SCERT AP 7th Class Social Study Material Pdf 12th Lesson మన పరిసరాలలో ఉన్న మార్కెట్లు Textbook Questions and Answers.
AP State Syllabus 7th Class Social Solutions 12th Lesson మన పరిసరాలలో ఉన్న మార్కెట్లు
7th Class Social 12th Lesson మన పరిసరాలలో ఉన్న మార్కెట్లు Textbook Questions and Answers
కింది తరగతులలోని విషయ పునశ్చరణకి
ప్రశ్న 1.
పై చిత్రాలు ఏమి తెలియజేస్తున్నాయి?
జవాబు:
మొదటి చిత్రంలో నిత్యావసర సరుకులు అమ్ముతున్న కిరణా వ్యాపారి, రెండవ చిత్రంలో పండ్లు, కూరగాయలు (దొరికే) అమ్మే మార్కెట్ ను తెలియజేస్తున్నాయి.
ప్రశ్న 2.
అక్కడ ప్రజలు ఎందుకు గుమిగూడారు?
జవాబు:
అక్కడ ప్రజలు కూరగాయలు, పండ్లు కొనుగోలు కొరకు గుమిగూడారు.
ప్రశ్న 3.
అక్కడ ఎలాంటి వస్తువులు విక్రయించబడుతున్నాయి?
జవాబు:
అక్కడ నిత్యావసర సరుకులైన పప్పులు, బియ్యం, ఇతర ధాన్యాలు, పండ్లు, పంచదార మరియు సుగంధ ద్రవ్యాలు విక్రయించబడుతున్నాయి. రెండవ చిత్రంలో అరటి, ‘మ, బత్తాయి వంటి పండ్లు, సొరకాయ, వంకాయ, బెండకాయ, దొండకాయ, క్యాబేజి, బీరకాయ లాంటి కూరగాయలు అమ్ముతున్నారు.
Improve your learning (మీ అభ్యసనాన్ని మెరుగుపడుచుకోండి)
I. క్రింది ప్రశ్నలకు జవాబులివ్వండి.
ప్రశ్న 1.
మార్కెట్ అనగానేమి? వివిధ రకాల మార్కెట్ల గురించి సంక్షిప్తంగా వివరించండి.
జవాబు:
మార్కెట్ :
రద్దీగా ఉండే వ్యక్తులు, వివిధ రకాల వస్తువులు, పండ్లు, కూరగాయలు మరియు ఆ వస్తువులను కొనుగోలు చేసే వినియోగదారులు మరియు వాటిని విక్రయించే దుకాణాలు ఉండే ప్రాంతం.
మార్కెట్లు-రకాలు :
పని చేసే విధానం ఆధారంగా మార్కెట్లను రెండు రకాలుగా విభజిస్తారు. అవి 1. భౌతిక మార్కెట్లు, 2. ఈ-మార్కెట్లు.
భౌతిక మార్కెట్లు :
భౌతిక మార్కెట్ అనేది కొనుగోలుదారులు, అమ్మకందారులను, భౌతికంగా కలిసి వారికి అవసరమైన వస్తువులను కొనుగోలు చేసే ప్రాంతం.
ఉదా : షాపింగ్ మాల్స్, డిపార్ట్ మెంటల్ స్టోర్స్, రిటైల్ స్టోర్స్, భౌతిక మార్కెట్లను క్రింది విధంగా వర్గీకరించవచ్చు.
భౌగోళిక ఉనికి ఆధారంగా స్థానిక మార్కెట్లు :
కొనుగోలుదారులు మరియు అమ్మకందారులు స్థానికంగా వస్తువులు ఉత్పత్తి అయ్యే ఒక నిర్ణీత ప్రాంతానికి పరిమితమైతే వాటిని స్థానిక మార్కెట్లు
అంటారు.
ప్రాంతీయ మార్కెట్లు :
స్థానిక మార్కెట్ల కంటే ఎక్కువ విస్తృతిని కలిగి ఉండి ఆయా ప్రాంతాలలో లేదా రాష్ట్రాల సముదాయంలో మాత్రమే లభించే వస్తువులను కల్గి ఉండే మార్కెట్లు.
జాతీయ మార్కెట్లు :
జాతీయ మార్కెట్ అనునది దేశంలోని అన్ని ప్రాంతాలలో వస్తువులు మరియు సేవల కోసం వర్తకం జరిగే మార్కెట్. ఉదాహరణకు తీరప్రాంత రాష్ట్రాలలో లభించే చేపలను దేశవ్యాప్తంగా అమ్మడం.
అంతర్జాతీయ మార్కెట్లు :
వివిధ దేశాల మధ్య జరిగే వస్తువులు మరియు సేవల వ్యాపారాన్ని అంతర్జాతీయ మార్కెట్ అంటారు.
ప్రశ్న 2.
“వారాంతపు సంతలు క్రమంగా అంతరిస్తున్నాయి”. ఈ వ్యాఖ్యను అంగీకరిస్తారా? అలా అయితే కారణాలు చెప్పండి.
జవాబు:
“వారాంతపు సంతలు క్రమంగా అంతరిస్తున్నాయి” ఈ వ్యాఖ్యను అంగీకరిస్తున్నాను.
కారణాలు :
- అందరూ ఎక్కువగా ఒకే రకమైన వస్తువులు అమ్మటం ద్వారా ‘పోటీ’ ఎక్కువగా ఉంటుంది.
- ధరలు అధికంగా అన్పించటం వల్ల వేరే ప్రాంతానికి తరలి వెళుతున్నారు.
- పెరిగిపోతున్న అవసరాలు, ఫ్యాషన్లు వారాంతపు మార్కెట్లు తీర్చలేకపోవుట.
- ఆధునిక సమాజంలో కొత్తగా వెలుస్తున్న షాపింగ్ మాల్స్, సూపర్ మార్కెట్ల పోటీని తట్టుకోలేకపోవటం మొదలైన కారణాలు.
ప్రశ్న 3.
“పండుగ రోజులలో అమ్మకాలు పెరుగుతాయి” దీనిని మీరు అంగీకరిస్తారా? మీ సమాధానాన్ని సమర్థించండి.
జవాబు:
పండుగ రోజులలో అమ్మకాలు పెరుగుతాయి. దీనిని నేను అంగీకరిస్తాను. కారణం
- పండుగ అంటే అందరు కచ్చితంగా కొనుగోలు చేస్తారు.
- పండుగలకి డిస్కౌంటులు ప్రకటించడంతో కొనుగోళ్ళు కూడ పెరుగుతాయి.
- పండుగ అంటే సామాన్య ప్రజానీకం కూడా ఎంతో కొంత కొనుగోలు చేస్తారు.
- భారతీయ సాంప్రదాయంలో పండుగలకు కొంత ప్రత్యేకత ఉంటుంది. దాని వలన సదరు పండుగ జరుపు కునేవారు వస్తువులు / వస్త్రాలు కొనుగోలు చేస్తారు.
ప్రశ్న 4.
వారాంతపు మార్కెట్లో లభించే వస్తువుల జాబితా తయారు చేసి పొరుగు మార్కెట్లలో లభించే వస్తువులతో పోల్చండి.
జవాబు:
- వారాంతపు మార్కెట్లో లభించే వస్తువుల జాబితా :
కూరగాయలు, పండ్లు, వస్త్రాలు, మాంసం, చేపలు, కోళ్ళు, ఎండుచేపలు, చేతితో తయారుచేసిన పనిముట్లు, చెప్పులు, గేదెలు, మేకలు, గొర్రెలు, సౌందర్య లేపనాలు, ఎండు మిర్చి, పసుపు, కారం మరియు అటవీ ఉత్పత్తులు. - పొరుగు మార్కెట్లలో లభించే వస్తువులు చాలా వరకు వారాంతపు మార్కెట్లలో లభిస్తాయి.
- వారాంతపు మార్కెట్లలో ఎక్కువగా చేతితో తయారుచేసినవి (హ్యాండిక్రాఫ్స్) లభిస్తాయి.
- వారాంతపు మార్కెట్లలో ‘ప్రముఖ బ్రాండ్ల ఉత్పత్తులు దొరకవు. మన పొరుగు మార్కెట్లో అన్ని బ్రాండ్లు దొరుకుతాయి.
- నాణ్యత విషయంలో పొరుగు మార్కెట్లలో దొరికే వస్తువులు చెప్పుకోదగినవి.
ప్రశ్న 5.
వినియోగదారుల రక్షణ చట్టం – 2019 యొక్క లక్ష్యం ఏమిటి?
జవాబు:
వినియోగదారుల రక్షణ చట్టం 2019:
- వినియోగదారుల రక్షణ చట్టం ఆగష్టు 9, 2019న ఆమోదించబడింది.
- ఈ డిజిటల్ యుగంలో వినియోగదారుల వివాదాలను సకాలంలో మరియు సమర్ధవంతంగా నిర్వహించడం మరియు పరిష్కరించడం లక్ష్యంగా పెట్టుకుంది.
- ఈ చట్టం ‘వినియోగదారుడు’ అనే భావనను విస్తృతం చేసింది.
- ఈ చట్టం ‘వినియోగదారుల’ భావనను విస్తృతం చేసింది. ఇది ఆన్లైన్ లేదా ఆన్లైన్ లావాదేవీలు, ఎలక్ట్రానిక్ మార్గాలు, టెలీ షాపింగ్, ప్రత్యక్ష అమ్మకం లేదా బహుళస్థాయి మార్కెటింగ్ ద్వారా ఏవైనా వస్తువులను కొనుగోలు చేసే వ్యక్తిగా వినియోగదారుని నిర్వచిస్తుంది.
ప్రశ్న 6.
ఏవైనా మూడు వినియోగదారుల హక్కులు రాయండి.
జవాబు:
వినియోగదారుల హక్కులు :
- వినియోగదారుల ప్రాణ మరియు ఆస్తులకు నష్టాన్ని కలిగించే ప్రమాదకరమైన ఉత్పత్తులు లేదా మార్కెటింగ్ కి వ్యతిరేకంగా రక్షణ పొందే హక్కు.
- అన్యాయమైన వాణిజ్య పద్ధతుల నుండి వినియోగదారుని రక్షించడానికి, వస్తువుల, ఉత్పత్తుల లేదా సేవల యొక్క నాణ్యత, పరిమాణం, శక్తి, స్వచ్ఛత, ప్రామాణికత మరియు ధరల గురించి తెలియజేసే హక్కు.
- వివిధ రకాల వస్తువులు, ఉత్పత్తులు, సేవలను సాధ్యమైనంత వరకు పోటీ ధరలకు పొందగలం అనే భరోసా కల్పించే హక్కు
- అన్యాయమైన వాణిజ్య పద్దతులు లేదా నిర్బంధిత వాణిజ్య పద్దతులు లేదా వినియోగదారులు అసాంఘిక దోపిడీకి గురికావడానికి వ్యతిరేకంగా పరిష్కారం కోరుకునే హక్కు
- “వినియోగదారులు అవగాహన” పొందే హక్కు.
ప్రశ్న 7.
ప్రసాద్ తన రెండు గేదెల పాలను అమ్ముతూ జీవనం సాగిస్తున్నాడు. దానిని వ్యాపారం అనవచ్చా? అలా అయితే, అతని వ్యాపారాన్ని పెద్ద ఎత్తున విస్తరించడానికి మీరు ఏమి సలహా ఇస్తారు?
జవాబు:
అనవచ్చు, పాల వ్యాపారం అని పిలవవచ్చు. అతని వ్యాపారం పెద్ద ఎత్తున విస్తరించటానికి క్రింది సలహాలు ఇస్తాను.
- తన ఖాతా ఉన్న బ్యాంకు సంప్రదించి వ్యాపార విస్తరణకు ఋణం గ్రహించవలెను.
- బ్యాంక్ లోను ద్వారా రెండు గేదెల నుంచి 20 గేదెలకు పెంచాలి.
- పెద్ద షెడ్డు నిర్మించుకొని, ఇద్దరు ముగ్గురు పనివాళ్ళను సహాయంగా పెట్టుకోవాలి.
- పెరిగిన పాల ఉత్పత్తికి తగినట్లుగా పాలు పోయించుకునే ఖాతాలను పెంచుకోవాలి.
II. సరి అయిన సమాధానాన్ని ఎన్నుకోండి.
1. ఒక వ్యక్తి ఒక జాతీయ బ్యాంక్ లో కొంత మొత్తాన్ని ఫిక్స్ డ్ డిపాజిట్ చేశాడు. దానిపై అతనికి ప్రతి నెల కొంత ఆదాయం వస్తుంది. ఈ ఆదాయాన్ని ఏమంటారు?
ఎ) జీతం
బి) అద్దె
సి) వడ్డీ
డి) కమీషన్
జవాబు:
సి) వడ్డీ
2. క్రింది ఇవ్వబడిన మార్కెట్లలో, దేనిలో వస్తువులు చౌకగా లభిస్తాయి?
ఎ) షాపింగ్ మాల్
బి) వారాంతపు సంత
సి) ఈ-మార్కెట్
డి) పరిసరాలలోని మార్కెట్
జవాబు:
బి) వారాంతపు సంత
3. క్రింది వానిలో అంతర్జాతీయ మార్కెట్ కలిగి ఉన్న వస్తువులు ఏవి?
ఎ) బంగారం
బి) ఆభరణాలు
సి) పెట్రోలియం
డి) పైవన్నీ
జవాబు:
డి) పైవన్నీ
4. పెద్ద మొత్తంలో వస్తువులను కొనుగోలు చేసేవారిని క్రింది విధంగా పిలుస్తారు.
ఎ) టోకు వర్తకుడు
బి) చిల్లర వర్తకుడు
సి) వ్యాపారి
డి) ఎవరూ కాదు
జవాబు:
ఎ) టోకు వర్తకుడు
5. ఆన్ లైన్ షాపింగ్ కి మనం చెల్లింపులు క్రింది ఏ పద్ధతిలో చేయవచ్చు?
ఎ) నెట్ బ్యాంకింగ్
బి) క్రెడిట్ కార్డ్
సి) డెబిట్ కార్డ్
డి) ఇవన్నీ
జవాబు:
డి) ఇవన్నీ
III. జతవరుచుము.
గ్రూప్ -ఎ | గ్రూప్ – బి |
1. ఇంటర్నెట్ బ్యాంకింగ్ | ఎ) షాపింగ్ మాల్స్ |
2. అంతర్జాతీయ మార్కెట్ | బి) నిర్మాత |
3. రైతు | సి) పెట్రోలియం |
4. బహుళజాతి కంపెనీలు | డి) డిజిటల్ చెల్లింపులు |
ఈ) చిల్లర వర్తకుడు |
జవాబు:
గ్రూప్ -ఎ | గ్రూప్ – బి |
1. ఇంటర్నెట్ బ్యాంకింగ్ | డి) డిజిటల్ చెల్లింపులు |
2. అంతర్జాతీయ మార్కెట్ | సి) పెట్రోలియం |
3. రైతు | బి) నిర్మా త |
4. బహుళజాతి కంపెనీలు | ఎ) షాపింగ్ మాల్స్ |
IV. ఖాళీలను పూరించండి.
1. ………………… భూమికి లభించే ప్రతిఫలం. (అద్దె)
2. వస్తువులు మరియు సేవలు కొనుగోలు చేసే వ్యక్తిని ……………….. అంటారు. (కొనుగోలుదారుడు)
3. అంతిమంగా వినియోగదారులకి వస్తువులను అమ్మే వ్యక్తిని ……………. అంటారు. (చిల్లర వర్తకుడు)
4. జాతీయ వినియోగదారుల దినోత్సవంను ……………….. రోజున జరుపుకుంటాం. (డిసెంబరు 24)
7th Class Social Studies 12th Lesson మన పరిసరాలలో ఉన్న మార్కెట్లు InText Questions and Answers
7th Class Social Textbook Page No.153
ప్రశ్న 1.
వివిధ షాపింగ్ మాల్స్ యొక్క చిత్రాలు సేకరించి, మీ తరగతి గదిలో ప్రదర్శించండి.
జవాబు:
7th Class Social Textbook Page No. 155
ప్రశ్న 2.
షాపింగ్ మాల్స్ మరియు షాపింగ్ కాంప్లెక్స్ మధ్య భేదాలు గుర్తించండి.
షాపింగ్ మాల్స్ | షాపింగ్ కాంప్లెక్స్‌లు |
1. బహుళ అంతస్తుల భవనంలో దుకాణాలు ఉంటాయి. | 1. ఒకే ప్రాంగణంలో అన్ని రకాల అనేక వస్తువులను విక్రయించే దుకాణాలుంటాయి. |
2. ఎయిర్ కండీషన్ సౌకర్యం కల్గి ఉంటుంది. | 2. కొన్ని దుకాణాలకు ఏసి ఉండవచ్చును. |
3. బ్రాండెడ్ & నాన్ బ్రాండెడ్ వస్తువులు ఉంటాయి. | 3. బ్రాండెడ్, నాన్ బ్రాండెడ్’ ఉంటాయి. |
4. ధరలు కొంచెం ఎక్కువగా ఉంటాయి. | 4. ధరలు మరీ అంత ఎక్కువగా ఉండవు. |
5. షాపింగ్ మాల్ మొత్తం ఒకే యజమాని నిర్వహిస్తాడు. | 5. వివిధ షాపులకు వివిధ యజమానులుంటారు. |
7th Class Social Textbook Page No. 159
ప్రశ్న 3.
ఏదైనా హోల్ సేల్ దుకాణాన్ని సందర్శించి, వివిధ వస్తువుల ధరలను సేకరించి వాటిని ఏదైనా రిటైల్ దుకాణం ధరలతో పోల్చండి.
జవాబు:
విద్యార్థులు స్వయంగా చేయగలరు.
క్రింద ఇచ్చిన ఉదాహరణ ఆధారంగా
ప్రశ్న 4.
వ్యవసాయ క్షేత్రాల నుండి లభించే ఉత్పత్తుల జాబితాను తయారు చేయండి. వాటిని నిల్వ వుండేవి మరియు త్వరగా పాడైపోయేవిగా వాటిని వర్గీకరించి వ్రాయండి.
జవాబు:
వ్యవసాయ ఉత్పత్తులు :
త్వరగా పాడైపోయేవి | నిల్వ వుండేవి |
1. కాయగూరలు (కూరగాయలు) | 1. ఎండు మిర్చి |
2. ఆకుకూరలు | 2. పొగాకు |
3. నిమ్మకాయలు | 3. పత్తి |
4. వివిధ రకాల పండ్లు | 4. సుగంధ ద్రవ్యాలు |
5. డ్రైఫ్రూట్స్ (జీడిపప్పు, బాదం, ఎండుద్రాక్ష మొదలైనవి) |
|
6. వివిధ రకాల పప్పులు (కందిపప్పు, మినప, పెసర, శనగపప్పు మొదలైనవి) |
ప్రశ్న 5.
మీ ప్రాంతంలో స్థానికంగా సాగుచేయబడిన లేదా తయారు చేయబడిన వస్తువుల జాబితాను తయారు చేయండి.
జవాబు:
- పత్తి,
- పొగాకు,
- ఎండు మిర్చి,
- క్రేన్ వక్కపొడి,
- జూట్,
- చేనేత వస్త్రాలు
7th Class Social Textbook Page No. 161
ప్రశ్న 6.
ఒక వస్తువుల జాబితాను తయారు చేసి, వాటిని ఆర్థిక వస్తువులు మరియు ఉచిత వస్తువులుగా వర్గీకరించండి.
జవాబు:
ఉచిత వస్తువులు :
నీరు, గాలి, కొండ ప్రాంతాలలో వారికి రాళ్ళు, నదీతీర ప్రాంతం వారికి ఇసుక మొ|| ప్రకృతి ప్రసాదించేవి ఉచిత వస్తువులు.
ఆర్ధిక వస్తువులు :
(మనం డబ్బులు చెల్లించి కొనుగోలు చేసే వువులను ఆర్ధిక వస్తువులంటారు) బియ్యం, పప్పులు, కూరగాయలు, పండ్లు, వంట పాత్రలు, భవన నిర్మాణ సామగ్రి, మందులు, కూల్ డ్రింక్స్, ఔషధాలు, పుస్తకాలు, పెన్లు, కంప్యూటర్స్, ఫోన్లు, టి.వి.లు, ఫ్రిడ్జ్, మిక్సీ, గైండర్స్, బట్టలు, బ్యాగ్, షూస్, చెప్పులు, దుప్పట్లు, కళ్ళజోడు, సైకిల్, బైక్ మొదలైనవి.
ప్రశ్న 7.
వివిధ రంగాలలోని వృత్తుల గురించి సమాచారాన్ని సేకరించండి.
జవాబు:
ప్రజలు తమ జీవనోపాధి కోసం వివిధ రకాల వృత్తులు చేపడతారు.
ఈ వృత్తులను ప్రధానంగా మూడు రంగాలుగా విభజిస్తారు. అవి
- ఉత్పత్తి ప్రక్రియలో ప్రకృతి ప్రధాన పాత్ర వహించే వ్యవసాయం, మత్స్య పరిశ్రమ, అటఖీ, పౌల్టీ, గనులు, ఉద్యానవన, పశుసంవర్ధక శాఖ మొదలైన వాటికి సంబంధించిన పనులు.
- యంత్రాలు, పరికరాలు ఉపయోగించి వస్తువులు ఉత్పత్తి చేయడం. కుటీర, చిన్నతరహా, మధ్యతరహా, భారీ పరిశ్రమల్లో పనిచేయువారు.
- సేవారంగం : వ్యాపారం, వాణిజ్యం, హోటళ్ళు, రవాణా, ప్రసార మాధ్యమాలు, పోస్టల్, కొరియర్, ఆర్థిక, బీమా, స్థిరాస్తి, బ్యాంకింగ్, సాఫ్ట్వేర్, ప్రజా, సామాజిక సేవలు, రక్షణ, భద్రత, ప్రభుత్వపాలన, విద్య, వైద్యం, గ్రంథాలయాలు, దస్తావేజుల నిర్వహణ, మ్యూజియం, రైల్వేలు, ఓడరేవులు, విమానయానం, రోడ్డు రవాణా మరియు ఉపగ్రహ సేవలు, సెల్‌ఫోన్ మొదలైనవి.
ఆలోచించండి & ప్రతిస్పందించండి
7th Class Social Textbook Page No. 143 & 145
ప్రశ్న 1.
కమల ఆమె కుమారుడు బాలు ఆదివారం ఉదయం మార్కెట్‌కు వెళ్లారు. బాలు అక్కడ రకరకాల పండ్లు, కూరగాయలు గమనించాడు. అతను పండ్లు మరియు కూరగాయల దుకాణాలతో పాటు కిరాణా మరియు ఫ్యాన్సీ దుకాణాలను కూడా గమనించాడు. బాలు క్రికెట్ బ్యాట్ కొనుగోలు చేశాడు. బాలు వాళ్ళ అమ్మగారు, మార్కెట్ నుండి కొన్ని పండ్లు మరియు కూరగాయలు కొనుగోలు చేసింది. ఇంతలో బాలు మామిడికాయలు కావాలని పండ్ల అమ్మకందారుడిని అడగ్గా మామిడిపండ్లు వేసవిలో మాత్రమే దొరుకుతాయని, ఇప్పుడు చలికాలం కావడంతో అవి దొరకవని సమాధానమిచ్చాడు. బాలు తన తల్లిని క్రికెట్ బ్యాట్ కావాలని అడిగాడు, దానితో ఆమె బ్యాట్ కొనుగోలు చేసింది. చివరకు తాము కొనుగోలు చేసిన వస్తువులతో మార్కెట్ ను వదిలి వెళ్లారు.
పై పేరా చదివి ప్రశ్నలకు సమాధానాలు వ్రాయండి.
1. మార్కెట్లో బాలు ఏమి గమనించాడు?
జవాబు:
బాలు మార్కెట్లో రకరకాల పండ్లు, కూరగాయల దుకాణాలతో పాటు కిరాణా మరియు ఫ్యాన్సీ దుకాణాలను గమనించాడు.
2. బాలు వాళ్ల అమ్మ మరియు బాలు మార్కెట్లో ఏమి కొనుగోలు చేశారు?
జవాబు:
బాలు వాళ్ళ అమ్మగారు, మార్కెట్ నుండి కొన్ని పండ్లు మరియు కూరగాయలు కొనుగోలు చేసింది. బాలు క్రికెట్ బ్యాట్ కొనుగోలు చేశాడు.
3. మీ పట్టణం / గ్రామంలోని మార్కెట్ గురించి వ్రాయండి.
జవాబు:
మా పట్టణంలోని మార్కెట్లో కూరగాయలు, పూలు మరియు వివిధ రకాల పండ్లను అమ్ముతారు. చాలా తక్కువగా కిరాణా దుకాణాలున్నాయి. కొన్ని ప్రాంతాలలో ‘రైతు బజార్లు’న్నాయి.
7th Class Social Textbook Page No. 145
ప్రశ్న 2.
పై చిత్రాలను గమనించి క్రింది ప్రశ్నలకు జవాబులు ఇవ్వండి :
ఎ) మొదటి చిత్రంలో ఏ దుకాణం ఉంది?
బి) మొదటి చిత్రంలోని వ్యక్తులు ఏమి చేస్తున్నారు?
సి) రెండవ చిత్రంలో మీరు ఏమి గమనించారు?
డి) జనరల్ స్టోర్ అల్మారాలలోని వస్తువులను పేర్కొనండి.
జవాబు:
ఎ) మొదటి చిత్రంలోని దుకాణం వస్త్ర దుకాణం.
బి) మొదటి చిత్రంలో వ్యక్తులు కొందరు బట్టలను అమ్ముతున్నారు. కొందరు వారికి కావలసిన బట్టలను ఎంచుకొని కొనుక్కొంటున్నారు.
సి) రెండవ చిత్రంలో జనరల్ స్టోర్‌ను గమనించాను.
డి) జనరల్ స్టోర్ అల్మారాలోని వస్తువులు :
బిస్కెట్ ప్యాకెట్లు, కురురే, లేస్, సబ్బులు, షాంపూలు, పప్పుండలు వంటి తినుబండారాలు, పెన్నుల బాప్లు, సిగరెట్ బార్లు, అగ్గిపెట్టెలు.
7th Class Social Textbook Page No. 147
ప్రశ్న 3.
జాతీయ మరియు అంతర్జాతీయ మార్కెట్ల మధ్య వ్యత్యాసాలు పేర్కొనండి.
జవాబు:
- దేశంలోని అన్ని ప్రాంతాలలో వస్తువులు మరియు సేవల కోసం వర్తకం జరిగే మార్కెట్.
- వివిధ దేశాల మధ్య జరిగే వస్తువులు మరియు సేవల వ్యాపారాన్ని అంతర్జాతీయ మార్కెట్ అంటారు.
ఉదా : ఆభరణాలు, పెట్రోలియం, ఔషధాలు.
ప్రశ్న 4.
స్థానిక మార్కెట్ల యొక్క ప్రాధాన్యత ఏమిటి?
జవాబు:
స్థానిక మార్కెట్ల యొక్క ముఖ్యమైన ప్రాధాన్యత ఇవి ఎక్కువగా అందుబాటులో (స్థానికంగా) ఉంటాయి. స్థానికంగా వస్తువులు ఒక నిర్ణీత ప్రాంతానికే పరిమితమై ఉంటాయి. ఎక్కువ మంది ప్రజలకు దగ్గరలో ఉంటాయి.
ప్రశ్న 5.
మీ స్థానిక మార్కెట్లో లభించే కొన్ని సుగంధ ద్రవ్యాలను పేర్కొనండి.
జవాబు:
మా స్థానిక మార్కెట్లో లభించే సుగంధ ద్రవ్యాలు :
శొంఠి, నువ్వులు, మిరియాలు, గసగసాలు, దాల్చిన చెక్క, లవంగాలు, పసుపుకొమ్ములు, యాలకులు, మరాఠి మొగ్గ, జాజికాయ, జాపత్రి, వాము, ఇంగువ, సోంపు, జీలకర్ర, మెంతులు, బార్లీ, వెల్లుల్లి, అల్లం, ధనియాలు మొదలైనవి.
7th Class Social Textbook Page No. 149
ప్రశ్న 6.
మీ పరిసరాలలో మీరు ఏ రకమైన దుకాణాలను గమనించారు? ఆ దుకాణాల నుండి మీరు ఏయే వస్తువులు కొనుగోలు చేస్తారు?
జవాబు:
మా పొరుగున ఒక చిల్లర దుకాణం కలదు. దాని నుండి మేము బియ్యం, గోధుమలు (పిండి), పప్పులు, పుస్తకాలు, సబ్బులు, పేస్టులు, నూనెలు, పౌడర్లు మరియు ఇంటిలోకి అవసరమైన వెచ్చాలు కొనుగోలు చేస్తాము.
ప్రశ్న 7.
డిజిటల్ చెల్లింపు అనగానేమి?
జవాబు:
ఏదైనా ఒక వస్తువు కొనుగోలు చేయుటకు ద్రవ్యం / కరెన్సీని వాడకుండా ఏదైనా ఎలక్ట్రానిక్ పద్దతిలో చెల్లింపులు, లావాదేవీలు చేసినట్లయితే దానిని డిజిటల్ చెల్లింపు అనవచ్చు.
ఉదా : మొబైల్ యాప్స్, బ్యాంక్ కార్డు మొ||
7th Class Social Textbook Page No. 151
ప్రశ్న 8.
రైతు బజారు వల్ల ప్రయోజనాలు ఏమిటి?
జవాబు:
- రైతు బజార్ల వల్ల రైతులకు మరియు వినియోగదారులకి ఇద్దరికి లాభదాయకంగా ఉంటుంది.
- రైతులు నేరుగా తమ ఉత్పత్తులను వినియోగదారులకి అమ్మటం వలన రైతులు మంచి ధరను పొందగలుగుతారు.
- అలాగే వినియోగదారులు నేరుగా రైతుల దగ్గర నుండి ఉత్పత్తులు కొనుగోలు చేయటం వలన తక్కువ (సరసమైన) ధరకు పొందగలుగుతున్నారు.
- రైతులు నేరుగా అమ్మటం వలన ‘తాజా’ మరియు నాణ్యమైన ఉత్పత్తులు అందించగలుగుతారు. వినియోగదారులకు ఇది కూడా ప్రయోజనకారే.
ప్రశ్న 9.
వస్తువుల ధరలు పొరుగు మార్కెట్లు మరియు షాపింగ్ మాల్స్ కంటే వారాంతపు సంతలలో చౌకగా ఉంటాయి. ఎందుకు?
జవాబు:
- వారాంతపు మార్కెట్లు సంప్రదాయ మార్కెట్లు. సాధారణంగా, ఈ మార్కెట్లు గ్రామీణ ప్రాంతాల్లో కనిపిస్తాయి.
- ప్రతి వారం ఒక నిర్దిష్ట రోజున ఈ మార్కెట్లు ఉదయాన్నే ఏర్పాటు చేయబడి సాయంత్రం మూసివేయబడతాయి.
- వారాంతపు మార్కెట్లో వివిధ రకాల వస్తువులను కొనుగోలు చేయవచ్చు.
- నిర్వహణ ఖర్చులు తక్కువగా ఉన్నందున ఈ వారాంతపు మార్కెట్లు సాధారణ మార్కెట్ ధరల కంటే తక్కువ ధరలకు వస్తువులను విక్రయించగలుగుతాయి.
- వారాంతపు మార్కెట్ చుట్టూ నివసించే ప్రజలు ఈ మార్కెట్ల నుండి తమకు అవసరమైన అన్ని వస్తువులను కొనుగోలు చేస్తారు.
- ఫలితంగా, ఈ మార్కెట్లు చాలామందికి ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఉపాధి అవకాశాలను అందిస్తున్నాయి.
7th Class Social Textbook Page No. 153
ప్రశ్న 10.
సంజు మరియు మను ఒక షాపింగ్ మాలను సందర్శించారు. అది వారు ఇప్పటివరకు సందర్శించిన అత్యంత ఉత్తేజకరమైన మరియు మనోహరమైన ప్రదేశం. అక్కడ తిరుగుతున్న ప్రజలను చూసి వారిద్దరూ ఆశ్చర్యపోయారు. వారు బ్యాటరీతో పనిచేసే కార్లు మరియు బైక్ పై తిరుగుతూ ఆడుకున్నారు. వారు కొంత నగదు చెల్లించి మాల్ అంతటా ఉత్సాహంగా తిరిగారు తరువాత వారి చూపులు రుచికరమైన మరియు విభిన్నమైన వంటకాలపై పడ్డాయి. వారు కాటన్ క్యాండీలు, మిల్క్ షేక్స్ మరియు ఐస్ క్రీంల రుచిని ఆస్వాదించారు. వీటన్నింటికీ వారు డబ్బు చెల్లించారు.
వారు కొత్త బట్టలు, బూట్లు, టోపీలు మరియు బెల్టులను కొన్నారు. వారు చాలా సాఫ్ట్ టాయ్స్ కూడా కొన్నారు. వారు మాల్ లో చాలా సంతృప్తిగా గడిపారు.
పై సన్నివేశం ఆధారంగా క్రింది ప్రశ్నలకు జవాబులు ఇవ్వండి.
1. సంజు మరియు మను మాల్ లో సంతోషంగా గడపడానికి డబ్బు చెల్లించారు. ఎందుకు?
జవాబు:
సంజు మరియు మను మాల్ లో బ్యాటరీతో పనిచేసే కార్లు మరియు బైక్ పై తిరుగుతూ ఆడుకున్నారు. వాటిని వాడుకున్నందుకు డబ్బు చెల్లించారు.
2. సంజు మరియు మను సందర్శించిన మాల్ లో లాగా, అన్ని షాపింగ్ మాల్స్ ఆకర్షణీయమైన ఏర్పాట్లు ఎందుకు చేస్తాయి?
జవాబు:
వినియోగదారులను ఆకర్షించటానికి.
3. సంజు మరియు మనులు కొనుగోలు చేసిన వస్తువుల జాబితాను తయారు చేయండి.
జవాబు:
సంజు మరియు మనులు కొనుగోలు చేసిన వస్తువుల జాబితా : కాటన్ క్యాండీలు, మిల్స్ షేక్స్ మరియు ఐస్ క్రీంలు వంటి తినుబండారాలు, కొత్త బట్టలు, బూట్లు, టోపీలు మరియు బట్టలను, సాఫ్ట్ టాయ్స్ ను కొనుగోలు చేసారు.
ప్రశ్న 11.
బహుళజాతి కంపెనీలు నిర్వహించే షాపింగ్ మాల్స్ రిటైల్ వ్యాపారంపై ఎలాంటి ప్రభావం చూపుతాయని మీరు అనుకుంటున్నారు?
జవాబు:
బహుళజాతి కంపెనీలు నిర్వహించే షాపింగ్ మాల్స్ వల్ల రిటైల్ వ్యాపారం దాదాపు కుదేలయిపోతుంది. కొన్ని సందర్భాలలో రిటైల్ షాపులు మూతపడతాయి కూడా.
7th Class Social Textbook Page No. 157
ప్రశ్న 12.
ఆన్లైన్ మార్కెట్ ద్వారా వస్తువులను ఎలా కొనుగోలు చేస్తావు?
జవాబు:
మనకు కావలసిన వస్తువులను ప్రముఖ ఆన్లైన్ మాధ్యమం అమెజాన్, ఫ్లిప్ కార్ట్ మొదలైన వానిలో ఆర్డర్ (మొబైల్ ఫోన్, ఇంటర్నెట్ కంప్యూటర్ ద్వారా) ఇచ్చి, సదరు వస్తువు యొక్క ధరను క్రెడిట్ / డెబిట్/నెట్ బాంకింగ్ / యూపిఐ ద్వారా కాని చెల్లించి, మన ఇంటి అడ్రసను ఇచ్చినట్లయితే, సదరు E-Commerce , కంపెనీ వారు మనం ఆర్డర్ ఇచ్చిన వస్తువును నిర్దిష్ట పని దినాలలో మని ఇంటికి చేర్చును.
ప్రశ్న 13.
ఆన్లైన్ షాపింగ్ యొక్క ప్రయోజనాలు మరియు ప్రతికూలతలు వ్రాయండి.
జవాబు:
ఆన్ లైన్ షాపింగ్ యొక్క ప్రయోజనాలు :
- మనం ఇంటి దగ్గర ఉండే సరుకులు కొనుగోలు చేయవచ్చు.
- విభిన్నమైన వస్తువులలో (వెరైటీస్) ఎంపిక చేసుకోవచ్చు (వివిధ బ్రాండెడ్ వస్తువులు).
- మన ఇంటి దగ్గరకే సరుకులు డెలివరీ చేయబడును.
- నాణ్యతా ప్రమాణాలు గల వస్తువులు దొరుకును.
- డబ్బులు భౌతికంగా అవసరం లేదు. ఆన్లైన్లోనే చెల్లించవచ్చు (వివిధ రకాల డిజిటల్ మార్గాల ద్వారా).
- కొన్ని సందర్భాలలో తక్కువ ధరకే వస్తువులు దొరుకును.
ఆన్ లైన్ షాపింగ్ యొక్క నష్టాలు :
- స్థానిక, చిన్న వ్యాపారులపై ప్రభావం చూపుతాయి.
- నకిలి E-Commerce వెబ్ సైట్ల వల్ల చాలా నష్టం జరగవచ్చు.
- ఆన్లైన్ నేరాలకు అవకాశం కలదు.
- వస్తువులు మనం ఆన్లైన్లో చూసినట్లుగా ఉండకపోవచ్చు (వస్త్రాలు మొదలైనవి).
- న్యాయ సంబంధమైన విషయాల్లో ఇబ్బంది కల్గవచ్చు.
- దీనికి కచ్చితంగా ఇంటర్నెట్ సదుపాయం మరియు ఫోన్ గాని కంప్యూటర్ గాని కావాలి.
ప్రశ్న 14.
ఆన్లైన్ షాపింగ్ కి చెల్లింపులు ఎలా చేస్తావు?
జవాబు:
ఆన్ లైన్ షాపింగ్ కి డబ్బులు క్రింది విధంగా చేయవచ్చును.
- క్రెడిట్ కార్డు
- డెబిట్ కార్డు
- నెట్ బ్యాంకింగ్
- UPI (Phone pay, Google pay, Amazon pay etc.)
- కొన్ని రకాల గిఫ్ట్ కార్డ్స్ ద్వారా
ప్రశ్న 15.
“ఆన్లైన్ కొనుగోళ్ళు స్థానిక వ్యాపారులపై ప్రభావం చూపుతాయి” ఈ ప్రకటనను అంగీకరిస్తారా? వ్యతిరేకిస్తారా? కారణాలు రాయండి.
జవాబు:
ఆన్లైన్ కొనుగోళ్ళు స్థానిక వ్యాపారులపై ప్రభావం చూపుతాయి అనడానికి నేను అంగీకరిస్తాను. కారణం :
- ఆన్ లైన్ లో అన్ని రకాల ఉత్పత్తులు దొరుకుతాయి. అన్ని బ్రాండ్లు దొరుకుతాయి.
- ఇంట్లోంచి బయటకు వెళ్ళకుండానే ఆర్డర్ చేయవచ్చు.
- డబ్బుల (చిల్లర) సమస్య ఉండదు. ఆన్ లైన్ లో చెల్లించవచ్చు.
7th Class Social Textbook Page No. 159
ప్రశ్న 16.
పై బాలో ఇచ్చిన సమాచారం ఆధారంగా క్రింది ప్రశ్నలకు జవాబులు వ్రాయండి.
ఎ) ఒక చిల్లర వర్తకుడు తన దుకాణానికి కావాల్సిన వస్తువులు ఏ విధంగా పొందుతాడు?
బి) వస్తువుల పంపిణీలో టోకు వర్తకుడు ఎందుకు ముఖ్యమని మీరు అనుకుంటున్నారు?
జవాబు:
ఎ) చిల్లర వర్తకుడు తన దుకాణానికి కావల్సిన వస్తువులను ‘టోకు వర్తకుడు’ లేదా ‘పంపిణీదారుడు’ నుంచి పొందుతాడు.
బి) వస్తువుల పంపిణీలో టోకు వర్తకుడు ముఖ్యమైనవాడు ఎందుకంటే, ఉత్పత్తిదారునికి, చిల్లర వర్తకునికి మధ్య అనుసంధానకర్తగా ఉంటాడు. ఉత్పత్తిదారుడు ఉత్పత్తి చేసిన వస్తువులను మార్కెటింగ్ చేయాలంటే టోకు వర్తకునిది కీలక పాత్ర.
ప్రశ్న 17.
“కుటీర పరిశ్రమలు గ్రామీణ నిరుద్యోగులకు వరం వంటివి.” చర్చించండి.
జవాబు:
- కుటీర పరిశ్రమలు గ్రామీణ నిరుద్యోగులకు వరం లాంటివి. ఇవి తక్కువ పెట్టుబడితో ప్రారంభించవచ్చును.
- వీటి ఉత్పత్తి స్థానికంగా డిమాండ్ ఉన్నదే కాబట్టి మార్కెటింగ్ సులభం.
- కుటీర పరిశ్రమలకు ప్రభుత్వ ప్రోత్సాహం లభిస్తుంది. వీటి ఉత్పత్తులకు మార్కెటింగ్ సౌకర్యం కల్పిస్తుంది.
- ఎక్కువ మంది శ్రామికులతో పని లేదు, ఇంట్లోని వారంతా కలిసి చేసుకోవచ్చు. ముఖ్యంగా మహిళలకు పని కల్పించవచ్చు.
- ముఖ్యంగా ఉద్యోగం కోసం ఒకరిని అడగనక్కర్లేదు. స్వంతంగా మనమే పరిశ్రమ ప్రారంభించవచ్చు.
ప్రశ్న 18.
మీ ప్రాంతంలో ఏవైనా కుటీర పరిశ్రమలు ఉన్నాయా?
జవాబు:
ఉన్నాయి. మా ప్రాంతంలోని కుటీర పరిశ్రమలు :
- చేనేత వస్త్రం తయారీ
- స్టీల్ పాత్రల తయారీ
- బిస్కట్ల తయారీ
- బుట్టల అల్లిక
- లేన్ల అల్లిక
- మగ్గం వర్క్ (డైయింగ్ వర్క్)
- పిండి వంటల తయారీ (స్వగృహ ఫుడ్స్)
- జామ్ తయారీ
- ఇటుకల తయారీ
- హలోబ్రిక్స్ తయారీ
- సిమెంట్ పైపుల తయారీ
- అగరు బత్తీల తయారీ
- విస్తరాకుల తయారీ
- కొవ్వొత్తుల తయారీ
- కుండల తయారీ మొదలైనవి.
7th Class Social Textbook Page No. 161
ప్రశ్న 19.
మీ కుటుంబం యొక్క ఆదాయ వనరు ఏది?
జవాబు:
వ్యవసాయం
ప్రశ్న 20.
ఒక రైతు తన కుటుంబ అవసరాల కోసం డబ్బు ఎలా సంపాదిస్తాడు?
జవాబు:
రైతు తన పొలంలో (రకరకాల) పంటలను వేసి, వాటిని సంరక్షించి, పంట దిగుబడిని మార్కెట్లో అమ్మి డబ్బు సంపాదిస్తాడు.
7th Class Social Textbook Page No. 163
ప్రశ్న 21.
వినియోగదారుల రక్షణ చట్టాల ఉపయోగం ఏమిటి?
జవాబు:
వినియోగదారుల రక్షణ చట్టాల వలన ఉపయోగాలు :
- వినియోగదారుని డబ్బుకు మరియు వస్తువుల నాణ్యత ప్రమాణాలకు రక్షణ/భద్రత కల్పిస్తాయి.
- వినియోగదారుని సార్వభౌమాధికారానికి ఈ చట్టం రక్షణ కల్పిస్తుంది.
- సత్వర, సులభ మరియు చౌకగా రక్షణ / న్యాయం పొందవచ్చును.
- వివిధ రకాలైన అమ్మకందార్ల మోసాల నుంచి వినియోగదారునికి రక్షణ కల్పిస్తాయి.
అన్వేషించండి
7th Class Social Textbook Page No. 149
ప్రశ్న 1.
వివిధ రకాల ఎలక్ట్రానిక్ చెల్లింపుల గురించి మీ ఉపాధ్యాయుని అడగండి.
జవాబు:
ఎలక్ట్రానిక్ చెల్లింపులు:
- నెట్ బ్యాంకింగ్
- UPI (United Payment Interface)
- బ్యాంక్ కార్డ్పు (Debit & Credit cards)
- మొబైల్ వ్యాలెట్స్
- మొబైల్ బ్యాంకింగ్
- AEPS (Aadhaar Enabled Payment System)
- డిజిటల్ పేమెంట్ యాప్స్ మొదలైనవి.
7th Class Social Textbook Page No. 155
ప్రశ్న 2.
తేలియాడే మార్కెట్లను గురించి మరింత సమాచారాన్ని సేకరించి మీ తరగతి గదిలో చర్చించండి.
జవాబు:
శ్రీనగర్, జమ్మూ కాశ్మీర్‌లో తేలియాడే మార్కెట్ :
శ్రీనగర్ లోని అత్యంత సుందరమైన దాల్ సరస్సులో ప్రతిరోజు ఉదయం 5 గంటల నుండి 7 గంటల వరకు కూరగాయల వ్యాపారం పడవల ద్వారా జరుగుతుంది. ఈ పడవలను స్థానిక భాషలో ‘షికారా’ అంటారు. కూరగాయలతోపాటు చెక్కబొమ్మలు, కుంకుమ పువ్వు మరియు ఇతర స్థానిక వస్తువులు కూడా ఈ షికారాల్లో లభిస్తాయి. వివిధ దేశాల పర్యాటకులు ఈ దాల్ సరస్సులో షాపింగ్ చేయడాన్ని ఆనందిస్తారు.
ప్రశ్న 3.
కోవిడ్ 19 మహమ్మారి సమయంలో, చాలా మంది ప్రజలు ఆన్లైన్లో వస్తువులను కొనుగోలు చేశారు. దీనికి గల కారణాలను మీ స్నేహితునితో చర్చించండి.
జవాబు:
కోవిడ్-19 మహమ్మారి సమయంలో ఆన్లైన్లో వస్తువులు కొనుగోలుకు కారణం :
- ఆన్లైన్లో అయితే మిగతా వ్యక్తులతో ప్రత్యక్ష సంబంధం ఉండదు.
- ఆన్లైన్లో అయితే చాలా సురక్షితంగా ఉంటుంది.
- బయట లాక్ డౌన్ విధించి ఉండటం.
- బయటకు వెళ్ళే గుంపుల్లో కలవాల్సిన పని, భౌతికదూరంతో పని ఉండదు.
- ఒకరు తాకిన వస్తువులు మరొకరు తాకాల్సిన అవసరం ఉండదు.
ప్రాజెక్ట్ పని
ప్రశ్న 1.
వివిధ ఈ-కామర్స లను సందర్శించి, కింది వస్తువుల ధరలను సేకరించి, వాటిని ఒకదానితో ఒకటి పోల్చండి.
అ) ల్యాప్టాప్ ఆ) సెల్యులార్ ఫోన్ ఇ జీన్స్ ప్యాంట్స్ ఈ) పెన్నులు ఉ) బొమ్మలు
జవాబు:
విద్యార్థులు స్వయంగా చేయగలరు. క్రింది ఉదాహరణల ఆధారంగా.
ప్రశ్న 2.
వారాంతపు మార్కెట్ ని సందర్శించి, సమాచారాన్ని సేకరించి అక్కడ లభించే వస్తువుల జాబితాను తయారు చేయండి.
జవాబు:
వారాంతపు మార్కెట్లోని వస్తువులు :
- వివిధ రకాల పండ్లు,
- వివిధ రకాల కూరగాయలు,
- వివిధ రకాల దుస్తులు,
- వివిధ రకాల చెప్పులు, బూట్లు,
- వివిధ రకాల పప్పుధాన్యాలు,
- వివిధ రకాల ఆహారధాన్యాలు,
- వివిధ రకాల బుట్టలు, తట్టలు,
- వివిధ రకాల బొమ్మలు,
- వివిధ రకాల వంటపాత్రలు, సామగ్రి,
- వివిధ రకాల వ్యవసాయ పరికరాలు,
- వివిధ రకాల తినుబండారాలు (స్వీట్స్, కారా మొదలైనవి),
- వివిధ రకాల ప్లాస్టిక్ సామాన్లు,
- వివిధ రకాల మట్టి పాత్రలు,
- గొడుగులు, చాపలు, దుప్పట్లు,
- వివిధ రకాలైన హస్తకళా వస్తువులు,
- వివిధ రకాల సుగంధ ద్రవ్యాలు,
- వివిధ రకాల సౌందర్య లేపనాలు,
- వివిధ రకాల ఔషధాలు (ఆయుర్వేదం)
- తేనె, మాంసం.
ప్రశ్న 3.
ఏదైనా షాపింగ్ మాల్ ని సందర్శించి, మీ అనుభవాన్ని క్లుప్తంగా వ్రాయండి.
జవాబు:
విద్యార్థి స్వయంగా సందర్శించగలరు. ఉదాహరణ
నేను గత ఆదివారం మా తల్లిదండ్రులతో కలిసి మా పట్టణంలోని పెద్ద షాపింగ్ మాల్ కి వెళ్ళాను. అక్కడ అన్ని రకాల వస్తువులు ఉన్నాయి. కిరాణా సరుకులు, స్టేషనరీ, కాస్మటిక్స్. బేకరీ, కిచెన్, వస్త్రాలు, ఎలక్ట్రానిక్స్, కూరగాయలు, పండ్లు, మాంసం, నూనెలు, సుగంధ ద్రవ్యాలు, చాక్లెట్స్, షాంపూలు, సబ్బులు మొ||న వస్తు విభాగాలు కలవు. మేము ఆ షాపు అంతా కలియ చూడటానికి దాదాపు 3 గం||ల సమయం పట్టింది. మధ్యలో బేకరీలో పిజ్జా తిన్నాము) మా ఇంటి అవసరాలకు కావల్సిన వస్తువులన్నీ కొనుగోలు చేసి చివరిగా బిల్ కౌంటర్‌లో బిల్లు చెల్లించి, వస్తువులు తనిఖీ చేయించుకుని చివరిగా బయటపడ్డాము.