Andhra Pradesh BIEAP AP Inter 1st Year Accountancy Study Material 5th Lesson ఆవర్జా Textbook Questions and Answers.
AP Inter 1st Year Accountancy Study Material 5th Lesson ఆవర్జా
స్వల్ప సమాధాన ప్రశ్నలు
ప్రశ్న 1.
ఆవర్ణాను నిర్వచించి, వాటి ప్రయోజనాలు తెలపండి.
జవాబు:
వివిధ ఖాతాల సముదాయమే ఆవర్జా. వ్యక్తిగత, వాస్తవిక, నామమాత్రపు ఖాతాలకు సంబంధించిన అన్ని వ్యవహారములను విడివిడిగా సంబంధిత ఖాతాలలో నమోదు చేయడానికి ఏర్పరచిన పుస్తకాన్ని ఆవర్జా అంటారు. ఎల్.సి. క్రాపర్ ఆవర్జాను ఈ క్రింది విధముగా నిర్వచించినాడు.
“ఒక నియమిత కాలములో జరిగిన వ్యవహారములన్నింటిని, వాటి నికర ఫలితాన్ని తెలుసుకునే విధముగా ఖాతాలకు నెలవైన పుస్తకమే ఆవర్జా వ్యాపార సంస్థ నిర్వహించే పుస్తకాలలో ముఖ్యమైనది ఆవర్జా. వ్యాపార వ్యవహారములను చివరగా ఆవర్జాలోకి నమోదు చేస్తారు. కాబట్టి దీనిని ‘మలిపద్దు’ పుస్తకం అంటారు.
ప్రయోజనాలు :
- అకౌంటింగ్ సమాచారము : ఆవర్జాలో ప్రతి అంశానికి ఒక ఖాతాను ఏర్పాటు చేస్తారు. కాబట్టి యజమానులకు ఎప్పటికప్పుడు గణక సమాచారము లభ్యమవుతుంది.
- సమగ్ర సమాచారము : ఒక ఖాతాకు చెందిన అన్ని వ్యవహారాలు ఒకేచోట లభ్యమవుతాయి. ఆ ఖాతా నిల్వ ఆధారముగా వ్యాపార వ్యవహారాల సమగ్ర సమాచారము తెలుసుకోవచ్చు.
- అంకగణితపు ఖచ్చితము : ఖాతాల నిల్వల ఆధారముగా అంకణాను తయారుచేసినపుడు చిట్టా, ఆవర్జాల తయారీలో దొర్లిన తప్పులను, అంకగణిత తేడాలను తెలుసుకోవచ్చు.
- వ్యాపార ఆర్థిక ఫలితాలు : ఆవర్జా సహాయముతో అంకణాను తయారుచేసి, అంకణా సహాయముతో ముగింపు లెక్కలను తయారుచేయడం ద్వారా వ్యాపార సంస్థ ఆర్థిక పరిస్థితిని తెలుసుకోవచ్చు.
ప్రశ్న 2.
నమోదు అంటే ఏమిటి ? నమోదు ఖాతాలను వివరించండి.
జవాబు:
చిట్టాలోగాని, సహాయక చిట్టాలో గాని నమోదు చేసిన పద్దులు ఆవర్జాలో సంబంధిత ఖాతాను ప్రారంభించి అందులో వ్రాయడాన్ని ‘ఆవర్జాలో నమోదు చేయడం’ అంటారు. చిట్టాలలో రాసిన పద్దులన్నింటిని ఆవర్జాలో వాటికి సంబంధించిన ఖాతాలలో నమోదు చేయడం వలన, ఒక నిర్ణీత కాలానికి సంబంధించిన ఖాతాల నికర మొత్తాలను తెలుసుకోవడానికి వీలవుతుంది.
నమోదుకు సంబంధించిన నియమాలు : చిట్టాపద్దులను ఆవర్జాలోకి నమోదు చేసేటపుడు దిగువ అంశాలను పరిగణనలోకి తీసుకోవలెను.
1) ఖాతాల ఏర్పాటు : ప్రతి వ్యవహారములోను రెండు ఖాతాలు ఉంటాయి. వాటికి వేరు వేరుగా ఆవర్జాలో ఖాతాలను ఏర్పాటుచేయాలి. ఈ ఖాతాలు వ్యక్తిగత, వాస్తవిక, నామమాత్రపు ఖాతాలకు సంబంధించినవై ఉండవచ్చు. ఖాతా నికర ఫలితాన్ని తెలుసుకోవడానికి వ్యాపార వ్యవహారముల డెబిట్, క్రెడిట్ మొత్తాలను సంబంధిత ఖాతాలో నమోదు చేయాలి.
2) చిట్టాపద్దును ఖాతాలో నమోదు : ఖాతా అంశము చిట్టాపద్దులో డెబిట్ పంక్తిలో ఉంటే డెబిట్ వైపు, ఖాతా అంశము ‘క్రెడిట్ పంక్తిలో ఉన్నప్పుడు క్రెడిట్ వైపు నమోదు చేయాలి.
3) TO, By పదములు ; ఖాతాలో డెబిట్ వైపు వివరాల వరసలో To అనే పదముతో, క్రెడిట్ వైపు By” అనే పదముతో ప్రారంభించాలి.
4) ఖాతా నిల్వ : ఖాతాలోని డెబిట్ వరుస మొత్తము, క్రెడిట్ వరుస మొత్తము తేడా ఖాతా నిల్వను సూచిస్తుంది.
లఘు సమాధాన ప్రశ్నలు
ప్రశ్న 1.
ఆవర్జా అంటే ఏమిటి ?
జవాబు:
వాస్తవిక ఖాతాను పరిశీలించినపుడు ఆస్తి యొక్క పుస్తకపు విలువను తెలుసుకోవచ్చు. నామమాత్రపు ఖాతాను చూసినప్పుడు ఏ మేరకు ఖర్చు చెల్లించారో తెలుస్తుంది. ఈ విధముగా వ్యక్తిగత, వాస్తవిక, నామమాత్రపు ఖాతాలకు సంబంధించిన అన్ని వ్యవహారాలను విడివిడిగా సంబంధిత ఖాతాలను ఏర్పాటు చేయడానికి పెట్టిన పుస్తకాన్ని ఆవర్జా
అంటారు.
ప్రశ్న 2.
నమోదు చేయడం అంటే ఏమిటి ?
జవాబు:
తొలిపద్దు. పుస్తకములో నమోదు చేసిన వ్యవహారాలను ఆవర్జాలో వాటి సంబంధిత ఖాతాలలోకి బదిలీ చేసే ప్రక్రియను ఆవర్జాలో నమోదు చేయడం అంటారు. ఆవర్జా నమోదు ప్రతి దినము, వారానికి గాని, నెలకు గాని వ్యాపార సంస్థ సౌలభ్యం, అవసరాన్ని బట్టి చేస్తారు.
ప్రశ్న 3.
ఖాతాల నిల్వలను తేల్చే విధానం.
జవాబు:
ఖాతాలో డెబిట్ మొత్తాలు క్రెడిట్ మొత్తాలకు గల వ్యత్యాసము తెలుసుకోవడాన్ని ఖాతా నిల్వలు తేల్చే ప్రక్రియ అంటారు. నమోదు అయిన తర్వాత డెబిట్ వైపున, క్రెడిట్ వైపున ఉన్న మొత్తాలలో ఎక్కువ మొత్తము నుంచి, తక్కువ మొత్తాన్ని తీసివేస్తే వచ్చే తేడాను తేల్చిన నిల్వగా గుర్తించి, తక్కువవైపు మొత్తము వరుసలో ఆ వ్యత్యాసాన్ని చూపాలి.
ప్రశ్న 4.
బిట్ నిల్వ అంటే ఏమిటో వివరించండి.
జవాబు:
ఖాతాలో క్రెడిట్ వైపు ఉన్న మొత్తము కంటే, డెబిట్ వైపు మొత్తము ఎక్కువగా ఉంటే దానిని డెబిట్ నిల్వ అంటారు.
ప్రశ్న 5.
క్రెడిట్ నిల్వ అంటే ఏమిటి ?
జవాబు:
ఖాతాలో డెబిట్ వైపు ఉన్న మొత్తము కంటే, క్రెడిట్ వైపు మొత్తము ఎక్కువగా ఉంటే దానిని క్రెడిట్ నిల్వ అంటారు.
వ్యాసరూప సమాధాన ప్రశ్నలు
ప్రశ్న 1.
కింద ఇచ్చిన వాటికి చిట్టాపద్దులు రాసి, ప్రహ్లాద్ పుస్తకాల్లో నమోదు చేసి ఖాతాల నిల్వలు తేల్చండి.
సాధన.
ప్రహ్లాద్ పుస్తకాలలో చిట్టాపద్దులు
ఆవర్జా
ప్రశ్న 2.
కింద ఇచ్చిన వివరాల నుంచి పవన్ ఖాతా తయారుచేయండి.
సాధన.
ప్రశ్న 3.
కింద ఇచ్చిన వివరాల నుంచి సుధ ఖాతా తయారుచేయండి.
సాధన.
ప్రశ్న 4.
స్వామి ఖాతా తయారుచేయండి.
సాధన.
ప్రశ్న 5.
కింద ఇచ్చిన వివరాల నుంచి యంత్రం ఖాతా తయారుచేయండి.
సాధన.
ప్రశ్న 6.
కింద ఇచ్చిన వివరాల నుంచి భవ్య ఆవర్జాను తయారుచేయండి.
సాధన.
ప్రశ్న 7.
కింద ఇచ్చిన వివరాలతో ప్రవీణ్ ఖాతాను 31.03.2014 నాటికి తయారు చేయండి.
సాధన.
ప్రశ్న 8.
కింద ఇచ్చిన వివరాలతో వంశీ ఖాతాను తయారుచేయండి.
సాధన.
ప్రశ్న 9.
అనిరుధ్ ఖాతాను తయారుచేయండి.
సాధన.
ప్రశ్న 10.
కింద ఇచ్చిన వ్యాపార వ్యవహారాలకు ముఖేష్ & కంపెనీ పుస్తకాల్లో ఆవర్జాను తయారు చేయండి.
సాధన.
ఆవర్జా