AP Board 7th Class Telugu Solutions 1st Lesson అక్షరం

SCERT AP Board 7th Class Telugu Solutions 1st Lesson అక్షరం Textbook Questions and Answers.

AP State Syllabus 7th Class Telugu 1st Lesson Questions and Answers అక్షరం

7th Class Telugu 1st Lesson అక్షరం Textbook Questions and Answers

వినడం – అలోచించి మాట్లాడడం

AP Board 7th Class Telugu Solutions 1st Lesson అక్షరం 1
ప్రశ్న 1.
చిత్రంలో ఎవరెవరున్నారు?
జవాబు:
చిత్రంలో తల్లీ, పిల్లలు ఉన్నారు.

ప్రశ్న 2.
తల్లి ఏం చేస్తోంది?
జవాబు:
పిల్లలకు తల్లి చదువు (అక్షరాలు) చెబుతోంది.

ప్రశ్న 3.
పిల్లలు ఏం చేస్తున్నారు?
జవాబు:
తల్లి చెప్పే విషయాలను (అక్షరాలను) జాగ్రత్తగా గమనిస్తున్నారు.

Improve Your Learning (అభ్యసనాన్ని మెరుగుపరచుకుందాం)

ప్రశ్న 1.
ఈ వచనకవితను భావయుక్తంగా చదవండి.
జవాబు:
సూచన : ఉపాధ్యాయుడు చదివే విధానాన్ని గమనించండి. ఆయనతో బాటు చదవండి. కఠిన పదాల ఉచ్చారణ చాలా జాగ్రత్తగా గమనించండి. చదవండి. దోషాలు గుర్తించండి. సవరించుకోండి. పదే పదే చదివి బాగా చదవడం అలవరుచుకోండి.

AP Board 7th Class Telugu Solutions 1st Lesson అక్షరం

ప్రశ్న 2.
మీరు తల్లి దగ్గర ఏమి నేర్చుకున్నారు?
జవాబు:
నాకు మా అమ్మ నడక నేర్పింది. నడత నేర్పింది. మాటలు కూడా మా అమ్మ దగ్గరే నేర్చుకొన్నాను. పళ్లు తోము కోవడం నేర్చుకొన్నాను. స్నానం చేయడం నేర్చుకొన్నాను. అన్నం తినడం నేర్చుకొన్నాను. భయపడకుండా ధైర్యంగా ఉండడం కూడా మా అమ్మ దగ్గరే నేర్చుకొన్నాను. చిన్న చిన్న పనులు చేయడం నేర్చుకొన్నాను. బట్టలు మడత పెట్టడం నేర్చుకొన్నాను. నేను అక్షరాలు వ్రాయడం, చదవడం, అంకెలు వేయడం, వారాల పేర్లు, నెలల పేర్లు, చిట్టీ చిలకమ్మ వంటి పాటలు, అభినయం, శరీరభాగాలు చూపించడం మొదలైనవన్నీ మా అమ్మ దగ్గరే నేర్చుకొన్నాను. ఈ రోజు నేను చేసే ప్రతి పనినీ ప్రాథమిక స్థాయిలో మా అమ్మ దగ్గరే నేర్చుకొన్నాను.

ప్రశ్న 3.
మీ చిన్నప్పటి అనుభవాలను తెల్పండి.
జవాబు:
నా చిన్నతనంలో నాకు తొందరగా నడవడం రాలేదు. మా అమ్మ చేయి పట్టుకొని నడిపించేది. కొన్ని మాటలు పలకడం వచ్చేది కాదు. మా అమ్మ ఆ మాటలను పదేపదే పలికించేది. అలా నేర్పింది. ఒకసారి ఒకటవ తరగతిలో ఒక అబ్బాయి నన్ను కొట్టాడు, దానితో బడికి వెళ్లనని ఏడ్చాను. మా అమ్మ నన్నెంతో బ్రతిమాలింది. అయినా వినలేదు. చివరకు అమ్మ కూడా కొట్టింది. తర్వాత చాక్లెట్లు ఇచ్చి బుజ్జగించింది. నన్ను ఎత్తుకొని కబుర్లు చెబుతూ, నవ్విస్తూ బడికి తీసుకొని వచ్చింది. నన్ను కొట్టిన అబ్బాయితో మాట్లాడింది. కొట్టుకోవడం తప్పని చెప్పింది. వాడికీ చాక్లెట్లు నా చేత ఇప్పించింది. స్నేహంగా ఉండాలని చెప్పింది. అప్పటి నుంచీ ఇద్దరం ప్రాణ స్నేహితులుగా మారిపోయాం . వాడే నా స్నేహితుడు రాము.

ప్రశ్న 4.
కింది దేశభక్తి గేయాన్ని ఆలపించండి. ప్రశ్నలకు జవాబులు రాయండి.
జయము జయము భరతమాత జయము నీకు జగన్మాత
ఈ జగాన సాటి ఎవ్వరే ఓ యమ్మ నీకు
గంగ-యమున గోదారీ సింధు కృష్ణ కావేరీ
బ్రహ్మపుత్ర తుంగభద్ర తపతీ నర్మద పెన్నా
పొంగి పొరలె తరంగాలు నీ మెడలో హారాలు
జీవనదుల కన్నతల్లివే ఓయమ్మ నీవు ||జయము, జయము||

హిమ వింధ్యా పర్వతాలు దేవతలకు నిలయాలు
దట్టమైన అరణ్యాలు మహామునుల స్థావరాలు
పసిడి పంట క్షేత్రాలు పంచలోహ ఖనిజాలు
నిజముగ నువు రత్న గర్భవే ఓయమ్మ నీవు || జయము జయము||

లోకమంత చీకటిలో తల్లడిల్లుతున్నప్పుడు
నాగరికత లేక నరులు పామరులై ఉన్నప్పుడు
వేదాలను వెతికి తెచ్చి జ్ఞాన భిక్ష పెట్టినావు.
నిజముగ నీవు జగద్గురువువే ఓయమ్మ నీవు ||జయము జయము||

ప్రశ్నలు :
అ) మన జీవనదులు ఏవి?
జవాబు:
మన జీవనదులు గంగ, యమున, గోదావరి, సింధు, కృష్ణ, కావేరి, బ్రహ్మపుత్ర, తుంగభద్ర, తపతి, నర్మద, పెన్నా.

ఆ) మహామునుల స్థావరాలు ఏవి?
జవాబు:
దట్టమైన అరణ్యాలు మహామునుల స్థావరాలు.

ఇ) ఎవరికి జయము పలకాలి?
జవాబు:
భరతమాతకు జయము పలకాలి.

ఈ) పై గేయం ఆధారంగా ప్రశ్నలు తయారుచేయండి.
జవాబు:
సూచన : ఒకే ప్రశ్న తయారుచేయమని అడుగుతారు.

  1. భరతమాత మెడలో హారాలుగా వేటిని చెప్పారు?
  2. జీవనదులకు కన్నతల్లి ఎవరు?
  3. దేవతలకు నిలయాలేవి?
  4. రత్నగర్భ అని ఎవరినంటారు?
  5. జ్ఞాన భిక్షను పెట్టినవేవి?
  6. జగద్గురువుగా ఎవరిని పేర్కొన్నారు?

వ్యక్తీకరణ – సృజనాత్మకత

అ) కింది ప్రశ్నలకు నాలుగైదు వాక్యాలలో జవాబులు రాయండి.

ప్రశ్న 1.
అక్షరాలు ఎక్కడ కవాతు చేస్తాయని కవి అన్నాడు?
జవాబు:
అక్షరాలు కవి హృదయంలో కవాతు చేస్తున్నాయి అన్నాడు. తన కనురెప్పలపై కవాతు చేస్తున్నాయి అన్నాడు. తన గుండె నిండా అక్షరాలే ఉన్నాయి అన్నాడు. తను నిద్రపోదామని కళ్లు మూస్తే తన కనురెప్పలపై అక్షరాలు కవాతు చేస్తున్నాయి అన్నాడు. అందుచేత తనకు నిద్రాభంగం కలుగుతోంది అన్నాడు.

AP Board 7th Class Telugu Solutions 1st Lesson అక్షరం

ప్రశ్న 2.
అన్నప్రాసన నాడు జరిగిన సంఘటన గురించి రాయండి.
జవాబు:
అన్నప్రాసన నాడు పెన్ను, పుస్తకాలు, దేవుడి బొమ్మ, బొమ్మ కత్తి, బొమ్మలు మొదలైనవన్నీ కవిగారి చిన్నతనంలో చుట్టూ వేశారు. వాటిలో ఏదో ఒకటి తీయమన్నారు. సహజంగానే ఎర్రగా ఉన్న పెన్ను కవిని ఆకర్షించింది. దానినే తీశాడు. కలం పట్టుకొన్నందుకు వాళ్లమ్మ చాలా ఆనందించింది. బిడ్డను అక్కున చేర్చుకొంది. ఒళ్లంతా ముద్దులు పెట్టుకొంది. తన బిడ్డ కలం చేతబట్టి గొప్ప వాడవుతాడని మురిసిపోయింది.

ఆ) కింది ప్రశ్నలకు 8 నుండి 10 వాక్యాలలో జవాబులు రాయండి.

ప్రశ్న 1.
‘అక్షరం’ గేయం సారాంశాన్ని మీ సొంతమాటల్లో రాయండి.
జవాబు:
కవిగారి హృదయంలో ఎప్పుడూ చదువు గురించే ఆలోచన. నిద్రపోయేటపుడు కూడా అతని కళ్లలో చదువు గురించే కలలు. అందుకే తరచుగా నిద్రాభంగమయ్యేది.

వాళ్లమ్మగారు ఉపాధ్యాయురాలు. అతని కలలు చదువు గురించే ఉండేవి. అన్ని ప్రదేశాలూ చదువుకు స్థావరాలే. – తను నిద్రపోయేటపుడు వాళ్లమ్మ అక్షరాల దుప్పటి కప్పిందేమో అందుకే అతనికి నిద్రలోనూ, మెలకువలోనూ కూడా చదువు ధ్యాసే ఉండేది.

కవి చిన్నతనంలో అన్నప్రాశన చేశారు. ఆ రోజు అతని చుట్టూ చాలా వస్తువులు పెట్టారు. అన్నింటిలో అతనికి ఎర్రగా ఉన్న పెన్ను నచ్చింది. పెన్నునే పట్టుకొన్నాడు. అది చూసి వాళ్లమ్మ చాలా ఆనందించింది. తన .” బిడ్డ బాగా చదువుకొని ప్రపంచాన్ని పరిపాలిస్తాడని మురిసిపోయింది. అతనిని ఒళ్లంతా ముద్దులతో ముంచెత్తింది.

ఆ ముద్దులలో అతనికి అక్షరాల ముద్దరలు ఉన్నట్లు అనిపించేయి. తన ఒంటినిండా చదువుకు సంబంధించిన మంచి మాటలే ఆ ముద్దులలో కనిపించాయి.

ఇప్పుడు ప్రతి అక్షరంలోనూ అమ్మే కనిపిస్తోంది. తనను అక్షరాల రాశిగా చేసిన అమ్మకు తనొక చదువుల సరస్వతిగా మారి తనను తాను సమర్పించుకొన్నాడు.

ప్రశ్న 2.
జీవితంలో చదువు విలువ ఎంత ముఖ్యమో తెల్పండి.
జవాబు:
జీవితంలో చదువు చాలా ముఖ్యమైనది. చదువు వలన వినయం వస్తుంది. దాని వలన గౌరవం పెరుగుతుంది. విద్య, వినయం, గౌరవప్రదమైన ప్రవర్తన వలన మంచి ఉద్యోగం వస్తుంది. దాని వలన ధనం వస్తుంది. దానితో ధర్మాన్ని నిలబెట్టవచ్చు.

మనిషిని మహోన్నతునిగా తీర్చిదిద్దేది చదువు. చదువు వలన జ్ఞానం పెరుగుతుంది. జ్ఞానం వలన గౌరవం పెరుగుతుంది. ధనమును దొంగలు దోచుకొంటారు. అన్నదమ్ములు వాటాలు అడుగుతారు. కాని, చదువును కానీ, దాని వలన వచ్చిన జ్ఞానాన్ని కానీ దొంగలెత్తుకుపోలేరు. ఎవ్వరూ వాటాలు అడగలేరు. అందుచేత ధనం కంటె విలువైనది చదువు.

ధనం ఖర్చు పెడితే తరిగిపోతుంది. సంపదలన్నీ తరిగిపోతాయి. చదువు మాత్రం ఇతరులకు చెప్పే కొలది ” మనకు జ్ఞానం పెరుగుతుంది. అందుకే అన్ని దానాల కంటే విద్యాదానం గొప్పది అంటారు.

ఎవరికైనా అన్నం పెడితే అప్పటికే ఆకలి తగ్గుతుంది. డబ్బిస్తే కొంతకాలమే ఉంటుంది. ఇల్లు కట్టిస్తే కొంత .కాలానికి కూలిపోతుంది. కాని, చదువు చెప్పిస్తే బ్రతకడం తెలుస్తుంది. శరీరంలో బలం కూడా అనారోగ్యాల వలన, కాలక్రమేణా తగ్గవచ్చు. కానీ చదువు విలువ, దాని వలన వచ్చిన తెలివీ పెరుగుతుంది తప్ప తగ్గదు. అందుచేత జీవితంలో అన్నిటికంటే చదువు విలువైనదీ, ముఖ్యమైనది అని చెప్పవచ్చును.

ప్రశ్న 3.
అమ్మ ప్రేమ గురించి మీ మాటల్లో రాయండి.
జవాబు:
అమ్మ ప్రేమతో సమానమైనదేదీ లేదు. తను తినకపోయినా తన పిల్లలకు కడుపునిండా అన్నం పెడుతుంది. తను ఎన్ని కష్టాలనైనా భరిస్తుంది. కానీ, తన పిల్లలకు చిన్న కష్టం కూడా రానివ్వదు. తన పిల్లల కోసం ప్రాణాలైనా అర్పిస్తుంది. తన పిల్లలకు ఎంతో ప్రేమగా ఆటలు నేర్పుతుంది. మాటలు నేర్పుతుంది. చదువు చెబుతుంది. పిల్లలు చెడు మార్గంలోకి వెడుతుంటే మంచి మాటలతో వారిని మంచిదార్లో పెడుతుంది. అనారోగ్యం వస్తే అల్లాడిపోతుంది. పిల్లలు భయపడితే ధైర్యం చెబుతుంది. మారాం చేస్తుంది. బుజ్జగిస్తుంది. తప్పు చేస్తే దండిస్తుంది. బాధపడుతుంటే ఓదారుస్తుంది. పిల్లలకు కావలసినవన్నీ వండి పెడుతుంది. అమ్మ దైవం కంటే గొప్పది. భగవంతుడికైనా కోపం వస్తుందేమో కానీ అమ్మకు కోపం రాదు. అలసట రాదు. నీరసం రాదు. చిరాకు రాదు. అమ్మ ప్రేమ గురించి వ్రాయడానికి పదాలు చాలవు.

భాషాంశాలు

అ) కింది పదాలకు అర్థాలను జతపరచండి.

1. గవాక్షం అ) నేల
2. తావు ఆ) హృదయం
3. గుండె ఇ) కిటికీ
4. ఇల ఈ) స్థానం

జవాబు:

1. గవాక్షం ఇ) కిటికీ
2. తావు ఈ) స్థానం
3. గుండె ఆ) హృదయం
4. ఇల అ) నేల

ఆ) కింద ఇచ్చిన పదాలకు సమానార్థకపదాలు (పర్యాయపదాలు) వాక్యాలలో గుర్తించి రాయండి.

1. శరీర శుభ్రతను పాటించాలి. తనువును ఆరోగ్యంగా ఉంచుకోవాలి.
జవాబు:
కాయం = శరీరం, తనువు

2. నేత్రాలను సురక్షితంగా ఉంచుకోవాలి. నయనాలు లేనిదే లోకాన్ని చూడలేము.
జవాబు:
కన్ను = నేత్రం, నయనం

3. అమ్మను మించిన దైవం లేదు. మాతను పూజించాలి.
జవాబు:
తల్లి = అమ్మ, మాత

ఇ) కింది పదాలలో ప్రకృతి వికృతులను గుర్తించి రాయండి.
AP Board 7th Class Telugu Solutions 1st Lesson అక్షరం 2

ప్రకృతి – వికృతి
1. నిద్ర – నిదుర
2. అంబ – అమ్మ
3. రాత్రి – రాతిరి
4. ముద్ర – ముద్దర
5. అక్షరము – అక్కరము

ఈ) కింది ఖాళీలను సరైన పదాలతో పూరించండి.

1. నేను తల్లిదండ్రులను ఎల్లప్పుడూ గౌరవిస్తాను.
ఎల్లప్పుడూ గౌరవిస్తాను, కొంచెం గౌరవిస్తాను

2. నేను కష్టపడి చదువుతాను.
చదువుతాను, చదవను

3. చేతులు శుభ్రంగా కడుగుతాను.
కడుగుతాను, కడగను

4. మంచి వాళ్ళతో స్నేహం చేస్తాను.
చేస్తాను, చేయను

ఉ) కింది పదాలకు సొంతవాక్యాలు రాయండి.
ఉదా : అక్షరాలు

మన జీవితానికి అక్షరాలు మార్గదర్శకాలు.
1. నిరంతరం = ఎల్లప్పుడు,
నిరంతరం పరిశుభ్రంగా ఉండాలి.

2. అనుబంధం = ఎప్పుడూ ఉండే సంబంధం
మంచివారితో అనుబంధం పెంచుకోవాలి.

3. కంబళి = రగ్గు, దుప్పటి
చలికాలంలో కంబళి కప్పుకోవాలి.

4. నిద్రాభంగం = నిద్రకు ఆటంకం
ఎవ్వరికీ నిద్రాభంగం చేయకూడదు.

5. అక్కున చేర్చుకొను = గుండెకు హత్తుకొను
మదర్ థెరిసా పేద రోగులను అక్కున చేర్చుకొని కాపాడింది.

AP Board 7th Class Telugu Solutions 1st Lesson అక్షరం

ఊ) కింది వాక్యాలు ఆధారంగా మన బంధుత్వాలను గళ్ళలో నింపండి.
AP Board 7th Class Telugu Solutions 1st Lesson అక్షరం 3

అడ్డం :

  1. తల్లికి ఇంకొక పేరు (2)
  2. తల్లిగారి చెల్లిని ఏమని పిలుస్తారు? (3)
  3. తల్లిగారి అక్కను ఏమని పిలుస్తారు? (3)

నిలువు :

  1. తల్లిగారి తల్లిని ఏమని పిలుస్తారు? (3)
  2. తండ్రిగారి తల్లిని ఏమని పిలుస్తారు? (3)
  3. తండ్రిగారి అక్కచెల్లిని ఏమని పిలుస్తారు? (తిరగబడింది) (3)

AP Board 7th Class Telugu Solutions 1st Lesson అక్షరం 4

వ్యాకరణాంతాలు

పూర్వ పదం – పరపదం

అ) కింది వాక్యాలను గమనించండి. గీతగీసిన పదాలను విడదీయండి.

1. దేశమును ప్రేమించుమన్నా మంచి యన్నది పెంచుమన్నా.
2. భద్రాద్రి రామయ్య కళ్యాణం కన్నుల పండువగా జరుగుతుంది.
3. చదువు నేర్పే గురువులకిదే మా వందనం.
4. శ్రీశైల మల్లన్న కోరిన కోర్కెలు తీర్చే దైవం.
5. సింహాద్రి అప్పన్న నమ్మిన భక్తులకు కొండంత అండ.
ఉదా : రామయ్య = రామ + అయ్య
1. ప్రేమించుమన్న = ప్రేమించుము + అన్న
2. పెంచుమన్న = పెంచుము + అన్న
3. గురువులకిదే = గురువులకు + ఇదే
4. అప్పన్న = అప్ప + అన్న
5. మల్లన్న = మల్ల + అన్న

పై ఉదాహరణలను గమనించండి. ఉదాహరణలో రామయ్య అనే పదం ఉంది కదా ! దీనిలో రెండు పదాలు ఉన్నాయి. అవి రామ, అయ్య అనేవి. వీటిలో ‘రామ’ అనేది మొదటి పదం కదా ! దీనినే పూర్వపదం అంటారు.

రెండవ పదం ‘అయ్య’ అనేది. దీనిని పరపదం అంటారు. ఈ రెండు పదాలు (పూర్వపదం, పరపదం) కలయిక వలన ‘రామయ్య’ అనే పదం ఏర్పడింది. ఇదే విధంగా మిగిలిన పదాలు కూడా గమనించండి.

పూర్వ స్వరం – పర స్వరం

ఆ) కింది వాక్యాలను గమనించండి. గీత గీసిన పదాలను విడదీయండి.

1. దేశమంటే మనుషులోయ్ అని గురజాడ అన్నారు.
2. గాంధీజీ లేఖలు మనకందరికీ ఆదర్శం.
3. ప్రపంచమందు భారతీయులు చాలా దేశాల్లో ఉన్నారు.
4. అల్లూరి, టంగుటూరి వంటి వారంతా స్వాతంత్ర్య సమరయోధులు.
5. అమూల్యమైన పుస్తకాలకు నిలయం గ్రంథాలయం.
ఉదా : దేశమంటే = దేశము + అంటే

పై ఉదాహరణలో పూర్వపదం చివరలో ఉన్న ‘ము’ ను విడదీస్తే ‘మ్ + ఉ’ = ‘ము’. ఇలా పూర్వపదం చివర ఉన్న ‘ఉ’ అనే అచ్చును పూర్వస్వరం అంటారు. పరపదమైన ‘అంటే’ అనే పదంలోని మొదటి అచ్చు ‘అ’. దీనినే పరస్వరం అని అంటారు. అచ్చులను స్వరాలు / ప్రాణాలు / నాదాలు అని కూడా అంటారు.

కింది పదాలను గమనించండి. పూర్వ పర స్వరాలను గుర్తించి రాయండి.
AP Board 7th Class Telugu Solutions 1st Lesson అక్షరం 5

సంధి

ఇ) కింది వాక్యాలను చదవండి.

1. కృష్ణుడతడు మహాభారతానికి సూత్రధారి.
2. దుర్యోధనుడెక్కడ అంటూ భీముడు గర్జించాడు.
3. సీత పుట్టినింటికి మెట్టినింటికి పేరు తెచ్చింది.
4. చిన్నదైన ఉడుత రామునికి సాయం చేసింది.

ఈ) గీత గీసిన పదాలను విడదీయండి. కలిసినప్పుడు జరుగుతున్న మార్పులను గమనించండి.
ఉదా : కృష్ణుడతడు = కృష్ణుడు + అతడు.

1. దుర్యోధనుడెక్కడ = ‘దుర్యోధనుడు + ఎక్కడ (డ్ + ఉ + ఎ = డె)
2. పుట్టినింటికి = పుట్టిన + ఇంటికి (న్ + అ + ఇ = ని)
3. మెట్టినింటికి = మెట్టిన . + ఇంటికి (న్ + అ + ఇ = ని)
4. చిన్నదైన = చిన్నది + ఐన (దే + ఇ + ఐ = దై)
5. చూసినవన్నీ = చూసినవి +. అన్నీ . (వ్ + ఇ + అ = వ)

పై ఉదాహరణలో పూర్వస్వరం (ఉ), పరస్వరం (అ) కలిశాయి. ఆ రెంటికి బదులుగా పరస్వరం (అ) ఒక్కటే వచ్చి ముందు ఉన్న హల్లు (డ్)తో కలిసింది. ‘డె’ ఏర్పడింది కదా ! దీనికే ‘సంధి’ అని పేరు. మిగిలిన ఉదాహరణలలోని మార్పులను కూడా
2) న్ + అ + ఇ = ని
3) న్ + అ + ఇ = ని
4) దే + ఇ + ఐ = దై
5) వ్ + ఇ + అ = వ – లను గమనించండి. అవగాహన చేసుకోండి.

AP Board 7th Class Telugu Solutions 1st Lesson అక్షరం

ఉ) కింది పదాలను విడదీసి రాయండి.
ఉదా : అక్షరాలంటని = అక్షరాలు + అంటని
1. కప్పిందేమో = కప్పింది + ఏమో
2. బాగుందని = బాగుంది + అని
3. మరేమివ్వగలరు = మరి + ఏమి + ఇవ్వగలరు

ఊ) కింది పదాలను కలిపి రాయండి.
ఉదా : అక్షరాన్ని + అవ్వడం = అక్షరాన్నవ్వడం
1. ముద్దర్లు + ఉన్నట్లు = ముద్దర్లున్నట్లు
2. దున్నుతాడు . + అని = దున్నుతాడని
3. చుట్టూరు + ఏసి = చుట్టూరేసి

ద్వితీయా విభక్తి

ఋ) కింది పట్టికను గమనించండి. వాక్య రూపంలో రాయండి.

లక్ష్మణుడు

(ని/ను)

కాపాడాలి
దేవుడు గౌరవించాలి
చెట్లు భార్య ఊర్మిళ
తల్లిదండ్రులు నమ్మేవారు ఆస్తికులు
పర్యావరణం నరకవద్దు

ఉదా :
లక్ష్మణుని భార్య ఊర్మిళ

1. దేవుని నమ్మేవారు ఆస్తికులు.
2. చెట్లను నరకవద్దు.
3. తల్లిదండ్రులను గౌరవించాలి.
4. పర్యావరణమును కాపాడాలి.

పై ఉదాహరణ వాక్యాల్లో ‘ని-ను’ అనే విభక్తి ప్రత్యయాలు వాక్యాలను అర్థవంతం చేశాయి. ఇలా వాక్యంలోని పదాల మధ్యన చేరే నిన్, నున్, లన్, కూర్చి, గురించి అనే ప్రత్యయాలను ద్వితీయావిభక్తి అంటారు. సాధారణంగా కర్మను గురించి తెలియజేసే సందర్భంలో ద్వితీయా విభక్తి ప్రత్యయాలను ఉపయోగిస్తాం.

ప్రాజెక్టుపని

అక్షరం/ అమ్మకు సంబంధించిన పాటలను సేకరించండి. తరగతి గదిలో పాడండి.
జవాబు:
పల్లవి :
అమ్మను మించి దైవమున్నదా
ఆత్మను మించి అద్దమున్నదా
అమ్మను మించి దైవమున్నదా
ఆత్మను మించి అద్దమున్నదా
జగమే పలికే శాశ్వత సత్యమిదే
అందరినీ కనే శక్తి అమ్మ ఒక్కతే
అవతార పురుషుడైనా
ఓ అమ్మకు కొడుకే
అందరినీ కనే శక్తి అమ్మ ఒక్కతే
అవతార పురుషుడైనా
ఓ అమ్మకు కొడుకే

చరణం -1:
రఘురాముడి లాంటి కొడుకు ఉన్నా
తగిన కోడలమ్మ లేని లోటు తీరాలి.
సుగుణరాశి సీతలాగా తాను
కోటి ఉగాదులే నా గడపకు తేవాలి.
మట్టెలతో నట్టింట్లో తిరుగుతుంటే
మట్టెలతో నట్టింట్లో తిరుగుతుంటే
ఈ లోగిలి కోవెలగా మారాలి
అమ్మను మించి దైవమున్నదా
ఆత్మను మించి అద్దమున్నదా
జగమే పలికే శాశ్వత సత్యమిదే
అందరినీ కనే శక్తి అమ్మ ఒక్కతే
‘అవతార పురుషుడైనా – ఓ అమ్మకు కొడుకే

చరణం -2:
తప్పటడుగులేసిన చిననాడు
అయ్యో తండ్రీ అని గుండెకద్దుకున్నావు
తప్పటడుగులేస్తే ఈనాడు
నన్ను నిప్పుల్లో నడిపించు ఏనాడు
నింగికి నిచ్చెనలేసే మొనగాడినే
ఐనా నీ ముంగిట అదే అదే పసివాడినే

గానం : ఎస్.పి. బాలు, పి. సుశీల
రచన : డాక్టర్ సి. నారాయణ రెడ్డిగారు

నీతి పద్యం
ఆ||వె||
అమ్మయనెడి రెండు అక్షరములె గాని
అందులోని మహిమకంతు లేదు
అమ్మ మాట మధురమానంద భరితమౌ
అంతు లేని ప్రేమ అమ్మ ప్రేమ

భావం :
అమ్మ అనేది రెండక్షరాల మాట. కాని, అందులో చాలా .మహిమ ఉంది. అమ్మ మాట మధురంగా ఉంటుంది. అమ్మ మాట వింటే చాలా ఆనందం కల్గుతోంది. అమ్మ ప్రేమ అంతులేనిది.

మీకు తెలుసా?

కవాతు :
సైనికులు బృందంగా క్రమశిక్షణతో లయబద్ధంగా నడిచే పద్ధతి ‘కవాత్’ అని అంటారు. ఒక మార్గంలో అందరూ కలిసి ఒకేసారి కదలడం (పాద విన్యాసం). కవాతు నిర్వహించడం ద్వారా సైనికుల నిబద్ధత తెలుస్తుంది.

అన్న ప్రాశన :
శిశువుకు మొదటిసారి అన్నం తినిపించే తంతు. దీని వలన శిశువుకు ఆయువు, తేజస్సు అభివృద్ధి చెందుతాయి. అన్నప్రాశన రోజు శిశువు ముందు బంగారు నగలు, డబ్బు, పుస్తకాలు, పెన్ను, కత్తి, పూలు మొదలైన వస్తువులను పెడతారు. శిశువు ఏ వస్తువును తాకుతాడో ఆ వస్తువుతో సంబంధమైన జీవనోపాధి లభిస్తుందని ఒక నమ్మకం.

AP Board 7th Class Telugu Solutions 1st Lesson అక్షరం

ఉపాధ్యాయులకు సూచనలు

* కన్నబిడ్డలను కంటికి రెప్పలాగా కాపాడుకొనే అమ్మను ఎలా గౌరవించాలో, వృద్ధాప్యంలో ఎలా చూసుకోవాలో విద్యార్థులకు వివిధ రూపాలలో వివరించగలరు.
జవాబు:
అమ్మను గౌరవించడం, వృద్ధాప్యంలో చూసుకోవడం గురించి కథలు, నాటికలు, సంభాషణలు మొదలైన వాటి ద్వారా చెప్పవచ్చు.
ఉదా : కథ

అమ్మప్రేమ
రామాపురం అనే గ్రామంలో సీతమ్మ, రామయ్య అనే వృద్ధ దంపతులు ఉండేవారు. వారికి ముగ్గురు కొడుకులు. రామయ్య చాలా ఆస్తి, డబ్బు, బంగారం సంపాదించాడు. ఒకరోజు రామయ్యకు జబ్బు చేసింది. మరణించాడు. ముగ్గురు కొడుకులు ఆస్తిని, డబ్బును, బంగారాన్ని సమానంగా పంచేసుకున్నారు. తల్లికి చిల్లిగవ్వ ఇవ్వలేదు. ఆమె చేత సంతకాలు పెట్టించేసి ఇంటిని కూడా లాగేసుకున్నారు. ఆమెను ఇంటిలోంచి గెంటేశారు. ఊరి చివర స్మశానంలో పాక వేశారు. ఆమెకు కొంత పిండి, నూనె, సరుకులు ఇచ్చారు.

సీతమ్మకు అట్లంటే చాలా ఇష్టం. తనూ, తన భర్తా రోజూ అట్లు వేసుకొని తినేవారు. పిల్లలకు కూడా రోజూ పెట్టేది. ఈరోజు తన అట్లు తినేవారు లేరని బాధపడింది. ముగ్గురు కోడళ్లకు వంట సరిగ్గా రాదు. రోజు తనే వండి పెట్టేది. ఇంటెడు చాకిరీ చేసేది. అయినా జాలి కూడా లేకుండా గెంటేశారు. సీతమ్మ తన బిడ్డలకు భోజనాలు ఎలా ? అనే బాధ పడింది.

ఆ రాత్రి నిద్ర పట్టలేదు. టైమెంతయిందో తెలీదు. అట్లు వేద్దామనుకుంది. స్నానం చేసింది. పొయ్యి వెలిగించింది. అట్లు వేస్తోంది. అంతలో ముగ్గురు చిన్నపిల్లలు వచ్చారు. “అట్లు పెట్టవా ? మామ్మా !” అని అడిగారు. చిన్నప్పటి తన పిల్లలే గుర్తు వచ్చారు. కళ్లు చెమర్చాయి. కళ్లు తుడుచుకుంది.

“తప్పకుండా పెడతాను. రండమ్మా !” అని ఆప్యాయంగా పిలిచింది. వేసిన అట్లన్నీ తినేశారు. తృప్తిగా చూసింది. “మరి నీకో!” అన్నారు. “మీరు తింటే నా కడుపు నిండిపోతుందర్రా !” “ఇంకా కావాలా?” అంది. “వద్దు! మామ్మా ! చాల్చాలు,” అని నవ్వుతూ “డబ్బులిమ్మంటావా?” అన్నారు. “ఛీ ! ఛీ ! డబ్బులా? వద్దు ! వద్దు ! మీరు నా మనవలు”, అంది. ” “రోజూ పెడతావా?” అన్నారు. “తప్పకుండా పెడతాను. రండి !” అంది.

వాళ్లు ముగ్గురూ మూడు చేతి సంచులు ఆమె పక్కన పెట్టి వెళ్లిపోయేరు. తర్వాత చూసుకొంది. వాటి నిండా బంగారం, వజ్రాలు, డబ్బులు ఉన్నాయి. పిల్లలు మరిచిపోయేదేమో అనుకొంది.

మర్నాడు రాత్రి మళ్లీ వచ్చారు. సంచుల గురించి అడిగింది. తామే ఇచ్చామన్నారు. ఇలా కొన్నాళ్లు సాగేటప్పటికి సీతమ్మకు అక్కడే ఒక పెద్దమేడను కట్టించి ఇచ్చారు. ఆ పిల్లలు, దానిలో అన్ని సదుపాయాలు కల్పించారు. ఈ విషయం కొడుకులకు తెలిసింది. భార్యలతో వచ్చేశారు. సీతమ్మ చాలా ఆనందించింది. అసలు విషయం చెప్పింది. దానితో వాళ్లకి ఆశ పెరిగిపోయింది. మర్నాడు రాత్రి సీతమ్మను గదిలో పెట్టి తలుపేసేశారు. కోడళ్లు పొయ్యి వెలిగించారు. ముగ్గురు పిల్లలూ వచ్చారు. అట్లడిగారు. డబ్బులిస్తేనే పెడతామన్నారు. సీతమ్మ గురించి అడిగారు. లేదన్నారు. వాళ్లకు కోపం వచ్చింది. అవి దెయ్యాలు, తమ నిజ స్వరూపాలు చూపించాయి.

కొడుకుల్నీ, కోడళ్లనీ చితకబాదేశాయి. సీతమ్మను విడిపించాయి. ఆమె మంచితనాన్ని, గొప్పతనాన్ని వాళ్లకు ఆ దెయ్యాలు మూడు చెప్పాయి. ఇటు పైన తల్లిని నిర్లక్ష్యం చేస్తే తమ తడాఖా చూపిస్తామన్నాయి. అప్పటి నుండి ముగ్గురు కొడుకులూ, కోడళ్లూ సీతమ్మను చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నారు. అందరూ ఆనందంగా కలిసి మెలిసి ఉంటున్నారు. దెయ్యాలు కూడా గుర్తించిన తమ తల్లి గొప్పతనాన్ని తాము గుర్తించలేనందుకు వాళ్లు రోజూ బాధపడతారు, సిగ్గుపడుతున్నారు.

రామయ్య చాలా ఆస్తి, డబ్బు, బంగారం సంపాదించాడు. ఒకరోజు రామయ్యకు జబ్బు చేసింది. మరణించాడు. ముగ్గురు కొడుకులు ఆస్తిని, డబ్బును, బంగారాన్ని సమానంగా పంచేసుకున్నారు. తల్లికి చిల్లిగవ్వ ఇవ్వలేదు. ఆమె చేత సంతకాలు పెట్టించేసి ఇంటిని కూడా లాగేసుకున్నారు. ఆమెను ఇంటిలోంచి గెంటేశారు. ఊరి చివర స్మశానంలో పాక వేశారు. ఆమెకు కొంత పిండి, నూనె, సరుకులు ఇచ్చారు.

సీతమ్మకు అట్లంటే చాలా ఇష్టం. తనూ, తన భర్తా రోజూ అట్లు వేసుకొని తినేవారు. పిల్లలకు కూడా రోజూ పెట్టేది. ఈరోజు తన అట్లు తినేవారు లేరని బాధపడింది. ముగ్గురు కోడళ్లకు వంట సరిగ్గా రాదు. రోజు తనే వండి పెట్టేది. ఇంటెడు చాకిరీ చేసేది. అయినా జాలి కూడా లేకుండా గెంటేశారు. సీతమ్మ తన బిడ్డలకు భోజనాలు ఎలా? అనే బాధ పడింది.

ఆ రాత్రి నిద్ర పట్టలేదు. టైమెంతయిందో తెలీదు. అట్లు వేద్దామనుకుంది. స్నానం చేసింది. పొయ్యి వెలిగించింది. అట్లు వేస్తోంది. అంతలో ముగ్గురు చిన్నపిల్లలు వచ్చారు. “అట్లు పెట్టవా ? మామ్మా !” అని అడిగారు. చిన్నప్పటి తన పిల్లలే గుర్తు వచ్చారు. కళ్లు చెమర్చాయి. కళ్లు తుడుచుకుంది.

“తప్పకుండా పెడతాను. రండమ్మా !” అని ఆప్యాయంగా పిలిచింది. వేసిన అట్లన్నీ తినేశారు. తృప్తిగా చూసింది. “మరి నీకో!” అన్నారు. “మీరు తింటే నా కడుపు నిండిపోతుందర్రా !” “ఇంకా కావాలా?” అంది. “వద్దు! మామ్మా ! చాల్చాలు,” అని నవ్వుతూ
“డబ్బులిమ్మంటావా?” అన్నారు.
“ఛీ! ఛీ ! డబ్బులా ? వద్దు ! వద్దు ! మీరు నా మనవలు”, అంది.
“రోజూ పెడతావా?” అన్నారు.
“తప్పకుండా పెడతాను. రండి !” అంది.

వాళ్లు ముగ్గురూ మూడు చేతి సంచులు ఆమె పక్కన పెట్టి వెళ్లిపోయేరు. తర్వాత చూసుకొంది. వాటి నిండా బంగారం, వజ్రాలు, డబ్బులు ఉన్నాయి. పిల్లలు మరిచిపోయేరేమో అనుకొంది. మర్నాడు రాత్రి మళ్లీ వచ్చారు. సంచుల గురించి అడిగింది.

తామే ఇచ్చామన్నారు. ఇలా కొన్నాళ్లు సాగేటప్పటికి సీతమ్మకు అక్కడే ఒక పెద్దమేడను కట్టించి ఇచ్చారు. ఆ పిల్లలు, దానిలో అన్ని సదుపాయాలూ కల్పించారు. ఈ విషయం కొడుకులకు తెలిసింది. భార్యలతో వచ్చేశారు. సీతమ్మ చాలా ఆనందించింది. అసలు విషయం చెప్పింది. దానితో వాళ్లకి ఆశ పెరిగిపోయింది. మర్నాడు రాత్రి సీతమ్మను గదిలో పెట్టి తలుపేసేశారు. కోడళ్లు పొయ్యి వెలిగించారు. ముగ్గురు పిల్లలూ వచ్చారు. అట్లడిగారు. డబ్బులిస్తేనే పెడతామన్నారు. సీతమ్మ గురించి అడిగారు. లేదన్నారు. వాళ్లకు కోపం వచ్చింది. అవి దెయ్యాలు, తమ నిజ స్వరూపాలు చూపించాయి.

కొడుకుల్నీ, కోడళ్లనీ చితకబాదేశాయి. సీతమ్మను విడిపించాయి. ఆమె మంచితనాన్ని, గొప్పతనాన్ని వాళ్లకు . ఆ దెయ్యాలు మూడు చెప్పాయి. ఇటుపైన తల్లిని నిర్లక్ష్యం చేస్తే తమ తడాఖా చూపిస్తామన్నాయి. అప్పటి నుండి ముగ్గురు కొడుకులూ, కోడళ్లూ సీతమ్మను చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నారు. అందరూ ఆనందంగా కలిసి మెలిసి ఉంటున్నారు. దెయ్యాలు కూడా గుర్తించిన తమ తల్లి గొప్పతనాన్ని తాము గుర్తించలేనందుకు వాళ్లు రోజూ బాధపడతారు, సిగ్గుపడుతున్నారు.

కవి పరిచయం

కవి పేరు : రావినూతల ప్రేమ కిషోర్
జననం : ప్రకాశం జిల్లాలోని కొండపి గ్రామంలో 1-8-1965న జన్మించారు.
తల్లిదండ్రులు: మరియమ్మ, అంకయ్య అనే పుణ్యదంపతులు
విద్య : 1 నుండి 7వ తరగతి వరకు – కొండపి గ్రామంలో 8 నుండి 10వ తరగతి వరకు – కందుకూరులో ఇంటర్మీడియట్ ఉలవపాడులో బి.ఎ, యమ్.ఎ (హిస్టరీ) – ఒంగోలులో చదివారు.
భార్య : అపరంజిని
సంతానం : ప్రేమ సాత్విక్, ప్రేమ సాదృశ్య

రచనలు : శ్రమవద్గీత, అజమాయిషీ, నిశి, రెక్కల పుడమి, ఇంకుచుక్క నిశ్శబ్ద గాయం , టామి, కల్లందిబ్బ మొదలైన 40 రచనలు చేశారు.

అవార్డులు : వీరు రాసి నటించిన నాటికలకు రాష్ట్ర, రాష్ట్రతర ప్రదేశాలలో అనేక ఉత్తమ అవార్డులు, ప్రశంసలు లభించాయి. ప్రస్తుత పాఠ్యాంశం ‘నలుగురమవుదాం’ అనే కవితా సంపుటిలోనిది. , 7.10.2019న స్వర్గస్తులయ్యారు.

పద్యాలు – అర్థాలు – భావాలు

1. నా గుండె గవాక్షాల్లోనే కాదు
మూసిన నా కనురెప్పలపై కూడా
అక్షరాలు కవాతు చేస్తుంటాయ్
నిరంతరం నిద్రాభంగం చేస్తుంటాయ్
కలలు రాలని రాత్రి
నా కంటికి, ఒంటికి లేవుగా ….
ఎంతైనా
పంతులమ్మగారి బుజ్జోణ్ణి
ఆ మాత్రం అక్షరానుబంధం ఉండదా… !?
నిద్ర పోయేటప్పుడు
అమ్మ అచ్చరాల కంబళి కప్పిందేమో.

అర్థాలు:
గవాక్షం : కిటికీ
కవాతు : (సైన్యము చేయు) కసరత్తు
నిరంతరం = ఎల్లప్పుడు
నిద్రాభంగం = నిద్రకు ఆటంకం
తావు = ప్రదేశం
కంబళి – దళసరి దుప్పటి (లేదా) రగ్గు

భావం:
నా హృదయంలోనే కాదు. నేను కళ్లు మూసినా నా కనురెప్పలపై అక్షరాలే కసరత్తు చేస్తుంటాయి. ఆ అక్షరాల అలజడిలో నాకు నిద్రాభంగం కలుగుతుంది. అంటే నా హృదయంలో ఎప్పుడూ చదువు గురించే ఆలోచన. నేను నిద్రపోతున్నా చదువు గురించే ఆలోచిస్తాను. నాకు కలలు రాని అక్షరాలంటని తావు రాత్రి లేదు. అక్షరాలు తాకని ప్రదేశం లేదు. మా అమ్మ పంతులమ్మ (ఉపాధ్యాయురాలు). నేను ఆమె ముద్దుల కొడుకుని కాబట్టి నాకు పగలూ, రాత్రీ చదువే లోకం. నేను నిద్రపోయేటపుడు అమ్మ అక్షరాల దుప్పటి కప్పిందేమో ! అందుకే నా కలలన్నీ చదువు గురించే, అని కవిగారు అన్నారు.

AP Board 7th Class Telugu Solutions 1st Lesson అక్షరం

2. చిన్నప్పుడు అన్నప్రాసననాడు
తలావొకటి నా చుట్టూరేసి
పట్టుకోమన్నప్పుడు
ఎర్రగా బాగుందని పెన్ను పట్టుకుంటే
అమ్మ అక్కున చేర్చుకుని
కలంపట్టిన బిడ్డ ఇలను దున్నుతాడని
ఆనందంతో
ఒళ్ళంతా ముద్దుల్లో నింపిందట
అమ్మ ముద్దులో
అక్షరాల ముద్దర్లున్నట్టుంది
ఒంటినిండా అచ్చరాల సుద్దలే….
ఇప్పుడు
ప్రతి అక్షరంలోనూ అమ్మే కన్పిస్తుంది
నన్నో అక్షరాల పుట్టని చేసిన
అమ్మకు అక్షరాన్నవ్వడం మినహా
మరేమివ్వగలను?

అర్థాలు:
అన్నప్రాశన = ‘చంటి పిల్లలకు తొలిసారి అన్నం తినిపించే వేడుక
చుట్టూరేసి = చుట్టూ పెట్టి
అక్కున చేర్చుకోవడం = అభిమానంతో గుండెలకు హత్తుకోవడం
ఇల = భూమి
ముద్దర్లు = ముద్దరలు, గుర్తులు
అచ్చరాలు = అక్షరాలు
(సుద్దలు) సుద్దులు = సూక్తులు, మంచిమాటలు
అక్షరాల పుట్ట = అక్షరాల రాశి
మినహా = తప్పించి

భావం:
అన్నప్రాశన నాడు తనచుట్టూ ఉన్నవాటిలో ఎర్రగా ఉన్న పెన్నును పట్టుకొన్నాడు. వాళ్ళమ్మ గారు చాలా ఆనందించింది. బిడ్డను అక్కున చేర్చుకొంది. ఆ బిడ్డ బాగా చదువుకొని భూమిని పరిపాలిస్తాడని భావించి బిడ్డను ముద్దులలో ముంచెత్తింది. అమ్మ ముద్దులలో కూడా కవికి అక్షరాల గుర్తులే కనిపించాయి. చదువు గురించిన మంచిమాటలే కనిపించాయి. అందుకే కవికి ప్రతి అక్షరంలోనూ అమ్మే కనిపించింది. తన తల్లి తనను అక్షరాల రాశిగా చేసిందని కవి భావించాడు. తనొక అక్షరంగా (విజ్ఞానఖనిగా) మారి తనను తాను అమ్మకు సమర్పించు కోవాలని కవి భావించాడు.

AP Board 7th Class Telugu Solutions 1st Lesson అక్షరం

బాల్యంలో మనకు అమ్మ ఎన్నో సేవలు చేసింది కదా ! ఇప్పుడు మీరు అమ్మకు ఎలాంటి సేవలు చేయగలరో చర్చించండి.
జవాబు:
రాము : కిరణ్ ! అమ్మ మనకు చాలా సేవలు చేసింది కదా ! .
కిరణ్ : ఇప్పటికీ చేస్తోంది కదా ! వంట చేస్తోంది. మనకు పెడుతోంది. చదువు చెబుతోంది.
లత : నిజమే ! బట్టలు ఉతుకుతోంది. బూట్లు కూడా శుభ్రం చేస్తోంది.
రాము : నేను మాత్రం అమ్మకు అన్ని పనులలో సహాయం చేస్తాను.
కిరణ్ : అమ్మకు, నీళ్లుపట్టడంలోను, సామాన్లు సర్దడంలోనూ సహాయపడతాను.
లత : నేను కూడా ఇల్లు శుభ్రం చేయడంలోనూ, బట్టలు ఉతకడంలోనూ, సామాన్లు శుభ్రం చేయడంలోనూ సహాయపడతాను.
రాము, కిరణ్, లత : ఈ రోజు నుండీ అమ్మకు అన్ని పనులలోనూ మనందరం సహాయపడదాం.

సారాంశం

కవి తనకు అక్షరాలతో ఉన్న అనుబంధాన్ని గురించి వివరిస్తున్నాడు.

తన హృదయంలో నిరంతరం చదువు గురించే ఆలోచన అని కవిగారు చెప్పారు. తనకు కళ్లు మూసినా తెరిచినా అక్షరాలే కనిపిస్తుంటాయి అని అన్నారు. తనకు నిద్రను కూడా పట్టనివ్వనంతగా తన ధ్యాసంతా ! చదువుపైనే అని కవిగారు చెప్పారు.

నిద్రించని తనకు కలలు రావన్నారు. చదువులేని ప్రదేశమేదీ తన కంటికీ, ఒంటికీ. లేదన్నారు.

తను పంతులమ్మగారి అబ్బాయి కనుక తనకు అక్షరాలతో అనుబంధం ఏర్పడిందన్నారు. నిద్రపోయేటపుడు తనకు వాళ్లమ్మగారు అక్షరాల దుప్పటి కప్పినందు వలననే తనకు పగలూ రాత్రీ చదువు ధ్యాసేనని చమత్కరించారు.

అక్షరం చిన్నతనంలో అన్నప్రాశననాడు చాలా వస్తువులు చుట్టూ పెట్టారు. కవిగారు ప్రాకుతూ వెళ్లి కలం పట్టుకున్నారట. దానితో వాళ్లమ్మగారు చాలా సంతోషించారు. తనను అక్కున చేర్చుకొన్నారుట. కలం పట్టినవాడు తన జ్ఞానంతో ఇలను దున్నుతాడని సంతోషించారు. బుల్లి కవిగారిని ఒళ్లంతా ముద్దులతో నింపారుట.

అమ్మ పెట్టిన ముద్దులలో కూడా అక్షరాల ముద్దరలున్నాయి. ఒంటినిండా’ అక్షరాల గుసగుసలే. కవిగారికి ! ప్రతి అక్షరంలోనూ వాళ్లమ్మగారే కనిపిస్తున్నారు. తననో చదువుల పుట్టను చేసిన తన తల్లికి తానొక జ్ఞానమూర్తిగా (అక్షరంగా) మారి తనను తాను సమర్పించుకోవడం తప్ప, ఏమివ్వగలనని చెప్పారు.