AP Inter 1st Year Botany Notes Chapter 1 జీవ ప్రపంచం

Students can go through AP Inter 1st Year Botany Notes 1st Lesson జీవ ప్రపంచం will help students in revising the entire concepts quickly.

AP Inter 1st Year Botany Notes 1st Lesson జీవ ప్రపంచం

→ పెరుగుదల, ప్రత్యుత్పత్తి పరిస్థితులను గమనించే సామర్థ్యం, దానికి తగిన అనుక్రియను చూపడం, జీవక్రియ, పునరుత్పత్తి సామర్థ్యం స్వయం సంవిధానం, పరస్పరచర్య, లక్షణాల వ్యక్తీకరణ వంటివి జీవుల ప్రత్యేక లక్షణాలు.

→ మొక్కలలో కణవిభజన ద్వారా పెరుగుదల జీవిత కాలమంతా నిరంతరం జరుగుతుంది.

→ కణవిభజనలు జరిగేవరకు, ఏకకణ జీవులలో కుడా పరిమాణం పెరుగుతుంది.

→ జనకుల లక్షణాలను పోలిన లక్షణాలు కల సంతతిని ఉత్పత్తి చేయుటను బహుకణజీవుల – ప్రత్యుత్పత్తి అంటారు.

→ శిలీంధ్రాలు అలైంగికంగా సిద్ధ బీజాలను ఉత్పత్తి చేసి, వ్యాప్తి చెందుతాయి. ఈస్ట్, హైడ్రా లాంటి నిమ్న జీవులలో పురోహాలు ఏర్పడతాయి.

→ శిలీంధ్రాలు తంతురూప శైవలాలు, నాచులలో ప్రథమతంతువు ముక్కలవడం ద్వారా సంఖ్యలో పెరుగుతాయి.

AP Inter 1st Year Botany Notes Chapter 1 జీవ ప్రపంచం

→ అన్ని జీవులు రసాయినాలతో నిర్మితమై ఉంటాయి. జీవులలో జరిగే రసాయన చర్యల మొత్తాన్ని జీవక్రియ అంటారు.

→ అన్ని మొక్కలు, జంతువులు, శిలీంధ్రాలు మరియు సూక్ష్మజీవులు జీవక్రియను చూపుతాయి.

→ ఏ నిర్జీవి జీవక్రియను ప్రదర్శించదు.

→ అన్ని జీవరాశులకు గల అతి స్పష్టమైన, సాంకేతాకంగా సంక్లిష్టమైన ప్రక్రియ, పర్యావరణ ప్రేరణలకు జీవి అనుక్రియను చూపుట. దీనికి క్షోభ్యత అంటారు.

→ అన్ని జీవరాశులు వాటి పరిసరాలకు అప్రమత్తంగా ఉంటాయి. దీనినే సహ అంటారు.

→ మనకు తెలిసిన, వర్ణించబడిన జాతులు 1.7 నుండి 1.8 మిలియన్ల వరకు ఉంటాయి. దీన్నిజీవ వైవిధ్యం అంటారు. ఇది భూమిపైగల జీవుల సంఖ్య రకాలను సూచిస్తుంది.

→ సేకరించిన జీవి పూర్తిగా కొత్తదా లేక పూర్వం తెలిసి ఉన్నదా అనే విషయాన్ని నిర్ధారించడమే గుర్తింపు.

→ గుర్తించిన జీవికి, ప్రపంచవ్యాప్తంగా ఒకే పేరు పెట్టుటను నామీకరణ అంటారు.

→ గుర్తించిన మొక్కకు అంతర్జాతీయ వృక్ష నామీకరణ నియమాలు (ICBN) ప్రకారం శాస్త్రీయ నామము ఇస్తారు.

→ మొక్కకు 2 పదాలతో కూడిన పేరు పెట్టుటను ద్వినామ నామీకరణ అంటారు. దీనిని లిన్నేయస్ ప్రవేశపెట్టారు.

→ వివిధ రకాల జీవులు, వాటి వైవిధ్యాలు సంబంధ బాంధవ్యాల అధ్యయనాన్ని సిస్టమాటిక్స్ అంటారు.

→ వృక్ష, జంతురాజ్యాలలో కనిష్ట ప్రమాణాన్ని జాతి అంటారు.

→ మౌళికమైన పోలికలు కల జీవుల సముదాయాన్ని జాతి అంటారు.

→ దగ్గర సంబంధాలు కల జాతుల సమూహాలను ప్రజాతి అంటారు.

→ సన్నిహిత సంబంధంకల ప్రజాతుల సముదాయాలను కుటుంబము అంటారు.

→ తక్కువ లక్షణాలతో మాత్రమే సారూప్యతకల వేర్వేరు కుటుంబాలను క్రమం అంటారు.

→ పోలికలు కలిగిన క్రమాలను తరగతి అంటారు.

→ పోలికలు కల తరగతులను విభాగం అంటారు.

→ వివిధ విభాగాలకు చెందిన మొక్కలన్నీంటిని వృక్షరాజ్యంలో ఉంచారు.

→ మొక్కల, జంతుజాతుల సరైన నమూనాల సేకరణ వర్గీకరణ అధ్యయనాలకు మూలాధారము.

→ సేకరించిన వృక్ష నమూనాను ఆరబెట్టి, ప్రెస్చేసి, షీట్లపై భద్రపరిచే ప్రదేశాన్ని హెర్బేరియం అంటారు.

AP Inter 1st Year Botany Notes Chapter 1 జీవ ప్రపంచం

→ ఇంగ్లండ్ లోని ‘క్యూ’ వద్ద ‘రాయల్ బొటానికల్ గార్డెన్’ అతి పెద్ద హెర్బేరియం కలిగి ఉన్నది.

→ హోరాలోని ఇండియన్ బొటానికల్ గార్డెన్స్, లక్నోలోని నేషనల్ బొటానికల్ రిసెర్చి ఇన్స్టిట్యూట్లు భారతదేశంలోని వృక్షశాస్త్ర ఉద్యానవనాలు.

→ భద్రపరచబడిన వృక్ష, జంతునమూనాలు సేకరణలు, అధ్యాయనం కోసం సంప్రదింపులకు మ్యూజియంలు తోడ్పడతాయి.

→ వివిధ రకాల మొక్కలు, జంతువుల మధ్య ఉన్న పోలికలు, వ్యత్యాసాల ఆధారంగా వాటి గుర్తింపుకు తోడ్పడే వర్గీకరణ సహాయకంను ‘కీ’ (key) అంటారు.

→ ఫ్లోరా, మాన్యుయల్లు, మోనోగ్రాఫు, కాటలాగ్లు వర్ణనలు చేయడానికి తోడ్పడతాయి.

→ ప్రరోహాలేర్పడటం : ఇది ఏక కణజీవుల (ఉదా : ఈస్ట్) అలైంగిక ప్రత్యుత్పత్తి పద్ధతులలో ఒకటి. ఈ పద్ధతిలో పక్వస్థితిలో గల జనకుల నుంచి బహిర్జనితంగా పెరిగిన భాగం, కుంచనం ఏర్పడటం ద్వారా వేరై కొత్తజీవిగా అభివృద్ధి చెందుతుంది. స్పృహ : జీవులలో పరిసరాల్ని గ్రహించగల సామర్థ్యమే స్పృహ,

→ విచ్ఛిత్తి : ఏకకణజీవులలో కేంద్రకం, కణద్రవ్య విభజనలవల్ల రెండుగానీ, అంతకంటే ఎక్కువగానీ కొత్త కణాల్ని (జీవుల్ని) ఏర్పరిచే అలైంగిక ప్రత్యుత్పత్తి పద్ధతి.

→ ఫ్లోరా : ఒక ప్రదేశంలో ఉన్న మొక్కల ఆవాసం, వితరణల సమాచారాన్ని, మొక్కల జాబితాను ఒక క్రమపద్ధతిలో కలిగి ఉంటుంది.

→ ముక్కలవడం : ఇది తంతురూప జీవులలో సాధారణంగా గుర్తించబడే శాకీయ ప్రత్యుత్పత్తి పద్ధతి. దీనిలో మొక్క చిన్న చిన్న ముక్కలుగా యాంత్రిక పద్ధతుల ద్వారా విరిగి, ప్రతి ముక్కా కొత్త మొక్కగా అభివృద్ధి చెందుతుంది. పెరుగుదల : ఇది జీవుల పరిమాణంలో జరిగే శాశ్వతమైన, అద్వితమైన వృద్ధి. సాధారణంగా ఇది జీవుల శుష్క భారంలో మార్పుతో ముడిబడి ఉంటుంది.

→ హెర్బేరియం : సేకరించిన వృక్షనమూనాను ఆరబెట్టి, ప్రెస్ చేసి, షీట్లపై భద్రపరచే ప్రదేశాన్ని హెర్బేరియం అంటారు.

→ పరస్థానిక (in vitro) : జీవి ప్రమేయం లేకుండా వెలుపల ఉండే కృత్రిమ వాతావరణం.

→ ICBN : అంతర్జాతీయ వృక్ష నామకరణ నియమావళి.

→ మాన్యుయల్ : ఇది తక్షణ సంప్రదింపు కోసం రూపొందించిన చిన్న పుస్తకం.

→ జీవక్రియ : ఒక జీవి శరీరంలో జరిగే అన్ని రసాయనిక చర్యలను కలిపి జీవక్రియగా పేర్కొంటారు. సరళమైన అణువుల నుంచి సంక్లిష్టమైన అణువులు ఏర్పడే నిర్మాణాత్మక జీవక్రియను నిర్మాణక్రియ (anabolism) అంటారు. సంక్లిష్టమైన అణువులు సరళమైన అణువులుగా విడగొట్టబడే విచ్ఛిన్న జీవక్రియను విచ్ఛిన్నక్రియ (catabolism) అని అంటారు.

→ కాంతి కాలావధి : మొక్కలు పుష్పించే అనుక్రియపై పగలు, రాత్రి సాపేక్ష వ్యవధుల ప్రభావాన్ని కాంతికాలావధి అంటారు.

→ ప్రత్యుత్పత్తి : తల్లిదండ్రులతో దాదాపు సమానమైన లక్షణాలను కలిగిన సంతతిని ఉత్పత్తి చేయడం.

→ సిద్ధబీజం : ఇది ప్రత్యక్షంగా కొత్తమొక్కగా అభివృద్ధి చెందగల అలైంగిక ఏకకణ ప్రత్యుత్పత్తి ప్రమాణం. ఇది వ్యాప్తి చెందడంకోసం అనుకూలనాలను ఏర్పరచుకొని ప్రతికూల పరిస్థితులలో కూడా అనేక కాలాలపాటు జీవించి ఉండగలదు. సిద్ధబీజాలు అనేక బాక్టీరియమ్లు, మొక్కలు, శైవలాలు, శిలీంధ్రాలు, కొన్ని ప్రోటోజోవన్ల జీవిత చక్రంలో ఒక భాగంగా ఉంటాయి. ఉన్నతశ్రేణి మొక్కలలో సిద్ధబీజ మాతృకలలో క్షయకరణ విభజన అనంతరం ఏర్పడే సిద్ధబీజాలను ‘మియోస్పోరులు’ అంటారు. థాలోఫైటాలో సిద్ధబీజాలు సమవిభజన ఫలితంగా ఏర్పడవచ్చు. అట్టి వాటిని ‘మైటోస్పోరులు’ అంటారు.

→ సిస్టమాటిక్స్ : వివిధ రకాల జీవులు, వాటి వైవిధ్యాలు సంబంధ బాంధవ్యల అధ్యాయనాన్ని సిస్టమాటిక్స్ అంటారు.

AP Inter 1st Year Botany Notes Chapter 1 జీవ ప్రపంచం

→ టాక్సన్ (Taxon) : వర్గీకరణ వ్యవస్థలోని ఏ స్థాయికి చెందిన ప్రమాణాన్నైనా లేదా రకాన్నైనా టాక్సాన్ అంటారు. ఈ టాక్సా (బహువచనం) లను వృక్షరాజ్యం నుంచి ఉపజాతుల వరకు క్రమ స్థాయిలో అమరుస్తారు.

→ వర్గీకరణ స్థాయి క్రమం : జీవులను ఆరోహణ క్రమంలో పెద్ద, విస్తృత సముదాయాలుగా అమర్చడం. దీనివల్ల తక్కువ స్థాయి సముదాయాలు ఎప్పుడూ ఉన్నత స్థాయి సముదాయాలలో ఇమడ్చబడతాయి.