Students can go through AP Inter 1st Year Botany Notes 2nd Lesson జీవశాస్త్ర వర్గీకరణ will help students in revising the entire concepts quickly.
AP Inter 1st Year Botany Notes 2nd Lesson జీవశాస్త్ర వర్గీకరణ
→ రెండు రాజ్యాల వర్గీకరణను లిన్నేయస్ ప్రవేశపెట్టారు.
→ బాక్టీరియమ్లు, శైవలాలు, శిలీంధ్రాలు, బ్రయోఫైట్లు, టెరిడోఫైట్లు, వివృతబీజాలు, ఆవృతబీజాలన్నీ మొక్కల కిందే ఉంటాయి.
→ ఐదు రాజ్యాల వర్గీకరణను ఆర్.హెచ్. విటాకర్ ప్రవేశ పెట్టారు. దీనిలో మొనీరా, ప్రొటిస్టా, ఫంగై, ప్లాంటే మరియు ఆనిమేలియాలు కలవు.
→ మొనీరా కాకుండా మిగిలినవన్ని నిజకేంద్రక జీవులే.
→ మొనీరాలో ఆర్కి బాక్టీరియా, యూబాక్టీరియాలు కలవు.
→ ఆకారంను బట్టి బాక్టీరియమ్లు నాలుగు రకాలు అవి గోళాకారం (కోకస్) దండాకారం (బాసిల్లస్) సర్పిలాకారము (స్పైరిల్లమ్) కామా ఆకారం (విబ్రియో)
→ సయనో బాక్టీరియమ్లు ఏకకణంగాను, సహనివేశకంగాను లేదా తంతురూపంలోను ఉంటాయి.
→ కొన్ని జీవులు హెటిరోసిస్ట్ అనబడే ప్రత్యేకమైన కణాలలో వాతావరణంలోని నత్రజనిని స్థాపిస్తాయి. ఉదా : నాస్టాక్, అబీనా
→ మధ్యదరా సముద్రములోని ఎరుపు అలలకు “ట్రైకోడెస్మియం ఎరిథ్రియం” కారణము
→ పరపోషిత బాక్టీరియాలలో అధికభాగం పూతికాహారులు లేక విచ్ఛిన్నకారులు
→ బాక్టీరియాలు ద్విధావిచ్ఛిత్తి ద్వారా ప్రత్యుత్పత్తి జరుపుకుంటాయి.
→ మైకోప్లాస్మాలు కణకవచం లేకుండా బహుళ రూపాలలో ఉండే జీవులు మొక్కలలో మంత్రగత్తె చీపురుకట్ట వ్యాధిని, పశువులలో ఫ్లూరోనిమోనియా, మానవులలో మైకోప్లాస్మల్ యురిథ్రెటిస్ వ్యాధులను కలుగచేస్తాయి.
→ ఆక్టినోమైసిటిస్ శాఖాయుతమైన, తంతురూప బాక్టీరియమ్లు వాటి కణకవచంలో మైకోలిక్ ఆమ్లము ఉంటుంది.
→ ప్రొటిస్టా రాజ్యంలో క్రైసోఫైట్లు, డైనోఫ్లాజెల్లేట్లు, యూగ్లినాయిడ్లు జిగురు బూజులు, ప్రొటోజోవన్లు ఉన్నాయి.
→ ఫంగై రాజ్యం పరిపోషిత జీవులను కలిగిన ప్రత్యేకమై రాజ్యం
→ చాలా శిలీంధ్రాలు పరపోషితాలు. మృతిచెందిన అధస్థ పదార్థాల నుంచి కరిగిన సేంద్రియ పదార్థాలను గ్రహిస్తాయి. వీటిని పూతికాహారులు అంటారు.
→ శాకీయ ప్రత్యుత్పత్తి ముక్కలవడం, కణవిచ్ఛిత్తి, ప్రరోహలేర్పడటం ద్వారా జరుగుతుంది. అలైంగిక ప్రత్యుత్పత్తి కోనిడియంల ద్వారా లేదా గమన సిద్ధబీజాల ద్వారా జరుగుతుంది. లైంగికంగా గోళాకార సిద్ధబీజాలు ఆస్కోసోరులు, బెసీడియోస్టోరుల ద్వారా జరుగుతుంది.
→ ఫంగై రాజ్యంలో ఫైకోమైసిటోస్ (పక్సీనియా), డ్యుటీరోమైసిటీస్ (ఆల్టర్నేరియా) కలవు.
→ ప్లాంటే రాజ్యంలో నిజకేంద్రకయుత, హరితం కల జీవులన్నీ చేర్చారు.
→ ఆనిమేలియా రాజ్యంలో బహుకణయుతమై, కణకవచం లేని కణాలు గల పరపోషిత నిజకేంద్రక జీవులను చేర్చారు.
→ కార్ల్ వోస్ (Carl Wóese) ఆరు రాజ్యాల వర్గీకణను ప్రతిపాదించారు. అవి బాక్టీరియమ్లు, ఆర్కి బాక్టీరియమ్లు, ప్రొటిస్ట్గా, శిలీంధ్రాలు, మొక్కలు, జంతువులు.
→ వైరస్లు కేంద్రకామ్లం, ప్రొటీన్లు కలిగిన అవికల్ప పరాన్నజీవులు.
→ టీ.ఓ. డైనెర్ (T. O. Diener) అనువారు ప్రోటీను కవచం లేని కేంద్రకామ్లం (RNA) కల చిన్న సంక్రమణ కారకాన్ని గుర్తించారు.
→ కొన్ని సంక్రమణకారకాలలో ప్రొటీన్ కవచం ఉంటుంది. కేంద్రికామ్లం ఉండదు. వాటిని ప్రియాన్లు అంటారు.
→ ఒక శైవలం, ఒక శిలీంధ్రం కలసి సన్నిహితంగా ఏర్పడిన మొక్కలను లైకెన్లు అంటారు. లైకెన్ ని శైవలమును ఫైకోబయాంట్ అని, శిలీంధ్రంను మైకోబయాంట్ అని అంటారు.
→ సూక్ష్మజీవనాశకాలు : ఇవి సూక్ష్మజీవులు ఉత్పత్తి చేసే రసాయనిక పదార్థాలు. ఇతర సూక్ష్మజీవుల పెరుగుదలను నిరోధించడం లేదా చంపగల సామర్థ్యం ఉన్నవి.
→ నిశ్చల సిద్ధబీజాలు : చలనరహితమైన, పలచటి గోడలు ఉన్న సిద్ధబీజాలు.
→ ఆస్కోకార్ప్ : ఇది (ఆస్కోమైసిటిస్కు చెందిన శిలీంధ్రాలలోని ఫలనాంగం.
→ ఆస్కోస్పోర్ : ఇది ఆస్కస్ (ఆస్కోకార్స్లోనిది) లో ఉత్పత్తి అయ్యే సిద్ధబీజం.
→ స్వయం పోషితాలు : అసేంద్రియ పదార్థాల నుంచి వాటి ఆహార పదార్థాలను తయారు చేసుకోగల జీవులు.
→ బెసీడియోకార్ప్ : ఇది బెసిడియోమైసిటీస్ తరగతికి చెందిన శిలీంధ్రాలలో గల ఫలనాంగం.
→ బెసీడియోస్పోర్ : ఇది బెసీడియం ఉత్పత్తిచేసే (బెసీడియోకార్ప్ లోనిది) సిద్ధబీజం.
→ జీవవాయువు (బయోగ్యాస్) : జంతువుల పేడలాంటి జీవద్రవ్యరాశి నుంచి అవాయుసహిత కిణ్వనం ద్వారా ఉత్పత్తి చేయబడుతుంది. దీనిలో 50-70 శాతం మీథేన్, 30-40 శాతం కార్బన్-డై-ఆక్సైడ్, ఉదజని, నత్రజని, హైడ్రోజన్ సల్ఫైడ్లు అతి సూక్ష్మమైన పాళ్ళలో ఉంటాయి.
→ జీవసందీప్తి : ఇది జీవులు బహిర్గతం చేసే కాంతి.
→ రసాయనిక స్వయంపోషితాలు : వివిధ అసేంద్రియ పదార్థాల ఆక్సీకరణ ద్వారా విడుదలైన శక్తిని ఉపయోగించుకొని ఆహారాన్ని తయారు చేసుకొనే జీవులు.
→ నిజ కేంద్రక జీవులు : జన్యుపదార్ధమైన DNA క్రొమాటిన్ రూపంలో సంవిధానం చెంది నిజమైన కేంద్రకాన్ని కలిగివున్న జీవులు. వీటిలో త్వచంతో ఆవరించబడిన అనేక కణాంగాలు ఉంటాయి.
→ ఆవాసం : ఒక జీవి సాధారణంగా నివసించే సహజ ప్రదేశం లేదా ప్రాంతం.
→ ఏకస్థితిక జీవిత చక్రం (haplontic) : ఏకస్థితిక దశలు ప్రాధాన్యం కలిగి, ద్వయస్థితిక దశ సంయుక్త బీజానికి మాత్రమే పరిమితమైన జీవిత చక్రం.
→ గుల్మం : చేవదేరిన భాగాలేవీ లేకుండా ఉన్న చిన్న నాజూకైన మొక్క
→ పరపోషితాలు : వాటి ఆహార పదార్ధాన్ని అవి తయారు చేసుకోలేవు. కానీ ఇతర జీవులపై కాని లేదా నిర్జీవమైన సేంద్రియ పదార్థాలపై కానీ వాటి ఆహారం కోసం ఆధారపడే జీవులు.
→ హోలోఫైటిక్ : స్వయంపోషిత పోషణనే హోలో ఫైటిక్ పోషణ అని కూడా అంటారు.
→ జాంతవ భక్షణ పోషణ : ఘనరూపంలో గల సేంద్రియ ఆహార పదార్థాలను నేరుగా లోపలికి తీసుకోవడం పోషణ పొందగలగడం.
→ కారియోగమీ : ‘రెండు కేంద్రకాల కలయిక’.
→ శిలీంధ్ర మూలాలు : శిలీంధ్రానికి, నాళికాయుత మొక్కల వేర్లకు మధ్య ఉన్న సన్నిహిత సంబంధం వల్ల ఇవి ఏర్పడతాయి. మొక్క వేర్ల ఫాస్పేట్ శోషణను పెంపొందిస్తాయి. అందుకే, వీటిని జీవ ఎరువులుగా ఉపయోగిస్తారు.
→ నత్రజని స్థాపన : వాతావరణంలోని ద్వినత్రజని అమ్మోనియా లేదా నైట్రేట్ లాంటి స్థిరమైన రూపంలోకి మార్పు చెందే ప్రక్రియనే నత్రజని స్థాపన అంటారు.
→ అవికల్ప పరాన్నజీవులు : వికల్ప పరాన్నజీవికి భిన్నంగా ఈ పరాన్నజీవి స్వతంత్రంగా అంటే పరాన్న జీవిగా కాకుండా జీవితం గడపలేదు.
→ గోళాకార సంయుక్త బీజం (oospore) : ఇది ఫలదీకరణ చెందిన స్త్రీబీజ కణం లేదా సంయుక్త బీజం. ముఖ్యంగా మందమైన ఖైటిన్ సహిత గోడను కలిగి ఉండేది.
→ పామెల్లా దశ : కొన్ని కశాభాయుత ఆకుపచ్చ శైవలాలు లేదా మొక్కలవంటి ప్లాజెల్లేట్ల లేదా కశాభాయుత జీవుల జీవిత చక్రంలో ఏర్పడే చలనరహిత, కశాభారహిత విడికణాల సమూహం.
→ పరాన్న జీవులు : ఇవి ఆహారం కోసం ఇతర జీవులపై ఆధారపడతాయి.
→ కాంతి స్వయం పోషితాలు : ఇవి సూర్యరశ్మిలోని శక్తిని వినియోగించుకొని సరళ పదార్థాల నుంచి ఆహారాన్ని తయారు చేసుకొనే జీవులు.
→ ప్లవకాలు : ఇవి నీటి అలలపై అచేతనంగా తేలే చిన్న జీవులు.
→ ప్లాస్మోడియం : జిగురు బూజులలోని (శిలీంధ్రాలలోని) ప్లాస్మాత్వచంతో కూడి వున్న బహు కేంద్రకయుత జీవపదార్థ ద్రవ్యరాశిని ప్లాస్మోడియం అంటారు.
→ ప్లాస్మోగమీ : ‘చలన లేక చలనరహిత సంయోగ బీజాల జీవ పదార్థాల కలయిక.
→ ప్లియోమార్ఫిక్ : ఒక జీవి తన జీవిత చరిత్రలో ఒకటి కంటే ఎక్కువ విడి రూపాలలో ఉండటాన్ని ప్లియోమార్ఫిక్ అంటారు. పరభక్షి : తన ఆహారం కోసం వేరొక జంతువును చంపి తినే జంతువు.
→ ప్రియాన్లు : ప్రోటీన్ కవచం కలిగి, కేంద్రకామ్లం లేకుండా ఉన్న వ్యాధికారక క్రమములు.
→ స్పోరోజోవన్లు : జీవిత చక్రంలో సంక్రామక సిద్ధబీజం కల వాటిని స్పోరోజోవన్లు అంటారు.
→ కేంద్రకపూర్వ జీవులు : కణాలలో కేంద్రకం లేని లేదా ఇతర కణాంగాలు త్వచరహితంగా గల జీవులు. వీటి జన్యు పదార్థం క్రొమాటిన్ రూపంలో సంవిధానం చెంది ఉండదు.
→ పూతికాహారులు : ఇవి ఆహారం కోసం మృతిచెందిన లేదా నిర్జీవ సేంద్రియ పదార్థాలపై ఆధారపడి ఉంటాయి. పొదలు : ఇవి గుబురుగా పెరుగుతూ చేవదేరిన బహువార్షిక మొక్కలు.
→ సిద్ధబీజం : ఇది ప్రత్యక్షంగా కొత్తమొక్కగా అభివృద్ధి చెందగల అలైంగిక ఏకకణ ప్రత్యుత్పత్తి ప్రమాణం. ఇది వ్యాప్తి చెందడం కోసం అనుకూలనాలను ఏర్పరచుకొని ప్రతికూల పరిస్థితులలో కూడా అనేక కాలాలపాటు జీవించి ఉండగలదు. సిద్ధబీజాలు అనేక బాక్టీరియమ్లు, మొక్కలు, శైవలాలు, శిలీంధ్రాలు, కొన్ని ప్రోటోజోవన్ల జీవిత చక్రంలో ఒక భాగంగా ఉంటాయి. ఉన్నతశ్రేణి మొక్కలలో సిద్ధబీజమాతృకలలో క్షయకరణ విభజన అనంతరం ఏర్పడే సిద్ధబీజాలను ‘మియోస్పోరులు’ అంటారు. ధాలోఫైటాలో సిద్ధబీజాలు సమవిభజన ఫలితంగా ఏర్పడవచ్చు. అట్టి వాటిని ‘మైటోస్పోరులు’ అంటారు.
→ సహజీవులు : రెండు భిన్న జీవుల మధ్యగల సహసంబంధంలో రెండూ పరస్పరం లబ్ది పొందడాన్ని సహజీవనం అని అలాంటి జీవులను సహజీవులు అని పిలుస్తారు.
→ వృక్షం : ఇది ఒక పెద్ద చేవదేరిన బహువార్షిక మొక్క
→ గమనసిద్ధబీజం : కొన్ని శైవలాలు, శిలీంధ్రాలలో కశాభాల సహాయంతో చలించగల అలైంగిక సిద్ధబీజం. దీనిని చలత్కసిద్ధబీజం (swarm spore) అని కూడా అంటారు.