Students can go through AP Inter 1st Year Chemistry Notes 13th Lesson కర్బన రసాయన శాస్త్రం – సామాన్య సూత్రాలు, విధానాలు will help students in revising the entire concepts quickly.
AP Inter 1st Year Chemistry Notes 13th Lesson కర్బన రసాయన శాస్త్రం – సామాన్య సూత్రాలు, విధానాలు
→ కర్బన పదార్థాలను శుద్ధిచేసే విధానాలు : స్ఫటికీకరణం, ఉత్పతనం, స్వేదనం, పాక్షిక, అంశిక భాష నిర్వాత స్వేదనాలు, ద్రావణి నిష్కర్షణ, క్రోమెటోగ్రఫీ.
→ లైసాన్ (లేదా) సోడియం నిష్కర్షణ పరీక్ష ద్వారా నైట్రోజన్, హాలోజన్లు, సల్ఫర్లను గుర్తిస్తారు.
→ ఫెర్రిక్ ఫెర్రో సైనైడ్, Fe, [Fe(CN)6])3, ను ప్రసన్ బ్లూ అంటారు.
→ డ్యూమా మరియు జెల్డాల్ పద్ధతులలో నైట్రోజన్ భారశాతమును కనుగొంటారు.
→ సైక్లోహెక్సేన్, సైక్లోపెంటేన్ మొ॥ ఎలిసైక్లిక్ సమ్మేళనాలకు ఉదాహరణలు.
→ పిరిడీన్, ఫ్యురాన్ మొ॥ హెటిరోసైక్లిక్ సమ్మేళనాలకు ఉదాహరణలు,
→ -‘CH2‘ వ్యత్యాసం కన్పించే శ్రేణిని సమజాత శ్రేణి అంటారు
→ సాదృశ్యం రెండు రకాలు. అవి :
- నిర్మాణాత్మక సాదృశ్యం,
- ప్రాదేశిక సాదృశ్యం.
→ కర్బన కారకాల్లో రకాలు : ఎలక్ట్రోఫైల్లు, న్యూక్లియోఫైల్లు మరియు స్వేచ్ఛా ప్రాతిపదికలు.
→ సాధారణ కర్బన రసాయన చర్యలు : ప్రతిక్షేపణ చర్యలు, సంకలనాత్మక చర్యలు, విలోపన చర్యలు, అణుపు నరమరికలు.
→ ‘C – C’ ఏకబంధం ద్వారా భ్రమణం జరిపితే ఆల్కేన్లలో అనురూపకాలు వస్తాయి.
→ ఈథేన్ అనురూపకాలలో ముఖ్యమైనవి : ఈథేన్ గ్రహణ రూపకం, ఈథేన్ అస్తవ్యస్థ రూపకం.
→ ఈథేన్ ప్రతిక్షేపణ చర్యలలో పాల్గొంటుంది. ఈథేన్ క్లోరినేషన్ శృంఖల చర్యకు ఉదాహరణ.
→ సైక్లోహెక్సేన్ తయారీ పద్ధతులు: ప్రూయిండ్ పద్ధతి, విసిసెనస్ పద్ధతి, డిక్ మన్ పద్ధతి, డీల్స్ – ఆల్టర్ పద్ధతి, జీగర్ చర్య
→ క్షేత్ర సాదృశ్యం (సిస్ – ట్రాన్స్ సాదృశ్యం) ఆల్కీన్లలో కనబడుతుంది.
→ మార్కోనికాఫ్ నియమము : “ఈ నియమం ప్రకారం ఒక అసమకారకం, ద్విబంధం దగ్గర సంకలనం చెందేప్పుడు దాని ధనావేశ భాగం ఎక్కువ స్థిరత్వముండే కార్టోకాటయాన్ మధ్యస్థం ఏర్పడేందుకు వీలుగా ఉన్న ద్విబంధ కార్బన్పై సంకలనం చెందుతుంది.”
→ ఇథిలీన్ ను మస్టర్డ్ వాయువు తయారీలో వాడతారు.
→ అయొడోఫామ్ను (CHI3) సిల్వర్ పొడితో వేడిచేస్తే ఎసిటిలీన్ వస్తుంది.
→ ఎసిటిలీన్లో హైడ్రోజన్లకు ఆమ్ల లక్షణం వస్తుంది.
→ బెంజీన్ మరియు బెంజీన్ కలిగి ఉన్న సమ్మేళనాలను ఏరోమాటిక్ సమ్మేళనాలంటారు. రెజొనెన్స్ వలన వీటికి స్థిరత్వం ఎక్కువ. ఇవి ప్రత్యేక ధర్మాలను చూపిస్తాయి.
→కోలార్ను పాక్షిక స్వేదనానికి గురిచేస్తే బెంజీన్ ఏర్పడుతుంది.
→ బెంజీన్ ఏరోమాటిక్ ఎలక్ట్రోఫిలిక్ ప్రతిక్షేపణ చర్యలలో పాల్గొంటుంది.
→ ఆర్థో, పారా స్థాననిర్దేశక గ్రూపులు :
– OH, – NH2, – NHR, – OCH3 – CH3 మొ॥నవి.
→ మెటా నిర్దేశక గ్రూపులు :
– SO3H, – CHO, – COR, – CO2R మొ॥నవి.
→ బహు కేంద్రక వలయాల హైడ్రోకార్బన్లు క్యాన్సర్ కారకాలు ఉదా: 1, 2 బెంజ్ పైరీన్, 1, 2 బెంజాన్ సీన్
→ క్షేత్ర సాదృశ్యాల నామకరణానికి E-Z సాంకేతిక పద్ధతిని వాడతారు.
→ కర్బన సమ్మేళనంలో ఒక కార్టన్ నాలుగు వేరువేరు గ్రూపులతో కలిసి ఉంటే అది అసౌష్టవ అణువు.
→ స్వాంటే ఆర్టీనియస్ (1859-1927)
ఆర్జీనియస్ స్వీడన్ దేశస్థుడు. భౌతిక, రసాయనక శాస్త్రజ్ఞుడు. ఈయనకు 1903లో నోబెల్ బహుమతి లభించింది.