AP Board 9th Class Social Solutions Chapter 4 వాతావరణం

SCERT AP 9th Class Social Studies Guide Pdf 4th Lesson వాతావరణం Textbook Questions and Answers.

AP State Syllabus 9th Class Social Solutions 4th Lesson వాతావరణం

9th Class Social Studies 4th Lesson వాతావరణం Textbook Questions and Answers

Improve your learning (మీ అభ్యసనాన్ని మెరుగుపడుచుకోండి)

ప్రశ్న 1.
వాతావరణంలోని వివిధ అంశాలను వివరించండి. (AS1)
జవాబు:
వాతావరణంలోని వివిధ అంశాలు:

  1. ఉష్ణోగ్రత
  2. పీడనం
  3. పవనాలు
  4. గాలిలోని తేమ
  5. వర్షపాతం

1. ఉష్ణోగ్రత :
భూ ఉపరితలం నుండి పైకి వెళ్ళే కొలది ఉష్ణోగ్రతలు తగ్గుతాయి.

2. పీడనం :
వాతావరణం యొక్క బరువు భూమి ఉపరితలముపై ఒత్తిడిని కలిగిస్తుంది. దీనినే పీడనం అంటారు.

3. పవనాలు :
అధిక పీడన ప్రాంతం నుంచి ఎల్లప్పుడు అల్పపీడన ప్రాంతానికి వీచే గాలిని పవనాలు అంటారు.

4. గాలిలోని తేమ :
గాలిలోని తేమను ఆర్ధత అంటారు.

5. వర్షపాతం :
నీటి బిందువుల రూపంలో పడుతుంది.

ప్రశ్న 2.
చిత్రం సహాయంతో వాతావరణంలోని పొరలను చర్చించండి. (AS1)
జవాబు:
AP Board 9th Class Social Solutions Chapter 4 వాతావరణం 1
సాంద్రత, ఉష్ణోగ్రతల ఆధారంగా కూడా వాతావరణాన్ని వివిధ పొరలుగా విభజించవచ్చు.

1. ట్రోపో ఆవరణం :

  1. వాతావరణంలో అన్నిటి కంటే కింద ఉన్న పొర.
  2. ధృవాల వద్ద 8 కిలోమీటర్లు భూమధ్యరేఖ వద్ద 18 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉంటుంది.
  3. ఈ పొర సగటు ఎత్తు 13 కిలోమీటర్లు.
  4. వాతావరణంలో మార్పులు జరుగుతాయి.
  5. జీవరాశి నివసిస్తుంది.
  6. మేఘాలు ఏర్పడతాయి.

2. స్ట్రాటో ఆవరణం :

  1. 50 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉంటుంది.
  2. జెట్ విమానాలు ఎగరటానికి ఈ పొర చాలా అనువుగా ఉంటుంది.
  3. ఓజోన్ పొర ఈ ఆవరణలోనే కలదు.
  4. ఎత్తుకు వెళ్తున్న కొలది ఈ ఆవరణంలో ఉష్ణోగ్రతలు తగ్గుతాయి.

3. మీసో ఆవరణం :

  1. 80 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉంటుంది.
  2. విశ్వంలో రాని ఉల్కలు ఈ పొరలోకి ప్రవేశించగానే కాలిపోతాయి.
  3. ఎత్తు పెరుగుతున్న కొద్దీ ఈ ఆవరణంలో ఉష్ణోగ్రతలు తగ్గుతాయి.

4. థర్మో ఆవరణం :

  1. 400 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉంటుంది.
  2. ఈ ఆవరణంలో ఎత్తుకు వెళుతున్న కొద్ది ఉష్ణోగ్రతలు వేగంగా పడిపోతాయి.
  3. ఈ పొరలో అయాన్లు అనే విద్యుదావేశం ఉండే కణాలు ఉంటాయి.
  4. భూమి నుంచి ప్రసారితమయ్యే రేడియో తరంగాలు ఈ అయాన్ల కారణంగా తిరిగి – భూమికి పరావర్తనం చెందుతాయి.

5. ఎక్సో ఆవరణం :
వాతావరణంలోని అన్నిటి కంటే చివరి పైపొర ఇదే. అత్యంత ఎత్తులో ఉండే ఈ పొర గురించి మనకు తెలిసింది చాలా తక్కువ.

AP Board 9th Class Social Solutions Chapter 4 వాతావరణం

ప్రశ్న 3.
శీతోష్ణస్థితులు (climate), స్థానిక వాతావరణ స్థితులు (weather) మధ్య తేడాలను తెలియజేయండి. (AS1)
జవాబు:

  1. శీతోష్ణస్థితులు అనగా ఉష్ణోగ్రత, పీడనం, పవనాలు, గాలిలోని తేమ, వర్షపాతం వంటి అంశాలను శీతోష్ణస్థితి అంశాలు అనవచ్చును. సాధారణంగా అంతటా ఉన్న పై అంశాలను గురించి తెలియజేసేది శీతోష్ణస్థితి.
  2. స్థానిక వాతావరణ స్థితులు అనగా ప్రత్యేకంగా ఒక ప్రాంతంలో ఉన్న ఉష్ణోగ్రత, పీడనం, పవనాలు, గాలిలోని తేమ, వర్షపాతం వంటి అంశాలను గురించి వివరించడాన్ని స్థానిక వాతావరణ స్థితులు అంటారు. స్థానికం అనగా ఒక ప్రాంతం గురించి వివరించడం.

ప్రశ్న 4.
సంవహన వర్షపాతం, పర్వతీయ వర్షపాతాల మధ్య తేడాలు, పోలికలు తెలియజేయండి. (AS1)
జవాబు:
1. సంవహన వర్షపాతం :
వేడెక్కిన ఉపరితలం మీద తేమ కలిగిన గాలి కూడా వేడెక్కి పైకిలేచి చల్లబడినపుడు పడే వర్షాన్ని సంవహన వర్షపాతం అంటారు.

2. పర్వతీయ వర్షపాతం :
తేమతో కూడిన గాలి దాని దారిలో ఉన్న కొండ లేదా ఎత్తైన అవరోధం వల్ల పైకి లేచినపుడుఈ రకమైన వర్షం కురుస్తుంది.

తేడాలు :
సంవహన వర్షం తేమ కలిగిన గాలి పైకి లేచి ఆదే ప్రాంతంలో వర్షం పడుతుంది. పర్వతీయ వర్షపాతం తేమతో కూడిన గాలి వీయడం వల్ల పర్వతాలు అడ్డు వచ్చే వరకు వెళ్ళి అక్కడ వర్షం సంభవిస్తుంది.

పోలికలు :
రెండు రకాలైన వర్షాలు తేమతో కూడిన గాలుల వలన సంభవిస్తాయి.

రెండు రకాల వర్షాలు భూ ఉపరితలం పైనున్న నీరు ఆవిరై నీటి ఆవిరిగా మారి వర్షపాతం సంభవిస్తుంది.

ప్రశ్న 5.
ప్రపంచ వ్యాప్తంగా వర్షపాతం ఎలా ఉంటుందో వివరించండి. (AS1)
జవాబు:
ప్రపంచవ్యాప్తంగా వర్షాలు :

  1. భూమధ్యరేఖకు ఉత్తర, దక్షిణ దిశలలో 10° నుంచి 30° అక్షాంశాల మధ్య వాణిజ్య పవనాల కారణంగా తూర్పు తీరంలో భారీ వర్షాలు పడతాయి, పశ్చిమం వైపునకు వెళ్ళే కొద్దీ వర్షాలు తగ్గుతాయి.
  2. భూమధ్యరేఖకు, ఉత్తర, దక్షిణ దిశలలో 40° నుంచి 60° అక్షాంశాల మధ్య పశ్చిమ పవనాల వల్ల పడమటి తీరంలో భారీ వర్షాలు పడతాయి. తూర్పునకు వెళుతున్న కొద్దీ వర్షాలు తగ్గుతాయి.
  3. తక్కువ పీడనం ఉన్న ప్రాంతాలలో, ప్రత్యేకించి భూమధ్యరేఖకు సమీపంలో ఎక్కువ పీడనం ఉన్న ప్రాంతాలకంటే ఎక్కువ వర్షాలు పడతాయి.
  4. ఖండాల మీదకంటే సముద్రాల మీద వర్షాలు ఎక్కువ పడతాయి.

ప్రశ్న 6.
శీతోష్ణస్థితులలోని మార్పులు మానవ జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తాయి? (AS4)
(లేదా)
వాతావరణంలో వస్తున్న మార్పులు మానవ జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తున్నాయి?
జవాబు:
శీతోష్ణస్థితులలోని మార్పులు మానవజీవితాన్ని ప్రభావితం చేసే విధానం:
శీతోష్ణస్థితి అంశాలు –

  1. ఉష్ణోగ్రత
  2. పీడనం
  3. పవనాలు
  4. గాలిలోని తేమ
  5. వర్షపాతం వంటి అంశాలు మానవుని ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక జీవన విధానాన్ని నిర్ణయిస్తాయి. ఉష్ణోగ్రత పీడనం, పవనాలు, గాలిలోని తేమ, వర్షపాతాలపై ఆచారాలు, అలవాట్లు, వేషధారణ, ఆహారం మొ||న విషయాలు ఆధారపడి ఉన్నాయి.

AP Board 9th Class Social Solutions Chapter 4 వాతావరణం

ప్రశ్న 7.
సాపేక్ష ఆర్ధతను వివరించండి. (AS1)
జవాబు:

  1. ఒక నిర్దిష్టమైన ఉష్ణోగ్రత మరియు పీడనము వద్ద గాలి గ్రహించగల మొత్తం నీటి ఆవిరి పరిమాణమునకు మరియు లెక్కకట్టిన సమయంలో గాలిలోగల నీటి ఆవిరి పరిమాణానికి మధ్యగల నిష్పత్తిని సాపేక్ష ఆర్ధత అంటారు.
  2. దీనిని ఎల్లప్పుడూ శాతములో చూపుతారు.
  3. వాతావరణంలో సాపేక్ష ఆర్ధత 100 గా ఉన్నప్పుడు దానిని సంతృప్తి స్థాయి అంటారు.

ప్రశ్న 8.
ఎత్తు పెరిగేకొలది నీటి ఆవిరి వేగంగా తగ్గుతుంది. ఎందువల్ల? (AS1)
జవాబు:
ఎత్తు పెరిగేకొలది నీటి ఆవిరి వేగంగా తగ్గుతుంది. కారణం ఎత్తుకు నీటి ఆవిరికి విలోమ సంబంధం కలదు.

  1. థర్మో ఆవరణం 400 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉంటుంది.
  2. ఈ ఆవరణలో ఎత్తుకు వెళుతున్న కొద్దీ ఉష్ణోగ్రతలు వేగంగా పడిపోతుంటాయి. అందువల్ల నీటి ఆవిరి కూడా వేగంగా తగ్గిపోతుంది.

ప్రశ్న 9.
కొరియాలిస్ ప్రభావం అనగానేమి? దాని ప్రభావాన్ని వివరించండి. (AS1)
జవాబు:

  1. భూభ్రమణము వలన జనించు శక్తిని కొరియాలిస్ ప్రభావం అంటారు.
  2. దాని ప్రభావం : ఉత్తరార్ధగోళంలో వీచే పవనాలు కుడివైపునకు, మరియు దక్షిణార్ధ గోళములో. వీచే పవనాలుఎడమవైపునకు నెట్టబడుతున్నాయి.
  3. ఇది భూమధ్యరేఖ వద్ద శూన్యంగానూ, ధృవ ప్రాంతాల వద్ద అత్యధికంగానూ ఉంటుంది.
  4. కాబట్టి ప్రపంచం అంతటా నిరంతరం వాతావరణ ప్రసరణ జరుగుతూ ఉంటుంది.

ప్రశ్న 10.
ప్రపంచ పటంలో కింది స్థానిక పవనాలను గుర్తించండి. (AS5)
ఎ) చినూక్ బి) లూ సీ) సైమూన్ డి) యోమా ఇ) నార్వెస్టర్ ఎఫ్) మిస్ట్రాల్ జి) ప్యూనా హెచ్) పాంపెరో
జవాబు:
AP Board 9th Class Social Solutions Chapter 4 వాతావరణం 2

ప్రశ్న 11.
పేజి నెం. 43లోని “ప్రపంచ పవనాల ప్రభావం” అంశాన్ని చదివి, వ్యాఖ్యానించండి. (AS2)
జవాబు:
ప్రపంచవ్యాప్తంగా వేడిని, తేమను రవాణా చేయటంలో ప్రపంచ పవనాలు కీలకపాత్ర పోషిస్తాయి. కనుకనే ప్రపంచంలో ఏ భాగము కూడా ప్రాణులు మనలేనంతగా వేడెక్కదు, లేదా చల్లబడదు. వాతావరణం, లేకపోతే పగటి పూట, లేదా ఉష్ణ మండలాల్లో భరించలేనంత వేడిగా ఉండేది, రాత్రిళ్లు లేదా ధృవప్రాంతాల్లో భరించలేనంతగా చల్లగా ఉండేది. అయితే వేడిని, తేమను ప్రపంచ పవనాలు సమంగా పంచటం లేదు. అందుకే మనకు ప్రపంచంలో కొన్ని ప్రాంతాలు వేడిగా, కొన్ని ప్రాంతాలు చలిగా, కొన్ని ప్రాంతాలు అధిక వర్షపాతంతో, కొన్ని ప్రాంతాలు ఎడారులుగా ఉన్నాయి.

9th Class Social Studies 4th Lesson వాతావరణం InText Questions and Answers

9th Class Social Textbook Page No.37

ప్రశ్న 1.
గాలిలో నీటి ఆవిరి లేకపోతే ఏమవుతుంది?
జవాబు:

  1. గాలిలో నీటి ఆవిరి లేకపోతే వేడిగా ఉంటుంది.
  2. వేడిగాలులు వలన మనం అనేక సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది.
  3. వర్షాలు పడవు.
  4. దానితో నీరు ఉండదు. సముద్రాలలో మార్పులుండవు.

ప్రశ్న 2.
శీతాకాలంలో మన చర్మం పొడారి పోతుంది. ఎందుకు?
జవాబు:
శీతాకాలంలో మన చర్మం పొడారి పోవడానికి కారణం :

  1. శీతాకాలంలో గాలి చలిగా, పొడిగా ఉంటుంది.
  2. ఇటువంటి వాతావరణంలో మన చర్మం దురద పెడుతుంది.
  3. ఇటువంటి సమయంలో పెదాలు పగులుతాయి. కారణం గాలిలో తేమ లేకపోవడమే.

9th Class Social Textbook Page No.37

ప్రశ్న 3.
వాతావరణంలోని రేణువులు మనకు ఏ రకంగా ఉపయోగకరమో, ఏ రకంగా హానికరమో పేర్కొనండి.
జవాబు:

  1. వాతావరణంలోని రేణువులు ప్రకృతి ప్రక్రియల ద్వారా, మానవ చర్యల ద్వారా ఏర్పడతాయి.
  2. భూమి మీద జీవనానికి అనువుగా వాతావరణ పరిస్థితులను ఈ రేణువులు మారుస్తాయి.
  3. సూర్యోదయం, సూర్యాస్తమయం సమయాల్లో సూర్యుడు నారింజ రంగులో ఉండటానికి కారణం ఈ రేణువులే.
  4. వర్షానికి, వడగండ్లు పడడానికి కూడా రేణువులు చాలా వరకు కారణమవుతాయి.

హానికరం :

  1. దుమ్ము, ధూళీ వలన కళ్లు దెబ్బతింటాయి.
  2. మృత్తికా క్రమక్షయం జరుగుతుంది.
  3. వీటి వలన ఎడారుల మీద ఇసుక తుపానులు, అడవుల్లో మంటలు సంభవిస్తాయి.

AP Board 9th Class Social Solutions Chapter 4 వాతావరణం

ప్రశ్న 4.
మనకు వాతావరణం ఎందుకు ముఖ్యమైనది?
జవాబు:

  1. మనం పీల్చే గాలితో పాటు ప్రాణవాయువు తీసుకుంటాం.
  2. అది లేకపోతే మనం బతకలేం. మనకు కావలసిన ప్రాణవాయువు వాతావరణంలో ఉంటుంది.
  3. మనం ఊపిరి బయటికి వదిలినపుడు బొగ్గుపులుసు వాయువు వదులుతాం.
  4. సూర్యుని నుండి వెలువడే హానికరమైన కిరణాల నుండి వాతావరణం మనల్ని కాపాడుతుంది.
  5. ఆకుపచ్చని చెట్లు బొగ్గుపులుసు వాయువు తీసుకుని సూర్యరశ్మి, నీటితో కిరణజన్య సంయోగక్రియ జరుపుతాయి.
  6. తత్ ఫలితంగా వాటి నుంచి తియ్యటి పళ్లు, కూరగాయలు, ఆహారధాన్యాలు వంటివి లభిస్తాయి.
  7. వీటి నుంచి మనకు మాంసకృత్తులు, పిండిపదార్థాలు, చక్కెరలు, కొవ్వు పదార్థాలు, ఖనిజలవణాలు, మనం జీవించటానికి అవసరమయ్యే ఇతర పోషకాలు లభిస్తాయి.
  8. వాతావరణం, వానను కూడా ఇస్తుంది.
  9. వాతావరణం లేకపోతే చాలా రాళ్లు కోతకు గురయ్యేవి కావు. అంటే మనకు అనేక రకాల నేలలు ఉండేవి కావు. అనేక రకాల పంటలు పండించగలిగేవాళ్లం కాదు.

ప్రశ్న 5.
చంద్రుని మీద జీవనం ఎందుకు సాధ్యం కాదో ఊహించండి.
జవాబు:
చంద్రుని మీద వాతావరణం లేదు. వాయువులు లేవు. నీరు లేదు. అందువలన మానవ జీవన విధానానికి కావలసిన వాతావరణం చంద్రుడి మీద లేదు కాబట్టి జీవనం సాధ్యం కాదు.

9th Class Social Textbook Page No.39

ప్రశ్న 6.
ఏ ఆవరణంలో జీవం ఉంది?
జవాబు:

  1. ట్రోపో ఆవరణంలో జీవం ఉంది.
  2. శీతోష్ణస్థితులు, వర్షపాతం వంటి వాతావరణ అంశాలన్నీ ఈ ఆవరణంలోనే సంభవిస్తాయి.
  3. అందువల్ల జీవం ట్రోపో ఆవరణంలోనే కలదు.

ప్రశ్న 7.
ఏ ఆవరణం గురించి మనకు చాలా తక్కువ తెలుసు?
జవాబు:

  1. ఎక్సో ఆవరణం గురించి మనకు చాలా తక్కువ తెలుసు.
  2. వాతావరణంలో అన్నిటి కంటే చివరి పై పొర ఇదే.
  3. అత్యంత ఎత్తులో ఉంటుంది.

AP Board 9th Class Social Solutions Chapter 4 వాతావరణం

ప్రశ్న 8.
జెట్ విమానాలు ఎగరటానికి ఏ ఆవరణం అనువైనది? ఎందుకు?
జవాబు:

  1. జెట్ విమానాలు ఎగరటానికి అనువైన ఆవరణం స్ట్రాటో ఆవరణం.
  2. ఈ ఆవరణంలో మబ్బులు ఉండవు. వర్షపాతం, తుపానులు వంటివి ఉండవు.
  3. అందువల్ల బాగా అనుకూలంగా ఉంటుంది.

ప్రాజెక్టు

ప్రశ్న 1.
వాతావరణ పరిస్థితికి సంబంధించిన సమాచారాన్ని పత్రికలు, రేడియో, టీవీల ద్వారా సేకరించండి. (T.Q.)
జవాబు:

ప్రశ్న 2.
జూలై నుండి డిసెంబర్ వరకు దేశంలోని వివిధ ప్రాంతాల్లో సంభవించిన అత్యధిక వర్షపాతానికి సంబంధించిన సమాచారాన్ని సేకరించండి. (T.Q)
జవాబు: