AP 9th Class Biology Important Questions 2nd Lesson వృక్ష కణజాలం

These AP 9th Biology Important Questions and Answers 2nd Lesson వృక్ష కణజాలం will help students prepare well for the exams.

AP Board 9th Class Biology 2nd Lesson Important Questions and Answers వృక్ష కణజాలం

9th Class Biology 2nd Lesson వృక్ష కణజాలం 1 Mark Important Questions and Answers

ప్రశ్న 1.
కణజాలాలు అనగానేమి?
జవాబు:
ఒకే విధమైన నిర్మాణం కలిగి ఒకే విధమైన విధుల్ని నిర్వర్తించే కణాల సమూహాలను కణజాలాలు అంటారు.

ప్రశ్న 2.
మొక్కలలో కణజాలాలు ఎన్ని రకాలు? అవి ఏవి?
జవాబు:
మొక్కలలో కణజాలాలు నాలుగు రకాలు. అవి : 1. విభాజ్య కణజాలాలు 2. త్వచ కణజాలాలు 3. సంధాయక కణజాలాలు 4. ప్రసరణ కణజాలాలు

ప్రశ్న 3.
విభాజ్య కణజాలం మొక్కలలో ఏయే ప్రదేశాలలో ఉంటుంది?
జవాబు:
కాండం కొనభాగాల్లోను, పార్శ్వ భాగాల్లోను, ఇతర కణజాలాల పొరల మధ్యలోను విభాజ్య కణజాలం ఉంటుంది.

ప్రశ్న 4.
అగ్ర విభాజ్య కణజాలాలు అనగానేమి?
జవాబు:
మొక్కలలో పెరుగుదలను కలిగించే విభాజ్య కణజాలాలను అగ్ర విభాజ్య కణజాలాలు అంటారు.

ప్రశ్న 5.
పార్శ్వ విభాజ్య కణజాలాలు అనగానేమి?
జవాబు:
కాండంలో పార్శ్వపు అంచుల చుట్టూ వర్తులంగా పెరుగుదలను కలిగించే కణజాలాన్ని పార్శ్వ విభాజ్య కణజాలాలు అంటారు.

ప్రశ్న 6.
మధ్యస్థ విభాజ్య కణజాలం మొక్కలో ఎక్కడ ఉంటుంది?
జవాబు:
కాండం మీద శాఖలు ఏర్పడేచోట, ఆకులు, పుష్ప వృంతం పెరిగేచోట మధ్యస్థ విభాజ్య కణజాలం ఉంటుంది.

AP 9th Class Biology Important Questions 2nd Lesson వృక్ష కణజాలం

ప్రశ్న 7.
విభాజ్య కణజాలంలోని కణాలు ఏ విధంగా ఉంటాయి?
జవాబు:
కణాలు చిన్నవిగా పలుచని కణ కవచమును, స్పష్టమైన కేంద్రకమును, కణముల మధ్య ఖాళీ లేకుండా ఉంటాయి.

ప్రశ్న 8.
మొక్క దేహ ఉపరితలమంతా ఉండే కణజాలం?
జవాబు:
త్వచ కణజాలం

ప్రశ్న 9.
త్వచ కణజాలం ఎన్ని రకాలు? అవి ఏవి?
జవాబు:
త్వచ కణజాలంలోని కణాల విధులను బట్టి మరియు స్థానాన్ని బట్టి త్వచ కణజాలం మూడు రకాలు. అవి :

  1. బాహ్యచర్మం లేక బహిస్త్వచం
  2. మధ్యస్వచం లేక మధ్యపొర
  3. అంతస్త్వచం లేక లోపలిపొర

ప్రశ్న 10.
ఎడారి మొక్కల్లో త్వచ కణజాలపు కణాలు ఏవిధంగా ఉంటాయి?
జవాబు:
ఎడారి మొక్కల్లో త్వచ కణజాలపు కణాలు బాగా దళసరిగా ఉండి మైనపు పూతను కలిగి ఉంటాయి.

ప్రశ్న 11.
వేరులో పొడవైన వెంట్రుక వంటి మూలకేశాలు ఏ కణజాలం నుండి ఏర్పడతాయి?
జవాబు:
వేరులో పొడవైన వెంట్రుక వంటి మూలకేశాలు త్వచ కణజాలం నుండి ఏర్పడతాయి.

ప్రశ్న 12.
చెట్ల నుండి జిగురు ఏ విధంగా స్రవించబడుతుంది?
జవాబు:
జిగురునిచ్చే చెట్ల యొక్క త్వచ కణజాలం నుండి జిగురు స్రవించబడుతుంది. ఉదా : తుమ్మ, వేప

ప్రశ్న 13.
త్వచ కణజాలము విధి ఏది?
జవాబు:
నీటి ఎద్దడి, కొమ్మలు విరగడం, చీలడం వంటి యాంత్రికంగా కలిగే నష్టాలు, పరాన్నజీవులు, రోగకారక జీవుల దాడి మొదలైన వాటి నుండి మొక్కలను త్వచ కణజాలం కాపాడుతుంది.

ప్రశ్న 14.
బెరడు అనగానేమి?
జవాబు:
పెద్ద చెట్లలో త్వచ కణజాలం బాహ్య చర్మంపైన అనేక పొరలను ఏర్పరుస్తుంది. దానిని బెరడు అంటారు.

ప్రశ్న 15.
త్వచ కణజాలం నుండి ఏర్పడేవి?
జవాబు:
త్వచ కణజాలం నుండి ఏర్పడేవి పత్రరంధ్రాలు మరియు మూలకేశాలు.

ప్రశ్న 16.
మొక్క దేహంలో ఎక్కువ భాగం ఏ కణజాలంతో ఏర్పడుతుంది?
జవాబు:
మొక్క దేహంలో ఎక్కువ భాగం సంధాయక కణజాలంతో ఏర్పడుతుంది.

ప్రశ్న 17.
సంధాయక కణజాలం ఉపయోగం ఏమిటి?
జవాబు:
ఆహారం నిల్వచేయడానికి, మొక్కకు యాంత్రికంగా బలాన్ని ఇవ్వడానికి ఉపయోగపడుతుంది.

AP 9th Class Biology Important Questions 2nd Lesson వృక్ష కణజాలం

ప్రశ్న 18.
సంధాయక కణజాలంలోని రకాలు ఏవి?
జవాబు:
సంధాయక కణజాలంలో ముఖ్యంగా మూడు రకాలు కలవు. అవి :

  1. మృదు కణజాలం
  2. స్థూలకోణ కణజాలం
  3. దృఢ కణజాలం

ప్రశ్న 19.
మృదు కణముల నిర్మాణం వివరించండి.
జవాబు:
మృదు కణజాలంలోని కణాలు మృదువుగా, పలుచని గోడలు కలిగి వదులుగా సంధించబడి ఉంటాయి.

ప్రశ్న 20.
మృదు కణజాలము నందలి రకములు ఏవి?
జవాబు:
మృదు కణజాలము నందలి రకములు హరిత కణజాలం, వాయుగత కణజాలం మరియు నిల్వచేసే కణజాలం.

ప్రశ్న 21.
దవ్వ భాగానికి మృదు కణజాలమని పేరు పెట్టినవాడు?
జవాబు:
దవ్వ భాగానికి మృదు కణజాలమని పేరు పెట్టినవాడు నెహేమియా గ్రూ.

ప్రశ్న 22.
“అనాటమీ ఆఫ్ ప్లాంట్స్” గ్రంథాన్ని ప్రచురించినవాడు?
జవాబు:
“అనాటమీ ఆఫ్ ప్లాంట్స్” గ్రంథాన్ని ప్రచురించినవాడు నెహేమియా గ్రూ (1682).

ప్రశ్న 23.
కణాల మధ్య ఖాళీలు లేకుండా దగ్గర దగ్గరగా అమరి ఉండు కణజాలం?
జవాబు:
కణాల మధ్య ఖాళీలు లేకుండా దగ్గర దగ్గరగా అమరి ఉండు కణజాలం దృఢ కణజాలం.

ప్రశ్న 24.
ప్రసరణ కణజాలాలు అని వేటిని అంటారు?
జవాబు:
ప్రసరణ కణజాలాలు అని దారువు, పోషక కణజాలములను అంటారు.

ప్రశ్న 25.
వేర్ల నుండి సేకరించిన నీరు, పోషక పదార్థాలు వేటి ద్వారా మొక్క భాగాలకు సరఫరా అవుతాయి?
జవాబు:
వేర్ల నుండి సేకరించిన నీరు, పోషక పదార్థాలు దారువు ద్వారా మొక్క భాగాలకు సరఫరా అవుతాయి.

ప్రశ్న 26.
ఆకులో తయారయిన ఆహారపదార్థములను మొక్క ఇతర భాగాలకు సరఫరా చేసే కణజాలం ఏది?
జవాబు:
ఆకులో తయారయిన ఆహారపదార్ధములను మొక్క ఇతర భాగాలకు సరఫరా చేసే కణజాలం పోషక కణజాలం.

ప్రశ్న 27.
దారువు, ప్రసరణ కణజాలాలను రెండింటిని కలిపి ఏమంటారు?
జవాబు:
దారువు, ప్రసరణ కణజాలాలను రెండింటిని కలిపి నాళికాపుంజాలు అంటారు.

ప్రశ్న 28.
దారువు నందలి వివిధ రకముల కణములను వ్రాయుము.
జవాబు:
దారువు నందలి వివిధ రకముల కణములు : దారుకణాలు, దారునాళాలు, తంతువులు, మృదు కణజాలం

ప్రశ్న 29.
పోషక కణజాలము నందలి వివిధ రకముల కణములను వ్రాయుము.
జవాబు:
పోషక కణజాలము నందలి వివిధ రకముల కణములు: చాలనీ నాళాలు, చాలనీ కణాలు, సహకణాలు, తంతువులు, మృదు కణజాలం

ప్రశ్న 30.
యూకలిప్టస్ చెట్లలో దారువు ఎన్ని అడుగుల ఎత్తు వరకు నీటిని సరఫరా చేస్తుంది?
జవాబు:
యూకలిప్టస్ చెట్లలో దారువు 200 అడుగులు ఎత్తు వరకు నీటిని సరఫరా చేస్తుంది.

ప్రశ్న 31.
రెడ్ వుడ్ చెట్లలో దారువు ఎన్ని అడుగుల ఎత్తు వరకు నీటిని సరఫరా చేస్తుంది?
జవాబు:
రెడ్ వుడ్ చెట్లలో దారువు 330 అడుగులు ఎత్తు వరకు నీటిని సరఫరా చేస్తుంది.

ప్రశ్న 32.
సాధారణంగా త్వచ కణజాలం ఎన్ని పొరలుగా అమరి యుంటుంది?
జవాబు:
సాధారణంగా త్వచ కణజాలం ఒక వరుస కణాలను కలిగి ఉంటుంది.

AP 9th Class Biology Important Questions 2nd Lesson వృక్ష కణజాలం

ప్రశ్న 33.
ఆకు బాహ్య చర్మంలో కన్పించే చిన్న రంధ్రాలను ఏమంటారు?
జవాబు:
ఆకు బాహ్య చర్మంలో కన్పించే చిన్న రంధ్రాలను పత్ర రంధ్రాలు అంటారు.

ప్రశ్న 34.
పత్రరంధ్రాలు మరియు మూలకేశాల ఉపయోగం ఏమిటి?
జవాబు:
పత్రరంధ్రాలు వాయు మార్పిడికి మరియు బాష్పోత్సేకానికి, నేల నుండి నీరు లవణాల సంగ్రహణకు మూలకేశాలు ఉపయోగపడతాయి.

ప్రశ్న 35.
హరితరేణువుల్ని కలిగి ఉండే మృదు కణజాలం?
జవాబు:
హరితరేణువుల్ని కలిగి ఉండే మృదు కణజాలం హరిత కణజాలం.

ప్రశ్న 36.
పెద్ద గాలి గదుల్ని కలిగి ఉండే మృదు కణజాలం?
జవాబు:
పెద్ద గాలి గదుల్ని కలిగి ఉండే మృదు కణజాలం వాతయుత కణజాలం.

ప్రశ్న 37.
నీరు, ఆహారం, వ్యర్థ పదార్థాలను నిల్వ చేసే మృదు కణజాలం?
జవాబు:
నీరు, ఆహారం, వ్యర్థ పదార్థాలను నిల్వ చేసే మృదు కణజాలం నిల్వచేసే కణజాలం.

ప్రశ్న 38.
నెహేమియా గ్రూ ప్రకారం మొక్కలోని ప్రతి భాగం కలిగి ఉండే రెండు రకాల విభాగాలు?
జవాబు:
నెహేమియా గ్రూ ప్రకారం మొక్కలోని ప్రతి భాగం కలిగి ఉండే రెండు రకాల విభాగాలు 1. దవ్వ 2. గట్టిభాగం

ప్రశ్న 39.
మొక్కలలో హరిత కణజాలం యొక్క పాత్రను ఏ విధంగా అభినందిస్తావు?
జవాబు:
హరితరేణువులను కలిగి ఉండే హరితకణజాలం ఆకులలో ఉండుట వలన మొక్కలు ఆహారపదార్థములను తయారు చేయగలుగుతున్నాయి.

ప్రశ్న 40.
మొక్కలలో ఉండే వాతయుత కణజాలము యొక్క పాత్రను ఏ విధంగా అభినందిస్తావు?
జవాబు:
మొక్కలు నీటిలో తేలియాడుటకు గాలి గదులు కలిగిన వాతయుత కణజాలం సహాయపడుతుంది.

ప్రశ్న 41.
మొక్కలలో ఆహారపదార్ధములను నిల్వయుంచుటలో పాత్ర వహించు మృదు కణజాలం?
జవాబు:
మొక్కలలో ఆహారపదార్ధములను నిల్వయుంచుటలో పాత్ర వహించు మృదు కణజాలం నిల్వచేసే కణజాలం.

ప్రశ్న 42.
రెడ్ వుడ్, యూకలిప్టస్ చెట్లలో ఎక్కువ ఎత్తు వరకు నీటిని సరఫరా చేయుటలో ఏ కణజాలం పాత్రను నీవు అభినందిస్తావు?
జవాబు:
రెడ్ వుడ్, యూకలిప్టస్ చెట్లలో ఎక్కువ ఎత్తు వరకు నీటిని సరఫరా చేయుటలో దారువు కణజాలం పాత్రను నేను అభినందిస్తాను.

ప్రశ్న 43.
ఆకులలో తయారయ్యే ఆహారపదార్థాలు మొక్కలోని ఇతర భాగాలకు రవాణా చేయుటలో ఏ కణజాలం పాత్రని నీవు అభినందిస్తావు?
జవాబు:
ఆకులలో తయారయ్యే ఆహారపదార్థాలు మొక్కలోని ఇతర భాగాలకు రవాణా చేయుటలో పోషక కణజాలము పాత్రను నేను అభినందిస్తాను.

ప్రశ్న 44.
యాంత్రికంగా కలిగే నష్టాలు, పరాన్న జీవులు, రోగ కారక జీవుల దాడి నుండి మొక్కలను రక్షించడంలో ఏ కణజాలపు పాత్రను నీవు అభినందిస్తావు?
జవాబు:
యాంత్రికంగా కలిగే నష్టాలు, పరాన్న జీవులు, రోగ కారక జీవుల దాడి నుండి మొక్కలను రక్షించడంలో త్వచ కణజాలము పాత్రను నేను అభినందిస్తాను.

ప్రశ్న 45.
మధ్యస్థ విభాజ్య కణజాలాన్ని మొక్కలో నీవు ఎక్కడ గమనిస్తావు?
జవాబు:
కాండం మీద శాఖలు ఏర్పడే చోట, ఆకులు, పుష్పవృంతం పెరిగేచోట మధ్యస్థ విభాజ్య కణజాలం ఉంటుంది.

ప్రశ్న 46.
మొక్క దేహ ఉపరితలమంతా మనకు కనబడే కణజాలం?
జవాబు:
మొక్క దేహ ఉపరితలమంతా మనకు కనబడే కణజాలం త్వచ కణజాలం.

AP 9th Class Biology Important Questions 2nd Lesson వృక్ష కణజాలం

ప్రశ్న 47.
త్వచ కణజాలం నుండి విడుదలయ్యే స్రావము ఏమిటి?
జవాబు:
త్వచ కణజాలం నుండి విడుదలయ్యే స్రావము జిగురు.

ప్రశ్న 48.
మొక్కలలో వైవిధ్యమైన కణజాలాలు ఉండడానికి కారణమేమిటి?
జవాబు:
ఒక్కొక్క రకమైన కణజాలం ఒక ప్రత్యేకమైన పనిని నిర్వహించడానికి అనువుగా నిర్మితమై ఉంటుంది.

ప్రశ్న 49.
మొక్కలలో బాష్పోత్సేకానికి ఉపయోగపడే త్వచ కణజాలపు నిర్మాణాలు ఏవి?
జవాబు:
మొక్కలలో బాష్పోత్సేకానికి ఉపయోగపడే త్వచ కణజాలపు నిర్మాణాలు పత్రరంధ్రాలు.

ప్రశ్న 50.
చెట్ల యొక్క బెరడు భాగము ఏ విధముగా ఉపయోగపడుతుంది?
జవాబు:
చెట్ల యొక్క బెరడు భాగము ఆహార పదార్థముగాను, మందుల తయారీలోను ఉపయోగపడుతుంది.

9th Class Biology 2nd Lesson వృక్ష కణజాలం 2 Marks Important Questions and Answers

ప్రశ్న 1.
సరళ కణజాలంనకు మరియు సంక్లిష్ట కణజాలంనకు గల భేదములు ఏవి?
జవాబు:
1) నిర్మాణంలోనూ, విధులలోనూ ఒకే రకంగా ఉన్న కణాల సమూహమును సరళ కణజాలం అంటారు.
ఉదా : మృదు కణజాలం, స్థూలకోణ కణజాలం మరియు దృఢ కణజాలం.

2) ఒక విశిష్టమైన పనిని నిర్వహించడం కోసం భిన్న రకాలకు చెందిన కణాలు సమూహంగా ఏర్పడిన నిర్మాణాన్ని సంక్లిష్ట కణజాలం అంటారు.
ఉదా : దారువు, పోషక కణజాలం.

ప్రశ్న 2.
విభాజ్య కణజాలం నందలి కణముల లక్షణములేవి?
జవాబు:
విభాజ్య కణజాలంలోని కణాలు :

  1. కణాలు చిన్నవిగా ఉంటాయి. పలుచటి కణకవచాన్ని కలిగి ఉంటాయి.
  2. ఇవి స్పష్టమైన కేంద్రకాన్ని తగినంత జీవపదారమును కలిగి ఉండే కణజాలం.
  3. కణాల మధ్య ఖాళీ ప్రదేశాలు లేకుండా దగ్గరగా అమరి ఉంటాయి.
  4. ఎప్పుడూ విభజన చెందగలిగే శక్తి కలిగి ఉంటాయి.

ప్రశ్న 3.
కణకవచము ఆధారముగా మృదు కణజాలం, స్థూలకోణ కణజాలం మరియు దృఢ కణజాలాల మధ్య గల భేదమేది?
జవాబు:

మృదు కణజాలం స్థూలకోణ కణజాలం దృఢ కణజాలం
కణకవచములు పలుచగా ఉండి సెల్యులోజ్ తో నిర్మితమై ఉంటాయి. కణకవచముల గోడలందు పెక్టిన్ మరియు సెల్యులోజ్ లు అక్కడక్కడ అవక్షేపితం కావడం వల్ల మందంగా ఉంటాయి. కణకవచపు గోడలందు పెక్టిన్ ఉండుట వలన మందంగా ఉంటాయి.

ప్రశ్న 4.
పత్రరంధ్రము యొక్క విధులేవి?
జవాబు:

  1. వాతావరణములో వాయువుల మార్పిడికి పత్రరంధ్రములు అవసరం.
  2. బాష్పోత్సేక ప్రక్రియనందు నీరు నీటి ఆవిరి రూపంలో బయటకు పోవడానికి పత్రరంధ్రములు అవసరం.

AP 9th Class Biology Important Questions 2nd Lesson వృక్ష కణజాలం

ప్రశ్న 5.
దారువు ఎన్ని అంశముల కలయికచే ఏర్పడింది?
జవాబు:
దారువు నాలుగు అంశముల కలయికచే ఏర్పడింది. అవి :

  1. దారు కణములు
  2. దారు నాళాలు
  3. దారు మృదుకణజాలం
  4. దారు నారలు.

ప్రశ్న 6.
పోషక కణజాలం నందలి అంశములేవి?
జవాబు:
పోషక కణజాలం ఐదు రకముల అంశముల కలయికచే ఏర్పడింది. అవి చాలనీ కణములు, చాలనీ నాళములు, సహ ‘ కణములు, పోషక కణజాల నారలు మరియు పోషక కణజాల మృదు కణజాలం.

9th Class Biology 2nd Lesson వృక్ష కణజాలం 4 Marks Important Questions and Answers

ప్రశ్న 1.
దారువునందలి వివిధ అంశముల పేర్లను తెలుపుము. అంశములు చేయు పనుల గురించిన సమాచారమును సేకరించుము.
జవాబు:
దారువు నందు ఉండే అంశములు :

  1. దారుకణములు, దారునాళములు, దారు మృదుకణజాలం మరియు దారునారలు.
  2. దారు కణములు, దాగునాళములు పొడవుగా ఉండే కండె లేదా స్థూపాకార కణములు. అందువలన ఇవి నీటిని పోషక పదార్థములను నిలువుగా ప్రసరణ చేయగలవు.
  3. దారు మృదు కణజాలం ఆహారమును నిల్వ చేస్తుంది మరియు పార్శ్వభాగాలకు నీటిని సరఫరా చేస్తుంది.
  4. దారునారలు, నాళికాపుంజానికి యాంత్రిక బలాన్ని ఇస్తాయి.

ప్రశ్న 2.
మొక్క కణజాలములకు సంబంధించి ప్రవాహపటము (ఫ్లోచార్టు) ను గీయుము.
జవాబు:
AP 9th Class Biology Important Questions 2nd Lesson వృక్ష కణజాలం 1

ప్రశ్న 3.
మృదు కణజాలం, స్థూలకోణ కణజాలం మరల దృఢ కణజాలం బొమ్మలను గీయుము.
జవాబు:
AP 9th Class Biology Important Questions 2nd Lesson వృక్ష కణజాలం 2 AP 9th Class Biology Important Questions 2nd Lesson వృక్ష కణజాలం 3 AP 9th Class Biology Important Questions 2nd Lesson వృక్ష కణజాలం 4

ప్రశ్న 4.
విభాజ్య కణజాలం అనగానేమి? విభాజ్య కణజాలం రకములను తెలుపుము.
జవాబు:

  1. మొక్క భాగాలన్నింటిలో పెరుగుదలను, మరమ్మతులను నిర్వహించే కణజాలమును విభాజ్య కణజాలం అంటారు.
  2. విభాజ్య కణజాలాలు మూడు రకములు. అవి :
    1) అగ్రవిభాజ్య కణజాలం,
    2) పార్శ్వ విభాజ్య కణజాలం,
    3) మధ్యస్థ విభాజ్య కణజాలం.
  3. వేరు, కాండపు కొనల వద్ద ఉండే పెరుగుదలను కలిగించే కణజాలము అగ్రవిభాజ్య కణజాలం.
  4. కాండంలో పార్శ్వపు అంచుల చుట్టూ వర్తులంగా పెరుగుదలను కలిగించే కణజాలం పార్శ్వ విభాజ్య కణజాలం.
  5. కాండం మీద శాఖలు ఏర్పడేచోట, ఆకులు, పుష్పవృంతం పెరిగే చోట ఉండే కణజాలం మధ్యస్థ విభాజ్య కణజాలం.

ప్రశ్న 5.
మొక్క కణజాలములు, జంతు కణజాలముల మధ్య గల భేదాలేవి?
జవాబు:

మొక్క కణజాలాలు జంతు కణజాలాలు
1) మొక్క కణజాలాలు ఎక్కువగా నిర్జీవమైనవి. 1) జంతు కణజాలాలు ఎక్కువగా సజీవమైనవి.
2) మొక్కల జీవక్రియ నిర్వహణకు తక్కువ శక్తి అవసరము. 2) జంతువుల జీవక్రియ నిర్వహణకు ఎక్కువశక్తి అవసరం.
3) కణజాలాల వ్యవస్థీకరణ స్థిర నివాసమునకు ఆధారాన్నిస్తుంది. 3) కణజాల వ్యవస్థీకరణ జీవి కదలడానికి సహాయపడుతుంది.

AP 9th Class Biology Important Questions 2nd Lesson వృక్ష కణజాలం

ప్రశ్న 6.
పట సహాయముతో మృదు కణజాలంను, స్థూలకోణ కణజాలంను, దృఢ కణజాలంను వివరింపుము.
జవాబు:
AP 9th Class Biology Important Questions 2nd Lesson వృక్ష కణజాలం 2
1. మృదు కణజాలం :

  1. మృదు కణజాలంలోని కణాలు మృదువుగా పలుచని గోడలు గలిగి, వదులుగా అమరి ఉంటాయి.
  2. ఇందులో మూడురకాల కణజాలాలున్నాయి. హరిత కణజాలం, వాయుగత కణజాలం, నిల్వచేసే కణజాలం, మృదు కణజాలం

AP 9th Class Biology Important Questions 2nd Lesson వృక్ష కణజాలం 3
2. స్థూలకోణ కణజాలం :

  1. స్థూలకోణ కణజాలంలోని కణాలు దళసరి గోడలను కలిగి కొంచెం పొడవైన కణాలుగా ఉంటాయి.
  2. మొక్కకు ఆధారాన్ని, యాంత్రిక బలాన్ని ఇస్తుంది.
  3. కణాల మధ్య ఖాళీ ప్రదేశాలు ఉంటాయి.

AP 9th Class Biology Important Questions 2nd Lesson వృక్ష కణజాలం 4
3. దృఢ కణజాలం :

  1. దృఢ కణజాలంలోని కణాలు దళసరి గోడలు కలిగి ఉంటాయి.
  2. కణాల మధ్య ఖాళీ లేకుండా దగ్గర దగ్గరగా అమరియుంటాయి.
  3. మొక్కకు యాంత్రికబలాన్ని ఇస్తుంది.

9th Class Biology 2nd Lesson వృక్ష కణజాలం Important Questions and Answers

ప్రశ్న 1.
దారువు, పోషకా కణజాలాల్లో వుండే వివిధ రకాల కణాల పటాలను గీయండి.
జవాబు:
AP 9th Class Biology Important Questions 2nd Lesson వృక్ష కణజాలం 6

ప్రశ్న 2.
మొక్కలలో వుండే సంధాయక కణజాలంలోని రకాలను తెలపండి.
జవాబు:
మృదుకణజాలము, స్థూలకోణ కణజాలము, ధృడకణజాలము.

ప్రశ్న 3.
క్రింది వాటికి కారణాలు రాయండి.
a) దారువు ప్రసరణ కణజాలంగా పనిచేస్తుంది
b) క్రొవ్వు కణాలు ఉష్ణనిరోధకంగా పనిచేస్తాయి
c) హృదయకండరం నిరంతరం పనిచేస్తుంది
d) బాహ్యచర్మం రక్షణనిస్తుంది
జవాబు:
a) 1) దారువు వేర్ల నుండి నీటిని పోషక పదార్ధములను మొక్క అగ్రభాగాలకు సరఫరా చేస్తుంది.
2) వేర్ల నుండి పదార్ధములను దూరభాగములకు రవాణా చేస్తుంది. 3) వేర్ల నుండి మొక్క అగ్రభాగాలకు నీటి సరఫరా ఏకమార్గములో జరుగుతుంది.

b) క్రొవ్వు మనశరీరంలో చర్మం క్రింద ఉండే ఎడిపోజ్ కణజాలంలో నిల్వ ఉంచబడుతుంది. ఈ ఎడిపోజ్ కణజాలం చర్మం క్రింద మందంగా ఉండి ఉష్ణనిరోధకంగా పనిచేస్తాయి. అందుకనే స్థూలకాయులను చలికాలంలో చలి అంతగా బాధించదు.

c) హృదయకండరం హృదయాన్ని ఆవరించి ఉండి, హృదయ సంకోచ వ్యాకోచాలను నిరంతరం జరుపుతాయి. ఈ కండరాలు అన్నీ చారలను కలిగి ఉండి శాఖలుగా ఉంటాయి. వీటి చర్యలు మన ఆధీనంలో ఉండవు. ఇది అనియంత్రిత చర్యలను చూపిస్తుంది.

d) 1) బాహ్యచర్మము నందలి కణములు సాధారణముగా ఒక పొరయందు ఉంటాయి.
2) బాహ్యచర్మము నందలి కణముల గోడలు దళసరిగా ఉంటాయి.
3) నీటి ఎద్దడి, కొమ్మలు విరగడం, చీలడం వంటి యాంత్రికంగా కలిగే నష్టాలు పరాన్న జీవులు, రోగకారక జీవులు దాడి మొదలైన వాటి నుండి మొక్కలను బాహ్యచర్మం రక్షిస్తుంది.

4. a) వృక్షకణం బొమ్మను గీచి, భాగాలను గుర్తించండి.
b) అంతర్జీవ ద్రవ్యజాలం యొక్క విధులను తెల్పండి.
జవాబు:
a)
AP 9th Class Biology Important Questions 1st Lesson కణ నిర్మాణం – విధులు 2

b) 1) కణంలో ఒక భాగం నుండి మరియొక భాగానికి పదార్థాల రవాణా,
2) జీవ రసాయనిక చర్యలకు వేదిక
3) అనేక విషపదార్థాలను నిర్వీర్యం చేస్తుంది.
4) ప్రోటీన్లు, లిపిడ్ల సంశ్లేషణకు తోడ్పడుతుంది.

9th Class Biology 2nd Lesson వృక్ష కణజాలం 1 Mark Bits Questions and Answers

లక్ష్యాత్మక నియోజనము

1. మొక్క భాగాలన్నింటిలో పెరుగుదలను, మరమ్మతులను నిర్వహించే కణజాలం
A) విభాజ్య కణజాలం
B) త్వచ కణజాలం
C) సంధాయక కణజాలం
D) ప్రసరణ కణజాలం
జవాబు:
A) విభాజ్య కణజాలం

2. మొక్క బయటి పై పొరలను ఏర్పరచే కణజాలం
A) విభాజ్య కణజాలం
B) త్వచ కణజాలం
C) సంధాయక కణజాలం
D) ప్రసరణ కణజాలం
జవాబు:
B) త్వచ కణజాలం

AP 9th Class Biology Important Questions 2nd Lesson వృక్ష కణజాలం

3. వృక్ష దేహాన్ని ఏర్పాటు చేస్తూ ఇతర కణజాలాలు సరియైన స్థితిలో ఉండేలా చేసే కణజాలం
A) విభాజ్య కణజాలం
B) త్వచ కణజాలం
C) అంతస్త్వచం
D) పైవి అన్నియు
జవాబు:
C) అంతస్త్వచం

4. పదార్థాల రవాణాకు సహాయపడే కణజాలం
A) విభాజ్య కణజాలం
B) త్వచ కణజాలం
C) సంధాయక కణజాలం
D) ప్రసరణ కణజాలం
జవాబు:
D) ప్రసరణ కణజాలం

5. పెరుగుదల చూపించు కాండం, వేరు కొనభాగాల్లో ఉండే విభాజ్య కణజాలం
A) అగ్ర విభాజ్య కణజాలం
B) పార్శ్వ విభాజ్య కణజాలం
C) మధ్యస్థ విభాజ్య కణజాలం
D) త్వచ కణజాలం
జవాబు:
A) అగ్ర విభాజ్య కణజాలం

6. త్వచ కణజాలం ఏర్పరచేది.
A) బాహ్యస్త్వచం
B) మధ్యస్త్వచం
C) సంధాయక కణజాలం
D) ప్రసరణ కణజాలం
జవాబు:
D) ప్రసరణ కణజాలం

7. పత్రరంధ్రములు ఈ పొరనందు ఉంటాయి.
A) బాహ్యస్వచం
B) మధ్యస్వచం
C) అంతస్త్వచం
D) పైవి అన్నియు
జవాబు:
A) బాహ్యస్వచం

8. పత్రరంధ్రము ఈ కణములచే ఆవరించబడి ఉంటుంది.
A) దారు కణాలు
B) సహ కణాలు
C) గ్రంథి కణాలు
D) మృదు కణాలు
జవాబు:
B) సహ కణాలు

9. జిగురును స్రవించునది
A) త్వచ కణజాలం
B) విభాజ్య కణజాలం
C) దారువు
D) పోషక కణజాలం
జవాబు:
A) త్వచ కణజాలం

10. పత్రరంధ్రాలు మరియు మూలకేశాలు దీనికి సహాయపడతాయి.
A) వాయువుల మార్పిడి
B) బాష్పోత్సేకము
C) నీరు, లవణాల సంగ్రహణ
D) పైవి అన్నియు
జవాబు:
D) పైవి అన్నియు

11. దవ్వభాగానికి మృదుకణజాలమని పేరు పెట్టినవాడు
A) బిచాట్
B) నెహేమియా గ్రూ
C) రాబర్ట్ బ్రౌన్
D) అరిస్టాటిల్
జవాబు:
B) నెహేమియా గ్రూ

AP 9th Class Biology Important Questions 2nd Lesson వృక్ష కణజాలం

12. ప్రసరణ కణజాలంను గుర్తించండి.
A) దారువు
B) పోషక కణజాలం
C) దారువు మరియు పోషక కణజాలం
D) దృఢ కణజాలం
జవాబు:
C) దారువు మరియు పోషక కణజాలం

13. దారువు కలిగియుండు అంశములు
A) దారుకణాలు, దారు నాళాలు
B) దారునాళాలు
C) దారు మృదుకణజాలం
D) పైవి అన్నియు
జవాబు:
D) పైవి అన్నియు

14. పోషక కణజాలము నందు ఉండు అంశములు
A) చాలనీ కణాలు, చాలనీ నాళాలు
B) పోషక మృదుకణజాలం
C) సహ కణాలు, పోషక కణజాలం, మృదుకణజాలం
D) పైవి అన్నియు
జవాబు:
D) పైవి అన్నియు

15. రోజ్ వుడ్ వృక్షమునందు దారువు ఎన్ని అడుగుల ఎత్తు వరకు నీటిని మోస్తుంది?
A) 220 అడుగులు
B) 230 అడుగులు
C) 330 అడుగులు
D) 430 అడుగులు
జవాబు:
C) 330 అడుగులు

16. హరితరేణువులు కలిగిన మృదు కణజాలం పేరు
A) హరిత కణజాలం
B) వాయుగత కణజాలం
C) నిల్వచేసే కణజాలం
D) దృఢ కణజాలం
జవాబు:
A) హరిత కణజాలం

17. వీటి పెరుగుదల కొనభాగాలలో విభాజ్య కణజాలం ఉంటుంది.
A) వేరు
B) కాండం
C) వేరు మరియు కాండం
D) పార్శ్వ విభాజ్య కణజాలం
జవాబు:
C) వేరు మరియు కాండం

18. దారువు నందలి అంశములను గుర్తించుము.
A)దారు కణాలు
B) చాలనీ కణాలు
C) చాలనీ నాళాలు
D) సహ కణాలు
జవాబు:
A)దారు కణాలు

19. పోషక కణజాలంనందలి అంశములను గుర్తించుము.
A) స్రావ కణాలు
B) రక్షణ కణాలు
C) చాలనీ కణాలు
D) సహ కణాలు, చాలనీ కణాలు
జవాబు:
D) సహ కణాలు, చాలనీ కణాలు

AP 9th Class Biology Important Questions 2nd Lesson వృక్ష కణజాలం

20. కణజాలం అనగా ఈ కణాల సమూహం.
A) ఒకే నిర్మాణం కలిగి ఒకే విధమైన విధుల్ని నిర్వర్తిస్తాయి.
B) ఒకే నిర్మాణం కలిగి వేరు వేరు విధుల్ని నిర్వర్తిస్తాయి.
C) వేరు వేరు నిర్మాణం కలిగి ఒకే విధులను నిర్వర్తిస్తాయి.
D) వేరు వేరు నిర్మాణం కలిగి వేరు వేరు విధులను నిర్వర్తిస్తాయి.
జవాబు:
A) ఒకే నిర్మాణం కలిగి ఒకే విధమైన విధుల్ని నిర్వర్తిస్తాయి.

21. కాండం కొన భాగంలో ఉండి పెరుగుదలకు కారణమయ్యేది
A) త్వచ కణజాలం
B) విభాజ్య కణజాలం
C) సంధాయక కణజాలం
D) ప్రసరణ కణజాలం
జవాబు:
B) విభాజ్య కణజాలం

22. కాండం లావుగా పెరగటానికి కారణం
A) అగ్ర విభాజ్య కణజాలం
B) పార్శ్వ విభాజ్య కణజాలం
C) మధ్యస్థ విభాజ్య కణజాలం
D) సంధాయక కణజాలం
జవాబు:
B) పార్శ్వ విభాజ్య కణజాలం

23. పత్ర రంధ్రాన్ని ఆవరించి ఉండే రక్షక కణాల సంఖ్య
A) 1
B) 2
C) 3
D) 5
జవాబు:
B) 2

24. ఈ క్రింది వానిలో త్వచ కణజాలానికి సంబంధించినది
A) జిగురు
B) బెరడు
C) మూలకేశాలు
D) పైవన్నీ
జవాబు:
D) పైవన్నీ

25. మొక్క దేహంలో ఎక్కువ భాగం దీనితో నిర్మించబడి ఉంటుంది.
A) త్వచ కణజాలం
B) సంధాయక కణజాలం
C) ప్రసరణ కణజాలం
D) విభాజ్య కణజాలం
జవాబు:
B) సంధాయక కణజాలం

26. నిల్వచేసే కణజాలం దీనిని నిల్వ చేయదు.
A) నీరు
B) గాలి
C) ఆహారం
D) వ్యర్థ పదార్థాలు
జవాబు:
B) గాలి

27. గాలి నిల్వ ఉండే కణజాలం
A) హరిత మృదు కణజాలం
B) నిల్వచేసే కణజాలం
C) వాతయుత కణజాలం
D) దృఢ కణజాలం
జవాబు:
C) వాతయుత కణజాలం

28. నీటి మొక్కలు కలి ఉండే కణజాలం
A) స్థూలకోణ కణజాలం
B) హరిత కణజాలం
C) వాతయుత కణజాలం
D) నిల్వచేసే కణజాలం
జవాబు:
C) వాతయుత కణజాలం

29. “అనాటమీ ఆఫ్ ప్లాంట్స్” అనే గ్రంథాన్ని రచించిన శాస్త్రవేత్త
A) రాబర్ట్ హుక్
B) మార్సెల్లో మాల్ఫీజి
C) నెహేమియా గ్రూ
D) రుడాల్ఫ్ విర్కోవ్
జవాబు:
C) నెహేమియా గ్రూ

AP 9th Class Biology Important Questions 2nd Lesson వృక్ష కణజాలం

30. నెహేమియా గ్రూ మొక్కలోని ఏ భాగానికి మృదు కణజాలం అని పేరు పెట్టారు?
A) దారువు
B) దవ్వ
C) పోషక కణజాలం
D) నాళికాపుంజం
జవాబు:
B) దవ్వ

31. నీరు, పోషక పదార్థాలు దీని ద్వారా సరఫరా అవుతాయి.
A) దారువు
B) పోషక కణజాలం
C) పై రెండూ
D) స్థూలకోణ కణజాలం
జవాబు:
A) దారువు

32. పోషక కణజాలం ద్వారా సరఫరా అయ్యేది
A) నీరు
B) పోషక పదార్థాలు
C) ఆహార పదార్థాలు
D) గాలి
జవాబు:
C) ఆహార పదార్థాలు

33. దారువులోను, పోషక కణజాలంలోను రెండింటిలో ఉండే కణాలు
A) తంతువులు
B) మృదు కణజాలం
C) పై రెండూ
D) సహకణాలు
జవాబు:
C) పై రెండూ

34. రెడ్ ఉడ్ చెట్లలో ప్రసరణ కణజాలం ఎంత ఎత్తుకు పోషకాలను సరఫరా చేస్తాయి?
A) 220 అడుగులు
B) 330 అడుగులు
C) 250 అడుగులు
D) 350 అడుగులు
జవాబు:
B) 330 అడుగులు

35. మొక్క దేహానికి రక్షణనిచ్చే కణజాలం
A) త్వచ కణజాలం
B) సంధాయక కణజాలం
C) దృఢ కణజాలం
D) మృదు కణజాలం
జవాబు:
A) త్వచ కణజాలం

36. మొక్క భాగాలన్నింటిలో పెరుగుదలను, మరమ్మతులను నిర్వహించే కణజాలం
A) విభాజ్య కణజాలం
B) త్వచ కణజాలం
C) సంధాయక కణజాలం
D) ప్రసరణ కణజాలం
జవాబు:
A) విభాజ్య కణజాలం

37. ఈ క్రింది వానిలో సంక్లిష్ట కణజాలం
A) మృదు కణజాలం
B) స్థూలకోణ కణజాలం
C) దృఢ కణజాలం
D) దారువు
జవాబు:
D) దారువు

38. ఈ క్రిందివానిలో నిర్జీవ కణజాలం
A) మృదు కణజాలం
B) స్థూలకోణ కణజాలం
C) దృఢ కణజాలం
D) పోషక కణజాలం
జవాబు:
C) దృఢ కణజాలం

39. మొక్కల యొక్క వంగగలిగే భాగాలలో ఉండే కణజాలం
A) మృదు కణజాలం
B) స్తూలకోణ కణజాలం
C) దృఢ కణజాలం
D) పోషక కణజాలం
జవాబు:
B) స్తూలకోణ కణజాలం

AP 9th Class Biology Important Questions 2nd Lesson వృక్ష కణజాలం

40. సజీవ, నిర్జీవ రెండు రకాల కణాలను కలిగి ఉండేది
A) దారువు
B) పోషక కణజాలం
C) మృదు కణజాలం
D) స్థూలకోణ కణజాలం
జవాబు:
A) దారువు

41. క్రింది వాక్యాలను చదవండి.
a) వేరుకొన అగ్రభాగంలో విభాజ్య కణజాలం ఉంటుంది.
b) కొబ్బరి టెంకలలో దృఢ కణజాలం ఉంటుంది.
A) a మరియు b లు రెండూ సరైనవి కావు
B) a సరైనది, b సరైనది కాదు
C) b సరైనది, a సరైనది కాదు
D) a మరియు b లు రెండూ సరైనవి
జవాబు:
D) a మరియు b లు రెండూ సరైనవి

42. ఒక మొక్క కొమ్మలు విరగడం, చీలడం వంటి యాంత్రికంగా కలిగే నష్టాల నుండి రక్షించు కోలేకపోతుంది. ఇందుకు కారణాలు ఏమై ఉండవచ్చు?
i) మొక్కలో విభాజ్య కణజాలం నశించి ఉండవచ్చు
ii) మొక్కలో త్వచ కణజాలం నశించి ఉండవచ్చు
iii) మొక్కలో సంధాయక కణజాలం నశించి ఉండవచ్చు
iv)మొక్కలో బహిస్త్వచం ఏర్పడకపోయి ఉండవచ్చు
పై వాటిలో సరైన కారణాలు
A) i, iv
B) i, iii, iv
C) i, ii
D) పైవన్నియూ
జవాబు:
A) i, iv

43. ఉల్లిపొర కణాలను మైక్రోస్కోపు క్రింద పరీక్షించునపుడు ఈ క్రింది వానిలో అసత్యమైనది
A) అన్ని కణాలు ఒకే ఆకారంలో ఉన్నాయి.
B) కణాలు వృత్తాకారంగా అమరి ఉన్నాయి.
C) కణాంతర్గత ఖాళీలు ఉన్నాయి.
D) ప్రతి కణము కణకవచాన్ని కలిగి ఉంది.
జవాబు:
B) కణాలు వృత్తాకారంగా అమరి ఉన్నాయి.

44. ఉల్లిపొర కణాలను, బుగ్గ కణాలను మైక్రోస్కోపు క్రింద పరీక్షించునపుడు ఈ క్రింది వానిలో సత్యమైన ప్రవచనం ఏది?
A) ఉల్లి కణాలు కణకవచాన్ని, కణత్వచాన్ని కలిగి ఉన్నాయి.
B) బుగ్గ కణాలు కణకవచాన్ని, కణత్వచాన్ని కలిగి ఉన్నాయి.
C) ఉల్లి కణాలు కణత్వచాన్ని మాత్రమే కలిగి ఉన్నాయి.
D) బుగ్గ కణాలు కణత్వచాన్ని మాత్రమే కలిగి ఉన్నాయి.
జవాబు:
A) ఉల్లి కణాలు కణకవచాన్ని, కణత్వచాన్ని కలిగి ఉన్నాయి.

→ క్రింది పేరాను చదివి ఇవ్వబడిన ప్రశ్నలకు సరియైన సమాధానాన్ని గుర్తించండి.

సాధారణంగా త్వచ కణజాలం ఒక వరుస కణాలను కలిగి ఉండి, కణాల విభిన్నత చూపిస్తుంది. వాటి విధుల్ని బట్టి స్థానాన్ని బట్టి ఈ కణజాలం మూడు రకాలుగా విభజించబడింది. అవి – బాహ్యచర్మం లేక బహిత్వచం (వెలుపలి పొర) (Epidermis), మధ్యత్వచం (మధ్యపొర) (Mesodermis), అంతఃత్వచం (లోపలి పొర) (Endodermis).

ఆకు బాహ్యచర్మంలో చిన్న రంధ్రాలు కన్పిస్తాయి. వాటిని పత్రరంధ్రాలు (Stomata) అంటారు. వేరులో అయితే బాహ్యచర్మం కణాలు పొడవైన వెంట్రుకల వంటి మూలకేశాలను కలిగి ఉంటాయి.

45. పత్రరంధ్రాలు మనకు ఎక్కడ కనపడతాయి?
A) వృక్షాల త్వచ కణజాలాలలో
B) జిగురునిచ్చే చెట్ల బాహ్యచర్మం లేక బాహ్యత్వచంలో
C) ఆకు యొక్క బాహ్యచర్మం లేక బాహ్యత్వచంలో
D) కాండ కణాల బాహ్యచర్మం లేదా బాహ్యత్వచంలో
జవాబు:
C) ఆకు యొక్క బాహ్యచర్మం లేక బాహ్యత్వచంలో

46. ఈ క్రింది వానిలో సరిగా జతపరచబడని జత ఏది?
a) మధ్యత్వచం – వెలుపలి పొర
b) బాహ్యత్వచం – మధ్య పొర
c) అంతఃత్వచం – లోపలి పొర
A) a, b, c
B) a, b
C) a, c
D) b, c
జవాబు:
B) a, b

AP 9th Class Biology Important Questions 2nd Lesson వృక్ష కణజాలం

47. ప్రసరణ కణజాలంలో ఈ భాగాన్ని గుర్తించండి.
AP 9th Class Biology Important Questions 2nd Lesson వృక్ష కణజాలం 7
A) తంతువు
B) దారుకణం
C) దారునాళం
D) చాలనీ కణాలు
జవాబు:
B) దారుకణం

48. ప్రసరణ కణజాలంలో ఈ భాగాన్ని గుర్తించండి.
AP 9th Class Biology Important Questions 2nd Lesson వృక్ష కణజాలం 8
A) చాలనీ నాళాలు
B) దారుకణం
C) దారునాళం
D) ఏదీకాదు
జవాబు:
C) దారునాళం

49. ప్రసరణ కణజాలంలో ఈ భాగాన్ని గుర్తించండి.
AP 9th Class Biology Important Questions 2nd Lesson వృక్ష కణజాలం 9
A) సహకణాలు
B) దారునాళాలు
C) దారుకణాలు
D) చాలనీ కణాలు
జవాబు:
D) చాలనీ కణాలు

50. ఈ క్రింది స్లో చార్టును సరియైన క్రమంలో అమర్చండి.
AP 9th Class Biology Important Questions 2nd Lesson వృక్ష కణజాలం 10
A) 3, 4, 2, 1, 5
B) 1, 2, 3, 4, 5
C) 3, 4, 5, 2, 1
D) 3, 4, 1, 2, 5
జవాబు:
D) 3, 4, 1, 2, 5

51. పత్ర రంధ్రాలను కలిగి వుండునది
A) ప్రసరణ కణజాలం
B) విభాజ్య కణజాలం
C) సంధాయక కణజాలం
D) త్వచకణజాలం
జవాబు:
D) త్వచకణజాలం

52. మొక్క భాగాలన్నింటిలో పెరుగుదలను, మరమ్మత్తులను నిర్వహించే కణజాలం
A) విభాజ్య కణజాలం
B) త్వచ కణజాలం
C) సంధాయక కణజాలం
D) ప్రసరణ కణజాలం
జవాబు:
A) విభాజ్య కణజాలం

53. నీటి మొక్కలు తేలుటకు కారణమైనది.
A) మృధుకణజాలం
B) వాయుగత కణజాలం
C) స్థూలకోణ కణజాలం
D) దృఢ కణజాలం
జవాబు:
B) వాయుగత కణజాలం

54. కింది i, ii వాక్యాలను చూడండి.
i) ప్రసరణ కణజాలం కేవలం దారువుతో ఏర్పడుతుంది.
ii) నాళికాపుంజం, దారువు ప్రసరణ కణజాలంను ఏర్పరుస్తాయి.
A) i, ii సత్యాలు
B) i సత్యం, ii అసత్యం
C) i అసత్యం, ii సత్యం
D) i, ii అసత్యాలు
జవాబు:
C) i అసత్యం, ii సత్యం

మీకు తెలుసా?

విసర్జక పదార్థాలు, అధికంగా ఉన్న ఆహారపదార్థాలు, స్రావక పదార్థాలు వంటి కొన్ని రకాల పదార్థాలను విభిన్న రూపాలలో నిల్వచేసుకోగలిగే సామర్థ్యం మొక్కలకు ఉంది. జిగురునిచ్చే చెట్ల యొక్క త్వచకణజాలం నుండి జిగురు స్రవించబడుతుంది.

AP 9th Class Biology Important Questions 2nd Lesson వృక్ష కణజాలం 11
నెహేమియా గ్రూ (Nehemiah Grew) (1641-1712) ఒక వైద్యుడు. లండన్లోని రాయల్ సొసైటీకి కార్యదర్శిగా పనిచేశాడు. 1664వ సంవత్సరంలో మొక్కల అంతర్నిర్మాణం మీద అధ్యయనం చేయడం మొదలుపెట్టాడు.

మొక్కలోని ప్రతి భాగం రెండు రకాల విభాగాలను కలిగి ఉంటుంది. అవి ఒకటి దవ్వ (Pith) మరొకటి గట్టి భాగం (Ligneous part) అని అతడు భావించాడు. ఇది అతని ప్రాథమిక భావన.
దవ్వ భాగానికి ‘గ్రూ’ మృదుకణజాలం అని పేరుపెట్టాడు. ‘గ్రూ’ మొక్కల దేహాల్లోని కణజాలాలపై అధ్యయనం చేసి, 1682వ సంవత్సరంలో “అనాటమీ ఆఫ్ ప్లాంట్స్” అనే గ్రంథాన్ని ప్రచురించాడు.

పునరాలోచన

AP 9th Class Biology Important Questions 2nd Lesson వృక్ష కణజాలం 5

అనుబంధం

మీరు ప్రయోగశాలలో వివిధ వృక్ష కణజాలాలు పరిశీలించాలంటే వాటి స్లెడులను తయారుచేయడం నిపుణత సాధించడం అవసరం.

  • పరిచ్ఛేదాలను (సెక్షన్స్) పొందడానికి బెండును ఆధారంగా తీసుకోవాలి. బెండులో నిలువుగా ఒక చీలికను చేయాలి. పరిచ్ఛేదం తీయవలసిన పదార్థాన్ని (వేరు లేక కాండం లేక ఆకు లేక మొగ్గ) ఆ చీలికలోకి చొప్పించాలి.
  • నిలువుకోత కావాలంటే పదార్థాన్ని బెండులో అడ్డంగా చొప్పించాలి.
  • అడుకోత కావాలంటే పదార్థాన్ని బెండులో నిలువుగా చొప్పించాలి.
  • బ్లేడును ఉపయోగించి పలుచని పరిచ్ఛేదాలను ఉంచాలి.
  • వాచ్ గ్లాస్ లో ఉన్న నీటిలో పరిచ్ఛేదాలను ఉంచాలి.
  • ఒక పలుచటి పరిచ్చేదాన్ని ఎంపికచేసుకొని, చిన్న బ్రష్ సహాయంతో గాజు పలక పైన ఉంచాలి.
  • దానిపై ఒక చుక్క గ్లిజరిన్ వేయాలి.
  • ఒకచుక్క శాస్రనితో దానిని రంజనం చేయాలి.
  • నీడిల్ ను ఉపయోగించి, కవర్ స్లిప్ తో జాగ్రత్తగా మూయాలి.
  • అధికంగా ఉన్న నీటిని లేక గ్లిజరినను లేక వర్ణద్రవ్యాన్ని అద్దుడు కాగితంతో తొలగించాలి.
  • అప్పుడు సూక్ష్మదర్శినితో పరిశీలించాలి.