Students can go through AP Inter 1st Year Chemistry Notes 4th Lesson పదార్ధం స్థితులు : వాయువులు, ద్రవాలు will help students in revising the entire concepts quickly.
AP Inter 1st Year Chemistry Notes 4th Lesson పదార్ధం స్థితులు : వాయువులు, ద్రవాలు
→ అయాన్ – ద్విధృవ బలాలు, ద్విధృవ – ద్విధృవ ఆకర్షణలు, లండన్ విక్షేపక బలాలు, ద్విధృవ ప్రేరిత ద్విధృవ బలాలు మొ॥ అంతరణు బలాలు.
→ గ్రాహమ్ వాయు నియమము:
“ఇచ్చిన పీడనం, ఉష్ణోగ్రతల వద్ద ఒక వాయువు నిస్సరణ వేగం ఆ వాయువు సాంద్రత వర్గమూలానికి విలోమానుపాతంలో ఉంటుంది.
r ∝ \(\frac{1}{\sqrt{d}}\)
→ డాల్టన్ పాక్షిక పీడనాల నియమం :
ఇచ్చిన ఘనపరిమాణం గల ఒక పాత్రలో ఆదర్శ వాయువుల మిశ్రమం కలుగజేసే పీడనం, ఆ మిశ్రమంలోని వాయువులు ఒక్కొక్కటి అదే పాత్రలో అదే ఉష్ణోగ్రత వద్ద తీసుకొన్నప్పుడు కలుగజేసే విడివిడి పీడనాల విలువల మొత్తానికి సమానం.
Pమిశ్రమం = P1 + P2 + P3 + ……….
→ అవగాడ్రో నియమం :
సమాన ఘనపరిమాణాలు గల వాయువులన్నీ సమాన ఉష్ణోగ్రత, పీడనాల వద్ద సమాన సంఖ్యలో అణువులు (లేదా) మోల్లు కలిగి ఉంటాయి.
→ బాయిల్ నియమం :
స్థిర ఉష్ణోగ్రత వద్ద నియమిత ద్రవ్యరాశి ఉన్న ఒక వాయువు ఘనపరిమాణం దాని పీడనానికి విలోమాను పాతంలో ఉంటుంది.
→ చార్లెస్ నియమం :
ఇచ్చిన ఘనపరిమాణం, ద్రవ్యరాశి గల ఒక వాయువు పీడనం దాని కెల్విన్ ఉష్ణోగ్రతకు అనులోమానుపాతంలో ఉంటుంది.
→ అణుచలన సిద్ధాంత ప్రతిపాదనలను తు.చ. తప్పకుండా పాటించే వాయువులను ఆదర్శ వాయువులంటారు.
→ అణుచలన సిద్ధాంతం ప్రతిపాదికగా ఉత్పాదించిన సమీకరణాన్ని చలద్వాయు సమీకరణం అంటారు. అది
PV = \(\frac{1}{3}\)mnu2
→ ఒక వాయువులోని వివిధ అణువుల వేగ వర్గాల సగటు వర్గమూలాన్ని RMS వేగం అంటారు.
→ ఒక వాయువులో మొత్తం అణువులలో ఎక్కువ అణువులకు ఏ వేగం ఉంటుందో ఆ వేగాన్ని గరిష్ఠ సంభావ్యతా వేగం (Ump) అంటారు.
→ ఒక వాయువులో అన్ని అణువుల వేగాల సగటు విలువను సగటు వేగం (uav) అంటారు.
→ వివిధ ఉష్ణోగ్రతల వద్ద వాయువు యొక్క P – V వక్రాలను సమ ఉష్ణోగ్రత వక్రాలు అందురు.
→ సంపీడన గుణకం (Z)
→ ఆదర్శ వాయువుకు Z = 1
→ (P + \(\frac{a^2}{V^2}\))(V – nb) = nRT ను వాండర్ వాల్ స్థితి సమీకరణం అంటారు.
→ సందిగ్ధ పీడనం (Pc), సందిగ్ధ ఉష్ణోగ్రత (Tc) మరియు సందిగ్ధ ఘనపరిమాణం (Vc) లను సందిగ్ధ స్థిరాంకాలు
→ ఏ ఉష్ణోగ్రత వద్ద బాష్పపీడనం బాహ్య పీడనానికి సమం అవుతుందో ఆ ఉష్ణోగ్రతను ఆ పీడనం వద్ద ద్రవం బాష్పీభవన స్థానమంటారు.
→ స్నిగ్ధత అనేది ద్రవం ప్రవహించడానికి వీలుకాకుండా వ్యతిరేకించే బలం. ‘n’ అనేది స్నిగ్ధతా గుణకం.
→ లూయీ డీబోలీ (1892-1987)
లూయీ డీబ్రోలీ ఫ్రెంచ్ భౌతిక శాస్త్రవేత్త. ఎలక్ట్రాన్కు తరంగ స్వభావం ఉందని కనుక్కొన్నందుకు 1929లో నోబెల్ బహువతి లభించింది.