Students can go through AP Inter 1st Year Chemistry Notes 3rd Lesson రసాయన బంధం – అణు నిర్మాణం will help students in revising the entire concepts quickly.
AP Inter 1st Year Chemistry Notes 3rd Lesson రసాయన బంధం – అణు నిర్మాణం
→ శక్తిపరంగానూ, ఎలక్ట్రాన్ విన్యాసపరంగానూ స్థిరత్వాన్ని పొందుటకు పరమాణువులు సంయోగం చెంది అణువులను ఇస్తాయి.
→ వేలన్సీ ఎలక్ట్రాన్లు మాత్రమే బంధంలో పాల్గొంటాయి.
→ ns2 np6 విన్యాసం కలిగి ఉన్న పరమాణువులు లేక అయాన్లు మిగిలిన వాని కన్నా ఎక్కువ స్థిరమైనవి.
→ రసాయన బంధం మూడు రకాలు. అవి
- అయానిక బంధం
- సమయోజనీయ బంధం
- సమన్వయ సమయోజనీయ
→ విరుద్ధ విద్యుదావేశాలు గల అయాన్ల మధ్య ఉండే స్థిర విద్యుదాకర్షణ బలాలనే అయానిక బంధం అంటారు.
→ అనంత దూరంలో, వాయుస్థితిలో గల విరుద్ధ ఆవేశం గల అయాన్లు ఒకదానినొకటి ఆకర్షించుకొని ఒక మోల్ అయానిక స్ఫటికం ఏర్పడేటపుడు విడుదలయ్యే శక్తిని జాలకశక్తి లేక లాటిస్ శక్తి అంటారు.
→ అయానిక స్ఫటికంలో ఒక అయాన్ చుట్టూ అతి సన్నిహితంగా సమాన దూరాలలో ఉన్న విరుద్ధ ఆవేశం గల అయాన్ల సంఖ్యనే దాని సమన్వయ సంఖ్య అంటారు.
→ NaCl స్ఫటికం – ఫలక కేంద్రిత ఘనం – దాని సమన్వయ సంఖ్య 6. CsCl స్ఫటికం – అంతఃకేంద్రిత ఘనం – దాని సమన్వయ సంఖ్య 8.
→ పరమాణువులు ఎలక్ట్రాన్ జంటలను పంచుకొనుట వలన సమయోజనీయ బంధం ఏర్పడుతుంది.
→ వ్యతిరేక స్పిన్లు గల ఒంటరి ఎలక్ట్రాన్లున్న ఆర్బిటాళ్ళు అతిపాతం చెందుట వలన సమయోజనీయ బంధం ఏర్పడుతుంది.
→ రేఖీయ అతిపాతం వలన 6 – బంధం, ప్రక్కవాటు అతిపాతం వలన T బంధం ఏర్పడతాయి.
→ దాదాపు సమాన శక్తి గల ఆర్బిటాళ్ళు కలిసిపోయి తిరిగి అదే సంఖ్యలో సర్వసమానాలైన క్రొత్త ఆర్బిటాళ్ళు ఏర్పడుటను సంకరీకరణం అంటారు.
→ సాధారణంగా sp, sp, sp3, spld, sp’d’ సంకరీకరణాలు జరుగుతాయి.
→ అణువు రెండు చివరలయందు రెండు రకాల ఆవేశాలు గల దానిని ద్విధ్రువం అంటారు.
→ ఒక అణువు నందలి అధిక ఋణవిద్యుదాత్మకత గల పరమాణువుకి బంధితమైన హైడ్రోజన్ పరమాణువుకు అదే అణువులోని లేక మరొక అణువు నందలి అధిక ఋణవిద్యుదాత్మక పరమాణువు (F, O లేదా N) నకు గల బలహీనమైన ఆకర్షణ బలాన్ని హైడ్రోజన్ బంధం అంటారు.
→ అణువులో బంధిత కేంద్రకాల చుట్టూ ఎలక్ట్రాన్లను కనుగొనే సంభావ్యత అధికంగా ఉన్న ప్రాంతాన్ని అణు ఆర్బిటాల్ అంటారు. అణు తరంగ అణుప్రమేయంను అణు ఆర్బిటాల్ అంటారు.
→ ఆక్సిజన్ (లేదా) దానికంటే భారమూలకాల విషయంలో అణు ఆర్బిటాల్ల శక్తిస్థాయిల వరసక్రమము
→ బంధక్రమము (Bond order)
→ అణు ఆర్బిటాల్ సిద్ధాంతం ద్వారా ఆక్సిజన్ అణువుకు పారాయస్కాంత స్వభావముంటుందని ఋజువు చేయబడినది.
→ పదార్థాలు వాయువులు, ద్రవాలు, ఘనపదార్థాలు అనే మూడు స్థితులలో ఉంటాయి.
→ ద్విధృవ భ్రామకం (µ) = ఆవేశం (Q) × రెండు ధృవాల మధ్య దూరం (r)
→ పీటర్ డిజై:
పీటర్ డిబై డచ్ దేశస్తుడు. X- కిరణాల వివర్తన, ద్విదువభ్రామక పరిశోధ నలకు 1936లో నోబుల్ బహుమతి లభించింది. ఆయన జ్ఞాపకార్థం ద్విధ్రువ భ్రామక పరిమాణ ప్రమాణానికి డిబైగా నిర్ణయించారు.