SCERT AP 9th Class Biology Guide Pdf Download 10th Lesson నేల కాలుష్యం Textbook Questions and Answers.
AP State Syllabus 9th Class Biology 10th Lesson Questions and Answers నేల కాలుష్యం
9th Class Biology 10th Lesson నేల కాలుష్యం Textbook Questions and Answers
అభ్యసనాన్ని మెరుగుపరుచుకోండి
ప్రశ్న 1.
నేల కాలుష్యం అంటే ఏమిటి? (AS 1)
జవాబు:
నేల కాలుష్యం :
నేల కాలుష్యం అనగా నేల సారం లేదా నాణ్యతపై ప్రతికూల ప్రభావం చూపే పదార్థాల చేరిక అని అర్ధం.
ప్రశ్న 2.
రసాయనిక ఎరువులు పంటలకు ఉపయోగకరం. కానీ అవి పర్యావరణ కాలుష్యానికి ఏ విధంగా కారణమవుతాయి? (AS 1)
జవాబు:
- నేలలో ఎరువులు వేసినప్పుడు ఎరువుల తయారీలో ఉపయోగించే ముడిపదార్థాల నుంచి వచ్చే కలుషితాల వల్ల నేల కలుషితం అవుతుంది.
- ఎక్కువగా భాస్వరపు ఎరువులు ఉపయోగించడం వల్ల లోహాలు అయిన ఆర్సినిక్, లెడ్ మరియు కాడ్మియం నేలలో మోతాదుకు మించి చేరి విషతుల్యం అవుతున్నాయి.
- ఎక్కువ మొత్తంలో రసాయనిక ఎరువులు ఉపయోగించటం వలన అవి సరస్సులు, నదులు, చెరువులను కాలుష్యానికి గురి చేస్తున్నాయి.
- అవి ఎక్కువ మొత్తంలో శైవలాల పెరుగుదలకు కారణమవుతున్నాయి. దీనిని యూటోఫికేషన్ అంటారు.
- ఎక్కువ మొత్తంలో పెరిగే శైవలాలు నీటి ప్రవాహానికి ఆటంకం కలిగిస్తాయి. మరియు నీటిలో ఆక్సిజన్ శాతాన్ని తగ్గిస్తాయి.
- నీటిలో నివసించే ఇతర జీవులకు ఆక్సిజన్ లభ్యం కాకపోవటం వలన అవి చనిపోతాయి.
- నత్రజని ఎరువుల నుండి విడుదలయ్యే అమ్మోనియా మరియు నైట్రోజన్ ఆక్సెడుల వలన గాలి కాలుష్యం అవుతుంది.
- వీటి వలన ఆమ్ల వర్చాలు ఏర్పడటమే కాకుండా పొగతో కూడిన పొగమంచును నగరాలలో ఏర్పరుస్తాయి.
- దీనివలన పర్యావరణ మరియు ఆరోగ్య సమస్యలైన శ్వాససంబంధ వ్యాధులు కలుగుతాయి.
ప్రశ్న 3.
మానవ, పశువుల వ్యర్థాలను పర్యావరణానికి మేలు చేసే విధంగా పారవేసే పద్ధతుల గురించి రాయండి. (AS 1)
జవాబు:
- ఈ మధ్య కాలంలో పశువుల వ్యర్థాలే కాకుండా మానవుని విసర్జిత పదార్థాలు ప్రత్యామ్నాయ మరియు శ్రేష్టమైన పద్ధతిలో ఇంధనం తయారీలో ఉపయోగించవచ్చు.
- వ్యర్థ పదార్థాల నుండి వాయు రహిత కిణ్వనము ద్వారా వాయువు ఉత్పత్తి అవుతుంది. ఆ వాయువును ఇంధనముగా వాడతారు.
- ఈ వాయువు జీవ వ్యర్థాల నుండి తయారయినది కాబట్టి దీనిని బయోగ్యాస్ అంటారు.
- బయోగ్యాస్ నందు మిథేన్, కార్బన్ డయాక్సెడ్ ఇంకా అతి తక్కువ ప్రమాణంలో హైడ్రోజన్, నైట్రోజన్, హైడ్రోజన్ సల్ఫేట్లు ఉంటాయి.
ప్రశ్న 4.
పరిశ్రమల నుండి వెలువడే వ్యర్థాల వలన కలిగే నేల కాలుష్యాన్ని తగ్గించడానికి ఏమేమి చర్యలు చేపట్టాలి? (AS 1)
జవాబు:
- పరిశ్రమల నుండి విడుదలయ్యే వ్యర్థాలను భౌతికంగా, రసాయనికంగా మరియు జీవ శాస్త్రీయంగా ప్రమాదకరంకాని పదార్థాలుగా వాటిని తయారు చేయాలి.
- ఆమ్ల మరియు క్షార వ్యర్థాలను ముందుగా తటస్థీకరించాలి.
- నీటిలో కరగని పదార్థములయితే అవి నేలలో కలిసిపోయే పదార్ధములయితే వాటిని సహజ పరిస్థితులలో నేలలో కలసిపోయే విధంగా చేయాలి.
- కర్మాగారాల నుండి విడుదలయ్యే పొగలో రేణురూప కలుషితాలను తగ్గించటం కోసం, స్థిర విద్యుత్తు అవక్షేపాల పద్ధతిని ఉపయోగించాలి.
ప్రశ్న 5.
వైద్య సంబంధ వ్యర్థాలు అంటే ఏమిటి? ఎందుకు వీటిని హానికరమైన వ్యర్థాలుగా పరిగణిస్తారు? ప్రమాదకరం కాకుండా వీటిని తొలగించుకొనే పద్ధతులు ఏమి? (AS 1)
జవాబు:
- ఆసుపత్రులందు తయారయిన వ్యర్థ పదార్థములను వైద్య సంబంధ వ్యర్థ పదార్థాలు అంటారు.
- ఆసుపత్రిలో ఉత్పత్తి అయ్యే వ్యర్థాల వల్ల అనేక రకాల వ్యాధులు కలుగుతాయి. అందువలన వీటిని హానికరమైన వ్యర్థాలుగా పరిగణిస్తారు.
- సిరంజిలు, సూదులు, శస్త్ర చికిత్స పరికరాలు, ఆపరేషన్ థియేటర్ వ్యర్థాలు, మిగిలిన మందులు, బాండేజి గుడ్డలు, మానవ విసర్జితాలు మొదలైనవి వైద్య సంబంధ వ్యర్థాలకు ఉదాహరణలు.
- వైద్య సంబంధ వ్యర్థాలు ప్రమాదకరం కాకుండా వీటిని నివాస ప్రాంతాలకు దూరంగా నేలలో గోతులను తీసి పూడ్చివేయాలి.
ప్రశ్న 6.
ఎలాంటి వ్యవసాయ విధానాలు నేల కాలుష్యానికి కారణమవుతాయి? ఇవి ఏ విధమైన ప్రభావాన్ని చూపుతాయి? (AS 1)
జవాబు:
- విచక్షణారహితంగా ఎరువులు, శిలీంధ్ర నాశకాలు, కీటక సంహారకాలు, గుల్మనాశకాలు వాడడం, దున్ని వ్యవసాయం చేయడం, పంట మార్పిడి పద్ధతులు అవలంబించకపోవడమనేవి నేల కాలుష్యానికి కారణమవుతాయి.
- ఈ విధమైన వ్యవసాయ విధానాలు నేల మీద వ్యతిరేక ప్రభావాలు చూపిస్తాయి.
- రసాయనిక ఎరువులు వాడడం వల్ల మనం 20 – 30 సంవత్సరాల వరకే అధికోత్పత్తి సాధించగలం.
- ఆ తర్వాత నేల మొక్కలు మొలవడానికి కూడా పనికిరాకుండా పోతుంది.
- ఎక్కువ మొత్తంలో శిలీంధ్రనాశకాలు, క్రిమిసంహారకాలు, గుల్మనాశకాలు వినియోగించినట్లయితే నేల లవణీయత పెరిగిపోతుంది. మరియు పంటలు పండించడానికి ఆ నేల ఉపయోగపడదు.
- నేలకు ఎలాంటి అంతరాయం కలిగించకుండా పంటలు పండింఛడం, నేలను దున్నకుండా వ్యవసాయం చేయడం.
- నేలలో ఎరువులు వేయడానికి చాళ్ళను దున్నడం పనికి వస్తున్నప్పటికీ దీని వలన నేలలో ఉండే సూక్ష్మజీవులు
చనిపోతాయి. అందువలన నత్రజని స్థాపన తగ్గిపోతుంది. - ఒక రకం పంటను అన్ని కాలాలలో పండించడం వలన నేల కాలుష్యమవుతున్నది. తద్వారా పంట దిగుబడి తగ్గుతుంది.
ప్రశ్న 7.
మీ పరిసరాలలో కాలుష్యం కలిగించకుండా అనుసరిస్తున్న వ్యవసాయ విధానాలను గుర్తించి క్రమంలో రాయంది. (AS 1)
జవాబు:
- సేంద్రియ ఎరువులు వినియోగం
- సేంద్రియ పురుగు మందులు వినియోగం
- సేంద్రియ కలుపు మందులు వినియోగం
- పరభక్షక కీటకాల వినియోగం
- దున్నకుండా వ్యవసాయం చేయడం
- నేలలో సరియైన pH విలువ ఉండేలా చూడటం
- పంట మార్పిడి పద్ధతి
- క్షారత్వ నిర్వహణ
- నేలలోని జీవులు
ప్రశ్న 8.
నేలకు ఉండే మూడు ప్రధాన ధర్మాలను తెలిపి అవి ఏ విధంగా మొక్కల మీద ప్రభావం చూపిస్తాయో రాయండి. (AS 1)
జవాబు:
1) నేలకు ఉండే మూడు ప్రధాన ధర్మాలు :
1. భౌతిక ధర్మాలు, 2. రసాయనిక ధర్మాలు, 3. జీవసంబంధ ధర్మాలు.
2) భౌతిక ధర్మాలు – మొక్కల మీద ప్రభావం :
a) నేలలో ఉన్న అసంఖ్యాకమైన సూక్ష్మజీవులు జైవిక పదార్థాలను మొక్కలకు ఉపయోగపడే పోషకాలుగా మారుస్తాయి.
b) నేలను వ్యవసాయానికి అనుకూలంగా మారుస్తాయి.
3) రసాయనిక ధర్మాలు – మొక్కల మీద ప్రభావం :
a) మొక్కకు కావలసిన పోషకాల అందుబాటు నేల యొక్క pH విలువపై ఆధారపడి ఉంటుంది.
b) నేలలో pH విలువ తగ్గే కొద్దీ మొక్కకు కావలసిన పోషకాలైన సోడియం, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం మరియు సల్ఫర్ అందుబాటు తగ్గుతుంది.
4) జీవసంబంధ ధర్మాలు – మొక్కల మీద ప్రభావం :
a) నేలలో ఉన్న జీవరాశులు వృక్ష సంబంధ వ్యర్థాల మీద ఆధారపడి జీవిస్తూ నేలలోకి గాలి చొరబడడానికి నీరు నేలలోకి ఇంకేలా చేయడానికి తోడ్పడతాయి.
b) నేలలో ఉండే సూక్ష్మజీవులు జీవ సంబంధములను అనగా సేంద్రియ స్థితిలో ఉన్న వాటిని నిరింద్రియ పదార్థాలుగా మార్చి మొక్కలకు అందిస్తాయి.
ప్రశ్న 9.
ఉదజని సూచిక (pH) అంటే ఏమిటి? నేల ఉదజని సూచిక విలువ చాలా ఎక్కువగా ఉండటం లేదా చాలా తక్కువగా ఉండటం వలన కలిగే ఫలితాలు ఏమిటి? (AS 1)
జవాబు:
- నేలల ఆమ్ల మరియు క్లార స్వభావాలను తెలపడానికి pH ప్రమాణాలను ఉపయోగిస్తారు.
- మంచి నేలల pH విలువలు 5.5 నుండి 7.5 వరకు ఉంటాయి.
- pH విలువ 7 కన్నా తక్కువ కలిగిన నేలలను ఆమ్ల స్వభావం కలిగిన నేలలు అని, pH విలువ 7 కన్నా ఎక్కువ కలిగిన నేలలను క్షార స్వభావం కలిగిన నేలలు అని అంటారు.
ఉదజని సూచిక తక్కువగా ఉండడం వలన కలిగే ఫలితాలు :
- నీటిలో కరిగే లోహాలు అల్యూమినియం మరియు మాంగనీసు విషపదార్థాలుగా మారతాయి.
- కాల్షియం కొరత ఏర్పడవచ్చు.
- మొక్కలకు పోషకాలను అందించే సూక్ష్మజీవుల సంఖ్య తగ్గుతుంది.
- చిక్కుడు జాతి మొక్కలలో సహజీవన నత్రజని స్థాపన తీవ్ర ప్రభావానికి లోనవుతుంది.
- నేలలో తక్కువ సేంద్రియ పదార్థం ఉంటుంది.
- మొక్కలకు అందుబాటులో ఉండే పోషకాల సంఖ్య తగ్గుతుంది.
ఉదజని సూచిక ఎక్కువగా ఉండడం వలన కలిగే ఫలితాలు :
- మొక్కలు పోషకాలను గ్రహించడం మరియు సూక్ష్మజీవుల చర్యలు తగ్గిపోతాయి. తద్వారా మొక్కలకు అవి విషపదార్థాలుగా మారతాయి.
- ఉదజని సూచిక ఎక్కువగా ఉండుట వలన ఎక్కువ మొక్కలలో కణత్వచపు పొరలు మూయటం లేదా తెరవడం జరుగుతుంది.
- ఇది మొక్కల నిర్మాణం పైనా మరియు పోషకాలను పైకి గ్రహించే విధానం పైనా ప్రభావం చూపుతుంది.
- ఎక్కువ ఉదజని సూచిక వలన పోషకాలు అత్యధికంగా లభ్యమవడం లేదా అసలు లభ్యం కాకపోవడం జరుగుతుంది.
ప్రశ్న 10.
నేల సారవంతత అంటే ఏమిటి? నేలసారం పెంచుకోవడానికి మార్గాలేవి? (AS 1)
జవాబు:
- నేల సారవంతత నేల ధర్మాల మీద ఆధారపడి ఉంటుంది.
- ముఖ్యంగా నేలకు గల నీటిని నిలిపి ఉంచుకునే శక్తి, మొక్కలకు కావలసిన పోషకాలను కలిగి ఉండి అవసరమైన పరిమాణంలో నేరుగా అందించగలగడం అనే ధర్మాలు నేల సారవంతతను తెలియచేస్తాయి.
- సూక్ష్మజీవులు నేలలోని జైవిక పదార్థాన్ని తయారు చేయటంలో, పోషకాలను మెండుగా కలిగి ఉండే హ్యూమస్ తయారీలో కూడా ప్రధాన పాత్ర పోషిస్తాయి.
- నేలలో ఉండే పోషకాలు మట్టి కణాలతో బంధింపబడి ఉండకపోతే అవి మొక్కలకు అందుబాటులోకి రావు.
- సారవంతమైన నేల సూక్ష్మజీవులు జీవించడానికి అనుకూలంగా ఉంటుంది.
- నేల సారవంతతను పెంచడానికి సేంద్రియ ఎరువులు వినియోగిస్తారు.
- శిలీంధ్ర తంతువులు మొక్కల వేళ్ళు చొచ్చుకుపోలేని సూక్ష్మ ప్రదేశాలలోకి వెళ్ళి పోషకాలను సిద్ధం చేస్తాయి.
- నేల pH, ఆమ్ల, క్షార స్వభావాలు కూడా పోషకాలను మొక్కలకు అందుబాటులోకి తీసుకురావడానికి తోడ్పడతాయి.
- వృక్ష మరియు జంతువుల వ్యర్థాలు కుళ్ళిపోయినపుడు నేలలోనికి పోషకాలు విడుదల అవుతాయి.
ప్రశ్న 11.
జీవ సంబంధ పదార్థం అంటే ఏమిటి? ఇది మొక్కలకు ఎందుకు ముఖ్యమైనది? (AS 1)
జవాబు:
- జీవ సంబంధ పదార్థాలలో కుళ్ళిన జంతు, వృక్ష కళేబరాలు, వాటి విసర్జితాలు ఉంటాయి.
- సేంద్రియ పదార్థాలలో మొక్కల పెరుగుదలకు అవసరమయ్యే పనికివచ్చే నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం మొదలైన పోషకాలు ఉంటాయి.
- నేలలో 30 శాతం లేదా అంతకన్నా ఎక్కువ జీవ సంబంధ పదార్థాలను కలిగి ఉండే దానిని జైవిక నేల అంటారు.
- నేలలో ఉన్న జీవ సంబంధ పదార్థాలు నేలలో నీరు ఇంకడాన్నీ, నీటిని నిలువ ఉంచుకునే శక్తిని వృద్ధి చేస్తాయి.
- నేల నుండి తేమ ఆవిరి కాకుండా నిరోధిస్తాయి. 6) ఇలాంటి నేలలలో ఉండే అసంఖ్యాకమైన సూక్ష్మజీవులు జైవిక పదార్థాలను మొక్కలకు ఉపయోగపడే పోషకాలుగా మారుస్తాయి.
ప్రశ్న 12.
నేలలో జీవ సంబంధ పదార్థ స్థాయిపై ప్రభావితం చేసే కారకాలు ఏవి? నేలలో వీటిని ఎలా పెంచవచ్చు? (AS 1)
జవాబు:
1) నేలలో జీవ సంబంధ పదార్ధ స్థాయిపై ప్రభావం చూపే కారకాలు :
ఉష్ణోగ్రత, వర్షపాతం, సహజంగా పెరిగే చెట్లు, నేల స్వరూపం, నీటి పారుదల, పంటలు పండించడం, నేల దున్నడం మరియు పంట మార్పిడి పద్ధతులు.
2) ఉష్ణోగ్రత :
సేంద్రియ పదార్థం కుళ్ళిపోయే వేగం ఉష్ణోగ్రత ఎక్కువగా ఉన్నప్పుడు కంటే తక్కువగా ఉన్నప్పుడు జరుగుతుంది.
3) ప్రతి 10°C ఉష్ణోగ్రత తగ్గుదలకు రెండు నుండి మూడు రెట్ల సేంద్రియ పదార్థం మరియు పోషకాలు నేలకు చేర్చబడతాయి.
4) వర్షపాతము :
వర్షపాతము పెరిగే కొద్ది ఏర్పడే సేంద్రియ పదార్థము పెరుగుతుంది.
5) నేల స్వభావం :
అతి నాణ్యమైన స్వరూపం గల నేలలో ఎక్కువ సేంద్రియ పదార్థం ఉంటుంది.
6) సహజంగా పెరిగే చెట్లు :
గడ్డి మైదానాలలో ఉండే నేలలలో ఎక్కువ మొత్తంలో సేంద్రియ పదార్థం ఉంటుంది.
7) నీటి పారుదల :
నీటి పారుదల సక్రమంగా లేని నేలలందు తేమ ఎక్కువగా ఉంటుంది. గాలి చొరబాటు తక్కువ. అందువలన సేంద్రియ పదార్థం ఎక్కువగా ఉంటుంది.
8) పంటలు పండించడం మరియు దున్నడం :
పంటలు పండే నేలలందు చాలా తక్కువ మొత్తంలో సేంద్రియ పదార్థం. పోషక పదార్థాలు ఉంటాయి.
9) పంట మార్పిడి :
ప్రధాన ధాన్యపు పంట పండించిన తరువాత చిక్కుడు జాతికి చెందిన పంటలు పండిస్తే నేలలో ఎక్కువ మొత్తం సేంద్రియ పదార్థం ఉంటుంది.
ప్రశ్న 13.
జైవిక సవరణీకరణ (Bio-Remediation) అంటే ఏమిటి? ఇది నేల కాలుష్యాన్ని నియంత్రించడంలో ఏ విధంగా ఉపయోగపడుతుంది? (AS 1)
జవాబు:
- జీవ సంబంధ పద్ధతుల ద్వారా కాలుష్య కారకాలను తొలగించడాన్ని జైవిక సవరణీకరణ అంటారు.
- అవక్షేపాలు, నేల, నీరు మొదలైన వాటిలో ఏర్పడే పర్యావరణ సమస్యలను తొలగించుకోవడానికి సాధారణంగా సూక్ష్మజీవులను ఉపయోగిస్తారు.
- జైవిక సవరణీకరణంలో సూక్ష్మజీవులతోపాటు మొక్కలను కూడా ఉపయోగిస్తారు. దీనిని ఫైటోరిమిడియేషన్ అంటారు.
- లోహాల వంటి అకర్బన పదార్థాలు, తక్కువ స్థాయిలో గల రేడియోధార్మిక పదార్థాలు వంటి వాటి ద్వారా కలిగే కాలుష్యాన్ని తొలగించడానికి జైవిక పద్ధతులను ఉపయోగిస్తారు.
ప్రశ్న 14.
నేల స్వరూప స్వభావాలు నేలలో ఉండే పోషకాల మీద ప్రభావం చూపిస్తాయి. ఇవి వ్యవసాయం మీద ఎలాంటి ప్రభావం కలిగిస్తాయి? (AS 2)
జవాబు:
- వదులుగా, సూక్ష్మరంధ్రాలు కలిగిన నేల ఎక్కువ నీటిని గ్రహిస్తుంది. మరియు వేర్ల విస్తరణకు తోడ్పడుతుంది. వదులుగా ఉన్న నేల పోషకాలను మొక్కలు గ్రహించడంలో ఉపయోగపడుతుంది.
- సూక్ష్మమైన రేణువులు కలిగిన మట్టి, నేల యొక్క ఉపరితలమును పెంచుతుంది. తద్వారా పోషకాలను తనలో ఉంచుకోగలుగుతుంది.
- ఎక్కువ రంధ్రాలు కలిగిన నేల అనగా ఇసుకనేల తనగుండా ఎక్కువ మొత్తంలో పోషకాలను తనగుండా పోనిస్తుంది. తక్కువ మొత్తంలో పోషకాలు మొక్కలకు అందుబాటులో ఉంటాయి.
- సాధారణముగా వదులుగా ఉన్న, గాలి గలిగిన నేల నిర్మాణము మొక్కల పెరుగుదలకు అనుకూలము. పంట దిగుబడి ఎక్కువ వచ్చును.
- నేలను దున్నడం ద్వారా చిన్న మరియు పెద్ద మట్టి రేణువులు కలవడం అనేది దున్నడం ద్వారా చేయవచ్చు. ఎరువును దున్నడం ద్వారా నేలలో కలిసే విధంగా చేయవచ్చు.
ప్రశ్న 15.
నేలల సంరక్షణ ముఖ్యమైన అంశము. దీని గురించి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోకపోతే ఏమి జరుగుతుంది? (AS 2)
జవాబు:
- నేల అనేక జీవులు, మొక్కలకు ఆవాసం కనుక నేల సంరక్షణ మనకు అతి ముఖ్యమైన అంశము. ఎందువలనంటే నేల మానవులకు, జంతువులకు ఆహార వనరు.
- నేల పైభాగము క్రమక్షయమునకు గురి అయినట్లయితే అతి ముఖ్యమైన పోషక పదార్థాలను కోల్పోవటం వల్ల పంట దిగుబడి తగ్గుతుంది. అందువలన ఒక ఎకరాకు వచ్చే ఆహార దిగుబడి తగ్గుతుంది. కనుక నేలను సంరక్షించాలి.
- మొక్కల పెరుగుదలకు కావలసిన సేంద్రియ పదార్థం నేలలో ఉన్నది కనుక మనము నేలను సంరక్షించాలి.
- నేల సంరక్షణ చర్యలు చేపట్టకపోయినట్లయితే మృత్తికా క్రమక్షయము జరుగుతుంది.
- నేల నందు ఎక్కువగా పంటలు పండించినపుడు వాడే ఎరువుల వలన నేల లవణీయత పెరిగి, పంట పండించడానికి అనుకూలముగా ఉండదు. అందువలన నేలను సంరక్షించాలి.
- నేలను సంరక్షించకపోయినట్లయితే నేలలోని పోషకాలు తగ్గిపోతాయి.
ప్రశ్న 16.
నేలలో జీవించే ఏవైనా పది జీవుల పేర్లు రాయండి. ఇవి నేల మీద ఎలాంటి ప్రభావాన్ని కలిగిస్తున్నాయో రాయండి. (AS 4)
జవాబు:
- అతి సూక్ష్మమైన వైరస్లు, ఎలుకలు, నేల ఉడుతలు, బాక్టీరియా, శైవలాలు, శిలీంధ్రాలు, ప్రోటోజోవన్లు, పేడ పురుగులు, వానపాములు వివిధ రకాలయిన పురుగులు ఉంటాయి.
- నేలలో నివసించే జీవులు వృక్ష సంబంధ వ్యర్థాల మీద జీవిస్తూ నేలలోకి, గాలి చొరబడడానికి, నీరు నేలలోకి ఇంకేలా చేయడానికి తోడ్పడతాయి.
- నేలలో ఉండే సూక్ష్మజీవులు జీవ సంబంధ మూలకాలను అనగా సేంద్రియ స్థితిలో ఉన్న వాటిని నిరింద్రియ పదార్థాలుగా మారుస్తాయి.
- నేలలో నిరింద్రియ పదార్థాలు పోగుపడకుండా వివిధ రకాలైన సూక్ష్మజీవులు నియంత్రిస్తూ ఉంటాయి.
- సూక్ష్మజీవులు జరిపే వివిధ జీవ, భౌతిక, రసాయనిక చర్యల వల్ల నేలను వ్యవసాయానికి, ఇతర ప్రయోజనాలకు నేల తోడ్పడేలా చేస్తాయి.
ప్రశ్న 17.
నేల కాలుష్యం కలిగించే కారకాలను, వాటిని తొలగించే పద్ధతులను వివరించే ఫ్లోచార్టను తయారు చేయండి. (AS 5)
జవాబు:
ప్రశ్న 18.
మీ పరిసరాలలో కాలుష్యం కలిగించే చర్యలను గుర్తించండి. వాటిని ఎలా నివారించాలో సూచించే ఫ్లో చార్టును లేదా పట్టికను రూపొందించండి. (AS 5)
జవాబు:
మా పరిసరాలలో కాలుష్యం కలిగించే చర్యలు :
పరిశ్రమల నుండి వచ్చే వ్యర్థాలు, రసాయనిక పదార్థాలు, వ్యవసాయ క్రిమిసంహారకాలు, ఎరువులు మరియు కీటక సంహారకాలు, ఘనరూప వ్యర్థాలు.
ప్రశ్న 19.
కింది గుర్తును చూసి దీనికి అర్థం ఏమిటో చెప్పండి. (AS 5)
జవాబు:
- ఇది జైవిక సవరణీకరణకు సంబంధించిన గుర్తు.
- మొక్కలు జైవిక సవరణీకరణకు ఉపయోగపడతాయని అర్థం.
ప్రశ్న 20.
ప్లాస్టిక్ సంచులు పర్యావరణానికి ఆటంకం కలిగిస్తున్నాయంటారు ఎందుకు? (AS 6)
జవాబు:
- ప్లాస్టిక్ వినియోగం అత్యధికంగా ఉండటం వల్ల పర్యావరణంపై దాని యొక్క ప్రభావం అధికంగా ఉన్నది.
- ప్లాస్టిక్ సంచుల వినియోగం వలన నీటి ప్రవాహాలకు ఆటంకం ఏర్పడటం, నేలలోని సూక్ష్మరంధ్రాలను మూసివేయటం మురియు భూగర్భజల సేకరణకు ఆటంకం మొదలైనవి ఏర్పడుతున్నాయి.
- నేలలో ఉన్న సూక్ష్మజీవుల క్రియాత్మకతపై ప్లాస్టిక్ సంచులు ప్రభావం చూపిస్తాయి.
- ప్లాస్టిక్ సంచులను తిన్న జంతువులు చనిపోవడం జరుగుతుంది.
- ప్లాస్టిక్ సంచుల నుండి విడుదలయ్యే విషపూరిత రంగులు ఆహార పదార్ధములను కలుషితం చేస్తాయి.
- ప్లాస్టిక్ సంచులు నేలపై వెదజల్లబడతాయి లేదా సరియైన యాజమాన్య నిర్వహణలేని చెత్తకుప్పలందు పేరుకొని ఉంటాయి. ఇవి నేలలో కలసిపోవడానికి వందల సంవత్సరాల సమయం పడుతుంది.
- పేరుకొనిపోయిన ప్లాస్టిక్ సంచుల వలన పర్యావరణానికి హాని కలుగుతుంది.
ప్రశ్న 21.
నేల ఆరోగ్యం ఎంతో ముఖ్యమైన అంశం అని రాము చెప్పాడు. నీవు అతనిని ఎలా సమర్థిస్తావు? (AS 6)
జవాబు:
- నేల ఆరోగ్యం ఎంతో ముఖ్యమైన అంశం అని రాము చెప్పిన మాటను నేను సమర్ధిస్తాను.
- ఎందుకంటే ఆరోగ్యవంతమైన నేల ద్వారా వచ్చే ఆహార ఉత్పత్తులను తిన్న ప్రాణులు కూడా ఆరోగ్యంగా ఉంటాయి.
- నేలలో ఉండవలసిన అంశాలు సమపాళ్ళలో ఉన్నప్పుడు ఆ నేల అధిక దిగుబడి కూడా ఇస్తుంది.
ప్రశ్న 22.
మీ గ్రామంలో మీరు ఏ ఏ నేల కాలుష్య సమస్యలను గుర్తించారు? వాటికి కారణాలను, అవి తొలగించడానికి సూచనలను రాయండి. (AS 7)
జవాబు:
మా ఊరిలో నేను గుర్తించిన నేల కాలుష్య సమస్యలు :
నేల కాలుష్య సమస్య | కారణం | తొలగించడానికి సూచనలు |
1. మురికి కాలువల్లో చెత్త పేరుకొనిపోవడం | నీటి ప్రవాహంలో ఘనరూప పదార్థాలు అడ్డుపడడం | 1. కాలువలలో ఘనరూప వ్యర్థాలు వేయకుండా చూడాలి. 2. ఎప్పటికప్పుడు కాలువలో పూడిక తీయాలి. |
2. దుర్వా సన | ఒకే ప్రదేశంలో వ్యర్థాలు పారవేయడం | నివాస ప్రదేశాలకు దూరంగా వ్యర్థాలను పారవేయాలి. |
3. ఆసుపత్రి వ్యర్థాల వలన నేల కాలుష్యం | జనావాస ప్రదేశాలలో ఆసుపత్రి వ్యర్థాలు వేయడం | సుదూర ప్రాంతాలలో నేలలో గోతులు తీసి పూడ్చాలి. |
4. మల విసర్జన వల్ల కాలుష్యం, దుర్వాసన | రోడ్లకు ఇరువైపులా మల విసర్జన | పాయఖానాలను మల విసర్జనకు వినియోగించాలి. |
5. నేల లవణీయత పెరుగుదల | ఎక్కువ మొత్తంలో రసాయనిక ఎరువులు వాడడం | సేంద్రియ ఎరువులను వినియోగించాలి. |
ప్రశ్న 23.
ఘనరూప వ్యర్థాలు అంటే ఏమిటి? ఘనరూప వ్యర్థాల యాజమాన్యానికి సరైన పద్ధతులను సూచించండి. (AS 7)
జవాబు:
- వివిధ చర్యల ద్వారా సమాజం చేత ఒకసారి వాడుకొని పారేయబడిన కర్బన, అకర్బన పదార్థాలు వ్యర్థాలు అన్నింటిని ఘనరూప వ్యర్థాలు అంటారు.
ఘనరూప వ్యర్థాల యాజమాన్యానికి సరైన పద్ధతులు : - తగ్గించడం (Reduce), తిరిగి ఉపయోగించడం (Reuse), మరల వాడుకునేందుకు వీలుగా మార్చడం (Recycle), తిరిగి చేయడం (Recover) (4R system) అనే పద్ధతుల ద్వారా ఘనరూప వ్యర్థాలను తగ్గించవచ్చు.
- కాగితం, గాజు, కొన్ని రకాల ప్లాస్టిక్ వస్తువులను తిరిగి ఉపయోగించుకునే విధంగా తయారుచేయడం.
- ఘనరూప వ్యర్థాల యాజమాన్యంలో వ్యర్థాల సేకరణ, అనుకూలమైన ప్రదేశాలకు రవాణా చేయడం, పర్యావరణానికి విఘాతం కలిగించని పద్ధతుల ద్వారా తొలగించడం అనే దశలు పాటించాలి.
- ఘనరూప వ్యర్థాల యాజమాన్యంలో వీటిని నివాస ప్రాంతాలకు దూరంగా నేలలో గోతులను తీసి పూడ్చడమనేది అందరికి తెలిసిన పద్ధతి.
- ఘనరూప వ్యర్థాలను ఎరువుగా మార్చడం, అత్యధిక ఉష్ణోగ్రతల వద్ద మండించడం కూడా చేయవచ్చు.
9th Class Biology 10th Lesson నేల కాలుష్యం Textbook InText Questions and Answers
9th Class Biology Textbook Page No. 159
ప్రశ్న 1.
మనం ఎక్కడ పడితే అక్కడ వ్యర్థాలను పడేస్తూపోతే ఏమవుతుంది?
జవాబు:
- మనం ఎక్కడపడితే అక్కడ వ్యర్థాలను పడేస్తూపోతే అవి పరిసరాలను కాలుష్యపరుస్తాయి.
- నేల కాలుష్యానికి గురి చేస్తాయి. దుర్వాసన వెదజల్లుతాయి.
- ఒక్కొక్కసారి వ్యాధులను వ్యాప్తి చేయడంలో కారకమవుతాయి.
- మనుష్యుల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తాయి.
9th Class Biology Textbook Page No. 161
ప్రశ్న 2.
ఈ రోజు మీ పాఠశాల / ఇంట్లో ఉత్పత్తి అయిన వ్యర్థాలు ఏవి? వాటిలో కుళ్ళిపోని వ్యర్థాలు ఏవి? ఇవి ఏ విధంగా నేల కాలుష్యానికి కారణమవుతున్నాయి?
జవాబు:
ఈ రోజు మా పాఠశాల / ఇంట్లో ఉత్పత్తి అయిన వ్యర్థాలు :
వంటింటి చెత్త, పండ్ల తొక్కలు, మిగిలిన అన్నం, మినుముల పొట్టు, గాజు ముక్కలు, పెన్నులు, పాలిథీన్ కవర్లు, కార్డుబోర్డు, పేపరు, రబ్బరు, టీ గ్లాసులు, బిస్కెట్లు, చాక్లెట్ల కవర్లు, ఐస్ క్రీం పుల్లలు మొదలగునవి.
కుళ్లిపోని వ్యర్థాలు :
గాజు ముక్కలు, పాలిథీన్ కవర్లు, రబ్బరు, టీ గ్లాజులు (ప్లాస్టిక్), ఇవి ఎక్కువ కాలం నేలలో కలిసిపోకుండా ఉంటాయి. నేలలోనికి విష పదార్థాలను విడుదల చేస్తాయి. నీటి ప్రవాహానికి ఆటంకం కలిగిస్తాయి.
9th Class Biology Textbook Page No. 156
ప్రశ్న 3.
నేలల ఆమ్ల లేదా క్షార స్వభావం ఎక్కువైతే ఏం జరుగుతుంది?
జవాబు:
- నేలలందు ఆమ్ల లేదా క్షార స్వభావం ఎక్కువైతే మొక్కలకు లభ్యమయ్యే పోషకాలు తగ్గిపోతాయి.
- తద్వారా పంట దిగుబడి గణనీయంగా తగ్గుతుంది.
9th Class Biology Textbook Page No. 157
ప్రశ్న 4.
ఒక నేల సారవంతమైనది ఎలా చెప్పగలవు? జట్లతో చర్చించి మీ అభిప్రాయం రాయండి.
జవాబు:
నేల సారవంతమైన ధర్మాలపై ఆధారపడి ఉంటుంది. అవి :
- సారవంతమైన నేల మంచి దిగుబడిని ఇస్తుంది.
- సారవంతమైన నేల మంచి పోషకాలను కలిగి ఉంటుంది.
- ఈ నేలకు నీటిని నిలుపుకొనే సామర్ధ్యం అధికం.
- మొక్కలకు పోషకాలను నేరుగా అందిస్తుంది.
- సూక్ష్మజీవులు జీవించటానికి అనుకూలంగా ఉంటుంది.
- వేర్ల పెరుగుదలకు సౌకర్యంగా ఉంటుంది.
- సారవంతమైన నేల మంచి ఆవాసంగా ఉంటుంది.
9th Class Biology 10th Lesson నేల కాలుష్యం Textbook Activities (కృత్యములు)
కృత్యం – 1
1. కింది సూచనల ఆధారంగా పట్టిక నింపండి.
1) పాఠశాల విరామ సమయంలో వేణు ఒక పండు తింటున్నాడు.
2) పండ్ల తొక్కను వరండాలో మూలకు పడేశాడు.
3) అతని మిత్రుడు రాము అలా చేయడం తప్పు అన్నాడు. మనం వ్యర్థాలను వరండాలో వేయరాదు. తరగతి గదిలో ఉన్న చెత్తబుట్టలో వేయాలి అన్నాడు.
4) ఏయే వ్యర్థాలను ఎక్కడ వేయాలో కింది పట్టికలో రాయండి.
తడి చెత్త | పొడి చెత్త |
1. కూరగాయల చెత్త | బిస్కట్ కవర్లు |
2. అరటి తొక్కలు | పాలిథీన్ కవర్లు |
3. ఆహార పదార్థాలు | వాడిన కాగితాలు |
4. పండ్ల తొక్కలు | ప్లాస్టిక్ వస్తువులు |
5. పేడ | గాజు వస్తువులు |
6. చొప్ప | అట్ట ముక్కలు |
పేడ, చొప్ప వంటి తడి చెత్తను నిర్దేశిత ప్రదేశంలో వేయాలి. మిగిలిన తడి చెత్తలను ఒక చెత్త బుట్టలోనూ, పొడి చెత్తలను మరొక చెత్త బుట్టలోనూ వేయాలి.
కృత్యం – 2
2. పై పట్టికలో మీరు రాసిన వాటిలో ఒక రోజులో మీరు పారవేసే తడి చెత్త బరువును కొలవండి.
జవాబు:
1) మీ ఇంటిలో గల సభ్యుల సంఖ్యతో ఆ బరువును భాగించండి.
2) ఉదాహరణకు ఒక ఇంటిలో గల సభ్యుల సంఖ్య 4. వారు ఒక రోజు పడవేసే తడి చెత్త బరువు సుమారు 400 గ్రా.
ఆ ఇంటి తలసరి తడి చెత్త = 400 ÷ 4 = 100 గ్రా.
ఒక సంవత్సరానికి తయారయ్యే తలసరి చెత్త = 100 గ్రా. × 365
= 36500 గ్రా. = 36.5 కి.గ్రా.
కృత్యం – 3
3. చెత్తను కుళ్ళింపజేయడం
- పాలిథీన్ సంచి లేదా ప్లాస్టిక్ బకెట్ లేదా ఏదైనా ఒక డ్రమ్ము వంటి పాత్రను తీసుకోవాలి.
- దానిని సగం వరకు మట్టితో నింపాలి.
- దీనిలో తడి చెత్త మరియు ఇతర చెత్తలను వేయండి.
- ఈ చెత్తలో కచ్చితంగా కూరగాయల తొక్కలు, రబ్బరు, ప్లాస్టిక్ వంటి పదార్థాలుండాలి.
- దీనికి మరికొంత మట్టిని జత చేయాలి.
- దీనిపై నీళ్ళను క్రమం తప్పకుండా రోజూ చల్లుతూ ఉండండి.
- ప్రతి 15 రోజులకు ఒక్కసారి దాని లోపల తవ్వి చూడాలి. ఇలా చేసేటప్పుడు చేతి తొడుగులు ధరించాలి.
- పని పూర్తయిన తరువాత చేతులు సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలి.
కింద ఇచ్చిన పట్టికలో పరిశోధనలు నమోదు చేయాలి.