Students can go through AP Inter 1st Year Botany Notes 13th Lesson ఆవరణ సంబంధ అనుకూలనాలు, అనుక్రమం, ఆవరణ సంబంధ సేవలు will help students in revising the entire concepts quickly.
AP Inter 1st Year Botany Notes 13th Lesson ఆవరణ సంబంధ అనుకూలనాలు, అనుక్రమం, ఆవరణ సంబంధ సేవలు
→ రామేవ్ మిశ్రాను భారతదేశంలో ఆవరణశాస్త్ర పితగా పరిగణిస్తారు.
→ ఆయన ఆగష్టు 26, 1908న జన్మించారు.
→ మిశ్రాకు గౌరవ సూచకంగా ఇండియన్ నేషనల్ సైన్స్ అకాడమి, ప్రపంచ ఆర్ట్స్, సైన్స్ అకాడమి వారు ప్రోత్సాహకాలను ఇచ్చి సత్కరించారు. ఆవరణశాస్త్రంలో గౌరవప్రదమైన సంజయ్గాంధీ అవార్డును బహూకరించారు.
→ జీవులలోని, జీవులమధ్య, భౌతిక పరిసరాలతో జీవులకు గల సంబంధాన్ని తెలిపే జీవశాస్త్ర విభాగాన్ని ఆవరణశాస్త్రం అంటారు.
→ యూజెన్ వార్మింగ్ అనే డానిష్ వృక్షశాస్త్రవేత్త మొక్కలకు నీటికి ఉన్న సంబంధాలను అనుసరించి మూడు ఆవరణ సమూహాలను వర్గీకరించారు. అవి నీటి మొక్కలు, మధ్యరకపు మొక్కలు మరియు ఎడారి మొక్కలు.
→ పూర్తిగా నీటిలోగాని, బాగా తడిగా ఉన్న నేలలో పెరిగే మొక్కలను నీటి మొక్కలు అంటారు. నీటిలో పెరిగే విధానాన్ని బట్టి, ఇవి 5 రకాలు.
→ జలాభావ పరిస్థితులు లేదా నీరు అధికంగా లేని పరిస్థితులు ఉండే ఆవాసాలలో పెరిగే మొక్కలను పెరిగే మొక్కలను మధ్యరకపు మొక్కలు అంటారు.
→ నీరు లోపించిన జలాభావ పరిస్థితులలో పెరిగే మొక్కలను ఎడారి మొక్కలు అంటారు. ఇవి అల్పకాలికాలు, రసభరితమొక్కలు, రసభరితం కాని మొక్కలుగా వర్గీకరించారు.
→ ఒక ప్రదేశంలో క్రమాను గతంగా జాతుల సంఘటనలో ఊహించగల మార్పులు జరగడాన్ని ఆవరణసంబంధ అనుక్రమము అంటారు.
→ ఎలాంటి జీవజాతులు లేని చోట అనగా నగ్నశిలాప్రదేశాలలో మొదలయ్యే ప్రక్రియను ప్రాథమిక అనుక్రమం అంటారు.
→ ఒక ప్రదేశంలో మొదట ఉన్న జీవ సముదాయాలు నాశనం చేయబడిన తర్వాత మొదలయ్యే ప్రక్రియను ద్వితీయ అనుక్రమం అంటారు. ఉదా : పాడుబడిన వ్యవసాయ భూములు, చెట్లు నరకడం వల్ల నాశనమైన అరణ్యాలు.
→ నీరు లేక నీటి పరిసరాలలో ప్రారంభమయ్యే అనుక్రమంను జలక్రమకం అంటారు.
→ శుష్క ఆవాసాలలో ప్రారంభమయ్యే అనుక్రమంను జలాభావ క్రమకం అంటారు.
→ బంజరుభూమిలో మొదట ఆవాసం ఏర్పరుచుకొను మొక్కలను మార్గదర్శక మొక్కలు అంటారు.
→ జీవ, నిర్జీవ అనుఘటకాల మధ్య జరిగే చర్యలను ఆవరణ వ్యవస్థ అంటారు.
→ ఆవరణ వ్యవస్థ అనుపదమును A.G. టాన్స్ ప్రతిపాదించారు.
→ భూమండలంను అతిపెద్ద ఆవరణ వ్యవస్థ అంటారు.
→ పుష్పాలలోని అండాశయాల ఫలధీకరణను అవసరమైన పరాగరేణువులు మార్పిడి, ముఖ్యమైన ఆరోగ్యవంతమైన ఆవరణవ్యవస్థలోని భాగము.
→ ప్రపంచంలో ఆహారధాన్యాల అధిక ఉత్పత్తిలో పరాగసంపర్క సహకారులు ప్రధానపాత్ర వహిస్తాయి.
→ వ్యవసాయ సంబంధ ఉత్పత్తులలో ప్రధానపాత్ర పోషించే పరాగ సంపర్క సహకారి-తేనెటీగ.
→ 1,00,000 పైగా అకసేరుక జాతులు (తేనెటీగలు, సీతాకోకచిలుకలు, ఈగలు) ప్రపంచవ్యాప్తంగా పరాగసంపర్క సహకారులుగా పనిచేస్తున్నాయి.
→ మీ ఇళ్ళలోను, పరిసరాలలోను వాడే కీటకనాశకాల స్థాయిని తగ్గించి పరాగసంపర్క సహకారులను రక్షించవచ్చు.
→ ఒకసంవత్సర కాలంలో 10మంది వ్యక్తులకు కావలసిన 02 ను ఒక పత్రయుత ప్రౌఢ మొక్క ఒక ఋతువులో విడుదల చేస్తుంది.
→ పూర్తిగా ఎదిగిన మొక్క 48 lbs CO2 ను ఒక సంవత్సరకాలంలో శోషించి విడుదలచేసే O2 ఇద్దరు మనుషులకు సరిపోతుంది.
→ కొన్ని సూక్ష్మజీవులు, ప్రధానంగా సయనోబాక్టీరియాలు O2 ను ప్రత్యక్షంగా విడుదల చేస్తాయి.
→ సైకిల్ లేక నడక, ప్రజారవాణా వ్యవస్థను వాడటం ద్వారా సహజవనరులను రక్షించడం, కాలుష్యాన్ని తగ్గించడం ఆరోగ్యసంబంధ లాభాలను ఆస్వాదించడంవల్ల ఆవరణ సంబంధ విధులు కొనసాగించవచ్చు.
→ ఉద్యానవనాలలో స్థానికమొక్కలను పెంచడం, వన్యప్రాణులకు ఆవాసాన్ని ఏర్పరచాలి.
→ అనుకూలనాలు : జీవులు వాటి ప్రవర్తనా సంబంధ, శరీర ధర్మ సంబంధ అంశాలలో మార్పులకు లోనవుతూ క్రమంగా పరిసరాలతో సమతుల్యతను చూపే ప్రక్రియ.
→ బయోమ్లు : ఇది ఒక ప్రధానమైన ఆవరణ సంబంధ సముదాయం. ఇది అధిక భాగం ఆక్రమించి ఉంటుంది. సాధారణంగా ప్రధానమైన మొక్కల లక్షణాలచే గుర్తింపబడుతుంది.
→ జీవావరణం : జీవులు ఆవాసం చేసే ప్రపంచంలోని అన్ని ఆవరణ వ్యవస్థలతో కూడిన ప్రదేశం. ఈ భూమండలాన్ని “మహా ఆరవరణ వ్యవస్థ” గా భావిస్తారు.
→ సముదాయాలు లేదా సంఘాలు : ఒక ప్రాంతంలో నివసించే వివిధ జాతులకు చెందిన అనేక జనాభాల సమూహాన్ని సంఘం లేదా సముదాయం లేదా జీవుల సముదాయం అంటారు.
→ ఆవరణ వ్యవస్థ : ప్రకృతిలో ఇది క్రియాత్మక ప్రమాణం. జీవ నిర్జీవ అనుఘటకాల మధ్య జరిగే పరస్పర చర్యలను ఆవరణ వ్యవస్థ అంటారు. ఈ పదాన్ని ప్రతిపాదించింది ఎ.జి. టాన్.
→ ఆవరణసంబంధ అనుక్రమం: ఒక ప్రదేశాన్ని క్రమానుగతంగా వేరువేరు జీవుల సంఘాలు ఆక్రమించడాన్ని ఆవరణ సంబంధ అనుక్రమం అంటారు.
→ ఆవరణ వ్యవస్థ సేవలు లేదా ఆవరణ సంబంధ సేవలు : వాతావరణంలోని వివిధ ప్రక్రియల వల్ల ఉత్పత్తి అయ్యే వనరులు, వీటిని మనం చాలా వరకు తేలికగా తీసుకోవడం జరుగుతుంది. నీటి శుద్ధి, కలప, చేపల ఆవాసం, పంట మొక్కల పరాగ సంపర్కం మొదలైనవి ఈ సేవల కింద పేర్కొనవచ్చు.
→ జలక్రమకం : నీరు లేదా నీటి పరిసరాలలో ప్రారంభమయ్యే మొక్కల అనుక్రమము.
→ జలాభావ క్రమకం : శుష్క ఆవాసాలలో ప్రారంభమయ్యే మొక్క అను క్రమము.
→ జనాభా : ఒక ప్రాంతంలో నివసించే ఒకే జాతికి చెందిన జీవుల సమూహాన్ని జనాభా అంటారు. దీన్నే “ప్రాంతీయ జనాభా” అని కూడా అంటారు.