AP Board 9th Class Social Solutions Chapter 9 ద్రవ్య వ్యవస్థ – ఋణం

SCERT AP 9th Class Social Studies Guide Pdf 9th Lesson ద్రవ్య వ్యవస్థ – ఋణం Textbook Questions and Answers.

AP State Syllabus 9th Class Social Solutions 9th Lesson ద్రవ్య వ్యవస్థ – ఋణం

9th Class Social Studies 9th Lesson ద్రవ్య వ్యవస్థ – ఋణం Textbook Questions and Answers

Improve your learning (మీ అభ్యసనాన్ని మెరుగుపడుచుకోండి)

ప్రశ్న 1.
పేద కుటుంబాలలో చాలా కుటుంబాలు అనియత వనరుల నుండి రుణాలు పొందుతాయి. అనియత రుణాలపై ధనిక కుటుంబాలు చాలా తక్కువగా ఆధారపడతాయి. ఈ వాక్యాలను మీరు సమర్థిస్తారా? మీ సమాధానాన్ని సమర్థించడానికి పేజీ నెం. 114 లోని సమాచారాన్ని ఉపయోగించండి. (AS3)
(లేదా)
భారతదేశంలో నియత, అనియత రుణదాతలు రుణాన్ని అందించే విషయంలో చాలా తేడా ఉంది. నియత రుణ సంస్థలు ప్రభుత్వం, ఆర్.బి.ఐ. రూపొందించిన నియమ నిబంధనలకు అనుగుణంగా పనిచేస్తూ తమ ఖాతాదారులచే కూడా ఈ నిబంధనలను పాటింపచేస్తారు. కాని అనియత వడ్డీ వ్యాపారులు ఎటువంటి ప్రభుత్వ నిబంధనలను పాటించకుండా తమ స్వంత పద్ధతులను పాటిస్తారు. రుణగ్రహీతలు తీసుకున్న అప్పును చెల్లించలేకపోయిన పక్షములో నియత రుణదాతలు అప్పును తిరిగి రాబట్టడానికి వారిపై ఎటువంటి చట్టపరమైన చర్యనైనా చేపడతారు. కాని అనియత రుణదాతలు అప్పును తిరిగి రాబట్టడానికి చట్టవ్యతిరేక మరియు ఎటువంటి చర్యనైనా చేపడతారు. ఈ కారణాల వలన అప్పుడప్పుడు రుణగ్రహీతలు ఆత్మహత్య చేసుకుంటున్నారు. నియత రుణ సంస్థలతో పోలిస్తే అనియత రుణదాతలు అధిక వడ్డీ రేటు వసూలు చేస్తున్నారు.

బ్యాంకులు, సహకార సంస్థలు అధికంగా రుణాలు ఇవ్వాల్సిన అవసరం ఉంది. దీని వలన ఎక్కువ మంది తక్కువ వడ్డీకి రుణాలు పొంది “అధిక ఆదాయాన్ని పొందగల్గుతారు. వారు పంటలను పండించగల్గడం, వ్యాపారం చేయడం, చిన్న తరహా పరిశ్రమలను స్థాపించడం మొదలగునవి చేయగలుగుతారు. ప్రతి ఒక్కరికి తక్కువ వడ్డీ రేటు, అప్పును తిరిగి చెల్లించే సామర్థ్యం వంటివి కల్గించడం దేశాభివృద్ధికి ప్రధాన అంశాలుగా పనిచేస్తాయి.
ప్రశ్న : “ధనిక కుటుంబాల వారు నియత రుణదాతల నుండి స్వల్ప వడ్డీకి రుణాలు పొందుతుండగా, పేదకుటుంబాల వారు అనియత రుణదాతలకు అధిక వడ్డీ చెల్లించవలసి వస్తున్నది” వ్యాఖ్యానించండి.
జవాబు:
నియత రుణాలు :
1. బ్యాంకుల ద్వారా, సహకార సంస్థల ద్వారా పొందే రుణాలు :
అనియత రుణాలు :
1. వడ్డీ వ్యాపారస్థులు, వర్తకులు, యజమానులు – బంధువులు, స్నేహితులు ద్వారా పొందే రుణాలు. పేద కుటుంబాలలో చాలా కుటుంబాలు అనియత వనరుల నుండి రుణాలు పొందుతాయి. అనియత రుణాలపై ధనిక కుటుంబాలు చాలా తక్కువగా ఆధారపడతాయి. ఈ వాక్యాలను నేను సమర్థిస్తాను.

కారణం :
పేద కుటుంబాల వారికి బ్యాంకుల గురించిన సమాచారం అంతగా తెలియదు. బ్యాంకులలో జరిగే లావాదేవీలు కూడా పేద కుటుంబాల వారికి తెలియదు. బ్యాంకులు అంటే ధనికులకు
చెందినవి వారి అపోహ.

పైగా బ్యాంకుల ద్వారా ఋణాలు ఇవ్వడానికి పుచీకత్తులు’ అడుగుతారు అవి పేద కుటుంబాల వారి వద్ద ఉండవు. అందువలన ప్రైవేటు వ్యాపారస్తులను నమ్ముకుని వారి వద్ద మోసపోతారు.

పట్టిక – 1 ను పరిశీలిస్తే ఈ విషయం తెలుస్తుంది.
బ్యాంకులను ఎవరు వినియోగించుకుంటున్నారంటే…..
జీతం తీసుకునే ఉద్యోగులు,
పంటలు బాగా పండించే పెద్ద రైతులు,
వ్యాపారం చేసే వ్యాపారస్థులు,
బ్యాంకులలో డబ్బులు దాచుకుంటూ ఉండగా

బ్యాంకుల నుంచి రుణాలు పొందుతున్న వారు, కార్లు కొనుక్కునేవారు. ట్రాక్టర్లు కొనుక్కునేవారు, ఎరువులను కొనుగోలు చేసేవారు, ఇళ్లు కట్టుకునేవారు. వీరంతా ధనికులు. అందువలన బ్యాంకులావాదేవీలు అన్నియు నిర్వహించేవారు ఎక్కువగా ధనికులు మాత్రమే.

పేదవారు బ్యాంకులు వద్దకు వెళ్ళకుండానే ప్రైవేటు వ్యక్తుల వద్ద రుణాలు పొందుతూ ఉంటారు.

AP Board 9th Class Social Solutions Chapter 9 ద్రవ్య వ్యవస్థ – ఋణం

ప్రశ్న 2.
రుణాలపై అధిక వడ్డీరేట్లు ఎందుకు హానికరం? (AS1)
జవాబు:
రుణాలపై అధిక వడ్డీరేట్లు హానికరం ఎందుకు అనగా –

  1. ఒక్కొక్కసారి మనం తీసుకున్న దానికన్నా వడ్డీ అధికం అవుతుంది.
  2. మొత్తం తిరిగి చెల్లించాలంటే అది రుణగ్రహీతలకు భారం అవుతుంది.
  3. రుణం ద్వారా పొందిన ప్రయోజనం కన్నా రుణగ్రహీతలకు వడ్డీ చెల్లించే భారం అధికం అవుతుంది.
  4. వడ్డీ రేట్లు అధికంగా ఉండటం వలన రైతులు తమ పంటలు పాడైపోతున్నా చూస్తూ ఉంటారు. కానీ రుణాలు తీసుకుని వాటికి తగిన చర్యలు చేపడదాము అని అనుకోరు. అందువలన వడ్డీరేట్లు ప్రజలకు అందుబాటులో ఉంటే ధనాన్ని వడ్డీకి తీసుకుని అభివృద్ధికరమైన పనులు చేయడానికి వారికి అవకాశం ఏర్పడుతుంది.

ప్రశ్న 3.
పేదల కోసం గల స్వయం సహాయక బృందాల ప్రధాన ఉద్దేశం ఏది? మీ సొంత వాక్యాల్లో వివరించండి. (AS4)
జవాబు:
పేదవారికి రుణాలు అందజేయడానికి కొత్త పద్ధతులు అవలంబిస్తున్నారు.

  1. పేదవారిని సమీకృతం చేయడం
  2. ముఖ్యంగా స్త్రీలకోసం, వారు పొదుపు చేసే డబ్బును సేకరించడం.
  3. దీనికోసం స్వయం సహాయక బృందాలను ఏర్పాటుచేసి నిర్వహించడం.
  4. ప్రతి స్వయం సహాయక బృందంలో 15 నుండి 20 మంది ఒకే ప్రాంతానికి చెందినవారు సభ్యులుగా ఉంటూ నిరంతరం కలుస్తూ, వారి డబ్బును పొదుపు చేస్తారు.
  5. ప్రతి ఒక్కరూ 25 రూ||ల నుండి 100 లేదా అంతకన్నా ఎక్కువ వారి వారి సామర్థ్యాలను బట్టి పొదుపు చేస్తారు.
  6. సభ్యుల్లో ఎవరికైనా రుణం అవసరమైతే తమ బృందం నుండి అందరూ కలసి దాచుకున్న సొమ్ము నుండి అప్పుగా పొందవచ్చు.
  7. బృంద సభ్యులు అప్పు తీసుకున్న వారి నుండి వడ్డీ వసూలు చేస్తారు.
  8. ఈ వడ్డీ వ్యాపారులు వసూలు చేసే వడ్డీలకన్నా తక్కువగా ఉంటుంది.
  9. 1 లేదా 2 సం||రాల పాటు బృందంలోని సభ్యులందరూ క్రమం తప్పకుండా పొదుపు చేస్తే వారికి రుణం పొందే అర్హత వస్తుంది.
  10. బ్యాంకులతో ఉండే ఈ సంబంధం అందరికీ ఇచ్చే రుణాల మొత్తాన్ని పెంచడానికి దోహదపడుతుంది.
  11. బృందం పేరుమీద బ్యాంకులు రుణాలను అందజేస్తాయి.
  12. అదే విధంగా బృందాలు తీసుకున్న అప్పును అందరు కలసి తిరిగి చెల్లించే హామీని బ్యాంకులకు ఇస్తాయి.
  13. రుణాలను పొందడం, డబ్బును పొదుపు చేయడం వంటి విషయాలను బృందం చర్చించి నిర్ణయిస్తుంది.
  14. ఎవరైనా సభ్యులు అప్పును సరిగా చెల్లించకపోతే ఆ విషయాన్ని బృందమే పర్యవేక్షిస్తుంది. ఈ ఏర్పాట్ల వలన పేద మహిళలకు బ్యాంకులు పూచీకత్తు లేకుండానే రుణాలు ఇవ్వడానికి ముందుకు వస్తాయి.

ప్రశ్న 4.
బ్యాంకర్ తో మాట్లాడి పట్టణ ప్రాంత ప్రజలలో ఎవరు ఎక్కువ రుణాలు ఎందుకోసం పొందుతారో తెలుసుకోండి. (AS3)
జవాబు:
బ్యాంకుల నుండి పట్టణ ప్రాంత ప్రజలలో ఎక్కువ రుణాలు పొందుతున్న వారు:

  1. వ్యాపారస్థులు
  2. పారిశ్రామికవేత్తలు
  3. ప్రభుత్వ ఉద్యోగస్థులు
  4. ఆర్థికవేత్తలు

AP Board 9th Class Social Solutions Chapter 9 ద్రవ్య వ్యవస్థ – ఋణం

ప్రశ్న 5.
స్వయం సహాయక బృందాల ద్వారా వచ్చే రుణానికి, బ్యాంక్ ద్వారా వచ్చే రుణానికి తేడాలేమిటి? (AS1)
జవాబు:

  1. స్వయం సహాయక బృందాల ద్వారా వచ్చే రుణాలు సమష్టిగా ఉంటాయి. అదే విధంగా బృందాలు తీసుకున్న అప్పును అందరు కలిసి తిరిగి చెల్లించే హామీని బ్యాంకులకు ఇస్తాయి.
  2. రుణాలను పొందడం, డబ్బును పొదుపు చేయడం వంటి విషయాలను బృందం చర్చించి నిర్ణయిస్తుంది.
  3. రుణాలు షరతులను బృందమే నిర్ణయిస్తుంది.
  4. అప్పును తిరిగి చెల్లించడం బృందం సభ్యులందరి సమిష్టి బాధ్యత.
  5. ఎవరైనా సభ్యులు అప్పును సరిగా చెల్లించకపోతే ఆ విషయాన్ని బృందమే పర్యవేక్షిస్తుంది. అదే బ్యాంకు ద్వారా వచ్చే రుణాలు బృందాలతో సంబంధం ఉండదు. ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకోవచ్చు. వద్దు అనుకుంటే ఆగిపోవచ్చు. లేదా చెల్లించాల్సి వచ్చినప్పుడు చెల్లించవచ్చు. అనగా వ్యక్తిగత రుణాలు ఆ వ్యక్తి యొక్క అవసరాలను బట్టి ఉంటాయి.

ప్రశ్న 6.
పేజీ నెం. 115 లోని స్వయం సహాయక బృందాల ……. గురించి ఉన్న మూడవ పేరా చదివి ఈ కింది ప్రశ్నకు జవాబు రాయండి. (AS2)
మీ ప్రాంతంలో స్వయం సహాయక బృందాలు ఏ విధంగా పనిచేస్తున్నాయి?
(లేదా)
“స్వయం సహాయక బృందాలు గ్రామీణ, పట్టణ పేద ప్రజలకు కేంద్రంగా పనిచేస్తాయి. మహిళలు స్వయంకృషితో ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి మాత్రమే కాకుండా వివిధ సామాజిక సమస్యలైన ఆరోగ్యం, పోషణ, గృహహింస మొదలైన వాటిని చర్చించి సరియైన చర్యలు తీసుకునే వేదికగా కూడా స్వయం సహాయక బృందాల సమావేశాలు తోడ్పడతాయి.” పై అభిప్రాయంతో మీరు ఏకీభవిస్తున్నారా? మీ జవాబును వివరించండి.
జవాబు:
మా ప్రాంతంలోని స్వయం సహాయక బృందాలు పనిచేసే విధానం :

  1. స్వయం సహాయక బృందాలలోని సభ్యులు రుణాలను పొంది స్వయం ఉపాధిని పొంది స్వయం ఉపాధిని ఏర్పరచుకుంటున్నారు.
  2. బృంద సభ్యులు చిన్న చిన్న మొత్తాలను రుణాలుగా పొందుతారు.
  3. ఉదా:- పూచీకత్తుగా ఉంచిన భూమిని తిరిగి పొందడం, పెట్టుబడులను సంపాదించడం. (ఉదా: విత్తనాలు, ఎరువులు, ముడిసరుకులు, బట్టలు, నగలు కొనుగోలు మొదలైన వాటికి)
  4. గృహోపకరణాల కొనుగోలు నిమిత్తం, కుట్టుమిషన్, మగ్గం, పశువులు మొదలగు ఆస్తుల సంపాదన కోసం రుణాలు పొందుతారు.
  5. స్వయం సహాయక బృందాలు గ్రామీణ, పట్టణ పేదప్రజలకు కేంద్రంగా పనిచేస్తాయి.
  6. మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి మాత్రమేకాక వివిధ సామాజిక సమస్యలైన ఆరోగ్యం, పోషణ, గృహహింస – మొదలయిన వాటిని చర్చించి సరియైన చర్యలు తీసుకునే విధంగా కూడా స్వయం సహాయక బృందాలు పనిచేస్తున్నాయి.

ప్రశ్న 7.
రైతుల అవసరాలు తీర్చడంలో బ్యాంకులు అందజేసే సేవలు ఏమిటి?
జవాబు:
రైతుల అవసరాలను తీర్చడంలో బ్యాంకులు అందజేసే సేవలు ప్రముఖపాత్ర వహిస్తున్నాయి. పూర్వ కాలంలో అవసరాలకి, ప్రస్తుత కాల వ్యవసాయ అవసరాలకి చాలా తేడా కన్పిస్తుంది. పూర్వ కాలంలో వ్యవసాయానికి కావలసిన ఉత్పాదకాలలో చాలా వాటిని రైతులే స్వయంగా సమకూర్చుకునే వారు. సొంత పశువులనే పొలం దున్నడానికి, ఇంటి మనుషులే వ్యవసాయ కూలీలుగా తమ పొలంలో పండిన పంటనే విత్తనాలుగా, తమ పశువుల కొట్టం నుండే ఎరువులను తయారు చేసుకోవడం మొదలైన పనులు చేసేవారు. నవీన వ్యవసాయ పద్ధతులకు అధికమైన ధనం అవసరం.

విత్తనాలు, ఎరువులు, క్రిమిసంహారక మందులు కొనడం కోసం అలాగే పొలం దున్నడం, విత్తనాలు నాటడం, పంటకోత కోయడం మొదలైన వ్యవసాయ పనులు చేసే యంత్రాల కోసం, కూలీల జీతాల కోసం ఎక్కువ డబ్బు అవసరం. దీనికి అనుగుణంగా బ్యాంకులు, రైతుల అవసరాలకు తగ్గట్లు, కాలానుగుణంగా ఋణాలు అందించి, వ్యవసాయ పురోభివృద్ధికి, రైతుల అవసరాలు తీర్చడంలో బ్యాంకులు ముందుంటున్నాయి.

9th Class Social Studies 9th Lesson ద్రవ్య వ్యవస్థ – ఋణం InText Questions and Answers

9th Class Social Textbook Page No.105

ప్రశ్న 1.
డిమాండ్ డిపాజిట్లను నగదుగా ఎందుకు పరిగణిస్తారు?
జవాబు:

  1. డిమాండ్ డిపాజిట్లు నగదు, యొక్క వివిధ లక్షణాలకు దారితీస్తుంది.
  2. నగదుకు బదులుగా చెక్కుల రూపంలో లేదా వివిధ ఎలక్ట్రానిక్ పరికరాల ద్వారా చెల్లింపులు జరుగుతాయి.
  3. కరెన్సీ నోట్లు మొదలైన వివిధ నగదు రూపాల లాగానే ఈ డిపాజిట్ల ద్వారా జమచేసిన డబ్బును తిరిగి తీసుకోవడం లేదా చెల్లింపులు జరపటం లాంటి విషయాలను నగదు రూపంలో గాని, చెక్కుల రూపంలోగాని చేయవచ్చు.
  4. చెల్లింపులు జరపడంలో డిమాండ్ డిపాజిట్లు అధిక ,వినియోగం వలన అధునిక ఆర్థిక వ్యవస్థలో ఇవి కరెన్సీ, నగదుకు ప్రతిరూపంలో ఉన్నాయి. ప్రస్తుత కాలంలోని డబ్బు యొక్క వివిధ రూపాలైన కరెన్సీ, డిపాజిట్లు ఆధునిక బ్యాంకింగ్ వ్యవస్థతో దగ్గర సంబంధం కలిగి ఉన్నాయి.

AP Board 9th Class Social Solutions Chapter 9 ద్రవ్య వ్యవస్థ – ఋణం

ప్రశ్న 2.
బ్యాంక్ డిపాజిట్లను కూడా ప్రభుత్వం బీమా చేస్తుంది. వివరాలు సేకరించండి.
జవాబు:
ప్రతి బ్యాంక్ తన డిపాజిట్ దారుల తరఫున “డిపాజిట్ ఇన్సూరెన్స్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్” కు ఇన్సూరెన్స్ చేస్తుంది. ఏదైనా విపత్కర పరిస్థితులలో బ్యాంకు మూసివేయవలసి వస్తే ఒక లక్ష రూపాయలవరకు డిపాజిట్ దారులకు బీమా లభిస్తుంది. ప్రజలకు బ్యాంకులపై నమ్మకం కలుగచేయుటకొరకు బ్యాంక్ డిపాజిట్లను కూడా ప్రభుత్వం బీమా చేస్తుంది.

ప్రశ్న 3.
బ్యాంకులలో జమ చేసే ఫిక్స్ డిపాజిట్లు నగదు లాగా పనిచేస్తాయి. చర్చించండి.
జవాబు:

  1. బ్యాంకులలో దాచుకొనే డబ్బుకు, ఫిక్స్ డిపాజిట్లకు ప్రభుత్వం రక్షణ కల్పిస్తుంది.
  2. వివిధ లావాదేవీలపై అనుమతిస్తూ, ప్రజలకు బ్యాంకులపై నమ్మకం కలిగిస్తుంది.
  3. ఫిక్స్ డిపాజిట్లపై ఎప్పుడు కావాలంటే అప్పుడు ఋణాలను వెంటనే పొందవచ్చు. వాటిని తిరిగి చెల్లించవచ్చు. లేక నిర్ణీతకాలం అయిన తరువాత రుణమును మినహాయించి తిరిగి మొత్తం సొమ్మును పొందవచ్చును. అందువలన ఫిక్స్ డిపాజిట్లు కూడా నగదు లాగా పనిచేస్తాయి.

9th Class Social Textbook Page No.107

ప్రశ్న 4.
డిపాజిట్ దారులందరు ఒకేసారి బ్యాంకు నుండి తమ డబ్బును తిరిగి ఇవ్వవలసినదిగా కోరితే ఏమౌతుంది?
జవాబు:

  1. ఏమీ జరగదు. కారణం బ్యాంకు స్థాపించబోయే ముందు కొంత పైకమును రిజర్వుబ్యాంక్ ఆఫ్ ఇండియాకు డిపాజిట్ గా చెల్లించాలి. మరియు బ్యాంకులు వ్యాపారం చేస్తూ ఉంటాయి కాబట్టి లాభాల బాటలోనే నడుస్తాయి.
  2. బ్యాంకులు డిపాజిట్ చేసిన మొత్తం కన్నా ఎక్కువగా డిపాజిట్లను సేకరించరాదు.
  3. రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా పెట్టిన షరతులను అంగీకరించి డిపాజిట్ల పరిధి ఎక్కువగా ఉండరాదు.
  4. అందువలన డిపాజిట్ దారులు ఒకేసారి డిపాజిట్ చేసిన సొమ్ము మొత్తము అడిగినా బ్యాంకులు ఇవ్వగలవు.

ప్రశ్న 5.
బ్యాంకు నుండి రుణం తీసుకున్న వ్యక్తితో మాట్లాడండి. రుణాన్ని ఏ అవసరానికి తీసుకున్నాడో బ్యాంకు వారిని ఏ విధంగా కలిసాడో తెలుసుకోండి?
జవాబు:

  1. బ్యాంకు నుండి రుణం తీసుకున్న సుమ అనే వ్యక్తితో మాట్లాడాను.
  2. ఆమె రుణాన్ని ఇల్లు నిర్మించడానికి తీసుకున్నది.
  3. ఆమె ఎలా రుణాన్ని తీసుకుంది అనగా ముందుగా బ్యాంకు మేనేజర్ గారి వద్దకు వెళ్ళి నేను ఇల్లు నిర్మించదలచాను. నేను ప్రభుత్వ ఉద్యోగిని అని చెప్పి రుణం ఇవ్వమని అడిగాను అంది.
  4. ఆ తరువాత ఆమెను డిఫ్యూటి మేనేజర్ హోదాలో ఉన్న ఒక ఆఫీసర్ దగ్గరకు పంపగా ఆయన రుణం ఇవ్వడానికి ఏమి కావాలో చెప్పారు.
  5. కావలసినవి :
    1. జీతమునకు సంబంధించిన వివరాలతో కూడిన సర్టిఫికెట్
    2. ఇంటి స్థలమునకు చెందిన రిజిస్ట్రేషన్ పత్రం.
    3. న్యాయపరమైన అర్హత గల పత్రము.
    4. ఆ స్థలమును ఎవరికీ అన్యాక్రాంతము చేయలేదని రుజువు చేసే పత్రం.
    5. సంబంధిత అధికారుల చేత ఇల్లు నిర్మించుకోవటానికి కావలసిన అనుమతి పత్రం.
    6. ఇంజనీరు చేత రూపొందించబడిన ఇంటి నిర్మాణం యొక్క ఆకృతి పత్రము వంటివి తీసుకువచ్చి బ్యాంకువారికి అప్పగించిన తరువాత పై అధికారులు వాటిని పరిశీలించిన తరువాత రుణమును పొందవచ్చును అని చెప్పారని ఆమె తెలియపరిచినది.

AP Board 9th Class Social Solutions Chapter 9 ద్రవ్య వ్యవస్థ – ఋణం

ప్రశ్న 6.
బ్యాంక్ మేనేజర్ తో మాట్లాడి వారు ఏ ఏ రుణాలు ఇచ్చారో ఏ ఏ వాటికి రుణాలు ఇవ్వకూడదో చర్చించండి.
జవాబు:
1. బ్యాంక్ మేనేజర్ తో మాట్లాడితే ఆయన ఇవ్వవలసిన రుణాలను గురించి, ఇవ్వకూడని రుణాలను గురించి వివరించి చెప్పారు.

ఇవ్వవలసిన రుణాలు :

  1. వ్యక్తిగత రుణాలు,
  2. ఇళ్లు నిర్మించడానికి రుణాలు,
  3. కార్లు కొనుగోలు చేయడానికి రుణాలు,
  4. గృహోపకరణాలు కొనుగోలు చేయడానికి,
  5. చదువుకోడానికి,
  6. రైతులకు సంబంధించినవి,
  7. వ్యాపారులకు సంబంధించినవి,
  8. పారిశ్రామికవేత్తలకు సంబంధించినవి.

ఇవ్వకూడని రుణాలు :

  1. ఒకసారి తనఖా పెట్టిన తరువాత మరల తనఖా పెట్టవలసి వస్తే వాటిని పరిశీలించాలి.
  2. దివాళా తీసిన వారికి
  3. స్థిర నివాసం లేనివారికి ఋణాలను ఇవ్వరాదు.

ప్రశ్న 7.
ప్రజలు వారి డబ్బును బ్యాంకులలోనే కాకుండా ఇతర సంస్థలైన గృహ సముదాయ సంస్థలు, కంపెనీలు పోస్టాఫీసు పథకాలు మొదలైన వాటిలో కూడా జమ చేస్తారు. బ్యాంక్ డిపాజిట్ల కన్నా ఇవి ఏ విధంగా విభిన్నమో చర్చించండి.
జవాబు:

  1. బ్యాంక్ డిపాజిట్లలో కరెంట్ డిపాజిట్లు, ఫిక్స్ డిపాజిట్లు వంటి రకరకాల డిపాజిట్లు ఉంటాయి.
  2. ఇతర సంస్థలలో నిర్ణీత కాలపరిమితి ననుసరించి డిపాజిట్లు ఉంటాయి.
  3. వడ్డీ రేట్లలలో కూడా తేడాలుంటాయి.
  4. వాటిని బ్యాంకులలో హామీగా చూపించి రుణాలు పొందవచ్చును.
  5. ఇతర సంస్థల యందు లావాదేవీలు సులభంగా ఉంటాయి. చిన్న చిన్న మొత్తాలలో కూడా పొదుపు చేయవచ్చును. ఆ విధంగా పొదుపుచేసిన మొత్తం ఒకేసారి పొందవచ్చును.
  6. బీమా సంస్థలలో పొదుపు చేసేటప్పుడు పొదుపు చేసే వ్యక్తి ప్రమాదవశాత్తు మరణిస్తే తదుపరి పొదుపు చేయవలసిన అవసరం లేకుండానే ఆ మొత్తం పొదుపు డబ్బును పొందవచ్చును.
  7. బ్యాంకులలో అయితే ఆ విధంగా ఉండదు. అందువలన బ్యాంక్ కార్యకలాపాలకు, ఇతర బీమా, గృహ సముదాయ పోస్టాఫీసు పథకాలకు కొంత వ్యత్యాసం ఉంది.

9th Class Social Textbook Page No.108

ప్రశ్న 8.
కింది పట్టికను పూరించండి.
జవాబు:

అలీషా స్వప్న
రుణాలు ఎందుకవసరం? చెప్పులు తయారీదారుడు. పట్టణంలో పెద్ద వ్యాపారస్థుడు నెలరోజుల సమయంలో 3 వేల జతల షూస్ తయారుచేసి ఇవ్వమని ఆర్డర్ ఇచ్చాడు. గడువు లోపల ఇచ్చిన పని పూర్తి చేయడానికి పేస్టింగ్ గ్రీజు పూయడం, స్టిచ్చింగ్ (చెప్పులు కుట్టడం) మొ||న పనుల కోసం, మరి కొంత మంది పని వారికి నియమించుకోవాలి. ఇంకా చెప్పుల తయారీకి కావలసిన ముడి సరుకులు కొనాలి అందువలన అప్పు చేశాడు. స్వప్న ఒక చిన్న రైతు. తన 3 ఎకరాల భూమిలో వేరుశనగను పండిస్తుంది. పంట పండిన తరువాత వచ్చే డబ్బుతో తను అప్పును తీర్చవచ్చు అనే ఆశతో పంటకయ్యే ఖర్చును వ్యాపారస్థుని నుండి అప్పుగా పొందింది.
రుణం తీసుకోవడం వలన ఎటువంటి హాని జరగవచ్చు? అలీషా అనుకున్న సమయంలో చెప్పులుకుట్టి వ్యాపారస్థునికి ఇచ్చాడు. కాబట్టి లాభం పొందాడు. వేసిన పంట చీడకు గురైనందువలన ఏ విధమైన ఆదాయం రాకపోగా పెట్టిన పెట్టుబడి వృథా అయినది. అందువలన నష్టపోయి అప్పు తీర్చలేని పరిస్థితి ఎదురైంది.
ఫలితమేమిటి? లాభం పొందడం నష్టాలలో చిక్కుకోవడం, కష్టాలలో పడిపోవడం జరిగింది.

ప్రశ్న 9.
అలీషాకు వరుసగా ప్రతి సంవత్సరం ఆర్డర్లు వస్తే ఆరు సంవత్సరాల తరువాత అతను ఎటువంటి స్థితికి చేరుతాడు?
జవాబు:

  1. ఆర్థికంగా ఉన్నత స్థితికి చేరుకుంటాడు.
  2. తరువాత ఆర్డర్లు వచ్చిన అప్పు తీసుకునే అవకాశం ఉండదు.
  3. చిన్న కుటీర పరిశ్రమ లాంటి దానిని స్థాపించడానికి అవకాశం ఉంటుంది.
  4. దానిలో అతను మాత్రమే ఉపాధి పొందడం కాక ఇతరులకు ఉపాధి కల్పిస్తాడు.

AP Board 9th Class Social Solutions Chapter 9 ద్రవ్య వ్యవస్థ – ఋణం

ప్రశ్న 10.
స్వప్న నష్టాల స్థితికి చేరడానికి కారణాలు ఏవి? కింది అంశాలను చర్చించండి.
క్రిమి సంహారక మందులు, వడ్డీవ్యాపారుల పాత్ర, శీతోష్ణస్థితి.
జవాబు:
1. క్రిమిసంహారక మందులు :
ఉపయోగించిన ఈ మందుల వల్ల చీడపోవడం లేదు – కారణం నాణ్యత లోపం, కలీ మందుల వ్యాపారం వంటివి. అందువలన రైతు నష్టపోవడం జరుగుతుంది.

2. వడ్డీ వ్యాపారుల పాత్ర :
రైతులకు అధిక వడ్డీలకు రుణాలను ఇచ్చి పంటలు పండిన తరువాత తమకు అమ్మమనే షరతు పెడతారు. తక్కువ రేటుకు కొంటారు. ఎక్కువ రేటుకు అమ్ముకుంటారు. ఆ విధంగా వారు రెండు విధాలుగా లబ్ధి పొందుతారు.

3. శీతోష్ణస్థితి :
పంటలు పండటానికి వాతావరణం అనుకూలించాలి. అందుకే భారతీయ రైతు ఋతుపవనాలతో జూదం ఆడతాడు అంటారు. సకాలంలో వర్షాలు పడి పంటలు పండితే రైతు గెలిచినట్లు, పడవలసిన సమయంలో వర్షాలు పడక పడరాని సమయంలో వర్షాలు పడి అనావృష్టి, అతివృష్టి వంటి పరిస్థితులు ఏర్పడితే నష్టపోవాల్సి ఉంటుంది. అందువలన రైతులపై ప్రభావం చూపే ప్రధాన అంశాలుగా క్రిమిసంహారక మందులను, వడ్డీ వ్యాపారులను, శీతోష్ణస్థితి వంటి అంశాలను పేర్కొనవచ్చు.

9th Class Social Textbook Page No.109

ప్రశ్న 11.
ప్రజలు అనేక సామాజిక, సాంస్కృతిక విషయాల కోసం రుణాలు తీసుకుంటారు. వివాహ సమయాలలో చేసే అధిక ఖర్చుల కోసం వధూవరుల ఇద్దరి కుటుంబాలు అప్పు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మీ ప్రాంతంలోని ప్రజలు చేసే అప్పులకు ఇతర కారణాలు ఉన్నాయని మీరు భావిస్తున్నారా? మీ పెద్దలు, ఉపాధ్యాయుల నుండి సమాచారాన్ని సేకరించి తరగతిలో చర్చించండి.
జవాబు:
ఇతర కారణాలు ఉన్నాయి. అవి :

  1. అప్పటికే అప్పులలో ఉండటం,
  2. పంటలు సరిగా పండక అప్పులు తీర్చకపోవడం,
  3. ఆభరణాలకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వడం,
  4. కట్న, కానుకలకు అప్పులు చేయడం,
  5. తామే గొప్పగా కనిపించాలి అని అనుకోవడం,
  6. అనారోగ్య పరిస్థితులకు లోనుకావడం వంటి అంశాల వలన కూడా అప్పులు చేస్తారు.

9th Class Social Textbook Page No.110

ప్రశ్న 12.
రుణదాతలు అప్పు ఇవ్వడానికి ఎందుకు పూచీకత్తును అడుగుతారు?
జవాబు:

  1. అప్పు తీసుకునేవారు తమ సొంత ఆస్తులైన భూమి, భవనాలు, వాహనం, పశుసంపద, బ్యాంకులలో డిపాజిట్లు మొదలైన వాటిని పూచీకత్తుగా చూపిస్తారు.
  2. ఇవన్నీ అప్పు పూర్తిగా తీర్చే వరకు రుణదాతకు హామీగా ఉపయోగపడతాయి.

ప్రశ్న 13.
అప్పు తీసుకోవడంలో పూచీకత్తు పేదవారిపై ఎటువంటి ప్రభావాన్ని చూపుతుంది?
జవాబు:

  1. అప్పు తీసుకోవడంలో పూచీకత్తు ప్రధానపాత్ర పోషిస్తుంది.
  2. పూచీకత్తు లేకపోతే ఎవరూ వడ్డీకి ఇవ్వడానికి ముందుకు రారు.
  3. ఒకవేళ ఇచ్చినా ఎక్కువ వడ్డీ వసూలు చేస్తారు.
  4. పేదవారిని తమ వద్ద పనిచేయమని ఒత్తిడి చేస్తారు.
  5. తక్కువ కూలీ ఇస్తారు. తప్పనిసరి పరిస్థితులలో వారు చెప్పే షరతులకు అంగీకరించాల్సి ఉంటుంది.

AP Board 9th Class Social Solutions Chapter 9 ద్రవ్య వ్యవస్థ – ఋణం

ప్రశ్న 14.
సరియైన సమాధానమును ఎంచుకొని ఖాళీలను పూరించండి.
అప్పు తీసుకునేటప్పుడు రుణగ్రహీతలు సులభమైన షరతుల కోసం ఎదురుచూస్తారు. దీని అర్థం ……….. (అధిక / అత్యల్ప) వడ్డీరేటు, ………….. (సులభమైన / కష్టమైన) షరతులతో కూడిన చెల్లింపులు, ……………….. (తక్కువ / ఎక్కువ) సంఖ్యలో చూపాల్సిన పూచీకత్తుగా ఉపయోగపడే ఆస్తులు.
జవాబు:
అత్యల్ప, సులభమైన, తక్కువ.

9th Class Social Textbook Page No.111

ప్రశ్న 15.
పై ఉదాహరణలలో రుణం పొందడానికి ఉపయోగపడే వనరుల జాబితాను రాయండి.
జవాబు:

  1. భూమికి సంబంధించిన వివరాల పత్రం.
  2. పండిన పంటను దాచినట్లు చూపే పత్రం.

ప్రశ్న 16.
అందరికీ రుణం తక్కువ వడ్డీ రేటుతో లభిస్తుందా? ఎవరెవరికి లభిస్తుంది?
జవాబు:
అందరికీ రుణం తక్కువ వడ్డీకి లభించదు.

ఎవరికి లభిస్తుంది అనగా : పంట పొలాలున్న రైతులకు, వ్యాపారస్థులకు, పారిశ్రామికవేత్తలకు, ఇటీవలికాలంలో ఏర్పడిన స్వయం సహాయక బృందాలకు, పండిన పంటలను గోదాములలో దాచినట్లు చూపే హామీపత్రాలు ఉన్న రైతులకు తక్కువ వడ్డీ రేట్లకు బ్యాంకులు రుణాలు అందిస్తాయి.
సరియైన సమాధానం వద్ద (✓) గుర్తును ఉంచండి.
అ. కాలం గడిచే కొద్దీ రమ చేసిన అప్పు
– పెరుగుతుంది. (✓)
– స్థిరంగా ఉంటుంది.
– తగ్గుతుంది.

ఆ. బ్యాంకు నుండి రుణం పొందిన కొద్ది మందిలో అరుణ్ కూడా ఒకడు. దీనికి కారణం
– అతను విద్యావంతుడు.
– బ్యాంకు అడిగే పూచీకత్తును ప్రతి ఒక్కరూ సమర్పించలేరు. (✓)
– వడ్డీ వ్యాపారులు, బ్యాంకులు విధించే వడ్డీరేటు ఒక్కటే.
– బ్యాంకు రుణం పొందుటకు ఎటువంటి దస్తావేజులు (పత్రాలు) అవసరం లేదు.

ప్రశ్న 17.
మీ ప్రాంతంలోని కొందరిని కలిసి మీ దగ్గర ఉన్న రుణ ఏర్పాట్ల వివరాలు సేకరించండి. రుణ షరతులలో ఉన్న తేడాలను నమోదు చేయండి.
జవాబు:
నమ్మకం కలిగిన వ్యాపారస్థుల నుండి, భూస్వాముల నుండి బ్యాంకులు ఏ విధమైన హామీలు లేకపోయినా పెద్ద మొత్తంలో రుణాలు ఇవ్వడానికి ముందుకు వస్తాయి.

అదే పేదవారు అయితే బ్యాంకులకు నమ్మకం ఉండదు. అందువలన వారినీ పూచీకత్తులు అడుగుతాయి.

పూచీకత్తులు చూపించిన తదుపరి రుణాలను అందజేస్తాయి.

ప్రశ్న 18.
శివకామి, అరుణ్, రమ, వాసులకు సంబంధించిన కింది వివరాలు పట్టికలో నింపండి.
జవాబు:
AP Board 9th Class Social Solutions Chapter 9 ద్రవ్య వ్యవస్థ – ఋణం 1

9th Class Social Textbook Page No.114

ప్రశ్న 19.
నియత, అనియత వనరుల నుండి పొందే రుణాలలో గల భేదాలు ఏవి?
జవాబు:

  1. ధనిక కుటుంబాలు తక్కువ వడ్డీతో నియత రుణాలను పొందుతూ ఉంటే పేద కుటుంబాలు అధిక వడ్డీతో అనియత రుణాలను పొందుతున్నారు.
  2. అనగా నియత వనరులు ధనికులకు అందుబాటులో ఉన్నాయి. పేదలకు అందుబాటులో లేవు.
  3. నియత వనరులు తక్కువ వడ్డీరేటుకు లభిస్తాయి. అనియత వనరులకు ఎక్కువ వడ్డీరేటు ఉంటుంది.
  4. నియత వనరులు బ్యాంకులు ద్వారా, సహకార సంస్థల ద్వారా పొందే రుణాలు.
  5. అనియత వనరులు వడ్డీ వ్యాపారస్థుల ద్వారా, వర్తకుల ద్వారా, యజమానుల ద్వారా, బంధువుల ద్వారా, స్నేహితుల ద్వారా పొందే రుణాలు.

ప్రశ్న 20.
ప్రతి ఒక్కరికి సముచితమైన వడ్డీ రేట్లతో ఉన్న రుణాలు ఎందుకు అందుబాటులో ఉండాలి?
జవాబు:

  1. పేదవారు అనియత రుణాలపై ఆధారపడటం వలన ఒక్కొక్కసారి తీసుకున్న మొత్తం సొమ్ము కన్నా వడ్డీ ఎక్కువగా ఉంటుంది.
  2. దానితో వారు తిరిగి చెల్లించడానికి చాలా ఇబ్బంది పడతారు. అందువలన వడ్డీరేటు ఎల్లప్పుడు తక్కువగా ఉండాలి.
  3. వడ్డీరేటు తక్కువగా ఉండే రుణాలు నియత రుణాలు. అనగా బ్యాంకులు, సహకార సంస్థలు ఇచ్చేవి.
  4. అందువలన నియత వనరుల రుణాలు మరిన్ని ప్రదేశాలకు విస్తరించి ప్రతి ఒక్కరూ పొందేలా ఉండాలి.
  5. దానితో పేదప్రజలు తక్కువ వడ్డీపై రుణాలను పొందగలుగుతారు.

AP Board 9th Class Social Solutions Chapter 9 ద్రవ్య వ్యవస్థ – ఋణం

ప్రశ్న 21.
ఆర్.బి.ఐ లాగానే అనియత రుణాలకు పర్యవేక్షణాధికారి ఉండాలా? ఈ పని ఎందుకు కష్టతరం?
జవాబు:

  1. ఆర్.బి.ఐ లాగానే అనియత రుణాలకు పర్యవేక్షణాధికారి ఉండాలి. కానీ చాలా కష్టం.
  2. ఎందుకంటే అనియత రుణాలు ఎవరు ఇచ్చారు? ఎవరు తీసుకున్నారు? అనేది వివాదాస్పదం అయితే తప్ప ఎవరికీ తెలియదు.
  3. ఏ వడ్డీ వ్యాపారస్థుడైనా లేదా ఏ ధనవంతుడైనా మేము ఇంత పైకము వడ్డీకి ఇచ్చాము అని సమాచారాన్ని ఎవరికీ చెప్పరు.
  4. అంతేకాక ఆ లావాదేవీలన్నీ అనధికారికంగా జరుగుతాయి. అధికారికంగా వెల్లడి చేయరు.
    అందువలన పర్యవేక్షణాధికారి ఉండలేరు.

ప్రశ్న 22.
ఆంధ్రప్రదేశ్ రైతుల నిస్పృహకు పేదవారికి నియత రుణాలు తక్కువగా అందడం కూడా ఒక కారణమా? చర్చించండి.
జవాబు:

  1. అవును, అదీ ఒక కారణమే ఎందుకో మన ప్రభుత్వం చెప్పినంతగా బ్యాంకులు వ్యవసాయదారులకు రుణాలు ఇవ్వడం లేదు.
  2. వ్యవసాయం చేసే వారిలో ఎక్కువ మంది కౌలు రైతులు ఉండటం, వారికి యజమాన్యపు హక్కు లేకపోవడం వలన వారికి రుణాలు ఇవ్వడానికి బ్యాంకులు ముందుకు రావడం లేదు.
  3. దానితో వారు నిరాశ నిస్పృహలతో ప్రయివేటు వ్యక్తులను ఆశ్రయించి ఎక్కువ వడ్డీకి రుణాలను పొందవలసి వస్తున్నది.

9th Class Social Textbook Page No.115

ప్రశ్న 23.
బ్యాంకు నుండి పొందే రుణానికి స్వయం సహాయక బృంద సభ్యురాలిగా పొందే రుణానికి గల భేదాలు ఏమిటి?
జవాబు:

  1. బ్యాంకు నుండి పొందే రుణం వ్యక్తిగతం. :
  2. స్వయం సహాయక బృంద సభ్యురాలుగా పొందే రుణం సమష్టిది.
  3. బ్యాంకు నుండి రుణాన్ని వ్యక్తిగతంగా ఎప్పుడైనా తిరిగి చెల్లించవచ్చు.
  4. స్వయం సహాయక బృంద సభ్యురాలుగా పొందే రుణం సభ్యులందరితో కలసి సమష్టిగా చెల్లించాలి.
  5. బ్యాంకు నుండి పొందేది వ్యక్తిగత బాధ్యత. 6. స్వయం సహాయక బృందం పొందేది సమష్టి బాధ్యత.

ప్రశ్న 24.
కొన్ని స్వయం సహాయక బృందాలు’ వారి సభ్యులు తీసుకునే రుణాలకు అధిక వడ్డీని వసూలు చేస్తాయి. ఈ చర్య సరియైనదేనా? చర్చించండి.
జవాబు:

  1. సరియైనది కాదు ఎందువలననగా అన్ని స్వయం సహాయక బృందాలూ ఒకే రకమైన వడ్డీలు వసూలు చేయాలి.
  2. అందరీ పట్లా సమానత పాటించాలి.
  3. ఏ విధమైన వ్యత్యాసం చూపించరాదు.
  4. దానితో వారిలో ఆత్మస్టెర్యం పెరిగి ధైర్యంతో కొత్త కొత్త పనులు చేయడానికి, నూతన ఉత్పత్తులు చేయడానికి ముందుకు వస్తారు.

AP Board 9th Class Social Solutions Chapter 9 ద్రవ్య వ్యవస్థ – ఋణం

ప్రశ్న 25.
స్వయం సహాయక బృందాల సమాఖ్య యొక్క పాత్ర ఏమిటి?
జవాబు:

  1. స్వయం సహాయక బృందాలు గ్రామీణ, పట్టణ పేదప్రజలకు కేంద్రంగా పనిచేస్తాయి.
  2. మహిళలు స్వయం కృషితో ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి మాత్రమే కాకుండా వివిధ సామాజిక సమస్యలైన ఆరోగ్యం , పోషణ, గృహ హింస మొదలైన వాటిని చర్చించి సరియైన చర్యలు తీసుకునే వేదికగా కూడా స్వయం సహాయక బృందాల సమావేశాలు తోడ్పడతాయి.

ప్రాజెక్టు

మీ ప్రాంతంలో ఏ రైతు అయినా ఆత్మహత్య చేసుకున్నాడా? అయితే దానికి కారణాలను తెల్సుకొని ఒక రిపోర్టు తయారు చేసి, వార్తాపత్రికలలో దీనికి సంబంధించిన వార్తలను సేకరించి మీ తరగతి గదిలో చర్చించండి.

మా ప్రాంతంలో ఒకప్పుడు రామయ్య అనే రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. దానికి కారణం అప్పట్లో అనావృష్టి పరిస్థితి ఏర్పడి ఆరుగాలం శ్రమించి కష్టపడి వేసుకున్న పంట చేతికి రాక ఎండిపోతే దానికి పెట్టిన పెట్టుబడి తీర్చలేక ఆత్మహత్య చేసుకున్నాడు.

రిపోర్టు :

అయ్యా,
న్యూస్ పేపర్ మేనేజర్ గారికి
మా ప్రాంతంలో ఒకప్పుడు తీవ్రమైన దుర్భిక్ష పరిస్థితి నెలకొన్నది. వర్షాలు లేక నదులు ఎండిపోయి కాలువల ద్వారా నీరు రాక బావులలో సైతం ఊటలేక ‘చెరువులు ఎండిపోయి తత్ఫలితంగా పొలాలలో వేసిన పంటలు ఎండిపోయి, రైతులు పెట్టిన పెట్టుబడి రాక కుమార్తె పెండ్లి కుదుర్చుకొని పంట పండితే వాటిని అమ్మగా వచ్చిన డబ్బుతో కుమార్తెకు కట్నకానుకలు ఇచ్చి వివాహం చేద్దామనికొని నిర్ణయించుకున్న రామయ్య అనే రైతు చివరికి పెట్టిన పెట్టుబడి కూడా రాక వేసిన పంట ఎండిపోవడం చూసి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. కాబట్టి మేనేజర్ గారు దీనిని వార్తా పత్రికలయందు ప్రచురించి ఇలాంటి నిర్ణయాలు ఎవరిని తీసుకోవద్దు, బ్రతికి ఉంటే ఈ సంవత్సరం పంట పండకపోయిన వచ్చే సంవత్సరం పండుతుంది. ప్రభుత్వం ‘ఈసారి ముందుగానే పరిస్థితిని అంచనావేసి తగిన నిర్ణయాలు తీసుకొని చక్కని ప్రణాళికను రూపొందించి రైతులను ఆదుకుంటుంది, ప్రకృతి సహకరిస్తుంది’ అని రైతులకు తెలియజేయండి. వారిలో మనో ధైర్యాన్ని నింపండి.

ఇట్లు,
రామతేజ,
9వ తరగతి.