AP Board 8th Class Social Solutions Chapter 20 లౌకికత్వం – అవగాహన

SCERT AP 8th Class Social Study Material Pdf 20th Lesson లౌకికత్వం – అవగాహన Textbook Questions and Answers.

AP State Syllabus 8th Class Social Solutions 20th Lesson లౌకికత్వం – అవగాహన

8th Class Social Studies 20th Lesson లౌకికత్వం – అవగాహన Textbook Questions and Answers

Improve your learning (మీ అభ్యసనాన్ని మెరుగుపడుచుకోండి)

ప్రశ్న 1.
మీ పరిసర ప్రాంతాలలో వివిధ మత ఆచారాల జాబితా తయారుచేయండి – రకరకాల ప్రార్థనలు, దేవుడిని కొలిచే విధానాలు, పవిత్ర స్థలాలు, భక్తి పాటలు, సంగీతం మొదలైనవి. మత ఆచరణ స్వేచ్ఛను ఇది సూచిస్తోందా? (AS3)
జవాబు:
AP Board 8th Class Social Solutions Chapter 20 లౌకికత్వం – అవగాహన 1

ప్రశ్న 2.
మా మతం శిశుహత్యలను అనుమతిస్తుంది అని ఒక మత ప్రజలు అంటే ప్రభుత్వం అందులో జోక్యం చేసుకుంటుందా? మీ సమాధానానికి కారణాలు పేర్కొనండి. (AS1)
జవాబు:
చేసుకుంటుంది అని కచ్చితంగా చెప్పవచ్చు.
కారణాలు :

  1. భారతదేశ లౌకికవిధానం మతాలలో జోక్యం చేసుకుంటుంది.
  2. ఈ జోక్యం రాజ్యాంగంలోని ఆదర్శాలకు అనుగుణంగా ఉంటుంది.

ప్రశ్న 3.
ఒకే మతంలో భిన్న దృక్పథాలకు సంబంధించి కొన్ని ఉదాహరణలను సేకరించండి. (AS1)
జవాబు:
మనం దీనికి ఉదాహరణగా బౌద్ధమతంను తీసుకుందాము.

బుద్ధుని బోధనలను అనుసరించేవారిని బౌద్ధులు అని అంటాము. వీరు ఆచరించే విధానాలను బౌద్ధమతం అని చెప్పుకుంటాము. అయితే దీనిలో 3 రకాల దృక్పథాలు ఉన్నాయి.

  1. తేరవాదం
  2. మహాయానం
  3. వజ్రయానం

1) తేరవాదం :
తేరవాదులు ఎవరికి వారే ఆత్మసాక్షాత్కారాన్ని పొందాలని నమ్ముతారు.

2) మహాయానం :
వీరు ఆత్మ సాక్షాత్కారానికి ప్రయత్నిస్తూనే ఇతరులకు కూడా ఆ స్థాయి రావడానికి సహాయం చేయాలని భావిస్తారు.

3) వజ్రయానం :
ఇతరులకు సహాయం చేయటమేకాక వారిని ఆ స్థాయికి తేవడానికి తగిన శక్తిని కలిగి ఉండాలని భావిస్తారు.

ఈ విధంగా ఒకే మతంలో విభిన్న దృక్పథాలు ఉంటాయి.

AP Board 8th Class Social Solutions Chapter 20 లౌకికత్వం – అవగాహన

ప్రశ్న 4.
భారత రాజ్యం మతానికి దూరంగా ఉంటుంది. మతంలో జోక్యం చేసుకుంటుంది. ఈ భావన గందరగోళం సృష్టించవచ్చు. ఈ అధ్యాయంలో ఇచ్చిన ఉదాహరణలతో పాటు మీకు అనుభవంలోకి వచ్చిన / తెలిసిన ఇతర ఉదాహరణలతో దీనిని మరోసారి చర్చించండి. (AS1)
జవాబు:
భారత రాజ్యాంగం లౌకిక విధానాన్ని అవలంబిస్తూనే మత విధానాలలో జోక్యం చేసుకుంటుంది. ఈ జోక్యం రాజ్యాంగంలోని ఆదర్శాలకు అనుగుణంగా ఉంటుంది.
ఉదా :

  1. హిందూమతంలోని ‘అంటరానితనాన్ని’ నిషేధించింది.
  2. భారతదేశ ముస్లిం మహిళలు వారి మతధర్మం ప్రకారం విడాకులు పొందినా, భారతదేశంలో కోర్టుకు వెళ్ళినట్లయితే వారికి భరణం ఇవ్వాల్సిందిగా నిర్దేశించినది. (షాబానోకేసు)
  3. శిశు విద్యా మందిరం, ఆర్.సి.యం పాఠశాలలు, ఉర్దూ పాఠశాలలు మొదలగునవి మతపరమైన విద్యాలయాలు అయినా వాటికి ప్రభుత్వం ఆర్ధిక మద్దతు అందిస్తుంది.
  4. అదే విధంగా వారసత్వంలో సమాన ఆస్తిహక్కును కాపాడటానికి ప్రజల మత ఆధారిత పౌర చట్టాలలో రాజ్యం జోక్యం చేసుకోవలసిరావచ్చు.
  5. మన ప్రభుత్వం తరఫున ఒంటిమిట్ట రాములవారి కళ్యాణానికి ప్రభుత్వ లాంఛనాలతో ముత్యాలు, పట్టువస్త్రాలు మొదలైనవి పంపుతారు. వీటిని ముఖ్యమంత్రి లేదా ఒక మంత్రిస్థాయిలోని వారు తీసుకుని వెళతారు.
  6. రంజాన్ మాసంలో ప్రభుత్వ శాఖలలో పనిచేసే ముస్లింలకు నమాజుకు ప్రభుత్వం సమయం కేటాయిస్తూ పనివేళలు మారుస్తుంది.

ఈ విధంగా మన రాజ్యాంగం లౌకికంగానే ఉంటూ మతపరమైన విషయాలలో జోక్యం చేసుకుంటుంది.

ప్రశ్న 5.
లౌకికవాదం అంటే ఏమిటి ? అన్న భాగం చదివి దానిపై వ్యాఖ్యానించండి. (AS2)
జవాబు:

  1. ప్రభుత్వంలో మతవరమైన జోక్యం లేకపోవడాన్ని లౌకికవాదం అంటారు.
  2. భారతదేశం లౌకికంగా ఉండాలని రాజ్యాంగం నిర్దేశిస్తోంది.
  3. అందుచే అది మతానికి దూరంగా ఉంటుంది.
  4. ఆధిపత్య నివారణకు, జోక్యం చేసుకోకుండా ఉండటం అన్న విధానాన్ని అనుసరిస్తుంది.
  5. అవసరమైతే భారత రాజ్యం మతంలో జోక్యం చేసుకుంటుంది.

8th Class Social Studies 20th Lesson లౌకికత్వం – అవగాహన InText Questions and Answers

8th Class Social Textbook Page No.223

ప్రశ్న 1.
ఈ అధ్యాయానికి పైన ఉన్న పరిచయాన్ని మరొకసారి చదవండి. ఈ సమస్యకు ప్రతీకార చర్య సరైనది ఎందుకు కాదు? వివిధ బృందాలు ఈ పద్ధతిని అనుసరిస్తే ఏమవుతుంది?
జవాబు:
పై పేరాను చదివిన తర్వాత ప్రతీకార చర్య సరైనది కాదు. ఎందుకంటే భారతదేశం ప్రజాస్వామిక, లౌకికవాద దేశం. సంస్కృతి, సాంప్రదాయాలకు, మత సామరస్యానికి ప్రతీక. అలా చేయడం వలన మత విద్వేషాలు పెరుగుతాయి. అధికులు ఎక్కువగా ఉన్న మతవాదులు, అల్పజన మతంపై దాడులు చేస్తే మత స్వేచ్ఛకు భంగం కలిగి, భారతదేశం లాంటి శాంతి కాముక దేశ ఆదర్శవాదం దెబ్బతింటుంది.

8th Class Social Textbook Page No.224

ప్రశ్న 2.
ఒకే మతంలో భిన్న దృక్పథాలు ఉండవచ్చా ? తరగతిలో చర్చించండి.
జవాబు:
ఒకే మతంలో భిన్న దృక్పథాలు ఉండవచ్చు. ప్రపంచంలో చాలా మతాలలో భిన్న దృక్పథాలు ఉన్నవే ఉన్నాయి.
ఉదా :
వీటినన్నింటిని పరిశీలించినట్లయితే అన్ని ముఖ్యమైన మతాలలో భిన్న దృక్పథాలు ఉన్నాయని తెలుస్తోంది.

8th Class Social Textbook Page No.225

ప్రశ్న 3.
ఇతర ప్రజాస్వామిక దేశాలతో పోలిస్తే భారత లౌకికవాదం ఏ విధంగా భిన్నమైనది?
జవాబు:
ఇతర ప్రజాస్వామిక దేశాలతో పోలిస్తే ప్రభుత్వాలు మతంతో ఏమాత్రం జోక్యం చేసుకోవు. కానీ భారత లౌకిక విధానం మతాలతో జోక్యం చేసుకుంటుంది. ఈ విధంగా ఇది ఇతర ప్రజాస్వామిక దేశాలతో భిన్నమైనది.

8th Class Social Textbook Page No.226

ప్రశ్న 4.
ఇటీవల కాలంలో భారతదేశంలో ఏ ప్రాంతంలోనైనా, రాజ్యాంగంలోని లౌకిక ఆదర్శాలు ఉల్లంఘింపబడిన ఘటనలు విన్నారా? మతం కారణంగా వ్యక్తులు వేధింపబడి, చంపబడిన ఘటనలు విన్నారా?
జవాబు:
ఇటీవల కాలంలో అంటే 11 సంవత్సరాల క్రితం 2002 లో ఇటువంటి ఘటనలు జరిగాయని మా పెద్దలు చెప్పుకోగా విన్నాము.

ఫిబ్రవరి 22వ తేదీ, 2002 ….

కొంతమంది రామభక్తులు అయోధ్య వెళ్ళి తిరిగి వస్తున్నారు. గుజరాత్ లో ‘గోద్రా’ రైల్వే స్టేషన్‌కు సమీపంలోనే వీరి భోగీలపై ఒక ముస్లింల గుంపు దాడిచేసి కంపార్టుమెంటును తగులబెట్టారు.

ఇందులో 58 మంది హిందువులు ఉన్నారు. వీరిలో 25 మంది స్త్రీలు, 15 మంది పిల్లలు ఉన్నారు. వీరందరూ మరణించారు. ఇది ముందే ప్లాన్ చేయబడినదని తరువాత జరిగిన విచారణలు తెలియచేశాయి.

దీని కారణంగా హిందూ – ముస్లింల మధ్య అనేక మతపరమైన అల్లర్లు జరిగాయి. వీటి మూలంగా 790 మంది ముస్లింలు, 254 మంది హిందువులు చనిపోగా ఎంతోమంది ఇళ్ళనూ, ఆస్తులనూ కోల్పోయారు.

అయితే ఈ సంఘటనలో చెప్పుకోదగిన విశేషమేమిటంటే రాజ్యాంగంలోని ఆదర్శాలను గౌరవించాల్సిన మునిసిపల్ కౌన్సిలర్, మునిసిపల్ ప్రెసిడెంట్ ఇరువురూ కూడా ఈ గుంపు మధ్యలో ఉండి ఈ మారణకాండను నడిపించారని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు.

ఈ సంగతి విని మేము చాలా బాధపడ్డాము. ఇది మనదేశ లౌకికత్వానికి మాయని మచ్చ.

AP Board 8th Class Social Solutions Chapter 20 లౌకికత్వం – అవగాహన

ప్రశ్న 5.
ఈ క్రింది పేరాను చదివి రెండు ప్రశ్నలను తయారు చేయండి.

లౌకికవాదంలో ముఖ్యమైన అంశం ప్రభుత్వ అధికారం నుంచి మతాన్ని వేరుచేయటం. ఒక దేశం ప్రజాస్వామికంగా పనిచేయాలంటే ఇది ముఖ్యం. ప్రపంచంలోని దాదాపు అన్ని దేశాల్లో ఒకటికంటే ఎక్కువ మతాల ప్రజలు నివసిస్తుంటారు. ఈ మతాలలో ఏదో ఒకటి అధిక ప్రజలను కలిగి ఉంటుంది. అధిక సంఖ్యలో ఉన్న మత బృందం ప్రభుత్వాధికారంలోకి వస్తే, ఈ అధికారాన్ని, ఆర్థిక వనరులను వినియోగించుకుని ఇతర మతాలకు చెందిన వ్యక్తులను వేధించవచ్చు, వివక్షతకు గురిచేయవచ్చు. అధిక సంఖ్యాకుల ఆధిపత్యం వల్ల ఈ అల్పసంఖ్యాక ప్రజలు వివక్షత, ఒత్తిడికి గురికావచ్చు. ఒక్కొక్కసారి చంపబడవచ్చు. అధిక సంఖ్యలో ఉన్నవాళ్లు తేలికగా తక్కువ సంఖ్యలో ఉన్నవాళ్ళని వాళ్ల మతాన్ని పాటించకుండా చేయవచ్చు. మతంలో సంబంధం లేకుండా ప్రతి వ్యక్తికీ ప్రజాస్వామిక సమాజం ఇచ్చే హక్కులు మత ఆధిపత్యం వల్ల ఉల్లంఘింపబడతాయి. అంటే అధిక సంఖ్యాకుల పెత్తనాన్ని ప్రాథమిక హక్కులు ఉల్లంఘింపబడకుండా” చూడాలన్నా ప్రజాస్వామిక సమాజాలలో ప్రభుత్వాధికారం నుంచి మతాన్ని వేరుచేయటం చాలా ముఖ్యమవుతుంది.

వ్యక్తులకు వారి మతాన్ని విడిచిపెట్టి మరొక మతాన్ని స్వీకరించడానికి, మత బోధనలను భిన్నంగా విశ్లేషించ డానికి, స్వేచ్ఛను కాపాడటానికి కూడా ప్రజాస్వామ్య సమాజంలో ప్రభుత్వాధికారం నుంచి మతాన్ని వేరుచేయటం ముఖ్యమవుతుంది.
జవాబు:

  1. మత మార్పిడులు ‘అధిక సంఖ్యాకుల మతం నుండి ఎక్కువగా ఉన్నాయా? అల్ప సంఖ్యాకుల మతం నుండి ఎక్కువగా ఉన్నాయా?
  2. ప్రభుత్వాధికారం నుండి మతాన్ని వేరు చేయటం ఎందుచే ముఖ్యమవుతుంది?

ప్రశ్న 6.
ఈ క్రింది పేరాను చదివి ప్రశ్నలకు జవాబులిమ్ము.

2004 ఫిబ్రవరిలో ముస్లిం ఆడపిల్లలు కట్టుకునే తలగుడ్డ, యూదుల టోపీ, క్రైస్తవ శిలువలు వంటి మత, రాజకీయ చిహ్నాలను పాఠశాల విద్యార్ధులు ధరించకుండా ఫ్రాన్స్ ఒక చట్టం చేసింది. ఫ్రాన్స్ కింద ఒకప్పుడు వలస దేశాలుగా ఉన్న అల్జీరియా, ట్యునీసియా, మొరాకో దేశాల నుంచి వచ్చి ఫ్రాన్స్ లో నివసిస్తున్న వాళ్లు ఈ చట్టాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. 1960లలో ఫ్రాన్స్ లో కార్మికుల కొరత తీవ్రంగా ఉండటంతో ఆ దేశాల నుంచి వలస వచ్చి పనిచేయటానికి వీసాలు ఇచ్చింది. ఈ వలస కుటుంబాల ఆడపిల్లలు బడికి వెళ్లేటప్పుడు తలకి గుడ్డ కట్టుకుంటారు. ఈ చట్టం చేసిన తరువాత తలకి గుడ్డ కట్టుకున్నందుకు ఈ పిల్లలు బడి నుంచి బహిష్కరించబడ్డారు.
అ) ఫ్రాన్స్ ఏమి చట్టం చేసింది?
జవాబు:
మత, రాజకీయ చిహ్నాలను పాఠశాల విద్యార్థులు ధరించకుండా ఫ్రాన్స్ ఒక చట్టం చేసింది.

ఆ) ఈ చట్టాన్ని ఎవరు వ్యతిరేకించారు?
జవాబు:
ఫ్రాన్సుకు వలస వచ్చినవారు దీనిని తీవ్రంగా వ్యతిరేకించారు.

ఇ) చట్టం ఎప్పుడు చేయబడింది?
జవాబు:
2004 ఫిబ్రవరిలో

ప్రశ్న 7.
లౌకికవాదం అంటే ఏమిటి?
జవాబు:
ప్రభుత్వంలో మతపరమైన జోక్యం లేకపోవడాన్ని లౌకికవాదం అంటారు.

ప్రశ్న 8.
ఇతర ప్రజాస్వామిక దేశాలతో పోలిస్తే లౌకికవాదం ఏ విధంగా భిన్నమైనది?
జవాబు:
ఇతర ప్రజాస్వామిక దేశాలతో పోలిస్తే ప్రభుత్వాలు మతంతో ఏమాత్రం జోక్యం చేసుకోవు. కానీ భారత లౌకిక విధానం మతాలతో జోక్యం చేసుకుంటుంది. ఈ విధంగా ఇది ఇతర ప్రజాస్వామిక దేశాలతో భిన్నమైనది.

ప్రశ్న 9.
బౌద్ధమతంలో ఎన్ని రకాల దృక్పథాలు ఉన్నాయి? అవి ఏవి?
జవాబు:
బౌద్ధమతంలో 3 రకాల దృక్పథాలు ఉన్నాయి. అవి

  1. తేరవాదం
  2. మహాయానం
  3. వజ్రాయానం

AP Board 8th Class Social Solutions Chapter 20 లౌకికత్వం – అవగాహన

ప్రశ్న 10.
ఏ దేశంలో ముస్లింలు కానివాళ్ళను దేవాలయాలు, ప్రార్థనా మందిరాలు కట్టుకోవడానికి అనుమతించరు?
జవాబు:
సౌదీ అరేబియాలో ముస్లింలు కానివాళ్ళను దేవాలయాలు, ప్రార్ధనా మందిరాలు కట్టుకోవడానికి అనుమతించరు.