SCERT AP 8th Class Biology Study Material Pdf 5th Lesson కౌమార దశ Textbook Questions and Answers.
AP State Syllabus 8th Class Biology 5th Lesson Questions and Answers కౌమార దశ
8th Class Biology 5th Lesson కౌమార దశ Textbook Questions and Answers
అభ్యసనాన్ని మెరుగుపరచుకుందాం
ప్రశ్న 1.
బాల్యావస్థ కౌమార దశ కంటే ఏ విధంగా భిన్నమైనది ?
జవాబు:
- బాల్యావస్థలో శరీర అభివృద్ధి ఎక్కువగా జరుగుతుంది.
- కానీ కౌమార దశలో ఇది అత్యంత ఎక్కువ స్థాయికి వెళ్తుంది.
- అంతేకాక మానసిక ఎదుగుదల, భావోద్వేగాలు ఎక్కువగా వ్యక్తమవుతాయి.
- బాల్యావస్థలో ఉన్న ఆధారపడే మనస్తత్వం (తల్లి, తండ్రి, అక్క, అన్నల మీద) కౌమార దశలో తగ్గుతుంది.
- కౌమార దశలో వ్యక్తిగత శ్రద్ధ, స్వయంగా నా పనులు నేను చూసుకోగలననే అభిప్రాయం పిల్లలలో వ్యక్తమవుతుంది.
- ఇలా శారీరక, మానసిక, భావోద్వేగాల వ్యక్తీకరణలో బాల్యావస్థ కౌమార దశ కన్నా భిన్నమైనదని చెప్పవచ్చు.
ప్రశ్న 2.
క్లుప్తంగా రాయండి.
(i) ద్వితీయ లైంగిక లక్షణాలు
(ii) ఆడమ్స్ యాపిల్
జవాబు:
(i) ద్వితీయ లైంగిక లక్షణాలు:
- కౌమార దశలో, హార్మోనుల ప్రభావం వల్ల శరీరంలో వచ్చే ముఖ్య లక్షణాలను ద్వితీయ లైంగిక లక్షణాలు అంటారు.
- మగపిల్లలలో నూనుగు మీసాలు, గడ్డం రావటం, గొంతు బొంగురుగా మారటం.
- ఆడపిల్లలలో నాజూకుతనం మొదలైనవి.
- లైంగిక అవయవ వ్యవస్థలో పరిపక్వతకు వస్తాయి.
- బాహు మూలాల్లో వెంట్రుకలు పెరుగుతాయి.
(ii) ఆడమ్స్ యాపిల్ :
- గొంతు దగ్గర ముందుకు పొడుచుకు వచ్చినట్లుగా ఉన్న థైరాయిడ్ మృదులాస్థి ఎముకను ‘ఆడమ్స్ యాపిల్’ అంటారు.
- ఈ ‘ఆడమ్స్ యాపిల్’ మన స్వరపేటిక (Larynx) యొక్క పాక్షిక పెరుగుదల వలన పెరుగుతుంది.
- కౌమారదశలో థైరాయిడ్ మృదులాస్థి పెరగటం వల్ల ‘ఆడమ్స్ యాపిల్’ ఏర్పడుతుంది.
- ఇది మగపిల్లలలో ఒకానొక ద్వితీయ లైంగిక లక్షణం.
ప్రశ్న 3.
కౌమార దశలో మానవ శరీరంలో జరిగే మార్పుల జాబితా రాయండి.
జవాబు:
1. ‘కౌమార దశ’ ప్రతి మానవునిలో 13-19 సం||ల మధ్య వచ్చే ముఖ్యమైన దశ.
2. దీని వల్ల మానవ శరీరంలో
ఎ) కండరాలు, ఎముకల అభివృద్ధి ఎక్కువ జరుగుతుంది.
బి) దీనివల్ల ఎత్తు, బరువు పెరుగుతారు.
సి) శరీరంలో జీవనక్రియ రేటు పెరుగుతుంది. దీనివల్ల శక్తి ఎక్కువగా అందుబాటులో ఉంటుంది. (దీనిని + ‘tive గా మార్చుకోవాలి)
డి) ‘ఆడమ్స్ యాపిల్’ మగపిల్లలలో పెరుగుతుంది.
ఇ) ఆడపిల్లలలో స్థనాల పరిమాణం పెరుగుతుంది.
ఎఫ్) బాహు మూలాల్లో, ప్రత్యుత్పత్తి అంగాల దగ్గర వెంట్రుకలు పెరుగుతాయి.
జి) బాలికలలో ఋతుచక్రం మొదలవుతుంది.
హెచ్) మగపిల్లలలో వీర్యకణాల ఉత్పత్తి మొదలవుతుంది.
ప్రశ్న 4.
జతపరచండి.
జవాబు:
1) C
2) B
3) D
4) A
ప్రశ్న 5.
కౌమార దశలో మొటిమలు, మచ్చలు ఎందుకు వస్తాయి ? వాటి పట్ల ఏ ఏ జాగ్రత్తలు తీసుకోవాలి ?
జవాబు:
1. కౌమార దశలో శరీరంలో అభివృద్ధి ఎక్కువ స్థాయిలో జరుగుతుంది. ఈ
2. దీనివల్ల శరీరంలోని తైల గ్రంథులు, స్వేద గ్రంథులు కూడా ఎక్కువ స్థాయిలో స్పందించి తైలాన్ని, స్వేదాన్ని ఉత్పత్తి చేస్తాయి.
3. దీనివల్ల ముఖం జిడ్డుగా ఉండటం, తైల గ్రంథుల నాళాలలో బాక్టీరియా చేరి ఉబ్బుగా ఉండే బుడిపెలు (మొటిమలు) రావటం సాధారణ విషయం.
4. కొన్నిసార్లు చీము పట్టి ఇవి నొప్పిని కలుగచేస్తాయి.
5. వీటిని గిల్లినా, గోరు తగిలినా అది మచ్చగా మారుతుంది.
6. చెమట వల్ల శరీరం నుంచి ఒక రకమైన వాసన కూడా వస్తుంది.
తీసుకోవలసిన జాగ్రత్తలు :
ఎ) ముఖాన్ని చల్లని నీటితో రోజుకు 3, 4 సార్లు శుభ్రం చేసుకోవాలి.
బి) మాటిమాటికీ సబ్బుతో ముఖాన్ని కడగకూడదు.
సి) మొటిమలను గిల్లకూడదు. ఆహారంలో కొవ్వు పదార్థాలు ఎక్కువగా లేకుండా జాగ్రత్త పడాలి.
డి) వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి.
ఇ) ఒత్తిడి, ఆందోళన లేకుండా మానసిక ఉల్లాసానికి సాధన చేయాలి.
ప్రశ్న 6.
కౌమారదశలో వ్యక్తిగత పరిశుభ్రత పాటించటానికి నువ్వు మీ స్నేహితుడికి ఏం సలహాలు ఇస్తావు?
జవాబు:
కౌమారదశలో వ్యక్తిగత పరిశుభ్రతకు, నా స్నేహితునికి కింది సలహాలు ఇస్తాను.
- ప్రతిరోజు రెండు పూటలా స్నానం చేయాలి.
- మర్మావయవాల శుభ్రత పట్ల శ్రద్ధ వహించాలి.
- ముఖాన్ని ఎక్కువసార్లు చల్లని నీటితో కడగాలి.
- మొటిమలను గిల్లటం కాని, వత్తటం కాని చేయరాదు.
- ముఖానికి లేపనాలు రాయరాదు.
- అవాంఛిత రోమాలను తొలగించుకోవాలి.
- నూనె, నెయ్యి తక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలి.
- తగినంత శారీరక శ్రమ కొరకు వ్యాయామం చేయాలి. ఆటలు ఆడాలి.
ప్రశ్న 7.
మీకు ఎప్పుడైనా మీ తల్లిదండ్రులపై కోపం వచ్చిందా ? మీ తల్లిదండ్రులు ఎలా ఉండాలని మీరు భావిస్తారు ?
జవాబు:
1. నాకు చిన్నప్పటి నుండి ఎప్పుడూ నా తల్లిదండ్రులపై కోపం రాలేదు.
2. కానీ ఈ మధ్య వారిచ్చే సూచనల పట్ల విసుగు వస్తోంది.
3. నాకు తెలిసిన విషయాలు కూడా వారు పదే పదే చిన్నపిల్లవాడికి చెప్పినట్లు చెప్పటం విసుగనిపిస్తోంది.
4. నా వయస్సు ఇప్పుడు 14 సం||లు.
5. ఎండలో స్నేహితులతో ఆటలకు వెళ్ళేద్దంటారు.
6. స్నేహితులను ఇంటికి రానివ్వరు. వచ్చినా బయట మాట్లాడమంటారు. కానీ నాకు వారితో గడపటం ఇష్టంగా ఉంటుంది. ఇలాంటప్పుడు కోపం వస్తుంది.
7. ఎక్కువగా ఈ మధ్య ఇది చెయ్యి. అది చేయకూడదు అన్న సలహాల ప్రక్రియ మొదలయ్యింది. ఇది నాకిష్టం లేదు.
8. నా తల్లిదండ్రులు
ఎ) నేను పెద్దవాణ్ణి అయ్యాను అని గుర్తించాలని కోరుకుంటాను.
బి) నాకు నచ్చిన, నాకిష్టమైన పనులు చేయవద్దని అనకుండా ఉంటే బాగుంటుంది.
సి) నేను పెద్దవాణ్ణి అని వారు గుర్తించాలనిపిస్తుంది.
డి) నేను కూడా స్వతంత్రంగా పనులు చేయగలనని వారు విశ్వసించాలని భావిస్తాము.
ప్రశ్న 8.
మీరు మీ తల్లిదండ్రుల కంటే స్నేహితులతో ఏ ఏ సమస్యలు, అభిప్రాయాలు పంచుకుంటారు ?
జవాబు:
నేను నా స్నేహితులతో ఈ కింది అభిప్రాయాలు పంచుకుంటాను.
1. నా శరీరంలో జరిగే మార్పులు – ఎత్తు, బరువు, మొటిమల గురించి వారి అనుభవాలను తెలుసుకోవాలని అనుకుంటాను.
2. చదువు విషయంలో ప్రగతి విషయమై తల్లిదండ్రులు, ఉపాధ్యాయులిచ్చిన సూచనలపై వారి అభిప్రాయాలు తీసుకొని, వారి సలహాలను నిర్లక్ష్యం చేస్తాను. (చాలా కొద్దిమంది మాత్రమే ఈ విషయంలో వాస్తవానికి దగ్గరగా ఆలోచిస్తారు. )
3. సినిమాలు, హీరో, హీరోయిన్ల విషయాలు ‘స్నేహితులతో ఎక్కువగా పంచుకుంటాను.
4. వీడియో గేమ్ లు, సాంఘిక అంతర్జాల పట్టికల గురించి వారి సలహాలు, అనుభవాలు తెలుసుకోవటానికి ఉత్సాహం చూపుతాను.
5. భిన్నలింగ వర్గీయుల గురించి, కబుర్లు ఎక్కువగా స్నేహితులతో చర్చిస్తాను.
6. లైంగిక అవయవాల అభివృద్ధి గురించి కంగారు పడి స్నేహితుల సలహాల కోసం ఆత్రుతగా చూస్తాను. (ఇది కూడా 99% ఋణాత్మక ఫలితాన్ని ఇస్తుంది. సమ వయస్కులు కాబట్టి ఈ విషయంపై వారికి శాస్త్రీయ పరిజ్ఞానం ఉండదు. )
ప్రశ్న 9.
ఒకవేళ నీకు వైద్యుడ్ని సంప్రదించే అవకాశం వస్తే, కౌమార దశలో ఉద్వేగాల గురించి నీవు అడిగే ప్రశ్నలు ఏమిటి ?
జవాబు:
నాకు వైద్యుడ్ని కలిసి కౌమార దశలో నేను ఎదుర్కొనే ఉద్వేగాల గురించి ఈ కింది ప్రశ్నలు అడుగుతాను.
- నేను నా సౌందర్యంపై మునుపెన్నడూ లేనంత ఎక్కువ శ్రద్ధ చూపిస్తున్నాను. ఎందుకని ?
- తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఇచ్చే సూచనలు సలహాలు నచ్చక వారితో విభేదిస్తున్నాను. కారణం ఏమిటి ?
- అందరి దృష్టిలో నేను ఎందుకు అగుపడాలి అని భావిస్తున్నాను.
- ఈ మధ్య నా ప్రవర్తనలో దూకుడు, దుందుడుకు మనస్తత్వం ఎందుకు వస్తున్నది ?
- ఎందుకు నాకు అవకాశమెచ్చినప్పుడు గట్టిగా అరచి గోల చేయాలనిపిస్తున్నది ?
- భిన్న లైంగిక వర్గీయుల పట్ల నేను ఎందుకు ఆకర్షణకు లోనవుతున్నాను ?
- నా లైంగిక అవయవాల దగ్గర, బాహు మూలాల్లో వెంట్రుకలు ఎందుకు పెరుగుతున్నాయి ? చెమట ఎక్కువ పోస్తున్నది. ఎందుకు ?
- ఋతుచక్రం, రజస్వల అవటం ఆడపిల్లలలో జరిగే మార్పులు. మరి మగవారిలో ఎలాంటి మార్పులు వస్తాయి ?
- అనవసరమైన సిగ్గు, అసహనం, అరచి గోల చేయాలనిపించటం – గొంతు బొంగురు పోవటం ఎందువల్ల నాలో కలుగుతున్నాయి ?
- ‘వ్యక్తిగత పరిశుభ్రత’ అంటే ఏమిటి ? నేను ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ?
ప్రశ్న 10.
కొన్ని మొబైల్ ఫోన్లలో ఉండే ఆడియో మీటరును ఉపయోగించి 6 నుండి 10వ తరగతి వరకు చదువుతున్న కొందరి విద్యార్థుల స్వరాల పౌనఃపున్యాన్ని నమోదు చేసి మీ పరిశీలనలు రాయండి.
జవాబు:
పరిశీలనలు :
1. 6వ తరగతి పిల్లలలో స్వర పౌనఃపున్యం దాదాపు ఆడ, మగపిల్లల్లో ఒకే విధంగా ఉందని గమనించాను.
2. 7వ తరగతిలో కూడా స్వర పౌనఃపున్యం ఆడ, మగపిల్లల్లో ఒకే విధంగా ఉంది.
3. 8వ తరగతిలో మగపిల్లలలో పౌనఃపున్యం తగ్గింది. అంటే వారి స్వరం బొంగురుగా ఉంది. ఆడపిల్లల్లో మాత్రం సన్నగా ఉండి పౌనఃపున్యం 6, 7వ తరగతుల కంటే కొంచెం ఎక్కువగా ఉన్నట్లు పరిశీలనలో తేలింది. (కౌమార దశ ప్రారంభమైనదని సూచన)
4. 9,10 తరగతుల మగపిల్లల్లో బొంగురు గొంతు ఉంది. సాధారణంగా పురుషులలో ఉండాల్సిన పౌనఃపున్యం 120 Htz కు దగ్గరగా ఉన్నది. అమ్మాయిలలో సన్నని గొంతు ఇంకా సున్నితత్వంతో ఉందని మా పరిశీలనలో తేలింది.
5. టెస్టోస్టిరాన్, అడ్రినలిన్ల ప్రభావం వల్ల 13 నుండి 15 సం|| వయస్సుకు వచ్చిన పిల్లల గొంతు బొంగురుగా వుంటుంది.
6. ఈస్ట్రోజన్ ప్రభావం వల్ల ఆడపిల్లల గొంతులో సున్నితత్వం మొదలయిందని గమనించాము.
ప్రశ్న 11.
బాల్యవివాహాలు, బాలికల ఆరోగ్యంపై చూపే ప్రభావం గురించి సమాచారం సేకరించి నివేదిక తయారుచేయండి.
జవాబు:
బాల్యవివాహాలు ఒక సాంఘిక దురాచారం. చిన్న వయస్సులోనే వివాహం చేయటం వలన వారిలో గర్భధారణకు
కావలసిన శారీరక పరిణితి ఉండదు. అందువలన ప్రసవ సమయంలో తల్లి ప్రాణానికి ప్రమాదం ఉంటుంది. వీరికి కలిగే సంతానం కూడా సరైన ఎదుగుదల లేకపోవటం వంటి సమస్యలతో బాధపడతారు.
అంతేగాక వివాహ బంధాన్ని కొనసాగించటానికి కావలసిన మానసిక పరిణితి లోపించి వివాహాలు విఫలమవుతాయి. చిన్న వయస్సులోనే తల్లి కావటం వలన వారి గర్భాశయం సరిగా ఎదగక ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. అందువలన భారత ప్రభుత్వం వివాహానికి కనీస వయస్సు పురుషులకు 21 సంవత్సరాలుగాను, స్త్రీలకు 18 సంవత్సరాలుగాను నిర్ణయించింది. బాధ్యత గల పౌరునిగా మనం వీటిని పాటించాలి.
ప్రశ్న 12.
పటంను పరిశీలించండి. మానవ శరీరంలో ఉండే అంతఃస్రావ గ్రంథులు, అవి ఉండే చోటును తెలిపే పటం గీయండి.
జవాబు:
ప్రశ్న 13.
ఆడమ్స్ యాపిల్ పటం గీయండి.
జవాబు:
ప్రశ్న 14.
కౌమార దశలో జరిగే మార్పులు, తీసుకోవలసిన జాగ్రత్తలను సూచిస్తూ ఒక ఉపన్యాస వ్యాసం తయారుచేయండి. (లేదా) ఏ లక్షణాలను బట్టి బాలబాలికలు కౌమారదశను చేరుకున్నారని తెలుసుకోవచ్చు.
జవాబు:
1. 13-19 సం|| మధ్య వయస్సు గల పిల్లలలో కనిపించే అతి సున్నితమైన, ముఖ్యమైన దశను కౌమార దశ అంటారు.
2. దీనినే టీనేజ్ అంటారు. ఇది శారీరక, మానసిక భావోద్వేగాల అభివృద్ధిని వేగవంతం చేసే వయస్సు.
మార్పులు :
(1) శారీరక మార్పులు :
- ఈ దశలో శరీరంలో అభివృద్ధి బాగా ఎక్కువ జరుగుతుంది.
- BMR (Basal Metabolic Rate) ఎక్కువగా ఉంటుంది.
- కండరాల అభివృద్ధి, ఎముకల పెరుగుదల ఎక్కువవటం వల్ల ఎత్తు, బరువు పెరుగుతారు.
- మగపిల్లల్లో గొంతు బొంగురుపోవటం, మీసాలు, గెడ్డాలు రావటం, జననాంగాల వద్ద వెంట్రుకలు రావటం ప్రారంభమవుతుంది.
- బాహు మూలాల్లో వెంట్రుకలు పెరిగి, శరీరంలో చెమట ఎక్కువ పోస్తుంది.
- ఆడపిల్లల్లో రజస్వల అయ్యి, ఋతుచక్రం ప్రారంభమవుతుంది.
- ముఖంపై మొటిమలు, మచ్చలు వస్తాయి.
(2) మానసిక మార్పులు :
- వీరిలో దేనిపైనా సరైనా ఆసక్తి ఉండదు.
- విసుగు ఎక్కువ.
- నిర్లక్ష్యంగా ఉంటూ, ఎక్కువ సార్లు అసహనం వ్యక్తపరుస్తారు.
- అరచి గోల చేయాలనిపిస్తుంది.
- అందరి దృష్టి తన పైనే ఉండాలని, తాను పెద్దవాడ్ని అయ్యాను కాబట్టి తన నిర్ణయాల పట్ల అందరూ సానుకూలంగా స్పందించాలని కోరుకుంటారు.
- భావోద్వేగాల స్థాయి ఎక్కువగా ఉంటుంది.
- ఎక్కువ సేపు అద్దం ముందు గడుపుతూ తమ సౌందర్యంపై ఎక్కువ మక్కువ చూపిస్తారు.
- సమ వయస్కులు, స్నేహితులతో ఎక్కువ సమయం గడపాలని కోరుకుంటారు.
- కలల ప్రపంచంలో విహరిస్తూ, ఆ స్వప్నంలో తమ కోరికలు నెరవేరినట్లు హిస్తూ గడపటానికి ప్రాధాన్యం ఇస్తారు.
- భిన్న లింగ వర్గీయుల పట్ల ఆకర్షణకు లోనవుతారు.
తీసుకోవలసిన జాగ్రత్తలు :
- ఈ భావోద్వేగ మార్పులను తనలో సహజంగా హార్మోనుల వల్ల వచ్చే మార్పులని ముందుగా తనకు తాను చెప్పుకోవాలి.
- స్నేహితుల ప్రోదల్బంతో చెడు అలవాట్లకు దగ్గరవకుండా స్వీయ క్రమశిక్షణ పాటించాలి.
- తనలో జరిగే ఈ ‘సంక్లిష్ట సంఘర్షణ’ నుండి బయటపడడానికి ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల సాయం, అవసరమైతే డాక్టర్ల సాయం తీసుకోవాలి.
- మానసిక ఒత్తిడిని తగ్గించే ప్రయత్నం చేయాలి.
- ‘వ్యక్తిగత పరిశుభ్రత’ పాటిస్తూ వ్యాధుల నుండి కాపాడుకోవాలి.
- ‘తేలికపాటి వ్యాయామం’ ఆటల ద్వారా శరీరాన్ని అలసట చెందించటం ద్వారా మంచి నిద్రను ఆహ్వానించవచ్చు.
- టివిల ముందు వీడియో గేమ్ ల ముందు, చాటింగ్ (చరవాణి ద్వారా SMS) లను నివారించి, స్థూలకాయత్వం రాకుండా చూసుకొనవచ్చు.
- భిన్నలింగ వర్గీయుల పట్ల గౌరవ భావాన్ని పెంచుకోవాలి.
- ఇది ఇప్పటి సమాజ శ్రేయస్సుకు ఎంతో ముఖ్యమైనది.
- తల్లిదండ్రులు పిల్లల్ని ఈ దశలో నిశిత పరిశీలన చేస్తూ వారికి మానసికంగా కావలసిన అండదండలను అందించాలి.
ప్రశ్న 15.
ప్రత్యుత్పత్తిపరంగా మరొక తరం సంతతిని ఉత్పత్తి చేసే విధంగా ప్రకృతి మానవ శరీరాన్ని తయారుచేసింది. దీన్ని నువ్వెట్లా అభినందిస్తావు ?
జవాబు:
- ప్రత్యుత్పత్తిపరంగా మరొక తరం సంతతిని ఉత్పత్తి చేసే విధంగా ప్రకృతి మానవ శరీరంలో లింగ భేదం ఉన్న ప్రత్యుత్పత్తి వ్యవస్థలను తయారుచేసింది.
- పురుషులలో ఒక జత ముష్కాలతో పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థను, స్త్రీలలో ఒక జత స్త్రీ బీజకోశాలతో స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థను, ప్రకృతి అభివృద్ధి చేసింది.
- పురుషుల నుండి శుక్రకణం స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థలో విడుదలైన అండంతో కలిసి సంయోగం చెంది సంయుక్త – బీజంగా అభివృద్ధి చెందుతుంది.
- దీనిని అంతర ఫలదీకరణ అంటారు.
- ఇది స్త్రీలలోని ఫాలోపియన్ నాళాలలో జరుగుతుంది.
- తరువాత పిండం ఏర్పడి గర్భాశయ గోడలకు అంటిపెట్టుకుని ‘భ్రూణం’గా అభివృద్ధి చెందుతుంది.
- ఈ భ్రూణం ‘గర్భావధి కాలం 270-280 రోజుల మధ్య ఉంటుంది. పూర్తిగా అభివృద్ధి చెంది శిశువుగా మారిన తరువాత తల్లి బిడ్డకు జన్మనిస్తుంది.
- ఇది సంక్లిష్టమైన ప్రక్రియ. దీనికి అవసరమైన ఏర్పాట్లు గర్భాశయంలోనే ప్రకృతి అభివృద్ధి చేసింది.
- ఇది ఎంతో అభినందించవలసిన విషయం.
- ఈ ఏర్పాట్ల వల్ల మానవ సంతతి తరం తర్వాత తరంలో అభివృద్ధి చెందే అవకాశం ఏర్పడింది.
ప్రశ్న 16.
బాల్యవివాహం ఒక సామాజిక దురాచారం అని మీకు తెలుసు. దీని నివారణకై కొన్ని నినాదాలు తయారుచేయండి.
జవాబు:
1. వివాహం మరొక తరాన్ని సృష్టించటంలో కీలకపాత్ర పోషించే ఒక సామాజిక, సాంస్కృతిక ప్రక్రియ.
2. దీనికి పురుషులలో 21 సంవత్సరాలు. స్త్రీలలో 18 సంవత్సరాల కనిష్ఠ వయస్సును మన దేశ రాజ్యాంగం చట్టంగా చేసింది. దీనిని మనందరం గౌరవించాలి.
నినాదాలు :
- బాల్య వివాహాలు చట్ట వ్యతిరేకం.
- బాల్య వివాహాలు నేరం.
- పిల్లల్ని ఎదగనీయండి. తరువాత వివాహం చేయండి. ఆరోగ్యమైన సంతతిని పొందండి.
- ఆడపిల్లల చదువు – ఆ ఇంటికి వెలుగు.
- బాల్య వివాహం – తల్లీ బిడ్డల ఆరోగ్యానికి హానికరం.
- బాల్య వివాహాలు – వారి జీవితాల్లో ఆటుపోటులకు ఆనవాలు.
- బాల్య వివాహాలు ఆపుదాం – ముందు తరాలను కాపాడదాం.
- బాల్య వివాహం – ఒక సామాజిక దురాచారం.
ప్రశ్న 17.
13 ఏళ్ళ స్వరూప్ తన ఎత్తు గురించి కలవరపడుతున్నాడు. అతడు ఎత్తు పెరుగుతాడా ? తనకి నువ్వు ఇచ్చే సలహా ఏమిటి ?
జవాబు:
1. స్వరూప్ ప్రస్తుత వయస్సు 13 సంవత్సరాలే.
2. పిల్లలు సాధారణంగా కౌమార దశ చివరి వరకు ఎత్తు బాగా పెరుగుతారు.
3. కౌమార దశ 13-19 సం|| వరకు, కాబట్టి స్వరూప్ ఇంకా కౌమార దశ మొదట్లోనే ఉన్నాడు. ఇంకా అతను 6 సం||ల వరకు ఎత్తు ఎదిగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.
4. 19 సం|| దాటిన తర్వాత కూడా 25 నుండి 30 సం|| వరకూ స్వల్పంగా ఎత్తు పెరిగే అవకాశం ఉన్నది.
5. కాబట్టి స్వరూప్ తన ఎత్తు గురించి కలవరపడే అవసరం లేదని నేను అతనికి సలహా .(శాస్త్రీయంగా) ఇస్తాను.
ప్రశ్న 18.
మీ పాఠశాలలో ఉన్న రెడ్ రిబ్బన్ క్లబ్ నిర్వహించే కార్యక్రమాలు మెరుగుపరచుకోవడానికి ఏవైనా ఐదు సలహాలు సూచించండి.
జవాబు:
1. మా పాఠశాలలో ‘కౌమార విద్య’ పై అవగాహన కల్పిస్తూ వాటి కార్యక్రమాల రూపకల్పన మరియు నిర్వహణ కోసం రూపొందించబడిన వాలంటరీ జట్టునే ‘రెడ్ రిబ్బన్ క్లబ్’ అంటారు.
2. చాలామంది దీనిని HIV / AIDS కార్యక్రమ ప్రచారం కోసమే అని భావిస్తారు. కానీ అది తప్పు.
3. ఇది కౌమార దశలో ఉన్న టీనేజర్లు చేసే తప్పులను చేయకూడదని చెప్తూ వారిని చైతన్యపరచి వారి భావోద్వేగాల నియంత్రణకు అవసరమైన కార్యక్రమాలను రూపకల్పన చేస్తుంది.
ఈ క్లబ్ నిర్వహణ మెరుగుపడడానికి కొన్ని సూచనలు :
- క్లబ్ నిర్మాణం పారదర్శకంగా ఉండాలి.
- సమూహాన్ని జట్లుగా విభజించి ప్రతి జట్టుకు నిర్దిష్టమైన బాధ్యతలను, విధులను కేటాయించాలి.
- వీరందరినీ సమన్వయపరచటానికి ఒక ఉపాధ్యాయినీ (బాలికలకు), ఒక ఉపాధ్యాయుడు (బాలురకు) విడిగా ఉండాలి.
- చేసిన కార్యక్రమ వివరాలు విధిగా ‘ఒక రిజిస్టరు నందు నమోదు చేయాలి.
- ఈ క్లబ్ నిర్వహణ ‘ఒక సామాజిక బాధ్యత’గా పాఠశాల ఉపాధ్యాయులు స్వీకరించాలి.
8th Class Biology 5th Lesson కౌమార దశ InText Questions and Answers
కృత్యములు
1. పట్టికను గమనించండి. క్రింది ప్రశ్నలకు సమాధానాలు వ్రాయండి.
జవాబు:
బాల బాలికల వయస్సు ఆధారంగా ఉండవలసిన సగటు ఎత్తు.
(a) ఏ వయస్సుకు చేరుకున్న తర్వాత అబ్బాయిలలో ఎత్తు పెరుగుదల దాదాపుగా ఆగిపోయింది?
జవాబు:
18 సం|| వయస్సు నాటికి అబ్బాయిలలో పెరుగుదల 100% పూర్తి అవుతుంది.
(b) అమ్మాయిలలో పెరుగుదల ఏ వయస్సులో వేగంగా జరుగుతుందని నువ్వు అనుకుంటున్నావు ?
జవాబు:
అమ్మాయిలలో పెరుగుదల 8 సంవత్సరాల నుండి వేగంగా ప్రారంభమై 16 సం|| పూర్తి అవుతుంది.
(c) అమ్మాయిల్లో పెరుగుదల ఏ వయసులో ఎక్కువగా జరుగుతుంది ?
జవాబు:
అమ్మాయిల్లో పెరుగుదల ప్రధానంగా 11 సంవత్సరాల నుండి 13 సంవత్సరాల మధ్య ఎక్కువగా (4%) జరుగుతుంది.
(d) అబ్బాయి, అమ్మాయిలలో ఎవరు వేగంగా పెరుగుతారు ? ఎట్లా చెప్పగలవు ?
జవాబు:
1. అబ్బాయిలతో పోల్చితే అమ్మాయిలలో పెరుగుదల రేటు అధికం అనిపిస్తుంది.
2. మొదట అమ్మాయిలు వేగంగా పెరిగినప్పటికీ 18 సంవత్సరాలు వచ్చేటప్పటికి ఇరువురిలో పెరుగుదల సమానంగా ఉంటుంది.
(b) మీ సంపూర్ణ ఎత్తు ఎంతో ఎలా లెక్కకట్టగలవు ? (పేజీ నెం. 70)
జవాబు:
1. దీనికి నా ప్రస్తుత వయస్సు ఎంతో కావాలి.
2. తరువాత ఈ వయస్సులో ఎంత ఎత్తు ఉన్నానో తెలియాలి.
3. చివరగా ఎత్తు పెరుగుదల శాతం, ఈ వయస్సుకు ఎంతో తెలియాలి.
అంటే నా ప్రస్తుత వయస్సు = 14 సం||
నా ప్రస్తుత ఎత్తు = 130 సెం.మీ.
ఉండవలసిన పూర్తి ఎత్తు శాతం = 92
ఈ విషయాలను కింది సూత్రంలో ప్రతిక్షేపించాలి.
నా సంపూర్ణ ఎత్తు = ప్రస్తుత ఎత్తు / ఉండవలసిన పూర్తి ఎత్తు శాతం × 100 = \(\frac {130}{92}\) × 100 = 141.3 సెం.మీ.
నేను టీనేజ్ పూర్తయ్యే నాటికి 141.3 సెం.మీ. ఎత్తు పెరుగుతాను. అంటే ఇంకా 11.3 సెం.మీ. ఎత్తు పెరుగుతానన్న మాట!
(దీనికి అనుబంధంగా వయస్సు, పెరుగుదల శాతం గల పట్టిక సహాయం తీసుకోవాలి)
ఎత్తు అంచనావేద్దాం.
ప్రశ్న 2.
నీ స్నేహితులు ఆరుగురిని ఎంపిక చేసి వారి ప్రస్తుత ఎత్తు, భవిష్యత్ ఎత్తు ఎలాప్రశ్న అంచనా వేస్తావో చెప్పు. (పేజీ నెం. 71)
జవాబు:
సూత్రం : మీ సంపూర్ణ ఎత్తు = ప్రస్తుత ఎత్తు (సెం.మీ.లలో) / ఉండవలసిన పూర్తి ఎత్తు శాతం × 100
(పట్టిక – 1లోని సమాచారం ఉపయోగించుకున్నాను.)
మీ శరీరంలో మార్పులు పరిశీలిద్దాం.
3. మీ పాఠశాలలోని లేదా మీ తరగతిలోని స్నేహితుల ఆరోగ్య కార్డులను గమనించి కింది పట్టిక పూరించండి. మీ పరిశీలనలు రాయండి. (పేజీ నెం. 71)
జవాబు:
పరిశీలనలు :
1. కౌమార దశలో శారీరక మార్పులు వేగంగా జరుగుతాయి.
2. అమ్మాయిల కంటే అబ్బాయిల భుజాలు వెడల్పుగా మారాయి.
3. అమ్మాయిలలో నడుం కింద భాగం వెడల్పుగా మారడం గమనించాము. (ఈ మార్పు ముందు ముందు బిడ్డకు జన్మ నివ్వడంలో తోడ్పడుతుంది.)
4. మీ స్నేహితుని ప్రవర్తన మీ ప్రవర్తనలు కింది చెక్ లిస్ట్ తో సరిపోతాయో లేదో సరిచూసుకోండి. దానిని బట్టి నువ్వు ఏ ఏ విషయాలు గమనించావో తెలపండి.
జవాబు:
చెక్ లిస్ట్ :
పై చెక్ లిస్టు ఆధారంగా చేసుకుని ఈ కింది విషయాలు అర్థం చేసుకున్నాను.
- బాల్యంలో చేసే పనులకు, కౌమార దశలో చేసే పనులకు తేడా ఉంటుంది.
- ఈ దశలో బాలబాలికలు స్వతంత్రంగా వ్యవహరిస్తారు.
- శారీరక, మానసిక మార్పులు వస్తాయి.
- ఉద్వేగానికి, అయోమయానికి లోనయ్యే దశలో మేమున్నాం అని గుర్తించాం.
- కొత్త ఆలోచనల వెల్లువ మనసులో ఏర్పడుతుంది.
- కొత్త విషయాలు అన్నీ తెలుసుకోవాలన్న ఉత్సాహం ఉంటుంది.
- మానసిక ఒత్తిడి ఉంటుంది.
- అనుమానాలు, సంశయాలు తీర్చే ఉపాధ్యాయులన్నా, పెద్దలన్నా చాలా గౌరవభావం ఏర్పడుతుంది. (కౌమార దశలో ప్రకృతి సహజంగా ఉన్న రహస్యాల గురించి దాచి పెట్టకుండా అన్నింటినీ నివృత్తి చేయాలి.)
పాఠ్యాంశములోని ప్రశ్నలు
ప్రశ్న 1.
చిన్న పిల్లలు ఫోన్ లో మాట్లాడుతున్నప్పుడు గొంతును బట్టి అమ్మాయా, అబ్బాయో చెప్పగలమా ? (పేజి నెం. 72)
జవాబు:
చిన్న పిల్లల గొంతును బట్టి అబ్బాయో, అమ్మాయో చెప్పలేము. ఇద్దరి గొంతు ఒకే విధంగా ఉంటుంది.
ప్రశ్న 2.
మాట్లాడేవారు అబ్బాయో, అమ్మాయో ఎప్పుడు ఎలా చెప్పగలుగుతాం ? (పేజి నెం. 72)
జవాబు:
యుక్త వయస్సు వచ్చిన తర్వాత అబ్బాయిల గొంతు గంభీరంగా మారి అమ్మాయిల కంటే విభిన్నంగా ఉంటుంది. అప్పుడు గొంతు ఆధారంగా అబ్బాయో, అమ్మాయో చెప్పలేము.
ప్రశ్న 3.
కౌమార దశలో సాధారణంగా మగపిల్లల కంఠస్వరంలో మార్పు ఎందుకు వస్తుంది ? (పేజి నెం. 72)
జవాబు:
కౌమార దశలో మగపిల్లల స్వరకోశం పరిమాణంలో పెద్దదిగా పెరుగుతుంది. దీనినే ఆడమ్స్ యాపిల్ అంటారు. దీని పరిమాణం పెరగటం వలన గొంతు గంభీరంగా ఏర్పడి ఆడవారి నుండి విభేదిస్తుంది.
ప్రశ్న 4.
ప్రత్యుత్పత్తి దశలను, ప్రత్యుత్పత్తి దశల క్రమాన్ని ఫ్లోచార్టు రూపంలో రాయండి. ఫ్లోచార్టు ఆధారంగా ఈ క్రింది ప్రశ్నలకు సమాధానాలు రాయండి. (పేజి నెం. 74)
(a) స్త్రీలలో అండం విడుదల చాలా రోజుల వరకు కొనసాగుతుందా ?
జవాబు:
స్త్రీలలో అండం విడుదల దాదాపు 50 నుండి 55 సంవత్సరాలపాటు కొనసాగుతుంది.
(b) ఒక వేళ అండం విడుదల ఆగిపోతే ఏం జరుగుతుంది ?
జవాబు:
1. అండం విడుదల కాకపోతే, ఫలదీకరణ జరగదు.
2. కావున కొత్త జీవులు ఏర్పడవు.
(c) ఫలదీకరణ చెందిన అండాలు ఏమవుతాయి ?
జవాబు:
1. ఫలదీకరణ చెందిన అండాలు సంయుక్త బీజంగా మారతాయి.
2. సంయుక్త బీజం గర్భాశయంలో జీవిగా ఎదుగుతుంది.
(d) ఫలదీకరణ జరగకపోతే ఏమౌతుంది ?
జవాబు:
1. ఫలదీకరణ జరగకపోతే జీవులు ఏర్పడవు.
2. జాతి అంతరించి పోతుంది.
(e) అసలు అండమే విడుదల కాకపోతే ఏమౌతుంది ?
జవాబు:
లైంగిక ప్రత్యుత్పత్తికి అండము తప్పనిసరి. అసలు అండము విడుదల కాకపోతే లైంగిక ప్రత్యుత్పత్తి జరగదు. దానివలన కొత్త జీవులు రూపొందవు.
ప్రశ్న 5.
NPEGEL కార్యక్రమం ద్వారా పాఠశాలలో అమ్మాయిలకు నాప్ కిన్లు అందజేస్తున్నారు. మీ పాఠశాలలో ఈ పథకంలో భాగంగా ఏ ఏ కార్యక్రమాలు చేస్తారో రాయండి. (పేజీ నెం. 79)
జవాబు:
NPEGEL కార్యక్రమం మా పాఠశాలలో
- ఆరోగ్య విద్య మీద చర్చ నిర్వహిస్తారు.
- కౌమార దశలో శారీరక శుభ్రత ప్రాధాన్యత వివరిస్తారు.
- ఉద్వేగ నియంత్రణ అంశంపై క్లాసులు నిర్వహిస్తాడు.
- మంచిగా ఆలోచించటం, కలిసి జీవించటం వంటి అంశాలపై అవగాహన ఏర్పరుస్తారు.