SCERT AP 7th Class Social Study Material Pdf 13th Lesson ప్రపంచ పరివర్తనలో మహిళలు Textbook Questions and Answers.
AP State Syllabus 7th Class Social Solutions 13th Lesson ప్రపంచ పరివర్తనలో మహిళలు
7th Class Social 13th Lesson ప్రపంచ పరివర్తనలో మహిళలు Textbook Questions and Answers
కింది తరగతులలోని విషయ పునశ్చరణకి
ప్రశ్న 1.
పై చిత్రంలో మీరు ఏమి గమనించారు? మీరు ఎప్పుడైనా ఇటువంటి దృశ్యాన్ని చూశారా?
జవాబు:
పై చిత్రంలో ఒక మహిళ వ్యవసాయం (చేనును దున్నటం) చేయటం గమనించాను. ఇలాంటి దృశ్యాన్ని మా ప్రాంతంలో తరచుగా చూస్తుంటాను.
ప్రశ్న 2.
పురుషులతో సమానమైన సామర్థ్యాలు మహిళలకు ఉన్నాయనే భావనను మీరు సమర్థిస్తారా? వివరించండి.
జవాబు:
పురుషులతో సమానమైన సామర్థ్యాలు మహిళలకు ఉన్నాయనే భావనను నేను సమర్థిస్తాను.
- పురుషులతో సమానంగా అన్ని రంగాలలో స్త్రీలు రాణిస్తున్నారు.
- పురుషులకు ధీటుగా వారి శక్తి, సామర్థ్యాలు ప్రదర్శిస్తున్నారు.
- మహిళలు తక్కువ సామర్థ్యం కల్గి ఉంటారనేది ఒక మూస ఆలోచన మాత్రమే అని చెబుతూ అన్ని వృత్తులలో మహిళలు రాణిస్తున్నారు.
Improve your learning (మీ అభ్యసనాన్ని మెరుగుపడుచుకోండి)
I. క్రింది ప్రశ్నలకు సమాధానాలు వ్రాయండి.
ప్రశ్న 1.
ఈ పాఠంలో కొంతమంది స్పూర్తిదాయక మహిళల గురించి తెలుసుకున్నారు. మీకు తెలిసిన ఎవరైనా ఇద్దరు మహిళలు, వారు సాధించిన విజయాల గురించి వ్రాయుము.
జవాబు:
1) వైద్య విద్య కోసం ఆస్తులు అమ్మడానికైనా సిద్ధమయ్యే వాళ్లు ఎందరో ! మోనిక ఇందుకు భిన్నంగా ఆలోచించింది. తొలి ప్రయత్నంలోనే కామన్ ఎంట్రన్స్ టెస్ట్ లో 200వ ర్యాంకు సాధించింది. బంధువులు, కుటుంబ సభ్యులు ‘మంచి ర్యాంకు….. మెడికల్ సీటు పక్కా’ అంటూ పొగడ్తలతో ముంచేశారు. కానీ మోనిక సమాధానం విన్నాక అందరూ ఆశ్చర్యపోయారు. తనకి వైద్య విద్య కన్నా వ్యవసాయమే ఇష్టమని. ఆ కోర్సునే ఎంచుకుంటానని చెప్పింది. అప్పటి తన నిర్ణయం సరైందే అని తాజాగా మోనిక సాధించిన విజయాలే నిరూపించాయి. బెంగళూరులో మంగళవారం నిర్వహించిన బెంగళూరు వ్యవసాయ విశ్వవిద్యాలయం 55వ స్నాతకోత్సవంలో 10 స్వర్ణ పతకాలు అందుకుంది.
సేవ చేయాలనే తపన ఉంటే ఏ రంగమైనా ఒకటేనని చెబుతోంది మోనిక. కర్ణాటకలోని తుమకూరు జిల్లా మధుగిరి ఆమె సొంత ఊరు. అక్కడ సరైన సదుపాయం లేక దగ్గర్లోని మూడబిదరిలోని ఆళ్వాస్ పీయూ కళాశాలలో చేరింది. అప్పుడే తనకి తన సొంత ఊర్లోనే కాక, చదువుకుంటున్న చోట కూడా రైతులు ఎదుర్కొంటున్న కష్టాలు తెలిశాయి. రైతు కష్టానికి తగిన ఆదాయం పొందలేకపోవడంపై అధ్యయనాలు చేపట్టింది. వ్యవసాయ కుటుంబంలో పుట్టిన మోనిక తండ్రి సాగులో లాభం రాదని ఉపాధ్యాయ వృత్తిని చేపట్టారు. కానీ మోనిక మాత్రం వ్యవసాయంలోనే విజయం సాధించాలని నిర్ణయించుకుంది. ఎప్పుడు ఊరు వెళ్లినా… తాతయ్య, చిన్నాన్న, పెదనాన్నలనడిగి పంటల బాగోగులు, మార్కెట్ పరిస్థితుల్ని ఆరా తీసేది. సాగుపై మమకారంతో మండ్య వ్యవసాయ కళాశాలలో చేరి నాలుగేళ్ల అగ్రి బీఎస్సీని 91.10 సీజీపీఏతో పూర్తి చేసింది. ప్రస్తుతం అసోంలో ఎమ్ఎస్ఎస్సీ చేస్తోంది. మారుతున్న జీవనశైలికి అనుగుణంగా రైతులు తమ పంటల్లో వైవిధ్యత పాటించాలి. ఈ రంగంలో సమస్యల్ని అధ్యయనం చేసి పరిష్కారాలు చూపడం, రైతన్నల జీవితాల్లో వెలుగులు నింపడమే నా లక్ష్యం ‘ అని అంటోంది మోనిక.
2) రక్షణ శాఖ ఆధ్వర్యంలో డీఆర్‌డీవో జాతీయ స్థాయిలో డేర్ టు డ్రీమ్ 2.ఓ-2020 కార్యక్రమానికి దేశవ్యాప్తంగా 1965 మంది యువ శాస్త్రవేత్తలు ఆలోచనలను పంపగా స్టార్టప్ విభాగంలో 15, వ్యక్తిగత విభాగంలో 20 మంది చొప్పున ఎంపిక చేశారు. తెలుగు రాష్ట్రాల నుంచి చిత్తూరు జిల్లా కేజీ కుప్పంకు చెందిన డాక్టర్ శిరీష ఒకరే ఎంపికయ్యారు. మద్రాసు యూనివర్సిటీ నుంచి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, జేఎన్టీయూ, హైదరాబాద్ నుంచి ఎంఈ, కేఎల్ యూ నుంచి పీహెడీ చేశారు. ప్రస్తుతం హైదరాబాద్ ఎంవీఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ లో అసిస్టెంట్ ప్రొఫెసర్. భర్త దగ్గుబాటి వంశీకృష్ణ స్కూల్ డైరెక్టర్ శిరీష ప్రొఫెసర్ కేఎస్ఆర్ మూర్తి ఆధ్వర్యంలో మరో ముగ్గురితో కలిసి బృందంగా ఎనిమిదేళ్లుగా రక్షణ సంబంధిత ప్రాజెక్టులపై పని చేస్తున్నారు. తను రాసిన పలు పరిశోధన పత్రాలు అంతర్జాతీయ జర్నల్స్ లో ప్రచురితమయ్యాయి. డేర్ టూ డ్రీమ్ పోటీల్లో భాగంగా మూడు అంచెల వడపోత తర్వాత వ్యక్తిగత విభాగంలో శిరీష ఎంపికయ్యారు. ఇటీవల కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ చేతుల మీదుగా అబ్దుల్ కలాం ఆత్మనిర్బర్ పురస్కారం అందుకున్నారు. ‘రక్షణ శాఖలో ఎయిర్ క్రాఫ్ట్ ఇంజిన్ మానిటరింగ్ పై పరిశోధన చాలా క్లిష్టం. పైగా ఖర్చుతో కూడుకున్నది. ఎయిర్ క్రాఫ్ట్ చాలా వేగంగా ప్రయాణిస్తుంది. ఈ క్రమంలో ఇంజిన్ లోపాలు తలెత్తుతుంటాయి. దీనిపై ఆధారపడే ఇతర భాగాల పనితీరు ఉంటుంది. మేము కనిపెట్టిన విధానంతో ఇంజిన్ పనితీరు, కండిషన్ పైలట్ కు ఎప్పటికప్పుడు తెలుస్తుంది. భవిష్యత్తులో ఈ ప్రాజెక్టుపై మరింత పరిశోధన చేయాలన్నది నా లక్ష్యం’ అంటున్నారు శిరీష.
ప్రశ్న 2.
“పురుషులు ఏ పనినైనా చేయగలరు, స్త్రీలు కొన్ని పనులు మాత్రమే చేయగలరు అనే మూస ఆలోచన స్త్రీల పురోగతికి ప్రతిబంధకంగా ఉన్నది”. వ్యాఖ్యానించుము.
జవాబు:
- నిజమే, పురుషులు ఏ పనైనా చేయగలరు. స్త్రీలు కొన్ని పనులు మాత్రమే చేయగలరు అనే మూస (సంప్రదాయ) ఆలోచనల పరంపరే స్త్రీల పురోగతికి ప్రతిబంధకంగా ఉంది.
- నేటి సమాజంలో మహిళలు సాధిస్తున్న విజయాలు, ఈ ఆలోచనలకు చరమ గీతికలుగా భావించవచ్చు.
- నేటి ఆధునిక సమాజంలో స్త్రీలు లేని రంగం ఒకటి కూడా లేదు అంటే అతిశయోక్తి కాదాయే. విద్య, వైద్యం, రక్షణ, పోలీస్, రైల్వే, బ్యాంకింగ్, క్రీడలు, వాణిజ్యం, రాజకీయం ఒకటి ఏమిటి అన్ని రంగాలలో పురుషులతో సమానంగా రాణిస్తున్నారు.
- కావున సంప్రదాయపు, మూస ఆలోచనల్లోంచి సమాజము కూడా బయటపడినపుడు స్త్రీ పురోగతి సాధ్యమవుతుంది.
- ఈ మూస ధోరణుల నుండి విముక్తి పొందడంలో విద్య ప్రధాన పాత్ర పోషిస్తుంది.
ప్రశ్న 3.
మహిళలు పురుషులతో సమానమైన శక్తి సామర్థ్యాలు కలిగి ఉన్నారు. అను భావనను రెండు ఉదాహరణల ద్వారా సమర్థించుము.
జవాబు:
- మహిళలు పురుషులతో సమానమైన శక్తి సామర్థ్యాలు కలిగి ఉన్నారు అనుటలో సందేహం లేదు.
- మహిళలు, పురుషులతో సమానంగా అన్ని రకాల ఉద్యోగాలు, వృత్తులు చేయగలుగుతున్నారు. ఉదాహరణ పైలెట్లుగా, సైన్యంలో కమాండర్లుగా రైల్వేలో కో పైలట్లుగా, సాఫ్ట్వేర్, శాస్త్రవేత్తలుగా, వాణిజ్యవేత్తలుగా, పారిశ్రామికవేత్తలుగా ఎదిగారు, ఎదుగుతున్నారు. వీటితో పాటు ఇంటి పనులు సైతం చాలా చాకచక్యంగా నిర్వహిస్తున్నారు.
- శారీరక దృఢత్వంలోను పురుషులతో సమానంగా వివిధ క్రీడలలో రాణిస్తున్నారు. ఉదా : కరణం మల్లీశ్వరీ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్ మరియు స్వర్ణ పతకం సాధించింది. అలాగే గీతా పోగట్ కుస్తీ పోటీల్లో మొదటిగా భారతదేశానికి స్వర్ణపతకం అందించింది.
ప్రశ్న 4.
మహిళల కోసం ఏయే అంశాలలో ఉద్యమించవలసిన అవసరం ఉంది అని నీవు భావిస్తున్నావు?
జవాబు:
నేను మహిళల కోసం క్రింది అంశాలలో ఉద్యమించవలసిన అవసరం ఉందని భావిస్తున్నాను.
- మహిళా సాధికారత (ఆర్ధిక మరియు రాజకీయ సాధికారత).
- చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించుటకు (ఇది రాజకీయ సాధికారతకు నిదర్శనం)
- అత్యాచార నిందితులకు, కఠిన (మరణ శిక్షలు అమలుచేయడంపై.
- లైంగిక వేధింపులకు పాల్పడేవారిని కఠినంగా శిక్షించే చట్టాలు చేయటంపై.
- బాలికల, మహిళల అక్రమ రవాణాకు కఠినంగా శిక్షించే చట్టాలు చేయటం మొ||న వాటికై ఉద్యమించాల్సి ఉంది.
ప్రశ్న 5.
“పేద అమ్మాయిలు చదవడం ఇష్టం లేకపోవడం వలన చదువు మానేస్తారు”. ఈ ప్రకటనను సమర్థిస్తారా?
జవాబు:
“సమర్థించను, పేద అమ్మాయిలు చదవడం ఇష్టం లేకపోవటం వలన చదువు మానివేయడం లేదు, దానికి ఇతర కారణాలు కలవు. అవి :
- పేదరికం, ఆర్థిక స్తోమత లేకపోవడం.
- తల్లిదండ్రుల నిరక్షరాస్యత.
- తల్లిదండ్రుల మూఢ నమ్మకాలు, విశ్వాసాలు.
- తల్లిదండ్రుల పేదరికం.
- ఇంటి దగ్గర పనులు చేయించడం.
- ఇంటి దగ్గర సోదర, సోదరీమణుల పోషణ అమ్మాయికి అప్పగించడం మొ||వి.
ప్రశ్న 6.
మహిళల సమానత్వము ప్రాముఖ్యతను తెలిపే కొన్ని నినాదాలను వ్రాయుము.
జవాబు:
- మహిళ సమానత్వము గౌరవించడం పురుషుడి సంపన్నత్వము.
- మహిళా (లింగ) సమానత్వము – ఇది ప్రతి ఒక్కరి బాధ్యత.
- దేశ అభివృద్ధికి చిహ్నం – లింగ సమానత్వం,
- మహిళా సమానత్వము లేనిదే – నిజమైన స్వేచ్ఛ లేదు.
- మహిళా సమానత్వము అంటే సాంఘిక సమానత్వమునకు చిహ్నం.
- మహిళ నీలో సగం, నింగిలో సగం. జనాభాలో సగం అందుకే మీతో సమానం.
ప్రశ్న 7.
“బేటీ బచావో బేటీ పఢావో” ప్రచారం యొక్క ఉద్దేశ్యం ఏమిటో వ్రాయుము.
జవాబు:
“బేటీ బచావో బేటీ పఢావో” ప్రచారం యొక్క ఉద్దేశ్యం:
- బాలిక జననం వేడుక కావాలి, ఆమె చదువుకు ఆటంకం లేకుండుట.
- బాలికల రక్షణ మరియు జీవనమునకు భరోసా కల్పించుట.
- బాలికల విద్య, భాగస్వామ్యంకై భరోసా కల్పించుట, (హామినిచ్చుట)
- లింగ వివక్షతను రూపుమాపుట.
ప్రశ్న 8.
మహిళా సాధికారతపై కొన్ని నినాదాలను తయారుచేయండి.
జవాబు:
- మహిళా సాధికారత – అది జాతి సాధికారత.
- మహిళల స్వేచ్ఛ – సామాజిక స్వేచ్ఛకు సంకేతం.
- మహిళలకు సాధికారత కల్పించడం – సామాజిక అభివృద్ధికి చిహ్నం.
- మహిళ – దేశ భవిత, దానిని అపాయంలోకి నెట్టకండి.
- మహిళలకు సాధికారత కల్పించండి – లింగ అసమానతను తొలగించండి.
- స్త్రీని శక్తివంతం చేయండి – తద్వారా దేశం శక్తివంతం అవుతుంది.
II. సరైన సమాధానాన్ని ఎన్నుకోండి.
1 ఎన్.ఎస్.ఎస్ 61వ రౌండ్ (2004-2005) ప్రకారం భారతదేశంలో వ్యవసాయ పనిలో నిమగ్నమైన శ్రామిక మహిళల శాతం.
ఎ) 89.6
బి) 91.7
సి) 83.6
డి) 65.2
జవాబు:
సి) 83.6
2. “బేటీ బచావో బేటీ పఢావో” కార్యక్రమం ఈ సంవత్సరంలో ప్రారంభమైంది.
ఎ) 2012
బి) 2013
సి) 2014
డి) 2015
జవాబు:
డి) 2015
3. అంతర్జాతీయ మహిళా దినోత్సవంను మనం ఈ తేదీన జరుపుకుంటాం.
ఎ) మార్చి 15
బి) ఏప్రిల్ 7
సి) మార్చి 8
డి) జులై 11
జవాబు:
సి) మార్చి 8
4. పద్మశ్రీ అవార్డు పొందిన మొట్టమొదటి మహిళా శాస్త్రవేత్త.
ఎ) జానకీ అమ్మాళ్
బి) నందిని హరినాథ్
సి) కాదంబరి గంగూలీ
డి) అన్నా మణి
జవాబు:
ఎ) జానకీ అమ్మాళ్
5. మహిళల ఉద్యమ ఫలితంగా 1993వ సంవత్సరంలో సారాను నిషేధించిన రాష్ట్రం.
ఎ) తమిళనాడు
బి) ఆంధ్రప్రదేశ్
సి) గుజరాత్
డి) కేరళ
జవాబు:
బి) ఆంధ్రప్రదేశ్
III. జతవరుచుము.
గ్రూప్ -ఎ | గ్రూప్ -బి |
1. మిథాలీ రాజ్ | ఎ) పర్యావరణవేత్త |
2. వందనా శివ | బి) కమాండో ట్రైనర్ |
3. సీమారావ్ | సి) క్రికెటర్ |
4. ప్రాంజల్ పాటిల్ | డి) శాస్త్రవేత్త |
5. నందిని హరినాథ్ | ఇ ) ఐ.ఏ.ఎస్ అధికారిణి |
జవాబు:
గ్రూప్ -ఎ | గ్రూప్ -బి |
1. మిథాలీ రాజ్ | సి) క్రికెటర్ |
2. వందనా శివ | ఎ) పర్యావరణవేత్త |
3. సీమారావ్ | బి) కమాండో ట్రైనర్ |
4. ప్రాంజల్ పాటిల్ | ఇ ) ఐ.ఏ.ఎస్ అధికారిణి |
5. నందిని హరినాథ్ | డి) శాస్త్రవేత్త |
7th Class Social Studies 13th Lesson ప్రపంచ పరివర్తనలో మహిళలు InText Questions and Answers
7th Class Social Textbook Page No.171
ప్రశ్న 1.
ఎవరు ఏ పనులు చేస్తారు?
మీ ప్రాంతంలో క్రింద ఇవ్వబడిన పనులను ఎవరు నిర్వహిస్తారు ? వృత్తులు
మహిళలు పురుషులు వైద్యం అంగడి నిర్వాహకుడు వ్యవసాయం శాస్త్రవేత్త డ్రైవర్
ప్రశ్న : పై పట్టిక నుండి మీరు ఏమి గమనించారు?
జవాబు:
పై పట్టికలో నేను గమనించిన అంశాలు :
- పైన ఇవ్వబడిన పనులు అన్నీ మహిళలు, పురుషులు నిర్వహిస్తున్నారు.
- మహిళలు ఏ విషయంలోను పురుషుల కంటే తక్కువ కాదని గమనించాను.
- డ్రైవర్ వృత్తి మా ప్రాంతంలో చేయడం లేదు కాని మిగతా ఇతర పట్టణాలలో, ప్రాంతాల్లో నిర్వహిస్తున్నారని గమనించాను.
- మహిళలు, పురుషులు సమాన నైపుణ్యాలు కల్గి ఉంటారని గమనించాను.
7th Class Social Textbook Page No. 177
ప్రశ్న 2.
మీ ప్రాంతంలో మూస పద్ధతులను విచ్చిన్నం చేసి విజయం సాధించిన మహిళల గురించి సమాచారాన్ని సేకరించండి. మీ తరగతి గదిలో చర్చించండి.
జవాబు:
మా ప్రాంతంలో ఈశ్వరమ్మ అనే ఆమెకు ఇద్దరు పిల్లలు. ఒక మగపిల్లాడు, ఒక ఆడపిల్ల. అయితే ఈమెకు చిన్నతనంలోనే అంటే 36 సం||ల వయస్సులోనే భర్త మరణించాడు. ఆమె ఏనాడూ బయటికి వచ్చి ఏ పనీ చేసింది లేదు. కాని భర్త మరణంతో ఆమె బ్రతుకు పోరాటాన్ని ఒక చిన్న టిఫిన్ సెంటర్లో ప్రారంభించింది. ఆమె తన ఇద్దరి పిల్లల చదువుకు ఏ మాత్రం ఆటంకం కలుగనీయలేదు. సమాజంలో బాగా బ్రతికిన ఆమె అలా చితికిపోవటం బాధాకరం అయితే చుట్టుప్రక్కల వాళ్ళు, బంధువులు ఆమె ఆర్థిక పరిస్థితిని చూసి ఆదుకోవాల్సింది పోయి ఆడిపోసుకుంటున్నారు. కొంత మంది హేళనగా మాట్లాడేవారు. అయినా ఆమె వీటన్నింటిని ఎదుర్కొని తన కుమారుడిని బ్యాంక్ అధికారిగా, కుమార్తెను టీచర్ గా తీర్చిదిద్దింది. నిజంగా ‘ ఆమెను గురించి మా పెద్దలు చెబుతుంటే నాకు ఎంతో స్ఫుర్తిదాయకంగా ఉంది.
ప్రశ్న 3.
శ్రీ గుఱ్ఱం జాషువా రచించిన ‘అనాథ’ పద్యంను చదవండి.
జవాబు:
విద్యార్థులు స్వయంగా చదవగలరు.
7th Class Social Textbook Page No. 179
ప్రశ్న 4.
మీ గ్రామంలో బాలికలు బడి మానేయడానికి గల కారణాలను చర్చించండి.
జవాబు:
మా గ్రామంలో బాలికలు బడి మానేయడానికి గల కారణాలు :
- పేదరికం, తల్లిదండ్రుల ఆర్ధిక స్తోమత.
- బాల్య వివాహాలు
- ఇంటి దగ్గర చిన్న పిల్లలను చూసే బాధ్యత అప్పగించటం.
- తల్లిదండ్రులలో ఎవరో ఒకరు మరణించటం.
- అభద్రతా భావం
- సమాజంలోని మూఢనమ్మకాలు / విశ్వాసాలు మరియు మూస ధోరణులు
ఆలోచించండి & ప్రతిస్పందించండి
7th Class Social Textbook Page No. 171
ప్రశ్న 1.
మీ పరిసరాలలోని మహిళలు పురుషులతో సమానంగా తమ హక్కులను వినియోగించుకోగలుగుతున్నారా?
జవాబు:
మా పరిసరాలలోని మహిళలు కొంతమంది మాత్రం పురుషులతో సమానంగా తమ హక్కులను వినియోగించు కోగలుగుతున్నారు. ఈ తరం మహిళలు దీనిలో ముందంజలో ఉన్నారు. పాత తరం మహిళలు సంప్రదాయాలు, కట్టుబాట్లు మొ||న వలయంలోనే చిక్కుకొని తమ హక్కులను కొన్నింటిని కోల్పోతున్నారు.
7th Class Social Textbook Page No. 173
ప్రశ్న 2.
పైన పేర్కొన్న పనులలో ఏవి పురుషులు మాత్రమే చేయగలరని మీరు అనుకుంటున్నారు?
జవాబు:
పైన పేర్కొన్న పనులలో ఏవీ కూడా పురుషులు మాత్రమే చేయగలరని నేను అనుకోవడం లేదు, మహిళలు కూడా చేయగలరు.
ప్రశ్న 3.
పైన పేర్కొన్న పనులలో ఏవి మహిళలు మాత్రమే చేయగలరని మీరు అనుకుంటున్నారు?
జవాబు:
పైన పేర్కొన్న పనులలో ఏవీ కూడా మహిళలు మాత్రమే చేయగలరని నేను అనుకోవడం లేదు, పురుషులు కూడా చేయగలరు.
ప్రశ్న 4.
పురుషులు చేసే పనులు మహిళలు చేయలేరని అనుకోవడం సమంజసమా? ఎందుకు?
జవాబు:
పురుషులు చేసే పనులు మహిళలు చేయలేరని అనుకోవడం సమంజసం కాదు. ఎందుకంటే, పనిలో నైపుణ్యం, (తెలివితేటలు) శక్తి సామర్థ్యాలు మొ||వి లింగం ఆధారంగా ఉండవు. అవి అందరికి సమానంగానే ఉంటాయి.
7th Class Social Textbook Page No. 175
ప్రశ్న 5.
కుటుంబంలో, సమాజంలో ఎదురవుతున్న ఈ సవాళ్లను అధిగమించడానికి ఏమి చేయాలి?
జవాబు:
కుటుంబంలో, సమాజంలో ఎదురవుతున్న ఈ మూస ధోరణులు / సవాళ్ళను అధిగమించడానికి
- మహిళలు/బాలికలు విద్యావంతులు కావాలి.
- మహిళలు ఆర్ధిక మరియు రాజకీయ సాధికారత సాధించాలి.
- మహిళలు ఆర్థిక స్వేచ్ఛను కల్గి ఉండాలి. దానికిగాను ఉద్యోగ, ఉపాధులను పొందాలి.
- మహిళలు స్వయం శక్తులు / పోషకులు అవ్వాలి ఇతరులపై ఆధారపడకూడదు.
- మహిళలు తాము బలహీనులమని భావించకూడదు. బలవంతులమని దృఢంగా నమ్మాలి.
- మహిళలు అబలలు కాదని సబలలని నిరూపించాలి. ఆత్మవిశ్వాసంతో ముందుకు నడవాలి/నడపాలి.
7th Class Social Textbook Page No. 179
ప్రశ్న 6.
మహిళా హక్కుల ఉద్యమాలు మహిళా హక్కుల సాధనకు ఎలా దోహదపడ్డాయి?
జవాబు:
మహిళలు మరియు బాలికలకు చదువుకునే మరియు పాఠశాలకు వెళ్లే హక్కు ఉంది. ఇతర అంశాలు ఐన హింస మరియు ఆరోగ్యం వంటి రంగాలలో న్యాయపరమైన సంస్కరణలు జరిగి, మహిళలు మరియు బాలికల పరిస్థితి మెరుగుపడింది. ఈ మార్పులు అనుకోకుండా జరిగినవి కావు. ఈ మార్పులను తీసుకురావడానికి మహిళలు వ్యక్తిగతంగా మరియు సమష్టిగా పోరాటం చేశారు. ఈ పోరాటాన్నే మహిళా ఉద్యమం అంటారు.
ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్ లో మహిళలు చేసిన సారా వ్యతిరేక ఉద్యమ ఫలితంగా 1993వ సంవత్సరంలో ప్రభుత్వం సారాను నిషేధించింది.
ఆడపిల్లల ఆత్మ గౌరవం కోసం జరిగిన ఉద్యమాల ఫలితంగా పాఠశాలలో ఆడపిల్లలకు ప్రత్యేకంగా మరుగుదొడ్లు , ఏర్పాటు చేయడమే కాకుండా ప్రతి ఇంటా మరుగుదొడ్లు నిర్మించడం జరిగింది.
అన్వేషించండి
7th Class Social Textbook Page No. 179
ప్రశ్న 1.
2015 లో ప్రారంభించిన ‘బేటీ బచావో బేటీ పఢావో’ ప్రచారం గురించి తెలుసుకోండి.
జవాబు:
- ‘ఆడపిల్లను రక్షించు – ఆడపిల్లను చదివించు’ పథకాన్ని 2015, జనవరి 22లో హర్యానాలో ఆడపిల్లలను రక్షించే ఉద్దేశ్యంతో ప్రధానమంత్రి ప్రారంభించారు.
- మహిళా, బాల వికాస మంత్రిత్వశాఖ ఈ చట్టాన్ని తయారుచేసి, దానిని పర్యవేక్షిస్తుంది.
ముఖ్య లక్ష్యాలు :
- ఆడపిల్లల సంఖ్య తక్కువగా ఉన్న 100 జిల్లాల్లో బాలికల సంఖ్య పెరిగే విధంగా చూడటం. (CSR లో వ్యత్యాసం తగ్గించడం)
- 5 సం||లలోపు సంభవించే శిశుమరణాల రేటు 8% నుండి 5% నికి తగ్గించడం.
- బాలికలకు పౌష్టికాహారం అందించడం.
- ప్రతి తరగతిలోను బాలికల సంఖ్య పెరిగేలా చూడటం, బాలికల విద్యను ప్రోత్సహించడం.
- ఆడపిల్లల్ని లైంగిక వేధింపుల నుండి రక్షించే విధానాలు రూపొందించడం.
- భ్రూణ హత్యలను అరికట్టేలా ప్రజలను చైతన్యపరచడం.
ప్రాజెక్ట్ పని
ప్రశ్న 1.
ప్రముఖ మహిళలు మరియు వారి విజయాలతో ఒక ప్ పుస్తకమును తయారుచేయండి.
జవాబు:
విద్యార్థులు స్వయంగా చేయగలరు. క్రింది ఉదాహరణ ఆధారంగా
సాహిత్య రంగం:
1. సుసన్నా అరుంధతీ రాయ్ – రచయిత – సంఘాన్ని చైతన్యం చేసే వ్యక్తి :
మొట్టమొదటిసారిగా తన రచన ‘ది గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్, అనే పుస్తకానికి 1997లో బ్రిటన్ వారిచ్చే ‘బుకర్ ప్రైజ్’ను గెలుచుకున్న భారతీయ మహిళ. 24.11. 1961లో బెంగాల్ లో జన్మించి కేరళ, కొట్టాయంలోని ‘అయమానమ్’ గ్రామంలో పెరిగింది. ఆమె చాలామందికి స్ఫూర్తి ప్రదాత. చిన్నతనం నుండి బాలికగా, స్త్రీగా ఎన్నో ఇబ్బందులను, అడ్డంకులను అధిగమించి ఈ స్థాయికి చేరింది. పేదలు, అణగారిన వర్గాల తరపున గొంతెత్తి ‘అధికారం’తో మాట్లాడాలంటే ఈమెకి ఈమే సాటి. 2004లో ఈమె సిడ్నీ శాంతి బహుమతిని కూడా గెలుచుకుంది.
విద్యారంగం :
2. శకుంతలాదేవి : మానవ కంప్యూటర్ – గణితంలో ఎంత కష్టమైన సమస్యనైనా ఎటువంటి యంత్ర సహాయం లేకుండానే సాధించగలిగేటటువంటి అసమాన ప్రతిభ కలిగిన స్త్రీ. 1939లో కర్ణాటకలోని బెంగుళూరులో జన్మించింది. చాలా దేశాలు ఈవిడ ప్రతిభను ప్రదర్శించడానికి తమ దేశాలకు ఆహ్వానించాయి. 1995లో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో ఈమె పేరును 26వ పేజీలో లిఖించారు.