Andhra Pradesh BIEAP AP Inter 1st Year Accountancy Study Material 8th Lesson నగదు పుస్తకం Textbook Questions and Answers.
AP Inter 1st Year Accountancy Study Material 8th Lesson నగదు పుస్తకం
వ్యాసరూప సమాధాన ప్రశ్నలు
ప్రశ్న 1.
నగదు పుస్తకం అర్థాన్ని, ప్రాముఖ్యతను వివరించండి.
జవాబు:
అన్ని సహాయక పుస్తకాలలో నగదు పుస్తకం లేదా నగదు ఖాతా చాలా ముఖ్యమైనది. సంస్థ యొక్క నగదు వ్యవహారాలలో నగదు వసూళ్ళు, నగదు చెల్లింపులు ఉంటాయి. సాధారణముగా వ్యాపార వ్యవహారాలలో నగదు వ్యవహారాలే ఎక్కువ సంఖ్యలో ఉంటాయి. కాబట్టి నగదు వసూళ్ళు, నగదు చెల్లింపులను రికార్డు చేయడానికి ప్రత్యేక నగదు పుస్తకము ఎంతైనా అవసరం. నగదు పుస్తకము నగదు వసూళ్ళను, చెల్లింపులను నమోదుచేసి, వ్యాపార సంస్థకు ఏ సమయములోనైనా నగదు నిల్వను తెలియజేస్తుంది.
నగదు పుస్తకము చిట్టాగా (తొలిపద్దు పుస్తకము), ఆవర్జాగా (మలిపద్దు పుస్తకము), ద్వంద్వ పాత్ర వహిస్తుంది. ఇది ఒక సహాయక చిట్టా. నగదు వ్యవహారములన్నీ మొదటగా నగదు పుస్తకములో రాయడం జరుగుతుంది. అందువలన దీనిని తొలిపద్దు పుస్తకము అంటారు. నగదు పుస్తకములో వ్రాసిన వ్యవహారాలను ఆవర్జాలో ప్రత్యేకముగా నగదు ఖాతా తెరిచి నమోదు చేయవలసిన అవసరము లేదు. అందువలన దీనిని మలిపద్దు పుస్తకము అంటారు. నగదు చిట్టా ప్రాముఖ్యత :
- దీనిని ఒక సహాయక చిట్టాగా పరిగణించవచ్చును.
- ఆవర్జావలె నగదు పుస్తకములో డెబిట్, క్రెడిట్ వరసలు ఉండి, నగదు వసూళ్ళు మరియు చెల్లింపులను నమోదు చేస్తారు.
- కేవలము నగదు వ్యవహారాలు మాత్రమే నమోదు చేస్తారు.
- నగదు పుస్తకము ఎల్లప్పుడు డెబిట్ నిల్వనే చూపుతుంది. కారణము వ్యాపార సంస్థ తాను వసూలు చేసిన మొత్తము కంటే ఎక్కువ చెల్లించలేదు.
- ఏ సమయములోనైనా నగదు నిల్వ ఎంత ఉన్నదీ చెప్పవచ్చును.
ప్రశ్న 2.
వివిధ రకాల నగదు పుస్తకాల గురించి సంక్షిప్త వివరణ ఇవ్వండి.
జవాబు:
వ్యాపార సంస్థ యొక్క అవసరము, పరిమాణము, నిర్వహించే వ్యాపార స్వభావాలను బట్టి, నగదు పుస్తకము స్వరూపము ఉంటుంది. సాధారణముగా వ్యాపార సంస్థలు దిగువ పేర్కొన్న నగదు పుస్తకాలను ఉపయోగిస్తాయి.
1. సాధారణ నగదు పుస్తకము
2. రెండు వరుస నగదు పుస్తకము
- నగదు, డిస్కౌంట్ వరుసలు గల నగదు చిట్టా
- బాంకు,డిస్కౌంట్ వరుసలు గల నగదు చిట్టా
3. మూడు వరుస గల నగదు చిట్టా(నగదు, బాంకు, డిస్కౌంటు వరుసలు)
4. చిల్లర నగదు చిట్టా
1) సాధారణ నగదు పుస్తకము : కొత్తగా ప్రారంభించబడిన వ్యాపార సంస్థలకు వర్తక కార్యకలాపాలు తక్కువగా ఉంటాయి. కాబట్టి, సాధారణ నగదు పుస్తకమును తయారుచేస్తాయి. కేవలం నగదు వ్యవహారాలనే నమోదు చేస్తారు. దీనిలో వ్యవహారాలను అవి జరిగిన కాలక్రమములో నమోదు చేస్తారు. నగదు వసూళ్ళను డెబిట్ వైపు, నగదు చెల్లింపులను క్రెడిట్ వైపు రాయాలి. ఇతర ఖాతాలలో మాదిరి ఈ పుస్తకమును కూడా నిల్వ తేల్చాలి. ఈ పుస్తకమును ప్రతిరోజు నిల్వ తేలుస్తారు.
2) రెండు వరుసలు గల నగదు పుస్తకము :
i) నగదు, డిస్కౌంట్ వరుసలు గల నగదు పుస్తకము : ఈ నగదు పుస్తకములో నగదు వసూళ్ళు, చెల్లింపులతో
పాటు, డిస్కౌంట్ను కూడా నమోదు చేస్తారు. అందువలన దీనిని రెండు వరుసలు గల నగదు పుస్తకము అంటారు. ఒక ఋణదాత తన ఋణగ్రస్తునకు సకాలములో డబ్బు చెల్లించేందుకు ఇచ్చే ప్రేరకాన్ని నగదు డిస్కౌంట్ అంటారు. వ్యాపారస్తుడు తన ఋణదాత నుంచి కొంత రిబేటును నగదు రూపములో పొందినపుడు వచ్చిన డిస్కౌంట్ గాను, అదే విధముగా ఖాతాదారుకు కొంత రిబేటును నగదు రూపములో ఇచ్చినపుడు ఇచ్చిన డిస్కౌంట్గా పరిగణిస్తారు. నగదు వరుసతోపాటు, డిస్కౌంట్ వరుసను కూడా నగదు పుస్తకములో డెబిట్ మరియు క్రెడిట్ వైపు చూపుతారు.
ii) బాంకు, డిస్కౌంట్ వరుసలు గల నగదు పుస్తకము : ఆధునిక వ్యాపార సంస్థలు తమ వ్యాపార కార్యకలాపాలను బాంకుల ద్వారా జరుపుతాయి. నగదు వసూళ్ళు, చెల్లింపులు చెక్కుల ద్వారా జరుగుతాయి. చెక్కును బాంకులో డిపాజిట్ చేసినపుడు నగదు పుస్తకము డెబిట్ వైపు, చెక్కుల ద్వారా చెల్లించినపుడు క్రెడిట్వైపు చూపుతారు. అదేవిధముగా వచ్చిన డిస్కౌంట్ క్రెడిట్ వైపు, ఇచ్చిన డిస్కౌంట్ డెబిట్ వైపు చూపుతారు.
3) మూడు వరుసలు గల నగదు పుస్తకము : పెద్ద పెద్ద వ్యాపార సంస్థలన్నీ తమ వ్యవహారాలను బాంకుల ద్వారా జరుపుతాయి. కాబట్టి నగదు, బాంకు, డిస్కౌంట్ వరుసలు గల నగదు పుస్తకాన్ని తయారు చేస్తాయి. అందువలన దీనిని మూడు వరుసలు గల నగదు పుస్తకము అంటారు.
4) చిల్లర నగదు పుస్తకము : ఈ నగదు పుస్తకములో చిల్లర ఖర్చులను నమోదు చేస్తారు. దీనిని చిన్న షరాబు నిర్వహిస్తాడు. చిన్న షరాబు చేసిన చెల్లింపులకు ఓచర్ను పొందుతాము. ఈ ఓచర్లకు క్రమ సంఖ్యలు వేయడం వలన భవిష్యత్తులో రిఫరెన్సుకు పనికి వస్తుంది.
ప్రశ్న 3.
మూడు వరుసల నగదు చిట్టా ప్రాముఖ్యత తెలియచేసి, ఆ చిట్టా నమూనా చూపండి.
జవాబు:
పెద్ద పెద్ద వ్యాపార సంస్థలన్నీ తమ వ్యవహారాలను బాంకుల ద్వారా జరుపుతాయి. కాబట్టి నగదు, బాంకు, డిస్కౌంట్ వరుసలు గల నగదు చిట్టా తయారు చేస్తాయి. అందువలన దీనిని మూడు వరుసలు గల నగదు చిట్టా అంటారు. వ్యాపార వ్యవహారాలు పెద్ద మొత్తాలలో చేసే వ్యాపార సంస్థలు బాంకులలో ఖాతాలను తెరిచి తమ కార్యకలాపాలను బాంకు ద్వారా జరుపుతాయి. పెద్ద పెద్ద వ్యాపార సంస్థలకు మూడు వరుసల నగదు చిట్టా ద్వారా దిగువ ప్రయోజనాలు కలుగుతాయి.
- మూడు వరుసలు గల నగదు చిట్టా నగదు వసూళ్ళు, నగదు చెక్కుల ద్వారా వసూళ్ళను నమోదు చేయడానికి ఉపయోగపడుతుంది.
- అదే విధముగా నగదు చెల్లింపులు, చెక్కుల ద్వారా చెల్లింపులను నమోదు చేయవచ్చు.
- వివిధ స్వభావము గల నగదు, బాంకు వ్యవహారాలను పెద్ద సంఖ్యలో నమోదు చేయవచ్చు.
- బాంకులో నగదును డిపాజిట్ చేయడం ద్వారా వడ్డీని ఆర్జించవచ్చు. ఎదురు పద్దులను నమోదు చేయవచ్చు. మూడు వరుసలు గల నగదు చిట్టా నమూనా :
ప్రశ్న 4.
మూడు వరుసల నగదు చిట్టా తయారుచేయడంలో గుర్తుంచుకోవాల్సిన ముఖ్య విషయాలను తెలపండి.
జవాబు:
మూడు వరుసలు గల నగదు చిట్టాను తయారుచేసేటపుడు దిగువ అంశాలు గమనించవలెను.
- ప్రారంభపు నిల్వ డెబిట్ వైపు వివరాల వరుసలో To తెచ్చిన నిల్వ అని వ్రాసి నగదు మొత్తాన్ని నగదు వరుసలో, బాంకు మొత్తాన్ని బాంకు వరుసలో రాయాలి. ఒకవేళ బాంకు ఓవర్ డ్రాఫ్ట్ ఇస్తే, క్రెడిట్ వైపు వివరాలలో By తెచ్చిన నిల్వ అని వ్రాసి, మొత్తాన్ని బాంకు వరుసలో చూపవలెను.
- నగదు వసూళ్ళను డెబిట్ వైపు నగదు వరుసలో, నగదు చెల్లింపులను క్రెడిట్ వైపు నగదు వరుసలో వ్రాయవలెను.
- చెక్కు ద్వారా వసూళ్ళను డెబిట్వైపు నగదు వరుసలో వ్రాయవలెను. ఒకవేళ చెక్కును వసూలు అయిన తేదీన బాంకులో వేస్తే నేరుగా డెబిట్ వైపు బాంకు వరసలో వ్రాయాలి. ఎదురుపద్దును వ్రాయకూడదు.
- చెక్కుల ద్వారా చెల్లింపులను క్రెడిట్ వైపు బాంకు వరుసలో నమోదు చేయాలి.
- ఆఫీసు ఉపయోగానికి బాంకు నుంచి నగదును తీసినపుడు, డెబిట్వైపు నగదు వరుసలోను, క్రెడిట్ వైపు బాంకు వరుసలోను నమోదు చేయాలి. ఇది ఎదురుపద్దు అవుతుంది.
- చెక్కు వసూలైనపుడు వాటిని నగదుగా భావించి, డెబిట్వైపు నగదు వరుసలో వ్రాయవలెను. ఈ చెక్కులను తరువాత వసూలుకై బాంకులో వేసినపుడు, నగదును బాంకులో డిపాజిట్ చేసినట్లుగానే డెబిట్ వైపు బాంకు వరుసలోనూ, క్రెడిట్వైపు నగదు వరుసలోను చూపవలెను. ఇది ఎదురు పద్దు అవుతుంది.
- నగదు లేదా బాంకు వ్యవహారాలలో డిస్కౌంట్ ఉన్నప్పుడు ఇచ్చిన డిస్కౌంట్ను డెబిట్ వైపు డిస్కౌంట్ వరుసలోను, వచ్చిన డిస్కౌంట్ను క్రెడిట్వైపు డిస్కౌంట్ వరుసలోను చూపవలెను.
లఘు సమాధాన ప్రశ్నలు
ప్రశ్న 1.
నగదు పుస్తకం ప్రయోజనాలు వ్రాయండి.
జవాబు:
నగదు పుస్తకము వలన ఈ క్రింది ప్రయోజనాలు కలుగుతాయి.
- వ్యాపార సంస్థకు వచ్చిన నగదు (వసూళ్ళు), వ్యాపార సంస్థ చెల్లించిన నగదుకు (చెల్లింపులు) సంబంధించిన వివరాలను తెలియజేస్తుంది.
- ఏ సమయములోనైనా వ్యాపార సంస్థ యొక్క నగదు, బాంకు నిల్వలను తెలుసుకోవచ్చును.
- నగదు పుస్తకము నిల్వ వ్యాపార సంస్థలో ఉన్న నిల్వతో సరిచూసుకోవచ్చు. నగదు పుస్తకపు నిల్వ, చేతిలో ఉన్న నగదు నిల్వతో సరిపోయినట్లయితే, తప్పులు, మోసాలు జరగలేదని భావించవచ్చు.
- నగదు పుస్తకము చిట్టా మరియు ఆవర్జాగా కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి నగదు ఖాతాను తయారు చేయనవసరము లేదు.
ప్రశ్న 2.
నగదు పుస్తకం లక్షణాలను తెలపండి.
జవాబు:
నగదు పుస్తకపు లక్షణాలను దిగువ విధముగా వివరించవచ్చును..
- నగదు పుస్తకము ఒక సహాయక చిట్టా (రోజువారీ పుస్తకము).
- ఇది నగదు వ్యవహారాలను మాత్రమే రికార్డు చేస్తుంది.
- నగదు పుస్తకము నగదు ఖాతాగా కూడా వ్యవహరిస్తుంది.
- నగదు పుస్తకములో డెబిట్ వైపు, క్రెడిట్వైపు ఉంటాయి. నగదు వసూళ్ళు డెబిట్వైపు, నగదు చెల్లింపులు క్రెడిట్ వైపు నమోదు చేస్తారు.
- నగదు పుస్తకము డెబిట్ నిల్వను మాత్రమే చూపుతుంది.
స్వల్ప సమాధాన ప్రశ్నలు
ప్రశ్న 1.
నగదు డిస్కౌంట్
జవాబు:
ఋణదాత, ఋణగ్రస్తునకు తాను చెల్లించవలసిన మొత్తాన్ని గడువు తేదీన గాని, గడువు తేదీ కంటే ముందుగా చెల్లించినట్లయితే ఇచ్చే మినహాయింపు లేదా రిబేటును నగదు డిస్కౌంట్ అంటారు. దీనిని ఋణగ్రస్తుడు స్వీకరించిన నగదు డిస్కౌంట్గా భావిస్తాడు. అదే విధముగా నగదు వసూలైనపుడు డిస్కౌంట్ లేదా రిబేటు ఇవ్వడము జరుగుతుంది. నగదు పుస్తకములో ఈ డిస్కౌంట్లకు వరుసలు రెండు వైపులా ఉంటాయి.
ప్రశ్న 2.
ఇచ్చిన డిస్కౌంట్
జవాబు:
వ్యాపారస్తుడు తన ఖాతాదారుల నుంచి గడువు తేదీ కంటే ముందు (సకాలములో) నగదు వసూలైనపుడు వారిని ప్రోత్సహిస్తూ ఇచ్చే మినహాయింపు మొత్తాన్ని ఇచ్చిన డిస్కౌంట్ అంటారు. దీనిని నగదు పుస్తకములో డెబిట్ వైపు డిస్కౌంట్ వరుసలో వ్రాయాలి.
ప్రశ్న 3.
వచ్చిన డిస్కౌంట్
జవాబు:
వ్యాపారస్తుడు తన ఋణదాతలకు గడువు తేదీ కంటే ముందు మొత్తాన్ని చెల్లించినపుడు పొందే డిస్కౌంట్ను వచ్చిన డిస్కౌంట్ అంటారు. దీనిని నగదు పుస్తకములో క్రెడిట్ వైపు డిస్కౌంట్ వరుసలో వ్రాయాలి.
ప్రశ్న 4.
ఎదురుపద్దు [A.P & T.S. Mar. ’15]
జవాబు:
ఒకే వ్యవహారాన్ని మూడు వరుసల గల నగదు చిట్టాలో డెబిట్వైపు, క్రెడిట్వైపు నమోదు చేస్తే దానిని ఎదురుపద్దు అంటారు. ఎదురుపద్దు నగదు పుస్తకములో రెండు ఖాతాలను అనగా నగదు, బాంకు ఖాతాలను ప్రభావితము చేస్తుంది. నగదుగాని, చెక్కులుగాని బాంకులో డిపాజిట్ చేసినపుడు, ఆఫీసు అవసరాలకై బాంకు నుంచి నగదు తీసినపుడు ఎదురుపద్దు ఏర్పడుతుంది. ఈ రెండు సందర్భాలలోను నగదు, బాంకు వరుసలలోను పద్దులు వ్రాయాలి.
ప్రశ్న 5.
బయానా భర్తీ పద్ధతి
జవాబు:
ఈ పద్ధతిలో నిర్ణీత కాలానికి అనగా వారానికి, నెలకి అయ్యే చిల్లర ఖర్చులకు అయ్యే మొత్తాన్ని ముందుగా అంచనా వేసి, ఆ మొత్తాన్ని చిన్న షరాబుకు చెక్కు ద్వారా ఇస్తారు. చిన్న షరాబు తాను చెల్లించిన ఖర్చులకు తగిన ఓచర్లు తయారు చేసి వారాంతము లేదా నెలాఖరున పెద్ద షరాబుకు సమర్పిస్తాడు. పెద్ద షరాబు ఓచర్లు, చిల్లర నగదు పుస్తకాన్ని తనిఖీ చేసి ఖర్చు పెట్టిన మొత్తానికి చెక్కును జారీ చేస్తాడు. ఖర్చు పెట్టిన మొత్తానికి పెద్ద షరాబు, చిన్న షరాబుకు చెల్లించడం జరుగుతుంది. కాబట్టి దీనిని బయానా భర్తీ పద్ధతి అంటారు.
ప్రశ్న 6.
చిల్లర నగదు చిట్టా
జవాబు:
పెద్ద వ్యాపార సంస్థలు తమ నగదు వ్యవహారములన్నీ బాంకు ద్వారా జరుపుతూ ఉంటాయి. అనగా సంస్థకు వచ్చిన నగదును బాంకులో వేయడం, చెల్లింపులకు చెక్కులు జారీ చేయడం. అయితే ఈ వ్యాపార సంస్థలకు నగదు వ్యవహారములతోపాటు చిల్లర ఖర్చులు కూడా ఉంటాయి. వీటి మొత్తము అతిస్వల్పముగా ఉండి చెక్కుల ద్వారా చెల్లించడం కుదరదు. అందువలన వ్యాపార సంస్థలు తమ వద్ద కొంత చిల్లర నగదును ఉంచుకొని, ఆ నిల్వనుండి చిల్లర ఖర్చులను చెల్లిస్తారు. వీటిని నమోదు చేయడానికి ఉంచిన పుస్తకమును ‘చిల్లర నగదు చిట్టా’ అంటారు.
TEXTUAL PROBLEMS
ప్రశ్న 1.
కింది వివరాల నుంచి 2014 జనవరి 1 తేదీన సాధారణ నగదు పుస్తకాన్ని తయారుచేయండి.
సాధన.
ప్రశ్న 2.
కింద ఇచ్చిన వివరాల నుంచి ఫార్మా ట్రేడర్స్ వారి ఒక వరస నగదు పుస్తకాన్ని తయారుచేయండి.
(సూచన : డిసెంబర్ 15: అరువు కొనుగోలు కాబట్టి నగదు పుస్తకంలో రాదు.
డిసెంబరు 20 :అరువు అమ్మకాలు కాబట్టి ఈ వ్యవహారాలన్ని నగదు పుస్తకంలో రాయకూడదు.)
సాధన.
ప్రశ్న 3.
31.03.2014 తేదీన సాధారణ నగదు పుస్తకాన్ని తయారుచేయండి.
సాధన.
ప్రశ్న 4.
2014 జనవరి 31వ తేదీన కింద ఇచ్చిన వ్యవహారాల నుంచి రెండు వరుసల నగదు చిట్టా తయారుచేయండి.
సాధన.
ప్రశ్న 5.
నగదు, డిస్కౌంట్ వరుసలు గల రెండు వరుసల నగదు చిట్టా తయారుచేయండి.
సాధన.
ప్రశ్న 6.
కింది వివరాల నుంచి రెండు వరుసల నగదు చిట్టా తయారుచేయండి.
(సూచన : ఫిబ్రవరి 20 శ్రీపతికి సరుకు అమ్మకం అరువు వ్యవహారం కాబట్టి నగదు పుస్తకంలో రాయకూడదు)
సాధన.
ప్రశ్న 7.
కింద ఇచ్చిన వ్యవహారాల నుంచి బాంకు, డిస్కౌంట్ వరుసల నగదు పుస్తకాన్ని తయారుచేయండి.
(సూచన : నవంబర్ 17 వంశీకి చెల్లించాల్సింది ? 500, చెల్లించిన మొత్తం కౌ 450 ఈ తేడా (550-450 = 50) వచ్చిన డిస్కౌంట్గా చేయాలి)
సాధన.
ప్రశ్న 8.
మూడు వరుసల నగదు చిట్టాను తయారు చేయండి.
సాధన.
ప్రశ్న 9.
కింద ఇచ్చిన వ్యవహారాల నుంచి మూడు వరుసల చిట్టా తయారు చేయండి.
(సూచన : అక్టోబర్ 9 – ఎదురు పద్దు నమోదు చేయాలి
అక్టోబర్ 25 – ఎదురు పద్దు నమోదు చేయాలి.)
సాధన.
ప్రశ్న 10.
కింద ఇచ్చిన వివరాల నుంచి మూడు వరుసల నగదు చిట్టా తయారుచేయండి.
(సూచన : జనవరి 15 మానస నుంచి సరుకు కొనుగోలు అరవు వ్యవహారం, నగదు పుస్తకంలో రాయకూడదు.
జనవరి 17 ఎదురు పద్దు నమోదు చేయాలి, జనవరి 23 ఎదురు పద్దు నమోదు చేయాలి.)
సాధన.
ప్రశ్న 11.
కింద ఇచ్చిన వ్యవహారాలకు నగదు, బాంకు, డిస్కౌంట్ వరుసల నగదు పుస్తకంలో నమోదు చేయండి.
(సూచన :
1. బాంకు ఓవర్ డ్రాఫ్ట్ నిల్వను నగదు పుస్తకంలో క్రెడిట్ వైపు బాంకు వరుసలో రాయాలి.
2. జనవరి 12 – అనిల్ నుంచి రావాల్సిన మొత్తం 31,000, అనిల్ నుంచి వసూలైన మొత్తం 900.
ఈ తేడా (1,000–900) 100 ఇచ్చిన డిస్కౌంట్ డెబిట్ వైపు డిస్కౌంట్ వరుసలో రాయాలి.
3. జనవరి 3 – ఎదురు పద్దు నమోదు చేయాలి.
జనవరి 14 – ఎదురు పద్దు నమోదు చేయాలి.
జనవరి 19 – ఎదురు పద్దు నమోదు చేయాలి.
సాధన.
ప్రశ్న 12.
కింద ఇచ్చిన వివరాల నుంచి మూడు వరుసల నగదు చిట్టా తయారు చేయండి.
(సూచన : అక్టోబర్ 14, 18, 29 తేదీల్లో వ్యవహారాలకు ఎదురు పద్దు రాయాలి.)
సాధన.
ప్రశ్న 13.
కింది వివరాల నుంచి మూడు వరుసల నగదు చిట్టా తయారు చేయండి.
(సూచన : జనవరి 9, 25 తేదీల వ్యవహారాలకు ఎదురు పద్దు రాయాలి.)
సాధన.
ప్రశ్న 14.
కింద ఇచ్చిన వివరాల నుంచి మూడు వరసల నగదుచిట్టా తయారుచేయండి.
సాధన.
ప్రశ్న 15.
మూడు వరుసల నగదుచిట్టా తయారుచేయండి.
(సూచన : ఫిబ్రవరి 15, 28 తేదీల వ్యవహారాలకి ఎదురు పద్దు రాయాలి.)
సాధన.
ప్రశ్న 16.
కింది వివరాల నుంచి మూడు వరుసల నగదు చిట్టా తయారుచేయండి :
(సూచన : మార్చి 7, 25 తేదీల వ్యవహారాలకు ఎదురు పద్దు రాయాలి.)
సాధన.
ప్రశ్న 17.
కింద వివరాల నుంచి మూడు వరసల నగదు చిట్టా తయారుచేయండి.
(సూచన : మే 7, 14, 19 తేదీల వ్యవహారాలకు ఎదురుపద్దు రాయాలి.)
సాధన.
ప్రశ్న 18.
కింద ఇచ్చిన మిస్టర్ స్టీఫెన్ యొక్క వివరాల నుంచి మూడు వరుసల నగదు చిట్టాను తయారు చేయండి.
సాధన.
ప్రశ్న 19.
కింద ఇచ్చిన మిసెస్ విజయ యొక్క వ్యవహారాల నుంచి మూడు వరుసల నగదు చిట్టా తయారుచేయండి.
సాధన.
ప్రశ్న 20.
విశ్లేషణాత్మక చిల్లర నగదు చిట్టా తయారుచేయండి.
సాధన.
ప్రశ్న 21.
విశ్లేషణాత్మక చిల్లర నగదు చిట్టా తయారుచేయండి.
సాధన.
ప్రశ్న 22.
కింద వివరాల నుంచి విశ్లేషణాత్మక చిల్లర నగదు చిట్టా తయారు చేసి ఆవర్జాలో నమోదు చేయండి.
సాధన.
TEXTUAL EXAMPLES
ప్రశ్న 1.
కింద ఇచ్చిన వ్యాపార వ్యవహారాల నుంచి సాధారణ నగదు పుస్తకం తయారుచేయండి.
(సూచన : జనవరి 22 గిరికి సరుకు అమ్మకాలు – అరువు వ్యవహారం కాబట్టి ఈ వ్యవహారాన్ని నగదు చిట్టాలో రాయకూడదు. )
సాధన.
ప్రశ్న 2.
కింద ఇచ్చిన వ్యాపార వ్యవహారాలకు సాధారణ నగదు పుస్తకం తయారుచేయండి.
సూచన : డిసెంబర్ 28 సూరి నుంచి సరుకు కొనుగోలు అరువు వ్యవహారం. కాబట్టి ఈ వ్యవహారాన్ని నగదు పుస్తకంలో రాయకూడదు.
సాధన.
ప్రశ్న 3.
కింద ఇచ్చిన వ్యవహారాల నుంచి రెండు వరుసల నగదు చిట్టా తయారుచేయండి.
సూచన:
1) అక్టోబర్ 23 ఈ వ్యవహారం అరువు వ్యవహారం కాబట్టి నగదు పుస్తకంలో రాదు.
2) అక్టోబర్ 26 ఈ వ్యవహారం నమోదు చేయడానికి అక్టోబర్ 23వ తేదీన జరిగిన వ్యవహారాన్ని గమనించాలి.
(అశోకికి అమ్మిన సరుకు = 11,200
అశోక్ నుంచి వచ్చిన నగదు = ₹ 11,000
తేడా మొత్తం (₹ 1,200 – ₹ 1,000 = ₹ 200) ఇచ్చిన డిస్కౌంట్గా నమోదు చేయాలి.
సాధన.
ప్రశ్న 4.
కింద ఇచ్చిన వివరాల నుంచి నగదు, డిస్కౌంట్ వరుసల నగదు చిట్టా తయారు చేయండి.
సాధన.
ప్రశ్న 5.
కింద ఇచ్చిన వివరాల నుంచి 31.05.2014 తేదీ నాటికి రెండు వరుసల నగదు చిట్టా తయారుచేయండి.
సాధన.
ప్రశ్న 6.
బాంకు, డిస్కౌంట్ వరుస గల రెండు వరుసల నగదు చిట్టా తయారుచేయండి.
సాధన.
ప్రశ్న 7.
బాంకు, డిస్కౌంట్ వరుస గల రెండు వరసల నగదు చిట్టా తయారుచేయండి.
(గమనిక : నగదు వసూళ్ళు, చెల్లింపులు బాంకు ద్వారా జరపడమైంది.)
సాధన.
ప్రశ్న 8.
కింద ఇచ్చిన వ్యవహారాల్లో ఎదురు పద్దులను గుర్తించి మీ జవాబు సమర్ధిస్తూ వివరణ రాయండి.
సాధన.
2014 జనవరి 1 : ఈ వ్యవహారానికి ఎదురు పద్దు రాయాలి.
వివరణ: బాంకులో నగదు వేసినప్పుడు బాంకు నిల్వ పెరుగుతుంది. నగదు నిల్వ తగ్గుతుంది. అందువల్ల ఈ పద్దును డెబిట్ వైపు బాంకు వరసలో, క్రెడిట్ వైపు నగదు వరసలో నమోదు చేయాలి.
2014 జనవరి 3 : ఈ వ్యవహారానికి ఎదురు పద్దు రాయకూడదు.
వివరణ : చెక్కు వచ్చిన రోజునే బాంకులో డిపాజిట్ చేశారు. అందువల్ల ఈ వ్యవహారం నగదు ఖాతాను ప్రభావితం చేయదు. ఈ వ్యవహారాన్ని డెబిట్ వైపు నేరుగా బాంకు వరుసలో రాయాలి.
2014 జనవరి 6 : ఈ వ్యవహారానికి ఎదురు పద్దు రాయకూడదు.
వివరణ : ఇది నగదు ఖాతాను ప్రభావితం చేయదు. కాబట్టి క్రెడిట్ వైపు బాంకు వరుసలో నమోదు చేయాలి.
2014 జనవరి 8 : ఈ వ్యవహారానికి ఎదురు పద్దు రాయకూడదు.
వివరణ : చెక్కు వచ్చిన రోజున బాంకుకి పంపకుండా మరొక రోజు డిపాజిట్ చేశారు. కాబట్టి ఇది నగదు వసూలుతో సమానం అవుతుంది. దీన్ని డెబిట్ వైపు నగదు వరుసలో నమోదు చేయాలి.
2014 జనవరి 10: ఈ వ్యవహారానికి ఎదురు పద్దు రాయాలి.
వివరణ : బాంకు నుంచి తీసినప్పుడు నిల్వ తగ్గుతుంది. నగదు నిల్వ పెరుగుతుంది. దీన్ని డెబిట్ వైపు నగదు వరుసలో, క్రెడిట్ వైపు బాంకు వరుసలో నమోదు చేయాలి.
2014 జనవరి 14 : ఈ వ్యవహారానికి ఎదురు పద్దు రాయాలి.
వివరణ: జనవరి 8వ తేదీన వచ్చిన చెక్కును జనవరి 14వ తేదీన డిపాజిట్ చేశారు. కాబట్టి దీనికి ఎదురు పద్దు రాయాలి. దీన్ని డెబిట్ వైపు బాంకు వరుసలో, క్రెడిట్ వైపు నగదు వరుసలో నమోదు చేయాలి.
2014 జనవరి 16: ఈ వ్యవహారానికి ఎదురు పద్దు రాయకూడదు.
వివరణ: సొంతవాడకాల కోసం బాంకు నుంచి నగదు తీసినప్పుడు రాయాల్సిన చిట్టా పద్దు ఈవిధంగా ఉంటుంది.
సొంతవాడకాల ఖాతా Dr
To బాంకు ఖాతా
ఈ వ్యవహారం నగదు ఖాతాను ప్రభావితం చేయదు. కాబట్టి ఎదురు పద్దు రాదు. దీన్ని క్రెడిట్ వైపు బాంకు వరుసలో రాయాలి.
ప్రశ్న 9.
కింది వ్యవహారాలకు మూడు వరుసల నగదు చిట్టా తయారుచేయండి.
సాధన.
ప్రశ్న 10.
కింద వివరాల నుంచి నగదు, బాంకు, డిస్కౌంట్ వరుసల నగదు పుస్తకాన్ని తయారుచేయండి.
సాధన.
ప్రశ్న 11.
మూడు వరుసల నగదు చిట్టా తయారుచేయండి.
సాధన.
ప్రశ్న 12.
కింది వివరాల నుంచి విశ్లేషణాత్మక చిల్లర నగదు చిట్టా తయారుచేయండి.
సాధన.
ప్రశ్న 13.
కిందది వివరాల నుంచి విశ్లేషణాత్మక చిల్లర నగదుచిట్టా తయారుచేయండి.
సాధన.