Andhra Pradesh BIEAP AP Inter 1st Year Civics Study Material 10th Lesson లౌకికవాదం Textbook Questions and Answers.
AP Inter 1st Year Civics Study Material 10th Lesson లౌకికవాదం
వ్యాసరూప సమాధాన ప్రశ్నలు
ప్రశ్న 1.
లౌకిక వాదమంటే ఏమిటో నిర్వచించి, లౌకికవాద భావనలను వివరించండి.
జవాబు:
పరిచయం: లౌకికవాదమనేది ఒక ప్రధానమైన సామాజిక, రాజకీయ దృగ్విషయం. అనేక సమకాలీన ప్రపంచదేశాలు తమ ప్రభుత్వ వ్యవహారాలలో లౌకికతను అనుసరిస్తున్నాయి. లౌకికవాదం ప్రత్యేకంగా మతంతో. సంబంధంలేని, స్వతంత్ర ఆదర్శాలను ప్రభోదిస్తుంది. ప్రభుత్వాలు మతంతో నిమిత్తం లేకుండా నైతికత, విద్యలాంటి సూత్రంపై ఆధారపడతాయనే దృక్పథమే లౌకికవాదం. వర్తమాన ప్రాపంచిక జీవనం దైవికమైనది కాకుండా కొన్ని నైతిక ప్రమాణాలు, పాలనా నియమాలు మానవ కార్యకలాపాలను నిర్ణయిస్తాయని లౌకికవాదం పేర్కొంటుంది. లౌకికవాదానికి మతాన్ని దూషించే ఉద్దేశం లేదు. మతం, రాజ్యం అనేవి రెండు ప్రత్యేక విభాగాలని అది గట్టిగా ఉద్ఘాటించింది.
అర్థం: Secular అనే ఆంగ్ల పదానికి లాటిన్ భాషలో అర్థం “ఇహలోకం” (This World) ఈ పదం మతానికి వ్యతిరేకమనే అర్థాన్ని ఇస్తుంది.
నిర్వచనం:
- జి. జె. హోల్యోక్: “లౌకికవాదం అంటే మతవిశ్వాసాలను విమర్శించకుండా లేదా తిరస్కరించకుండా మతంతో సంబంధంలేని ఒకానొక సామాజిక వ్యవస్థను ప్రోత్సహించటమనే భావన” గా నిర్వచించారు.
- ఎరిక్ ఎస్. వాటర్ హౌస్: “మతంలో పేర్కొన్న దానికంటే భిన్నమైన జీవనం, ప్రవర్తనలకు సంబంధించిన సిద్ధాంతాన్ని ప్రతిపాదించే ఒకానొక ఆదర్శమే లౌకికవాదం” అని అభిప్రాయపడ్డారు.
లౌకికవాద భావనలు (Concepts of secularism): లౌకికవాదం ప్రధానంగా నాలుగు భావనలను కలిగి ఉంది. అవి
- మానవతావాదం, హేతువాద భావన
- రాజకీయ, సామాజిక దృక్కోణం
- స్వేచ్ఛ, ప్రజాస్వామ్యం
- మతం పట్ల వ్యతిరేకత
ఈ నాలుగు భావనలను గురించి ఈ దిగువ పేర్కొన్న విధంగా వివరించవచ్చు.
1) మానవతావాదం, హేతువాద భావన (Humanistic and Atheistic philosophy): లౌకికవాదం అనేక వ్యక్తిగత, సాంస్కృతిక, రాజకీయ, సామాజిక అంతరార్థాలను కలిగి ఉంటుంది. మానవుల శ్రేయస్సును కోరుకొనుట చేత అది మానవతా స్వభావాన్ని కలిగి ఉంటుంది. మానవుడు అన్ని విషయాలకు కొలమానం అనే సామెతకు అది ప్రాముఖ్యతను ఇస్తుంది. ఇది మతాన్ని సమర్థించదు లేదా వ్యతిరేకించదు. వ్యక్తులు తమకు ఇష్టమైన మతాన్ని ఎంపిక చేసుకొని, అనుసరించేందుకు వీలు కల్పిస్తుంది.
2) రాజకీయ, సామాజిక దృక్కోణం (Political and Social dimension): లౌకిక వాదానికి నిర్దిష్టమైన రాజకీయ, సామాజిక దృక్కోణాలున్నాయి. అది సహజసిద్ధమైన, భౌతిక దృక్పథాలతోనూ, రాజకీయ, ఆర్థిక స్వావలంబనలతో కూడిన వ్యవస్థాపనకు ప్రతీకగా ఉంటుంది. కుటుంబానికి, సంస్థలకు మరియు సమాజానికి మత స్వాతంత్య్రానికి ఇది వీలు కల్పిస్తుంది.
3) స్వేచ్ఛ, ప్రజాస్వామ్యం (Liberty and Democracy): స్వేచ్ఛ, ప్రజాస్వామ్యానికి లౌకికవాదం ప్రయోజనకరమైనది. అలాగే ఉదార ప్రజాస్వామ్యానికి ప్రాతిపదికగా ఉంటుంది. లౌకికవాదం అధికారిక మత నాయకత్వాన్ని మత సంస్థల ఉనికి, కొనసాగింపు, మనుగడలను తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. ప్రజాసామ్యం, ప్రభుత్వాధికారాల వికేంద్రీకరణను సమర్ధిస్తుంది.
4) మతం పట్ల వ్యతిరేకత (Opposition to Religion): లౌకికవాదం ప్రజా వ్యవహారాలను మతం సమర్థించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. మతాధికారుల ప్రాబల్యతలను ఖండిస్తుంది. మానవజీవనానికి సంబంధించిన అప్రధాన అంశాలలో మతం ఒకటిగా పేర్కొంటూ, మత ప్రాధాన్యాన్ని తగ్గిస్తుంది. సమాజంలో శాంతి భద్రతలకు భంగం కలగని రీతిలో ప్రజలు వారి మత విశ్వాసాలను, ఆచారాలను అనుసరించవచ్చని పేర్కొంటుంది. ఇతర మతాలకు చెందిన వారికి ఏ విధమైన అపకారం, ద్వేషం, అసూయలు కలిగించకుండా వ్యక్తులు వారి మత కార్యక్రమాలను నిర్వహించుకోవచ్చని స్పష్టీకరించింది. రాజ్యాంగపు మహోన్నత ఆశయాలు, ఆకాంక్షలను ప్రతి ఒక్కరూ దృష్టిలో ఉంచుకోవాల్సి ఉంటుందని ఉద్ఘాటించింది.
ప్రశ్న 2.
లౌకికవాదం అర్థం, విభిన్న దృక్కోణాలు వర్ణించండి.
జవాబు:
అర్థం: Secular అనే ఆంగ్ల పదానికి లాటిన్ భాషలో అర్థం “ఇహలోకం” (This World) ఈ పదం మతానికి వ్యతిరేకమనే అర్థాన్ని ఇస్తుంది.
నిర్వచనం:
1. జి. జె. హోల్యోక్: “లౌకికవాదం అంటే మతవిశ్వాసాలను విమర్శించకుండా లేదా తిరస్కరించకుండా మతంతో సంబంధంలేని ఒకానొక సామాజిక వ్యవస్థను ప్రోత్సహించటమనే భావన” గా నిర్వచించారు.
2. ఎరిక్ ఎస్. వాటర్ హౌస్: “మతంలో పేర్కొన్న దానికంటే భిన్నమైన జీవనం, ప్రవర్తనలకు సంబంధించిన సిద్ధాంతాన్ని ప్రతిపాదించే ఒకానొక ఆదర్శమే లౌకికవాదం” అని అభిప్రాయపడ్డారు.
లౌకికవాదం దృక్కోణాలు (Dimensios of Secularism): లౌకికవాదం దృక్కోణాలు మూడు రకాలు. అవి 1) సామాజిక దృక్కోణం 2) ఆర్థిక దృక్కోణం 3) రాజకీయ దృక్కోణం. వీటిని గురించి క్రింద పేర్కొన్న విధంగా పరిశీలించవచ్చు.
1) సామాజిక దృక్కోణం (Social dimension): లౌకికవాద భావన సామాజిక జీవనంలో మూఢత్వాలను విస్మరించడం లేదా వదిలి వేయడానికి సంబంధించింది. కుల, మత, వర్గాల పరంగా వ్యక్తులు వ్యవహరించడాన్ని లౌకికవాదం ఎట్టి పరిస్థితులలో అనుమతించదు. సమాజంలో ఇరుగు పొరుగు వారితో వ్యవహరించేటప్పుడు వ్యక్తులు అస్త్రశ్యత, వెట్టి చాకిరీ వంటి దురాచారాలను పాటించరాదని అభిలషిస్తుంది. ఇతరులను తమతో సమానంగాను, గౌరప్రదంగానూ చూసుకోవాలని సలహా ఇస్తుంది. కుల వ్యత్యాసాలు, వర్గ వివక్షతలు, జాతి విద్వేషాలు వంటి దుర్గుణాల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని బోధిస్తుంది. అంతిమంగా సమాజంలో వ్యక్తుల మధ్య సామరస్య పూర్వక సంబంధాలను సూచిస్తుంది.
2) ఆర్థిక దృక్కోణం (Economic dimension): లౌకికవాదం వ్యక్తులు తమ ఇష్టానుసారంగా తమకు నచ్చిన వృత్తులను ఎన్నుకొని వాటిని ఆచరించటానికి, అనుసరించటానికి, ప్రచారం చేసుకోవడానికి కావలసిన స్వేచ్ఛను లౌకికవాదం కల్పిస్తుంది.
సమాజంలోని సహజ, మానవ, ఆర్థిక సంపదల ఉత్పత్తి కార్యకలాపాలలో వ్యక్తుల మధ్య మతపరమైన వివక్షతలను పాటించడాన్ని లౌకికవాదం నివారిస్తుంది. పారిశ్రామికవేత్తలకు లైసెన్సుల మంజూరులో మతపరమైన అంశాలను రాజ్యాధికారులు పాటించడాన్ని అనుమతించదు. ఆర్థిక వ్యవస్థలో పారిశ్రామిక లైసెన్సుల మంజూరు వంటి వ్యవహారాలలో యోగ్యత, నైపుణ్యం, ప్రోత్సాహస్ఫూర్తి వంటి అంశాలకు ప్రాధాన్యతనిస్తుంది.
3) రాజకీయ దృక్కోణం (Political dimension): లౌకికవాదానికి కొన్ని రాజకీయ దృక్కోణాలు ఉంటాయి. లౌకిక వాదం రాజకీయ వ్యవహారాలలో పౌరులందరికీ పూర్తిస్వేచ్ఛా, స్వాతంత్ర్యాలను అనుమతిస్తుంది. మతం, పరిపాలన, రాజకీయ, చట్టనిర్మాణం, ప్రభుత్వ విధానాల అమలు వంటివి పూర్తిగా మతంతో సంబంధం లేనివిగా విశ్వసిస్తుంది. లౌకిక రాజ్యంలో ప్రజా ప్రతినిధులను ఎన్నుకొనే విషయంలో పౌరులకు అనేక రాజకీయ హక్కులు, స్వాతంత్ర్యాలు ప్రసాదిస్తుంది. మతపరమైన అంశాలతో సంబంధం లేకుండా ప్రతి పౌరుడు ప్రభుత్వ పదవిని చేపట్టేందుకు అవకాశం ఇస్తుంది. రాజకీయ హక్కులను ప్రసాదించడంలో మతం అనేది ఒక ఆవశ్యక అంశంగా పరిగణించకుండా ప్రజల యొక్క ప్రజాస్వామిక ఆకాంక్షలు, స్వాతంత్ర్యాలకు మార్గాన్ని ఏర్పరుస్తుంది. క్లుప్తంగా చెప్పాలంటే లౌకికవాదపు రాజకీయ దృక్కోణం ఆధునిక రాజ్యపు ప్రజాస్వామిక పనితీరుతో సమానంగా పరిగణించబడుతుంది.
ప్రశ్న 3.
లౌకికవాదం అర్థం, సుగుణాల గురించి మీకు తెలిసింది రాయండి.
జవాబు:
అర్థం: Secular అనే ఆంగ్ల పదానికి లాటిన్ భాషలో అర్థం “ఇహలోకం” (This World) ఈ పదం మతానికి వ్యతిరేకమనే అర్థాన్ని ఇస్తుంది.
నిర్వచనం: “మతంలో పేర్కొన్న దానికంటే భిన్నమైన జీవనం, ప్రవర్తనలకు సంబంధించిన సిద్ధాంతాన్ని ప్రతిపాదించే ఒకానొక ఆదర్శమే లౌకికవాదం” అని ఎరిక్. ఎస్. వాటర్ హౌస్ పేర్కొన్నాడు.
లౌకికవాదం సుగుణాలు (Merits of Secularism):
1) సమత (Equity): లౌకికవాదం సమసమాజానికి ప్రాతిపదిక. అన్ని మతాల వారిని సమానంగా పరిగణిస్తుంది. మానవులు సృష్టించిన అసమానతలను గుర్తించదు. అలాగే కుల, మత, వర్ణ, వర్గ, ప్రాంతీయ భాషాపరమైన వివక్షతలకు తావు ఇవ్వదు. దాంతో ప్రజలు జాతిపట్ల ఎంతో దృఢమైన సానుకూలమైన భావాన్ని కలిగి ఉంటారు.
2) మత స్వాతంత్ర్యం (Religious Freedom): లౌకికవాదం, మత స్వాతంత్య్రాన్ని ప్రజలు సంపూర్ణంగా అనుభవించుటకు దోహదపడుతుంది. రాజ్యం వ్యక్తుల మత వ్యవహారాలలో జోకం్య చేసుకోదు. లౌకిక రాజ్యంలో రాజ్యాంగం, వివిధ చట్టాలు, వ్యక్తులకు తమ ఇష్టం వచ్చిన మతాన్ని స్వీకరించుటకు, ప్రబోధించుటకు, ప్రచారం చేసుకొనేందుకు, సంపూర్ణమైన స్వాతంత్ర్యాన్ని ప్రసాదిస్తాయి.
3) శాంతి భద్రతలు (Law and Order): వర్తమాన కాలంలో రాజ్యం, ప్రభుత్వం, ఇతర సంస్థలు ఎంతో విచారకరమైన, దుఃఖదాయకమైన మతానుకూల ఉద్యమాలను ప్రోత్సహించడం లేదా ప్రత్యక్షంగా మద్దతు ఇవ్వడాన్ని మనం గమనించవచ్చు. దాంతో విభిన్న మతసముదాయాలకు చెందిన ప్రజల మధ్య సామరస్యం సాధించడం అనేది పెద్ద సవాలుగా పరిణమించింది. అటువంటి సందర్భాలలో లౌకికవాదం మతపరమైన ఘర్షణలను, విద్వేషాలను నివారించగలుగుతుంది. అంతిమంగా, ప్రజల మధ్య మత సామరస్యాన్ని లౌకికవాదం పెంపొందించడం జరుగుతుంది.
4) సమన్యాయ పాలన (Rule of Law): లౌకికవాదం సమన్యాయపాలన అనే భావనకు ప్రాధాన్యతనిస్తుంది. లౌకికవాదాన్ని అనుసరించే రాజ ఏ ఒక్క మతానికి కాకుండా అన్ని మతాలకు చెందిన ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని చట్టాలను రూపొందించి అమలు చేస్తుంది. చట్ట నిర్మాణ సమయంలో ప్రజలకు మత ఛాందస భావాలను పరిగణనలోనికి తీసుకోదు. అలాగే చట్ట నిర్మాణం, చట్టాల అమలు, చట్టాల వ్యాఖ్యానంలో ప్రజలకు ఏ మతంతో సంబంధం లేకుండా లౌకిక రాజ్యం వ్యవహరిస్తుంది.
5) సహనం (Tolerance): లౌకికవాదం సహనం, దయార్ధ గుణాన్ని ప్రబోధిస్తుంది. విశ్వమానవ సౌభ్రాతృత్వాన్ని, భగవంతుడి పితృత్వంల (Fatherhood) పట్ల విశ్వాసాన్ని కలిగి ఉంటుంది. దాతృత్వం, జాలి, ప్రేమ, ఔదార్యం, అహింస వంటి మహోన్నత గుణాలను ప్రబోధించి, ప్రచారం గావించి ఆచరణలో ఉంచుతుంది.
6) జాతీయ సమైక్యత (National Integration): లౌకికవాదం, ప్రజలలో జాతీయ సమైక్యత, సమగ్రత భావాలను పెంపొందించే ఉత్తమ సాధనంగా దోహదపడుతుంది. భిన్నత్వంలో ఏకత్వ సాధనకు ఉత్తమ కారకంగా భావించబడుతుంది. విభిన్న మతాలు, వాడుకలు అనుసరించే ప్రజల మధ్య ఐక్యతను సాధిస్తుంది.
7) మైనారిటీల రక్షణ (Protection to the Minorities): లౌకికవాద రాజ్యం అందరినీ ఒకే రకంగా ఆదరిస్తుంది. సమాజంలో మెజారిటీ వర్గం ఇతర వర్గాల మధ్య ఎటువంటి వివక్షతను చూపదు. అదే సమయంలో మతపరమైన మెజారిటీ వర్గం ఆధిపత్యాల నుంచి మైనారిటీ వర్గాల ప్రయోజనాలను పరిరక్షించి, వారికి ప్రత్యేక సౌకర్యాలను కల్పిస్తుంది. మైనారిటీ వర్గాల వారి పట్ల మతసహనాన్ని పాటించాల్సిందిగా ప్రజలకు బోధిస్తుంది.
8) అన్ని రంగాల ప్రగతి (Allround Progress): లౌకికవాదంలోని అత్యంత గొప్ప సుగుణం ఏమిటంటే ప్రజలు అన్ని రంగాలలో ప్రగతిని సాధించేందుకు దోహదపడుతుంది. సమాన్యాయ పాలన, మత సహనం, ప్రభుత్వ తటస్థ వైఖరి వంటి అంశాలు లౌకికవాదంలో ఉండుట చేత ఆ రకమైన ప్రగతి సాధ్యమవుతుంది. ప్రత్యేకంగా సంక్షేమం, సామాజిక న్యాయం, అసౌకర్యానికి గురైన వర్గాల ప్రయోజనాల పరిరక్షణ వంటి విషయాలకు సంబంధించి అన్ని మతాలకు చెందిన ప్రజల ప్రగతికి లౌకిక వాదం కృషి చేస్తుంది.
ప్రశ్న 4.
లౌకిక రాజ్యాన్ని నిర్వచించి, లౌకిక రాజ్యం లక్షణాలు, ప్రాముఖ్యతను విశదీకరించండి. [Mar. 2016]
జవాబు:
నిర్వచనాలు:
1. జి. జె. హోల్యోక్: “లౌకికవాదం అంటే మతవిశ్వాసాలను విమర్శించకుండా లేదా తిరస్కరించకుండా మతంతో సంబంధంలేని ఒకానొక సామాజిక వ్యవస్థను ప్రోత్సహించటమనే భావన” గా నిర్వచించారు.
2. ఎరిక్ ఎస్. వాటర్ హౌస్: “మతంలో పేర్కొన్న దానికంటే భిన్నమైన జీవనం, ప్రవర్తనలకు సంబంధించిన సిద్ధాంతాన్ని ప్రతిపాదించే ఒకానొక ఆదర్శమే లౌకికవాదం” అని అభిప్రాయపడ్డారు.
లక్షణాలు:- లౌకిక రాజ్యం కింది లక్షణాలను కలిగి ఉంటుంది.
1. మతానికి తావు లేదు (No place for religion): లౌకిక రాజ్యం ఏ ఒక్క మతం పట్ల ప్రత్యేక శ్రద్ధను చూపదు. మతపరమైన అంశాల ప్రాతిపదికపై చట్టాలను రూపొందించదు, అమలు చేయదు.
2. సమాన హోదా (Equal status): లౌకికరాజ్యం ప్రజలందరికీ సమాన హోదాను కల్పిస్తుంది. వ్యక్తుల మధ్య కులం, వర్ణం, మతం, తెగ, ప్రాంతం, భాషలవారీగా ఎటువంటి వివక్షతను చూపదు. దాంతో ప్రజలు సంతృప్తి చెంది, వివిధ విధానాలు, కార్యక్రమాల అమలులో ప్రభుత్వానికి సహకారాన్ని అందిస్తారు. విభిన్న మత సముదాయాలకు చెందిన వారందరూ ఇరుగు పొరుగు వారితో సామరస్యంతో కలసిమెలసి నివసిస్తారు.
3. అధికారిక మతం లేకుండుట (No State reglion): లౌకిక రాజ్యం ఏ ఒక్క మతాన్ని అధికార మతంగా గుర్తించదు. మత వ్యవహారాలలో తటస్థ వైఖరిని అవలంబిస్తుంది. ప్రజల మతపరమైన భావాలతో సంబంధం లేకుండా వివిధ చట్టాలను, సామాజిక సంక్షేమ కార్యకలాపాలను అమలు చేస్తుంది. ప్రభుత్వ వ్యవహారాలలో ఏ ఒక్క మతానికి ప్రత్యేకమైన ప్రాధాన్యతను ఇవ్వదు. విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు, న్యాయ సంస్థలు వంటి అన్ని ప్రభుత్వ సంస్థల కార్యకలాపాలను ఏ ఒక్క మతంతో సంబంధం లేకుండా నిర్వహిస్తుంది.
లౌకికరాజ్యం ప్రాముఖ్యత (Importance of Secular State): ఇటీవలి కాలంలో లౌకిక రాజ్య భావన ఎంతగానో ప్రాముఖ్యతను సంతరించుకొంది. ప్రజాస్వామిక స్ఫూర్తి, శాస్త్ర సాంకేతికత, రవాణా సదుపాయాల అభివృద్ధి, హేతుబద్ధమైన చింతన, శ్రేయోవాదం వంటి అంశాల ప్రభావం చేత లౌకిక రాజ్య ప్రాముఖ్యత పెరిగింది. మొత్తం మీద | లౌకిక రాజ్య ప్రాముఖ్యతను కింది అంశాల ద్వారా వివరించవచ్చు.
- లౌకిక రాజ్యం దేశంలోని వివిధ రంగాలలోని మతేతర శక్తులను బలపరుస్తుంది.
- ప్రజల హృదయాలలో పాతుకుపోయిన దురాచారాలను, మూఢ విశ్వాసాలను పారద్రోలుతుంది.
- మత పరమైన విద్వేషం, మతమౌఢ్యాలను పారద్రోలడం ద్వారా సామాజిక సంస్కరణలకు దోహదపడుతుంది.
- ప్రజలలో శాస్త్రీయ చింతనను పెంపొందించి, వారి మేధోపరమైన వికాసానికి తోడ్పడుతుంది.
- విశ్వాసంపై హేతువుకు, కాల్పనికతపై తర్కానికి, కట్టుకథలపై వాస్తవికతలకు ఆధిక్యతనిస్తుంది.
- మతపరమైన మైనారిటీ వర్గాలకు భద్రతను కల్పించి వారి రక్షణకు హామీనిస్తుంది.
- ప్రతి వ్యక్తి మతపరమైన విశ్వాసాలను గౌరవిస్తుంది.
భారత రాజ్యాంగ మూడవ భాగములో ప్రాథమిక హక్కుల జాబితాలో మత స్వాతంత్య్రపు హక్కు 25వ నిబంధన నుండి 28వ నిబంధన వరకు వివరించబడెను. ఈ హక్కు ప్రకారం భారతదేశంలో మతస్వేచ్ఛ అమలు చేయబడుతుంది.
భారతదేశంలో లౌకిక రాజ్యం – లక్షణాలు:
- 25వ నిబంధన ప్రకారం: ప్రతి వ్యక్తి తనకు నచ్చిన మతాన్ని స్వీకరించి పూజ, ఆరాధన కార్యక్రమాలను స్వేచ్ఛగా నిర్వహించుకొనవచ్చును.
- 26వ నిబంధన ప్రకారం: మతాభివృద్ధిని చేసుకొనవచ్చును.
- 27వ నిబంధన ప్రకారం: మతపరమైన పన్నులు, చందాలు నిర్బంధముగా వసూలు చేయకూడదు.
- 28వ నిబంధన ప్రకారం: ప్రభుత్వ ఆర్థిక సహాయంతో నిర్వహించబడే విద్యాసంస్థలలో మతబోధనలు చేయకూడదు.
- 14వ నిబంధన ప్రకారం: భారత ప్రజలందరూ ఏ మతము, ఏ శాఖ వారైనప్పటికిని సమానముగా చూడబడతారు.
- సమాజంలో అశాంతి కలగకుండా మత విధానాల వ్యాప్తి, పూజా ప్రార్థనా విధానాలు, పూజా ప్రార్థనా మందిరాల నిర్మాణం చేపట్టవచ్చు.
- అవసరమైతే స్వచ్ఛందంగా నిధులు సమకూర్చుకోవచ్చు. స్వచ్ఛందంగా మతస్థుల ద్వారా పన్నులు వసూలు చేసుకోవచ్చు.
- ఏ మత కార్యకలాపమైనా పరమత సహనాన్ని కలిగి ఉండాలి.
- మరో మతాన్ని లేదా మతాభిప్రాయాలను కించపరచే విధంగా గానీ, రెచ్చగొట్టే విధంగా గాని ఉండరాదు.
- మత కార్యకలాపాలు సమాజ శాంతి భద్రతలకు విఘాతం కలిగించరాదు.
భారతదేశంలో ఏ వ్యక్తి పట్ల మతపరంగా విచక్షణ చూపరు. ఏ మతానికి చెందిన వ్యక్తి అయినా విచక్షణకు గురి కాకుండా ఎలాంటి ఉన్నత పదవులనైనా చేపట్టవచ్చు. ఈ విధంగా రాజ్యాంగం మన దేశాన్ని లౌకిక రాజ్యంగా తీర్చిదిద్దింది. ఆచరణలో మన లౌకికతత్వంలో చిన్న చిన్న పొరపాట్లు దొర్లినా మన మౌలిక లక్ష్యం, గమ్యం లౌకిక రాజ్యస్థాపనే!
ప్రశ్న 7.
భారతదేశాన్ని లౌకిక రాజ్యంగా రూపొందించేందుకు అవసరమైన చర్యలను సూచించండి.
జవాబు:
భారతదేశంలో హిందూ, ఇస్లామ్, క్రైస్తవ, సిక్కు, బౌద్ధ, జైన, పార్శీ మతాలకు చెందిన ప్రజలు నివశిస్తున్నారు. భారత సమాజపు లౌకిక స్వరూపానికి కొన్ని కులాల మధ్య ఏర్పడిన ఘర్షణలు, పెచ్చరిల్లిన హింస భంగం కలిగించాయి. అటువంటి విచారకర సంఘటనల గురించి పత్రికలు ప్రతిరోజూ వెల్లడిస్తూనే ఉన్నాయి. అటువంటి సంఘటనలన్నింటికి మతమౌడ్యం, కులజాడ్యాలే కారణంగా పేర్కొనవచ్చు. స్వాతంత్య్రం తరువాత కుల, మత ప్రాతిపదికపై అనేక సంఘాలు స్థాపించబడినాయి. రాజకీయ నాయకులు, అసాంఘిక శక్తుల మధ్యగల సంబంధం కుల, మత తత్త్వాలను వెల్లడించాయి. అధికార, ప్రతిపక్ష స్థానాలలోని రాజకీయ నాయకులు రాజకీయ కారణాలతో ప్రజల మధ్య మతపరమైన ఆవేశాలను రెచ్చగొట్టడం సర్వసాధారణమైంది. అంతేకాకుండా కొందరు మతపెద్దలు ప్రజలలో మతపరమైన భావాలను రెచ్చగొట్టడమే పనిగా పెట్టుకొన్నారు. పైన పేర్కొన్న అంశాలన్నీ సమాజంలో శాంతియుత వాతావరణానికి భంగం కలిగిస్తున్నాయి.
కాబట్టి ప్రజల మనస్సులలో పాతుకుపోయిన మతపరమైన సంకుచిత భావాలను నిర్మూలించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఈ సందర్భంలో ప్రభుత్వం, రాజకీయ పార్టీలు, స్వచ్ఛంద సంస్థలు, ప్రజలు క్రింద పేర్కొన్న చర్యలను చేపట్టాల్సి ఉంటుంది.
- మత సంస్థలు నిర్వహించే సమావేశాలలో మంత్రులు, ప్రభుత్వ అధికారులు పాల్గొనరాదు. ప్రభుత్వ భవనాల నిర్మాణానికి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవం వంటి కార్యక్రమాలలో మతపరమైన ప్రార్థనలు, పూజలు జరుపరాదు. ఏ ఒక్క మతం పట్ల ప్రత్యేక అభిమానాన్ని చూపేందుకు ప్రయత్నించరాదు.
- జాతీయ లేదా సామాజిక ప్రయోజనాలకు, రాజ్యాంగానికి భంగం కలిగించే మతసంస్థలను ప్రభుత్వం నిషేధించాలి.
ప్రశ్న 5.
భారతదేశంలో లౌకికవాద నేపధ్యాన్ని పేర్కొనండి.
జవాబు:
బ్రిటిష్ ప్రభుత్వపాలన భారతదేశంలో అనేక విద్యా సంస్కరణలను ప్రారంభించింది. శాస్త్రవిజ్ఞానానికి ప్రాముఖ్యతను ఇచ్చింది. అదే సమయంలో భారతదేశంలోని రెండు ప్రధాన మతాలైన హిందువులు, మహమ్మదీయుల మధ్య మతపరమైన విషబీజాలను నాటింది. అందులో భాగంగా చట్టసభలలో మహమ్మదీయులకు ప్రత్యేక స్థానాలను కేటాయించింది. దాంతో భారత రాజకీయాలలో మతపరమైన ఘర్షణలు ఎడతెగని లక్షణంగా పరిణమించాయి. ఈ పరిస్థితి పట్ల చరిత్రకారులు కూడా తీవ్ర విచారాన్ని వెలిబుచ్చారు. ఈ సందర్భంలో వారు భిన్నమైన వివరణలను అందించారు. స్వాతంత్ర్యానికి పూర్వం భారతదేశంలో నెలకొన్న విచారకరమైన మత పరిస్థితులకు బ్రిటిష్ పాలకులను వారు నిందించారు. జనాభా పరిమాణం ఆధారంగా బ్రిటిష్ పాలకులు హిందువులు, మహమ్మదీయుల మధ్య ప్రాధాన్యత ఇవ్వటంతో మత అంశాల ప్రాతిపదికపై భారతీయుల మధ్య ఆవేశాలను ప్రోవు చేశారు. దాంతో భారతదేశంలో నివసించే విషయంలో మైనారిటీలలో అభద్రతా భావం నెలకొంది. కాలక్రమేణా మతఘర్షణలు, మతవిద్వేషాలు అనేవి భారతదేశంలో దైనందిన చర్యలుగా పరిణమించాయి. ఈ రకమైన పరిస్థితి అంతిమంగా మహమ్మదాలీ జిన్నా వంటి నాయకులు ‘ద్విజాతి సిద్ధాంతం’ (Two Nations Theory) ప్రతిపాదించేందుకు దారితీసింది. మరొకవైపు హిందూ మహాసభ వంటివి మత ప్రయోజనాలకు ప్రతీకగా నిలిచాయి. ఈ సంస్థలు భారతదేశాన్ని హిందూ ఆధిక్య ప్రధానమైన దేశంగా పరిగణించాయి. 1947 ఆగస్టులో భారత యూనియన్ ఇండియా, పాకిస్థాన్లుగా విడిపోవుటకు రాజకీయ పరిస్థితుల తీవ్రతయే కారణంగా పేర్కొనవచ్చు. దేశ విభజన తరువాత కూడా మతపరమైన విబేధాలు కొనసాగడం మతతత్వానికి పరాకాష్టగా భావించవచ్చు. స్వాతంత్ర్యం సిద్ధించి ఆరు దశాబ్దాలు గడిచినప్పటికీ భారతదేశంలో ఏదో ఒక ప్రాంతంలో మత ఘర్షణలు సంభవించడం లౌకిక వాదానికి సవాలుగా పరిణమించిందని చెప్పవచ్చు.
భారతదేశానికి స్వాతంత్య్రం సిద్ధించిన తరువాత ఆమోదించబడిన భారత రాజ్యాంగం లౌకిక వాదాన్ని భారతదేశ గణతంత్ర వ్యవస్థకు ప్రధాన ఆలంబనగా పేర్కొన్నది. దాని ప్రకారం భారతరాజ్యాంగం భారతదేశాన్ని లౌకిక రాజ్యంగా ప్రకటించింది. భారతదేశంలోని కేంద్ర, రాష్ట్ర, ప్రభుత్వాలు లౌకిక వాదాన్ని సిద్ధాంతపరమైన ఆచరణాత్మక భావనగా అనుసరించసాగాయి. చట్ట నిర్మాణం, దాని అమలు, రాజ్య పరిపాలనకు సంబంధించిన వ్యవహారాలలో ఆ ప్రభుత్వాలేవీ మతాన్ని అనుసరించరాదని భారత రాజ్యాంగం పేర్కొంది. భారతీయులు తమకు ఇష్టమైన మతవిశ్వాసాలను ప్రబోధించుకొనేందుకు, ప్రచారంగావించేందుకు సంపూర్ణమైన మతస్వాతంత్ర్యాన్ని కలిగి ఉండేందుకు భారత రాజ్యాంగం వీలు కల్పించింది. భారతదేశంలో రాజ్యం మతానుకూలమైనది, మత వ్యతిరేకమైనది కాదు. అందుకు బదులుగా అది రాజ్య వ్యవహారాలలో తటస్థ వైఖరిని అనుసరిస్తుంది. భారతరాజ్యాంగం మతం ఆధారంగా ప్రజలపై పన్నులు విధించి, వసూలు చేసేందుకు వీలు కల్పించలేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక నిధులతో సంపూర్ణంగా గానీ, పాక్షికంగా గానీ నిర్వహించబడే విద్యాసంస్థలలో మతం ఆధారంగా ప్రవేశాలను నిషేదించమని పేర్కొంది. అలాగే పైన పేర్కొన్న సంస్థలలో మత బోధనలను నిషేధించడమైంది. కాబట్టి రాజ్యాంగ పరమైన అంశాల ప్రకారం లౌకిక వాదానికి ఎంతో ప్రాధాన్యత ఉందని చెప్పవచ్చు.
భారత రాజ్యాంగ పీఠికలో ‘లౌకిక’ అనే పదాన్ని (42వ సవరణ) చట్టం ద్వారా 1976లో చేర్చడమైంది. పార్లమెంటులో భారత రాజ్యాంగం (42వ సవరణ) ముసాయిదా బిల్లును ప్రవేశపెట్టిన సందర్భంగా భారతదేశ తృతీయ ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరాగాంధీ కింది విధంగా ప్రకటించారు. “లౌకికవాదం అనేది మతానికి మతానికి మధ్య అభిమానాన్ని, వివక్షతను చూపడం కాదు. అన్ని మతాల ప్రజల పట్ల సమానమైన గౌరవాన్ని ప్రదర్శించడమే లౌకిక వాదం. కేవలం మతసహనాన్ని ప్రదర్శించడం ద్వారానే ఏ దేశ భవిష్యత్తు ఆధారపడి ఉండదు. ప్రతి మత సముదాయానికి చెందిన వారు ఇతర మతాల సముదాయాలకు చెందిన వారి పట్ల సానుకూల గౌరవాన్ని చూపడమనేది అందరి కర్తవ్యం”.
ప్రశ్న 6.
భారతదేశం లౌకిక రాజ్యమా ? కొన్ని ఉదాహరణల ద్వారా సమర్థిస్తూ జవాబు రాయండి.
జవాబు:
భారతదేశం లౌకిక రాజ్యముగా ప్రకటించబడినది. ప్రాచీన కాలం నుండి భారతదేశములో లౌకిక భావాలు ఉన్నాయి. పరమత సహనము, సహజీవనము భారతీయులలో ఉన్నత ఆదర్శాలుగా ఉన్నవి. భారతదేశంలో క్రైస్తవ, ఇస్లామ్, జైన, సిక్కు, బౌద్ధ, పార్శిక, హిందూ మతాలు సమానంగా ఆదరించబడుచున్నవి.
భారత రాజ్యాంగ పీఠిక భారతదేశాన్ని రాజ్యంగా ప్రకటించింది. భారత రాజ్యాంగాన్ని 1976వ సంవత్సరములో 42వ రాజ్యాంగ సవరణ జరిపి “లౌకిక” అనే పదాన్ని చేర్చడం జరిగింది.
భారత రాజ్యాంగ మూడవ భాగములో ప్రాథమిక హక్కుల జాబితాలో మత స్వాతంత్య్రపు హక్కు 25వ నిబంధన నుండి 28వ నిబంధన వరకు వివరించబడెను. ఈ హక్కు ప్రకారం భారతదేశంలో మతస్వేచ్ఛ అమలు చేయబడుతుంది.
భారతదేశంలో లౌకిక రాజ్యం – లక్షణాలు:
- 25వ నిబంధన ప్రకారం: ప్రతి వ్యక్తి తనకు నచ్చిన మతాన్ని స్వీకరించి పూజ, ఆరాధన కార్యక్రమాలను స్వేచ్ఛగా నిర్వహించుకొనవచ్చును.
- 26వ నిబంధన ప్రకారం: మతాభివృద్ధిని చేసుకొనవచ్చును.
- 27వ నిబంధన ప్రకారం: మతపరమైన పన్నులు, చందాలు నిర్బంధముగా వసూలు చేయకూడదు.
- 28వ నిబంధన ప్రకారం: ప్రభుత్వ ఆర్థిక సహాయంతో నిర్వహించబడే విద్యాసంస్థలలో మతబోధనలు చేయకూడదు.
- 14వ నిబంధన ప్రకారం: భారత ప్రజలందరూ ఏ మతము, ఏ శాఖ వారైనప్పటికిని సమానముగా చూడబడతారు.
- సమాజంలో అశాంతి కలగకుండా మత విధానాల వ్యాప్తి, పూజా ప్రార్థనా విధానాలు, పూజా ప్రార్థనా మందిరాల నిర్మాణం చేపట్టవచ్చు.
- అవసరమైతే స్వచ్ఛందంగా నిధులు సమకూర్చుకోవచ్చు. స్వచ్ఛందంగా మతస్థుల ద్వారా పన్నులు వసూలు చేసుకోవచ్చు.
- ఏ మత కార్యకలాపమైనా పరమత సహనాన్ని కలిగి ఉండాలి.
- మరో మతాన్ని లేదా మతాభిప్రాయాలను కించపరచే విధంగా గానీ, రెచ్చగొట్టే విధంగా గాని ఉండరాదు.
- మత కార్యకలాపాలు సమాజ శాంతి భద్రతలకు విఘాతం కలిగించరాదు.
భారతదేశంలో ఏ వ్యక్తి పట్ల మతపరంగా విచక్షణ చూపరు. ఏ మతానికి చెందిన వ్యక్తి అయినా విచక్షణకు గురి కాకుండా ఎలాంటి ఉన్నత పదవులనైనా చేపట్టవచ్చు. ఈ విధంగా రాజ్యాంగం మన దేశాన్ని లౌకిక రాజ్యంగా తీర్చిదిద్దింది. ఆచరణలో మన లౌకికతత్వంలో చిన్న చిన్న పొరపాట్లు దొర్లినా మన మౌలిక లక్ష్యం, గమ్యం లౌకిక | రాజ్యస్థాపనే !
ప్రశ్న 7.
భారతదేశాన్ని లౌకిక రాజ్యంగా రూపొందించేందుకు అవసరమైన చర్యలను సూచించండి.
జవాబు:
భారతదేశంలో హిందూ, ఇస్లామ్, క్రైస్తవ, సిక్కు, బౌద్ధ, జైన, పార్శీ మతాలకు చెందిన ప్రజలు నివశిస్తున్నారు. భారత సమాజపు లౌకిక స్వరూపానికి కొన్ని కులాల మధ్య ఏర్పడిన ఘర్షణలు, పెచ్చరిల్లిన హింస భంగం కలిగించాయి. అటువంటి విచారకర సంఘటనల గురించి పత్రికలు ప్రతిరోజూ వెల్లడిస్తూనే ఉన్నాయి. అటువంటి సంఘటనలన్నింటికి మతమౌడ్యం, కులజాడ్యాలే కారణంగా పేర్కొనవచ్చు. స్వాతంత్ర్యం తరువాత కుల, మత ప్రాతిపదికపై అనేక సంఘాలు స్థాపించబడినాయి. రాజకీయ నాయకులు, అసాంఘిక శక్తుల మధ్యగల సంబంధం కుల, మత తత్త్వాలను వెల్లడించాయి. అధికార, ప్రతిపక్ష స్థానాలలోని రాజకీయ నాయకులు రాజకీయ కారణాలతో ప్రజల మధ్య మతపరమైన ఆవేశాలను రెచ్చగొట్టడం సర్వసాధారణమైంది. అంతేకాకుండా కొందరు మతపెద్దలు ప్రజలలో మతపరమైన భావాలను రెచ్చగొట్టడమే పనిగా పెట్టుకొన్నారు. పైన పేర్కొన్న అంశాలన్నీ సమాజంలో శాంతియుత వాతావరణానికి భంగం కలిగిస్తున్నాయి.
కాబట్టి ప్రజల మనస్సులలో పాతుకుపోయిన మతపరమైన సంకుచిత భావాలను నిర్మూలించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఈ సందర్భంలో ప్రభుత్వం, రాజకీయ పార్టీలు, స్వచ్ఛంద సంస్థలు, ప్రజలు క్రింద పేర్కొన్న చర్యలను చేపట్టాల్సి ఉంటుంది.
- మత సంస్థలు నిర్వహించే సమావేశాలలో మంత్రులు, ప్రభుత్వ అధికారులు పాల్గొనరాదు. ప్రభుత్వ భవనాల నిర్మాణానికి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవం వంటి కార్యక్రమాలలో మతపరమైన ప్రార్థనలు, పూజలు జరుపరాదు.
- ఒక్క మతం పట్ల ప్రత్యేక అభిమానాన్ని చూపేందుకు ప్రయత్నించరాదు.
- జాతీయ లేదా సామాజిక ప్రయోజనాలకు, రాజ్యాంగానికి భంగం కలిగించే మతసంస్థలను ప్రభుత్వం నిషేధించాలి.
- కొన్ని ప్రత్యేక ప్రాంతాలలో మతసామరస్యానికి భంగం కలిగించే రీతిలో మతపరమైన కట్టడాలను ప్రభుత్వం
అనుమతించరాదు. - భూసంస్కరణలు, కుటుంబ సంక్షేమం, ఉపాధి విస్తరణ వంటి ఇతర కార్యక్రమాలను మతంతో సంబంధం లేకుండా ప్రభుత్వం అమలుచేయాలి.
- ఎన్నికల సమయంలో ఓట్లను చేజిక్కించుకొనేందుకై రాజకీయ పార్టీలు మతాన్ని వాడుకోవడాన్ని ప్రభుత్వం నిషేధించాలి. అలాగే మతపరమైన అంశాల ఆధారంగా పార్టీల స్థాపన, నిర్వహణలపై నిషేధం విధించాలి. ఎన్నికల సమయంలో మతపరమైన చిహ్నాలను ఎవరూ వినియోగించకుండా చర్యలు చేపట్టాలి.
- ప్రభుత్వం పాఠ్యగ్రంథాలను లౌకిక ప్రాతిపదికపై ప్రచురించాలి. పాఠ్యగ్రంథాలలో మతసామరస్యాన్ని పాటిస్తూ, విశ్వమతాలకు సంబంధించిన అంశాలను పొందుపరచాలి.
- వివిధ సమాచార ప్రసారాల సంస్థలన్నీ మత ప్రాతిపదికపై వార్తలను ప్రచురించి, ప్రచారంలోకి తీసుకు రాకూడదు. మతపరమైన ఘర్షణలకు అనవసరమైన ప్రాధాన్యతనిస్తూ ఇతర ప్రాంతాలలో ఆ రకమైన ఘర్షణలు చోటుచేసుకొనేందుకు ఏ మాత్రం అవకాశం ఇవ్వరాదు.
స్వల్ప సమాధాన ప్రశ్నలు
ప్రశ్న 1.
లౌకికవాద ఆవిర్భావం గురించి రాయండి.
జవాబు:
ప్రాచీన, మధ్యయుగాలలో మతపరమైన రాజ్యాలుండేవి. ఆ యుగాలలో రాజ్య వ్యవహారాలలో మతం ఎంతో ప్రాధాన్యమైన పాత్రను పోషించింది. పాలకులు, ప్రజల మతవిశ్వాసాలను గుర్తించి, గౌరవించి పరిపాలించేవారు. మతం సమాజంలో శాంతి భద్రత, స్థిరత్వాలను అందించి వ్యక్తుల మధ్య సంబంధాలను నియంత్రించింది. దేశ పరిపాలన సాఫీగా కొనసాగేందుకు అవసరమైన రాజకీయ విధేయతను అందించేందుకు మతం దోహదకారి అయింది.
అయినప్పటికీ మతాచార్యులకు, సంస్కరణవాదులకు మధ్య ఘర్షణలు ఏర్పడి సమాజంలో అరాచకం ప్రబలింది. మతం పేరుతో ప్రజల మీద అత్యున్నతాధికారం చెలాయించేందుకు ఆధ్యాత్మికవాదులు, మత పెద్దలు ప్రయత్నిస్తే లౌకిక పాలకులు వారి వ్యూహాలను నిర్వీర్యపరచారు. రాజ్య వ్యవహారాల నుంచి మతాన్ని వేరు చేసారు. ప్రాచీన రోమన్ చక్రవర్తులు క్రైస్తవ మతాన్ని గుర్తించేందుకు నిరాకరించారు. మధ్యయుగంలో మార్టిన్ లూథర్, కాల్విన్ జ్వింగిలాంటి సాంఘిక, మత సంస్కరణవాదులు మత పెద్దల ఆధ్యాత్మిక గుత్తాధిపత్యాన్ని సవాలు చేశారు. మత, ఆధ్యాత్మిక విషయాలన్ని కూడా పూర్తిగా వ్యక్తిగత, స్వీయ వ్యవహారాలుగా వీరు భావించారు. మతపరమైన విషయాలపై వారి ప్రసంగాలు విశేషమైన ప్రభావాన్ని చూపాయి. ఆధునిక కాలంలో మాకియవెల్లి, జీనోడిన్ వంటి రాజనీతి తత్వవేత్తలు రాజకీయాల నుంచి మతాన్ని వేరుచేయాలని గట్టిగా పేర్కొన్నారు. జాన్లాక్ వంటి ఉదారవాద తత్వవేత్తలు మత సహనాన్ని ప్రజలు అనుసరించాలని సూచించారు. పైన పేర్కొన్న తాత్వికుల రచనలు కాలక్రమేణ ప్రజలపై ప్రభావాన్ని చూపటంతో, మతమనేది ఒక వైయుక్తిక, స్వీయ వ్యవహారంగా భావించటం మొదలైంది. అమెరికా దేశాధ్యక్షుడైన థామస్ జఫర్సన్ లౌకికవాదపు నిజమైన అర్థాన్ని వివరిస్తూ రాజ్యం, మతం మధ్య స్పష్టమైన హద్దులు ఉన్నాయని ప్రకటించారు.
కాబట్టి ఆధునిక కాలంలో లౌకికవాదాన్ని పైన పేర్కొన్న కారణాలు ప్రగాఢంగా ప్రభావితం చేసాయని పేర్కొనవచ్చు.
ప్రశ్న 2.
లౌకికవాద వ్యాప్తికి దోహదపడే అంశాలను పేర్కొనండి.
జవాబు:
ప్రపంచంలోని అనేక ప్రాంతాలలో లౌకికవాద వ్యాప్తికి క్రింద పేర్కొన్న కారకాలు దోహదపడ్డాయని చెప్పవచ్చు.
- మూఢనమ్మకాల పట్ల ప్రజలలో వ్యతిరేక ధోరణి.
- హేతుబద్ధమైన చింతన, వ్యాప్తి.
- ప్రజాస్వామ్య విలువలు, సంస్థల విస్తరణ.
- శాస్త్రసాంకేతిక రంగాలలో పురోగతి.
- మతపరమైన దోషాల పట్ల అప్రమత్తత.
- సామాజిక శాసనాల ప్రభావం.
- లౌకిక దృక్పథం, ఆవశ్యకత.
- సామాజిక, ఆర్థిక రంగాలలో వ్యక్తుల పురోగతి.
- లౌకిక రాజకీయ నాయకత్వ ప్రభావం.
- అంతర్జాతీయ శాంతి భావనలకు ప్రాధాన్యత.
ప్రశ్న 3.
లౌకికవాదంలోని ఏ మూడు భావనలైనా విశదీకరించండి.
జవాబు:
లౌకికవాద భావనలు (Concepts of secularism): లౌకికవాదం ప్రధానంగా నాలుగు భావనలను కలిగి ఉంది. అవి
- మానవతావాదం, హేతువాద భావన
- రాజకీయ, సామాజిక దృక్కోణం
- స్వేచ్ఛ, ప్రజాస్వామ్యం
- మతం పట్ల వ్యతిరేకత
ఈ నాలుగు భావనలను గురించి ఈ దిగువ పేర్కొన్న విధంగా వివరించవచ్చు.
1) మానవతావాదం, హేతువాద భావన (Humanistic and Atheistic philosophy): లౌకికవాదం కోరుకొనుట అనేక వ్యక్తిగత, సాంస్కృతిక, రాజకీయ, సామాజిక అంతరార్థాలను కలిగి ఉంటుంది. మానవుల శ్రేయస్సును చేత అది మానవతా స్వభావాన్ని కలిగిఉంటుంది. మానవుడు అన్ని విషయాలకు కొలమానం అనే సామెతకు అది ప్రాముఖ్యతను ఇస్తుంది. ఇది మతాన్ని సమర్థించదు లేదా వ్యతిరేకించదు. వ్యక్తులు తమకు ఇష్టమైన మతాన్ని ఎంపిక చేసుకొని, అనుసరించేందుకు వీలు కల్పిస్తుంది.
2) రాజకీయ, సామాజిక దృక్కోణం (Political and Social dimension): లౌకిక వాదానికి నిర్దిష్టమైన రాజకీయ, సామాజిక దృక్కోణాలున్నాయి. అది సహజసిద్ధమైన, భౌతిక దృక్పథాలతోనూ, రాజకీయ, ఆర్థిక స్వావలంబనలతో కూడిన వ్యవస్థాపనకు ప్రతీకగా ఉంటుంది. కుటుంబానికి, సంస్థలకు మరియు సమాజానికి మత స్వాతంత్ర్యానికి ఇది వీలు కల్పిస్తుంది.
3) స్వేచ్ఛ, ప్రజాస్వామ్యం (Liberty and Democracy): స్వేచ్ఛ, ప్రజాస్వామ్యానికి లౌకికవాదం ప్రయోజనకరమైనది. అలాగే ఉదార ప్రజాస్వామ్యానికి ప్రాతిపదికగా ఉంటుంది. లౌకికవాదం అధికారిక మత నాయకత్వాన్ని మత సంస్థల ఉనికి, కొనసాగింపు, మనుగడలను తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. ప్రజాసామ్యం, ప్రభుత్వాధికారాల వికేంద్రీకరణను సమర్థిస్తుంది.
4) మతం పట్ల వ్యతిరేకత (Opposition to Religion): లౌకికవాదం ప్రజా వ్యవహారాలను మతం సమర్థించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. మతాధికారుల ప్రాబల్యతలను ఖండిస్తుంది. మానవజీవనానికి సంబంధించిన అప్రధాన అంశాలలో మతం ఒకటిగా పేర్కొంటూ, మత ప్రాధాన్యాన్ని తగ్గిస్తుంది. సమాజంలో శాంతి భద్రతలకు భంగం కలగని రీతిలో ప్రజలు వారి మత విశ్వాసాలను, ఆచారాలను అనుసరించవచ్చని పేర్కొంటుంది. ఇతర మతాలకు చెందిన వారికి ఏ విధమైన అపకారం, ద్వేషం, అసూయలు కలిగించకుండా వ్యక్తులు వారి మత కార్యక్రమాలను నిర్వహించుకోవచ్చని స్పష్టీకరించింది. రాజ్యాంగపు మహోన్నత ఆశయాలు, ఆకాంక్షలను ప్రతి ఒక్కరూ దృష్టిలో ఉంచుకోవాల్సి ఉంటుందని ఉద్ఘాటించింది.
ప్రశ్న 4.
లౌకికవాదం దృక్కోణాలను క్లుప్తంగా విశ్లేషించండి.
జవాబు:
లౌకికవాదం దృక్కోణాలు (Dimensions of Secularism): లౌకికవాదం దృక్కోణాలు మూడు రకాలు. అవి 1) సామాజిక దృక్కోణం 2) ఆర్థిక దృక్కోణం 3) రాజకీయ దృక్కోణం. వీటిని గురించి క్రింద పేర్కొన్న విధంగా పరిశీలించవచ్చు.
1) సామాజిక దృక్కోణం (Social dimension): లౌకికవాద భావన సామాజిక జీవనంలో మూఢత్వాలను విస్మరించడం లేదా వదిలివేయడానికి సంబంధించింది. కుల, మత, వర్గాల పరంగా వ్యక్తులు వ్యవహరించడాన్ని లౌకికవాదం ఎట్టి పరిస్థితులలో అనుమతించదు. సమాజంలో ఇరుగు పొరుగు వారితో వ్యవహరించేటప్పుడు వ్యక్తులు అస్పృశ్యత, వెట్టి చాకిరీ వంటి దురాచారాలను పాటించరాదని అభిలషిస్తుంది. ఇతరులను తమతో సమానంగాను, గౌరవప్రదంగానూ చూసుకోవాలని సలహా ఇస్తుంది. కుల వ్యత్యాసాలు, వర్గ వివక్షతలు, జాతి విద్వేషాలు వంటి దుర్గుణాల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని బోధిస్తుంది. అంతిమంగా సమాజంలో వ్యక్తుల మధ్య | సామరస్యపూర్వక సంబంధాలను సూచిస్తుంది.
2) ఆర్థిక దృక్కోణం (Economic dimension): లౌకికవాదం వ్యక్తులు తమ ఇష్టానుసారంగా తమకు నచ్చిన వృత్తులను ఎన్నుకొని వాటిని ఆచరించటానికి, అనుసరించటానికి, ప్రచారం చేసుకోవడానికి కావలసిన స్వేచ్ఛను లౌకికవాదం కల్పిస్తుంది.
సమాజంలోని సహజ, మానవ, ఆర్థిక సంపదల ఉత్పత్తి కార్యకలాపాలలో వ్యక్తుల మధ్య మతపరమైన వివక్షతలను పాటించడాన్ని లౌకికవాదం నివారిస్తుంది. పారిశ్రామికవేత్తలకు లైసెన్సుల మంజూరులో మతపరమైన అంశాలను రాజ్యాధికారులు పాటించడాన్ని అనుమతించదు. ఆర్థిక వ్యవస్థలో పారిశ్రామిక లైసెన్సుల మంజూరు వంటి వ్యవహారాలలో యోగ్యత, నైపుణ్యం, ప్రోత్సాహస్ఫూర్తి వంటి అంశాలకు ప్రాధాన్యతనిస్తుంది.
3) రాజకీయ దృక్కోణం (Political dimension): లౌకికవాదానికి కొన్ని రాజకీయ దృక్కోణాలు ఉంటాయి. లౌకిక వాదం రాజకీయ వ్యవహారాలలో పౌరులందరికీ పూర్తిస్వేచ్ఛా, స్వాతంత్ర్యాలను అనుమతిస్తుంది. మతం, పరిపాలన, రాజకీయ, చట్టనిర్మాణం, ప్రభుత్వ విధానాల అమలు వంటివి పూర్తిగా మతంతో సంబంధం లేనివిగా విశ్వసిస్తుంది. లౌకిక రాజ్యంలో ప్రజా ప్రతినిధులను ఎన్నుకొనే విషయంలో పౌరులకు అనేక రాజకీయ హక్కులు, స్వాతంత్ర్యాలు ప్రసాదిస్తుంది. మతపరమైన అంశాలతో సంబంధం లేకుండా ప్రతి పౌరుడు ప్రభుత్వ పదవిని చేపట్టేందుకు అవకాశం ఇస్తుంది. రాజకీయ హక్కులను ప్రసాదించడంలో మతం అనేది ఒక ఆవశ్యక అంశంగా పరిగణించకుండా ప్రజల యొక్క ప్రజాస్వామిక ఆకాంక్షలు, స్వాతంత్ర్యాలకు మార్గాన్ని ఏర్పరుస్తుంది. క్లుప్తంగా చెప్పాలంటే లౌకికవాదపు రాజకీయ దృక్కోణం ఆధునిక రాజ్యపు ప్రజాస్వామిక పనితీరుతో సమానంగా పరిగణించబడుతుంది.
ప్రశ్న 5.
మతరాజ్యం అంటే ఏమిటి ? [Mar. 2016]
జవాబు:
మతరాజ్యం (Theocratic State) అంటే రాజ్యానికి ఒక అధికార మతం ఉంటుంది. సాధారణంగా అధికార మతం ఉన్న మతరాజ్యాలలో ఇతర మతాల నిషేధం ఉంటుంది. లేదా ఇతర మతాల కార్యకలాపాలపై చాలా నియంత్రణ ఉంటుంది. మత రాజ్యాలలో దేశంలోని అన్ని కీలక పదవులకు అధికార మతస్థులనే నియమించడం గానీ లేదా ఎన్నుకోవడానికి గాని అర్హత కలిగి ఉంటారు. రాజ్యం మత కార్యకలాపాలలో అధికారికంగా పాల్గొంటుంది. మత | వ్యాప్తికి, పునరుద్ధరణకు, ప్రార్థనాలయాల నిర్మాణానికి రాజ్యం నిధులు సమకూరుస్తుంది. మతసహనం, సహజీవనం ఈ రాజ్యాలలో చాలా తక్కువగా ఉంటుంది. రాజ్యకార్యకలాపాలలో మతపెద్దల, మతాచారాలకు అగ్రతాంబూలం ఉంటుంది. మతపరమైన న్యాయం, చట్టాలలో, ప్రజల జీవనవిధానంలో ప్రముఖంగా కన్పిస్తుంది. ప్రజల జీవన విధానం, వేషధారణ, ఆహారపు అలవాట్లలో కూడా మత ప్రాధాన్యత ఈ రాజ్యాలలో స్పష్టంగా కనిపిస్తుంది.
ప్రశ్న 6.
లౌకికరాజ్యం, మతపరమైన రాజ్యం మధ్య వ్యత్యాసాలను పేర్కొనండి. [Mar. 2018]
జవాబు:
లౌకికరాజ్యం, మతపరమైన రాజ్యం ఒకటి కాదు. ఈ రెండూ రాజ్యంలాంటి మానవీయ రాజకీయ సంస్థలుగా ఉన్నప్పటికీ వీటి మధ్య ఈ క్రింది వ్యత్యాసాలు కలవు.
లౌకికరాజ్యం (Secular State)
- లౌకికరాజ్యం మతేతర అంశాలపై ఆధార పడుతుంది.
- లౌకిక రాజ్యంలో అధికారమతం అంటూ ఏదీ ఉండదు.
- లౌకిక రాజ్యంలో అన్ని మతాలకు చెందిన పౌరులు ఏ విధమైన వివక్షతలు లేకుండా మత స్వాతంత్ర్యాన్ని అనుభవిస్తారు.
- లౌకిక రాజ్యంలో సమన్యాయపాలన ఉంటుంది.
- ఈ రాజ్యంలో పౌరులందరూ శాసన, పాలన, విద్యా, మత, ఆర్థిక, సాంస్కృతిక రంగాలలో సమాన అవకాశాలు పొందుతారు.
- రాజకీయ వ్యవహారాలలో మతాచార్యులకు, ఆధ్యాత్మిక అధిపతులకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉండదు.
- సర్వమత సమానత్వం అనే సూత్రంపై లౌకిక రాజ్యం ఆధారపడుతుంది.
- పన్నుల విధింపులలో మతం అనేది ప్రధాన ప్రాతిపదిక కాదు.
- రాజ్యం మతానుకూలంగానూ, మత వ్యతిరేకంగానూ వ్యవహరించదు.
- ప్రభుత్వ ఆధీనంలో పూర్తిగాను లేదా పాక్షికంగాను నిర్వహించబడుతున్న విద్యాసంస్థలలో విద్యాబోధన లౌకిక తరహాలో జరుగుతుంది.
- తీర్పులను ప్రకటించే, వివాదాల పరిష్కార విషయంలో న్యాయ సంస్థలు మతానికి ప్రత్యేక ప్రాము ఖ్యతను ఇవ్వవు.
మతపరమైన రాజ్యం (Theocratic State)
- ఇది ప్రధానంగా మతపరమైన అంశాలపై ఆధార పడుతుంది.
- మతపరమైన రాజ్యంలో ఏదో ఒక మతానికి అధికారిక మతహోదా కల్పించబడుతుంది.
- అధికారిక హోదా కలిగిన మతానికి సంబంధించిన వారు ఇతర మతాల వారితో పోల్చినట్లయితే ఆధిక్యతను కలిగివుండి, ప్రత్యేక సౌకర్యాలను పొందుతారు.
- సాధారణ చట్టాలపై మతపరమైన ఆదేశాలు పైచేయిగా ఉంటాయి. ఆజ్ఞలకు ఆధిక్యం ఉంటుంది.
- అధికారిక మతానికి చెందిన వారికి సమాజం, రాజ్యం, ప్రభుత్వ రంగాలలో అధిక ప్రాధాన్యత లభిస్తుంది.
- మతాచార్యులకు, ఆధ్యాత్మిక అధిపతులకు అన్ని రంగాలలో ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది.
- ప్రజా వ్యవహారాలలో అధికారిక మతానికి చెందిన వారికి ఎక్కువ ప్రాముఖ్యత ఉంటుందన్న ప్రమేయంపై మతపరమైన రాజ్యం ఆధారపడి ఉంటుంది.
- పన్నుల విధింపులోనూ, పన్ను రాయితీల వర్తింపు విషయంలోనూ మతాన్ని ప్రాతిపదికగా తీసుకుంటారు.
- రాజ్యం అధికారిక మతానికి సంబంధించిన వారిపట్ల ప్రత్యేక అభిమానాన్ని ఆదరణను ప్రదర్శిస్తుంది.
- విద్యా విషయాలలో మతానుకూల అంశాలు అధ్యయనంగా ఉంటాయి.
- వివాదాల పరిష్కారంలో మతపరమైన భావాలను, విశ్వాసాలను న్యాయస్థానాలు పరిగణనలోకి తీసుకొంటాయి.
ప్రశ్న 7.
లౌకికవాదంలోని నాలుగు సుగుణాలను వివరించండి.
జవాబు:
లౌకికవాదం సుగుణాలు (Merits of Secularism):
1) సమత (Equity): లౌకికవాదం సమసమాజానికి ప్రాతిపదిక. అన్ని మతాల వారిని సమానంగా పరిగణిస్తుంది. మానవులు సృష్టించిన అసమానతలను గుర్తించదు. అలాగే కుల, మత, వర్ణ, వర్గ, ప్రాంతీయ భాషాపరమైన వివక్షతలకు తావు ఇవ్వదు. దాంతో ప్రజలు జాతిపట్ల ఎంతో దృఢమైన సానుకూలమైన భావాన్ని కలిగి ఉంటారు.
2) మత స్వాతంత్ర్యం (Religious Freedom): లౌకికవాదం, మత స్వాతంత్ర్యాన్ని ప్రజలు సంపూర్ణంగా అనుభవించుటకు దోహదపడుతుంది. రాజ్యం వ్యక్తుల మత వ్యవహారాలలో జోకం్య చేసుకోదు. లౌకిక రాజ్యంలో రాజ్యాంగం, వివిధ చట్టాలు, వ్యక్తులకు తమ ఇష్టం వచ్చిన మతాన్ని స్వీకరించుటకు, ప్రబోధించుటకు, ప్రచారం చేసుకొనేందుకు, సంపూర్ణమైన స్వాతంత్ర్యాన్ని ప్రసాదిస్తాయి.
3) శాంతి భద్రతలు (Law and Order): వర్తమాన కాలంలో రాజ్యం, ప్రభుత్వం, ఇతర సంస్థలు ఎంతో విచారకరమైన, దుఃఖదాయకమైన మతానుకూల ఉద్యమాలను ప్రోత్సహించడం లేదా ప్రత్యక్షంగా మద్దతు ఇవ్వడాన్ని మనం గమనించవచ్చు. దాంతో విభిన్న మతసముదాయాలకు చెందిన ప్రజల మధ్య సామరస్యం సాధించడం అనేది పెద్ద సవాలుగా పరిణమించింది. అటువంటి సందర్భాలలో లౌకికవాదం మతపరమైన ఘర్షణలను, విద్వేషాలను నివారించగలుగుతుంది. అంతిమంగా, ప్రజల మధ్య మత సామరస్యాన్ని లౌకికవాదం పెంపొందించడం జరుగుతుంది.
4) సమన్యాయ పాలన (Rule of Law): లౌకికవాదం సమన్యాయ పాలన అనే భావనకు ప్రాధాన్యతనిస్తుంది. లౌకికవాదాన్ని అనుసరించే రాజ్యం ఏ ఒక్క మతానికి కాకుండా అన్ని మతాలకు చెందిన ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని చట్టాలను రూపొందించి అమలు చేస్తుంది. చట్ట నిర్మాణ సమయంలో ప్రజలకు మత ఛాందస భావాలను పరిగణనలోనికి తీసుకోదు. అలాగే చట్ట నిర్మాణం, చట్టాల అమలు, చట్టాల వ్యాఖ్యానంలో ప్రజలకు ఏ మతంతో సంబంధం లేకుండా లౌకిక రాజ్యం వ్యవహరిస్తుంది.
ప్రశ్న 8.
లౌకికరాజ్యం లక్షణాలేవి ? [Mar. 2017]
జవాబు:
లౌకికరాజ్యం కింది లక్షణాలను కలిగి ఉంటుంది.
1. మతానికి తావు లేదు (No place for religion): లౌకిక రాజ్యం ఏ ఒక్క మతం పట్ల ప్రత్యేక శ్రద్ధను చూపదు. మతపరమైన అంశాల ప్రాతిపదికపై చట్టాలను రూపొందించదు, అమలు చేయదు.
2. సమాన హోదా (Equal status): లౌకికరాజ్యం ప్రజలందరికీ సమాన హోదాను కల్పిస్తుంది. వ్యక్తుల మధ్య కులం, వర్ణం, మతం. తెగ, ప్రాంతం, భాషలవారీగా ఎటువంటి వివక్షతను చూపదు. దాంతో ప్రజలు సంతృప్తి చెంది, వివిధ విధానాలు, కార్యక్రమాల అమలులో ప్రభుత్వానికి సహకారాన్ని అందిస్తారు. విభిన్న మత సముదాయాలకు చెందిన వారందరూ ఇరుగు పొరుగు వారితో సామరస్యంతో కలసిమెలసి నివసిస్తారు.
3. అధికారిక మతం లేకుండుట (No State reglion): లౌకిక రాజ్యం ఏ ఒక్క మతాన్ని అధికార మతంగా గుర్తించదు. మత వ్యవహారాలలో తటస్థ వైఖరిని అవలంబిస్తుంది. ప్రజల మతపరమైన భావాలతో సంబంధం లేకుండా వివిధ చట్టాలను, సామాజిక సంక్షేమ కార్యకలాపాలను అమలు చేస్తుంది. ప్రభుత్వ వ్యవహారాలలో ఏ ఒక్క మతానికి ప్రత్యేకమైన ప్రాధాన్యతను ఇవ్వదు. విద్యా సంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు, న్యాయ సంస్థల వంటి అన్ని ప్రభుత్వ సంస్థల కార్యకలాపాలను ఏ ఒక్క మతంతో సంబంధం లేకుండా నిర్వహిస్తుంది.
ప్రశ్న 9.
లౌకిక రాజ్యం ప్రాముఖ్యత గురించి వ్రాయండి.
జవాబు:
లౌకికరాజ్యం ప్రాముఖ్యత (Importance of Secular State): ఇటీవలి కాలంలో లౌకిక రాజ్య భావన ఎంతగానో ప్రాముఖ్యతను సంతరించుకొంది. ప్రజాస్వామిక స్ఫూర్తి, శాస్త్ర సాంకేతికత, రవాణా సదుపాయాల అభివృద్ధి, హేతుబద్ధమైన చింతన, శ్రేయోవాదం వంటి అంశాల ప్రభావం చేత లౌకిక రాజ్య ప్రాముఖ్యత పెరిగింది. మొత్తం మీద లౌకిక రాజ్య ప్రాముఖ్యతను కింది అంశాల ద్వారా వివరించవచ్చు.
- లౌకిక రాజ్యం దేశంలోని వివిధ రంగాలలోని మతేతర శక్తులను బలపరుస్తుంది.
- ప్రజల హృదయాలలో పాతుకుపోయిన దురాచారాలను, మూఢ విశ్వాసాలను పారద్రోలుతుంది.
- మత పరమైన విద్వేషం, మతమౌఢ్యాలను పారద్రోలడం ద్వారా సామాజిక సంస్కరణలకు దోహదపడుతుంది.
- ప్రజలలో శాస్త్రీయ చింతనను పెంపొందించి, వారి మేధోపరమైన వికాసానికి తోడ్పడుతుంది.
- విశ్వాసంపై హేతువుకు, కాల్పనికతపై తర్కానికి, కట్టుకథలపై వాస్తవికతలకు ఆధిక్యతనిస్తుంది.
- మతపరమైన మైనారిటీ వర్గాలకు భద్రతను కల్పించి వారి రక్షణకు హామీనిస్తుంది.
- ప్రతి వ్యక్తి మతపరమైన విశ్వాసాలను గౌరవిస్తుంది.
అతి స్వల్ప సమాధాన ప్రశ్నలు
ప్రశ్న 1.
లౌకికవాదాన్ని నిర్వచించండి. [Mar. 2017]
జవాబు:
- “లౌకికవాదం అంటే మతవిశ్వాసాలను విమర్శించకుండా లేదా తిరస్కరించకుండా మతంతో సంబంధం లేని ఒకానొక సామాజిక వ్యవస్థను ప్రోత్సహించటమనే భావన” అని జి.జె. హోల్యోక్ నిర్వచించాడు.
- “మతంలో పేర్కొన్న దానికంటే భిన్నమైన జీవనం, ప్రవర్తనలకు సంబంధించిన సిద్ధాంతాన్ని ప్రతిపాదించే ఒకానొక ఆదర్శమే లౌకికవాదం” అని వాటర్ హౌస్ పేర్కొన్నాడు.
ప్రశ్న 2.
లౌకికవాదం రకాలు ఏవి ?
జవాబు:
లౌకికవాదం ప్రధానంగా రెండు రకాలు. అవి
- వ్యక్తిపరమైన లౌకికవాదం
- వస్తుపరమైన లౌకికవాదం
మొదటిది ప్రజల దైనందిన కార్యక్రమాలను మతపరమైన భావాల నుండి విడదీస్తుంది. రెండవది ప్రభుత్వ వ్యవహారాలు, ప్రజా జీవనానికి సంబంధించిన సంస్థలను మతపరమైన వేడుకలు, భావనల నుండి వేరుచేస్తుంది.
ప్రశ్న 3.
లౌకికవాదం గురించి డి.ఇ. స్మిత్ ఇచ్చిన నిర్వచనం ఏది ?
జవాబు:
డి.ఇ. స్మిత్ ప్రకారం లౌకికవాదం మూడు అర్థాలను కలిగి ఉంటుంది. అవి
- మత సంబంధమైన స్వేచ్ఛా, స్వాతంత్ర్యాలు.
- పౌరసత్వం, సమానత్వపు హక్కు వివక్షతా లేమి, తటస్థతలు.
- మతం నుండి రాజ్యాన్ని వేరుచేయటం.
ప్రశ్న 4.
లౌకికవాదం ఆవిర్భావం గురించి రాయండి.
జవాబు:
మతాచార్యులకు, సంస్కరణవాదులకు మధ్య ఘర్షణలు సమాజంలో అరాచకం ఏర్పడటానికి దారితీసినాయి. మతం పేరుతో ప్రజల మీద అత్యున్నతాధికారాన్ని చెలాయించేందుకు ఆధ్యాత్మికవాదులు, మత పెద్దలు ప్రయత్నిస్తే లౌకిక పాలకులు వారి వ్యూహాలను నిర్వీర్యపరచారు. రాజ్య వ్యవహారాల నుండి మతాన్ని వేరు చేసారు. ఈ క్రమంలో ఆవిర్భవించిన వాదమే లౌకికవాదం అని భావించవచ్చు.
ప్రశ్న 5.
లౌకికవాద వ్యాప్తికి దోహదపడే నాలుగు అంశాలను ఉదహరించండి.
జవాబు:
- మూఢనమ్మకాల పట్ల ప్రజలలో వ్యతిరేక ధోరణి.
- హేతుబద్ధమైన చింతన, వ్యాప్తి.
- ప్రజాస్వామ్య విలువలు, సంస్థల విస్తరణ.
- శాస్త్ర, సాంకేతిక రంగాలలో పురోగతి.
ప్రశ్న 6.
లౌకికవాదంలోని ఒక భావన గురించి రాయండి.
జవాబు:
మానవతావాదం, హేతువాద భావన: లౌకికవాదం అనేక వ్యక్తిగత, సాంస్కృతిక, రాజకీయ, సామాజిక అంతరార్థాలను కలిగి ఉంటుంది. మానవుల శ్రేయస్సును కోరుకొనుటచేత అది మానవతా స్వభావాన్ని కలిగి ఉంటుంది. ఇది మతాన్ని సమర్థించదు లేదా వ్యతిరేకించదు. వ్యక్తులు తమకు ఇష్టమైన మతాన్ని ఎంపిక చేసుకొని అనుసరించేందుకు వీలు కల్పిస్తుంది.
ప్రశ్న 7.
లౌకికవాదం సామాజిక ధృక్కోణాన్ని తెలపండి.
జవాబు:
సామాజిక దృక్కోణం (Social dimension): లౌకికవాద భావన సామాజిక జీవనంలో మూఢత్వాలను విస్మరించడం లేదా వదిలి వేయడానికి సంబంధించింది. కుల, మత, వర్గాల పరంగా వ్యక్తులు వ్యవహరించడాన్ని లౌకికవాదం ఎట్టి పరిస్థితులలో అనుమతించదు. సమాజంలో ఇరుగు పొరుగు వారితో వ్యవహరించేటప్పుడు వ్యక్తులు అస్త్రశ్యత, వెట్టి చాకిరీ వంటి దురాచారాలను పాటించరాదని అభిలషిస్తుంది. ఇతరులను తమతో సమానంగాను, గౌరప్రదంగానూ చూసుకోవాలని సలహా ఇస్తుంది. కుల వ్యత్యాసాలు, వర్గ వివక్షతలు, జాతి విద్వేషాలు వంటి దుర్గుణాల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని బోధిస్తుంది. అంతిమంగా సమాజంలో వ్యక్తుల మధ్య సామరస్య పూర్వక సంబంధాలను సూచిస్తుంది.
ప్రశ్న 8.
మతస్వామ్యం అంటే ఏమిటి ? [Mar. 2018]
జవాబు:
సాంకేతికంగా మతస్వామ్యం అంటే ‘భగవంతుడి పాలన’ అని అర్థం. ఆచరణలో మతాచార్యుల పాలన. భగవంతుడి నుంచి సర్వాధికారాలు సంక్రమిస్తాయనే సిద్ధాంతంపై ఈ భావన రూపొందింది. హిందూమతం, ప్రాచీన యూదు మతం మొదలైన వాటిలో పేర్కొన్నట్లు చట్టాలను వ్యాఖ్యానించే ఏకైక హక్కుతో కూడిన మతాధిపతుల వ్యవస్థను మతపాలన సూచిస్తుంది. వర్తమాన కాలపు ఇస్లాం మతంలో కూడా ఈ భావన ప్రదర్శితమవుతుంది.
ప్రశ్న 9.
లౌకిక రాజ్యానికి, మత రాజ్యానికి మధ్యగల రెండు వ్యత్యాసాలను గుర్తించండి.
జవాబు:
- లౌకిక రాజ్యం మతేతర అంశాలపై ఆధారపడుతుంది. మత రాజ్యం మతపరమైన అంశాలపై ఆధార – పడుతుంది.
- లౌకిక రాజ్యంలో అధికార మతమంటూ ఏదీ ఉండదు. మత రాజ్యాలలో ఏదో ఒక మతానికి అధికారిక మతహోదా కల్పించబడుతుంది.
ప్రశ్న 10.
లౌకికవాదం ఏ విధంగా వ్యక్తుల స్వేచ్ఛా స్వాతంత్ర్యాలకు దోహదపడుతుంది ?
జవాబు:
లౌకిక వ్యవస్థ అమలులో ఉన్న రాజ్యాలలో వ్యక్తులంతా సంపూర్ణ మత, స్వేచ్ఛా, స్వాతంత్ర్యాలను కలిగి ఉంటారు. ప్రతి వ్యక్తి తన అంతరాత్మ ప్రబోధం ప్రకారం తనకు నచ్చిన మతాన్ని స్వీకరించవచ్చు లేదా మతరహితంగా, హేతువాదిగా ఉండిపోవచ్చు. తాను నమ్మిన మత సిద్ధాంతాలను వ్యాప్తి చేసుకోవచ్చు. మతవ్యాప్తికై వెచ్చించే ధనంపై ఎటువంటి పన్ను చెల్లించనవసరం లేదు.
ప్రశ్న 11.
సమన్యాయ పాలన లౌకికవాదాన్ని ఏ విధంగా పెంపొందిస్తుంది ?
జవాబు:
లౌకికవాదం సమన్యాయ పాలన అనే భావానికి ప్రాధాన్యతనిస్తుంది. రాజ్యం ఏ ఒక్క మతానికి కాకుండా అన్ని మతాలకు చెందిన ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని చట్టాలను రూపొందించి అమలు చేస్తుంది. చట్ట నిర్మాణ సమయంలో ప్రజల మతఛాందస భావాలను పరిగణనలోకి తీసుకోదు. అందువలన లౌకిక రాజ్యాలలో ప్రజలు సంతృప్తిని, సంతోషాన్ని పొందుతారు.
ప్రశ్న 12.
లౌకిక రాజ్యాన్ని నిర్వచించండి. [Mar. 2018]
జవాబు:
“వ్యక్తులకు స్వీయ, సమిష్టి మత స్వాతంత్ర్యాన్ని హామీ ఇస్తూ వ్యక్తులకు వారి మతంతో సంబంధం లేకుండా పౌరులుగా గుర్తించే రాజ్యమే లౌకిక రాజ్యం” అని డి.ఇ. స్మిత్ పేర్కొన్నాడు.
ప్రశ్న 13.
లౌకిక రాజ్యం రెండు లక్షణాలను గురించి రాయండి. [Mar. 2018]
జవాబు:
- మతానికి తావులేదు: లౌకిక రాజ్యం ఏ ఒక్క మతం పట్ల ప్రత్యేక శ్రద్ధను చూపదు. మతపరమైన అంశాల ప్రాతిపదికపై చట్టాలను రూపొందించదు, అమలు చేయదు.
- సమాన హోదా: లౌకిక రాజ్యం ప్రజలందరికి సమాన హోదాను కల్పిస్తుంది. వ్యక్తుల మధ్య కులం, వర్ణం, మతం, తెగ, ప్రాంతం భాషల వారీగా ఎటువంటి వివక్షతను చూపదు.
ప్రశ్న 14.
లౌకిక రాజ్యం ప్రాముఖ్యత ఏమిటి ?
జవాబు:
ప్రస్తుత కాలంలో లౌకిక రాజ్య భావన ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకొంది. ప్రజాస్వామిక స్ఫూర్తి, శాస్త్ర సాంకేతికత, రవాణా సదుపాయాల అభివృద్ధి, హేతుబద్ధమైన చింతన, శ్రేయోవాదం మొదలగు అంశాల ప్రభావం చేత లౌకికరాజ్యం ప్రాముఖ్యత పెరిగింది.
ప్రశ్న 15.
భారతదేశాన్ని లౌకిక రాజ్యంగా సమర్థించేందుకు రెండు అంశాలను ఉదహరించండి.
జవాబు:
- భారత రాజ్యాంగంలో 1976వ సంవత్సరంలో 42వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ‘లౌకిక’ అనే పదమును చేర్చడం జరిగింది.
- భారత పౌరులకు ప్రసాదించిన ప్రాథమిక హక్కులలో మత స్వాతంత్య్రపు హక్కు ముఖ్యమైనది. భారతీయ పౌరులందరూ ఎటువంటి విచక్షణ లేకుండా సంపూర్ణ మత స్వేచ్ఛా, స్వాతంత్ర్యాలను అనుభవిస్తున్నారు.