SCERT AP 9th Class Biology Study Material Pdf Download 3rd Lesson జంతు కణజాలం Textbook Questions and Answers.
AP State Syllabus 9th Class Biology 3rd Lesson Questions and Answers జంతు కణజాలం
9th Class Biology 3rd Lesson జంతు కణజాలం Textbook Questions and Answers
అభ్యసనాన్ని మెరుగుపరుచుకోండి
ప్రశ్న 1.
కణజాలం అనగానేమి? (AS 1)
జవాబు:
కణజాలం :
ఒకే నిర్మాణం కలిగి, ఒకే విధమైన విధుల్ని నిర్వర్తించే కణాల సమూహమును కణజాలం అంటారు.
ప్రశ్న 2.
హృదయ కండరం చేసే ప్రత్యేకమైన విధి ఏమిటి? (AS 1)
జవాబు:
హృదయకండరం చేసే ప్రత్యేకమైన విధి : హృదయ కండరం హృదయాన్ని ఆవరించి ఉండి, హృదయంలో సంకోచ వ్యాకోచాలను కలిగిస్తూ రక్త ప్రసరణలో పాత్ర వహిస్తుంది.
ప్రశ్న 3.
ఉండే స్థానం, ఆకారాన్ని అనుసరించి రేఖిత, అరేఖిత కండరాల మధ్య భేదాన్ని రాయండి. (AS 1)
జవాబు:
రేఖిత కందరం | అరేఖిత కండరం |
నిర్మాణం: 1) ప్రతి కండరం అనేక పొడవైన సన్నటి శాఖా రహితమైన తంతువులను పోలిన కణములను కలిగి ఉంటుంది. కణం స్థూపాకారంలో అనేక కేంద్రకాలను కలిగి ఉంటుంది. |
1) కండర కణాలు పొడవుగా సాగదీయబడి కుదురు ఆకారంలో ఉంటాయి. కణంలో ఒకే కేంద్రకం ఉంటుంది. |
2) కండరము పొడవుగా అనేక అడ్డుచారలు కలిగి ఉంటుంది. | 2) అడ్డుచారలు ఉండవు. |
స్థానం : 3) కాళ్ళు, చేతులందు మరియు అస్థిపంజరములోని ఎముకలకు అతికి ఉంటాయి. |
3) ఆహారనాళం, రక్తనాళాలు, ఐరిస్, గర్భాశయం మరియు వాయునాళాల్లో ఉంటాయి. |
ప్రశ్న 4.
కింది వాక్యాలు చదివి వాటి పేర్లు రాయండి. (AS 1)
ఎ) మన నోటి లోపలి పొరలలో ఉండే కణజాలం
బి) మానవుల శరీరపు ఎముకలతో కలిసి ఉండే కండరం
సి) జంతువులలో ఆహారపదార్థం రవాణా చేసే కణజాలం
డి) మన శరీరంలో కొవ్వు నిల్వచేసే కణజాలం
ఇ) మెదడులో ఉండే సంయోజక కణజాలం
జవాబు:
ఎ) స్తంభాకార ఉపకళా కణజాలము
బి) స్నాయుబంధనం
సి) రక్తకణజాలం
డి) ఎడిపోజ్ కణజాలం
ఇ) నాడీ కణజాలం
ప్రశ్న 5.
ఈ క్రింది అవయవాల్లో ఎటువంటి కణజాలం ఉంటుంది? (AS 1)
చర్మం, ఎముక, మూత్రపిండ నాళాల అంతర భాగం.
జవాబు:
చర్మం : సరిత ఉపకళా కణజాలము.
ఎముక : సంయోజక కణజాలము.
మూత్రపిండనాళాల అంతర్భాగం : ఘనాకార ఉపకళా కణజాలము.
ప్రశ్న 6.
ఒక్కొక్కసారి మోచేతిని గట్టిగా కొట్టినప్పుడు విద్యుత్ ఘాతం తగిలినట్టు అనిపిస్తుంది. ఎందుకు? (AS 1)
జవాబు:
- మానవులలో ముంజేటి లోపల ఎముక అయిన మూర ఎముకతో ఉన్న: నరము లేదా నాడి భుజము నుండి చేయి వరకు వ్యాపిస్తుంది.
- ఈ నరము మోచేయి దగ్గర ఉపరితలమునకు వస్తుంది.
- ఉపరితలమునకు వచ్చిన నరమునకు కండరముగాని, క్రొవ్వుగాని, ఏ ఇతర మెత్తటి కణజాలము గాని రక్షణ ఇవ్వదు.
- చిన్న ప్రేరణలకు కూడా ఈ నరము చాలా ఎక్కువగా ప్రతిస్పందిస్తుంది.
- అందువలన మనకు మోచేతి పై దెబ్బ తగిలినపుడు విద్యుత్ తం తగిలినట్టు అనిపిస్తుంది.
ప్రశ్న 7.
రక్తాన్ని ద్రవరూప కణజాలమని ఎందుకు అంటారు? (AS 1)
జవాబు:
- రక్తం అన్ని అవయవాల గుండా ప్రవహించుట ద్వారా శరీరములోని రకరకాల కణజాలములను, అవయవములను కలుపుతుంది. అందువలన రక్తమును కదలాడే ద్రవరూప సంయోజక కణజాలం అంటారు.
- ఇది మిగతా సంయోజక కణజాలముల కంటే భిన్నమైనది.
- రక్తములో రకరకాల కణములు ఉన్నాయి. ప్రతి కణమునకు నిర్దిష్టమైన పని ఉన్నది.
- కణేతర మాత్రిక ద్రవరూప ప్లాస్మాతో నిండియుంది. దీనిలో రక్తకణములు స్వేచ్చగా తేలియాడతాయి.
- అందువలన రక్తమును ద్రవరూప కణజాలం అంటారు.
ప్రశ్న 8.
రక్తంలో రక్తఫలకికలు లేకపోతే ఏమి జరుగుతుంది? (AS 2)
జవాబు:
- రక్తఫలకికలు రక్తాన్ని గడ్డకట్టించడంలో సహాయపడతాయి.
- రక్తఫలకికలు లేకపోతే రక్తము గడ్డ కట్టదు. తద్వారా గాయము నుండి రక్తము కారిపోతూనే ఉంటుంది.
- ఎక్కువ మొత్తంలో రక్త నష్టం జరిగితే గాయపడిన వ్యక్తి చివరకు చనిపోతాడు.
ప్రశ్న 9.
మూడు రకాల కండర కణజాలాలలో గల భేదాలను పటం సహాయంతో వివరించండి. (AS 3)
జవాబు:
కండరాలు మూడు రకాలు. అవి : రేఖిత, అరేఖిత మరియు హృదయ కండరాలు.
1) రేఖిత కండరాలు:
- ఇవి అస్థిపంజరంలో ఎముకలకు అతికి ఉండి కదలికలకు కారణమవుతాయి.
- ఇవి మన అధీనంలో ఉంటాయి. కాబట్టి వీటిని నియంత్రిత కండరములు అంటారు.
- ప్రతి కండరం అనేక పొడవాటి శాఖారహితమైన కణాలను కలిగి ఉండును.
- ప్రతి కణం కండరం పొడవునా ఉండును.
- కండరం పొడవునా అనేక అడ్డుచారలు కలిగి ఉంటాయి. కావున వీటిని రేఖిత కండరాలంటారు. వీటిలో అనేక కేంద్రకాలుంటాయి.
2) అరేఖిత కండరాలు :
- ఇవి అన్నవాహిక, రక్తనాళాలలో ఉండి సంకోచ వ్యాకోచాలను కలిగిస్తాయి.
- ఈ కండరాల కదలికలు మన అధీనంలో ఉండవు. కాబట్టి వాటిని అనియంత్రిత కండరాలు అంటారు.
- ఇవి పొడవుగా సాగదీయబడి, కుదురు ఆకారంలో ఉంటాయి.
- వీటిలో అడ్డుచారలుండవు. కాబట్టి వీటిని అరేఖిత కండరాలంటారు.
- ఈ కణాలలో ఒక్క కేంద్రకం మాత్రమే ఉంటుంది. (ఏక కేంద్రకం).
3) హృదయ కండరాలు:
- ఈ కండరాలు గుండెలో ఉంటాయి. ఇవి రక్తప్రసరణలో సహాయపడతాయి.
- ఈ కణాలు శాఖలు కలిగి, పొడవుగా ఉంటాయి.
- హృదయ కండరంలోని కణాలన్నీ చారలు కలిగి, ఉంటాయి.
- దీనిలో కదలికలు మన అధీనంలో ఉండవు.
- నిర్మాణంలో ఇది రేఖిత కండరాన్ని పోలి ఉన్న అనియంత్రిత చర్యలు చూపిస్తుంది.
ప్రశ్న 10.
కిట్ ను ఉపయోగించి మీ రక్తవర్గాన్ని కనుగొనడంలో మీరు అనుసరించిన విధానాన్ని రాయంది. (AS 3)
జవాబు:
ఉద్దేశ్యం : రక్త వర్గాలను కనుగొనడం.
కావలసిన పరికరాలు : రక్త పరీక్ష కిట్, స్లెడ్, మైనపు పెన్సిల్, డిస్పోసబుల్ సూదులు.
కిట్లో లేనివి : దూది, 70% ఆల్కహాల్, పంటిపుల్లలు.
ప్రయోగ విధానం:
1) ఒక తెల్ల పింగాణి పలక. తీసుకొని తుడిచి ఆరబెట్టాలి.
2) తెల్ల పింగాణి పలక మీద సమానదూరంలో మైనపు పెన్సిల్ లో మూడు వృత్తాలను గీయాలి.
3) ప్రతి వృత్తంలో ఒక్కొక్క సీరంను అంచులు తాకకుండా ఒక చుక్క వేయాలి. (ఉదా : మొదటి వృత్తంలో యాంటీ సీరం ‘A’ను, రెండవదానిలో యాంటీ సీరం ‘B’ ను, మూడవ వృత్తంలో ‘RhD’ సీరంను వేయాలి).
4) ఎడమచేతి ఉంగరపు వేలిని సర్జికల్ స్పిరిట్లో ముంచిన దూదితో తుడిచి, వేలు మీద సూదిని మెల్లగా గుచ్చి రక్తాన్ని బయటకు తీయాలి.
5) వేలుని కొద్దిగా ఒత్తుట వలన రక్తం రావడం మొదలవుతుంది.
6) ఒక చుక్క రక్తాన్ని వృత్తంలో పడేలా బొటనవేలితో వేలిని ఒత్తాలి. ఆ రక్తపు చుక్కలను సీరం ఎ, బి, RhD లకు కలపాలి.
7) మూడు వృత్తాలలో రక్తం సేకరించిన తర్వాత వేలి మీద సూదితో గుచ్చినచోట ఇంతకుముందు ఉంచిన దూదితో అణచి పెట్టాలి.
8) మూడు వేరు వేరు పంటి పుల్లలను తీసుకొని రక్తం, సీరంలను బాగా కలపాలి.
9) ఏ వృత్తములోనైనా రక్తం గడ్డ కట్టిందేమో పరిశీలించాలి. పారదర్శక ద్రవంలో చిన్న చిన్న తునకలుగా రక్తం గడ్డకట్టి తేలి ఉండేటట్లు ఉందేమో గమనించాలి.
10) ‘Rh’ వృత్తం వద్ద రక్తం గడ్డకట్టడానికి కొంచెం సమయం తీసుకుంటుంది.
ఫలిత నిర్ధారణ :
ఫలితాల అనుగుణంగా రక్తవర్గాన్ని నిర్ధారించవచ్చు. ఇందుకోసం కింది పట్టిక సహాయం తీసుకోవాలి.
యాంటి – ఎ | యాంటి – బి | రకం |
రక్తం గడ్డకట్టింది | రక్తం గడ్డకట్టలేదు | ఎ |
రక్తం గడ్డకట్టలేదు | రక్తం గడ్డకట్టింది | బి |
రక్తం గడ్డకట్టింది | రక్తం గడ్డకట్టింది | ఎబి |
రక్తం గడ్డకట్టలేదు | రక్తం గడ్డకట్టలేదు | ఓ |
అలాగే RhD కారకంలో రక్తం గడ్డకట్టితే Rh* రక్తం, రక్తం గడ్డకట్టకపోతే Rh” అవుతుందని గమనించాలి.
ప్రశ్న 11.
మీ దగ్గర బంధువు/స్నేహితుల పాత రక్తనమూనాలను సేకరించి అందులోని అంశాల ఆధారంగా ఒక ప్రాజెక్టు నివేదికను తయారుచేయండి. (AS 4)
జవాబు:
నేను నా స్నేహితుని పాత రక్త నమూనాను పరిశీలించాను. అది క్రింది విధంగా ఉంది.
Random blood sugar 115 mg/dl (80 – 140 mg/dl)
Microscopic -2 – 4 puscells / Hp of seen Malaria – Negative (-ve)
దీని ఆధారంగా తెల్లరక్త కణాల సంఖ్య సరైన మోతాదులో ఉందని గుర్తించాను. చీము కణాలు కణించటం వలన స్వల్పంగా ఇన్ ఫెక్షన్ ఉన్నట్లుగా భావించవచ్చు మలేరియా పరీక్ష ఋణాత్మకం కావున, రక్తంలో మలేరియా పరాన్నజీవి లేదని నిర్ధారించవచ్చు.
ప్రశ్న 12.
నాడీకణం పటం గీచి, భాగాలు రాయండి. (AS 5)
జవాబు:
ప్రశ్న 13.
రాము బలహీనంగా కనిపించడం చేత, వాళ్ళ నాన్న అతడిని ఆసుపత్రికి తీసుకుపోయాడు. డాక్టర్ రక్తపరీక్ష చేయించి రక్తంలో హిమోగ్లోబిన్ తక్కువగా ఉందని చెప్పారు. హిమోగ్లోబిన్ తక్కువగా ఉంటే జరిగే పరిణామాలను చర్చించి వ్రాయండి. (AS 6)
జవాబు:
హిమోగ్లోబిన్ తక్కువగా ఉండుట వలన కలిగే దుష్ఫలితాలు :
- రక్తము ఎర్రగా ఉండటానికి కారణం ఎరుపు వర్ణపు ప్రోటీను హిమోగ్లోబిన్.
- హిమోగ్లోబిన్ ఆక్సిజన్ మరియు కార్బన్ డై ఆక్సెడులను రవాణా చేయటంలో సహాయపడుతుంది.
- హిమోగ్లోబిన్ తక్కువగా ఉంటే అది రక్తహీనతకు దారితీస్తుంది.
- రక్తంలో హిమోగ్లోబిన్ తక్కువగా ఉంటే కణజాలాలకు ఆక్సిజన్ సరఫరా తగ్గిపోతుంది. దీని వలన తక్కువగా ఊపిరి ఆడటం జరుగుతుంది.
- తక్కువ హిమోగ్లోబిన్ స్థాయి గుండెకు సంబంధించిన సమస్యలను ఎక్కువ చేస్తుంది.
- తక్కువ హిమోగ్లోబిన్ స్థాయి వలన మనుష్యులు ఎక్కువగా నీరసించిపోతారు. కణములు క్రియలను నిర్వహించడానికి కావలసిన ఆమ్లజని సరఫరా లేకపోవడం ప్రధాన కారణం.
ప్రశ్న 14.
రోగనిర్ధారణలో రక్తపరీక్ష యొక్క ఆవశ్యకతను నిజజీవిత సన్నివేశంలో వివరించండి. (AS 7)
జవాబు:
నా పేరు వివేక్. రెండు నెలల క్రితం నాకు జ్వరం వచ్చింది. మా నాన్న దగ్గరలో ఉన్న ఆర్.ఎం.పి వైద్యుని వద్దకు తీసుకెళ్ళాడు. అతను పరీక్షించి ఇంజక్షన్ చేసి మందులు ఇచ్చాడు. అవి వాడినప్పటికి జ్వరం తగ్గలేదు. ఐదు రోజుల గడచిపోయాయి. నేను బాగా నీరసించిపోయాను. అప్పుడు మా నాన్న నన్ను పెద్ద ఆసుపత్రికి తీసుకెళ్ళాడు. డాక్టర్ పరీక్షించి రక్తపరీక్ష చేయించమన్నాడు. మలేరియా, టైఫాయిడ్, వైరల్ జ్వరాల కొరకు రక్తపరీక్ష నిర్వహించారు.
రక్తపరీక్షలో టైఫాయిడ్ అని తేలింది. డాక్టర్ ధైర్యం చెప్పి మందులను కోర్స్ గా పదిహేను రోజుల పాటు వాడారు. నేను వ్యాధి నుండి , కోలుకున్నాను. వ్యాధిని నిర్ధారించటంలో రక్తపరీక్ష యొక్క ఆవశ్యకత నాకు అర్థమైంది. రక్తపరీక్ష ద్వారా అనేక వ్యాధులను నిర్ధారిస్తారని తెలుసుకొన్నాను. వ్యాధిని సరిగా నిర్ధారించకుండా చికిత్స చేయటం కూడా ప్రమాదకరమని తెలుసుకొన్నాను.
9th Class Biology 3rd Lesson జంతు కణజాలం Textbook Activities (కృత్యములు)
ప్రయోగశాల కృత్యము – 1
ఉద్దేశ్యం : సేకరించిన నమూనా నుండి కణజాలాలు గుర్తించుట.
కావలసిన పరికరాలు : మైక్రోస్కోప్, స్లెడ్, సజల హైడ్రోక్లోరిక్ ఆమ్లం, శ్రావణాలు, బ్రష్,
ప్రయోగ విధానం :
- మీ దగ్గరలో ఉండే మాంసం అమ్మే చోటికి వెళ్ళి చిన్న కోడి మాంసం ముక్కని ఎముకతో సహా సేకరించాలి.
- మాంసం ముక్కను రెండు గంటల పాటు సజల హైడ్రోక్లోరిక్ ఆమ్లంలో ఉంచాలి. దాని నుండి పలుచని చర్మ భాగాన్ని తీసుకోవాలి.
- దాంట్లోని చిన్న భాగాన్ని శ్రావణం సహాయంతో ఒక స్లెడ్ పైన ఉంచాలి.
- మరొక సైడ్ ను దానిమీద ఉంచి రెండు స్లెట్లను గట్టిగా అణచి నొక్కాలి. చర్మపు పొర మరింత పలుచగా స్లెడ్ మీద పరుచుకుంటుంది.
- ఈ సైడ్ ను సూక్ష్మదర్శిని సహాయంతో పరిశీలించాలి. మీ ల్యాబ్ రికార్డులో దాని పటాన్ని గీయాలి.
- ఇచ్చిన పటంతో మీరు గీసిన పటాన్ని పోల్చండి.
ప్రశ్నలు:
1. రెండూ ఒకే మాదిరిగా ఉన్నాయా?
జవాబు:
ఒకే మాదిరిగా ఉన్నాయి.
2. అన్ని కణాలు ఒకేలా ఉన్నాయా?
జవాబు:
అన్ని కణాలు ఒకేలా ఉన్నాయి.
3. వాటి అమరిక ఏ విధంగా ఉంది?
జవాబు:
కణాలు వరుసలలో పొరలాగా అమరి ఉన్నాయి.
4. ఈ కణాలన్నీ దగ్గర దగ్గరగా అమరి ఉన్నాయా? ఒక త్వచం లేదా పొర మాదిరిగా ఏర్పడినాయా?
జవాబు:
కణాలు దగ్గర దగ్గరగా అమరి త్వచం లేదా పొర మాదిరిగా ఏర్పడినాయి.
5. కణాల మధ్య ఖాళీ ప్రదేశాలు లేదా కణాంతర అవకాశం ఉన్నదా?
జవాబు:
ఖాళీ ప్రదేశాలు లేవు.
కృత్యం – 1
1. ఒక శుభ్రమైన స్పూనిగాని, ఐస్క్రీం పుల్లగాని తీసుకొని మీ బుగ్గ లోపలి భాగంలో ఉన్న సన్నని పొరని గీకాలి.
2. ఒక పలుచని పొరను స్పూన్ నుండి సేకరించి ఒక సైడ్ పైన ఉంచి సూక్ష్మదర్శిని సహాయంతో పరిశీలించాలి.
3. పరిశీలించిన దాని పటాన్ని మీ నోట్ పుస్తకంలో గీయాలి.
ప్రశ్నలు :
1. కణాలన్నీ ఏ విధంగా అమరి ఉన్నాయి?
జవాబు:
కణాలు అన్ని పలుచగా, బల్లపరుపుగా అమరి ఉన్నాయి.
2. కణాల మధ్య కణాంతర అవకాశాలు ఉన్నాయా?
జవాబు:
కణాల మధ్య కణాంతర అవకాశాలు లేవు.
3. చర్మంలో ఇవి ఎందుకు అనేక వరుసలలో అమరియుంటాయో ఒకసారి ఆలోచించండి?
జవాబు:
చర్మము మన శరీరానికి రక్షణ ఇస్తుంది. అందువలన ఇవి అనేక వరుసలలో అమరి ఉంటాయి.
4. మీరు వేడి టీ/ కాఫీగాని, చల్లని పానీయం గానీ తాగేటప్పుడు ఎలా అనిపిస్తుంది?
జవాబు:
వేడి టీగాని, కాఫీగాని తాగినపుడు నోరు కాలుతుంది. బయటకు ఊస్తాము. చల్లని పానీయం తాగినపుడు నోటిలోపలి పొరలు చల్లదనాన్ని భరించలేవు.
5. ఒకవేళ చర్మం కాలిపోయినట్లయితే ఏ కణజాలం దెబ్బతినే అవకాశం ఉంటుంది?
జవాబు:
ఉపకళా కణజాలం.
కృత్యం – 2
ఘనాకార ఉపకళ కణజాలాన్ని పరిశీలిద్దాం.
1. మీ పాఠశాలలో ఉన్న సైడ్ పెట్టి నుండి ఘనాకార ఉపకళా శాశ్వత సైడ్ ను తీసుకొని సూక్ష్మదర్శిని సహాయంతో జాగ్రత్తగా పరిశీలించాలి.
2. పరిశీలించిన దాని పటాన్ని మీ నోట్ పుస్తకంలో గీయాలి.
జవాబు:
1. కణాలన్నీ ఎలా అమరి ఉన్నాయి?
జవాబు:
ఘనాకారపు కణాలు దగ్గర దగ్గరగా, కణాంతర అవకాశాలు లేకుండా అమరి ఉన్నాయి.
ప్రయోగశాల కృత్యము -2
ఉద్దేశ్యం :
సేకరించిన నమూనా నుండి కణజాలాలు గుర్తించుట.
కావలసిన పరికరాలు : మైక్రోస్కోప్, స్లెడ్, రక్త నమూనా, సిరంజి, దూది.
ప్రయోగ విధానం :
- ఒక క్రిమిరహితం చేసిన సిరంజి మరియు సూదిని తీసుకోవాలి.
- ఉపాధ్యాయుని సహాయంతో మీ వేలినుండి ఒక చుక్క రక్తం తీసుకోవాలి.
- జాగ్రత్తగా రక్తపు బొట్టును ఒక సైడ్ పైన రుద్దాలి.
- వేరొక సైడ్ సహాయంతో ఒక పలుచని పొర ఏర్పడేటట్లు అడ్డంగా రుద్దాలి.
- సూక్ష్మదర్శిని సహాయంతో సైడ్ ను పరిశీలించాలి.
- మీరు పరిశీలించిన అంశాల పటం గీచి, దానిని ఇవ్వబడిన పటంతో పోల్చాలి.
ఈ క్రింది ప్రశ్నలకు సమాధానాలు చెప్పండి.
1. సైట్లో ఏమి పరిశీలించావు?
జవాబు:
రక్తములో ప్లాస్మాను, రక్తకణములను పరిశీలించాను.
2. ఏమైనా కణాలు కనబడుతున్నాయా?
జవాబు:
కనబడుతున్నాయి.
3. దానిలోని అన్ని కణాలు ఒకే రకంగా ఉన్నాయా?
జవాబు:
లేవు.
4. ద్రవరూపంలో ఉన్న పదార్థం ఏమైనా ఉన్నదా?
జవాబు:
ద్రవరూప ప్లాస్మా ఉన్నది.
15. రక్తం కూడా ఒక కణజాలమే అని ఒప్పుకుంటావా?
జవాబు:
అవును. రక్తం కూడా ఒక ద్రవరూప కణజాలమే.
కృత్యం – 3
1. పాఠశాల ప్రయోగశాల నుండి స్తంభాకార ఉపకళా కణజాలం యొక్క సైడ్ ను తీసుకుని సూక్ష్మదర్శిని సహాయంతో పరిశీలించాలి.
2. మీరు పరిశీలన చేసిన దాని పటాన్ని గీయాలి.
జవాబు:
ప్రశ్నలు :
1. మీరు పరిశీలన చేసిన దాని పటాన్ని గీయండి.
జవాబు:
విద్యార్థి కృత్యము.
2. మీరు పరిశీలించిన కణాల్లో చిన్న కేశాల వంటి నిర్మాణాలు కనిపిస్తున్నాయా?
జవాబు:
అవును కనిపిస్తున్నాయి.
ప్రయోగశాల కృత్యము – 3
ఉద్దేశ్యం : సేకరించిన నమూనా నుండి కణజాలాలు గుర్తించుట.
కావలసిన పరికరాలు : మైక్రోస్కోప్, సైడ్, సజల హైడ్రోక్లోరిక్ ఆమ్లం, శ్రావణాలు, బ్రష్
ప్రయోగ విధానం :
- సేకరించిన మాంసం ముక్క నుండి కొంచెం కండరం తీసుకోవాలి.
- దీనిని సజల హైడ్రోక్లోరిక్ ఆమ్లంలోగాని, వెనిగర్ లో గాని రెండు గంటల పాటు నానబెట్టాలి.
- దానిలో నుండి ఒక పలుచని ముక్కని శ్రావణం ద్వారా తీసుకొని ఒక స్లెడ్ పైన ఉంచాలి.
- దానిపైన ఇంకో సైడ్ పెట్టి నెమ్మదిగా నొక్కాలి.
- సూక్ష్మదర్శిని సహాయంతో పరిశీలించిన దాని పటం గీయాలి.
- రెండు పటాలను పోల్చాలి.
ఈ క్రింది ప్రశ్నలకు సమాధానాలు చెప్పండి.
1. కణాలన్నీ ఎలా అమరి ఉన్నాయి?
జవాబు:
కణాలన్నీ వరుసలలో ఒకదానిపై ఒకటి అమరి ఉన్నాయి.
2. త్వచకణజాలానికి, కండరకణజాలానికి మధ్య ఏమైనా తేడాలున్నాయా?
జవాబు:
కండర కణాలు పొడవుగా, సాగదీయబడి కేంద్రకమును కలిగి ఉన్నాయి.
ఎముకను పరిశీలించుట :
మాంసం ముక్క నుండి ఎముకను వేరుచేసి దాదాపు ఒక రోజంతా సజల హైడ్రోక్లోరిక్ ఆమ్లంలోగాని, వెనిగర్ లోగాని ఉంచి నానబెట్టాలి. ఒక కత్తి సహాయంతో ఎముక నుంచి పలుచని ముక్కను కోయాలి. రెండు స్లె మధ్య అణచి పెట్టాలి. ఎముక ఉన్న సైడ్ ని సూక్ష్మదర్శిని సహాయంతో పరిశీలించాలి.
3. ఇంతకు ముందు చూసిన కణజాలానికి, ఇప్పుడు చూసిన దానికి ఏమైనా సంబంధాలున్నాయా?
జవాబు:
సాధారణంగా ఎముక కండరముతో కలుపబడి ఉంటుంది.
4. ఈ కణజాలాలు చలనానికి సహాయపడతాయా?
జవాబు:
సహాయపడతాయి.
5. అన్ని రకాల కణజాలాలు ఒకే రకమైన విధులు నిర్వర్తిస్తాయా?
జవాబు:
లేదు. వేరు వేరు కణజాలాలు రకరకాల విధులు నిర్వహిస్తాయి.
కృత్యం – 4
రక్తకణజాలం
1. మీ గ్రామంలోని ఆరోగ్య కేంద్రంలో ఉండే ఆరోగ్య కార్యకర్తలను లేదా రోగ నిర్ధారణ చేసే నిపుణుడిని మీ తరగతికి ఆహ్వానించాలి.
2. అతనితో రక్తం యొక్క నిర్మాణం, విధులపై ఒక ముఖాముఖి ఏర్పాటు చేయాలి.
3. ముఖాముఖి ఏర్పాటు చేసే ముందు ఒక ప్రశ్నావళి తయారుచేయాలి.
4. ముఖాముఖి పూర్తి అయిన తరువాత రక్తంపై ఒక చిన్న పుస్తకం తయారు చేయాలి.
5. ఆ చిన్న పుస్తకాన్ని గ్రంథాలయంలో ఉంచాలి. బులెటిన్ బోర్డుపై ప్రదర్శించాలి.
జవాబు:
రక్తం గురించిన చిన్న పుస్తకం :
- రక్తం ద్రవరూప కణజాలం.
- రక్తంలో వివిధ రకాలయిన కణజాలాలున్నాయి. ప్రతీది భిన్నమైన నిర్దిష్టమైన పనిని నిర్వహిస్తుంది.
- ఈ కణాలన్నీ ప్లాస్మాలో స్వేచ్ఛగా తేలియాడుతూ ఉంటాయి.
- కణబాహ్య ప్రదేశం ద్రవపదార్థమైన ప్లాస్మాతో నింపబడి ఉంటుంది. రక్తం సంధాయక కణజాలమైనప్పటికీ రక్తంలో తంతువులు ఉండవు.
- ఒక ప్రౌఢ మానవుని శరీరంలో 5 లీటర్ల రక్తం ఉంటుంది. రక్తంలో ఒక అంశం అయిన ప్లాస్మాలో ఎక్కువ శాతం నీరే ఉంటుంది.
- నీటితో పాటు ఇందులో గ్లూకోజు, ఎమినో యాసిడ్ల వంటి రకరకాల పోషకాలు కూడా ఉంటాయి.
- రక్తం గడ్డకట్టడానికి కావలసిన అనేక కారకాలు కూడా ప్లాస్మాలో ఉంటాయి. రక్తం రక్తనాళాలలో గడ్డకట్టకుండా హిపారిన్ అనే పదార్థం ఉపయోగపడుతుంది.
- రక్త కణాలు మూడు రకాలు 1. ఎర్ర రక్తకణాలు 2. తెల్ల రక్తకణాలు. 3. రక్తఫలకికలు.
- ఎర్ర రక్తకణాలను ఎరిత్రోసైటులు అంటారు. హిమోగ్లోబిన్ ఉండుట వలన ఇవి ఎర్రగా ఉంటాయి.
- హిమోగ్లోబిన్ ఆక్సిజన్, కార్బన్ డై ఆక్సెల రవాణాలో ,సహాయపడుతుంది.
- శిశువు తల్లి గర్భంలో ఉన్నప్పుడు రక్త కణాలు కాలేయం మరియు పిత్తాశయంలో తయారవుతాయి. ప్రౌఢ మానవులలో ఎముకలలో ఉండే మజ్జలో తయారవుతాయి.
- ఎర్ర రక్త కణాలు 120 రోజులు జీవిస్తాయి.
- రక్తంలో గల రెండవ రకపు కణాలు తెల్ల రక్తకణాలు. వీటిల్లో హిమోగ్లోబిన్ ఉండదు కాబట్టి వర్ణరహితంగా ఉంటాయి. వీటిని ల్యూకోసైటులు అంటారు.
- తెల్లరక్తకణాలు రెండు రకాలు – కణికాభకణాలు, కణికరహిత కణాలు.
- కణికాభ కణాలలో న్యూట్రోఫిల్స్, బేసోఫిల్స్ మరియు ఇసినోఫిల్స్ అని మూడు రకాలు ఉన్నాయి.
- ఇవి రక్తంలోకి ప్రవేశించిన సూక్ష్మజీవులను ఎదుర్కొని నాశనం చేస్తాయి.
- కణిక రహిత కణాలు లింఫోసైట్స్ మరియు మోనోసైట్స్ అని రెండు రకాలు.
- లింఫోసైట్స్ రక్తంలోకి వచ్చిన బాహ్య పదార్థాలను ఎదుర్కొని ప్రతిదేహాలను తయారు చేస్తాయి. లింఫోసైటులను సూక్ష్మరక్షక భటులంటారు.
- మోనోసైటులు రక్తంలో అమీబా మాదిరిగా కదులుతూ బాహ్య పదార్థాలను ఎదుర్కొని భక్షించి నాశనం చేస్తాయి. మోనోసైట్లను పారిశుద్ధ్య కార్మికులు అంటారు.
- రక్తఫలకికలకు కేంద్రకం ఉండదు. ఇవి రక్తం గడ్డకట్టడానికి సహాయపడతాయి.
ప్రయోగశాల కృత్యము – 4
రక్త వర్గాన్ని కనుగొనటానికి నీవు చేసిన ప్రయోగాన్ని వివరింపుము.
ఉద్దేశ్యం : రక్త వర్గాలను కనుగొనడం.
కావలసిన పరికరాలు : రక్త పరీక్ష, కిట్, సైడ్, మైనపు పెన్సిల్, డిస్పోసబుల్ సూదులు.
కిట్లో ఉండవలసిన పరికరాలు :
కిట్లో లేనివి : దూది, 70% ఆల్కహాల్, పంటి పుల్లలు.
ప్రయోగ విధానం :
1) ఒక తెల్ల పింగాణి పలక తీసుకుని శుభ్రంగా కడిగి ఆరబెట్టాలి.
2) పటంలో చూపినట్లు తెల్ల పింగాణి పలక మీద ఒక మైనపు పెన్సిల్ లో మూడు వృత్తాలు గీయాలి. వృత్తాలను వేరుచేస్తూ అడ్డగీతలు గీయాలి.
3) ప్రతి వృత్తంలో పైన పేర్కొనిన మూడు సీరమ్ లు తీసుకొని ఒక్కొక్క చుక్క పటంలో చూపిన విధంగా అంచులలో వేయాలి.
4) ఎడమ చేతి ఉంగరపు వేలిని సర్జికల్ స్పిరిట్ ముంచిన దూదితో తుడిచి, సూదిని మెల్లగా గుచ్చి బయటకు తీయాలి.
5) వేలుని కొద్దిగా ఒత్తాలి – రక్తం రావడం మొదలవుతుంది.
6) ఒక చుక్క రక్తాన్ని వృత్తంలో పడేలా బొటన వేలితో వేలిని ఒత్తాలి. ఆ రక్తం చుక్కలను సీరంలు ఎ, బి, RhDని ఒక చొప్పున కలపాలి.
7) మూడు వృత్తాలలో రక్తం సేకరించిన తరువాత వేలిమీద సూదితో గుచ్చిన చోట ఇంతకు ముందు ఉంచిన దూదితో అణచిపెట్టాలి.
8) ఒక పంటి పుల్లను తీసుకొని సీరమ్ ను, రక్తాన్ని జాగ్రత్తగా కలపండి. వేరు వేరు వృత్తాలకు వేరు వేరు పంటి పుల్లలను ఉపయోగించి కలపాలి.
9) ఏ వృత్తాలలోనైనా రక్తం గడ్డకట్టిందేమో పరిశీలించాలి. ‘ఆర్ హెచ్’ వృత్తం వద్ద రక్తం గడ్డకట్టడానికి కొంచెం సమయం తీసుకుంటుంది.
ఫలిత నిర్ధారణ :
ఫలితాలకు అనుగుణంగా రక్తవర్గాన్ని నిర్ధారించవచ్చు. కింది పట్టిక సహాయం తీసుకోవాలి.
రక్తం వర్గం నిర్ధారించటం.
యాంటి – ఎ | యాంటి – బి | రకం |
రక్తం గడ్డకట్టింది | రక్తం గడ్డకట్టలేదు | ఎ |
రక్తం గడ్డకట్టలేదు | రక్తం గడ్డకట్టింది | బి |
రక్తం గడ్డకట్టింది | రక్తం గడ్డకట్టింది | ఎబి |
రక్తం గడ్డకట్టలేదు | రక్తం గడ్డకట్టలేదు | ఓ |
అలాగే ఆర్ హెడ్ కారకంలో గాని రక్తం గడ్డకడితే Rh+ రక్తం గడ్డకట్టకపోతే Rh– అవుతుంది.
గమనించిన ఫలితాలు పట్టికలో నమోదు
విద్యార్థి పేరు | రక్తవర్గం |
1. పి. ప్రణయ | O |
2. పి. ప్రబంధ | O |
3. పి. ప్రమోద | A |
4. వి. ఉమాదేవి | A |
5. కె. అనసూయ | AB |
6. యమ్. రాము | B |
7. ఎస్. రవి. | A |
8. ఎల్. లక్ష్మీకాంత్ | AB |
9. కె. గోపాల్ | B |
10. జి. ఉదయకిరణ్ | B |
కృత్యం – 5
5. మీ పాఠశాల ప్రయోగశాల నుండి మూడు రకాల కండరాల సైడ్ తీసుకొని సూక్ష్మదర్శిని సహాయంతో పరిశీలించండి. పరిశీలించిన అంశాలు క్రింది పట్టికలో నమోదు చేయండి.
జవాబు:
రేఖిత కండరాల లక్షణాలు | అరేఖిత కండరాల లక్షణాలు | హృదయ కండర లక్షణాలు |
1. నియంత్రిత కండరాలు | అనియంత్రిత కండరాలు | అనియంత్రిత కండరాలు |
2. కండరాల పొడవుగా అనేక అడ్డు చారలు కలిగి ఉంటాయి. | పొడవుగా ఉంటాయి. అడ్డు చారలు ఉండవు. | కణాలు చారలతో ఉంటాయి. |
3. ప్రతి కండరం అనేక పొడవైన సన్నటి శాఖారహితమైన తంతువులు పోలిన కణాలు ఉంటాయి. చాలా కేంద్రకాలు ఉంటాయి. | కండరాలు పొడవుగా సాగదీయబడిన కుదురు ఆకారంలో ఉంటాయి. ఒకే కేంద్రకం ఉంటుంది. | కణాలు పొడవుగా, శాఖలు కలిగి ఉంటాయి. చాలా కేంద్రకాలు ఉంటాయి. |
4. ఈ కండరాలు కాళ్ళు, చేతులతో ఉంటాయి. | ఆహార వాహిక, రక్తనాళాలు ఐరిస్, గర్భాశయంలో ఉంటాయి. | హృదయంనందు ఉంటాయి. |
కృత్యం – 6
1. పాఠశాల ప్రయోగశాల నుండి నాడీకణం సైడ్ ను తీసుకొని సూక్ష్మదర్శిని సహాయంతో పరిశీలించాలి.
2. పరిశీలించిన అంశాలు నోటు పుస్తకంలో రాయాలి.
జవాబు:
- నాడీ కణాలను మూడు భాగాలుగా విభజించవచ్చు. 1. కణదేహం, 2. ఆక్టాన్, 3. డెండ్రైటులు.
- నాడీ కణదేహంలో ఉన్న జీవద్రవంలో ఒక కేంద్రకం తేలియాడుతూ ఉంటుంది. జీవద్రవంలో కొన్ని గ్రంథిరూప కణాలుంటాయి. వీటిని నిస్సల్ కణికలు అంటారు.
- కణదేహం నుండి బయటకు వచ్చిన నిర్మాణాలను డెండ్రైటులు అంటారు. ఇది శాఖలు కలిగి మొనదేలి ఉంటాయి.
- కణదేహం నుండి ఒకే ఒక్క పొడవాటి నిర్మాణం బయలుదేరుతుంది. దీనిని తంత్రిరాక్షం లేదా ఆక్లాస్ అంటారు.
- ఆక్టాన్లో కొంత భాగం ఒక పొరతో కప్పబడి ఉంటుంది. ఆ త్వచాన్నే మెయిలిన్ త్వచం అంటారు.
- ఆక్టాన్లో ఉండే కణుపుల వంటి భాగాన్ని రాన్ వియర్ సంధులు అంటారు.