AP Inter 1st Year Botany Study Material Chapter 3 మొక్కల విజ్ఞానం – వృక్షశాస్త్రం

   

Andhra Pradesh BIEAP AP Inter 1st Year Botany Study Material 3rd Lesson మొక్కల విజ్ఞానం – వృక్షశాస్త్రం Textbook Questions and Answers.

AP Inter 1st Year Botany Study Material 3rd Lesson మొక్కల విజ్ఞానం – వృక్షశాస్త్రం

అతిస్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
‘బొటనీ’ అనే పదం ఏ విధంగా వాడుకలోకి వచ్చిందో వివరించండి.
జవాబు:
బోటనీ అనే గ్రీకు పదం బౌస్సికీన్ (Bouskein) అనే పదం నుండి ఏర్పడింది. బౌస్సికీన్ అంటే పశువుల చేత మేయబడేది అని అర్థం. బోస్కిన్ అను పదము బొటానే గాను, బొటానే అనే పదం క్రమంగా బోటనీ అనే పదంగా రూపాంతరం చెందింది.

ప్రశ్న 2.
పరాశరుడు రచించిన పుస్తకాల పేర్లు తెలిపి వాటిలోని ముఖ్యాంశాలను వివరించండి.
జవాబు:
కృషిపరాశరంలో (వ్యవసాయం) పంట మొక్కలు, కలుపు మొక్కలు గురించి వివరించబడ్డాయి. వృక్షాయుర్వేదంలో ఎన్నో రకాల అడవులు గురించి; మొక్కల బాహ్య, అంతర్నిర్మాణ లక్షణాలు; ఔషధ మొక్కల గురించి వివరించబడ్డాయి.

ప్రశ్న 3.
వృక్షశాస్త్ర పిత అని ఎవరిని అంటారు ? అతను రచించిన గ్రంథం ఏది?
జవాబు:
థియోఫ్రాస్టస్ ను వృక్షశాస్త్ర పిత అని పిలుస్తారు. అతను దీ హిస్టోరియా ప్లాంటారమ్ అనే గ్రంథాన్ని రచించాడు.

ప్రశ్న 4.
హెర్బలిస్టులు అంటే ఎవరు? వారు రచించిన గ్రంథాలేవి?
జవాబు:
సజీవంగా, సహజ ఆవరణలో ఉన్న ఔషద మొక్కలను సాంకేతికంగా వర్ణన చేయు శాస్త్రజ్ఞులను హెర్బలిస్టులు అంటారు. వీరు రచించిన గ్రంథాలను హెర్బల్స్ అంటారు. పుక్స్, బ్రన్ఫెల్స్, బోవెల్ అనువారు ప్రముఖ హెర్బలిస్టులు.

ప్రశ్న 5.
వృక్ష వర్గీకరణ శాస్త్రాభివృద్ధికి కెరోలస్ వాన్ లిన్నేయస్ చేసిన కృషి ఏమిటి?
జవాబు:
కెరోలస్ వాన్ లిన్నేయస్ వృక్షవర్గీకరణ శాస్త్రాన్ని అభివృద్ధి చేశాడు. ఈయన స్పిషీస్ ప్లాంటారమన్ను రచించి ద్వినామ నామీకరణ విధానాన్ని వాడుకలోకి తెచ్చాడు. ఈయన లైంగిక వర్గీకరణ విధానాన్ని ప్రతిపాదించాడు.

AP Inter 1st Year Botany Study Material Chapter 3 మొక్కల విజ్ఞానం – వృక్షశాస్త్రం

ప్రశ్న 6.
మెండల్ను ‘జన్యుశాస్త్ర పిత’ గా ఎందుకు పరిగణిస్తున్నారు?
జవాబు:
బఠాణి మొక్కలపై సంకరణ ప్రయోగాలు జరపటం వల్ల; అనువంశిక సూత్రాలను ప్రవేశపెట్టటం వల్ల మెండల్ జన్యుశాస్త్ర పితగా ప్రసిద్ధికెక్కాడు.

ప్రశ్న 7.
కణాన్ని కనుక్కొన్నదెవరు? ఆయన రచించిన పుస్తకం ఏమిటి?
జవాబు:
రాబర్ట్ హుక్ కణాన్ని మొదటిసారి కనుగొన్నాడు. ఆయన మైక్రోగ్రాఫియా అనే గ్రంథాన్ని రచించాడు.

ప్రశ్న 8.
పురావృక్ష శాస్త్రం అంటే ఏమిటి ? దాని ఉపయోగం ఏమిటి? [Mar. 14]
జవాబు:
మొక్కల శిలాజాల గురించి అధ్యయనం చేయు శాస్త్రమును “పురావృక్షశాస్త్రము” అందురు. దీనివల్ల మొక్కలలో పరిణామక్రమాన్ని అర్థం చేసుకోవచ్చు.

ప్రశ్న 9.
హరితసహిత, స్వయంపోషక థాలోఫైట్ల హరితరహిత, పరపోషకత థాలోఫైట్లకు సంబంధించిన వృక్షశాస్త్ర విభాగాలను తెలపండి.
జవాబు:
పత్రహరితయుత, స్వయంపోషక థాలోఫైటా మొక్కలను అధ్యయనం చేసే విభాగాన్ని శైవలశాస్త్రం (ఫైకాలజీ) అంటారు. పత్రహరితరహిత, పరపోషిత థాలోఫైటా మొక్కలను అధ్యయనం చేసే విభాగాన్ని శిలీంధ్రశాస్త్రం (మైకాలజీ) అంటారు.

ప్రశ్న 10.
లైకెన్లలో సహజీవనం చేసే మొక్కల సముదాయాలు ఏవి? లైకెన్ల అద్యయనాన్ని ఏమంటారు?
జవాబు:
లైకెన్లలో సహజీవనం గడిపే భాగస్వామి మొక్కల వర్గాలు శైవలాలు, శిలీంధ్రాలు. లైకెన్లను గురించి అధ్యయనం చేసే విభాగాన్ని లైకెనాలజీ అంటారు.

ప్రశ్న 11.
ఏ మొక్కల సముదాయాన్ని నాళికాకణజాలయుత పుష్పించని మొక్కలు అంటారు? వీటి అద్యయనానికి సంబంధించిన వృక్షశాస్త్రశాఖ పేరేమిటి?
జవాబు:
టెరిడోఫైటాకు చెందిన మొక్కలను నాళికాయుత పుష్పించని మొక్కలు అంటారు. వాటిని అధ్యయనం చేసే విభాగాన్ని అంటారు.

AP Inter 1st Year Botany Study Material Chapter 3 మొక్కల విజ్ఞానం – వృక్షశాస్త్రం

ప్రశ్న 12.
ఏ మొక్కల సముదాయాన్ని వృక్ష రాజ్యపు ఉభయచరాలు అని అంటారు? వాటిని అద్యయనం చేసే విభాగాన్ని ఏమంటారు?
జవాబు:
మొట్టమొదటగా నేలమీద పెరిగిన మొక్కలను (వృక్షరాజ్యపు ఉభయచరాలు) బ్రయోఫైట్లు అంటారు. వాటిని అధ్యయనం చేసే విభాగాన్ని బ్రయాలజీ అంటారు.

స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
వ్యవసాయ, ఉద్యానవన, ఔషధపరంగా వృక్షశాస్త్ర పరిధిని క్లుప్తంగా వర్ణించండి.
జవాబు:

 1. హరితవిప్లవం ద్వారా వ్యాధి నిరోధక, కీటక నిరోధక పంటలను జీవ సాంకేతిక పద్ధతులలో అభివృద్ధి పరిచి, జనాభా పెరుగుదల, వనరుల తరుగుదల వంటి సమస్యలను చాలా వరకు పరిష్కరించవచ్చు.
 2. సంకరణం, జన్యు ఇంజనీరింగ్ ప్రయోగాల ద్వారా వృక్షశాస్త్రంలోని వ్యవసాయము, అటవీసంపద, ఉద్యానవన, పుష్పోత్పత్తి తాంటి అనువర్తన శాస్త్రాలలో మంచి పురోగతి సాధించవచ్చు.
 3. సాగు మొక్కలైన వరి, గోధుమ, మొక్కజొన్న, చెరుకులలో కొత్త వంగడాలను ఏర్పరచడానికి క్రొత్త ప్రజనన పద్ధతులు ఉపయోగపడును.
 4. వృక్ష వ్యాధి శాస్త్రంలో జరిపిన పరిశోధనల ఫలితాలు మొక్కల్లో వచ్చే అనేక వ్యాధులను నివారించడం, నిర్మూలనకు ‘ఉపయోగపడతాయి.
 5. మొక్కల వృద్ధి నియంత్రికాల పాత్ర, వాటి పరిజ్ఞానం వల్ల వ్యవసాయ, ఉద్యాన వనరంగాల్లో అభివృద్ధి సాధించడమైంది.
 6. కణజాల, అవయవవర్ధనం వల్ల అతితక్కువ సమయంలో అధిక సంఖ్యలో మొక్కలను ప్రయోగశాలలో ఉత్పత్తిచేయవచ్చు.
 7. వృక్షశాస్త్ర అభివృద్ధి వల్ల బట్టలు, కాగితం, చక్కెర లాంటి ఎన్నో, పరిశ్రమలు వృద్ధిచెందాయి.
 8. ఆర్నికా, సింకోనా, వేప, దతురా, డిజిటాలిస్, రావుల్ఫియా, తులసి మొదలైన ఔషధ విలువలు గల మొక్కల పరిజ్ఞానం, వాటిని మానవుని ఆరోగ్య సంరక్షణ కోసం ఉపయోగించుటలో దోహదపడును.
 9. సూక్ష్మజీవనాశక పదార్థాలైన పెనిసిలిన్, జీవకీటకనాశినిలు, స్పైరులినా, క్లోరెల్లా లాంటి ఏకకణ ప్రోటీన్ల ఉత్పత్తి కూడా ఆయా పదార్థాలనిచ్చే మొక్కల విస్తృత అధ్యయనం వల్ల సాధ్యమవుతుంది.

ప్రశ్న 2.
వృక్షశరీర ధర్మ శాస్త్రాన్ని ఉదాహరణగా తీసుకొని వృక్షశాస్త్ర పరిధిని వివరించండి.
జవాబు:

 1. మొక్కల పోషణలో మూలకాలపాత్ర తెలియుట వల్ల రసాయన ఎరువులను ఉపయోగించి, మూలకలోపాలను అధిగమించి అధిక దిగుబడులు సాధించవచ్చు.
 2. మొక్కల వృద్ధి నియంత్రికాల పాత్ర, వాటి పరిజ్ఞానం వల్ల కలుపు మొక్కలు నివారణ, విత్తనాలు సుప్తావస్థను తొలగించుట స్పినాచ్ వంటి ఆకుకూరలు ఎక్కువ కాలం నిల్వ ఉంచడం, అరటి, ఆపిల్, పుచ్చకాయ లాంటి పళ్ళు కృత్రిమంగా పక్వానికి వచ్చేట్లు చేయటం, శాఖీయోత్పత్తి కోసం కాండపు ఖండికలతో వేళ్ళను ప్రేరేపించడం జరిపి వ్యవసాయ, ఉద్యాన వనరంగాలలో అభివృద్ధి సాధించడమైనది.

AP Inter 1st Year Botany Study Material Chapter 3 మొక్కల విజ్ఞానం – వృక్షశాస్త్రం

ప్రశ్న 3.
వృక్ష స్వరూప శాస్త్రంలోని వివిధ శాఖలు, వాటి లక్షణాలను రాయండి.
జవాబు:
మొక్కలలో వివిధ భాగాల అధ్యయనానికి వర్ణనకు సంబంధించిన శాస్త్రము. ఇది మొక్కల వర్గీకరణకు మౌలిక ఆధారము దీనిలో “2 రకాలు” కలవు.

1) బాహ్యస్వరూప శాస్త్రము:
మొక్క భాగాలైన వేరు, కాండం, పత్రం, పుష్పం, ఫలం, విత్తనం బాహ్యస్వరూప లక్షణాలను అధ్యయనం చేసి వర్ణించుట.

2) అంతరస్వరూప శాస్త్రము :
వివిధ భాగాల అంతర్నిర్మాణాన్ని తెలిపే శాస్త్రము. దీనిలో “2 రకాలు” కలవు
a) కణజాల శాస్త్రము : మొక్కలోని వివిధ కణజాలాలను అధ్యయనం చేసే విభాగము.
b) అంతర్నిర్మాణ శాస్త్రము : మొక్కల్లోని వేరు, కాండం, పత్రం, పుష్పంలోని అంతర్నిర్మాణ వివరాలకు సంబంధించినది.

దీర్ఘ సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
వృక్షశాస్త్రంలోని వివిధ శాఖల పరిధిని సోదాహరణంగా వివరించండి.
జవాబు:

 1. వ్యవసాయము : హరిత విప్లవం ద్వారా వ్యాధి నిరోధక కీటక నిరోధక పంటలను జీవ సాంకేతిక పద్ధతులలో అభివృద్ధి చేసి జనాభా పెరుగుదల, వనరుల తరుగుదల వంటి సమస్యలను పరిష్కరించవచ్చు.
 2. సంకరణం జన్యు ఇంజనీరింగ్ ప్రయోగాల ద్వారా వృక్షశాస్త్రంలోని వ్యవసాయం, అటవీసంపద, ఉద్యానవన పుష్పోత్పత్తి లాంటి అనువర్తన శాస్త్రాలలో పురోగతి సాధించవచ్చు.
 3. సాగు మొక్కలైన వరి, గోధుమ, మొక్కజొన్న, చెరకులలో కొత్త వంగడాలను ఏర్పరచడానికి కొత్త ప్రజనన పద్ధతులు ఉపయోగపడతాయి.

వృక్షవ్యాధి శాస్త్రము :
మొక్కలలో వచ్చే అనేక వ్యాధులను నివారించడం, నిర్మూలనకు వృక్షవ్యాధి శాస్త్రంలో జరిపిన ఫలితాలు ఉపయోగపడతాయి.

వైద్య రంగం :

 1. ఆర్నికా, సింకోనా, వేప, దతురా, రావుల్ఫియా, తులసి, కలబంద వంటి ఔషధ విలువలు కల మొక్కల పరిజ్ఞానం వాటిని మానవ ఆరోగ్య సంరక్షణ కోసం ఉపయోగించవచ్చు.
 2. సూక్ష్మజీవనాశక పదార్థాలైన పెనిసిలిన్, జీవ కీటకనాశినిలు, ఏకకణ ప్రోటీన్ల ఉత్పత్తి చేయవచ్చు.

వాతావరణ కారకాలు :

 1. హరిత గృహ ప్రభావాన్ని విరివిగా మొక్కలునాటుట ద్వారా నియంత్రించడం, బయోరెమిడియేషన్ ద్వారా మృత్తికా కాలుష్యాన్ని పూతికాహారుల ద్వారా పోషక పదార్థాల పునశ్చక్రీయం, రసాయన ఎరువుల వల్ల కలిగే మృత్తిక, నీటి కాలుష్యాలను అరికట్టుట కోసం జీవఎరువులు వాడుట, మృత్తిక క్రమక్షయాన్ని తగ్గించడంకోసం ఇసుకను పట్టుకొనే మొక్కలను పెంచడం.
 2. క్లోరెల్లా లాంటి శైవలాలను అంతరిక్ష పరిశోధనలో వ్యోమగాముల ఆహారంగా ఉపయోగించుట, సముద్ర కలుపుమొక్కల నుంచి అయోడిన్, అగార్-అగార్ తయారు చేయుట సమకాలీన ప్రపంచంలో వృక్షశాస్త్రానికి ఉన్న అవకాశాలను సూచిస్తాయి.

వాణిజ్య ఉత్పత్తులు :

 1. వాణిజ్యపరంగా ప్రాముఖ్యం ఉన్న కలప, నారలు, కాఫీ, తేయాకు లాంటి పానీయాలు సుగంధ ద్రవ్యాలు, రబ్బరు, జిగురు పదార్థాలు, రెసిన్లు అద్దకాలు, సుగంధతైలాలు లాంటి పదార్థాలు, వాటిని సక్రమంగా వినియోగించుకోవడానికి మొక్కల పరిజ్ఞానం ఉపయోగపడును.
 2. వృక్షశాస్త్రం అభివృద్ధి వల్ల బట్టలు, కాగితం, ఆయుర్వేద ఔషధాలు, చక్కెర లాంటి పరిశ్రమలు వృద్ధిచెందాయి.