SCERT AP 9th Class Social Studies Guide Pdf 8th Lesson భారతదేశంలో సేవా కార్యకలాపాలు Textbook Questions and Answers.
AP State Syllabus 9th Class Social Solutions 8th Lesson భారతదేశంలో సేవా కార్యకలాపాలు
9th Class Social Studies 8th Lesson భారతదేశంలో సేవా కార్యకలాపాలు Textbook Questions and Answers
Improve your learning (మీ అభ్యసనాన్ని మెరుగుపడుచుకోండి)
ప్రశ్న 1.
1. ‘సేవా కార్యకలాపాలు’ అంటే ఏమిటి? (AS1)
జవాబు:
- సేవా కార్యకలాపాలు వ్యవసాయ, పారిశ్రామిక కార్యకలాపాలకు అవసరమైనటువంటివి.
- సేవా కార్యకలాపాలు ఉత్పత్తి చేసే సేవలు వరి లేక వస్త్రం లాగా కంటికి కనిపించవు. అయినప్పటికి వీరు ఒక ప్రత్యేకమైన సేవలను తమ పనుల ద్వారా ప్రజలకు, వ్యాపారాలకు అందిస్తారు.
- ఇక్కడ సేవ అనేది చేసిన పని స్వభావాన్ని తెలుపుతుంది.
- సేవ అనేది వస్తువు యొక్క ఉత్పత్తికి భిన్నమైనది.
ఉదా : ఆసుపత్రిలో వైద్యులు చేసేది సేవ
కిరాణాషాపులో వ్యాపారి చేసేది సేవ
సంస్థలో అకౌంటెంట్ చేసేది సేవ
వ్యా న్ డ్రైవర్ చేసేది సేవ
బ్యాంకులు, రవాణా రంగాలు చేసేవి సేవలు.
ప్రశ్న 2.
ఏవైనా ఐదు సేవా కార్యకలాపాలమ రాసి, అవి ఎందుకు వ్యవసాయ, పారిశ్రామిక కార్యకలాపాల కిందికి రావో కారణాలు తెలపండి. (AS1)
జవాబు:
ఐదు సేవా కార్యకలాపాలు
1. వైద్యం :
వైద్యులు ఆసుపత్రిలో రోగులను పరీక్షించి, మందులను సూచించి వారి ఆరోగ్య పరిస్థితులను సమీక్షిస్తారు.
2. వ్యాపారం :
వస్తువులను సూల్ సేల్ దుకాణాల నుండి కొనుగోలు చేసి వినియోగదారులకు విక్రయించడం.
3. అకౌంటెంట్ :
ఖాతాలను పరిశీలించడం, చెల్లింపులను రశీదులను సరిచూసుకుంటూ ఆ బిల్లులు, ఖాతాలకు అనుకూలంగా ఉన్నాయో లేదో సరిచూడటం. ప్రతి యొక్క వ్యాపార సంస్థకు ఖాతాలను రాయడం, నిర్వహించడం.
4. డ్రైవర్ :
ఆటోలలో, వ్యా న్లలో ప్రయాణికులను ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి చేరవేయడం. సరకులను కూడా ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి చేరవేయడం.
5. ప్రభుత్వ పరిపాలన :
గ్రామాలు, నగర పంచాయతీలు, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల ద్వారా అందించే ప్రజాసేవలన్నీ పరిపాలన వర్గానికి చెందుతాయి.
ఉదా : పోలీసులు, గ్రామ పరిపాలనాధికారులు మొదలయినవారు.
పైన పేర్కొన్న వారు అందిస్తున్న సేవలు రైతులు, వ్యవసాయ కూలీలు, పరిశ్రమలలో పనిచేసే వారి పనులకు భిన్నంగా ఉన్నాయని మనం గమనించవచ్చు.
6. వీరు ఉత్పత్తి చేసే సేవలు వరి లేక వస్త్రం లాగా కంటికి కనిపించవు.
7. అయినప్పటికి వీరు ఒక ప్రత్యేకమైన సేవలను తమ పనుల ద్వారా ప్రజలకు, వ్యాపారాలకు అందిస్తారు.
8. ఇక్కడ సేవ అనేది చేసిన పని స్వభావాన్ని తెలుపుతుంది.
9. సేవ అనేది వస్తువు యొక్క ఉత్పత్తికి భిన్నమైనది.
ప్రశ్న 3.
దేశ సమగ్రాభివృద్ధికి సేవా కార్యకలాపాలు ఎలా తోడ్పడతాయి? (AS1)
జవాబు:
- సేవా కార్యకలాపాలనేవి వ్యవసాయం లేదా పరిశ్రమలలో తయారవుతున్నట్లు వస్తువును ఉత్పత్తి చేయవు.
- ఇవి వ్యవసాయానికి, పరిశ్రమలకు, ప్రజలకవసరమైన ఎన్నో సేవలను చేస్తూ ఒక ప్రత్యేకమైన రీతిలో సహాయం చలాయి.
- రవాణ సమాచార సాధనాలు, బ్యాంకులు మొదలైన రంగాలు అభివృద్ధి చెందడం వలన వ్యవసాయక ఉత్పత్తులకు, పారిశ్రామిక ఉత్పత్తులకు ఉపయోగించడం మాత్రమేకాక వస్తువుల సరఫరాకు తగిన ఆర్థిక వనరులు అందించుటకు తద్వారా వాటి అభివృద్ధికి కారకాలు అవుతాయి.
- ప్రజలు మెరుగైన ఆదాయాలు ఆర్జించినపుడు వారి వినియోగ వ్యయంలో కూడా మార్పులు వస్తాయి.
- వారు ఎక్కువగా సేవాసంబంధమైన కార్యకలాపాలైన విద్య, వినోదం, ఆహారం, పర్యాటకం పైన ఎక్కువ ఖర్చు చేయడానికి ఆసక్తి చూపుతారు. అభివృద్ధికి అది ఒక చిహ్నం.
ప్రశ్న 4.
వ్యవసాయ, పారిశ్రామిక కార్యకలాపాలు సేవలతో ఎలా ముడిపడి ఉన్నాయి? (AS1)
జవాబు:
- సేవలు అనేవి వ్యవసాయానికి, పరిశ్రమలకు, ప్రజలకు అనేకానేక అవసరాలకు ఒక ప్రత్యేకమైన రీతిలో సహాయపడతాయి.
- వ్యవసాయ ఉత్పత్తులను మార్కెట్ కు తరలించడంలో, వీటిని కొంతమంది వ్యక్తుల సమూహం కొని వినియోగదారులకు నేరుగా లేదా రైస్ మిల్లులు, నూనె మిల్లులు వంటి ఇతర ఉత్పత్తిదారులకు అమ్మడం జరుగుతుంది.
- ఇవి అన్నీ సేవాసంస్థలైన రవాణా, వాణిజ్య, కార్యకలాపాల ద్వారా జరుగుతాయి.
- పారిశ్రామిక కార్యకలాపాలకు పట్టణాలలో, నగరాలలోని సిమెంట్ వ్యాపారులకు రైల్వేల ద్వారా సిమెంట్ కర్మాగారాల నుండి సిమెంట్ సంచులు రవాణా కాకపోతే భవన నిర్మాణాలు ఎలా జరుగుతాయి?
- కావున వ్యవసాయక, పారిశ్రామిక కార్యకలాపాలన్నీ సేవలపైనే ఆధారపడి ఉన్నాయి.
ప్రశ్న 5.
సేవారంగం పెరుగుదల సుస్థిరమైనది మరియు అది భారతదేశాన్ని ఒక ధనిక దేశంగా చేస్తుంది. ఈ వ్యాఖ్యతో నీవు ఏకీభవిస్తావా? విశదీకరించండి. (AS2)
జవాబు:
- భారతదేశం వంటి అభివృద్ధి చెందుతున్న దేశాలలో అభివృద్ధికి ప్రోత్సాహమనేది ఎన్నో వ్యవస్థాపక సౌకర్యాలతో ముడిపడి ఉంటుంది.
- ఇది అవస్థాపన సౌకర్యాలు, ఇతర సేవల విస్తరణను కలిగి ఉంటుంది.
- రవాణా సమాచార సాధనాలు, బ్యాంకులు మొదలైన విలువైన సేవల తరహాలోనే సేవా కార్యకలాపాల విలువ కూడా – పెరగాలని ఆశించడం సహజం.
- భారతదేశంలో ఉద్యోగాలు చేసే వారిలో 1/4వ వంతు సేవాకార్యకలాపాలే కలిగి ఉన్నారు.
- సేవాకలాపాల ఉద్యోగాలు ప్రజల జీవన స్థాయిలో పురోభివృద్ధికి ఒక కారణం.
- ప్రజలు మెరుగైన ఆదాయాలు ఆర్జించినపుడు వారి వినియోగ వ్యయంలో కూడా మార్పులు వస్తాయి.
- వారు ఎక్కువగా సేవా సంబంధమైన కార్యకలాపాలైన విద్య, వినోదం, ఆహారం, పర్యాటకం పైన ఎక్కువ ఖర్చు చేయడానికి ఆసక్తి చూపుతారు.
అందువలన సేవారంగం సుస్థిర వృద్ధి భారతదేశాన్ని ఒక ధనిక దేశంగా చేస్తుందనడంలో ఏ మాత్రం సందేహం లేదు.
ప్రశ్న 6.
సేవారంగం కార్యకలాపాలు ఎందుకు ప్రాముఖ్యత సంతరించుకుంటున్నాయి? (AS1)
జవాబు:
సేవారంగ కార్యకలాపాలు ప్రాముఖ్యత సంతరించుకోవడానికి ప్రధాన కారణాలు :
- మారుతున్న పరిస్థితులకనుగుణంగా సమాచార, సాంకేతిక విజ్ఞానంలో విప్లవాత్మకమైన మార్పులు వచ్చాయి.
- మానవ జీవితం యాంత్రికమైనది.
- రవాణా, కమ్యూనికేషన్ వ్యవస్థ పూర్తిగా మారిపోయింది.
- సుదూర ప్రాంతాలను అతి తక్కువ సమయంలో చేరడానికి గాను, ఇంటర్నెట్, గ్లోబల్ విలేజ్ వంటి వాటి ద్వారా మానవ సమాజం చేరువైనది.
- అధునాతన వైద్య సదుపాయాలు అందుబాటులోనికి వచ్చాయి.
- అనేక రకాలుగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పిస్తున్నాయి.
ప్రశ్న 7.
వ్యవసాయం, పరిశ్రమలు లేకుండా సేవా కార్యకలాపాలను ఒక స్థాయిని దాటి విస్తరించలేం. వివరించండి. (AS1)
జవాబు:
- ఆర్థిక వ్యవస్థలో ప్రాథమిక రంగమైన వ్యవసాయ రంగం, ద్వితీయ రంగమైన పారిశ్రామిక రంగం అభివృద్ధి చెందితే తృతీయ రంగం సత్వర, సుస్థిర ప్రగతిని సాధిస్తుంది.
- ఆర్థిక వ్యవస్థ అనే ఇరుసుకు రెండు చక్రాల వంటివి వ్యవసాయ, పారిశ్రామిక రంగాలు. వీటి వలన ఉత్పాదక సామర్థ్యం పెరుగుతుంది.
- ఉత్పాదక సామర్థ్యం. ఉన్న చోట సేవారంగం సుస్థిర ప్రగతి సాధిస్తుంది.
- ప్రజలు మెరుగైన ఆదాయాలు పొందాలంటే వ్యవసాయ, పారిశ్రామిక రంగాలు అభివృద్ధి చెందాలి. అప్పుడు వారి వినియోగ వ్యయంలో మార్పులు వచ్చి సేవాకార్యకలాపాలైన విద్య, వినోదం, ఆహారం, పర్యాటకం వంటి వాటిపై ” ఖర్చు చేయడానికి ఆసక్తి చూపుతారు.
- అందువల్ల వ్యవసాయ, పారిశ్రామిక రంగాలు అభివృద్ధి చెందడం వల్ల సేవాకార్యకలాపాలు ఒకస్థాయిని దాటి విస్తరించగలవు.
ప్రశ్న 8.
భారతదేశంలో చదువుకున్నవారి నిరుద్యోగితను సేవారంగం ఎలా తగ్గించగలదు? (AS1)
జవాబు:
- సాంకేతిక పరిజ్ఞానంలో నిరంతర మార్పు ,సేవారంగాన్ని ముందుకు నడిపిస్తుంది.
- వ్యాపార నిర్వహణలో పొరుగు సేవల ద్వారా కొత్త తరహా ఉద్యోగ అవకాశాలను నిరుద్యోగ యువతకు కల్పిస్తోంది.
- టెలికమ్యూనికేషన్ల అనుసంధానాన్ని ఉపయోగించుకొని ఉద్యోగులు తాము ఉన్న చోటునుండి ప్రపంచంలో ఎక్కడ ఉన్న వారికైనా తమ సేవలను అందిస్తున్నారు.
- ప్రధాన నగరాలలో స్థాపించబడిన ఎన్నో ఐ.టి. సంస్థలు అత్యంత నిపుణులైన ఇంజనీర్లకు ఉద్యోగాలు కల్పించి ప్రత్యేకమైన సాఫ్ట్ వేర్ సేవలను ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సంస్థలకు అందిస్తున్నాయి. వారికి ఇతర దేశాల నుండి ప్రాజెక్టులు వస్తాయి.
- వినోద పరిశ్రమ, వార్తా ప్రసార సంస్థలు, కేబుల్ టెలివిజన్ ఛానల్ లో ఉద్యోగ అవకాశాలను కల్పిస్తున్నాయి.
- పట్టణాలలో, నగరాలలో ఇంటర్ నేట్ కేఫీలు, పబ్లిక్ టెలిఫోన్ బూత్ లు సర్వసాధారణంగా కన్పిస్తాయి.
- సాధారణంగా వాణిజ్య ప్రకటనల రంగం కూడా కొత్త ఉద్యోగ అవకాశాలు తీసుకువచ్చింది.
ప్రశ్న 9.
మీ ప్రాంతం నుండి ఎవరైనా పనివారు వలస వెళ్లారా? వారు ఎందుకు వలస వెళ్లారో కారణాలు తెలుసుకోండి. (AS3)
జవాబు:
- మా ప్రాంతం నుండి వలస వెళ్ళినవారు ఉన్నారు.
- వారు వివిధ రకాల పనుల నిమిత్తం వివిధ ప్రాంతాలకు వలస వెళ్ళినారు.
- ఉన్నత చదువులు చదువుకుని ఉన్నత ఉద్యోగాల కోసం వివిధ ప్రాంతాలకు వలస వెళ్ళినారు.
- అలాగే పనిపాటలు చేసుకునే వివిధ రకాల పనులు కోసం వలస వెళ్ళినారు.
- కూలి పనులు చేసుకునేవారు మా ప్రాంతంలో పని ఉన్నప్పుడు ఉండి పని లేని సమయంలో వేరే ప్రాంతాలకు వలస వెళ్ళి పనులు పూర్తయిన తదుపరి ప్రాంతానికి వస్తారు.
ప్రశ్న 10.
ఈ పాఠంలోని 9వ పేరా చదవండి (సేవా కార్యకలాపాలనేవి వ్యవసాయం….) ఈ కింది ప్రశ్నకు సమాధానం వ్రాయండి. వ్యవసాయం, పరిశ్రమలకు అవసరమైన, సేవా కార్యకలాపాలు ఏమిటి?
జవాబు:
- రోడ్లు, రైలు, జల, వాయు మార్గాలు అనగా రవాణా సౌకర్యాలను ఏర్పాటు చేయాలి.
- వైద్య, విద్యా సంస్థలను ఏర్పాటు చేయడం
- గిడ్డంగి సౌకర్యాలను కల్పించడం.
- రుణ సదుపాయాలను కల్పించడం.
- వ్యాపార సౌకర్యాలను ఏర్పాటుచేయడం.
ప్రశ్న 11.
పేజీ నెం. 104లోని పటాన్ని పరిశీలించి భారతదేశ అవుట్ లైన్ పటంలో సాఫ్ట్ వేర్ టెక్నాలజీ పార్కులు గల నగరాలను గుర్తించండి.
జవాబు:
9th Class Social Studies 8th Lesson భారతదేశంలో సేవా కార్యకలాపాలు InText Questions and Answers
9th Class Social Textbook Page No.97
ప్రశ్న 1.
ఈ కింద ఎనిమిది రకాల సేవా కార్యకలాపాలు ఇవ్వబడ్డాయి. కొన్ని వివరాలు నింపి మిగిలినవి వదిలేయబడ్డాయి. మీ ఉపాధ్యాయుడితో చర్చించి ఆ ఖాళీలను పూరించండి.
జవాబు:
1. విద్య : సంస్థలు :
పాఠశాలలు, కళాశాలలు, విశ్వ విద్యాలయాలు, సాంకేతిక విద్యాసంస్థలు ఈ కోవకు చెందుతాయి. ఈ సంస్థలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు, పరిపాలన సిబ్బంది, వారి కార్యకలాపాలు సేవలను అందిస్తాయి.
2. ఆరోగ్య, వైద్య సేవలు :
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, జిల్లా జనరల్ ఆసుపత్రులు, వివిధ రకాలైన వైద్య కేంద్రాలు, వృద్ధాశ్రమాలు మొ||నవి.
3. వర్తకం :
మన చుట్టూ చూస్తున్న వివిధ రకాల టోకు (సూల్ సేల్) చిల్లర వ్యాపార కార్యకలాపాలు, జాతీయ, అంతర్జాతీయ వ్యాపారం మొదలైనవి.
4. ప్రభుత్వ పరిపాలన :
గ్రామీణ, నగర పంచాయితీలు, రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల ద్వారా అందించే ప్రజాసేవలన్నీ ఈ . వర్గానికి చెందుతాయి. ఉదా: పోలీస్ స్టేషన్లో పనిచేసే వ్యక్తులు, వివిధ ప్రభుత్వ విభాగాలలో చేస్తున్న వ్యక్తులు అంటే గ్రామ పరిపాలనాధికారులు, రెవెన్యూ ఇన్ స్పెక్టర్, తహసీల్దార్లు అన్ని రకాల న్యాయస్థానాలలో పనిచేయువారు, . అసిస్టెంట్లు, క్లలు, అకౌంటెంట్లు, టైపిస్టులు, ఫ్యూన్లు, డ్రైవర్లు మొదలగువారు.
5. రక్షణ రంగం :
త్రివిధ దళాలకు చెందిన సైనిక,నావిక, వైమానిక దళాలలో పనిచేయు వ్యక్తులు, వారి కార్యకలాపాలు ఈ కోవకు చెందుతాయి. బిఎస్ఎఫ్, సిఐఎస్ఎఫ్ పోలీసుల సేవల వంటివి కూడా వస్తాయి.
6. విత్త కార్యకలాపాలు :
బ్యాంకులు, వివిధ పొదుపు పథకాలు, తపాలా తంతి – వ్యవస్థ, జీవిత బీమా సంస్థ మొ||నవి.
7. వ్యక్తిగత సేవలు :
ఇళ్లలో పనిచేయు పనివారు, బట్టలు ఉతుకువారు, శుభ్రపరిచేవారు, అద్దకం సేవలు, క్షురకులు, బ్యూటీపార్లర్ నడిపేవారు, టైలరింగ్ పనివారు, ఫోటో, వీడియో స్టూడియోలో పనిచేయువారు.
8. ఇతర రకాల కార్యకలాలు :
వినోదం, సమాచార సాంకేతిక పరిశ్రమలు – చిత్ర నిర్మాణం, టీవీ సీరియళ్లలో పని చేయువారు. వార్తాపత్రికలు, టివి ఛానళ్లలో, వాణిజ్య ప్రకటన సంస్థలు, మీడియాలో పనిచేసేవారి పనులు కూడా సేవలకు చెందుతాయి.
9th Class Social Textbook Page No.100
ప్రశ్న 2.
1991 నుండి 2010 వరకు కొన్ని ప్రధాన తరగతులలో వివిధ సేవా కార్యకలాపాలలో పనిచేసే వారి సంఖ్యను (లక్షలలో) ఈ కింది పట్టిక చూపుతుంది. ఈ పట్టికను జాగ్రత్తగా చదివి కింది ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
1) 2010 సంవత్సరంలో ఏ సేవా కార్యకలాపం అత్యధిక ఉద్యోగితను కల్పించింది?
జవాబు:
సామాజిక, సాంఘిక, వ్యక్తిగత సేవలు.
2) గత సంవత్సరాలుగా ప్రభుత్వ ఉద్యోగాల సంఖ్య పెరిగిందా లేదా తగ్గిందా? ఈ కాలంలో ఏ రకమైన ఉద్యోగాలు ప్రభుత్వం కల్పించింది?
జవాబు:
గత సంవత్సరాలుగా ప్రభుత్వ ఉద్యోగాల సంఖ్య తగ్గింది. విత్త, బీమా సంస్థలు, స్థిరాస్తి వ్యాపారం మొదలగునవి మాత్రం 11.9 నుంచి 14.1 కి పెరిగాయి.
3) ప్రైవేటు సేవాకార్యకలాపాల్లో ప్రజలు ఎటువంటి ఉద్యోగాలను పొందగలిగారు?
జవాబు:
ప్రైవేట్ ఉద్యోగాల సంఖ్య పెరిగింది.
టోకు వర్తకం, చిల్లర వర్తకం, రవాణా గిడ్డంగులు, సమాచార రంగం, విత్త, బీమా సంస్థలు, స్థిరాస్తి వ్యాపారం మొదలైన వాటిల్లోనూ,
సామాజిక, సాంఘిక, వ్యక్తిగత సేవలు వంటి అంశాలలో ఉద్యోగాలు పెరిగాయి.
4) ప్రభుత్వ, ప్రైవేట్ వ్యవస్థలో కల్పిస్తున్న ఉద్యోగాలకు మధ్య ఏమైనా వ్యత్యాసాలు ఉన్నాయా? చర్చించండి.
జవాబు:
- టోకు వర్తకం, చిల్లర వర్తకం వంటి అంశాలలో ‘ప్రైవేట్ ఉద్యోగాలు ఎక్కువగా ఉండగా
- రవాణా గిడ్డంగులు, సమాచార రంగం వంటి అంశాలలో ప్రభుత్వ ఉద్యోగాలు ఎక్కువగా ఉండి, ప్రైవేట్ ఉద్యోగాలు తక్కువగా ఉన్నాయి.
- విత్త, బీమా సంస్థలు, స్థిరాస్తి వ్యాపార రంగాలలో ఒకప్పుడు ప్రైవేట్ ఉద్యోగాలు ప్రభుత్వ ఉద్యోగాలు కన్నా తక్కువగా ఉండగా ఈ మధ్య కాలంలో ప్రభుత్వ ఉద్యోగాల కన్నా ప్రైయివేట్ ఉద్యోగాల సంఖ్య పెరిగింది.
- సామాజిక, సాంఘిక, వ్యక్తిగత సేవల రంగాలలో ప్రైవేట్ ఉద్యోగాలకన్నా ప్రభుత్వ ఉద్యోగాలు ఎక్కువగా ఉన్నాయి.
9th Class Social Textbook Page No.101
ప్రశ్న 3.
చిల్లర వర్తకంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులపై మీ అభిప్రాయం ఏమిటి? ఈ సమస్యను చక్కదిద్దడానికి ప్రభుత్వం ఏమైనా చేయగలుగుతుందా?
జవాబు:
- మా అభిప్రాయం ఏమనగా వీటి వల్ల లాభాలు, నష్టాలు ఉన్నాయి.
- మొత్తం మీద చూస్తే నష్టాల కంటే లాభాలే ఎక్కువ అని అంటారు.
- అంతేకాక కాలక్రమంలో మొదట్లో నష్టపోయిన వాళ్లు కూడా లాభపడతారు.
- పెద్ద, మధ్యతరగతి రైతులు ప్రారంభంలో ఎక్కువ లాభపడతారని, చిన్న రైతులు లేదా భూమి లేని కూలీలు నష్టపోతారని పేర్కొంటారు.
- అయితే పెద్ద సూపర్ మార్కెట్ల కొనుగోళ్ల వల్ల వ్యవసాయ ఉత్పత్తులకు గిరాకీ పెరిగి తత్ఫలితంగా వ్యవసాయ ఉత్పత్తి పెరుగుతుంది.
- దీని వల్ల కూలీలకు గిరాకీ పెరిగి క్రమంగా వ్యవసాయ కూలీ రేట్లు పెరుగుతాయి.
ఈ సమస్యను చక్కదిద్దడానికి ప్రభుత్వం చేపట్టే అంశాలు :
- ఆధునిక నిల్వ సౌకర్యాలను ప్రభుత్వం కూడా ఏర్పాటు చేస్తుంది.
- మార్కెట్ కొద్ది చేతులలో కేంద్రీకృతం కాకుండా చూస్తుంది.
- విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఎప్పటికప్పుడు తన పర్యవేక్షణలో పెడుతుంది.
9th Class Social Textbook Page No.102
ప్రశ్న 4.
భారతదేశంలో విదేశీ కంపెనీలు చిల్లర దుకాణాలను ఏర్పరచడంపై మీ అభిప్రాయం ఏమిటి?’ అవి భారతదేశంలో ఉపాధి కల్పనకు ఏ విధంగా దోహదం చేస్తాయి?
జవాబు:
భారతదేశంలో విదేశీ కంపెనీలు సరకులు అమ్మడానికి చిల్లర దుకాణాలను ప్రారంభించడం జరిగింది.
- కాలక్రమంలో ఈ విదేశీ పెట్టుబడి కంపెనీలు తమ అధికారాన్ని దుర్వినియోగం చేసి తక్కువ ధరలకు తమ సరకును అమ్మే విధంగా రైతులపై ఒత్తిడి తెస్తాయి.
- సరైన నిల్వ సౌకర్యాలు లేని కారణంగా వ్యవసాయ ఉత్పత్తులలో 20 – 40% వృథా అవుతున్నాయి.
- విదేశీ చిల్లర వ్యాపారస్తులు కూడా రైతులతో ఒప్పందం కుదుర్చుకొని వడ్డీ వ్యాపారస్తుల కంటే తక్కువ వడ్డీకి అప్పులు సమకూర్చవచ్చు.
- మెరుగైన నిల్వ సౌకర్యాల కారణంగా బహుళజాతి కంపెనీలు పెద్ద మొత్తంలో సరకు కొనుగోలు చేయడంతో రైతులకు వడ్డీ వ్యాపారస్తులతో పోలిస్తే ఇది ప్రయోజనకారిగా ఉంటుంది.
- వీటి వలన ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి. ఎంతో మందికి ఉపాధి కల్పించడానికి అవకాశాన్ని ఏర్పరచుతాయి.
ప్రశ్న 5.
మీ ప్రాంతంలోని కొంతమంది చిల్లర వ్యాపారస్తులతో మాట్లాడండి. విదేశీ చిల్లర దుకాణాలపై వాళ్ల అభిప్రాయాలు గురించి తరగతిలో చర్చించండి.
జవాబు:
- బహుళజాతి సంస్థలు ఎక్కువ మొత్తంలో కొనుగోలు చేయడం వలన వారు తక్కువ రేటుకు అమ్మినప్పటికి వారికి నష్టాలు రావు.
- అందువల్ల చిన్న దుకాణదారులు అమ్మే రేట్లతో పోలిస్తే తక్కువ రేట్లకు అమ్ముతారు.
- దానితో వినియోగదారులు చిన్న దుకాణాదారుల వద్దకు వెళ్ళకుండా చిల్లర వర్తకంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల షాపులకు వెళ్తారు.
- దానితో చిల్లర దుకాణదారులు తమ షాపులను మూసివేయాల్సి వస్తుంది.
- వాటిపై ఆధారపడినవారు ఉపాధిని కోల్పోతారు.
- నిల్వ సౌకర్యాల్లో పెద్ద పెద్ద చిల్లర వ్యాపారస్తులు ఆశించినంతగా పెట్టుబడులు పెట్టలేదు.
- అందువల్ల సంప్రదాయ చిల్లర వర్తకులు ఉపాధి కోల్పోతారు. దీనివల్ల మార్కెట్ కొద్దిమంది చేతుల్లో కేంద్రీకృతమవుతుంది.
ప్రశ్న 6.
రెండు నిలువు వరుసలతో ఒక పట్టిక తయారు చేసి అందులో భారతదేశంలో విదేశీ కంపెనీల చిల్లర దుకాణాల వల్ల కలిగే లాభాలను, నష్టాలను పేర్కొనండి.
జవాబు:
లాభాలు | నష్టాలు |
1. పెద్ద సూపర్ మార్కెట్లలో కొనుగోళ్ళ వల్ల వ్యవసాయ ఉత్పత్తులకు గిరాకీ పెరిగి తత్ఫలితంగా వ్యవసాయ ఉత్పత్తి పెరుగుతుంది. దీనివల్ల కూలీలకు గిరాకీ పెరిగి క్రమంగా వ్యవసాయ కూలీ రేట్లు పెరుగుతాయి. | 1. నిల్వ సౌకర్యాల్లో పెద్ద పెద్ద చిల్లర వ్యాపారస్తులు ఆశించినంతగా పెట్టుబడులు పెట్టలేదు. అందువల్ల సంప్రదాయ చిల్లర వర్తకులు ఉపాది కోల్పోతారు. దీనివల్ల మార్కెట్ కొద్ది మంది చేతుల్లో కేంద్రీకృతమవుతుంది. |
2. విదేశీ చిల్లర వ్యాపారస్తులు కూడా రైతులతో ఒప్పందం కుదుర్చుకొని వడ్డీ వ్యాపారస్తులు కంటే తక్కువ వడ్డీకి అప్పులు సమకూర్చవచ్చు. | 2. విదేశీ పెట్టుబడి కంపెనీలు తమ అధికారాన్ని దుర్వినియోగం చేసి తక్కువ ధరలకు తమ సరుకును అమ్మే విధంగా రైతులపై ఒత్తిడి తెస్తాయి. |
3. మెరుగైన నిల్వ సౌకర్యం కారణంగా బహుళజాతి కంపెనీలు పెద్ద మొత్తంలో సరకు కొనుగోలు చేయడంతో రైతులకు వడ్డీ వ్యాపారస్తులతో పోలిస్తే ఇది ప్రయోజనకారిగా ఉంటుంది. | 3. నిల్వ సౌకర్యాలపై పెట్టుబడులు పెట్టడం ద్వారా వృథా అయ్యే శాతాన్ని సూపర్ మార్కెట్లు తగ్గిస్తాయనడంలో వాస్తవం లేదు. |
ప్రశ్న 7.
భారతదేశంలో మరిన్ని వైద్య విద్యాసంస్థలను నెలకొల్పాల్సిన అవసరం ఏమిటి?
జవాబు:
- భారతదేశం ఆరోగ్య రంగంలో 64 లక్షల వృత్తి సేవానిపుణుల కొరతను ఎదుర్కొంటున్నది.
- ఒక్క ఉత్తరప్రదేశ్ లోనే 10 లక్షల ఆరోగ్య సంబంధ వృత్తి సేవానిపుణుల కొరత ఉంది.
- 2011 లో భారతదేశంలో ప్రతి 10 వేల జనాభాకు ఆరుగురు డాక్టర్లు ఉన్నారు.
- అదే నర్సులు, మంత్రసానుల విషయానికొస్తే ప్రతి 10 వేలమందికి 13 మంది ఉన్నారు.
- డాక్టరు, జనాభా నిష్పత్తి భారతదేశంలో 0.5 : 1000 కాగా, థాయ్ లాండ్లో 0.3, శ్రీలంకలో 0.4, చైనాలో 1.6, ఇంగ్లాండ్లో 5.4, అమెరికాలో 5.5 గా ఉంది.
- దంత సంబంధిత సాంకేతిక విజ్ఞానంలో 20 లక్షల మంది నిపుణుల కొరత ఉంది.
- పునరావాస వృత్తి సంబంధిత వృత్తినిపుణులలో 18 లక్షల మంది కొరత ఉంది.
- ఆపరేషన్లో మత్తుమందుకు సంబంధించిన నిపుణులు 9 లక్షలమంది కొరత ఉంది.
- వివిధ ఆరోగ్య కార్యకర్తలు సంబంధించిన నిపుణులు 9 లక్షలమంది కొరత ఉంది.
- వైద్య పరీక్షల సాంకేతిక నిపుణులు 2.4 లక్షల మంది కొరత ఉంది.
- ఆపరేషన్ సంబంధిత ఆరోగ్య నిపుణులు – 2 లక్షల మంది కొరత ఉంది.
- కంటికి సంబంధించిన కార్యకర్తలు 1.3 లక్షల మంది కొరత ఉంది.
వృత్తి, విద్యా కళాశాలలు, పాఠశాలల కేటాయింపుల్లో అసమానతల వల్ల అన్ని ప్రాంతాలలో సమానంగా లేరు.
అందువల్ల వైద్య, విద్యా సంస్థలను నెలకొల్పవలసిన అవసరం ఎంతైనా ఉంది.
ప్రశ్న 8.
కొత్త వైద్య విద్యా సంస్థలను ప్రభుత్వ రంగంలో నెలకొల్పవచ్చా లేక ప్రైవేట్ రంగంలోనా? ఎందుకు?
జవాబు:
ప్రభుత్వ, ప్రైవేట్ రంగంలోను స్థాపించవచ్చు.
ఎందుకనగా :
- ప్రభుత్వరంగంలో స్థాపించడం వలన పేద, మధ్యతరగతికి చెందిన ప్రతిభగల విద్యార్థినీ విద్యార్థులకు వైద్య విద్య అందుబాటులోకి వస్తుంది.
- ప్రైవేట్ రంగంలో స్థాపించినప్పటికి కొన్ని సీట్లను ప్రతిభగల పేద విద్యార్థులకు కేటాయించడం వల్ల వారికి న్యాయం చేకూరుతుంది.
- ప్రభుత్వం పైన నిర్వహణ ఖర్చు ఉండదు. ఆర్థిక భారమూ పడదు.
ప్రాజెక్టు
ప్రశ్న 1.
ఎవరైనా ఏడుగురు వ్యక్తులను కలసి వారి ఏ రంగంలో పనిచేస్తున్నారో తెలుసుకోండి. వారి పని గురించి సంక్షిప్తంగా వ్రాయండి. లేదా పోస్టరు తయారుచేయండి. వారి నివాస ప్రాంతానికి వారి పనికి మధ్య ఎలాంటి సంబంధాన్ని చూసారు.
జవాబు:
వ్యక్తి పేరు | చేసే పని యొక్క స్వభావం | వ్యవసాయం/పరిశ్రమ/సేవలు |
1. రామారావు | ప్రభుత్వ డాక్టరు | సేవలు |
2. కార్తికేయ | ప్రభుత్వ సీనియర్ అసిస్టెంట్ | సేవలు |
3. వేణుగోపాలరావు | ప్రైవేటు డాక్టర్ | సేవలు |
4. ముకుందరావు | ప్రైవేటు డాక్టర్ | సేవలు |
5. మీరాబాయి | ప్రభుత్వ సీనియర్ నర్సు | సేవలు |
6. పాపారావు | రైతు | వ్యవసాయం |
7. బుచ్చమ్మ | కార్మికురాలు | పరిశ్రమ |
వైద్య నిపుణుల కొరత గురించి ప్రభుత్వ ప్రయివేటు వైద్యశాలలయందు పైన పేర్కొన్న వ్యక్తులతో మాట్లాడగా వారు క్రింది విషయాలను వెల్లడి చేశారు.
అవి :
- మన దేశంలో, మన రాష్ట్రంలో, మన ప్రాంతంలో వైద్య నిపుణుల కొరత ఎంతైనా ఉంది.
- అనేక గ్రామీణ ప్రాంతాలలో నివసిస్తున్న ప్రజలకు ఇంకా డాక్టర్ అందుబాటులో లేడంటే ఆశ్చర్యపడవలసిన పనిలేదు.