SCERT AP 7th Class Science Study Material Pdf 4th Lesson శ్వాసక్రియ – ప్రసరణ Textbook Questions and Answers.
AP State Syllabus 7th Class Science 4th Lesson Questions and Answers శ్వాసక్రియ – ప్రసరణ
7th Class Science 4th Lesson శ్వాసక్రియ – ప్రసరణ Textbook Questions and Answers
Improve Your Learning (అభ్యసనాన్ని మెరుగుపరచుకుందాం)
I. ఖాళీలను పూరింపుము.
1. శ్వాసక్రియ అను ప్రక్రియ జీవన ……………… కు నిత్యం అవసరం. (మనుగడ)
2. ఉచ్ఛ్వా సించిన గాలిలో ……………. ఆక్సిజన్ మరియు …………. కార్బన్ డై ఆక్సెడ్ ఉంటాయి. (21%, 0.004)
3. ……………… తమ ఊపిరితిత్తులు మరియు చర్మముతో శ్వాసించగలవు. (కప్పలు)
4. ఇటీవలి వ్యాపించిన శ్వాస సంబంధ వ్యాధి (రుగ్మత) ……………. (కోవిడ్-19)
II. సరైన జవాబు సూచించు అక్షరమును బ్రాకెట్లో రాయండి.
1. హిమోగ్లోబిన్ వర్ణము
A) వర్ణరహితం
B) నీలి
C) ఎరుపు
D) ఆకుపచ్చ
జవాబు:
C) ఎరుపు
2. సున్నపు తేట దీనితో చర్య జరిపితే పాలవలే తెల్లగా మారును.
A) ఆక్సిజన్
B) నైట్రోజన్
C) కార్బన్
D) కార్బన్ డై ఆక్సైడ్
జవాబు:
D) కార్బన్ డై ఆక్సైడ్
3. రెండుగా చీలే శ్వాసక్రియ వ్యవస్థలోని భాగము
A) నాసికా కుహరము
B) వాయు నాళికలు
C) ఊపిరితిత్తులు
D) వాయునాళము
జవాబు:
D) వాయునాళము
4. మానవులు సామాన్యంగా నిమిషానికి ఎన్నిసార్లు శ్వాసిస్తారు?
A) 14 నుండి 20 సార్లు
B) 20 నుండి 30 సార్లు
C) 72 సార్లు
D) 80 సార్లు వరకు
జవాబు:
A) 14 నుండి 20 సార్లు
III. జతపరచండి.
గ్రూపు – A | గ్రూపు – B |
A) మొప్పలు | 1) వానపాము |
B) ట్రాకియా | 2) తిమింగలం |
C) ఊపిరితిత్తులు | 3) కాండం |
D) చర్మము | 4) చేప |
E) పత్ర రంధ్రాలు | 5) బొద్దింక |
F) లెంటి కణాలు | 6) ఆకు |
7) పుష్పము |
జవాబు:
గ్రూపు – A | గ్రూపు – B |
A) మొప్పలు | 4) చేప |
B) ట్రాకియా | 5) బొద్దింక |
C) ఊపిరితిత్తులు | 2) తిమింగలం |
D) చర్మము | 1) వానపాము |
E) పత్ర రంధ్రాలు | 6) ఆకు |
F) లెంటి కణాలు | 3) కాండం |
IV. ఈ క్రింది ప్రశ్నలకు జవాబులు రాయండి.
ప్రశ్న 1.
శ్వాసక్రియ అనగానేమి?
జవాబు:
శోషించబడిన ఆక్సిజన్, గ్లూకోజ్ రూపంలో ఉన్న జీర్ణమైన ఆహార పదార్థాలతో చర్య జరిపి దానిని కార్బన్ డై ఆక్సెడ్ మరియు నీరుగా విచ్ఛిన్నం చేసి శక్తిని విడుదల చేస్తుంది. ఈ ప్రక్రియను శ్వాసక్రియ అంటారు.
గ్లూకోజ్ + ఆక్సిజన్ — కార్బన్ డై ఆక్సైడ్ + నీరు + శక్తి
ప్రశ్న 2.
శ్వాసక్రియలోని రెండు రకాల పేర్లు వ్రాయుము. వాటి యొక్క పద సమీకరణము వ్రాయండి.
జవాబు:
శ్వాసక్రియలో ఆక్సిజన్ ప్రమేయం బట్టి రెండు రకాలు. అవి
1) వాయు సహిత శ్వాసక్రియ :
ఆక్సిజన్ సమక్షంలో జరిగే శ్వాసక్రియను వాయుసహిత శ్వాసక్రియ అంటారు.
గ్లూకోజ్ + ఆక్సిజన్ → కార్బన్ డై ఆక్సైడ్ + నీరు + శక్తి
ఉదా : మానవుడు
2) అవాయు శ్వాసక్రియ :
ఆక్సిజన్ లేకుండా జరిగే శ్వాసక్రియను అవాయు శ్వాసక్రియ అంటారు.
గ్లూకోజ్ → ఆల్కహాల్ + కార్బన్ డై ఆక్సైడ్ + నీరు + శక్తి
ఉదా : బాక్టీరియా
ప్రశ్న 3.
ఉచ్ఛ్వాస మరియు నిశ్వాస వాయువులలోని అంశీభూతాలు తెలియచేయండి.
జవాబు:
ప్రశ్న 4.
మానవులలో శ్వాసక్రియ ప్రక్రియని ఫ్లోచార్టు సహాయంతో వివరించండి.
జవాబు:
వాయుమార్గము :
శ్వాసవ్యవస్థలోని భాగాలు మరియు వాటి ద్వారా ప్రసరించే వాయు మార్గాన్ని గురించి తెలుసుకోవడానికి ఈ క్రింది ఫ్లోచార్టు పరిశీలించండి.
ప్రశ్న 5.
జంతువులలో ఉండే వివిధ శ్వాస అవయవాలు మరియు వాటి పని తీరును తెలియజేయండి.
జవాబు:
జంతువులలో వివిధ రకాల శ్వాస అవయవాలు కలవు. అవి
ఎ) వాయునాళాలు :
వాయునాళాల ద్వారా జరిగే శ్వాసక్రియను ట్రాకియల్ శ్వాసక్రియ అని అంటారు. ఇవి కీటకాలలో ఉంటాయి. ఈ వ్యవస్థలో శరీరానికి ఇరువైపులా చిన్న స్పైరకిల్ అనే రంధ్రాలు ఉంటాయి. ఇవి వలయాకారంగా శరీరంలో అల్లుకుపోయిన వాయునాళాలలోకి తెరుచుకొని శరీరంలోని అన్ని భాగాలకు గాలిని చేర్చి వాయుమార్పిడి ప్రక్రియ పూర్తిచేస్తాయి.
ఉదా :
బొద్దింక, మిడత, తేనెటీగ మొదలగునవి.
బి) చర్మము :
చర్మం ద్వారా జరిగే శ్వాసక్రియను క్యుటేనియస్ శ్వాసక్రియ అని అంటారు. కొన్ని జంతువులలో చర్మము తేమగా మరియు జిగటగా శ్లేష్మంతో కూడి ఉండి శ్వాసక్రియకు ఉపయోగపడుతుంది.
ఉదా : వానపాము, కప్ప మొదలైనవి. కప్పలో శ్వాసించడానికి ఊపిరితిత్తు లుంటాయి. వీటిని కప్ప నేలపై శ్వాసించడానికి ఉపయోగిస్తాయి. నీటిలో ఉన్నప్పుడు కప్పలు తమ మృదువైన, జిగురు చర్మంతో శ్వాసిస్తాయి.
సి) మొప్పలు :
మొప్పల ద్వారా జరిగే శ్వాసక్రియను చర్మ శ్వాసక్రియ అని అంటారు. ఇవి చేపలలోని శ్వాసవయవాలు. మొప్పలు తలకు ఇరువైపులా ఉన్న దొప్పలలోపల ఉంటాయి. మొప్పలలో రక్తం అధికంగా ఉండడం వలన ఆక్సిజన్ మరియు కార్బన్ డై ఆక్సైడ్ మార్పిడికి ఉపయోగపడుతుంది. చేపలు తమ నోటి ద్వారా నీటిని తీసుకొని దానిని మొప్పల మీదుగా పంపినప్పుడు నీటిలో కరిగి ఉండే ఆక్సిజనను శోషిస్తాయి. ఈ కారణం చేతనే చేపలు నీటిలో శ్వాసించగలవు కానీ ఊపిరితిత్తులు కలిగి ఉండే మానవులు గానీ, ఇతర జంతువులు గానీ నీటిలో శ్వాసించలేవు.
డి) ఊపిరితిత్తులు :
ఊపిరితిత్తుల ద్వారా జరిగే శ్వాసప్రక్రియను పుపుస శ్వాసక్రియ అని అంటారు. భూమిపై ఉండే అన్ని జీవులలో మరియు నీటిలో ఉండే కొన్ని జీవులలో ఊపిరితిత్తులు శ్వాసించడానికి ఉపయోగిస్తాయి. ఇవి గాలిలోని ఆక్సీజన్ తీసుకోవడానికి ఉపయోగపడతాయి.
ఉదా : ఆవు, కుక్క తిమింగలం, మానవులు మొదలగునవి.
ప్రశ్న 6.
ఉదరవితానము మరియు ఉరః పంజరం సంకోచ వ్యాకోచం చెందకపోతే జరిగే పరిణామాలేమిటి?
జవాబు:
- మానవుల శ్వాస కదలికలలో ఉదరవితానము మరియు ఉరఃపంజరం కీలకపాత్ర వహిస్తాయి.
- ఉదర వితానం పురుషులలో శక్తివంతంగా ఉండి శ్వాస కదలికలకు తోడ్పడుతుంది.
- స్త్రీలలో ఉరఃపంజరం శ్వాస కదలికలకు తోడ్పడుతుంది.
- ఇవి సంకోచ వ్యాకోచాలు చెందకపోతే శ్వాస కదలికలు సాధ్యం కాదు.
- దాని వలన ఉచ్ఛ్వాస, నిశ్వాస కదలికలు జరగవు.
- శ్వాసక్రియ రేటు తగ్గి జీవి మరణానికి దారితీయవచ్చు.
ప్రశ్న 7.
మొలకెత్తే విత్తనాలు శ్వాసించినప్పుడు కార్బన్ డై ఆక్సైడ్ విడుదల అవుతుందని మీరు ప్రయోగశాలలో నిర్వహించిన ప్రయోగశాల కృత్యం యొక్క రిపోర్టు రాయండి. (కృత్యం -4)
జవాబు:
ఉద్దేశం :
మొలకెత్తే విత్తనాలు శ్వాసక్రియ జరిపినపుడు కార్బన్ డై ఆక్సైడ్ విడుదల అవుతుందని నిరూపించుట.
పరికరాలు :
వెడల్పాటి మూతి గల సీసా, గాజు బీకరు, సున్నపునీరు మొలకెత్తుతున్న గింజలు.
విధానం :
- ఒక వెడల్పాటి మూతిగల సీసా తీసుకొని అందులో ఒక గుప్పెడు మొలకెత్తిన విత్తనాలు ఉంచండి.
- ఒక చిన్న పాత్రలో అప్పుడే తయారుచేసిన సున్నపు తేటను పోసి సీసాలో పక్కగా ఉంచండి.
- సీసాకు మూతను బిగించి 2 రోజులపాటు కదపకుండా ఉంచి పరిశీలించండి.
పరిశీలన :
బీకరులోని సున్నపునీరు తెల్లగా పాలవలె మారింది.
వివరణ : సున్నపు తేటను పాలవలె మార్చు వాయువు CO2. ఇది మొలకెత్తే విత్తనాలు శ్వాసక్రియ జరపటం వలన విడుదల అయ్యింది.
నిరూపణ :
మొలకెత్తే విత్తనాలు శ్వాసించినపుడు CO2 విడుదల అగును.
ప్రశ్న 8.
కింది అంశాల గురించి అవగాహన నినాదాలు రాయండి.
ఎ) పొగత్రాగడం వల్ల కలిగే దుష్ఫలితాలు
బి) విడ్-19 నివారణ
జవాబు:
ఎ) పొగత్రాగడం వలన కలిగే దుష్ఫలితాలు :
- పొగాకు నమలటం – ప్రాణాంతకం
- పొగాకు మత్తు – జీవితం చిత్తు
- పొగాకును వదులు – ఆరోగ్యం వైపు కదులు
- సిగరెట్, గుట్కా బీడి – జీవితాన్ని చేస్తాయి ఖాళీ
- పొగాకు మాత్రమే ఖరీదైనది – నోటి క్యాన్సర్ చౌకైనది.
బి) కోవిడ్ – 19 నివారణ :
- షేక్ హ్యాండ్ వద్దు – నమస్కారం ముద్దు.
- మాస్క్ ధరించు – కరోనాను ఎదిరించు.
- శానిటైజర్ రాయి – కరోనాను మూసేయి.
- నీకు నాకు దూరం – కరోనా మనకు దూరం.
- ఇంట్లోనే ఉందాం – కరోనాను చంపుదాం.
- కరోనా నీ ఇంటికే రాదు – నీవు ఇంటి నుండి బయటకు రాకు.
ప్రశ్న 9.
మీరు తయారు చేసిన స్టెతస్కోపును ఉపయోగించి మీ తరగతిలోని ఐదుగురు మిత్రుల గుండె కొట్టుకునే రేటును . కనుగొని కింది పట్టికలో నమోదు చేయండి.
జవాబు:
7th Class Science 4th Lesson శ్వాసక్రియ – ప్రసరణ InText Questions and Answers
7th Class Science Textbook Page No. 105
ప్రశ్న 1.
శ్వాసించటం అనగానేమి?
జవాబు:
ఉచ్ఛ్వాస, నిశ్వాసాల ప్రక్రియను శ్వాసించడం అంటారు.
ప్రశ్న 2.
గాలి ఊపిరితిత్తులకు ఎలా చేరుతుంది?
జవాబు:
ముక్కు ద్వారా పీల్చిన గాలి వాయునాళం ద్వారా ఊపిరితిత్తులకు చేరుతుంది.
ప్రశ్న 3.
శ్వాసవ్యవస్థలోని భాగస్వామ్య అవయవాలు ఏవి?
జవాబు:
మానవ శ్వాసక్రియ వ్యవస్థలో అనేక భాగాలతో ఏర్పడినదే వాయు మార్గము. దీనిలో భాగాలు
- నాసికా రంధ్రాలు
- నాసికా కుహరములు
- గ్రసని
- వాయు నాళము
- శ్వాస నాళము
- ఊపిరితిత్తులు
7th Class Science Textbook Page No. 107
ప్రశ్న 4.
ఊపిరితిత్తుల వ్యాకోచ, సంకోచాలు ఎలా సాధ్యమవుతాయి?
జవాబు:
ఒక పెద్ద, పలుచని కండరయుక్త ఉదరవితానము అనే భాగము ఉరఃపంజరపు దిగువ భాగమునకు అతకబడి ఛాతీ భాగాన్ని క్రింది నుండి మూసివేస్తుంది. శ్వాసించే ప్రక్రియలో ఉదరవితానము (పురుషులలో) మరియు ఉరఃపంజరం (స్త్రీలలో) ప్రధాన పాత్రను పోషిస్తాయి.
7th Class Science Textbook Page No. 111
ప్రశ్న 5.
ఉచ్చ్వాస నిశ్వాసాల మధ్య ఆక్సిజన్ పరిమాణంలో తేడాకు కారణమేమిటి?
జవాబు:
- మనం పీల్చే గాలిలో ఆక్సిజన్ అధికంగా ఉంటుంది.
- ఇది ఉచ్ఛ్వాస దశలో వాయునాళం ద్వారా ఊపిరితిత్తులకు చేరును.
- ఊపిరితిత్తులలోని రక్తంలోనికి ఆక్సిజన్ చేరుతుంది.
- అందువలన విడిచే గాలిలో ఆక్సిజన్ పరిమాణం తగ్గుతుంది.
ప్రశ్న 6.
నిశ్వాసంలో ఏ వాయువు పరిమాణం అధికంగా ఉంటుంది. ఎందుకు?
జవాబు:
- పీల్చే గాలితో పోల్చినపుడు, విడిచే గాలిలో CO2 పరిమాణం అధికంగా ఉంటుంది.
- శరీరంలో శ్వాసక్రియ వలన ఏర్పడిన CO2 రక్తం ద్వారా ప్రయాణించి ఊపిరితిత్తులను చేరుతుంది.
- ఊపిరితిత్తుల నుండి రక్తంలోని CO2 గాలిలోనికి చేరి నిశ్వాస క్రియలో బయటకు వస్తుంది.
- అందువలన విడిచే గాలిలో CO2 పరిమాణం అధికం.
ప్రశ్న 7.
ఊపిరితిత్తులలో గాలికి ఏమి జరుగుతుంది?
జవాబు:
ఊపిరితిత్తులలోని రక్తనాళాలు ఉచ్చ్వాసం ద్వారా తీసుకున్న గాలిలోని ఆక్సిజన్‌ను శోషించి (కలుపుకొని), శరీరంలోని అన్ని భాగాలకు (కణాలకు) రవాణా చేస్తాయి. అలాగే శరీరభాగాల నుండి రక్తనాళాలు (ఉపిరితిత్తులు, సేకరించి ఊపిరితిత్తులలోనికి తెచ్చిన రక్తంలోని కార్బన్ డై ఆక్సైడ్ నిశ్వాసం ద్వారా శరీరం బయటకు పంపబడుతుంది.
7th Class Science Textbook Page No. 113
ప్రశ్న 8.
అన్ని జంతువులలో ఒకేరకమైన శ్వాస అవయవాలు ఉంటాయా?
జవాబు:
లేదు. వేరు వేరు జీవులలో శ్వాస అవయవాలు వేరు వేరుగా ఉంటాయి.
ప్రశ్న 9.
తిమింగలంలో ఉండే శ్వాస అవయవాలు ఏమిటి?
జవాబు:
తిమింగలంలో ఊపిరితిత్తులు శ్వాస అవయవాలు.
ప్రశ్న 10.
కప్ప చర్మం తేమగా, జిగటగా ఉంటుంది. ఎందుకు?
జవాబు:
కప్ప చర్మం ద్వారా శ్వాసక్రియ జరుపుకుంటుంది. అందువలన చర్మం తేమగా, జిగటగా ఉంటుంది.
ప్రశ్న 11.
పదార్థాల దుర్వినియోగం మీద ఈ క్రింది చెలిను పూరించండి.
జవాబు:
- ఒకసారి సిగరెట్ కాల్చటానికి ప్రయత్నించటం వలన నష్టములేదు. ఎందుకంటే తరువాత దానిని ఆపివేయటం జరుగుతుంది. (తప్పు)
- రోజుకు ఒక సిగరెట్ కాల్చటం ఏమాత్రం హానికరం కాదు. (తప్పు)
- ఆపివేయాలన్న దృఢసంకల్పం మాత్రమే పొగత్రాగే అలవాటును మాన్పగలదు. (ఒప్పు)
- పొగత్రాగటం వలన ఆహ్లాదం, విశ్రాంతి కల్గుతాయి. (తప్పు)
- పొగత్రాగటం ఆరోగ్యానికి హానికరం కాదు. . (తప్పు)
ప్రశ్న 12.
ధూమపానం చేసేవారు పీల్చిన పొగ ఎక్కడకు వెళుతుంది?
జవాబు:
- ధూమపానం చేసేవారు పీల్చే పొగ ఊపిరితిత్తులను చేరుతుంది.
- దాని వలన ఊపిరితిత్తులు దెబ్బతిని వాటి సామర్థ్యం తగ్గుతుంది.
- దీని వలన లంగ్ క్యాన్సర్, క్షయ, ఇతర శ్వాస సంబంధ వ్యాధులు కలగవచ్చు.
7th Class Science Textbook Page No. 115
ప్రశ్న 13.
మొక్కలలోని శ్వాస అవయవాలు ఏవి?
జవాబు:
పత్రరంధ్రాలు, లెంటి కణాలు మొక్కలలో శ్వాస అవయవాలు.
ప్రశ్న 14.
మొక్కలు ఎలా శ్వాసిస్తాయి?
జవాబు:
మొక్కలు కూడా సజీవులే. కావున, అవి కూడా జీవించి ఉండడం కొరకు శ్వాసిస్తాయి. మొక్కలు ఇతర జీవులవలే ఆక్సిజన్ తీసుకొని కార్బన్ డై ఆక్సైడ్ విడుదల చేస్తాయి. శ్వాసించే ప్రక్రియ మొక్క ఆకులలో ఉండే చిన్న రంధ్రాలైన పత్రరంధ్రాలు మరియు కాండముపై ఉండే లెంటికణాల ద్వారా జరుగుతుంది. వేర్లకు కూడా శక్తి ఉత్పత్తి కొరకు ఆక్సిజన్ అవసరం. కావున వేర్లు నేలలోని మట్టి పెళ్ళల మధ్య ఉన్న ఖాళీలలో లభించే గాలిని మూలకేశాల సహాయంతో శ్వాసించి ఆక్సిజనను గ్రహించి శోషిస్తాయి.
7th Class Science Textbook Page No. 117
ప్రశ్న 15.
శరీర అన్ని భాగాలకు రక్తం ఎలా చేరుతుంది?
జవాబు:
గుండె రక్తనాళాల ద్వారా శరీర అన్ని భాగాలకు రక్తాన్ని సరఫరా చేస్తుంది.
ప్రశ్న 16.
రక్తంలోనికి శోషించబడిన ఆక్సిజన్ మరియు గ్లూకోజ్ శరీరంలోని అన్ని భాగాలకు ఎలా చేరుతుంది?
జవాబు:
గుండె కలిగించే వత్తిడి వలన రక్తం అన్ని శరీర భాగాలకు ఆక్సిజన్ మరియు గ్లూకోజ్ ను అందిస్తుంది.
7th Class Science Textbook Page No. 119
ప్రశ్న 17.
రక్తంలో ఏముంటాయి?
జవాబు:
రక్తంలో రక్త కణాలు మరియు ప్లాస్మా అనే ద్రవం ఉంటుంది.
ప్రశ్న 18.
రక్తం ఎర్రగా ఎందుకు ఉంటుంది?
జవాబు:
రక్తంలో ‘హిమోగ్లోబిన్’ అనే వర్ణకం వలన ఎర్రగా ఉంటుంది.
7th Class Science Textbook Page No. 121
ప్రశ్న 19.
అన్ని జీవులలో రక్తం మానవుల రక్తం వలె ఎర్రగా ఉంటుందా?
జవాబు:
అత్యధిక జంతువులలో రక్తము హీమోగ్లోబిన్ అనే వర్ణకము కారణంగా ఎర్ర రంగులో ఉంటుంది. వానపాములో రక్తము ఎర్రగా ఉండటానికి కారణం దాని రక్తంలో హీమోగ్లోబిన్ కరిగి ఉంటుంది. కీటకాలలో రక్తము రంగు లేకుండా ఉంటుంది. కారణం వర్ణకము లేకపోవడం.
ఉదా : బొద్దింక. రొయ్యలలో, నత్తలలో మరియు పీతలలో రక్తము నీలి వర్ణములో ఉంటుంది.
7th Class Science Textbook Page No. 123
ప్రశ్న 20.
ఇటీవల కాలంలో ప్రపంచవ్యాప్తంగా ప్రభావం చూపిన వ్యాధి ఏది?
జవాబు:
కోవిడ్ – 19
ప్రశ్న 21.
ప్రపంచ మహమ్మారి అంటే ఏమిటి?
జవాబు:
ప్రపంచ వ్యాప్తంగా ఒకేసారి అత్యధిక జనాభాకు సంక్రమించే వ్యాధిని ‘ప్రపంచ మహమ్మారి’ అంటారు.
7th Class Science Textbook Page No. 127
ప్రశ్న 22.
ప్రథమ చికిత్స అనగానేమి?
జవాబు:
ప్రమాదం జరిగినపుడు వైద్యుని వద్దకు తీసుకెళ్ళే ముందు మనం రోగికి అందించే తోడ్పాటునే ప్రథమచికిత్స అంటాము.
ప్రశ్న 23.
నీటిలో మునిగిన వారికి చేయవలసిన ప్రథమ చికిత్స ఏమిటి?
జవాబు:
ఎవరైనా నీట మునిగినప్పుడు మనం అతనిని బయటకు తీసుకువచ్చి వెల్లకిలా పడుకోబెట్టి ముఖమును ఒక ప్రక్కకు తిప్పాలి. నోటిలో, ముక్కులో, చెవులలో ఏమైనా ఇసుక లేక బురద ఉంటే దానిని తొలగించాలి. ఇప్పుడు పొట్ట భాగాన్ని మెల్లగా నొక్కుతూ ఉదర వితానము మరియు ఊపిరితిత్తులపై ఒత్తిడి కలిగేటట్లు చెయ్యాలి. వలన ఊపిరితిత్తులలోని నీరు బయటకు వస్తుంది. ఇదే ప్రక్రియను ఆ వ్యక్తిని బోర్లా పడుకోబెట్టి కోలుకునేంతవరకు కొనసాగించాలి. కోలుకోగానే ఆ వ్యక్తికి వెచ్చటి దుస్తులు మరియు వేడి పానీయాలు ఇవ్వండి.
ఆలోచించండి – ప్రతిస్పందించండి
7th Class Science Textbook Page No. 107
ప్రశ్న 1.
కుడి ఊపిరితిత్తి ఎడమ ఊపిరితిత్తి కంటే ఎందుకు పెద్దదిగా ఉంటుంది?
జవాబు:
- ఛాతి కుహరంలో రెండు ఊపిరితిత్తులు ఉంటాయి.
- కుడి ఊపిరితిత్తి, ఎడమదాని కంటే పెద్దదిగా ఉంటుంది.
- ఎడమవైపు ఊపిరితిత్తి గుండెకు ఖాళీ వదలటం కోసం పరిమాణంలో చిన్నదిగా ఉంటుంది.
- మానవ గుండె కొంచెం ఎడమవైపుగా ఊపిరితిత్తి లోపలకు అమరి ఉంటుంది.
- అందువలన ఎడమ ఊపిరితిత్తి పరిమాణం తగ్గి చిన్నదిగా ఉంటుంది.
ప్రాజెక్ట్ పనులు
7th Class Science Textbook Page No. 129
ప్రశ్న 1.
రెండు స్టాలు, నీరు కలిగిన బాటిల్ సహాయంతో మీ ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని పరీక్షించండి.
జవాబు:
- ఒక చిన్న ప్లాస్టిక్ కూల్ డ్రింక్ బాటిల్ తీసుకొని, దాని మూతకు రెండు రంధ్రాలు చేసాను.
- బాటిలను నీటిలో నింపాను.
- మూతకున్న రంధ్రాలలో రెండు స్ట్రాలు అమర్చాను.
- ఒక స్టా బాటిల్ అడుగువరకు రెండవ స్థాను నీటికి పైన ఉండేటట్లు అమర్చాను.
పనిచేయు విధానం :
- నీటి పైకి అమర్చిన స్ట్రా ద్వారా గట్టిగా గాలి పీల్చుకొని ఉండాలి.
- ఈ గాలి నీటి పై ఒత్తిడిని కలిగించి రెండవ స్ట్రా ద్వారా నీటిని పైకి చిమ్ముతుంది.
- పైకి చిమ్మిన నీటి ఫౌంటెన్ ఎత్తు ఆధారంగా లేదా సీసా లోపల ఏర్పడిన ఖాళీ ఆధారంగా ఊపిరితిత్తుల సామర్థ్యం అంచనా వేయవచ్చు.
ప్రశ్న 2.
పట్టిక 2లో చూపిన విధంగా మనం విడిచే గాలిలో నీటి ఆవిరి ఉన్నదా లేదా అనేది అద్దం సహాయంతో తెలుసుకోండి.
జవాబు:
- ఉదయం నిద్ర లేవగానే అద్దాన్ని చేతిలోనికి తీసుకొని నోటితో గాలిని దాని పైకి ఊదండి.
- వెంటనే నీ ప్రతిబింబం అద్దంలో మసకగా కనిపిస్తుంది.
- అద్దాన్ని అరచేతితో తుడిచి చూడండి.
- ప్రతిబింబం స్పష్టంగా కనిపించటంతో పాటు చేతికి తేమ తగులుతుంది.
- ఈ తేమ నీవు ఊదిన గాలిలోని ఆవిరి.
- వేసవికాలంలో కంటే శీతాకాలంలో ఈ ప్రక్రియ స్పష్టంగా కనిపిస్తుంది.
- శీతాకాలంలో పరిసరాలు చల్లగా ఉండుట వలన ఊదిన గాలిలోని నీటి ఆవిరి ఎక్కువసేపు నిలిచి ఉండటమే దీనికి కారణం.
ప్రశ్న 3.
నీటి బాటిల్, బెలూన్లు మరియు Y ఆకారంలో ఉన్న గొట్టాల్ని ఉపయోగించి శ్వాసక్రియలో ఉదర వితానం యొక్క ప్రాధాన్యత తెలిసేలా ఊపిరితిత్తుల నమూనా తయారుచేయండి.
జవాబు:
- వెడల్పుగా ఉన్న ఒక బాటిల్ తీసుకొని దాని అడుగు మధ్య భాగమున ఒక రంధ్రం చేసాను.
- బాటిల్ లోపలి నుండి Y స్టాండ్ పైపును తలక్రిందులుగా రంధ్రం ద్వారా పటంలో చూపినట్లుగా అమర్చండి.
- బాటిల్ ఉన్న రెండు Y పైపులకు బెలూన్లు కట్టాను. ఇవి ఊపిరితిత్తులవలె పనిచేస్తాయి.
- బాటిల్ మూతను తీసివేసి దాని స్థానంలో రబ్బర్ బెలూన్ షీట్ ను దారంతో కట్టాను. ఇది ఉదర వితానం వలె పనిచేస్తుంది.
పనిచేయు విధానం :
- రబ్బరు షీట్ ను క్రిందికి లాగినపుడు బాటిల్ లో గాలి పీడనం తగ్గి బయట ఉన్న – గాలి Y పైపు ద్వారా బెలూన్స్ లోనికి చేరి బెలూన్లు ఉబ్బుతాయి. ఈ ప్రక్రియ ఉచ్ఛ్వా సం.
- రబ్బరు షీట్ ను వదిలినపుడు అది పైకి జరిగి, బాటిల్ గాలి పీడనం పెంచుతుంది. అందువలన బెలూన్స్ లోని గాలి బయటకు వెళుతుంది. ఈ ప్రక్రియ నిశ్వాసం.
- ఈ నమూనాను రబ్బరుషీట్ (ఉదరవితానం) ను కదిలించకుండా బాటిలను వత్తుతూ, వదులుతూ (ఉరఃపంజరం) కూడా పని చేయించవచ్చు.
కృత్యాలు
కృత్యం – 2
ప్రశ్న 1.
ఒక కొలిచే టేపును తీసుకొని దానిని మీ మిత్రుని ఛాతీ చుట్టూ ఉంచి ఆమె/ అతని ఛాతీ కొలతను నమోదు చేయండి. టేపును తేలికగా సాగడానికి వీలుగా పట్టుకొని మీ మిత్రుడిని గట్టిగా గాలి పీల్చుకోమని చెప్పండి. అప్పటి కొలతను కూడా నమోదు చెయ్యండి. ఈ ప్రక్రియను మరొక నలుగురితో కూడా చేసి క్రింది పట్టికలో నమోదు చెయ్యండి.
జవాబు:
జవాబు:
ప్రశ్న 2.
రెండు బీకర్లు తీసుకోండి. వాటిని A మరియు B గా గుర్తించండి. రెండింటిలో కూడా సగం వరకు సున్నపుతేటతో నింపండి. ఒక స్టా తీసుకొని A అనే బీక ఉంచి నోటితో గాలిని ఊదండి. B అనే బీకనికి ఒక డ్రాపర్ సహాయంతో వాతావరణంలోని గాలిని అనేక పర్యాయాలు పంపించండి. రెండు బీకర్లలో జరిగే రంగు మార్పిడిని గమనించండి.
ఏ బీకరులోని సున్నపుతేట పాలవలె మారినది?
జవాబు:
నోటితో గాలి ఊదిన బీకరు A లోని సున్నపు తేట పాలవలె మారింది.
ఈ మార్పు ఏమి సూచిస్తుంది?
జవాబు:
ఈ మార్పు మనం విడిచే గాలిలో CO2 ఉందని నిర్ధారిస్తుంది.
కృత్యం – 4
3. ఒక వెడల్పాటి మూతిగల సీసా తీసుకొని అందులో ఒక గుప్పెడు మొలకెత్తిన విత్తనాలు ఉంచండి. ఒక చిన్న పాత్రలో అప్పుడే తయారుచేసిన సున్నపు తేటను పోసి సీసాలో ఒక పక్కగా ఉంచండి. సీసాకు మూతను బిగించి గాలి చొరబడకుండా అంచులకు వేజలిన్ పూత పూయండి. ఈ ఏర్పాటును 2 రోజులపాటు కదపకుండా ఒక పక్క ఉంచండి. రెండు రోజుల తరువాత సీసామూత తీసి చిన్న పాత్రలోని సున్నపు తేటను బయటకు తీసి మార్పులను గమనించండి.
మీరు సున్నపుతేటలో ఏ మార్పును గమనించారు?
జవాబు:
సున్నపుతేట తెల్లగా పాలవలె మారింది.
సున్నపు తేటలో మార్పు ఎందుకు జరిగింది?
జవాబు:
మొలకెత్తుతున్న గింజలు CO2 ను విడుదల చేయటం వలన సున్నపునీరు పాలవలె మారింది.
కృత్యం -5
ప్రశ్న 4.
స్టెతస్కోపను తయారుచేయు విధానం తెలపండి.
జవాబు:
ఉద్దేశం : స్టెతస్కోప్ ను తయారుచేయటం.
కావలసిన పరికరాలు :
రబ్బరు ట్యూబు, Y ఆకారం గొట్టము, చిన్న గరాటు, రబ్బరు షీట్, స్టీలు నాలుకబద్ద, పూసలు లేదా ఇయర్ఫో న్ బడ్స్, ఇన్సులేషన్ టేపు.
విధానం :
- Y ఆకారపు గొట్టము తీసుకొని దాని మూడు భుజాలకు రబ్బరు ట్యూబు అమర్చాను.
- క్రిందివైపు ఉన్న రబ్బరు ట్యూకు చివర గరాటు అమర్చి దానికి బెలూన్ షీట్ కట్టాను.
- పైన ఉన్న రెండు భుజాల రబ్బరుట్యూబ్ చివరలు ఇయర్ఫోన్, బడ్స్ అమర్చాను.
- ఈ రెండు భుజాలను కలుపుతూ Y గొట్టము మీదుగా స్టీలు నాలుకబద్ధ ఆధారం కోసం అమర్చాను.
పనిచేయు విధానం :
పై రెండు రబ్బరు గొట్టాలను చెవిలో ఉంచుకొని గరాటును స్నేహితుని గుండెకు ఆనించినపుడు గుండె చేయు శబ్దాలను స్పష్టంగా వినవచ్చును.
సూత్రం :
అనేక పర్యాయములు ధ్వని పరావర్తనం చెందటం వలన స్టెతస్కోప్ పని చేస్తుంది.