Students can go through AP Inter 1st Year Chemistry Notes 12th Lesson పర్యావరణ రసాయన శాస్త్రం will help students in revising the entire concepts quickly.
AP Inter 1st Year Chemistry Notes 12th Lesson పర్యావరణ రసాయన శాస్త్రం
→ భూమి చుట్టూ ఉండే పొరను వాతావరణం అంటారు.
→ పర్యావరణం నాలుగు విభాగాలుగా విభజించబడింది. అవి :
(a) వాతావరణం
(b) జలావరణం
(c) భూమ్యావరణం
(d) జీవావరణం
→ వాతావరణం నాలుగు భాగాలుగా విభజింపబడింది. అవి :
(a) పరివర్తన మండలం
(b) సమతాప మండలం
(c) మధ్య మండలం
(d) ఉష్ణతా మండలం.
→ భూమిపై జీవరాసుల మనుగడకు కారణమైన గాలి, నీరులను కలుషితం చేసి ప్రకృతి సమతుల్యాన్ని భంగపరచి సకల ప్రాణికోటి ఆరోగ్య జీవనానికి ప్రమాదకారియై, వినాశనానికి దారితీసే పదార్థాలను “కాలుష్య కారిణులు” అంటారు.
→ మానవుని కార్యకలాపాల వల్ల పర్యావరణంలోకి చేరుతూ దుష్ఫలితాన్ని కలుగచేసే రసాయనాలను “మాలిన్యకారిణులు” అంటారు.
→ కాలుష్యకం వల్ల ప్రభావితమయ్యే యానకాన్ని “గ్రాహకుడు” అంటారు.
→ దీర్ఘకాలికంగా కాలుష్యకంతో ఉంటూ చర్య జరిపే యానకాన్ని “శోషక నెలవులు” అంటారు.
→ నీటిలో ఉన్న సేంద్రియ పదార్థాలను ఆక్సీకరణం చెందించడానికి కావలసిన ఆక్సిజన్ పరిమాణాన్ని “రసాయన ఆక్సిజన్ అవసరం” (COD) అంటారు.
→ 20°C వద్ద 5 రోజులలో నీటిలోని వ్యర్థ పదార్థాలు వినియోగించుకునే ఆక్సిజన్ పరిమాణాన్ని “జీవరసాయన ఆక్సిజన్ అవసరం” (BOD) అంటారు.
→ నీటి మొక్కలు ఆర్యోగవంతంగా ఉండాలంటే నీటిలో ఉన్న ఆక్సిజన్ పరిమాణం 4 – 6 మి.గ్రా./లీ. ఉండాలి. దీనిని “కరిగి ఉన్న ఆక్సిజన్” (DO) అంటారు.
→ ఒక కాలుష్యకారిణి తన ఉత్పత్తి స్థానం నుండి పర్యావరణ విభాగాలు అయిన గాలి, నీరు, నేల మొదలయిన వాటిలోకి ప్రవేశించే విధానాన్ని “కాలుష్యకారిణి యొక్క పథం” అంటారు.
→ ఒక కార్మికుడు కర్మాగారంలో 8 గం॥లు సేపు పనిచేసినపుడు ఆ పరిశ్రమలో ఉన్న విష కాలుష్య పదార్థాలు ఏ మేరకు ఉంటే అతని ఆర్యోగంపై ఎటువంటి హాని కలుగచేయకుండా ఉంటాయో తెలిపే పరిమాణాన్ని “ఆరంభ అవధి విలువ” అంటారు.
→ CO2, SO2, SO3, NO, NO2, CH4, మొదలగునవి వాతావరణ కాలుష్యకారిణులు.
→ SO2, వలన ఆమ్ల వర్షం మరియు స్మాగ్ ఏర్పడతాయి.
→ pH విలువ 4 5 ఉండు వర్షపు నీటిని ఆమ్ల వర్షం అంటారు. దీనిలో H2SO4, HNO, లు ఉంటాయి.
→ అవాంఛనీయ విషపూరిత రసాయన పదార్థాల ఉనికి వలన నీటి యొక్క భౌతిక, రసాయనిక మరియు జీవపరమైన లక్షణాలు మార్పుచెంది మానవులకు మరియు జలప్రాణులకు హాని కలుగచేయు పరిస్థితిని జలకాలుష్యం అంటారు.
→ త్రాగునీటిలో గల అధిక ఫ్లోరైడ్ పరిమాణం వలన దంతాల రంగుమారుట, ఎముకల పటుత్వం తగ్గుటను “ఫ్లోరోసిస్” అంటారు.
→ ఓజోన్ పొర సూర్యకాంతిలో UV కిరణాలను శోషించుకొనుట ద్వారా భూమిపై గల జీవులను కాపాడుతుంది.
→ కార్టన్, క్లోరిన్ మరియు ఫ్లోరిన్ గల సమ్మేళనాలను క్లోరోఫ్లోరో కార్టన్లు అంటారు.
→ శీతలీకరణులుగా ఉపయోగించే CFC లను ఫ్రియాన్లు అంటారు.
→ CFC లు వాతావరణంలోని ఓజోన్ పొరను నాశనం చేస్తాయి.
→ కర్మాగారాలు, పరిశ్రమల వ్యర్థ పదార్థాలతో నగరాల నుంచి వచ్చే వ్యర్థాలు, రేడియో ధార్మిక కాలుష్యాలు, వ్యవసాయ పద్ధతులు, రసాయన, యాంత్రిక వ్యర్థాలు, జీవ సంబంధ కారకాలు, మట్టి అడుగుకు చేరే ఘన పదార్థాలు లాంటి అనేక పదార్థాలతో భూమి కలుషితమవుతుంది.
→ భూ కాలుష్యాన్ని నియంత్రించడానికి చేయవలసిన పనులు వ్యర్థాలను జాగ్రత్తగా ప్రోగుచేయడం, వనరులను పొందడం, జీవి చికిత్స, జీవ సాంకేతిక విధానాలు, విట్రిఫికేషన్, పునస్చక్రియ విధానాలు మొదలగునవి.
→ రసాయన శాస్త్రం, ఇతర శాస్త్ర విభాగాలను ఉపయోగించి వాటి అవగాహన, సూత్రాలతో సాధ్యమైనంతవరకు పర్యావరణంలో కాలుష్యం రాకుండా చూడటం గురించి చెప్పేదే హరిత రసాయన శాస్త్రం.
→ హరిత రసాయన శాస్త్రంలో ముఖ్యమైనది గ్రీన్ హౌస్ వాయువులైన CH4, CO2 వంటివి ఏర్పడకుండా చూసి గ్రీన్ హౌస్ ప్రభావం లేకుండా ఉంచడం.
→ హరిత రసాయన శాస్త్రం తక్కువ ఖర్చుతో కూడినది. తక్కువ రసాయనాలు వాడటం, తక్కువ శక్తి ఉపయోగించడం, అతి తక్కువ కారకాలను ఉత్పత్తి చేయడం దీని ముఖ్య ఉద్దేశం.
→ భోరెనో రొమానో ఎపీడియో కార్లో అవగాడ్రో డిక్వరెక ఎడి కారెటో (1776-1856)
1811లో అవగాడ్రో ఈ నియమాన్ని ప్రతిపాదించాడు. దీని ప్రకారం “సమఉష్ణోగ్రత, పీడనాల వద్ద సమాన ఘనపరిమాణాలు గల వాయువులు అన్నింటిలో సమాన సంఖ్యలో అణువులు ఉంటాయి”. అవగాడ్రో