Andhra Pradesh BIEAP AP Inter 1st Year Botany Study Material 2nd Lesson జీవశాస్త్ర వర్గీకరణ Textbook Questions and Answers.
AP Inter 1st Year Botany Study Material 2nd Lesson జీవశాస్త్ర వర్గీకరణ
అతిస్వల్ప సమాధాన ప్రశ్నలు
ప్రశ్న 1.
డయాటమ్లలో కణకవచ స్వభావం ఏది?
జవాబు:
డయాటమ్ కణకవచము సిలికాతో నిర్మితమై ఉండుట వల్ల నాశనం చెందవు.
ప్రశ్న 2.
వైరాయిడ్లకూ, వైరస్లకూ ఉన్న తేడాలు ఏమిటి? [Mar. ’14]
జవాబు:
వైరాయిడ్లు | వైరస్లు |
ప్రోటీన్ కవచం లేకుండా, కేంద్రకామ్లము (RNA) మాత్రమే కల వైరస్లను వైరాయిడ్లు అంటారు. ఉదా : పొటాటో స్పిండిల్ ట్యూబర్ వైరస్. | ప్రోటీన్ కవచము, కేంద్రకామ్లము కల జీవులను వైరస్లు అంటారు. ఉదా : TMV |
ప్రశ్న 3.
ఫైకోబయాంట్, మైకోబయాంట్ అనే పదాలు వేటిని తెలియజేస్తాయి?
జవాబు:
లైకెన్లోని శైవల భాగస్వామిని ఫైకోబయాంట్ అని, లైకెన్లోని శిలీంధ్ర భాగస్వామిని మైకోబయాంట్ అని అంటారు.
ప్రశ్న 4.
శైవల మంజరి (algal bloom), ఎరుపు అలలు (Red tides) అనే పదాలు వేటిని సూచిస్తాయి?
జవాబు:
సయనోబాక్టీరియమ్లలో సహనివేశకాలు, ట్రైకోమ్లు లేదా తంతువులు జిగురుపొరతో కప్పబడి, కలుషితమైన నీటిలో ఇవి మంజరులను ఏర్పరుస్తాయి. వీటిని శైవల మంజరులు అంటారు. ఉదా : నాస్టాక్, అనబీనా, గోనియోలాక్స్ లాంటి ఎరుపు రంగులోని డైనో ప్లాజెల్లేట్లు అతి త్వరితగతిలో వృద్ధి చెందడంవల్ల సముద్రమంతా ఎరుపు రంగులో (మధ్యదరా సముద్రములోని ఎరుపు అలలు) కనబడుతుంది.
ప్రశ్న 5.
పరపోషిత బాక్టీరియమ్లకు గల రెండు ఆర్థిక ప్రాముఖ్యం గల ఉపయోగాలను తెలపండి.
జవాబు:
పరపోషిత బాక్టీరియాలు పాల నుంచి పెరుగు తయారీకి, జీవనాశక పదార్థాల ఉత్పత్తి, లెగ్యూమ్ వేర్లలో నత్రజని స్థాపనలకు తోడ్పడతాయి.
ప్రశ్న 6.
వ్యవసాయ భూములలో పంటల పెంపుదలకు ‘సయనోబాక్టీరియమ్లను ఉపయోగించడంలో ఇమిడి ఉన్న ఉద్దేశ్యం ఏమిటి?
జవాబు:
సయనోబాక్టీరియమ్లు వ్యవసాయ భూములలో పెంచిన నత్రజని స్థాపన జరిగి, నేలలు సారవంతమై పంట దిగుబడి పెరుగుతుంది మరియు ఇవి ఆక్సిజనిక్ కిరణజన్య సంయోగక్రియ చూపుతాయి.
ప్రశ్న 7.
మొక్కలు స్వయంపోషితాలు. పాక్షికంగా పరపోషితాలైన కొన్ని మొక్కలను తెలపండి.
జవాబు:
పాక్షికంగా పరపోషితాలు అయిన మొక్కలు :
విస్కం, లోరాంధస్, స్ట్రెగా.
ప్రశ్న 8.
ఐదు రాజ్యాల వర్గీకరణను ఎవరు ప్రతిపాదించారు? ఈ వర్గీకరణలో నిజ కేంద్రక జీవులు ఎన్ని రాజ్యాలలో ఉన్నాయి?
జవాబు:
5 రాజ్యాలు వర్గీకరణను ఆర్. హెచ్. విటాకర్ (1969) ప్రతిపాదించారు. దీనిలో 4 రాజ్యాలు (ప్రొటిస్టా, శిలీంధ్రాలు, మొక్కలు జంతువులు) నిజకేంద్రక జీవులను కలిగి ఉన్నాయి.
ప్రశ్న 9.
విటాకర్ వర్గీకరణలో పాటించిన ముఖ్యమైన ప్రాతిపదికలు ఏవి?
జవాబు:
విటాకర్ వర్గీకరణలో కణ నిర్మాణము, థాలస్ సంవిధానము, పోషణ రకము, ప్రత్యుత్పత్తి, వర్గవికాస సంబంధాలు ముఖ్యమైన ప్రాతిపదికలు.
ప్రశ్న 10.
మైకోప్లాస్మా కలిగించే రెండు వ్యాధులను తెలపండి.
జవాబు:
మొక్కలలో మైకోప్లాస్మాలు వల్ల మంత్రగత్తె, చీపురు కట్ట (witches broom), పశువులలో పూరోనిమోనియా, మానవులలో మైకోప్లాస్మల్ యురిథ్రెటిస్ అను వ్యాధులు కలుగుతాయి.
ప్రశ్న 11.
జిగురు బూజులంటే ఏమిటి? జిగురు బూజుల దృష్ట్యా ప్లాస్మోడియం అంటే ఏమిటో వివరించండి?
జవాబు:
జిగురు బూజులు ప్రొటిస్టా రాజ్యానికి చెందిన పూతికాహార జీవులు బహుకేంద్రకయుతమైన జీవపదార్థము ప్లాస్మా త్వచంలో కప్పబడి, అనుకూల పరిస్థితుల్లో ప్లాస్మోడియమ్ అనే సముచ్ఛయనం (aggregation) ఏర్పడుతుంది.
స్వల్ప సమాధాన ప్రశ్నలు
ప్రశ్న 1.
యూగ్లినాయిడ్ల లక్షణాలు ఏవిటి?
జవాబు:
- యూగ్లినాయిడ్లు ఎక్కువగా నిల్వవున్న నీటిలో పెరిగే మంచినీటి జీవులు.
- ప్రోటీన్ అధికంగా వున్న ‘పెల్లికిల్’ అను పలుచని పొర ఉండటం వలన వీటి శరీరం సమ్యతను ప్రదర్శిస్తుంది.
- ఇవి ఒక పొడవు, ఒక పొట్టి కశాభాలను కల్గి ఉంటాయి.
- కణం పూర్వ భాగంలో గల అంతర్వలనంలో సైటోస్టోం (కణం నోరు) సైటోఫారింక్స్, రిజర్వాయర్ అను భాగాలు ఉంటాయి.
- రిజర్వాయర్ త్వచంపై కాంతి సూక్ష్మగ్రాహ్యత కల స్టిగ్మా లేదా కంటి చుక్కను కలిగి ఉంటుంది.
- సూర్యకాంతి లభించనప్పుడు పరపోషితాలుగా ఇతర చిన్నజీవులను భక్షిస్తాయి.
- ఇవి అనుదైర్ఘ్య ద్విథా విచ్ఛిత్తి ద్వారా ప్రత్యుత్పత్తి జరుపుకుంటాయి.
ప్రశ్న 2.
క్రైసోఫైట్ల ముఖ్య లక్షణాలు, ప్రాముఖ్యతలను తెలపండి?
జవాబు:
క్రైసోఫైట్లో డయాటమ్లు, బంగారు రంగు శైవలాలు ఉన్నాయి. ఇవి మంచినీరు, సముద్రపు నీటి పరిసరాలలో పెరుగుతాయి. ఇవి చాలా వరకు కిరణజన్య సంయోగక్రియను జరుపుకుంటాయి. డయాటమ్లలో కణకవచము రెండు అతివ్యాప్తమైన పలుచని పెంకువంటి నిర్మాణాలను కలిగి సబ్బుపెట్టెలాగా ఉంటుంది. పైదాన్ని ఎపిథీకా అని, క్రింది దాన్ని హైపోథీకా అని అంటారు. వీటి గోడలు సిలికాతో నిర్మితమై ఉండుట వల్ల నాశనం చెందవు. ఇవి నివసించే ఆవాసాలలో అత్యధిక పాళ్ళలో కణకవచ నిక్షేపాలు మిగిలి ఉంటాయి. అనేక సంవత్సరాలు ఇటువంటి పదార్థాలు సంచయనం చెందుటవల్ల ‘డయాటమేసియస్ మృత్తిక’ లేక ‘కైసిల్గర్’ అని అంటారు.
ప్రాముఖ్యత :
సిలికాను కలిగి ఉండుట వల్ల, పాలిష్ చేయటానికి, నూనెలు, ద్రవాల్ని వడగట్టటానికి వాడతారు. మహా సముద్రాలలో డయాటమ్లు ప్రముఖ ఉత్పత్తిదారులు.
ప్రశ్న 3.
డైనోఫ్లాజెల్లేట్ ల గురించి క్లుప్తంగా తెలపండి.
జవాబు:
- డైనోఫ్లాజెల్లేట్లు ఉప్పు నీటిలో పెరుగుతూ, కిరణజన్య సంయోగక్రియ జరుపుకుంటాయి.
- కణకవచాల బాహ్యతలంపై ధృడమైన సెల్యూలోస్ పలకలుంటాయి.
- వీటికి రెండు కశాభాలు ఉంటాయి. అవి బొంగరం వంటి చలనాలను చూపిస్తాయి. కావున వీటిని విర్లింగ్ విప్లు అంటారు.
- కేంద్రకం అంతర్దశలో కూడా సాంద్రీకరణ చెందిన క్రోమోసోమ్లను కలిగి ఉంటుంది. క్రోమోసోమ్లలో హిస్టోన్లు ఉండవు.
- కొన్ని డైనోఫ్లాజెల్లేట్ (నాక్టిల్యూకా) లు జీవసందీప్తిని ప్రదర్శిస్తాయి.
- గోనియాలాక్స్ వంటి డైనోఫ్లాజెల్లేట్లు అతి త్వరితగతిలో చెందుటవల్ల, ఆ సముద్రమంతా ఎరుపురంగులో కనబడుతుంది (మధ్యధరా సముద్రములోని ఎరుపు అలలు)
- వీటి నుండి వెలువడే విషపదార్థాలు చేపల వంటి సముద్రజీవులను చంపగలవు.
ప్రశ్న 4.
మన దైనందిన జీవితంలో శిలీంధ్రాల పాత్రను గురించి రాయండి. [Mar. ’14]
జవాబు:
మన దైనందిన జీవితంలో శిలీంధ్రాల వల్ల లాభాలు, నష్టాలు కలవు. అవి :
లాభాలు :
- ఈస్ట్ వంటి ఏకకణ శిలీంధ్రాలు రొట్టె, బీర్ తయారీలో ఉపయోగపడతాయి.
- కొన్ని శిలీంధ్రాలు, “పెనిసిలియం” వంటి సూక్ష్మ జీవనాశక పదార్థాలకు మూలము.
- అగారికస్ వంటి శిలీంధ్రాలు తినదగిన పుట్టగొడుగులుగా లభిస్తాయి.
నష్టాలు :
- కొన్ని శిలీంధ్రాల వల్ల కమలాపండ్లు కుళ్ళిపోతాయి.
- రొట్టెలపై బూజు ఏర్పడి, పాడైపోతుంది.
- ఆవాల ఆకులపై తెల్ల మచ్చలు ఆల్బుగో అను శిలీంధ్రం వల్ల ఏర్పడతాయి.
- కొన్ని శిలీంధ్రాలు (‘పక్సీనియా’) గోధుమ కుంకుమ తెగులును కలుగచేస్తాయి.
దీర్ఘ సమాధాన ప్రశ్నలు
ప్రశ్న 1.
మీరు చదివిన శిలీంధ్రాలలో వివిధ తరగతుల ముఖ్య లక్షణాలు తెలిపి, వాటిని పోల్చండి.
జవాబు:
సాధారణ లక్షణాలు :
I. ఫైకోమైసిటీస్
- ఇవి నీటి ఆవాసాలలోను, తడి, తేమ ప్రాంతాలలోని కుళ్ళే కొయ్యపైనా లేదా మొక్కలపై అవికల్ప పరాన్నజీవులుగా పెరుగుతాయి. వీటిని శైవలశిలీంధ్రాలు అని కూడా అంటారు.
- శిలీంధ్రజాలము విభాజక పటరహితం మరియు సీనోసైటిక్గా ఉంటుంది.
- అలైంగిక ప్రత్యుత్పత్తి గమన సిద్ధబీజాలు లేక చలనరహిత సిద్ధబీజాల ద్వారా జరుగుతుంది.
- రెండు సంయోగబీజాల కలయిక ఫలితంగా సంయుక్త సిద్ధబీజం ఏర్పడుతుంది. ఉదా : మ్యూకార్, రైజోపస్, ఆల్బుగో.
II. ఆస్కోమైసిటీస్
- వీటిని సాక్ఫంగై అని అంటారు.
- ఇవి ఏకకణయుతాలు (ఉదా : ఈస్ట్) లేదా బహుకణయుతాలు. (ఉదా : పెనిసిలియం)
- ఇవి పూతికాహరులు, విచ్ఛిన్నకారులు, పరాన్నజీవులు లేదా కోప్రోఫిలస్ (పేడపై పెరిగేవి)
- శిలీంధ్రజాలము శాఖాయుతము, విభాజకయుతము.
- అలైంగికంగా కొనిడియంల ద్వారా ప్రత్యుత్పత్తి జరుపుకుంటాయి.
- లైంగికంగా ఆస్కోస్పోరులు ద్వారా ప్రత్యుత్పత్తి జరుపుకుంటాయి.
ఉదా : ఆస్పర్జిల్లస్, క్లావిసెప్స్, పెనిసిలియం.
III. బెసీడియోమైసిటీస్
- వీటిని పుట్టగొడుగులు, బ్రాకెట్ఫంగై లేదా పఫ్బల్స్ లేదా క్లబ్ ఫంగై అంటారు.
- ఇవి మట్టి, దుంగలు, చెట్లు మోదులు, సజీవ మొక్కల శరీరాలలో పరాన్నజీవులుగా పెరుగుతాయి.
- శిలీంధ్ర జాలము శాఖాయుతము, విభాజకయుతము.
- శాకీయ ప్రత్యుత్పత్తి ముక్కలవటం ద్వారా జరుగుతుంది.
- లైంగిక అవయవాలు ఉండవు.
- రెండు వేర్వేరు జన్యురూపాలకు చెందిన శిలీంధ్ర తంతువుల శారీరక కణాల సంయోగం ద్వారా ప్లాస్మోగమీ జరుగుతుంది.
ఉదా : అగారికస్, యుస్టిలాగో, పాలిపోరస్.
IV. డ్యుటిరోమైసిటీస్
- వీటిని ఇంపర్ఫెక్ట్ ఫంగై అని అంటారు.
- కొన్ని పూతికాహారులుగా లేదా పరాన్న జాతులుగా ఉంటాయి. ఎక్కువ జాతులు విచ్ఛిన్నకారులుగా ఉంటూ ఖనిజాల చక్రీకరణలో తోడ్పడతాయి.
- శిలీంధ్రజాలము శాఖాయుతము, విభాజకయుతము.
- ఇవి అలైంగికంగా కొనిడియంల ద్వారా, శాకీయంగాను ప్రత్యుత్పత్తి జరుపుకుంటాయి.
- లైంగిక దశలను గుర్తించిన తర్వాత, వీటిని వేరొక తరగతులలోకి మారుస్తారు.
ఉదా : ఆల్టర్నేరియా, కొల్లెటో ట్రైఖమ్, ట్రెఖోడెర్మా.
ప్రశ్న 2.
మీరు చదివిన మొనీరాలోని వివిధ సముదాయాలను క్లుప్తంగా వివరించండి.
జవాబు:
మొనీరా రాజ్యంలో ఆర్కిబాక్టీరియమ్లు, యూబాక్టీరియమ్లు మైకోప్లాస్మా, ఆక్టినోమైసిటీస్ వంటి అన్ని కేంద్రక పూర్వజీవులు చేర్చబడినాయి.
I. ఆర్కిబాక్టీరియమ్ :
- ఇవి అధిక లవణయుత ప్రాంతాలు, వేడినీటి చలమలు మరియు బురద ప్రదేశాలలో నివసిస్తాయి.
- కణ కవచంలో సూడోమ్యూరిన్ ఉంటుంది.
- కణ కవచంలో శాఖాయుత లిపిడ్ శృంఖలాలుంటాయి.
- ఆవులు, గేదెలు లాంటి రూమినేట్ జంతువుల జీర్ణాశయంలో జీవిస్తూ, వాటి పేడ నుండి మీథేన్ గ్యాస్ ను ఉత్పత్తిచేయటానికి మిథనోజెన్లు తోడ్పడతాయి.
II. యూబాక్టీరియమ్ :
- ఇవి సర్వత్రా వ్యాపించి ఉన్నాయి. వేడినీటి చలమలు, ఎడారులు, మంచు, లోతైన సముద్రాలలో పరాన్న జాతులుగాను, మరికొన్ని సహజ జాతులుగాను నివసిస్తాయి.
- ఆకారమును బట్టి, గోళాకారము (కోకస్), దండాకారము (బాసిల్లస్), సర్పిలాకారము (స్పైరిల్లం) మరియు కామా (విబ్రియో) ఆకారంలో ఉంటాయి.
- కణ కవచము పెఫ్టిడోగ్లైకాన్ తో నిర్మితము.
- కణ త్వచంలో మీసోసోమ్లు ఉంటాయి.
- వీటిలో ప్రధాన జన్యుపదార్థమైన న్యూక్లియాయిడ్, 70’s రకపు రైబోసోమ్లు ఉంటాయి.
- కొన్ని యూ బాక్టీరియాలు స్వయంపోషితాలు. ఎక్కువ పరాన్న జీవులుగా ఉంటాయి.
- నాస్టాక్, అనబీనా వంటి నీలి ఆకుపచ్చ శైవలాలు సహనివేశాలుగా తంతువులుగా ఉంటూ హెటిరోసిస్ట్లలో నత్రజని స్థాపనలో తోడ్పడతాయి.
- ఇవి కలుషిత నీటిలో శైవల మంజరులు ఏర్పరుస్తాయి.
III. మైకోప్లాస్మాలు :
- ఇవి పూర్తిగా కణకవచం లేకుండా బహుళరూపాలలో ఉండే జీవులు.
- జీవ కణాలన్నింటిలోను అతి చిన్నవి. ఆక్సిజన్ లేని పరిస్థితులను కూడా తట్టుకోగలవు.
- ఇవి మొక్కలలో మంత్రగత్తె చీపురుకట్ట, పశువులలో పూరోనిమోనియా, మానవులలో మైకోప్లాస్మల్ యురిథ్రెటిస్ అను వ్యాధులు కలుగచేస్తాయి.
IV. ఆక్టినోమైసిటిస్ :
- ఇవి శాఖాయుత, తంతురూప బాక్టీరియమ్లు.
- కణకవచంలో మైకోలిక్ ఆమ్లాన్ని కలిగి ఉంటాయి.
- ఇది ఎక్కువగా పూతికాహార జీవులు లేదా విచ్ఛిన్నకారులు.
- మైకోబాక్టీరియమ్, కొరినిబాక్టీరియమ్ లు పరాన్న జీవులు.
- స్ట్రెప్టోమైసిస్ ప్రజాతులు నుండి అనేక సూక్ష్మ జీవనాశకాలు తయారుచేస్తాయి.
ప్రశ్న 3.
ప్రొటిస్టాలోని వివిధ సముదాయాల ముఖ్యలక్షణాలను సోదాహరణగా రాయండి.
జవాబు:
I. క్రైసోఫైట్లు :
క్రైసోఫైట్లో డయాటమ్లు, బంగారు రంగు శైవలాలు ఉన్నాయి. ఇవి మంచినీరు, సముద్రపు నీటి పరిసరాలలో పెరుగుతాయి. ఇవి చాలా వరకు కిరణజన్య సంయోగక్రియను జరుపుకుంటాయి. డయాటమ్లలో కణకవచము రెండు అతివ్యాప్తమైన పలుచని పెంకువంటి నిర్మాణాలను కలిగి సబ్బుపెట్టెలాగా ఉంటుంది. పైదాన్ని ఎపిథీకా అని, కింది దాన్ని హైపోథీకా అని అంటారు. వీటి గోడలు సిలికాతో నిర్మితమై ఉండుట వల్ల నాశనం చెందవు. ఇవి నివసించే ఆవాసాలలో అత్యధిక పాళ్ళలో కణకవచ నిక్షేపాలు-మిగిలి ఉంటాయి. అనేక సంవత్సరాలు ఇటువంటి పదార్థాలు సంచయనం చెందుటవల్ల ‘డయాటమేసియస్ మృత్తిక లేక ‘కైసిల్గాగర్’ అని అంటారు.
ప్రాముఖ్యత :
సిలికాను కలిగి ఉండుట వల్ల, పాలిష్ చేయటానికి, నూనెలు, ద్రవాల్ని వడగట్టటానికి వాడతారు. మహా సముద్రాలలో డయాటమ్లు ప్రముఖ ఉత్పత్తిదారులు.
II. డైనోఫ్లాజెల్లేట్లు :
- డైనోఫ్లాజెల్లేట్లు ఉప్పు నీటిలో పెరుగుతూ, కిరణజన్య సంయోగక్రియ జరుపుకుంటాయి.
- కణకవచాల బాహ్యతలంపై దృడమైన సెల్యూలోస్ పలకలుంటాయి.
- వీటికి రెండు కశాభాలు ఉంటాయి.’ అవి బొంగరం వంటి చలనాలను చూపిస్తాయి. కావున వీటిని విర్లింగ్ విప్లు అంటారు.
- కేంద్రకం అంతర్ధశలో కూడా సాంద్రీకరణ చెందిన క్రోమోసోమ్లను కలిగి ఉంటుంది. క్రోమోసోమ్లలో హిస్టోన్లు ఉండవు.
- కొన్ని డైనోఫ్లాజెల్లేట్ (నాక్టిల్యూకా) లు జీవ సందీప్తిని ప్రదర్శిస్తాయి.
- గోనియాలాక్స్ వంటి డైనోఫ్లాజెల్లేట్లు అతి త్వరితగతిలో చెందుటవల్ల, ఆ సముద్రమంతా ఎరుపురంగులో కనబడుతుంది (మధ్యదరా సముద్రములోని ఎరుపు అలలు)
- వీటి” నుండి వెలువడే విషపదార్థాలు చేపల వంటి సముద్రజీవులను చంపగలవు.
III. యూగ్లినాయిడ్లు :
- యూగ్లినాయిడ్లు ఎక్కువగా నిల్వవున్న నీటిలో పెరిగే మంచినీటి జీవులు,
- ప్రోటీన్ అధికంగా వున్న ‘పెల్లికిల్’ అను పలుచని పొర ఉండటం వలన వీటి శరీరం నమ్యతను ప్రదర్శిస్తుంది.
- ఇవి ఒక పొడవు, ఒక పొట్టి కశాభాలను కల్గి ఉంటాయి.
- కణం పూర్వ భాగంలో గల అంతర్వలనంలో సైటోస్టాం (కణం నోరు) సైటోఫారింక్స్, రిజర్వాయర్ అను భాగాలు ఉంటాయి.
- రిజర్వాయర్ త్వచంపై కాంతి సూక్ష్మగ్రాహ్యత కల స్టిగ్మా లేదా కంటి చుక్కను కలిగి ఉంటుంది.
- సూర్యకాంతి లభించనప్పుడు పరపోషితాలుగా ఇతర చిన్నజీవులను భక్షిస్తాయి.
- ఇవి అనుదైర్ఘ్య ద్విధా విచ్ఛిత్తి ద్వారా ప్రత్యుత్పత్తి జరుపుకుంటాయి.
IV. జిగురు బూజులు :
- ఇవి ప్రొటిస్టాకు చెందిన పూతికాహార జీవులు. బహుకేంద్రకయుతమైన జీవపదార్థము ప్లాస్మాత్వచంచే కప్పబడి ఉంటుంది.
- అనుకూల పరిస్థితులలో ఇవి సముచ్ఛయనం చెంది ప్లాస్మోడియమ్ ఏర్పడుతుంది.
- ప్రతికూల పరిస్థితులలో ప్లాస్మోడియమ్ విభేదన చెంది ఫలనాంగాలు ఏర్పడతాయి. ఇవి వాటి కొనలలో సిద్ధబీజాలను కలిగి ఉంటాయి.
- సిద్ధబీజాలు అత్యధిక నిరోధకతను కలిగి ప్రతికూల పరిస్థితులలో కూడా అనేక సంవత్సరాలు జీవించగలవు.
V. ప్రోటోజోవన్లు :
- ఇవి పరభక్షితాలుగా లేదా పరాన్నజీవులుగా జీవిస్తాయి.
- వీటికి కణకవచము ఉండదు.
- జీవపదార్థము ప్లాస్మాత్వచంచే ఆవరించబడి ఉంటుంది.
- అమీబాయిడ్ ప్రోటోజోవన్ లు మంచినీరు, సముద్రపు నీరు లేదా తడినేలలో జీవిస్తాయి. ఇవి అమీబావలె మిధ్యాపాదాలను ఏర్పరిచి ఆహారంను బంధిస్తాయి.
- ఫ్లాజెల్లేటెడ్ ప్రోటోజోవన్లు ఇవి స్వేచ్ఛగా గానీ పరాన్నజీవులుగా గానీ ఉంటాయి.
- ఇవి కశాభాలను కలిగి ఉంటాయి.
- పరాన్నజీవులుగా పెరిగే ట్రిపానోసోమా – నిద్రా వ్యాధిని కలుగచేస్తుంది.
- సీలియేటెడ్ ప్రోటోజోవన్లు : ఇవి చురుకుగా చలించే నీటిజీవులు.
- వీటిలోని గుంట కణం యొక్క ఉపరితలం వెలుపలికి తెరుచుకొని ఉంటుంది.
ఉదా : పారమీసియమ్.
స్పోరోజోవన్లు :
సంక్రామక సిద్ధబీజం లాంటి దశలను కలిగి ఉంటాయి. ప్లాస్మోడియమ్ – మలేరియాను కలిగించి మానవ జనాభాను అస్తవ్యస్తం చేసే ప్రభావం కలిగి ఉంటుంది.
Intext Question and Answers
ప్రశ్న 1.
వీటి రెండు ఆర్థిక ప్రాముఖ్యం గల ఉపయోగాలను తెలపండి.
a) పరపోషిత బాక్టీరియమ్లు
b) ఆర్కి బాక్టీరియమ్లు
జవాబు:
a) పరపోషిత బాక్టీరియమ్లు :
ఇవి పాల నుంచి పెరుగు తయారీ, జీవనాశక పదార్థాలు ఉత్పత్తి, లెగ్యూమ్ వేర్లలో నత్రజని స్థాపనలో తోడ్పడతాయి.
b) ఆర్కిబాక్టీరియమ్లు :
ఆవులు, గేదెలు లాంటి రూమినేట్ జంతువుల జీర్ణాశయంలో జీవిస్తూ వాటి పేడ నుండి మీథేన్ గ్యాస్ నన్ను ఉత్పత్తి చేస్తాయి.
ప్రశ్న 2.
ఈ కింది వాటి ఆధారంగా శిలీంధ్ర రాజ్యంలోని తరగతులను పోల్చండి
a) పోషణ విధానము
b) ప్రత్యుత్పత్తి పద్ధతి
జవాబు:
a) పోషణ ఆధారంగా :
i) ఫైకోమైసిటీస్: అవికల్ప పరాన్నజీవులు.
ii) ఆస్కోమైసిటీస్ : పూతికాహారులు, విచ్ఛిన్నకారులు.
iii) బెసిడియోమైసిటీస్ : పరాన్నజాతులు
iv) డ్యుటిరోమైసిటీస్ : పూతికాహారులు, విచ్ఛిన్నకారులు.
b) ప్రత్యుత్పత్తి ఆధారంగా :
i) ఫైకోమైసిటీస్ phycomycetes :
అలైంగిక గమనసిద్ధ బీజాల ద్వారా, లైంగికంగా – సంయోగ బీజాల ద్వారా.
ii) ఆస్కోమైసిటీస్ :
అలైంగికంగా కొనీడియాల ద్వారా, లైంగికంగా ఆస్కోస్ఫోరుల ద్వారా.
iii) బెసీడియోమైసిటీస్ :
అలైంగికంగా ముక్కలగుట ద్వారా, లైంగికంగా శాకీయ కణాల సంపర్కం వల్ల.
iv) డ్యుటిరోమైసిటీస్ :
అలైంగికంగా కొనిడియంల ద్వారా.
ప్రశ్న 3.
నిర్మాణం జన్యుపదార్థ స్వభావం దృష్ట్యా వైరస్ల ను గురించి క్లుప్తంగా రాయండి. ఏవైనా నాలుగు సాధారణ వైరస్ వ్యాధులను తెలపండి.
జవాబు:
వైరస్లలో కేంద్రకామ్లము, ప్రోటీన్లు ఉంటాయి. కేంద్రకామ్లము సంక్రమణ స్వభావంతో RNA లేక DNA గా ఉంటుంది. ప్రోటీను భాగము ఒక తొడుగులాగా ఉంటుంది. దీన్ని కాప్సిడ్ అంటారు. ఇది మధ్య ఉన్న కేంద్రకామ్లాన్ని చుట్టి ఉంటుంది.
కొన్ని వైరస్ వ్యాధులు :
- టొబాకో మొజాయిక్ వ్యాధి
- పొటాటో స్పిండిల్ ట్యూబర్ వ్యాధి
- హ్యూమన్ ఇమ్యునో వైరస్
- గొర్రెలలో పీ వ్యాధి
ప్రశ్న 4.
వైరస్లు, జీవులా లేదా నిర్జీవ పదార్థాలా ? అనే విషయాన్ని గురించి మీ తరగతిలో ఒక చర్చా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయండి.
జవాబు:
వైరస్లు వాస్తవంగా సజీవులు కాదు. జీవకణం వెలుపల అచేతనంగా ఉండి స్ఫటిక నిర్మాణాన్ని కలిగి ఉంటాయి. ఇవి అవికల్ప పరాన్న జాతులుగా ఉంటాయి.
ప్రశ్న 5.
నీకు కాకతాళీయకంగా ఒక పాత భద్రపరచబడిన లేబుల్ ని శాశ్వత గాజుపలక దొరికింది. దీన్ని గుర్తించడానికి సూక్ష్మదర్శిని కింద ఉంచినప్పుడు ఈ కింది లక్షణాలను గుర్తించావు.
a) ఏకకణ నిర్మిత శరీరం b) స్పష్టమైన కేంద్రకం c) ద్వికశాభయుత పరిస్థితి ఒక కశాభం నిలువుగానూ, మరొకటి అడ్డంగానూ ఉంది. దీనిని దేనిగా గుర్తిస్తావు? అది ఏ రాజ్యానికి చెందిందో తెలుపగలవా?
జవాబు:
ప్రొటిస్టియన్ కణము. అని ప్రొటిస్టా రాజ్యానికి చెందుతుంది.
ప్రశ్న 6.
కలుషిత నీటిలో అత్యధికంగా నాస్టాక్, ఆసిల్లటోరియా వంటి మొక్కలుంటాయి. కారణాలను తెలపండి.
జవాబు:
కలుషిత నీటిలోని ఆక్సిజనిక్ కిరణజన్య సంయోగక్రియను జరుపుతాయి. మరియు నత్రజని స్థాపనలో తోడ్పడతాయి. నీటిలోని భారమూలకాలను తొలగిస్తాయి.
ప్రశ్న 7.
ఐదు రాజ్యాల వర్గీకరణ ప్రకారం చాలా తేడా ఉన్నప్పటికీ సయనోబాక్టీరియమ్లు, పరపోషిత బాక్టీరియమ్లు రెండు మొనీరా రాజ్యంలో యూబాక్టీరియమ్ల కింద చేర్చారు. ఈ రెండు రకాలు వర్గాలనూ ఒకే రాజ్యంలో చేర్చడం సమంజసమా? అయితే ఎందువల్ల?
జవాబు:
సయనోబాక్టీరియాలు, పరపోషితబాక్టీరియమ్లను మొనీరా రాజ్యంలో యూబాక్టీరియమ్ కింద చేర్చడం సమంజసమే. ఎందువల్లననగా అవి రెండు నత్రజని స్థాపనలో పాల్గొంటాయి.
ప్రశ్న 8.
మీరు గమనించిన ఏ లక్షణాల వల్ల ట్రిపోనోజోమాను ప్రోటిస్టా రాజ్యంలో చేర్చగలరు?
జవాబు:
ఇవి స్వేచ్ఛగా లేక పరాన్న జాతులుగా ఉంటాయి. ఇవి కశాభాలను కలిగి ఉంటాయి.
ప్రశ్న 9.
జీవిత చరిత్రలోని ఒక దశలో ఆస్కోమైసిటీస్కు చెందిన శిలీంధ్రాలు క్లీస్టోథీసియం, పెరిథీసియం లేదా అపోథీసియం అనే ఫలనాంగాలను ఉత్పత్తి చేస్తాయి. ఈ మూడు రకాల ఫలనాంగాలు ఒకదానినుంచి మరొకటి ఏవిధంగా వేరుగా ఉంటాయి?
జవాబు:
ముఖరంధ్రం లేని గుండ్రటి ఆస్కోకార్ను క్లీసోథీసియం అంటారు. కూజా ఆకారంలో ఉండి కొనభాగంలో తెరుచుకునే ఆస్కోకార్ను పెరిథీసియం అంటారు. కప్పు లేదా సాసర్ ఆకారంలో ఈ ఆస్కోకార్ప్న అపోథీసియం అంటారు.