Andhra Pradesh BIEAP AP Inter 1st Year Accountancy Study Material 9th Lesson బ్యాంకు నిల్వల సమన్వయ పట్టిక Textbook Questions and Answers.
AP Inter 1st Year Accountancy Study Material 9th Lesson బ్యాంకు నిల్వల సమన్వయ పట్టిక
వ్యాసరూప సమాధాన ప్రశ్నలు
ప్రశ్న 1.
బ్యాంకు నిల్వల సమన్వయ పట్టిక ఉనికి, ప్రాముఖ్యతను వివరించండి.
జవాబు:
బ్యాంకులో కరెంట్ ఖాతాను తెరిచినపుడు ఒక పుస్తకము ఇవ్వడము జరుగుతుంది. దీనిని పాస్బుక్ అంటారు. ఇది బ్యాంకులో వర్తకునకు లేదా ఖాతాదారుకు చెందిన రికార్డు. వ్యాపారస్తుడు కూడా ఈ వ్యవహారములను నగదు పుస్తకములో బ్యాంకు వరుసలో నమోదు చేస్తాడు. అన్ని పద్దులను ఈ రెండు పుస్తకాలలో ఖచ్ఛితంగా వ్రాసినపుడు నగదు పుస్తకము నిల్వ, పాస్బుక్ నిల్వతో సమానముగా ఉంటుంది. కాని ఆచరణలో ఏదైనా ఒక పాత తేదీన ఈ నిల్వలు సమానముగా ఉండవు. పాసుబుక్ నిల్వ, నగదు పుస్తకము నిల్వలో సమన్వయము చేయడానికి తయారుచేసే పట్టికను బ్యాంకు నిల్వల సమన్వయ పట్టిక అంటారు. ఇంకొకవిధముగా చెప్పాలంటే, ఒక నిర్ణీత తేదీన నగదు పుస్తకము యొక్క బ్యాంకు వరుస, బ్యాంకు పాస్బుక్ నిల్వల మధ్య తేడాలకు గల కారణాలు కనుగొని, వాటిని సమన్వయము చేయడానికి తయారుచేసే నివేదికను బ్యాంకు నిల్వల సమన్వయ పట్టిక అంటారు. దిగువ ప్రయోజనాలను పొందుటకు బ్యాంకు నిల్వల సమన్వయ పట్టికను తయారు చేస్తారు.
- రెండువైపులా జరిగే దోషాలను కనుగొనుటకు,
- మోసాలను, నిధుల దుర్వినియోగాన్ని నివారించడానికి,
- వ్యాపారస్తుడు బ్యాంకు ద్వారా జరిగిన వాస్తవ వ్యవహారాలను తెలుసుకొనవచ్చు,
- చెల్లింపులు చేసినట్లుగా తగిన సాక్ష్యాధారాలను ఏర్పాటుచేయడం కోసము,
- వసూలుకు పంపినా వసూలు కాని చెక్కులకు సంబంధించిన సమాచారము బ్యాంకు ద్వారా గుర్తించవచ్చును.
ప్రశ్న 2.
నగదు చిట్టా నిల్వకు, పాస్బుక్ నిల్వ తేడాకు గల కారణాలను వివరించండి.
జవాబు:
ఒక నిర్ణీత తేదీనాడు నగదు పుస్తకములోని బ్యాంకు నిల్వ, పాస్బుక్ నిల్వ, రెండూ ఒకే మొత్తముతో సమానము కాకపోవడానికి అనేక అంశాలు కారణాలుగా ఉంటాయి. అవి.
1) వ్యవహారములు నగదు పుస్తకములో బ్యాంకు వరుసలో నమోదై, పాస్బుక్ లో నమోదు కాకపోవడం:
- సంస్థకు వచ్చిన చెక్కులను నగదు పుస్తకములో నమోదు చేసి, బ్యాంకుకు పంపకపోవడం. ఈ సందర్భములో చెక్కులు నగదు పుస్తకములో డెబిట్ వైపు మాత్రమే నమోదు అవుతాయి.
- సంస్థ చెక్కులను జారీచేసినా, చెల్లింపుకై బ్యాంకులో దాఖలు కాకపోవడం. ఇవి నగదుచిట్టాలో క్రెడిట్ వైపు మాత్రమే నమోదవుతాయి.
- వ్యాపారస్తుడు చెక్కులను బ్యాంకుకు వసూలుకు పంపగా, సమన్వయ తేదీనాటికి వసూలు కాకపోవడం. ఇది నగదు పుస్తకములో మాత్రమే డెబిట్వైపు నమోదు అవుతాయి.
2) వ్యవహారాలు పాస్బుక్ లో నమోదై నగదు పుస్తకములో నమోదు కాకపోవడం:
i) సంస్థ ఖాతాదారుడు నేరుగా సంస్థ బ్యాంకు ఖాతాలో జమకట్టినపుడు. ఇది పాస్బుక్లో క్రెడిట్ వైపు మాత్రమే నమోదు అవుతుంది.
ii) బ్యాంకు చార్జీలు: బ్యాంకు ఖాతాదారుకు సేవలను అందించినందుకుగాను కొంత మొత్తము చార్జి చేస్తారు. దీనిని బ్యాంకు చార్జీలు అంటారు. దీనిని పాస్ బుక్ లో డెబిట్ చేసినా ఖాతాదారుకు ఈ విషయం తెలిసేంత వరకు నగదు పుస్తకములో నమోదు కాదు.
iii) సంస్థ బ్యాంకుకు ఇచ్చిన స్థాయి ఉత్తర్వుల ప్రకారము బ్యాంకువారు భీమా ప్రీమియం, క్లబ్ బిల్లులు మొదలైన చెల్లింపులు పాస్బుక్ డెబిట్ చేస్తారు. సంస్థకు ఈవిషయం తెలిసేంతవరకు నగదు పుస్తకములో నమోదు చేయరు.
iv) నేరుగా చేసిన డెబిట్: రుణదాతలు వ్యాపారస్తుని అనుమతితో నేరుగా అతని బ్యాంకు ఖాతానుంచి సొమ్మును పొందినపుడు, పాస్బుక్ లో డెబిట్ చేయబడుతుంది. కాని నగదు పుస్తక్తములో నమోదుకానందున రెండు పుస్తకాల నిల్వలలో తేడా వస్తుంది.
v) ఓవర్ డ్రాఫ్ట్ పై వడ్డీ లేదా అప్పుమీద వడ్డీ: అప్పులమీద లేదా ఓవర్ డ్రాఫ్ట్ప చెల్లించిన వడ్డీ పాస్బుక్ లో డెబిట్ వైపు కనపడుతుంది. ఇది నగదు పుస్తకములో నమోదు కానందున రెండు నిల్వలలో తేడా వస్తుంది.
vi) డిపాజిట్లు లేదా పెట్టుబడులపై వడ్డీ: డిపాజిట్ల మీద లేదా పెట్టుబడులపై వసూలు చేసిన వడ్డీ పాస్బుక్లో క్రెడిట్ వైపు ఉంటుంది.
vii) చెక్కులు, బిల్లుల అనాదరణ: సంస్థ ఇచ్చిన చెక్కులు లేదా బిల్లులు సంస్థ ఖాతాలో తగినంత నిల్వ లేనందున అనాదరణ జరగవచ్చు. దీనిని సంస్థ ఖాతాకు డెబిట్ చేస్తారు కాని నగదు పుస్తకములో పద్దు ఉండదు.
3) తప్పుల వలన ఏర్పడే తేడాలు:
- సంస్థ కొన్ని తప్పులను చేయవచ్చు. ఉదా: వ్యవహారమును నమోదు చేయకపోవడం, తప్పుగా నమోదు లేదా తప్పుగా నిల్వ తేల్చడం మొదలగునవి.
- కొన్ని సమయాలలో బ్యాంకు వారు కూడా కొన్ని తప్పులు చేయవచ్చు. వ్యవహారాన్ని తప్పుగా నమోదు చేయడం లేదా వ్యవహారాన్ని వదిలి వేయడం మొదలైనవి. ఈ తప్పుల వలన నగదు పుస్తకము నిల్వ పాస్బుక్ నిల్వతో సమానము కాదు.
ప్రశ్న 3.
ఉదహరించిన అంకెలతో బ్యాంకు నిల్వల సమన్వయ పట్టిక తయారుచేసే పద్ధతిని వివరించండి.
జవాబు:
నగదు పుస్తకములోని నిల్వకు, పాస్ బుక్ లోని నిల్వకు తేడాలున్నప్పుడు వాటిని సమన్వయము చేయడానికి బ్యాంకు నిల్వల సమన్వయ పట్టికను తయారు చేస్తారు. ఈ పట్టికను తయారుచేసే ముందు ఒక పుస్తకములోని నిల్వను కనుక్కోవడానికి రెండవ పుస్తకము నిల్వలో తగిన సర్దుబాట్లను చేయవలసి ఉంటుంది. దీనివలన రెండు నిల్వలకు సమానత్వము ఏర్పడుతుంది.
బ్యాంకు నిల్వల సమన్వయ పట్టికను నెల చివరితేదీన గాని లేదా సంస్థకు ఏ తేదీ అనుకూలముగా ఉంటే ఆ తేదీన గాని తయారుచేయవచ్చును. నగదు పుస్తకము మరియు ప్లాస్బుకు రెండు నిల్వలు ఇచ్చినపుడు, ఈ పుస్తకములు ఒకే కాలానికి సంబంధించినవో, కాదో చూడవలెను. ఈ రెండు పుస్తకాలు వివిధ కాలాలకు చెందినపుడు, రెండు పుస్తకాలలో నమోదైన అంశాలను లెక్కలోకి తీసుకొనవలెను. అలా కాకుండా రెండు పుస్తకములు ఒకే కాలమునకు సంబంధించినవి అయితే రెండు పుస్తకాలలో నమోదుకాని అంశాలను పరిగణించవలెను.
31-3-2014 నాటి బ్యాంకు నిల్వల సమన్వయ పట్టిక
లఘు సమాధాన ప్రశ్నలు
ప్రశ్న 1.
బ్యాంకు నిల్వల సమన్వయ పట్టిక అంటే ఏమిటి?
జవాబు:
నగదు పుస్తకము, పాస్బుక్ నిల్వలను సమన్వయము చేయడానికి తయారుచేసే నివేదికను బ్యాంకు నిల్వల సమన్వయ పట్టిక అంటారు. నగదు పుస్తకము, పాస్బుక్ వేర్వేరు నిల్వలను చూపుతున్నప్పుడు, తేడాలు చూపడానికి గల కారణాలు కనుక్కొని, వాటని సమన్వయము చేయడానికి తయారుచేసే పట్టికను బ్యాంకు నిల్వల సమన్వయ పట్టిక అంటారు. ఈ పట్టికను నిర్దిష్ట కాలానికి అనగా నెలకు లేదా ఆరు నెలలకుగాని తయారుచేస్తారు. బ్యాంకులో తనకున్న నిల్వ మొత్తము లేదా బ్యాంకుకు తాను ఋణపడిన బాకీ మొత్తము ఖచ్చితముగా తెలుసుకోవడానికి వ్యాపారస్తునకు ఈ బ్యాంకు నిల్వల సమన్వయ పట్టిక ఉపయోగపడుతుంది.
ప్రశ్న 2.
అనుకూల నిల్వ అంటే ఏమిటి ?
జవాబు:
నగదు పుస్తకము డెబిట్ నిల్వను చూపుతున్నప్పుడు, పాస్బక్ క్రెడిట్ నిల్వను చూపితే దానిని అనుకూల నిల్వ అని అంటారు. అనుకూల నిల్వ వ్యాపారస్తునకు బ్యాంకులో అతని ఖాతాలో నిల్వ ఉన్నదని సూచిస్తుంది.
ప్రశ్న 3.
ప్రతికూల నిల్వ అంటే ఏమిటి ?
జవాబు:
సంస్థ తన ఖాతాలో ఉన్న నిల్వకంటే ఎక్కువ మొత్తాన్ని బ్యాంకు నుంచి తీసుకున్నప్పుడు ఓవర్ డ్రాఫ్ట్ ఏర్పడుతుంది. వాస్తవ నిల్వ కంటే ఎంత మొత్తము ఎక్కువగా తీసుకుంటారో దానిని మాత్రమే ఓవర్ డ్రాఫ్ట్ అంటారు. దీనినే ప్రతికూల నిల్వ అనికూడా అంటారు.
ప్రశ్న 4.
ఓవర్ డ్రాఫ్ట్ను వివరించండి. [A.P. Mar. ’15]
జవాబు:
ఓవర్ డ్రాఫ్ట్ అనేది బ్యాంకు అందజేసే పరపతి సౌకర్యము. వ్యాపార అవసరాలకు బ్యాంకు మంజూరు చేసిన పరిమితి మేరకు ఖాతాలో ఉన్న నిల్వ కంటే ఎక్కువ మొత్తాన్ని వాడుకోవచ్చు. దీనిని నగదు లేదా చెక్కులను బ్యాంకులో డిపాజిట్ చేయడం ద్వారా తిరిగి చెల్లించవచ్చు. వ్యాపార సంస్థ బ్యాంకు అందచేసిన ఈ ఓవర్ డ్రాఫ్ట్ప వడ్డీని చెల్లించవలసి ఉంటుంది. ఓవర్ డ్రాఫ్ట్ను ప్రతికూల నిల్వ అని కూడా అంటారు.
ప్రశ్న 5.
వసూలు కోసం చెక్కులను బ్యాంకులో డిపాజిట్ చేసినపుడు దాని ప్రభావం చిట్టాపై ఎలా ఉంటుంది ?
జవాబు:
వ్యాపారస్తుడు తన ఖాతాదారులు ఇచ్చిన చెక్కులను వసూలు కోసం బ్యాంకుకు పంపి, తన నగదు పుస్తకములో డెబిట్ చేస్తాడు. అందువలన నగదు పుస్తక్తము నిల్వ ఆ మేరకు పెరుగుతుంది. అయితే బ్యాంకువారు చెక్కులు వసూలుకు వచ్చినంత మాత్రాన వ్యాపారస్తుని ఖాతాకు క్రెడిట్ చేయరు. ఆ చెక్కులు వసూలైనప్పుడు మాత్రమే క్రెడిట్ చేస్తారు. కాబట్టి సమన్వయ తేదీ నాటికి ఇలాంటి చెక్కులు వసూలు కాకపోతే, బ్యాంకు పాస్బుక్లో క్రెడిట్ ఉండదు. ఈ కారణము వలన నగదు పుస్తకము ఎక్కువ నిల్వను, పాస్బుక్ తక్కువ నిల్వను చూపుతాయి.
TEXTUAL PROBLEMS
ప్రశ్న 1.
పాస్బుక్ ప్రకారం నిల్వ ₹ 12,600. పాస్బుక్ నిల్వతో నగదు పుస్తకం నిల్వను పోల్చినప్పుడు క్రింది వ్యత్యాసాలు గుర్తించారు.
a) జారీచేసిన చెక్కులు చెల్లింపుకు దాఖలు కానివి ₹ 2,100.
b) డిపాజిట్ చేసిన, వసూలు కాని చెక్కులు ₹ 1,800.
c) బ్యాంకు చార్జీలు ₹ 175.
d) బ్యాంకు చెల్లించిన బీమా ప్రీమియం ₹1,500.
e) సంస్థ రుణగ్రస్థుడు నేరుగా బ్యాంకులో జమచేసిన మొత్తం ₹ 1,200. నగదు పుస్తకం నిల్వను తెలుసుకోవడానికి బ్యాంకు నిల్వల సమన్వయ పట్టిక తయారుచేయండి.
సాధన.
బ్యాంకు నిల్వల సమన్వయ పట్టిక
ప్రశ్న 2.
30-09-2013 తేదీ నాటి మూర్తి & సన్స్ వారి పాస్బుక్ నిల్వ ₹ 21,700. పాస్బుక్ నిల్వ నగదు పుస్తకంతో పోల్చి చూసినప్పుడు కింది విషయాలు గమనించారు.
a) జారీచేసిన చెక్కులు ఇంకా దాఖలు కానివి ₹ 32,500.
b) సంస్థ ఖాతాదారుడు నేరుగా బ్యాంకులో డిపాజిట్ చేశారు ₹ 3,000.
c) పాస్బుక్లో మాత్రమే క్రెడిట్ అయిన వడ్డీ ₹ 575.
d) డిపాజిట్ చేసినా ఇంకా వసూలు కాని చెక్కులు ₹ 3,500.
e) బ్యాంకు చార్జీలు ₹ 150.
నగదు పుస్తకం నిల్వను తెలుసుకోవడానికి బ్యాంకు నిల్వల సమన్వయ పట్టిక తయారుచేయండి.
సాధన.
సెప్టెంబరు 30, 2013 నాటి మూర్తి & సన్స్ వారి బ్యాంకు నిల్వల సమన్వయ పట్టిక
ప్రశ్న 3.
31-03-2014 తేదీ నాటి గిరి ఇండియా లిమిటెడ్ వారి పాస్బుక్ నిల్వ ₹ 8,900. కింది విషయాలను పరిగణనలోకి తీసుకొని బ్యాంకు నిల్వల సమన్వయ పట్టిక తయారుచేయండి.
a) జారీచేసిన చెక్కులు ఇంకా దాఖలు కానివి ₹ 2,100.
b) డిపాజిట్ చేసినా ఇంకా వసూలు కాని చెక్కులు ₹ 900.
e) బ్యాంకు పాస్బుక్ డెబిట్వైపు పొరపాటుగా నమోదైన వ్యవహారం ₹ 500.
d) పాస్ బుక్ లో మాత్రమే డెబిట్ అయిన బ్యాంకు చార్జీలు ₹ 210.
e) స్థాయి ఉత్తర్వులను అనుసరించి బ్యాంకు వారు నేరుగా చెల్లించిన బీమా ప్రీమియం ₹ 600.
సాధన.
31-3-2014 నాటి గిరి ఇండియా లిమిటెడ్ వారి బ్యాంకు నిల్వల సమన్వయ పట్టిక
ప్రశ్న 4.
బి.బి.ఆర్. లిమిటెడ్ వారి నగదు చిట్టా బ్యాంకు వరుస డెబిట్ నిల్వ ₹ 15,000. పాస్బుక్ నిల్వతో పోల్చగా వ్యత్యాసం కలదు. కింది వివరాలతో బ్యాంకు నిల్వల సమన్వయ పట్టిక తయారుచేసి పాస్బుక్ నిల్వను కనుక్కోండి.
a) జారీచేసిన చెక్కులు ఇంకా దాఖలు కానివి ₹ 4,200.
b) బ్యాంకుకి పంపిన వసూలు కాని చెక్కులు ₹ 5,600.
c) నగదు పుసక్త వసూళ్ళ వరుస అధికంగా కూడటం జరిగింది ₹ 300.
d) సంస్థ కరెంటు ఖాతాపై జారీచేసిన చెక్కు పొరపాటుగా సేవింగ్స్ ఖాతా నుంచి చెల్లించాడు ₹ 2,100.
e) వసూలు కోసం బ్యాంకులో డిపాజిట్ చేసిన చెక్కులను నగదు పుస్తకంలో నమోదు చేయడం మరిచిపోయారు ₹ 900.
సాధన.
బి.బి.ఆర్.లిమిటెడ్ వారి బ్యాంకు నిల్వల సమన్వయ పట్టిక
ప్రశ్న 5.
31-12-2013 తేదీ నాడు రెడ్డినాయుడు అనుకూల నగదు పుస్తకం నిల్వ ₹ 25,500. కింది కారణాల వల్ల నగదు, పాస్బుక్ నిల్వలు సమానంగా లేవు. వీటి ఆధారంగా పాస్బుక్ నిల్వను తెలుసుకోండి.
a) సరితా & కంపెనీ వారి నుంచి పొందిన చెక్కు ₹ 2,450 నగదు పుస్తకంలో రెండుసార్లు నమోదు చేశారు.
b) నగదు పుస్తకం వసూలు వరుస అధికంగా కూడటమైంది ₹ 1,940.
c) సప్లయీరులకు జారీచేసిన మొత్తం చెక్కుల విలువ ఔ 6,000 . అందులో 1,500 చెక్కులు 2-1-2014 నాడు ₹ 2,500; 4-1-2014 నాడు పాస్బుక్లో డెబిట్ అయ్యాయి. మిగిలిన చెక్కులు 31-12-2013 తేదీ లోపలే డెబిట్ చేశారు.
d) డిస్కౌంట్ చేసిన బిల్లు అనాదరణ పొందింది ₹ 750.
e) పాస్బుక్లో క్రెడిట్ అయి, నగదు పుస్తకంలో ఎలాంటి మార్పులేని వ్యవహారాల విలువ ₹ 400.
f) వసూలు కాని చెక్కులు ₹ 1,000.
సాధన.
31 డిసెంబరు 2013 నాటి రెడ్డి వారి బ్యాంకు నిల్వల సమన్వయ పట్టిక
ప్రశ్న 6.
31-12-2013న నగదు పుస్తకం ప్రతికూల నిల్వ ₹ 29,000. కింది విషయాల సహాయంతో బ్యాంకు నిల్వల సమన్వయ పట్టిక తయారుచేయండి.
a) డిపాజిట్ చేసిన, వసూలుకాని చెక్కులు ₹ 4,530
b) సప్లయిదారుడైన కార్తీక్ రెడ్డికి జారీచేసిన చెక్కు, ఇంకా చెల్లింపు కోసం దాఖలు కాలేదు ₹ 5,040.
c) పాస్బుక్ డెబిట్ చేసిన బ్యాంకు చార్జీలు ₹ 600.
d) డిస్కౌంట్ చేసిన 72,000 విలువగల బిల్లు అనాదరణ చెందింది.
సాధన.
31-12-2013 నాటి బ్యాంకు నిల్వల సమన్వయ పట్టిక
ప్రశ్న 7.
ఈ కింది విషయాల ఆధారంగా బ్యాంకు నిల్వల సమన్వయ పట్టిక తయారుచేయండి.
a) నగదు పుస్తకం ప్రకారం ఓవర్ డ్రాఫ్ట్ నిల్వళ్ ₹ 16,100.
b) నగదు పుస్తకం డెబిట్ వైపు తక్కువగా చూపడం జరిగింది ₹ 200.
c) బ్యాంకు వారు నేరుగా వసూలు చేసిన బిల్లులు ₹ 3,500.
d) నగదు పుస్తకంలో బ్యాంకు చార్జీలను రెండుసార్లు నమోదు చేశారు 240.
e) పాస్బుక్లో మాత్రమే నమోదైన చెక్కు వసూలు ₹ 1,100.
f) ‡ 6,000 విలువగల చెక్కులను డిపాజిట్ చేసినా, కాని వాస్తవంగా కేవలం ₹ 2,600 మాత్రమే వసూలు అయ్యాయి.
g) పాస్బుక్లో మాత్రమే నమోదైన పెట్టుబడుల మీద వడ్డీ 2,000.
సాధన.
బ్యాంకు నిల్వల సమన్వయ పట్టిక
ప్రశ్న 8.
ఈ కింద ఇచ్చిన వివరాలతో 31-03-2014 నాటి మనస్వీ & బ్రదర్స్ వారి బ్యాంకు నిల్వల సమన్వయ పట్టిక తయారుచేయండి.
a) బ్యాంకు వారి నివేదిక(పాస్బుక్) ప్రకారం ఓవర్ డ్రాఫ్ట్ నిల్వ ₹ 22,470.
b) చాంబర్ ఆఫ్ కామర్స్కు, స్థాయి ఉత్తర్వులను అనుసరించి బ్యాంకు వారు చెల్లించిన వార్షిక సబ్ స్క్రిప్షన్ ₹ 2,530, నగదు పుస్తకంలో నమోదు కాలేదు.
c) 23–03–2014 నాడు నగదు పుస్తకం క్రెడిట్ వైపు నిల్వ ₹ 1,900 తక్కువగా చూపడం జరిగింది.
d) బ్యాంకులో డిపాజిట్ చేసిన చెక్కు వివరాలు, నగదు పుస్తకంలో లేవు 2,500.
e) నగదు పుస్తకంలో రెండు బ్యాంకు చార్జీల మొత్తాల్లో మొదటిది ₹ 290 రెండుసార్లు నమోదైంది. రెండవ మొత్తం ₹ 120 అసలు నమోదు కాలేదు.
f) బ్యాంకువారు వసూలు చేసిన వాటాలపై డివిడెండ్ ₹ 3,200. ఈ విషయం సంస్థకు సమాచారం లేదు.
g) ₹ 1,850, ₹ 1,500 విలువగల రెండు చెక్కులు జారీచేయగా ₹ 1,850 విలువగల చెక్కు మాత్రమే సమన్వయ తేదీనాటికి చెల్లింపు అయింది.
సాధన.
31.3.2014 నాటి మనస్వీ & బ్రదర్స్ వారి బ్యాంకు నిల్వల సమన్వయ పట్టిక
ప్రశ్న 9.
31-03-2014 న కార్తీక్ బ్యాంకు నిల్వల సమన్వయ పట్టిక తయారు చేయండి.
a) పాస్బుక్ ప్రకారం ప్రతికూల నిల్వ ₹ 6,500.
b) బ్యాంకులో డిపాజిట్ చేసిన ₹ 5,000 చెక్కుల్లో ₹ 2,000 మాత్రమే వసూలు అయ్యాయి.
c) జారీచేసిన చెక్కులు బ్యాంకులో ఇంకా దాఖలు కానివి ₹ 1,500.
d) ఒక ఖాతాదారుడు నేరుగా బ్యాంకులో జమచేసిన మొత్తం ₹ 1,200.
e) బ్యాంకు చార్జీలు ₹ 200; బీమా ప్రీమియం 3 300 పాస్బుక్లో మాత్రమే నమోదు అయ్యాయి.
f) పాస్బుక్లో మాత్రమే క్రెడిట్ అయిన డివిడెండ్ ₹ 300.
సాధన.
31.3.2014 నాటి కార్తీక్ వారి బ్యాంకు నిల్వల సమన్వయ పట్టిక
ప్రశ్న 10.
పి.ఆర్.జి.రావు & సన్స్ వారి 31-03-2014 తేదీ నాటి బ్యాంకు నిల్వల సమన్వయ పట్టిక తయారు చేయండి. [A.P Mar. ’15]
a) నగదు పుస్తకం ప్రకారం ప్రతికూల నిల్వ ₹ 14,500.
b) జారీచేసిన చెక్కులు చెల్లింపులు దాఖలు కానివి ₹ 4,500.
c) ఒక ఖాతాదారుడు నేరుగా బ్యాంకులో జమచేసిన మొత్తం ₹ 3,500.
d) బ్యాంకులో డిపాజిట్ చేసినా వసూలు కాని చెక్కులు ₹ 7,500.
e) పాస్బుక్లో మాత్రమే డెబిట్ చేసిన బ్యాంకు చార్జీలు ₹200.
f) పాస్బుక్లో మాత్రమే డెబిట్ చేసిన ఓవర్ డ్రాఫ్ట్ప వడ్డీ ₹ 500.
సాధన.
31-3-2014 నాటి పి.ఆర్.జి. రావు & సన్స్ బ్యాంకు నిల్వల సమన్వయ పట్టిక
TEXTUAL EXAMPLES
ప్రశ్న 1.
క్రింది సమాచారం నుంచి మెసర్స్ వినాయక ప్లైవుడ్ ఇండ్రస్టీస్ వారి 31-12-2013 నాటి బ్యాంకు నిల్వల సమన్వయ పట్టిక తయారుచేయండి.
a) నగదు పుస్తకం ప్రకారం బ్యాంకు నిల్వ ₹ 25,000.
b) జారీచేసినా ఇంకా చెల్లింపుకు దాఖలు కాని చెక్కులు ₹ 9,500.
c) బ్యాంకులో డిపాజిట్ చేసిన తేదీ 31-12-2013 నాటికి క్రెడిట్ కాని చెక్కులు ₹ 5,300.
d) బ్యాంకు (Electronic Clearing System) ద్వారా వసూలు చేసి క్రెడిట్ చేసిన డివిడెండ్ ₹ 3,500 .
e) బ్యాంకు డెబిట్ చేసిన బ్యాంకు చార్జీలు ₹ 200.
సాధన.
31-12-2013 నాటి మెసర్స్ వినాయక ప్లైవుడ్ ఇండస్ట్రీస్ వారి బ్యాంకు నిల్వల సమన్వయ పట్టిక
ప్రశ్న 2.
మెసర్స్ మాధవి ట్రేడర్స్ వారి తేదీ 31-12-2013 నాటి బ్యాంకు నిల్వల సమన్వయ పట్టిక తయారు చేయండి.
a) 31-12-13 నాటి నగదు చిట్టా ప్రకారం బ్యాంకు నిల్వ ₹ 58,000
b) 25-12-13 న జారీ చేసిన ₹ 25,000 చెక్కులు, 5-1-14 న చెల్లింపుకు బ్యాంకు దాఖలు అయినవి.
c) 21-12-13 న బ్యాంకులో డిపాజిట్ చేసిన ₹ 20,000 చెక్కు, 8-1-14న అనాదరణ పొందింది.
d) బ్యాంకు వసూలు చేసి క్రెడిట్ చేసిన పెట్టుబడులపై వడ్డీ ₹ 1,500. దీనికి నగదు చిట్టాలో పద్దులేదు.
e) పాస్బుక్లో మాత్రమే డెబిట్ అయిన బ్యాంకు చార్జీలు ₹ 120.
సాధన.
31-12-2013 నాటి మెసర్స్ మాధవి ట్రేడర్స్ వారి బ్యాంకు నిల్వల సమన్వయ పట్టిక
ప్రశ్న 3.
కింది సమాచారంతో 30-06-2013 నాటి న్యూఇండియా స్టోర్స్ వారి బ్యాంకు నిల్వల సమన్వయ పట్టిక తయారుచేయండి. [T.S. Mar. ’15]
a) పాస్బుక్ ప్రకారం బ్యాంకు నిల్వ ₹ 1,50,000
b) జూన్ 25వ తేదీన రెండు చెక్కులు ₹ 4,530, ₹ 1,520 విలువ గలవి జారీ చేసినా, జూలై నెలలో ఆ చెక్కులు బ్యాంకుకు దాఖలు అయ్యాయి.
c) ₹ 1,150 విలువ గల చెక్కు వసూలు కోసం బ్యాంకుకు పంపగా, జూన్ 30వ తేదీ వరకు పాస్బుక్లో నమోదు కాలేదు.
d) వడ్డీ ₹ 100, బ్యాంకు కమీషన్ ₹ 460 నగదు చిట్టాలో నమోదు కాలేదు.
సాధన.
జూన్ 30, 2013 నాటి న్యూ ఇండియా స్టోర్స్ వారి బ్యాంకు నిల్వల సమన్వయ పట్టిక
ప్రశ్న 4.
30 ఏప్రిల్ 2013న మెసర్స్ పోసినా బ్రదర్స్ వారి పాస్బుక్ ₹ 45,000 క్రెడిట్ నిల్వ చూపుతోంది.
a) బ్యాంకులో డిపాజిట్ చేసిన చెక్కులు ₹ 10,500 అందులో ₹ 4,500 విలువగల చెక్కులు మాత్రమే ఏప్రిల్ 30 తేదీనాటికి వసూలు అయ్యాయి.
b) జారీచేసిన చెక్కులు 715,000, అందులో ₹ 5,100 విలువ గల చెక్కులు మాత్రమే ఏప్రిల్ 30 తేదీ నాటికి బ్యాంకుకి చెల్లింపుకు దాఖలు కాలేదు.
c) పాస్బుక్లో మాత్రమే క్రెడిట్ చేసిన పెట్టుబడులపై వడ్డీ ₹ 300, డెబిట్ చేసిన బ్యాంకు చార్జీలు ₹ 75. బ్యాంకు నిల్వల సమన్వయ పట్టిక తయారుచేసి, నగదు చిట్టా ప్రకారం బ్యాంకు నిల్వను చూపండి.
సాధన.
30-4-2013 నాటి మెసర్స్ పోసినా బ్రదర్స్ వారి బ్యాంకు నిల్వల సమన్వయ పట్టిక
ప్రశ్న 5.
30-06-2013న మెసర్స్ శ్రీనివాసా ఎంటర్ప్రైజెస్ వారి నగదు పుస్తకం ₹ 9,000 క్రెడిట్ నిల్వను చూపుతుంది. పాస్ బుక్ తో పోల్చగా నిల్వల్లో తేడా ఉన్నట్లు గుర్తించడమైంది.
క్రింది సమాచారంతో బ్యాంకు నిల్వల సమన్వయ పట్టిక తయారు చేయండి.
a) శ్రీ కు వంశీ కృష్ణకు ₹ 500 కు చెక్కును జారీచేయగా, ఇంకా ఆ చెక్కు బ్యాంకుకి దాఖలు కాలేదు.
b) వాటాలపై డివిడెండు బ్యాంకు వసూలుచేసి క్రెడిట్ చేసింది. ₹ 31,000 నగదు పుస్తకం నమోదు కాలేదు.
c) ₹ 350 విలువగల చెక్కు బ్యాంకులో డిపాజిట్ చేయగా, జూన్ 30వ తేదీ వరకు బ్యాంకు క్రెడిట్ చేయలేదు.
d) బ్యాంకు చార్జీచేసిన ఓవర్ డ్రాఫ్ట్ప వడ్డీ ₹ 150 నగదు పుస్తకంలో నమోదు కాలేదు.
e) బ్యాంకు డెబిట్ చేసిన ఇన్సిడెంటల్ చార్జీలు ₹ 100 జూన్ 30వ తేదీ వరకు నగదు పుస్తకం నమోదు కాలేదు.
సాధన.
జూన్ 30, 2013 నాటి మెసర్స్ శ్రీనివాసా ఎంటర్ ప్రైజెస్ వారి బ్యాంకు నిల్వల సమన్వయ పట్టిక
ప్రశ్న 6.
క్రింది సమాచారం నుండి మెసర్స్ స్వామినాథన్ & సన్స్ వారి 31-12-2013 నాటి బ్యాంకు నిల్వల సమన్వయ పట్టిక తయారుచేయండి.
a) నగదు పుస్తకం ప్రకారం ఓవర్ డ్రాఫ్ట్ నిల్వ ₹ 7,000.
b) నగదు పుసక్తం క్రెడిట్వైపు బ్యాంకు వరుసను 100 తక్కువగా రాయడమైంది.
c) వచ్చిన చెక్కులు ₹ 1,000 విలువగలవి బ్యాంకుకి పంపడం జరగలేదు.
d) ₹ 300 విలువ గల చెక్కులు బ్యాంకులో డిపాజిట్ చేశారు. కాని దీనికి సంబంధిత పద్దును నగదు చిట్టాలో రాయలేదు.
e) మెసర్స్ స్వామినాథన్ & సన్స్ స్థాయి ఉత్తర్వు ప్రకారం బ్యాంకు నేరుగా చెల్లించిన బీమా ప్రీమియం ₹ 500.
f) నగదు పుస్తకంలో రెండుసార్లు నమోదు అయిన బ్యాంకు చార్జీలు ₹ 100.
g) ₹ 400 విలువ గల చెక్కుని బ్యాంకు వాపసు చేసింది. దీనికి నగదు పుస్తకంలో పద్దు రాయలేదు. జారీచేసిన రెండు చెక్కులు ₹ 300 విలువ గలవి. సాంకేతిక కారణంవల్ల చెల్లించలేదు, వాపసు చేయని వీటిని నగదు పుస్తకం పద్దులేదు.
h) బ్యాంకు నేరుగా వసూలు చేసిన బిల్లులు ₹ 32,000 నగదు పుస్తకంలో నమోదు కాలేదు.
i) డిస్కౌంట్ చేసిన ₹ 4,000 బిల్లు అనాదరణ పొందింది.
j) ₹ 500 విలువ గల వసూలు చెక్కు రెండుసార్లు నగదు పుస్తకంలో నమోదు అయింది.
k) బ్యాంకు డెబిట్ చేసిన బ్యాంకు చార్జీలు ₹ 100 నగదు పుస్తకంలో నమోదు కాలేదు.
సాధన.
31-12-2013 నాటి మెసర్స్ స్వామినాథన్ & సన్స్ వారి బ్యాంకు నిల్వల సమన్వయ పట్టిక
ప్రశ్న 7.
30-11-2013 మెసర్స్ మురళీ సూపర్ మార్కెట్ వారి బ్యాంకు పాస్ బుక్లో డ్రాఫ్ట్ నిల్వను నగదు పుస్తకంతో పోల్చగా వ్యత్యాసం చూపుతోంది. కింది వివరాలతో బ్యాంకు నిల్వల సమన్వయ పట్టిక తయారుచేయండి.
a) ₹ 5,000 విలువ గల రెండు చెక్కులు బ్యాంకులో డిపాజిట్ చేయగా, అవి డిసెంబర్ 2వ తేదీన క్రెడిట్ అయ్యాయి.
b) ₹ 3,000, ₹ 1,500, ₹ 500 విలువగల మూడు చెక్కులను శ్రీ శంకరయ్య, శ్రీ వెంకటరమణ, శ్రీ సత్యనారాయణకు జారీచేయగా, 30 నవంబరు వరకు చెల్లింపు జరగలేదు.
c) చెక్కులను వసూలు చేయడానికి బ్యాంకు తీసుకున్న బ్యాంకు చార్జీలు 500 నగదు పుస్తకంలో నమోదు కాలేదు.
d) మెసర్స్ మాధవి ట్రేడర్స్ నుంచి వచ్చిన 32,000 విలువ గల చెక్కును నగదు పుస్తకంలో రాసి బ్యాంకుకి పంపడం మరచిపోయారు.
e) ₹ 200 విలువ గల వడ్డీని బ్యాంకు క్రెడిట్ చేసినప్పటికీ, ఈ సమాచారం వ్యాపారస్తునికి పంపించలేదు.
f) ₹ 2,000 విలువ గల రెండు చెక్కులను బ్యాంకు డిపాజిట్ చేయగా అనాదరణ పొందాయి. బ్యాంకు వాటిని పాస్బుక్లో డెబిట్ చేసింది. నగదు చిట్టా పుస్తకంలో నమోదు కాలేదు.
సాధన.
30 నవంబరు 2013 నాటి మెసర్స్ మురళీ సూపర్ మార్కెట్ వారి బ్యాంకు నిల్వల సమన్వయ పట్టిక
ప్రశ్న 8.
30-06-2013 నాటి మెసర్స్ రామకృష్ణ & సన్స్ వారి బ్యాంకు నిల్వల సమన్వయ పట్టిక తయారు చేయండి.
సూచన: నగదు చిట్టా, పాస్బుక్ ఖండికలను ఒకే కాలానికి ఇచ్చినప్పుడు, నగదు పుస్తకం డెబిట్ వైపు, పాస్ బుక్ క్రెడిట్ వ్యవహారాలను నగదు పుస్తకం క్రెడిట్వైపు, పాస్బుక్, డెబిట్ వైపు వ్యవహారాలు పోల్చి రెండు పుస్తకాల్లో నమోదైన వ్యవహారాలను వదిలి, ఒకే పుస్తకంలో నమోదైన వ్యవహారాల తేడాకు గల కారణాలుగా గుర్తించి వాటి సహాయంతో బ్యాంకు నిల్వల సమన్వయ పట్టిక తయారు చేయాలి.
సాధన.
30-06-2013 నాటి మెసర్స్ రామకృష్ణ & సన్స్ వారి బ్యాంకు నిల్వల సమన్వయ పట్టిక
ప్రశ్న 9.
మెసర్స్ దాసరాజు & సన్స్ వారి నగదు పుస్తకం బ్యాంకు వరుసలను, పాస్బుక్ వ్యవహారాలను కింద ఇవ్వడం జరిగింది. రెండు పుస్తకాల నిల్వల తేడాకు గల కారణాలను కనుక్కొని 31-03-2013 నాటి బ్యాంకు నిల్వల సమన్వయ పట్టిక తయారుచేయండి.
సాధన:
సూచన: నగదు పుస్తకం పాస్బుక్ ఖండికలను వేర్వేరు కాలాలకు సంబంధించి ఇచ్చినప్పుడు, ఒక పుస్తకం డెబిట్ వైపు మరో పుస్తకం క్రెడిట్వైపు వ్యవహారాలను, ఒక పుస్తకం క్రెడిట్వైపు, మరో పుసక్తం డెబిట్ వైపు వ్యవహారాలను పోల్చి రెండు పుస్తకాల్లో కనిపించిన వ్యవహారాలను మాత్రమే, రెండు పుస్తకాల నిల్వల తేడాకు గల కారణాలుగా గుర్తించి, వాటి సహాయంతో బ్యాంకు నిల్వల సమన్వయ పట్టిక తయారు చేయాలి.
మార్చి 31, 2013 నాటి మెసర్స్ దాసరాజు & సన్స్ వారి బ్యాంకు నిల్వల సమన్వయ పట్టిక