లేకపోవడం వలన చనిపోయిన, కుళ్ళిన పదార్థాల నుండి ఆహారాన్ని సేకరిస్తాయి.

కృత్యం – 5

ప్రశ్న 4.
మానవునిలోని దంతాల రకాలను, వాటి పనిని పట్టిక రూపంలో రాయండి.
ముందుగా చేతులను శుభ్రం చేసుకోవాలి. అద్దంలో మీ దంతాలను లెక్కించండి. మీ యొక్క చూపుడు వ్రేలితో దంతాలను తాకండి. ఎన్ని రకాల దంతాలను కనుగొన్నారు ? చిన్న ఆపిల్ ముక్కను గానీ, చెరుకు ముక్క రొట్టె ముక్కను గాని తినండి. ఏ దంతాలను కొరకడానికి, ముక్కలు చేయడానికి, ఏదంతాలను చీల్చడానికి వాడతాం?
AP Board 7th Class Science Solutions Chapter 3 జీవులలో పోషణ 7
జవాబు:
AP Board 7th Class Science Solutions Chapter 3 జీవులలో పోషణ 8

కృత్యం – 6

ప్రశ్న 5.
దంతాలు క్షయం చెందే ప్రక్రియను తెలుసుకొనుటకు నీవు ఏ ప్రయోగం నిర్వహిస్తావు?
జవాబు:
ఉద్దేశం : దంతం క్షయం చెందే ప్రక్రియను తెలుసుకొనుట.

కావలసినవి : చలువరాతి ముక్కలు, సజల హైడ్రోక్లోరికామ్లం మరియు పరీక్షనాళిక

ఎలా చేయాలి :
కొన్ని చలువరాతి ముక్కలను పరీక్ష నాళికలో తీసుకొని సజల హైడ్రోక్లోరికామ్లంను కలపాలి. కొద్దిసేపటి తరువాత గమనించండి.

ఏమి గమనించావు :
ఆమ్లం చలువరాతితో చర్య జరిపి దానిని కరిగేటట్లు చేస్తుంది.

ఏమి నేర్చుకున్నావు :
ఆమ్లంతో చర్య జరిగిన చలువరాయి కరిగిపోయినట్లే, కాల్షియం సమ్మేళనమైన ఎనామిల్ పొర ఆమ్లంతో చర్య జరిపి నశిస్తుంది.