SCERT AP 9th Class Biology Guide Pdf Download 2nd Lesson వృక్ష కణజాలం Textbook Questions and Answers.
AP State Syllabus 9th Class Biology 2nd Lesson Questions and Answers వృక్ష కణజాలం
9th Class Biology 2nd Lesson వృక్ష కణజాలం Textbook Questions and Answers
అభ్యసనాన్ని మెరుగుపరుచుకోండి
ప్రశ్న 1.
ఈ పదాలను నిర్వచించండి. (AS 1)
ఎ) కణజాలం
బి) విభాజ్య కణజాలం
సి) త్వచ కణజాలం
జవాబు:
ఎ) కణజాలం :
ఒకే నిర్మాణం కలిగి, ఒకే విధమైన విధుల్ని నిర్వర్తించే కణాల సమూహమును కణజాలం అంటారు.
బి) విభాజ్య కణజాలం :
పెరుగుతున్న భాగాల్లో ఉండే, విభజన చెందగలిగే కణజాలంను విభాజ్య కణజాలం అంటారు.
సి) త్వచ కణజాలం :
మొక్క భాగాలను వెలుపల కప్పి ఉంచే కణజాలంను త్వచ కణజాలం అంటారు. మొక్కకు రక్షణ ఇస్తుంది.
ప్రశ్న 2.
కింది వాటి మధ్య భేదములను తెల్పండి. (AS 1)
జవాబు:
ఎ) విభాజ్య కణజాలం, సంధాయక కణజాలం
విభాజ్య కణజాలం | సంధాయక కణజాలం |
1. ఎప్పుడూ విభజన చెందగలిగిన కణాలు ఉంటాయి. | 1. విభజన చెందలేని కణాలు ఉంటాయి. |
2. ఇది సరళ కణజాలం. | 2. ఇది సరళ లేదా సంక్లిష్ట కణజాలం. |
3. దీని యందు సజీవ కణాలు ఉంటాయి. | 3. దీని యందు సజీవ (లేదా) నిర్జీవ కణములు ఉండవచ్చు. |
4. చిక్కని జీవపదార్థము కణమునందు ఉంటుంది. | 4. పలుచని జీవపదార్ధము కణము నందు ఉంటుంది. |
బి) అగ్ర విజ్య కణజాలం, పార్శ్వ విభాజ్య కణజాలం
అగ్ర విభాజ్య కణజాలం | పార్శ్వ విభాజ్య కణజాలం |
1. వేరు, కాండం శాఖల అగ్రభాగాలలో ఉంటుంది. | 1. మొక్క దేహం యొక్క పార్శ్వ అంచుల వద్ద ఉంటుంది. |
2. వేరు, కాండములు పొడవుగా పెరగటానికి తోడ్పడతాయి. | 2. కాండాలు, వేర్లు మందంలో పెరుగుదల చెందడానికి తోడ్పడతాయి. |
సి) మృదు కణజాలం, స్థూలకోణ కణజాలం
మృదు కణజాలం | స్థూలకోణ కణజాలం |
1. మృదు కణజాల కణాలు మృదువుగా, పలుచని గోడలు కలిగి, వదులుగా అమరి ఉంటాయి. | 1. స్థూలకోణ కణజాల కణాలు దళసరి గోడలను కలిగి కొంచెం పొడవైన కణాలు కలిగి ఉంటాయి. |
2. మృదు కణజాల కణాలు ఆహారనిల్వ చేస్తాయి. హరితరేణువులు మరియు పెద్దగాలి గదులను కలిగి ఉంటాయి. | 2. ఇది కాండపు లేత కణజాలమునకు యాంత్రిక బలాన్ని ఇస్తుంది. |
3. కణకవచాలు, అసమాన మందంలో ఉంటాయి. | 3. సెల్యులోజ్ తయారయిన కణకవచము ఉంటుంది. |
4. కణాలు అండాకారంగా, గోళాకారంగా లేదా దీర్ఘచతురస్రాకారంగా ఉంటాయి. | 4. కణములు సాగి గుండ్రంగా గాని, గోళాకారంలోగాని ఉంటాయి. |
డి) దృఢ కణజాలం, మృదు కణజాలం
దృఢ కణజాలం | మృదు కణజాలం |
1. ఇది నిర్జీవ కణజాలం. | 1. ఇది సజీవ కణజాలం. |
2. కణకవచాలు మందంగా ఉంటాయి. | 2. కణకవచాలు పలుచగా ఉంటాయి. |
3. కణాల మధ్య ఖాళీ ప్రదేశాలు ఉండవు. | 3. కణాల మధ్య ఖాళీ ప్రదేశాలు ఉంటాయి. |
4. ఇది మొక్కకు యాంత్రిక బలాన్ని ఇస్తుంది. | 4. ఇది ఆహారనిల్వకు, కిరణజన్య సంయోగక్రియ జరుపుటకు మరియు మొక్కలు నీటిలో . తేలుటకు ఉపయోగపడుతుంది. |
ఇ) దారువు, పోషక కణజాలం
దారువు | పోషక కణజాలం |
1. నీరు-పోషకాలను వేర్ల నుండి మొక్క అగ్రభాగాలకు సరఫరా చేస్తుంది. | 1. ఆకు నుండి ఆహారపదార్ధములను మొక్క పెరుగుదల భాగాలకు సరఫరా చేస్తుంది. |
2. దారువు నందు దారు కణములు, దారునాళములు, దారునారలు మరియు దారుమృదు కణజాలం ఉంటాయి. | 2. పోషక కణజాలం నందు చాలనీ కణాలు చాలనీ నాళాలు, సహకణాలు పోషక కణజాల నారలు మరియు పోషక కణజాల మృదుకణజాలం ఉంటాయి. |
3. దారు మృదుకణజాలం సజీవ కణజాలం. | 3. పోషక కణజాల నారలు నిర్జీవ కణాలు. |
ఎఫ్) బాహ్యచర్మం, బెరదు
బాహ్య చర్మం | బెరడు |
1. కాండము, వేరు, ఆకునందు వెలుపల ఉండు పొర. | 1. బాహ్య చర్మం మీద అనేక వరుసలలో ఏర్పడినది బెరడు. |
2. బాహ్య చర్మం సజీవ కణజాలం. | 2. బెరడు నిర్జీవ కణజాలం. |
ప్రశ్న 3.
నా పేరేంటో చెప్పండి. (AS 1)
ఎ) నేను మొక్క పొడవులో పెరుగుదలకు కారణమైన పెరుగుదల కణజాలాన్ని
బి) నేను మొక్కలలో వర్తులంగా పెరుగుదలకు కారణమైన పెరుగుదల కణజాలాన్ని
సి) నేను నీటి మొక్కల్లో పెద్ద గాలి గదుల్ని కలిగి ఉండే మృదు కణజాలాన్ని
డి) నేను ఆహారపదార్థాన్ని కలిగి ఉండే మృదు కణజాలాన్ని
ఇ) నేను వాయు మార్పిడికి, బాష్పోత్సేకానికి అత్యవసరమైన రంధ్రాన్ని
జవాబు:
ఎ) అగ్ర విభాజ్య కణజాలం
బి) పార్శ్వ విభాజ్య కణజాలం
సి) వాయుగత కణజాలం
డి) నిల్వచేసే కణజాలం
ఇ) పత్రరంధ్రం
ప్రశ్న 4.
కింది వాటి మధ్య పోలికలు రాయండి. (AS 1)
జవాబు:
ఎ) దారువు, పోషక కణజాలం
దారువు | పోషక కణజాలము |
1. దారువు నీరు మరియు పోషక పదార్థములను వేర్ల నుండి మొక్క అగ్రభాగాలకు సరఫరా చేస్తుంది. | 1. ఇది ఆకుల నుండి ఆహార పదార్ధములను మొక్క ఇతర భాగాలకు సరఫరా చేస్తుంది. |
2. దారుకణాలు, దారునాళాలు, దారునారలు మరియు దారు మృదుకణజాలంలు దీనియందు ఉంటాయి. | 2. పోషక కణజాలం నందు చాలనీ కణాలు చాలనీ నాళాలు, సహకణాలు, పోషక కణజాల నారలు మరియు పోషక కణజాల మృదుకణజాలం ఉంటాయి. |
3. దారు మృదుకణజాలం మాత్రమే సజీవ కణజాలం. | 3. చాలనీ కణాలు, చాలనీ నాళాలు, సహకణాలు మరియు పోషక మృదుకణజాలంలు సజీవ కణజాలాలు. |
4. దారుకణాలు, దారునాళాలు, దారునారలు నిర్జీవ కణజాలంలు. | 4. పోషక కణజాల నారలు మాత్రమే నిర్జీవ కణజాలం. |
5. మొక్కకు యాంత్రిక బలాన్ని ఇస్తుంది. | 5. మొక్కకు యాంత్రిక బలమును ఇవ్వదు. |
6. దారువు నీటి సరఫరాను ఏకమార్గములో నిర్వహిస్తుంది. వేర్ల నుండి మొక్క అగ్రభాగాలకు చేరుస్తుంది. | 6. ఆహార పదార్థాల సరఫరా ద్విమార్గముల ద్వారా నిర్వహిస్తుంది. ఆకుల నుండి నిల్వ అంగాలు లేదా పెరుగుదల నిల్వ అంగాల నుండి పెరుగుదల ప్రదేశాలకు సరఫరా చేస్తుంది. |
బి) విభాజ్య కణజాలం, త్వచ కణజాలం
విభాజ్య కణజాలం | త్వచ కణజాలం |
1. కణములు చిన్నవిగా పలుచని కణకవచములు కలిగి ఉంటాయి. | 1. దీనియందలి కణముల కణకవచములు దళసరిగా ఉంటాయి. |
2. విభజన చెందగలిగే కణాలు ఉంటాయి. | 2. విభజన చెందలేని కణాలు ఉంటాయి. |
3. ఇది వేరు, కాండము, కొనలు మరియు శాఖలు వచ్చే ప్రదేశములలో ఉంటుంది. | 3. త్వచకణజాలం బాహ్యస్వచం, మధ్యస్త్వచం మరియు. అంతస్త్వచములుగా ఉంటుంది. |
4. మొక్క పెరుగుదలకు సహాయపడుతుంది. | 4. మొక్క భాగాలకు రక్షణ ఇస్తుంది. బాష్పోత్సేకము ద్వారా కలిగే నీటి నష్టాన్ని నివారిస్తుంది. |
ప్రశ్న 5.
కింది వాక్యాలు చదివి కారణాలు రాయండి. (AS 1)
జవాబు:
ఎ) దారువు ప్రసరణ కణజాలం :
- దారువు వేర్ల నుండి నీటిని పోషక పదార్థములను మొక్క అగ్రభాగాలకు సరఫరా చేస్తుంది.
- వేర్ల నుండి పదార్థములను దూరభాగములకు రవాణా చేస్తుంది.
- వేర్ల నుండి మొక్క అగ్రభాగాలకు నీటి సరఫరా ఏకమార్గములో జరుగుతుంది.
బి) బాహ్య చర్మం రక్షణనిస్తుంది.
- బాహ్యచర్మము నందలి కణములు సాధారణముగా ఒక పొరయందు ఉంటాయి.
- బాహ్యచర్మము నందలి కణముల గోడలు దళసరిగా ఉంటాయి.
- నీటి ఎద్దడి, కొమ్మలు విరగడం, చీలడం వంటి యాంత్రికంగా కలిగే నష్టాలు పరాన్న జీవులు, రోగకారక జీవుల దాడి మొదలైన వాటి నుండి మొక్కలను బాహ్యచర్మం రక్షిస్తుంది.
ప్రశ్న 6.
కింది వాటి విధులను వివరించండి. (AS 1)
1) విభాజ్య కణజాలం 2) దారువు 3) పోషక కణజాలం
జవాబు:
1) విభాజ్య కణజాలం విధులు :
- మొక్క భాగాలన్నింటిలో పెరుగుదలను, మరమ్మతులను నిర్వహించేది విభాజ్య కణజాలం.
- దీని నుండి ఏర్పడిన కణములు మొక్క దేహంలో వివిధరకాల కణజాలాలుగా ఏర్పడతాయి.
2) దారువు విధులు :
- నీరు మరియు పోషక పదార్థములను వేర్ల నుండి మొక్క అగ్రభాగాలకు సరఫరా చేస్తుంది.
- మొక్కకు యాంత్రిక బలాన్ని ఇస్తుంది.
- పోషక కణజాలం విధులు : ఆకులలో తయారయిన ఆహారపదార్థములు మొక్కలోని ఇతర భాగాలకు సరఫరా చేస్తుంది.
ప్రశ్న 7.
మొక్కల్లోని కణజాలాల గురించి మరింత విపులంగా తెలుసుకోవడానికి, మీరు ఎటువంటి ప్రశ్నలను అడుగుతారు? జాబితా రాయండి. (AS 2)
జవాబు:
- మొక్కలకు యాంత్రిక బలాన్ని, వంగే గుణాన్ని కలిగించే కణజాలమేది? (స్థూలకోణ కణజాలం)
- మొక్క దేహంలోనికి వ్యాధిని కలిగించే సూక్ష్మజీవులను రానీయకుండా అడ్డుకునే కణజాలం? (బాహ్య చర్మం)
- అగ్రవిభాజ్య కణజాలం పాడైనా లేదా తెగిన ఏమి జరుగుతుంది? (మొక్క పొడవు అవడం ఆగిపోతుంది)
- కొబ్బరికాయపై తొక్కునందు ఉండు కణజాలం పేరేమిటి? (దృఢ కణజాలం)
- మొక్కలకు రకరకాల కణజాలాలు ఎందుకు కావాలి? (వివిధ రకముల పనుల నిర్వహణకు)
ప్రశ్న 8.
“బెరడు కణాలు వాయువులను, నీటిని లోనికి పోనీయవు” ఈ వాక్యాన్ని వివరించడానికి నీవు ఏ ప్రయోగం చేస్తావు? (AS 3)
జవాబు:
- వేప చెట్టు నుండి బెరడు వలచి పడవ (దోనె) ఆకారంలో తయారు చేసుకొన్నాను.
- ఒక పలుచటి వేప చెక్కను బెరడు లేకుండా తీసుకొన్నాను.
- వేపచెక్కను, బెరడును, నీటిలో పడవేశాను. రెండూ నీటి మీద తేలాయి.
- బెరడు వెలుపలి భాగం నీటిని తాకుతూ, లోపలిభాగం నీటిని తాకకుండా జాగ్రత్త పడ్డాను.
- ఒక రోజు ఆగిన తరువాత రెండింటినీ పరిశీలించాను.
- వేపచెక్క పైభాగం తడిగా కనిపించింది. వేపచెక్క నీటిని పీల్చటం వలన పైభాగం తడిగా మారిందని గ్రహించాను.
- బెరడు లోపలి భాగంలో ఎటువంటి మార్పు గాని, తేమ గాని కనిపించలేదు.
- అంటే బెరడు ద్వారా నీరు లోపలికి ప్రసరించలేదు.
- దీనిని బట్టి బెరడు నీటిని లోపలికి పోనివ్వదని నిరూపించాను.
ప్రశ్న 9.
మొక్కల్లోని త్వచకణజాలం, వాటికి ఎలా సహాయపడుతుందో తెలిపే సమాచారాన్ని సేకరించండి. గోడపత్రికలో ప్రదర్శించండి. (AS 4)
జవాబు:
- త్వచ కణజాలంనందు సాధారణముగా ఒక పొర ఉంటుంది. దీనిలోని కణములు వేరువేరు విధముగా ఉంటాయి.
- వాటి విధులు, స్థానాన్ని బట్టి ఈ కణజాలం మూడు రకాలుగా విభజించబడింది. అవి బాహ్యచర్మం లేక బహిస్త్వచం (వెలుపలి పొర), మధ్యస్వచం (మధ్య పొర), అంతస్త్వచం (లోపలి పొర).
- ఆకు బాహ్య చర్మంలో చిన్నరంధ్రాలు కనిపిస్తాయి. వాటిని పత్రరంధ్రాలు అంటారు.
- వేరులో అయితే కణాలు పొడవైన వెంట్రుక వంటి మూలకేశాలను కలిగి ఉంటాయి.
- జిగురునిచ్చే చెట్ల యొక్క త్వచకణజాలం నుండి జిగురు స్రవించబడుతుంది.
- నీటి ఎద్దడి, కొమ్మలు విరగడం, చీలడం వంటి యాంత్రికంగా కలిగే నష్టాలు, పరాన్న జీవులు, రోగకారక జీవుల దాడి మొదలైన వాటి నుండి మొక్కలను రక్షించేది త్వచ కణజాలం.
ప్రశ్న 10.
కాండం-అడ్డుకోత పటం గీచి, భాగాలు గుర్తించండి. (AS 5)
జవాబు:
ప్రశ్న 11.
హరిత కణజాలం, వాయుగత కణజాలం, నిల్వ ఉంచే కణజాలం – ఈ మూడూ మృదుకణజాలాలే. అయినా వాటికి ప్రత్యేకమైన పేర్లు ఎందుకున్నాయి? (AS 6)
జవాబు:
- హరితకణజాలం, వాయుగత కణజాలం, నిల్వ ఉంచే కణజాలం ఇవి అన్నియు మృదు కణజాలంలే.
- ఈ మృదు కణజాలాలన్ని వివిధ రకాల పనుల నిర్వహణకై రూపాంతరం చెందాయి.
- హరిత రేణువులు కలిగి ఉండే మృదుకణజాలం హరిత కణజాలం. ఇది కిరణజన్య సంయోగక్రియ నిర్వహణకు ఉపయోగపడుతుంది.
- పెద్ద గాలి గదుల్ని కలిగి ఉండే మృదు కణజాలాన్ని వాయుగత కణజాలం అంటారు. ఇది మొక్కలు నీటిలో తేలుటకు సహాయపడుతుంది.
- నీరు, ఆహారం, వ్యర్థ పదార్థాల నిల్వకు ఉపయోగపడే కణజాలాన్ని నిల్వచేసే కణజాలం అంటారు.
ప్రశ్న 12.
మొక్కల అంతర్భాగములను పరిశీలించేటప్పుడు వాటి నిర్మాణం, విధులు గురించి మీరెలా అనుభూతిని పొందారు? (AS 6)
జవాబు:
- మొక్క భాగాల అంతర్నిర్మాణమును పరిశీలించినపుడు కణములు రకరకములని అందువలన వాటి యొక్క విధులు నిర్దిష్టంగా ఉన్నాయని భావించాను.
- ఉదాహరణకు కాండములో దారువు, పోషక కణజాలం మరియు ఆకునందు వెలుపలి పొరనందు ఉండే పత్రరంధ్రములు వివిధ పనుల నిర్వహణకు ఉన్నాయి.
- కణములు కణజాలములుగా ఏర్పడి వివిధరకాల క్రియల నిర్వహణ ద్వారా మొక్క జీవించి ఉండడానికి కారణమవుతున్నాయని భావించాను.
ప్రశ్న 13.
మొక్క పెరుగుదలలో వివిధ రకాల కణజాలాలు ఎలా దోహదం చేస్తాయో మీ పరిసరాలలోని ఒక చెట్టును పరిశీలించి అన్వయించండి. (AS 7)
జవాబు:
- చెట్టు యొక్క గ్రీవ భాగాలలోనూ, అగ్రభాగంలోనూ మొగ్గలు ఉన్నాయి. ఇవి విభాజ్య కణజాలాన్ని కలిగి వేగంగా పెరుగుదల చూపుతున్నాయి.
- ఈ మొగ్గలు (కోరకాలు) కొత్త ఆకులను ఏర్పర్చి చెట్టు ఆకారాన్ని, పరిమాణాన్ని నియంత్రిస్తున్నాయి.
- ఆకులు, కాండము, కొమ్మలు పై భాగాన పలుచని పొరవంటి కణజాలం కప్పి ఉంది. దీనిని త్వచకణజాలం అంటారు. ఇది మొక్క భాగాలకు రక్షణ కల్పిస్తుంది.
- వృక్ష దేహాన్ని ఏర్పర్చుతూ ఇతర కణజాలాన్ని సరైన స్థితిలో ఉంచటానికి సంధాయక కణజాలం ఉంది. ఇది అధికంగా విస్తరించి ఎక్కువ మోతాదులో ఉంది.
- పదార్థాల రవాణాకు, కాండము నుండి కొమ్మల ద్వారా పత్రాలలోనికి విస్తరించిన నాళాల వంటి కణజాలం ఉంది. దీనిని ప్రసరణ కణజాలం అంటారు.
- ప్రసరణ కణజాలంలోని దారువు ద్వారా నీరు సరఫరా చేయబడితే పోషకకణజాలం ద్వారా ఆహారపదార్థాల రవాణా జరుగుతుంది.
9th Class Biology 2nd Lesson వృక్ష కణజాలం Textbook Activities (కృత్యములు)
కృత్యం – 1
1. మొక్కలోని భాగాలు – వాటి విధులు :
మొక్కల్లోని వివిధ భాగాల పనులను గురించి కింది తరగతుల్లో చదువుకున్నారు. కింది పట్టికలోని విధుల జాబితా చదవంది. ఆ విధుల నిర్వహణలో పాల్గొనే మొక్క భాగాల పేర్లు రాయండి.
జవాబు:
విధి | భాగాల పేర్లు |
1. నీటి సంగ్రహణ | వేరు వ్యవస్థలోని దారువు |
2. వాయువుల (గాలి) మార్పిడి | ఆకులలోని పత్రరంధ్రాలు |
3. కిరణజన్య సంయోగక్రియ | ఆకులలోని పత్ర హరితం |
4. బాష్పోత్సేకం | ఆకులలోని పత్రరంధ్రాలు |
5. ప్రత్యుత్పత్తి | వేర్లు, కాండం, పత్రం, విత్తనాలు |
1. మొక్కలు అన్ని రకాల జీవ క్రియలను ఎలా జరుపుకోగలుగుతున్నాయి?
జవాబు:
మొక్కలలో అమరియున్న వివిధ కణజాలముల ద్వారా మొక్కలు అన్ని రకాల జీవక్రియలు జరుపుకోగలుగుతున్నాయి.
2. ఈ క్రియల నిర్వహణలో సహాయపడటానికి మొక్కల్లో ప్రత్యేకమైన కణాల అమరిక ఏమైన ఉందా?
జవాబు:
- ఒకే రకమైన నిర్మాణం మరియు విధులను నిర్వహించే కణములన్ని సమూహములుగా ఉండి కణజాలములు ఏర్పడినాయి.
- కణజాలాలు అన్ని నిర్దిష్టమైన అమరిక కలిగియుండి మొక్కలకు జీవక్రియ నిర్వహణలో తోడ్పడతాయి.
కృత్యం – 2
ఉల్లిపొరలోని కణాలు :
2. సూక్ష్మదర్శిని సహాయముతో ఉల్లిగడ్డ పొరను నీవు ఏ విధముగా పరిశీలిస్తావు? బొమ్మ గీచి, భాగాలు గుర్తించి, నీ పరిశీలనలను రాయుము.
జవాబు:
ఉల్లిగడ్డ పొర పరిశీలన :
- ఒక ఉల్లిపొర ముక్కని తీసుకోవాలి.
- దానిని గాజుపలక మీద ఉంచాలి.
- దీని పైన ఒక చుక్కనీరు, ఆ తర్వాత ఒక చుక్క గ్లిజరిన్ వేయాలి.
- దానిపై కవర్‌పను నెమ్మదిగా ఉంచాలి.
- సూక్ష్మదర్శిని ద్వారా పరిశీలించాలి.
పరిశీలనలు :
- కణములన్నియు ఒకే ఆకారం, నిర్మాణము కలిగి ఉన్నాయి.
- కణముల మధ్య ఖాళీ ప్రదేశాలు ఉన్నాయి.
- కణములు వరుసలలో అమరి ఉన్నాయి.
- ప్రతి కణమునకు కణకవచము, కేంద్రకము మరియు కణజీవ పదార్ధము ఉన్నాయి.
కృత్యం – 3
ఆకు – పై పొరలోని కణాలు :
3. సూక్ష్మదర్శిని సహాయంతో తమలపాకును ఏ విధంగా పరిశీలిస్తావు? బొమ్మ గీచి, భాగాలను గుర్తించి, నీ పరిశీలనలను వ్రాయుము.
కృత్యం :
- తమలపాకును గానీ, గోలగొండి ఆకును గానీ తీసుకొనవలెను.
- ఆకును మధ్యకు మడిచి చింపవలెను. చినిగిన చోట సన్నటి అంచు కనిపిస్తుంది.
- ఈ అంచును, ఉల్లిపొరను పరిశీలించినట్లే సూక్ష్మదర్శిని ద్వారా పరిశీలించవలెను.
- పరిశీలించిన దాని పటాన్ని గీయవలెను. పటంతో పోల్చవలెను.
పరిశీలనలు :
- పరిశీలించిన కణాలు అన్ని ఒకే మాదిరిగా లేవు. కొన్ని చిన్నవిగా, మరికొన్ని పెద్దవిగా ఉన్నాయి.
- కణాల అమరికలో తేడా ఉంది. అవి దగ్గర దగ్గరగా కణాంతరావకాశాలు లేకుండా అమరి ఉన్నాయి.
- కణాలు సమూహాలుగా ఉండి, నిర్దిష్టంగా అమరి ఉండటాన్ని పరిశీలించవచ్చు.
కృత్యం – 4
వేరు మూలలోని కణాలు :
4. ఉల్లిగడ్డ వేరుమూలంను నీవు ఏ విధముగా పరిశీలిస్తావు? సూక్ష్మదర్శిని సహాయముతో బొమ్మ గీయుము. నీ యొక్క పరిశీలనలను నమోదు చేయుము.
జవాబు:
వేరు మూలంలోని కణాల పరిశీలన :
- ఒక పారదర్శకమైన సీసాను తీసుకొని నీటితో నింపాలి. సీసా మూతి కంటే కొంచెం పెద్దదిగా ఉండే ఉల్లిగడ్డను తీసుకోవాలి. ఉల్లిగడ్డను సీసా మూతిపై ఉంచాలి.
- వేర్లు దాదాపు ఒక అంగుళం పొడవు పెరిగే వరకు కొద్దిరోజుల పాటు వేర్ల పెరుగుదలను గమనించాలి.
- ఉల్లిగడ్డను తీసుకొని కొన్ని వేర్ల కొనలను కత్తిరించాలి.
- ఒక వేరుకొనను తీసుకోవాలి. దాన్ని గాజుపలకపై ఉంచాలి.
- దానిపై ఒక చుక్క నీటిని, తరువాత ఒక చుక్క గ్లిజరినను వేయాలి.
- కవర్‌స్లితో కప్పి కవర్ స్లిప్ పై 2, 3 అదుడు కాగితాలను ఉంచాలి.
- నీడిల్ లేదా బ్రష్ వెనుకవైపు కొనతో కవర్ స్లిప్ పై సున్నితంగా కొట్టి పదార్థం పరచుకునేలా చేయాలి.
- కణాల నిర్మాణాన్ని, అమరికను సూక్ష్మదర్శినితో పరిశీలించాలి.
పరిశీలనలు :
- కణములన్నియు ఆకారపరంగా, నిర్మాణపరంగా ఒకే విధముగా లేవు.
- కణములన్నీ వివిధ వరుసలలో అమరి ఉన్నాయి.
- అగ్రవిభాజ్య కణజాలం వేరు తొడుగునకు క్రింద ఉన్నది.
కృత్యం – 5
పెరుగుతున్న వేర్లు :
5. ఉల్లిగడ్డ యొక్క కత్తిరించిన కొనలను సూక్ష్మదర్శినితో పరిశీలించుము. బొమ్మను గీచి పరిశీలనలను రాయండి.
జవాబు:
- ఉల్లిగడ్డను తీసికొని వేర్లను కత్తిరించాలి.
- కత్తిరించిన వేరు కొనలకు కొంచెం పైగా మార్కర్ పెతో గుర్తించాలి.
- ఉల్లిగడ్డను సీసామూత మీద ఉంచాలి.
- నాలుగు, ఐదు రోజులపాటు అలాగే ఉంచాలి.
- వేర్లు కొంచెం మునిగేలా, చాలినంత నీరు ఉండేలా తగు జాగ్రత్త తీసుకోవాలి.
పరిశీలనలు :
- నిర్దిష్ట రూపములో కణములు అమరియుండిన వేరుకొనను తొలగించిన వేరు పొడవు పెరుగుదల ఆగిపోతుంది.
- కణములు సమూహములుగా ఉన్నాయి.
కృత్యం – 6
కాండంకొన, వేరు కొనలో ఉన్న విభాజ్య కణజాలాన్ని సరిపోల్చడం.
6. కాండం కొన, వేరుభాగాలను పరిశీలించి కణాల అమరికను క్రింది పట్టిక నందు రాయండి.
జవాబు:
కణాల అమరిక (కణజాలాలు) | కాండం కొన | వేరుకొన |
కొనభాగంలో | అగ్ర విభాజ్య కణజాలం | వేరు తొడుగునకు వెనుక అగ్ర విభాజ్య కణజాలం |
పార్శ్వ భాగంలో | పార్శ్వ విభాజ్య కణజాలం | పార్శ్వ విభాజ్య కణజాలం |
శాఖలు వచ్చేచోట | మధ్యస్థ విభాజ్య కణజాలం | మధ్యస్థ విభాజ్య కణజాలం లేదు |
కృత్యం – 7
ద్విదళబీజ కాండంలోని కణజాలాలు :
7. ద్విదళ బీజకాండము అడ్డుకోత తాత్కాలిక సైడ్ ను సూక్ష్మదర్శిని క్రింద పరిశీలించి, బొమ్మ గీచి, భాగములను గుర్తించుము. నీ యొక్క పరిశీలనలను రాయుము.
జవాబు:
ద్విదళ బీజకాండము అడ్డుకోత సైడ్ ను తయారుచేసి సూక్ష్మదర్శిని క్రింద పరిశీలించాలి.
పరిశీలనలు:
- ద్విదళ బీకాండపు అడ్డుకోతనందు విభాజ్య కణజాలం, ప్రసరణ కణజాలం, త్వచకణజాలం మరియు సంధాయక కణజాలాలు ఉన్నాయి.
- కణములన్నియు ఒకేవిధమైన ఆకారము, నిర్మాణమును కలిగి యుండలేదు.
కృత్యం – 8
రియో ఆకు – ఉపరితల కణజాలం :
8. రియో ఆకును సూక్ష్మదర్శిని క్రింద పరిశీలించుము. మ్మ గీచి, భాగములను గుర్తించుము. నీ పరిశీలనలను రాయుము.
జవాబు:
- తాజాగా ఉన్న రియో ఆకును తీసుకోవాలి.
- ఒక్కసారిగా మధ్యలో చీల్చండి. చినిగిన అంచు వద్ద తెల్లటి పొర కనిపిస్తుంది.
- ఆ పొరను జాగ్రత్తగా తీసి సూక్ష్మదర్శిని ద్వారా పరిశీలించాలి.
పరిశీలనలు :
- నిర్మాణపరంగా కణములన్నీ ఒకే విధముగా ఉన్నాయి.
- కణముల మధ్య ఖాళీ ప్రదేశములు లేకుండా దగ్గరగా అమరి ఉన్నాయి.
- ఇది మొక్క యొక్క త్వచ కణజాలం.
- దీనియందు పత్రరంధ్రము కలదు.
కృత్యం – 9
కణజాలాల పరిశీలన :
9. మీ ప్రయోగశాల నుండి హరిత కణజాలం, వాతయుత కణజాలం, నిల్వచేసే కణజాలాల సైట్లను సేకరించండి. మైక్రోస్కోపీతో పరిశీలించండి. మీరు గమనించిన లక్షణాలను నోటు పుస్తకంలో రాయండి.
జవాబు:
గమనించిన లక్షణాలు:
i) హరిత కణజాలం :
ఈ కణజాలం హరిత రేణువులను కలిగి ఉంటుంది. అందువలన దీనిని హరిత కణజాలం అంటారు.
ii) వాతయుత కణజాలం :
ఈ కణజాలం మృదుకణజాలం. పెద్ద గాలిగదుల్ని కలిగి ఉంటుంది. అందువలన దీనిని వాయుగత మృదుకణజాలం లేదా వాతయుత కణజాలం అంటారు.
iii) నిల్వజేసే కణజాలం :
ఈ మృదు కణజాలం నీరు, ఆహారం, వ్యర్థ పదార్థాలను నిల్వ చేస్తుంది. అందువలన దీనిని నిల్వచేసే కణజాలం అంటారు.