AP Inter 1st Year Civics Study Material Chapter 9 ప్రజాస్వామ్యం

Andhra Pradesh BIEAP AP Inter 1st Year Civics Study Material 9th Lesson ప్రజాస్వామ్యం Textbook Questions and Answers.

AP Inter 1st Year Civics Study Material 9th Lesson ప్రజాస్వామ్యం

వ్యాసరూప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
ప్రజాస్వామ్యంలోని ప్రయోజనాలు, లోపాలను వివరించండి. [Mar. 2016]
జవాబు:
అర్థం: Democracy అనే ఇంగ్లీషు పదం ‘Demos’ మరియు ‘Kratos’ అనే రెండు గ్రీకు పదాల కలయిక నుంచి ఆవిర్భవించింది. డెమోస్ అంటే ‘ప్రజలు’ క్రటోస్ అంటే ‘అధికారం’ లేదా ‘పాలన’ అని అర్థం.

నిర్వచనం: “ప్రజాస్వామ్యం అంటే ప్రజల యొక్క ప్రజల చేత, ప్రజల కొరకు నిర్వహించబడే ప్రభుత్వం”.

అబ్రహాం లింకన్ ప్రజాస్వామ్యం ప్రయోజనాలు (Merits of Democracy): సమకాలీన ప్రపంచంలో ప్రజాస్వామ్యం విశేషమైన ప్రజాభిమానాన్ని చూరగొంది. దాదాపు ప్రముఖ రాజ్యాలన్నీ ప్రజాస్వామ్యాన్ని తమ రాజకీయ సిద్ధాంతంగా అనుసరిస్తున్నాయి. ప్రజాస్వామ్యంలో కింద పేర్కొన్న ప్రయోజనాలున్నాయి.

1) సమర్థవంతమైన ప్రభుత్వం (Efficient Government): ప్రజాస్వామ్యాన్ని సమర్థవంతమైన, పటిష్టమైన ప్రభుత్వంగా ప్రొఫెసర్ గార్నర్ వర్ణించాడు. ప్రజాస్వామ్య వ్యవస్థలో సాధారణ సమయాలలోనూ, అత్యవసర పరిస్థితులలోనూ ప్రభుత్వ కార్యక్రమాలు సమర్థవంతంగానూ, పటిష్టంగానూ కొనసాగుతాయి. ప్రజలచే ఎన్నిక, ప్రజల నియంత్రణ, ప్రజలకు బాధ్యత అనే ప్రజాస్వామ్య సూత్రాలు గోచరిస్తాయి. అవి ఇతర ప్రభుత్వాలతో పోల్చినపుడు ఇందులో సమర్ధతను చేకూర్చుతాయి.

2) వ్యక్తి స్వేచ్ఛల సమర్థన (Upholds Individual Liberties): ప్రజాస్వామ్య ప్రభుత్వం మాత్రమే వ్యక్తి స్వేచ్ఛలను సమర్థిస్తుంది. రాజ్యాంగపరమైన అనేక రక్షణల ద్వారా వ్యక్తుల హామీలకు హామీ ఇస్తుంది. ఈ అంశం ప్రాతిపదికపై జె.ఎస్.మిల్ ప్రజాస్వామ్యాన్ని సమర్థించాడు. ప్రజాస్వామ్యం ప్రజలకు వాక్, సభా, పత్రికా స్వాతంత్రాలు, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛలను ప్రసాదిస్తుందని అతడు ప్రకటించాడు.

3) సమానత్వానికి హామీ (Assures Equality): ప్రజాస్వామ్యం రాజకీయ, ఆర్థిక రంగాలలోని వ్యక్తుల యొక్క సమానత్వానికి హామీ ఇస్తుంది. రాజకీయ రంగంలో పౌరుల కుల, వర్ణం, పుట్టుక వంటి అంశాలతో ప్రమేయం లేకుండా వారికి ఓటు హక్కు, ఎన్నికలలో అభ్యర్థులుగా పోటీచేసే హక్కు, ప్రభుత్వ పదవులను చేపట్టే హక్కు వంటి రాజకీయ హక్కులను పౌరులకు ప్రసాదిస్తుంది. సమాజంలో ఇతర వర్గాలను విస్మరించి కొద్దిమంది వ్యక్తులకు ప్రత్యేక హక్కులను కల్పించడాన్ని వ్యతిరేకిస్తుంది.

AP Inter 1st Year Civics Study Material Chapter 9 ప్రజాస్వామ్యం

4) ప్రజలను విద్యావంతులను చేయడం (Educates the Masses): ప్రజలను విద్యావంతులుగా తీర్చిదిద్దేందుకు బృహత్తర ప్రయోగాలకు వీలు కల్పించే సాధనంగా ప్రజాస్వామ్యాన్ని కొందరు వర్ణించారు. వివిధ ప్రాతినిధ్య సంస్థలకు విభిన్న సమయాలలో జరిగే ఎన్నికలు, సంబంధిత ప్రచార ఉద్యమాలు ప్రజాస్వామ్యంలో పౌరులను విద్యావంతులుగా తీర్చిదిద్దుతుంది.

5) దేశభక్తిని పెంపొందించడం (Instills Patriotism): ప్రజాస్వామ్యం ప్రజలలో దేశభక్తిని పెంపొందిస్తుంది. ప్రజాస్వామ్యంలో వివిధ సంస్థల సభ్యుల ఎంపిక, ఎన్నికలలో ప్రజలకు ఎన్నో అవకాశాలు లభిస్తాయి. ప్రాతినిధ్య సంస్థలలో ప్రజలు పాల్గొని అవి విజయవంతంగా పనిచేసేటట్లు జాగ్రత్త వహిస్తారు. వీటి నిర్వహణలో పాల్గొనడాన్ని ప్రజలు ఎంతో గర్వంగా భావిస్తారు. దేశం క్లిష్ట పరిస్థితులలో ఉన్నప్పుడు ప్రజలు తమ సహాయ సహకారాలను అందించడంలో ఎంతో ఆసక్తిని చూపుతారు. గతంలో ఇండియాపై చైనా, పాకిస్తాన్లు దురాక్రమణ జరిపిన సందర్భాలలో భారతీయులు చూపించిన చొరవ, ప్రదర్శించిన దేశభక్తి ఇందుకు ఉదాహరణగా పేర్కొనవచ్చు.

6) స్థిరత్వానికి హామీ (Ensures Stability): ప్రజాస్వామ్యంలో ఎన్నికైన ప్రభుత్వం ఉండటం వల్ల విప్లవాల బారి నుంచి దేశాన్ని కాపాడేందుకు అవకాశం ఉంటుంది. ఈ వ్యవస్థలో ప్రజలు ఎన్నికల సమయంలో వ్యతిరేక ఓటు (Negative Vote) వినియోగం ద్వారా ప్రభుత్వాన్ని మార్చివేయగలుగుతారు.

7) ఒకే సమయంలో శాంతి, ప్రగతి (Simultaneous Order and Progress): నియంతృత్వం దేశ ప్రగతిని నిర్లక్ష్యం చేసి భద్రతకు హామీ ఇస్తుంది. అందుకు విరుద్ధంగా ప్రజాస్వామ్యం రాజ్యాంగబద్దమైన పాలన ద్వారా శాంతి భద్రతల నిర్వహణకు ప్రాధాన్యత ఇస్తుంది. వివిధ రంగాలలో ప్రజల ఔన్నత్యానికి కృషి చేస్తుంది. భారత ప్రజాస్వామ్య వ్యవస్థలో దీనిని మనం గమనించవచ్చు. జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్, మౌలానా అబ్దుల్ కలామ్ అజాద్, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ వంటి ఆదర్శవంతమైన నాయకులు, రాజనీతిజ్ఞులు శైశవదశలో ఉన్న భారత ప్రజాస్వామ్యాన్ని జాతీయ, అంతర్జాతీయ రంగాలలో శక్తివంతమైన, సార్థకమైందిగా తీర్చిదిద్దేందుకు ఎంతగానో కృషి చేశారు.

8) ప్రజలను బాధ్యతాయుతులుగా చేయడం (Makes the People Responsible): ప్రజాస్వామ్యం వ్యక్తి సామర్థ్యాన్ని గుర్తిస్తుంది. వ్యక్తులలో చొరవను ఏర్పరచేందుకు అనుకూలమైన వాతావరణాన్ని సృష్టిస్తుంది. ప్రజలలో బాధ్యతాయుత ప్రవర్తనను పెంపొందిస్తుంది. ఈ రకమైన పరిస్థితి ఇతర ప్రభుత్వ రకాలలో గోచరించదు. అంతేకాకుండా ప్రజాస్వామ్యం వ్యక్తుల వ్యక్తిత్వ వికాస సాధనకు దోహదపడి వారి ఔన్నత్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తుంది.

9) పౌరసత్వ శిక్షణ పాఠశాల (Training School for Citizenship): ప్రజాస్వామ్యపు మరొక సుగుణం ఏమిటంటే ఇది ఒక ఉత్తమ పౌరసత్వ పాఠశాలగా వ్యవహరిస్తుంది. ఎన్నికల సమయంలో ఓటుహక్కు, అభ్యర్థులను ఎన్నుకొనే హక్కు వంటి రాజకీయ హక్కులను పౌరులకు అందించడంలో హామీ ఇస్తుంది. అటువంటి హక్కులు, ఇతర రాజకీయ హక్కులలాగా, పౌరసత్వ పాఠాలను నేర్చుకొనేందుకు పౌరులకు సహాయకారిగా ఉంటాయి.

10) హేతుబద్ధమైన ప్రభుత్వం (A Rational Government): “ఏ ఒక్కరూ సంపూర్ణంగా దోషరహితులు ‘కారు’ అనే సూత్రంపై ప్రజాస్వామ్యం ఆధారపడి ఉంటుంది. అధికార దుర్వినియోగాన్ని అరికట్టేందుకు అవసరమైన చర్యలు, విమర్శలతో కూడిన ప్రక్రియను ప్రజాస్వామ్యం అనుసరిస్తుంది. అంతేకాకుండా రాజకీయ వ్యవస్థ హేతుబద్ధ స్వభావాన్ని ప్రజాస్వామ్యం సంరక్షిస్తుంది.

ప్రజాస్వామ్యం లోపాలు:
1) అజ్ఞానుల పాలన (Rule by Ignorants): అరిస్టాటిల్ ప్రజాస్వామ్యాన్ని ప్రభుత్వ వికృత రూపంగా పరిగణించాడు. ప్రజాస్వామ్యమనేది ఒక రకమైన మూకపాలనగా భావించాడు. అతడి గురువైన ప్లేటో ప్రజాస్వామ్యాన్ని అజ్ఞానుల పాలనగా పిలిచాడు. ప్రజాస్వామ్యంలో ఓట్ల లెక్కింపు మాత్రమే జరుగుతుందని మరికొందరు విమర్శించారు. ప్రజాస్వామ్యంలో అనేక అంశాలపై నిర్ణయాలనేవి శాసనసభ, మంత్రివర్గ సమావేశాలలో మెజారిటీ సభ్యుల అభీష్టం మేరకు జరుగుతాయి. దాంతో యోగ్యులు, నిజాయితీ గల వ్యక్తులు దూరంగా ఉంచబడి, అజ్ఞానులు, మూర్ఖులు ప్రాధాన్యత కలిగి ఉంటారు.

2) ధనికులకు అనుకూలత (Favours the Rich): ఆధునిక ప్రజాస్వామ్య రాజ్యాలలో అధికభాగం పెట్టుబడిదారీ స్వభావాన్ని కలిగి ఉన్నాయి. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రభుత్వాలు సంపన్న వర్గాల వారి పట్ల సానుకూలతను ప్రదర్శిస్తాయి. ఎన్నికలనేవి ఒక ప్రహసనంగా మారుతాయి. ప్రజాస్వామ్యంలో ఓటర్లను దైవంగా గుర్తించడమవుతుంది. ఎన్నికలలో పోటీచేసే అభ్యర్థులు కులం, వర్ణం, మతం, పుట్టుక, ప్రాంతం వంటి అంశాల వారీగా ఓటర్లను ప్రలోభపెట్టేందుకు ప్రయత్నిస్తారు. వారికి భౌతిక, ధన, కనక వస్తువులను అందించడం ద్వారా ఆకర్షిస్తారు.

AP Inter 1st Year Civics Study Material Chapter 9 ప్రజాస్వామ్యం

3) అధిక సంఖ్యాకుల పాలన అనేది ఒక భ్రమ (Majority rule – a Myth): ఒకప్పుడు 1980వ దశకం వరకు ప్రజాస్వామ్యాన్ని అధిక సంఖ్యాకుల పాలనగా పరిగణించడమైంది. ఆ తరువాత జాతీయ, అంతర్జాతీయ రంగాలలో సంభవించిన నాటకీయ పరిణామాల ఫలితంగా అనేక మార్పులు సంభవించాయి. విద్య, అక్షరాస్యత, విజ్ఞాన వికాసం, పత్రికలు, వార్తా దృశ్య సాధనాలు, ఫేస్బుక్, ట్విట్టర్, ఇతర సామాజిక మాధ్యమాలు రాజకీయ రంగంలో విప్లవాత్మకమైన మార్పులను తీసుకొచ్చాయి. సంకీర్ణ ప్రభుత్వ రాజకీయ సంస్కృతి సాధారణ రాజకీయ పరిణామంగా మారింది. ప్రాచీన పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థలుగా పేరుగాంచిన బ్రిటన్ వంటి రాజ్యాలలో సైతం సంకీర్ణ ప్రభుత్వాలు ఏర్పాటయినాయి. అలాగే అభివృద్ధి చెందుతున్న ఇండియా, బంగ్లాదేశ్, పాకిస్తాన్, నేపాల్ వంటి దేశాలలో కూడా సంకీర్ణ ప్రభుత్వాలు అనివార్యమవుతున్నాయి.

అందుకు కారణం ఆయా దేశాలలో శాసనసభలలో ఏ ఒక్క పార్టీకి ప్రభుత్వాన్ని ఏర్పరచే సంపూర్ణమైన మెజారిటీ స్థానాలు లభించకపోవడంగా పేర్కొనవచ్చు. దాంతో శాసనసభలలో ఎక్కువ స్థానాలు (మెజారిటీ స్థానాలు కాకుండ) గెల్చుకున్న అతిపెద్ద పార్టీ మిగిలిన చిన్న పార్టీలతో కలసి సంకీర్ణ భాగస్వామ్యంగా ఏర్పడి, కనీస ఉమ్మడి కార్యక్రమాన్ని రూపొందించి ప్రభుత్వాలను ఏర్పాటు చేయడం సర్వ సాధారణమైంది. అటువంటి ప్రభుత్వాలు శాసనసభలలో మెజారిటీ సభ్యుల మద్దతును పొందక పార్లమెంటరీ ప్రమాణాల పతనానికి దారితీశాయి. భారతదేశంలో 1990వ దశకం ద్వితీయార్థం నుంచి 2014 ప్రథమార్థం వరకు జాతీయ స్థాయిలో ఏర్పడిన ఐక్య సంఘటన (United Front), జాతీయ ప్రజాస్వామ్య కూటమి (National Democratic Alliance), ఐక్య ప్రగతిశీల కూటమి (United Progressive Alliance) ఇందుకు ఉదాహరణగా పేర్కొనవచ్చు.

4) సందేహాస్పద ప్రాతినిధ్య సూత్రం (Representative Principle Doubtful): ప్రజాస్వామ్యం ప్రాదేశిక ప్రాతినిధ్యం అనే సూత్రంపై ఆధారపడుతుంది. ఈ సూత్రం ప్రకారం నియోజకవర్గంలో ప్రతి ఒక్కరి భావాలకు, ఒకే శాసనసభ్యుడు ప్రాతినిధ్యం వహించాలి. ఈ విధానం లోపభూయిష్టం మరియు అన్ని వర్గాలకు సరైన ప్రాతినిధ్యం
లభించదు.

5) సమానత్వ సూత్రం దుర్వినియోగం (Abuse of Equality Principle): ప్రజాస్వామ్య ప్రభుత్వ ముఖ్య భావనయైన సమానత్వ సూత్రాన్ని ప్రభుత్వ ప్రక్రియలో ప్రతి ఒక్కరూ దుర్వినియోగ పరచడమవుతుంది. ప్రజాస్వామ్యం అనేది ప్రతి ఒక్కరూ యోగ్యత, పాండిత్యంతో సంబంధం లేకుండా అందరితో సమానులే అనే అసత్య వాక్యంపై ఆధారపడిందని కొందరు విమర్శించారు..

6) ప్రగతికి ఆటంకం (Impedes Progress): కళలు, సాహిత్యం, శాస్త్ర రంగాలలో ప్రగతికి ప్రజాస్వామ్యం ఆటంకంగా ఉంటుంది. ప్రభుత్వ వ్యవహారాల గురించి అట్టడుగు స్థాయిలో ప్రజలు అంతగా ఆసక్తి చూపించకపోవడమే ఇందుకు కారణం. సాంప్రదాయ దృక్పథం గల సామాన్య ప్రజలు దేశంలో శాస్త్రీయ ప్రగతికి విముఖతను ప్రదర్శిస్తారు.

7) నైతిక విలువలు లేకపోవడం (Lack of Ethical Values): ప్రజాస్వామ్య ప్రభుత్వం నైతిక విలువలు కలిగి ఉండదని కొందరు నినదించారు. వ్యక్తుల నైతికతను ప్రజాస్వామ్యం దిగజారుస్తుందని వారు ప్రకటించారు. ప్రజాస్వామ్యంలో నిరంతరం నిందలు, అసత్యం వంటి అనైతిక పద్ధతులు ప్రచారంలో ఉంటాయి.

8) వ్యక్తి స్వాతంత్ర్యాల పట్ల వ్యతిరేకత (Opposes Individual Freedoms): ప్రజాస్వామ్యం స్వేచ్ఛాయుత | భావాలను అణచివేసి, హేతువును అడ్డుకొంటుంది. ప్రజాస్వామ్య రాజ్యంలో సృజనాత్మక భావాలు గల తాత్త్వికులు మూర్ఖులుగా పరిగణించబడతారు. ప్రాచీన ఏథెన్స్ పాలకుల ఒత్తిడిచే విషం తాగిన మేధావి సోక్రటీస్ ఇందుకు ఉదాహరణగా పేర్కొనవచ్చు. కాబట్టి ప్రజాస్వామ్యంలో వ్యక్తిత్వం గల వారిపట్ల ఏ ఒక్కరూ సహనాన్ని కలిగిఉండరు. 9) వ్యయంతో కూడుకున్న ప్రభుత్వం (Expensive One): ప్రజాస్వామ్యంలో ఎన్నికల నిర్వహణ, ప్రచార కార్యక్రమం భారీ వ్యయంతో కూడుకుని ఉంటుంది. దాంతో సంపద, ఐశ్వర్యం గల వ్యక్తులు మాత్రమే ఎన్నికల బరిలో | ప్రవేశించి విజయపథాన కొనసాగుతారు. అటువంటప్పుడు పేదలు, యోగ్యులు, సేవాతత్పరత గల వ్యక్తులు ఎన్నికల వ్యయాన్ని భరించలేరు. పార్టీ నాయకత్వం కూడా సంపన్న పారిశ్రామికవేత్తలు, ఇతర ప్రభావిత వ్యక్తులకే ప్రాధాన్యత ఇస్తుంది.

ప్రశ్న 2.
ప్రజాస్వామ్యాన్ని నిర్వచించి సమకాలీన రాజకీయాలలో ప్రజాస్వామ్యం ప్రయోజనాలు, లోపాలను విశ్లేషించండి.
జవాబు:
అర్థం: Democracy అనే ఇంగ్లీషు పదం ‘Demos’ మరియు ‘Kratos’ అనే రెండు గ్రీకు పదాల కలయిక నుంచి ఆవిర్భవించింది. డెమోస్ అంటే ‘ప్రజలు’ క్రటోస్ అంటే ‘అధికారం’ లేదా ‘పాలన’ అని అర్థం.
నిర్వచనాలు:

  1. “ప్రజాస్వామ్యం అంటే ప్రజల యొక్క ప్రజల చేత, ప్రజల కొరకు నిర్వహించబడే ప్రభుత్వం” అని అబ్రహాం లింకన్ పేర్కొన్నాడు.
  2. “పాలనా అధికారం సమాజంలో ఏ ఒక్క వర్గానికో, వర్గాలకో కాకుండా అన్ని వర్గాలకు చెంది ఉండే ప్రభుత్వ విధానమే ప్రజాస్వామ్యం” అని లార్డ్స్ పేర్కొన్నాడు.
  3. “ప్రభుత్వంలో ప్రతి ఒక్కరికి భాగస్వామ్యం ఉన్న ప్రభుత్వమే ప్రజాస్వామ్యం” అని జే.ఆర్.సీలీ పేర్కొన్నాడు.

AP Inter 1st Year Civics Study Material Chapter 9 ప్రజాస్వామ్యం

సమకాలీన రాజకీయాలలో ప్రజాస్వామ్యం వలన కలిగే ప్రయోజనాలు:
1) సమర్థవంతమైన ప్రభుత్వం (Efficient Government): ప్రజాస్వామ్యాన్ని సమర్థవంతమైన, పటిష్టమైన ప్రభుత్వంగా ప్రొఫెసర్ గార్నర్ వర్ణించాడు. ప్రజాస్వామ్య వ్యవస్థలో సాధారణ సమయాలలోనూ, అత్యవసర పరిస్థితులలోనూ ప్రభుత్వ కార్యక్రమాలు సమర్థవంతంగానూ, పటిష్టంగానూ కొనసాగుతాయి. ప్రజలచే ఎన్నిక, ప్రజల నియంత్రణ, ప్రజలకు బాధ్యత అనే ప్రజాస్వామ్య సూత్రాలు గోచరిస్తాయి. అవి ఇతర ప్రభుత్వాలతో పోల్చినపుడు ఇందులో సమర్థతను చేకూర్చుతాయి.

2) వ్యక్తి స్వేచ్ఛల సమర్థన (Upholds Individual Liberties): ప్రజాస్వామ్య ప్రభుత్వం మాత్రమే వ్యక్తి స్వేచ్ఛలను సమర్థిస్తుంది. రాజ్యాంగపరమైన అనేక రక్షణల ద్వారా వ్యక్తుల హామీలకు హామీ ఇస్తుంది. ఈ అంశం ప్రాతిపదికపై జె. ఎస్. మిల్ ప్రజాస్వామ్యాన్ని సమర్థించాడు. ప్రజాస్వామ్యం ప్రజలకు వాక్, సభా, పత్రికా స్వాతంత్రాలు, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛలను ప్రసాదిస్తుందని అతడు ప్రకటించాడు.

3) సమానత్వానికి హామీ (Assures Equality): ప్రజాస్వామ్యం రాజకీయ, ఆర్థిక రంగాలలోని వ్యక్తుల యొక్క సమానత్వానికి హామీ ఇస్తుంది. రాజకీయ రంగంలో పౌరుల కుల, వర్ణం, పుట్టుక వంటి అంశాలతో ప్రమేయం లేకుండా వారికి ఓటు హక్కు, ఎన్నికలలో అభ్యర్థులుగా పోటీచేసే హక్కు, ప్రభుత్వ పదవులను చేపట్టే హక్కు వంటి రాజకీయ హక్కులను పౌరులకు ప్రసాదిస్తుంది. సమాజంలో ఇతర వర్గాలను విస్మరించి కొద్దిమంది వ్యక్తులకు ప్రత్యేక హక్కులను కల్పించడాన్ని వ్యతిరేకిస్తుంది.

4) ప్రజలను విద్యావంతులను చేయడం (Educates the Masses): ప్రజలను విద్యావంతులుగా తీర్చిదిద్దేందుకు బృహత్తర ప్రయోగాలకు వీలు కల్పించే సాధనంగా ప్రజాస్వామ్యాన్ని కొందరు వర్ణించారు. వివిధ ప్రాతినిధ్య సంస్థలకు విభిన్న సమయాలలో జరిగే ఎన్నికలు, సంబంధిత ప్రచార ఉద్యమాలు ప్రజాస్వామ్యంలో పౌరులను విద్యావంతులుగా తీర్చిదిద్దుతుంది.

5) దేశభక్తిని పెంపొందించడం (Instills Patriotism): ప్రజాస్వామ్యం ప్రజలలో దేశభక్తిని పెంపొందిస్తుంది. ప్రజాస్వామ్యంలో వివిధ సంస్థల సభ్యుల ఎంపిక, ఎన్నికలలో ప్రజలకు ఎన్నో అవకాశాలు లభిస్తాయి. ప్రాతినిధ్య సంస్థలలో ప్రజలు పాల్గొని అవి విజయవంతంగా పనిచేసేటట్లు జాగ్రత్త వహిస్తారు. వీటి నిర్వహణలో పాల్గొనడాన్ని ప్రజలు ఎంతో గర్వంగా భావిస్తారు. దేశం క్లిష్ట పరిస్థితులలో ఉన్నప్పుడు ప్రజలు తమ సహాయ సహకారాలను అందించడంలో ఎంతో ఆసక్తిని చూపుతారు. గతంలో ఇండియాపై చైనా, పాకిస్తాన్లు దురాక్రమణ జరిపిన సందర్భాలలో భారతీయులు చూపించిన చొరవ, ప్రదర్శించిన దేశభక్తి ఇందుకు ఉదాహరణగా పేర్కొనవచ్చు.

6) స్థిరత్వానికి హామీ (Ensures Stability): ప్రజాస్వామ్యంలో ఎన్నికైన ప్రభుత్వం ఉండటం వల్ల విప్లవాల బారి నుంచి దేశాన్ని కాపాడేందుకు అవకాశం ఉంటుంది. ఈ వ్యవస్థలో ప్రజలు ఎన్నికల సమయంలో వ్యతిరేక ఓటు (Negative Vote) వినియోగం ద్వారా ప్రభుత్వాన్ని మార్చివేయగలుగుతారు.

7) ఒకే సమయంలో శాంతి, ప్రగతి (Simultaneous Order and Progress): నియంతృత్వం దేశ ప్రగతిని నిర్లక్ష్యం చేసి భద్రతకు హామీ ఇస్తుంది. అందుకు విరుద్ధంగా ప్రజాస్వామ్యం రాజ్యాంగబద్దమైన పాలన ద్వారా శాంతి భద్రతల నిర్వహణకు ప్రాధాన్యత ఇస్తుంది. వివిధ రంగాలలో ప్రజల ఔన్నత్యానికి కృషి చేస్తుంది. భారత ప్రజాస్వామ్య వ్యవస్థలో దీనిని మనం గమనించవచ్చు. జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్, మౌలానా అబ్దుల్ కలామ్ అజాద్, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ వంటి ఆదర్శవంతమైన నాయకులు, రాజనీతిజ్ఞులు శైశవదశలో ఉన్న భారత ప్రజాస్వామ్యాన్ని జాతీయ, అంతర్జాతీయ రంగాలలో శక్తివంతమైన, సార్థకమైందిగా తీర్చిదిద్దేందుకు ఎంతగానో కృషి చేశారు.

8) ప్రజలను బాధ్యతాయుతులుగా చేయడం (Makes the People Responsible): ప్రజాస్వామ్యం వ్యక్తి సామర్థ్యాన్ని గుర్తిస్తుంది. వ్యక్తులలో చొరవను ఏర్పరచేందుకు అనుకూలమైన వాతావరణాన్ని సృష్టిస్తుంది. ప్రజలలో బాధ్యతాయుత ప్రవర్తనను పెంపొందిస్తుంది. ఈ రకమైన పరిస్థితి ఇతర ప్రభుత్వ రకాలలో గోచరించదు. అంతేకాకుండా ప్రజాస్వామ్యం వ్యక్తుల వ్యక్తిత్వ వికాస సాధనకు దోహదపడి వారి ఔన్నత్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తుంది.

9) పౌరసత్వ శిక్షణ పాఠశాల (Training School for Citizenship): ప్రజాస్వామ్యపు మరొక సుగుణం ఏమిటంటే ఇది ఒక ఉత్తమ పౌరసత్వ పాఠశాలగా వ్యవహరిస్తుంది. ఎన్నికల సమయంలో ఓటుహక్కు, అభ్యర్థులను ఎన్నుకొనే హక్కు వంటి రాజకీయ హక్కులను పౌరులకు అందించడంలో హామీ ఇస్తుంది. అటువంటి హక్కులు, ఇతర రాజకీయ హక్కులలాగా, పౌరసత్వ పాఠాలను నేర్చుకొనేందుకు పౌరులకు సహాయకారిగా ఉంటాయి.

10) హేతుబద్ధమైన ప్రభుత్వం (A Rational Government): “ఏ ఒక్కరూ సంపూర్ణంగా దోషరహితులు కారు’ అనే సూత్రంపై ప్రజాస్వామ్యం ఆధారపడి ఉంటుంది. అధికార దుర్వినియోగాన్ని అరికట్టేందుకు అవసరమైన చర్యలు, విమర్శలతో కూడిన ప్రక్రియను ప్రజాస్వామ్యం అనుసరిస్తుంది. అంతేకాకుండా రాజకీయ వ్యవస్థ హేతుబద్ధ స్వభావాన్ని ప్రజాస్వామ్యం సంరక్షిస్తుంది.

AP Inter 1st Year Civics Study Material Chapter 9 ప్రజాస్వామ్యం

ప్రజాస్వామ్యం లోపాలు:
1) అజ్ఞానుల పాలన (Rule by Ignorants): అరిస్టాటిల్ ప్రజాస్వామ్యాన్ని ప్రభుత్వ వికృత రూపంగా పరిగణించాడు. ప్రజాస్వామ్యమనేది ఒక రకమైన మూకపాలనగా భావించాడు. అతడి గురువైన ప్లేటో ప్రజాస్వామ్యాన్ని అజ్ఞానుల పాలనగా పిలిచాడు. ప్రజాస్వామ్యంలో ఓట్ల లెక్కింపు మాత్రమే జరుగుతుందని మరికొందరు విమర్శించారు. ప్రజాస్వామ్యంలో అనేక అంశాలపై నిర్ణయాలనేవి శాసనసభ, మంత్రివర్గ సమావేశాలలో మెజారిటీ సభ్యుల అభీష్టం మేరకు జరుగుతాయి. దాంతో యోగ్యులు, నిజాయితీ గల వ్యక్తులు దూరంగా ఉంచబడి, అజ్ఞానులు, మూర్ఖులు ప్రాధాన్యత కలిగి ఉంటారు.

2) ధనికులకు అనుకూలత (Favours the Rich): ఆధునిక ప్రజాస్వామ్య రాజ్యాలలో అధికభాగం పెట్టుబడిదారీ స్వభావాన్ని కలిగి ఉన్నాయి. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రభుత్వాలు సంపన్న వర్గాల వారి పట్ల సానుకూలతను ప్రదర్శిస్తాయి. ఎన్నికలనేవి ఒక ప్రహసనంగా మారుతాయి. ప్రజాస్వామ్యంలో ఓటర్లను దైవంగా గుర్తించడమవుతుంది. ఎన్నికలలో పోటీచేసే అభ్యర్థులు కులం, వర్ణం, మతం, పుట్టుక, ప్రాంతం వంటి అంశాల వారీగా ఓటర్లను ప్రలోభపెట్టేందుకు ప్రయత్నిస్తారు. వారికి భౌతిక, ధన, కనక వస్తువులను అందించడం ద్వారా ఆకర్షిస్తారు.

3) అధిక సంఖ్యాకుల పాలన అనేది ఒక భ్రమ (Majority rule – a Myth): ఒకప్పుడు 1980వ దశకం వరకు ప్రజాస్వామ్యాన్ని అధిక సంఖ్యాకుల పాలనగా పరిగణించడమైంది. ఆ తరువాత జాతీయ, అంతర్జాతీయ రంగాలలో సంభవించిన నాటకీయ పరిణామాల ఫలితంగా అనేక మార్పులు సంభవించాయి. విద్య, అక్షరాస్యత, విజ్ఞాన వికాసం, పత్రికలు, వార్తా దృశ్య సాధనాలు, ఫేస్బుక్, ట్విట్టర్, ఇతర సామాజిక మాధ్యమాలు రాజకీయ రంగంలో విప్లవాత్మకమైన మార్పులను తీసుకొచ్చాయి. సంకీర్ణ ప్రభుత్వ రాజకీయ సంస్కృతి సాధారణ రాజకీయ పరిణామంగా మారింది. ప్రాచీన పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థలుగా పేరుగాంచిన బ్రిటన్ వంటి రాజ్యాలలో సైతం సంకీర్ణ ప్రభుత్వాలు ఏర్పాటయినాయి. అలాగే అభివృద్ధి చెందుతున్న ఇండియా, బంగ్లాదేశ్, పాకిస్తాన్, నేపాల్ వంటి దేశాలలో కూడా సంకీర్ణ ప్రభుత్వాలు అనివార్యమవుతున్నాయి. అందుకు కారణం ఆయా దేశాలలో శాసనసభలలో ఏ ఒక్క పార్టీకి ప్రభుత్వాన్ని ఏర్పరచే సంపూర్ణమైన మెజారిటీ స్థానాలు లభించకపోవడంగా పేర్కొనవచ్చు. దాంతో శాసనసభలలో ఎక్కువ స్థానాలు (మెజారిటీ స్థానాలు కాకుండ) గెల్చుకున్న అతిపెద్ద పార్టీ మిగిలిన చిన్న పార్టీలతో కలసి సంకీర్ణ భాగస్వామ్యంగా ఏర్పడి, కనీస ఉమ్మడి కార్యక్రమాన్ని రూపొందించి ప్రభుత్వాలను ఏర్పాటు చేయడం సర్వ సాధారణమైంది. అటువంటి ప్రభుత్వాలు శాసనసభలలో మెజారిటీ సభ్యుల మద్దతును పొందక పార్లమెంటరీ ప్రమాణాల పతనానికి దారితీశాయి. భారతదేశంలో 1990వ దశకం ద్వితీయార్థం నుంచి 2014 ప్రథమార్థం వరకు జాతీయ స్థాయిలో ఏర్పడిన ఐక్య సంఘటన (United Front), జాతీయ ప్రజాస్వామ్య కూటమి (National Democratic Alliance), ఐక్య ప్రగతిశీల కూటమి (United Progressive Alliance) ఇందుకు ఉదాహరణగా పేర్కొనవచ్చు.

4) సందేహాస్పద ప్రాతినిధ్య సూత్రం (Representative Principle – Doubtful): ప్రజాస్వామ్యం ప్రాదేశిక ప్రాతినిధ్యం అనే సూత్రంపై ఆధారపడుతుంది. ఈ సూత్రం ప్రకారం నియోజకవర్గంలో ప్రతి ఒక్కరి భావాలకు, ఒకే | శాసనసభ్యుడు ప్రాతినిధ్యం వహించాలి. ఈ విధానం లోపభూయిష్టం మరియు అన్ని వర్గాలకు సరైన ప్రాతినిధ్యం లభించదు.

5) సమానత్వ సూత్రం దుర్వినియోగం (Abuse of Equality Principle): ప్రజాస్వామ్య ప్రభుత్వ ముఖ్య భావనయైన సమానత్వ సూత్రాన్ని ప్రభుత్వ ప్రక్రియలో ప్రతి ఒక్కరూ దుర్వినియోగ పరచడమవుతుంది. ప్రజాస్వామ్యం అనేది ప్రతి ఒక్కరూ యోగ్యత, పాండిత్యంతో సంబంధం లేకుండా అందరితో సమానులే అనే అసత్య వాక్యంపై ఆధారపడిందని కొందరు విమర్శించారు.

6) ప్రగతికి ఆటంకం (Impedes Progress): కళలు, సాహిత్యం, శాస్త్ర రంగాలలో ప్రగతికి ప్రజాస్వామ్యం ఆటంకంగా ఉంటుంది. ప్రభుత్వ వ్యవహారాల గురించి అట్టడుగు స్థాయిలో ప్రజలు అంతగా ఆసక్తి చూపించకపోవడమే ఇందుకు కారణం. సాంప్రదాయ దృక్పథం గల సామాన్య ప్రజలు దేశంలో శాస్త్రీయ ప్రగతికి విముఖతను ప్రదర్శిస్తారు.

7) నైతిక విలువలు లేకపోవడం (Lack of Ethical Values): ప్రజాస్వామ్య ప్రభుత్వం నైతిక విలువలు కలిగి ఉండదని కొందరు నినదించారు. వ్యక్తుల నైతికతను ప్రజాస్వామ్యం దిగజారుస్తుందని వారు ప్రకటించారు. ప్రజాస్వామ్యంలో నిరంతరం నిందలు, అసత్యం వంటి అనైతిక పద్ధతులు ప్రచారంలో ఉంటాయి.

8) వ్యక్తి స్వాతంత్ర్యాల పట్ల వ్యతిరేకత (Opposes Individual Freedoms): ప్రజాస్వామ్యం స్వేచ్చాయుత భావాలను అణచివేసి, హేతువును అడ్డుకొంటుంది. ప్రజాస్వామ్య రాజ్యంలో సృజనాత్మక భావాలు గల తాత్త్వికులు మూర్ఖులుగా పరిగణించబడతారు. ప్రాచీన ఏథెన్స్ పాలకుల ఒత్తిడిచే విషం తాగిన మేధావి సోక్రటీస్ ఇందుకు ఉదాహరణగా పేర్కొనవచ్చు. కాబట్టి ప్రజాస్వామ్యంలో వ్యక్తిత్వం గల వారిపట్ల ఏ ఒక్కరూ సహనాన్ని కలిగిఉండరు.

9) వ్యయంతో కూడుకున్న ప్రభుత్వం (Expensive One): ప్రజాస్వామ్యంలో ఎన్నికల నిర్వహణ, ప్రచార కార్యక్రమం భారీ వ్యయంతో కూడుకుని ఉంటుంది. దాంతో సంపద, ఐశ్వర్యం గల వ్యక్తులు మాత్రమే ఎన్నికల బరిలో ప్రవేశించి విజయపథాన కొనసాగుతారు. అటువంటప్పుడు పేదలు, యోగ్యులు, సేవాతత్పరత గల వ్యక్తులు ఎన్నికల వ్యయాన్ని భరించలేరు. పార్టీ నాయకత్వం కూడా సంపన్న పారిశ్రామికవేత్తలు, ఇతర ప్రభావిత వ్యక్తులకే ప్రాధాన్యత ఇస్తుంది.

AP Inter 1st Year Civics Study Material Chapter 9 ప్రజాస్వామ్యం

ప్రశ్న 3.
ప్రజాస్వామ్యం విజయవంతమయ్యేందుకు అవసరమైన పరిస్థితులను సూచించండి.
జవాబు:
అర్థం: Democracy అనే ఇంగ్లీషు పదం ‘Demos’ మరియు ‘Kratos’ అనే రెండు గ్రీకు పదాల కలయిక నుంచి ఆవిర్భవించింది. డెమోస్ అంటే ‘ప్రజలు’ క్రటోస్ అంటే ‘అధికారం’ లేదా ‘పాలన’ అని అర్థం.

నిర్వచనం: “ప్రజాస్వామ్యం అంటే ప్రజల యొక్క ప్రజల చేత, ప్రజల కొరకు నిర్వహించబడే ప్రభుత్వం”.

అబ్రహాం లింకన్
ప్రజాస్వామ్య విజయానికి అవసరమైన పరిస్థితులు (Essential conditions to the success of Democracy): ప్రజాస్వామ్య విజయానికి కింద పేర్కొన్న పరిస్థితులు అవసరమవుతాయి.
1) సరైన విద్య (Sound system of Education): ప్రజాస్వామ్యం విజయవంతం కావాలంటే పౌరులకు సరైన విద్య ఎంతో అవసరం. అజ్ఞానం, అమాయకత్వం, అవిద్య గల పౌరులు సరైన దృక్పథాన్ని కలిగి ఉండక, భారీ సంస్కరణల పట్ల విముఖత ప్రదర్శిస్తారు. విద్య అనేది వ్యక్తుల వివేకానికి పదును పెడుతుంది. అనేక విషయాల పట్ల సరియైన అవగాహనను పెంపొందిస్తుంది. పౌరులను అప్రమత్తులుగా చేస్తుంది. అంతేకాకుండా ప్రభుత్వ విధానాలను అంచనా వేయడంలో, విమర్శించడంలో విద్య దోహదపడుతుంది.

2) వికాసవంతమైన పౌరసత్వం (Enlightened Citizenship): ప్రజాస్వామ్య రాజ్యానికి వికాసవంతమైన పౌరులు విలువైన ఆస్థిగా పరిగణించబడతారు. వారు ఎంతో అప్రమత్తంగా వ్యవహరిస్తారు. వీరు ప్రభుత్వ వ్యవహారాలలో చురుకుగా పాల్గొని, హక్కులు, విధుల సక్రమ నిర్వహణలో తోటి పౌరులకు సహాయంగా ఉంటారు. ప్రభుత్వం అమలుచేసే అన్ని మంచి కార్యక్రమాలకు సహకారాన్ని అందిస్తారు.

3) స్వతంత్ర పత్రికలు (Independent Press): ప్రజాస్వామ్యానికి స్వతంత్రమైన పత్రికలు ఎంతో ఆవశ్యకమైనవి. పత్రికలు ప్రభుత్వ కార్యకలాపాలకు సంబంధించిన సమాచారాన్ని ఖచ్చితంగానూ, నిష్పక్షపాతంగానూ ప్రజలకు తెలుపుతాయి. ప్రభుత్వ కార్యకలాపాల పట్ల ప్రజలకు సంబంధం కలిగి ఉండేటట్లు చూస్తాయి. ప్రజల ఇబ్బందులను ప్రభుత్వ దృష్టికి తీసుకువెళతాయి. ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య సామరస్యపూర్వక సంబంధాలను పెంపొందించేందుకు కృషి చేస్తాయి.

4) దృఢమైన ప్రతిపక్షం (Strong Opposition): పార్లమెంటరీ ప్రజాస్వామ్య విజయం దృఢమైన, సమర్థవంతమైన ప్రతిపక్షంపై చాలా వరకు ఆధారపడుతుంది. అటువంటి ప్రతిపక్షం ప్రభుత్వ విధానాల లోపాలను వెల్లడించి, వాటి నివారణకు కృషి చేస్తుంది. అమెరికా, ఆస్ట్రేలియా, బ్రిటన్ వంటి కొన్ని అభివృద్ధి చెందిన దేశాలలో ప్రతిపక్షాలు ప్రశంసనీయమైన పాత్రను పోషిస్తున్నాయనే విషయాన్ని ఈ సందర్భంలో మనం ప్రస్తావించవచ్చు. భారతదేశంలో కూడా ఇటీవలి కాలంలో అధికారంలో కొనసాగిన అధికార పార్టీలకు చెందిన వ్యక్తులు పాల్పడిన కుంభకోణాలను వెలికి తీయడంలో ప్రతిపక్షం బృహత్తరమైన పాత్రను పోషించింది. పైన ఉదహరించిన దేశాలలోని అధికార పార్టీలు అనేక అంశాలలో ఎదురైన చిక్కుముడులను పరిష్కరించడంలో ప్రతిపక్షాల సలహాలను తీసుకోవడమైనది. ఇటువంటి పరిస్థితి అభివృద్ధి చెందుతున్న, అభివృద్ధి చెందిన దేశాలు రెండింటిలో ప్రజాస్వామ్యపు ఆరోగ్యకర చిహ్నంగా పరిగణించవచ్చు.

5) అధికారాల వికేంద్రీరణ (Decentralization of Powers): ప్రజాస్వామ్య వ్యవస్థ ఆరోగ్యకరంగా పనిచేసేందుకు అట్టడుగు స్థాయిలో అధికారాల వికేంద్రీకరణ అత్యంత ఆవశ్యకం. భారతదేశంలో అట్టుడుగు స్థాయిలోని ప్రాతినిధ్య సంస్థలు (పంచాయితీరాజ్ సంస్థలు) కిందిస్థాయి శాసనసభలుగా వ్యవహరించడం ఇందుకు ఉదాహరణగా పేర్కొనవచ్చు. స్థానిక ప్రాంతాలలో నివసిస్తున్న ప్రజలు తమ ఓటుహక్కును ఎలా వినియోగించుకోవాలనే విషయంలో | ఇవి పూర్తి అవగాహన కలిగిస్తాయి.

6) ఆర్థిక అసమానతలు లేకుండుట (Absence of economic disparities): దేశంలో ఆర్థిక వ్యత్యాసాలు లేనప్పుడు ప్రజాస్వామ్యం సాఫీగా పనిచేయగలుగుతుంది. దేశంలో ఎక్కువ మంది పేదవారుగానూ, కొద్దిమంది ఐశ్వర్య వంతులుగానూ ఉంటే ప్రజాస్వామ్యం విజయవంతం కాలేదు. వికాసవంతమైన, వివేకవంతమైన పౌరసత్వం గల వ్యక్తులు ఉన్నప్పుడే, ప్రభుత్వ వ్యవహారాలలో ప్రజలు ఉత్సాహంగా పాల్గొనగలుగుతారు. కాబట్టి ప్రజాస్వామ్యం విజయవంతంగా పనిచేసేందుకు ఆర్థిక అసమానతలు లేని సమాజ నిర్మాణానికి కృషి చేయాలి.

7) సాంఘిక సమానత్వం (Social Equality): సాంఘిక సమానత్వం అనేది ప్రజాస్వామ్య విజయానికి మరొక ఆవశ్యకంగా పేర్కొనవచ్చు. కులం, వర్గం, తెగల వ్యత్యాసాలు అనేవి ప్రజాస్వామ్యపు ఆరోగ్యకరమైన పనితీరును అడ్డుకుంటాయి. ఇటువంటి అంశాలు సంకుచిత అంశాలకు ఎక్కువ ప్రాముఖ్యతనిచ్చి ఉమ్మడి శ్రేయస్సుకు హాని కలిగిస్తాయి. అట్లాగే భాషా, ప్రాంతీయపరమైన అంశాలు ప్రజాస్వామ్య రాజ్య నిర్వహణకు ఆటంకంగా ఉంటాయి. ప్రజాస్వామ్యం విజయవంతం కావాలంటే సామాజిక రంగంలో ప్రతి ఒక్కరికీ సమాన అవకాశాలు కల్పించాలి. సాంఘిక సమానత్వాన్ని సిద్ధాంతరీత్యా ఆచరణలోను ఉంచే ప్రయత్నం జరగాలి.

8) ప్రజాస్వామ్యంపై విశ్వాసం (Faith in Democracy): ప్రజాస్వామ్యానికి సంబంధించిన కొన్ని విలువలైన వ్యక్తి యోగ్యత, విభిన్న వైఖరుల పట్ల సహనం, చర్చల ద్వారా నిర్ణయాలు తీసుకోవడం మొదలగు వాటిని ప్రజలకు నేర్పాలి. ప్రజా జీవనంలో సోదరభావాన్ని ఇతరుల అభిప్రాయాలు, ఆలోచనలకు తగిన ప్రాముఖ్యతను ఇవ్వడంలో ప్రజాస్వామ్య ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. కాబట్టి ప్రభుత్వాలు ప్రజలలో ప్రజాస్వామ్య విలువల పట్ల విశ్వాసం కల్పించినప్పుడే ప్రజాస్వామ్యం విజయవంతం కావడానికి అవకాశముంటుంది.

AP Inter 1st Year Civics Study Material Chapter 9 ప్రజాస్వామ్యం

9) ప్రాథమిక అంశాలపై ఆమోదం (Agreement on Fundamental Issues): ప్రజాస్వామ్యం |విజయవంతం కావాలంటే ప్రాథమిక అంశాలపై ఆమోదం కావాలి. లేనట్లయితే ప్రజల మధ్య విపరీతమైన వ్యత్యాసాలు నెలకొంటాయి. అటువంటి వ్యత్యాసాలను సంప్రదింపుల ద్వారా పరిష్కరించుకోవాలి. లేనట్లయితే ప్రజాస్వామ్య మనుగడ ప్రశ్నార్ధకమై ప్రమాదంలో పడుతుంది. కాబట్టి ప్రజాస్వామ్య ప్రక్రియపై సమాజంలోని అన్ని ప్రధాన వర్గాలకు గట్టి నమ్మకం ఉండాల్సిన అవసరం ఉంది. తమ మధ్య తలెత్తే ఘర్షణలను చర్చల ద్వారానే పరిష్కరించుకొనేందుకు ప్రజలు సన్నద్ధులుగా ఉండాలి.

10) వివేకవంతమైన నాయకత్వం (Sagacious Leadership): ప్రజాస్వామ్య మౌలిక అంశాలలో వివేక వంతమైన పాలకులు తమ పరిపాలనా సూక్ష్మత, రాజకీయ ఔచిత్యం, సామాజిక అంకిత భావం, ఆర్థిక దృక్పథం వంటి లక్షణాలతో ప్రజాస్వామ్య రాజ్యాన్ని మహోన్నత స్థాయికి తీసుకువెళ్ళగలుగుతారు. చెడు ఆచరణలకు, మహోన్నత ఆదర్శాలకు మధ్యగల వ్యత్యాసాన్ని గుర్తించగలుగుతారు. వివిధ సంఘటనల వల్ల ప్రతిస్పందించే విషయంలో సంకుచిత భావాలను మంచి నిర్ణయాల ద్వారా అధిగమిస్తారు.

11) నిజాయితీ, పారదర్శకతలు (Honesty and Transparency): వివిధ రంగాలకు చెందిన నిజాయితీ పరులైన వ్యక్తులు ప్రభుత్వంలో కీలక బాధ్యతలు అప్పగించినప్పుడు వారు ప్రజాస్వామ్య విజయానికి కృషి చేస్తారు. అదే విధంగా పాలనలో పారదర్శకత కూడా ప్రజాస్వామ్య విజయానికి ప్రధాన సాధనంగా ఉంటుంది. ప్రభుత్వంలో ఉన్నత స్థానాల్లో ఉన్న వ్యక్తులు అసత్య, అనైతికత, అశ్లీల చర్యలకు పాల్పడినప్పుడు ప్రజాస్వామ్యం అపహాస్యమవుతుంది. అలాగే స్వార్థపరత్వం, అధికార దాహం, వక్రభావాలు గల నాయకులు నిగూఢమైన అజెండాతో వ్యవహరించినట్లయితే దేశం కోలుకోలేని స్థితికి దిగజారిపోతుంది.

12) సైన్యం పెత్తనం లేకుండుట (Absence of militarism): సైన్యం అజమాయిషీ, పెత్తనం లేని దేశాలలో ప్రజాస్వామ్యం పనిచేయగలుగుతుంది. బలప్రయోగానికి ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా, వ్యక్తుల యోగత్యను విశ్వసిస్తుంది. సామర్థ్యం, అంకిత భావం, యోగ్యతల ఆధారంగా వ్యక్తులకు అనేక అవకాశాలను కల్పిస్తుంది. అందుకు విరుద్ధమైన పరిస్థితులు సైన్యం పెత్తనం ఉన్న దేశాలలో నెలకొని ఉంటాయి. సైనిక పాలనలో అధికారాల కేంద్రీకరణ జరిగి, నియంతృత్వం పట్ల అనుకూలత ఉంటుంది. యుద్ధం, సంఘర్షణల పట్ల మొగ్గు చూపుతున్న దేశాలలో సైన్యం పెత్తనం చెలాయిస్తుంది. ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్యాన్ని పెంచి పోషించాలంటే అందుకు అనుకూలమైన పరిస్థితులు ఉండాలి.

ప్రశ్న 4.
ప్రజాస్వామ్యం అంటే ఏమిటో తెలిపి, ప్రత్యక్ష ప్రజాస్వామ్య సాధనాల గురించి రాయండి. [Mar. ’18, ’17, ’16’]
జవాబు:
పరిచయం: ప్రజాస్వామ్యం ఒక ఆధునిక ప్రభుత్వ స్వరూపం. ఇందులో వివిధ స్థాయిలలో ప్రభుత్వములు ప్రజలచే ప్రత్యక్షముగా గాని లేదా పరోక్షముగా గాని ఏర్పాటు చేయబడి నిర్వహించబడతాయి. ఈ వ్యవస్థలో వంశపారంపర్య పదవులకు ఏ స్థాయిలోనూ అవకాశం ఉండదు.

అర్థం: Democracy అనే ఇంగ్లీషు పదం ‘Demos’ మరియు ‘Krates’ అనే రెండు గ్రీకు పదాల కలయిక నుంచి ఆవిర్భవించింది. డెమోస్ అంటే ‘ప్రజలు’ క్రటోస్ అంటే ‘అధికారం’ లేదా ‘పాలన’ అని అర్థం.

నిర్వచనం: “ప్రజాస్వామ్యం అంటే ప్రజల యొక్క ప్రజల చేత, ప్రజల కొరకు నిర్వహించబడే ప్రభుత్వం”.

అబ్రహాం లింకన్ ప్రత్యక్ష ప్రజాస్వామ్యం: ఈ పద్ధతిలో ప్రజలు ప్రభుత్వ పాలన వ్యవహారాలలో ప్రత్యక్షంగా పాల్గొంటారు. శాసన సంబంధమైన అధికారాలన్నీ వారు చెలాయిస్తారు. ప్రజలే చట్ట సభలలో పాల్గొని చట్టాలను రూపొందిస్తారు. రాజ్య వ్యవహారాలలో ప్రజలు ప్రత్యక్షంగా భాగస్వామ్యం వహిస్తారు.ప్రత్యక్ష ప్రజాస్వామ్య విధానం ప్రస్తుతం స్విట్జర్లాండ్ లో కొన్ని కాంటన్ల (Cantons) లోనూ, అమెరికా సంయుక్త రాష్ట్రాలలోని కొన్ని ప్రాంతాలలోనూ నెలకొని ఉంది.

ప్రత్యక్ష ప్రజాస్వామ్య సాధనాలు: ప్రత్యక్ష ప్రజాస్వామ్య సాధనాలు నాలుగు రకాలుగా ఉంటాయి. అవి:

  1. ప్రజాభిప్రాయ సేకరణ (Referendum)
  2. ప్రజాభిప్రాయ నివేదన (Initiative)
  3. పునరాయనం (Recall)
  4. ప్రజాభిప్రాయ నిర్ణయం (Plebiscite)

పైన పేర్కొన్న నాలుగు రకాల ప్రత్యక్ష ప్రజాస్వామ్య సాధనాలను కింది విధంగా చర్చించవచ్చు.
1) ప్రజాభిప్రాయ సేకరణ (Referendum): రిఫరెండమ్ (referendum) అనే ఆంగ్ల పదానికి అర్థం “ప్రజాభిప్రాయ సేకరణ”. ఒకానొక అంశంపై ప్రజల అభిప్రాయాన్ని ప్రత్యక్షంగా తెలుసుకొనే ప్రక్రియనే ప్రజాభిప్రాయ సేకరణ అంటారు. ఇటువంటి అంశం సాధారణమైనది లేదా రాజ్యాంగపరమైనది కావచ్చు. ఆర్.సి. బ్రూక్స్ ప్రకారం | ప్రజాభిప్రాయ సేకరణ అనేది శాసనసభ అప్పటికే ఆమోదించిన బిల్లు లేదా చట్టంపై నియోజకుల అభిప్రాయాన్ని తెలుసుకొనేందుకు ఉద్దేశించింది.

AP Inter 1st Year Civics Study Material Chapter 9 ప్రజాస్వామ్యం

ప్రజాభిప్రాయ సేకరణ రకాలు (Types of Referendum): ప్రజాభిప్రాయ సేకరణ రెండు రకాలు. అవి: 1. నిర్బంధమైనవి 2. స్వచ్ఛందమైనవి. ఒకానొక శాసన అంశంపై నియోజకుల అభిప్రాయాన్ని విధిగానూ, ఖచ్ఛితమైన నియమంగానూ పరిగణనలోకి తీసుకొని తెలుసుకోవడాన్ని నిర్బంధ ప్రజాభిప్రాయ సేకరణ అంటారు. ఈ రకమైన ప్రజాభిప్రాయ సేకరణ స్విట్జర్లాండ్, ఆస్ట్రేలియా రాజ్యాంగాల సవరణల విషయంలో అనుసరించడమైంది. ఉదాహరణకు స్విట్జర్లాండ్ లోని కొన్ని కాంటన్లలో (రాష్ట్రాలలో) సాధారణ బిల్లులపై కూడా నిర్బంధంగా ప్రజాభిప్రాయ సేకరణ జరగాలనే రాజ్యాంగ ప్రకరణం ఉంది. అదే విధంగా ఒక నిర్ణీత సంఖ్యలో పౌరులు శాసనసభ ఆమోదించిన అంశంపై ప్రజాభిప్రాయ సేకరణ జరపాలని కోరితే ఆ అంశంపై ప్రజాభిప్రాయ సేకరణ జరుగుతుంది. ఇటువంటి దానిని స్వచ్ఛందమైన ప్రజాభిప్రాయ సేకరణ అంటారు. ఉదాహరణకు 30,000 మంది పౌరులుగానీ, ఎనిమిది కాంటన్లు (8 రాష్ట్రాలు) |గానీ ప్రజాభిప్రాయ సేకరణ జరపాలని కోరినట్లయితే ఈ విధమైన ప్రజాభిప్రాయ సేకరణ జరుగుతుంది.

2) ప్రజాభిప్రాయ నివేదన (Initiative): ప్రత్యక్ష ప్రజాస్వామ్య సమర్థకులు ఒక్క ప్రజాభిప్రాయ సేకరణతో సంతృప్తి చెందలేదు. దాంతో ప్రజలు శాసన నిర్మాణ ప్రక్రియలో ప్రజలు పాల్గొనేలా ప్రజాభిప్రాయ నివేదన గురించి వారు గట్టిగా చెప్పారు. ఉదాహరణకు స్విట్జర్లాండ్లో 50,000 మంది పౌరులు ఏదైనా ఒక అంశంపై చట్టాన్ని రూపొందించాల్సిందిగా శాసనసభను కోరుతూ ఒక అర్జీపై సంతకం చేయవచ్చు. అప్పుడు వారి ప్రతిపాదనను ప్రజల అభిప్రాయాన్ని తెలుసుకోవడానికి పంపించబడుతుంది. మెజారిటీ పౌరులు ఆ ప్రతిపాదన ఆమోదించినట్లయితే, ఆ అంశం చట్టంగా ఆమోదితమై అమల్లోకి వస్తుంది. స్విట్జర్లాండ్లోని కాంటన్లలో (రాష్ట్రాలలో) సాధారణ అంశాలతోపాటుగా రాజ్యాంగ ప్రాముఖ్యతగల అంశాలపై ప్రజల అభిప్రాయాన్ని కోరడం ఎప్పటి నుంచో వాడుకలో ఉంది. అయితే అటువంటి ప్రతిపాదనపై సంతకం చేసే వారి సంఖ్య ఆ దేశంలో రాష్ట్రాల వారీగా మారుతూ ఉంటుంది.

ప్రజాభిప్రాయ నివేదన రకాలు (Types of Initiative): ప్రజాభిప్రాయ నివేదన 1. విధాయకమైనది లేదా నిర్ణీత నియమాలతో కూడినది. 2. విధాయకం కానిది లేదా నిర్ణీత నియమాలు లేనిది అని రెండు రకాలుగా చెప్పవచ్చు. మొదటిదైన విధాయకమైన అభిప్రాయ నివేదన అనేది ఒక బిల్లులోని అన్ని అంశాలకు సంబంధించినది. ఆ బిల్లు విషయంలో శాసనసభ ప్రజలు ప్రతిపాదించిన అంశాలన్నింటినీ యధాతధంగా ఆమోదించాల్సి ఉంటుంది. లేనియెడల ప్రజల తీర్పును తెలుసుకొనేందుకు ఓటింగ్ నిర్వహణకు పంపించబడుతుంది. ఇక రెండోదైన విధాయకంగాని ప్రజాభిప్రాయ నివేదన అనేది కేవలం బిల్లులోని సాధారణ అంశాల సూచనకు సంబంధించినది. ప్రజల డిమాండ్లు ఏమిటనే విషయంలో ఆ బిల్లులో పేర్కొనడం జరగదు. ఉదాహరణకు స్విట్జర్లాండులో శాసనసభ ప్రజలు పంపిన ప్రతిపాదనలను ఆమోదించి, వాటికి అనుగుణంగా బిల్లు ముసాయిదాను రూపొందించి, ప్రజల నిర్ణయాన్ని తెలుసుకొనేలా ఓటింగ్ జరిగేందుకు చర్యలు గైకొనడం జరుగుతుంది. ఒకవేళ స్విస్ ఫెడరల్ అసెంబ్లీ ప్రజలు పంపిన నివేదనలోని అంశాలను ఆమోదించినట్లయితే, ఫెడరల్ అసెంబ్లీ ప్రతిపాదిత అంశాలతో కూడిన బిల్లు రూపొందించి ఆమోదిస్తుంది. అయితే మొత్తం రాజ్యాంగమంతటిని సవరించాలనే డిమాండు అందుకు భిన్నంగా ఉంటుంది.

రాజ్యాంగ సవరణ గురించి ప్రజల అభిప్రాయాన్ని తెలుసుకొనేందుకు ఓటింగు నిర్వహించబడుతుంది. మెజారిటీ స్విస్ పౌరులు పూర్తి సవరణ పట్ల అనుకూలంగా ఉంటే, ఫెడరల్ అసెంబ్లీ రద్దవుతుంది. క్రొత్తగా ఎన్నుకోబడిన ఫెడరల్ అసెంబ్లీ సభ్యులు, పౌరులు ప్రతిపాదించిన రీతిలో ముసాయిదా రాజ్యాంగ బిల్లును రూపొందించి ఆమోదిస్తారు. ఆ తరువాత ఆ బిల్లుపై ప్రజాభీష్టాన్ని తెలుసుకొనేందుకై దేశవ్యాప్తంగా ఓటింగ్ నిర్వహించబడుతుంది. ఆ బిల్లును దేశంలోని మెజారిటీ దేశ ప్రజలు, కాంటన్లు ఆమోదించినట్లయితే ఆ అంశంపై రాజ్యాంగ సవరణ జరుగుతుంది.

3) పునరాయనం (Recall): పునరాయనం అనేది ఒక ముఖ్యమైన ప్రత్యక్ష ప్రజాస్వామ్య సాధనం. ఈ పద్దతిలో ఎన్నికైన ప్రజా ప్రతినిధులు లేదా అధికారులు ఉద్దేశ్యపూర్వకంగా తమ కర్తవ్యాలను నిర్వహించడంలో విఫలమైతే వారిని ఓటర్లు వెనుకకు పిలిచేందుకు వీలుంటుంది. దీనినే పునరాయనం అంటారు. ఈ రకమైన పద్ధతి అమెరికాలోని అరిజోనా, మోంటానా, లూసియానా, కాన్సాస్, కాలిఫోర్నియా, నెవెడా, ఓరెగాన్ మొదలగు రాష్ట్రాలలో అమలులో ఉంది.

4) ప్రజాభిప్రాయ నిర్ణయం (Plebiscite): ప్రజాభిప్రాయ నిర్ణయం (Plebiscite) అనే పదానికి ఫ్రాన్స్లో మూలాలున్నాయి. ఆ పదం లాటిన్ భాషలోని ప్లెబిస్ (Plebis), సెటిమ్ (Scitum) అనే రెండు పదాల నుంచి ఉద్భవించింది. లాటిన్ భాషలో ప్లెబిస్ అంటే ‘ప్రజలు’, సెటమ్’ అంటే ‘నిర్ణయం’ లేదా తీర్పు. ప్రజా నిర్ణయం లేదా ప్రజాతీర్పని అర్థం. అదేవిధంగా ఒకానొక ప్రభుత్వ విధానంపై ప్రజల అభిప్రాయాన్ని తెలుసుకొనేందుకు అనుసరించే ప్రజాస్వామ్య సాధనమే ప్రజాభిప్రాయ నిర్ణయంగా పేర్కొనవచ్చు. ప్రజా నిర్ణయానికి దైనందిన చట్ట నిర్మాణ కార్యక్రమానికి ఎటువంటి సంబంధం లేదు. ప్రజాభిప్రాయ నిర్ణయంలోని ముఖ్య లక్షణం ఏమిటంటే ఈ పద్ధతి ప్రకారం వెలువడిన ప్రజల నిర్ణయాలు అంతిమమైనవి. వాటికి ఏ విధమైన మార్పులు చేయబడవు.

AP Inter 1st Year Civics Study Material Chapter 9 ప్రజాస్వామ్యం

ఆధునిక కాలంలో 1804లో ఫ్రాన్స్లో ఆనాటి రాజ్యాంగాన్ని రద్దు చేసేందుకు నెపోలియన్ మొదటిసారిగా ఈ సాధనాన్ని వినియోగించాడు. అప్పటి నుంచి దానిని పలు పర్యాయాలు వినియోగించడమైంది.

భారత ఉపఖండంలో ఈ సాధనాన్ని వినియోగించే విషయంలో భారత్ పాకిస్తాన్ల మధ్య గతంలో వాదోపవాదనలు జరిగాయి.

స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
ప్రజాస్వామ్యం వివిధ దృక్కోణాలేవి ?
జవాబు:
ప్రజాస్వామ్యం వివిధ దృక్కోణాలను కలిగి ఉంది. వాటిలో ముఖ్యమైనవి స్వేచ్ఛ, సమానత్వం, రాజకీయ పార్టీలు, సమన్యాయ పాలన, అధికార వికేంద్రీకరణ మొదలగునవి. వాటిని గురించి ఈ క్రింది పేర్కొన్న విధంగా భావించవచ్చు. అవి:
1) స్వేచ్ఛ: ప్రజాస్వామ్యం యొక్క ముఖ్య దృక్కోణంగా స్వేచ్ఛను పేర్కొనవచ్చు. ఈ వ్యవస్థ అమలులో ఉన్న రాజ్యాలలో నివసించే పౌరులు సంపూర్ణ స్వేచ్ఛా, స్వాతంత్ర్యాలను కలిగి ఉంటారు.

2) సమానత్వం: ప్రజాస్వామ్య ప్రభుత్వానికి ప్రధాన ప్రాతిపదిక సమానత్వం. ఈ వ్యవస్థ అమలులో ఉన్న రాజ్యాలలో నివసించే ప్రజలంతా ఎటువంటి తారతమ్యాలు, వ్యత్యాసాలు లేకుండా ఆర్థిక, రాజకీయ, సాంఘిక, పౌర సమానత్వాన్ని కలిగి ఉంటారు.

3) రాజకీయ పార్టీలు: రాజకీయ పార్టీలను ప్రజాస్వామ్య వ్యవస్థ యొక్క మరొక దృక్కోణంగా మనం భావించవచ్చు. ఈ వ్యవస్థలో నిర్ణీత కాలంలో ఎన్నికలు జరుగుతాయి. ఈ ఎన్నికలలో మెజారిటీ నియోజక వర్గాలలో గెలుపొందిన రాజకీయ పార్టీ అధికారంలోకి వస్తుంది. రెండవ పార్టీ ప్రతిపక్ష పార్టీగా వ్యవహరిస్తుంది. ఇది ద్విరాజకీయ పార్టీ విధానం అమలులో ఉన్న రాజ్యాలలో జరిగే సాధారణ లేదా సహజ ప్రక్రియ.

4) సమన్యాయ పాలన: ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలంతా చట్టం ముందు సమానులే. చట్టాలను అమలు పరచే విషయంలో రాజ్యం, ప్రభుత్వం, జాతి, మత, కుల, వర్గ, వర్ణ, లింగ ప్రాతిపదికన ఏ వ్యక్తిని ఎటువంటి వివక్షతకు, పక్షపాతానికి గురి చేయకూడదు.

5) అధికార వికేంద్రీకరణ: అధికార వికేంద్రీకరణను ప్రజాస్వామ్య ప్రభుత్వం యొక్క ముఖ్యమైన దృక్కోణంగా పేర్కొనవచ్చు. రాజ్యము యొక్క సర్వ అధికారములు ప్రభుత్వ శాఖల మధ్య వికేంద్రీకరించబడతాయి.

ప్రశ్న 2.
ప్రజాస్వామ్యంలోని వివిధ రకాలను వర్ణించండి.
జవాబు:
అర్థం: Democracy అనే ఇంగ్లీషు పదం ‘Demos’ మరియు ‘Kratos’ అనే రెండు గ్రీకు పదాల కలయిక నుంచి ఆవిర్భవించింది. డెమోస్ అంటే ‘ప్రజలు’ క్రటోస్ అంటే ‘అధికారం’ లేదా ‘పాలన’ అని అర్థం.

నిర్వచనం: “ప్రజాస్వామ్యం అంటే ప్రజల యొక్క ప్రజల చేత, ప్రజల కొరకు నిర్వహించబడే ప్రభుత్వం”. – అబ్రహాం లింకన్

ప్రజాస్వామ్యం – వివిధ రకాలు:
1) ప్రత్యక్ష లేదా స్వచ్ఛమైన ప్రజాస్వామ్యం: ఈ పద్ధతిలో ప్రజలు ప్రభుత్వ పాలన వ్యవహారాలలో ప్రత్యక్షంగా పాల్గొంటారు. శాసన సంబంధమైన అధికారాలన్నీ వారు చెలాయిస్తారు. ప్రజలే చట్ట సభలలో పాల్గొని చట్టాలను రూపొందిస్తారు. రాజ్య వ్యవహారాలలో ప్రజలు ప్రత్యక్షంగా భాగస్వామ్యం వహిస్తారు.
ప్రత్యక్ష ప్రజాస్వామ్య విధానం ప్రస్తుతం స్విట్జర్లాండ్లో కొన్ని కాంటన్ల (Cantons) లోనూ, అమెరికా సంయుక్త రాష్ట్రాలలోని కొన్ని ప్రాంతాలలోనూ నెలకొని ఉంది.

2) పరోక్ష లేదా ప్రాతినిధ్య ప్రజాస్వామ్యం: ప్రజలచేత ఎన్నుకోబడిన ప్రతినిధుల ద్వారా ప్రభుత్వ పాలన నిర్వహించబడటాన్ని ప్రాతినిధ్య ప్రజాస్వామ్యం లేదా పరోక్ష ప్రజాస్వామ్యం అని అంటారు. నిర్ణీత సమయానికి ఎన్నికైన ప్రజా ప్రతినిధులు తమ అధికార, విధుల నిర్వహణలో ప్రజలకు బాధ్యత వహిస్తారు. ప్రజా ప్రతినిధులు తమ అధికార విధుల నిర్వహణలో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా వ్యవహరించటంలో విఫలమైతే వారిని ప్రజలు ఎన్నికల సమయంలో పదవుల నుండి తొలగిస్తారు.

AP Inter 1st Year Civics Study Material Chapter 9 ప్రజాస్వామ్యం

ప్రశ్న 3.
ప్రాతినిధ్య ప్రజాస్వామ్యం గురించి క్లుప్తంగా రాయండి.
జవాబు:
ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రతినిధుల ద్వారా ప్రభుత్వ పాలన నిర్వహించబడటాన్ని ప్రాతినిధ్య ప్రజాస్వామ్యం లేదా పరోక్ష ప్రజాస్వామ్యం అని అంటారు. నిర్ణీత సమయానికి ఎన్నికైన ప్రజా ప్రతినిధులు తమ అధికార, విధుల నిర్వహణలో ప్రజలకు బాధ్యత వహిస్తారు. ప్రజా ప్రతినిధులు తమ అధికార విధుల నిర్వహణలో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా వ్యవహరించటంలో విఫలమైతే వారిని ప్రజలు ఎన్నికల సమయంలో పదవుల నుండి తొలగిస్తారు.

పరోక్ష లేదా ప్రాతినిధ్య ప్రజాస్వామ్యంను తిరిగి రెండు రకాలుగా వర్గీకరించడమైనది. అవి: 1) అధ్యక్ష ప్రజాస్వామ్యం 2) పార్లమెంటరీ ప్రజాస్వామ్యం. అధ్యక్ష ప్రజాస్వామ్య విధానంలో అధికారాలన్నీ ఒకే ఒక కార్యనిర్వాహక అధిపతి వినియోగించడమే కాక కార్యనిర్వాహక అధికారాలన్నీ అధ్యక్షుడి చేతిలో కేంద్రీకృతమై ఉంటాయి. ఉదా: అమెరికా అధ్యక్షుడు అందుకు విరుద్ధంగా పార్లమెంటరీ విధానంలో ప్రధానమంత్రి నాయకత్వంలోని కొందరు మంత్రులు దేశ ‘ అధ్యక్షుడి పేరుతో కార్య నిర్వాహక అధికారాలను వినియోగిస్తారు. ప్రధానమంత్రితో కూడిన మంత్రులు తమ అధికార విధుల నిర్వహణలో పార్లమెంటుకు బాధ్యత వహిస్తారు. ఉదా: బ్రిటన్, ఇండియా, ఆస్ట్రేలియా మొదలైనవి.

ప్రశ్న 4.
ప్రత్యక్ష ప్రజాస్వామ్య సాధనాలను వివరించండి.
జవాబు:
ప్రత్యక్ష ప్రజాస్వామ్యం: ఈ పద్ధతిలో ప్రజలు ప్రభుత్వ పాలన వ్యవహారాలలో ప్రత్యక్షంగా పాల్గొంటారు. శాసన సంబంధమైన అధికారాలన్నీ వారు చెలాయిస్తారు. ప్రజలే చట్ట సభలలో పాల్గొని చట్టాలను రూపొందిస్తారు. రాజ్య వ్యవహారాలలో ప్రజలు ప్రత్యక్షంగా భాగస్వామ్యం వహిస్తారు.

ప్రత్యక్ష ప్రజాస్వామ్య విధానం ప్రస్తుతం స్విట్జర్లాండ్లో కొన్ని కాంటన్ల (Cantons) లోనూ, అమెరికా సంయుక్త రాష్ట్రాలలోని కొన్ని ప్రాంతాలలోనూ నెలకొని ఉంది.
ప్రత్యక్ష ప్రజాస్వామ్య సాధనాలు: ప్రత్యక్ష ప్రజాస్వామ్య సాధనాలు నాలుగు రకాలుగా ఉంటాయి. అవి: –

  1. ప్రజాభిప్రాయ సేకరణ (Referendum)
  2. ప్రజాభిప్రాయ నివేదన (Initiative)
  3. పునరాయనం (Recall)
  4. ప్రజాభిప్రాయ నిర్ణయం (Plebiscite)

1) ప్రజాభిప్రాయ సేకరణ (Referendum): రిఫరెండమ్ (referendum) అనే ఆంగ్ల పదానికి అర్థం “ప్రజాభిప్రాయ సేకరణ”. ఒకానొక అంశంపై ప్రజల అభిప్రాయాన్ని ప్రత్యక్షంగా తెలుసుకొనే ప్రక్రియనే ప్రజాభిప్రాయ సేకరణ అంటారు. ఇటువంటి అంశం సాధారణమైనది లేదా రాజ్యాంగపరమైనది కావచ్చు. ఆర్.సి. బ్రూక్స్ ప్రకారం ప్రజాభిప్రాయ సేకరణ అనేది శాసనసభ అప్పటికే ఆమోదించిన బిల్లు లేదా చట్టంపై నియోజకుల అభిప్రాయాన్ని తెలుసుకొనేందుకు ఉద్దేశించింది.

2) ప్రజాభిప్రాయ నివేదన (Initiative): ప్రత్యక్ష ప్రజాస్వామ్య సమర్థకులు ఒక్క ప్రజాభిప్రాయ సేకరణతో సంతృప్తి చెందలేదు. దాంతో ప్రజలు శాసన నిర్మాణ ప్రక్రియలో ప్రజలు పాల్గొనేలా ప్రజాభిప్రాయ నివేదన గురించి వారు గట్టిగా చెప్పారు. ఉదాహరణకు స్విట్జర్లాండ్లో 50,000 మంది పౌరులు ఏదైనా ఒక అంశం పై చట్టాన్ని రూపొందించాల్సిందిగా శాసనసభను కోరుతూ ఒక అర్జీపై సంతకం చేయవచ్చు. అప్పుడు వారి ప్రతిపాదనను ప్రజల అభిప్రాయాన్ని తెలుసుకోవడానికి పంపించబడుతుంది. మెజారిటీ పౌరులు ఆ ప్రతిపాదన ఆమోదించినట్లయితే, ఆ అంశం చట్టంగా ఆమోదితమై అమల్లోకి వస్తుంది. స్విట్జర్లాండ్ లోని కాంటన్లలో (రాష్ట్రాలలో) సాధారణ అంశాలతోపాటుగా రాజ్యాంగ ప్రాముఖ్యతగల అంశాలపై ప్రజల అభిప్రాయాన్ని కోరడం ఎప్పటి నుంచో వాడుకలో ఉంది. అయితే అటువంటి ప్రతిపాదనపై సంతకం చేసే వారి సంఖ్య ఆ దేశంలో రాష్ట్రాల వారీగా మారుతూ ఉంటుంది.

3) పునరాయనం (Recall): పునరాయనం అనేది ఒక ముఖ్యమైన ప్రత్యక్ష ప్రజాస్వామ్య సాధనం. ఈ పద్ధతిలో ఎన్నికైన ప్రజా ప్రతినిధులు లేదా అధికారులు ఉద్దేశ్యపూర్వకంగా తమ కర్తవ్యాలను నిర్వహించడంలో విఫలమైతే వారిని ఓటర్లు వెనుకకు పిలిచేందుకు వీలుంటుంది. దీనినే పునరాయనం అంటారు. ఈ రకమైన పద్దతి అమెరికాలోని అరిజోనా, ‘మోంటానా, లూసియానా, కాన్సాస్, కాలిఫోర్నియా, నెవెడా, ఓరెగాన్ మొదలగు రాష్ట్రాలలో అమలులో ఉంది.

AP Inter 1st Year Civics Study Material Chapter 9 ప్రజాస్వామ్యం

4) ప్రజాభిప్రాయ నిర్ణయం (Plebiscite): ప్రజాభిప్రాయ నిర్ణయం (Plebiscite) అనే పదానికి ఫ్రాన్స్లో మూలాలున్నాయి. ఆ పదం లాటిన్ భాషలోని ప్లెబిస్ (Plebis), సెటమ్ (Scitum) అనే రెండు పదాల నుంచి ఉద్భవించింది. లాటిన్ భాషలో ప్లెబిస్ అంటే ‘ప్రజలు’, సెటమ్ అంటే ‘నిర్ణయం’ లేదా తీర్పు. ప్రజా నిర్ణయం లేదా ప్రజా తీర్పని అర్థం. అదేవిధంగా ఒకానొక ప్రభుత్వ విధానంపై ప్రజల అభిప్రాయాన్ని తెలుసుకొనేందుకు అనుసరించే ప్రజాస్వామ్య సాధనమే ప్రజాభిప్రాయ నిర్ణయంగా పేర్కొనవచ్చు. ప్రజా నిర్ణయానికి దైనందిన చట్ట నిర్మాణ కార్యక్రమానికి ఎటువంటి సంబంధం లేదు. ప్రజాభిప్రాయ నిర్ణయంలోని ముఖ్య లక్షణం ఏమిటంటే ఈ పద్ధతి ప్రకారం వెలువడిన ప్రజల నిర్ణయాలు అంతిమమైనవి. వాటికి ఏ విధమైన మార్పులు చేయబడవు.

ప్రశ్న 5.
ప్రజాస్వామ్యాన్ని నిర్వచించి, ప్రజాస్వామ్య ప్రాముఖ్యతను పేర్కొనండి.
జవాబు:
నిర్వచనాలు:
1) “ప్రజాస్వామ్యం అంటే ప్రజల యొక్క ప్రజల చేత, ప్రజల కొరకు నిర్వహించబడే ప్రభుత్వం” అని అబ్రహాం లింకన్ పేర్కొన్నాడు.

2) “ప్రభుత్వంలో ప్రతి ఒక్కరికి భాగస్వామ్యం ఉన్న ప్రభుత్వమే ప్రజాస్వామ్యం” అని జె.ఆర్.సీలీ పేర్కొన్నాడు. ప్రజాస్వామ్య ప్రాముఖ్యత: ప్రజాస్వామ్యం అనేది ఆధునిక జీవన విధానం. ప్రజాస్వామ్యంలో మాత్రమే వ్యక్తుల స్వీయ గౌరవాలకు హామీ ఉంటుంది. ప్రజాస్వామ్యాన్ని ప్రాచీన గ్రీకు నగర రాజ్యాలు మొదలుకొని వర్తమాన కాలం వరకు అనుసరిస్తున్నారు. వర్తమాన కాలంలో సమాజం, రాజ్యం, ప్రభుత్వం వంటి అనేక సంస్థల నిర్మాణ నిర్వహణలలో ప్రజాస్వామ్యం ముఖ్యమైన సాధనంగా భావించబడింది.

ప్రజాస్వామ్యం వివక్షతలు లేని సమాజాన్ని ఏర్పాటు చేయాలని ఆశిస్తుంది. ప్రజాస్వామ్యం ప్రజలకు అనేక హక్కులను ప్రసాదిస్తుంది. అదే సమయంలో వారు కొన్ని బాధ్యతలను నిర్వర్తించేలా చూస్తుంది. ప్రజాస్వామ్యం అన్ని కాలాలకు సౌకర్యవంతమైన ప్రభుత్వంగా భావించబడుతుంది. ప్రబలమైన రాజకీయ ఉద్రిక్తతలు, సామాజిక ఒత్తిడులు ఉన్నప్పుడు కూడా ప్రజాస్వామ్యం శాంతియుతమైన, రాజ్యాంగబద్ధమైన పరిష్కారాలను అందిస్తుంది.

ప్రజాస్వామ్యం విభిన్నమైన సామాజిక, ఆర్థిక శక్తులు పరస్పరం పనిచేసేందుకు అనుకూలమైన వాతావరణాన్ని సృష్టిస్తుంది. ఈ సందర్భంలో లార్డ్ బ్రైస్ ప్రజాస్వామ్యం గురించి వ్యాఖ్యానిస్తూ ప్రజాస్వామ్యంలో ప్రజలు ఆస్తి, సామాజిక హోదాలతో సంబంధం లేకుండా స్నేహపూర్వక, సామరస్య ధోరణులతో వ్యవహరిస్తారని పేర్కొన్నాడు. ఒక్క మాటలో ప్రజాస్వామ్యంలో అసమ్మతివాదులు, వ్యతిరేకులు, విరుద్ధ భావాలు గల వారికి కూడా ప్రభుత్వ వ్యవహారాలలో భాగస్వామ్యం ఉంటుంది. ఈ ప్రక్రియలో సంప్రదింపులు, సఖ్యత, రాజీ, ఏకాభిప్రాయం వంటి నాలుగు రకాల సాధనాల ద్వారా నిర్ణయాలను తీసుకోవడమవుతుంది. కాబట్టి పై అంశాలను బట్టి ఆధునిక సమాజాలలో ప్రజాస్వామ్య విలువను గమనించవచ్చు.

ప్రశ్న 6.
ప్రజాస్వామ్యంలోని ఏవైనా మూడు సుగుణాలు, లోపాలను వివరించండి. [Mar. 2017]
జవాబు:
ప్రజాస్వామ్యం ప్రయోజనాలు (Merits of Democracy): సమకాలీన ప్రపంచంలో ప్రజాస్వామ్యం విశేషమైన ప్రజాభిమానాన్ని చూరగొంది. దాదాపు ప్రముఖ రాజ్యాలన్నీ ప్రజాస్వామ్యాన్ని తమ రాజకీయ సిద్ధాంతంగా అనుసరిస్తున్నాయి. ప్రజాస్వామ్యంలో కింద పేర్కొన్న ప్రయోజనాలున్నాయి.
1) సమర్థవంతమైన ప్రభుత్వం (Efficient Government): ప్రజాస్వామ్యాన్ని సమర్థవంతమైన, పటిష్టమైన ప్రభుత్వంగా ప్రొఫెసర్ గార్నర్ వర్ణించాడు. ప్రజాస్వామ్య వ్యవస్థలో సాధారణ సమయాలలోనూ, అత్యవసర పరిస్థితులలోనూ ప్రభుత్వ కార్యక్రమాలు సమర్థవంతంగానూ, పటిష్టంగానూ కొనసాగుతాయి. ప్రజలచే ఎన్నిక, ప్రజల నియంత్రణ, ప్రజలకు బాధ్యత అనే ప్రజాస్వామ్య సూత్రాలు గోచరిస్తాయి. అవి ఇతర ప్రభుత్వాలతో పోల్చినపుడు ఇందులో సమర్థతను చేకూర్చుతాయి.

2) వ్యక్తి స్వేచ్ఛల సమర్థన (Upholds Individual Liberties): ప్రజాస్వామ్య ప్రభుత్వం మాత్రమే వ్యక్తి స్వేచ్ఛలను సమర్థిస్తుంది. రాజ్యాంగపరమైన అనేక రక్షణల ద్వారా వ్యక్తుల హామీలకు హామీ ఇస్తుంది. ఈ అంశం ప్రాతిపదికపై జె.ఎస్.మిల్ ప్రజాస్వామ్యాన్ని సమర్థించాడు. ప్రజాస్వామ్యం ప్రజలకు వాక్, సభా, పత్రికా స్వాతంత్రాలు, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛలను ప్రసాదిస్తుందని అతడు ప్రకటించాడు.

3) సమానత్వానికి హామీ (Assures Equality): ప్రజాస్వామ్యం రాజకీయ, ఆర్థిక రంగాలలోని వ్యక్తుల యొక్క సమానత్వానికి హామీ ఇస్తుంది. రాజకీయ రంగంలో పౌరుల కుల, వర్ణం, పుట్టుక వంటి అంశాలతో ప్రమేయం లేకుండా వారికి ఓటు హక్కు, ఎన్నికలలో అభ్యర్థులుగా పోటీచేసే హక్కు, ప్రభుత్వ పదవులను చేపట్టే హక్కు వంటి రాజకీయ హక్కులను పౌరులకు ప్రసాదిస్తుంది. సమాజంలో ఇతర వర్గాలను విస్మరించి కొద్దిమంది వ్యక్తులకు ప్రత్యేక హక్కులను కల్పించడాన్ని వ్యతిరేకిస్తుంది.

AP Inter 1st Year Civics Study Material Chapter 9 ప్రజాస్వామ్యం

ప్రజాస్వామ్యం లోపాలు:
1) అజ్ఞానుల పాలన (Rule by Ignorants): అరిస్టాటిల్ ప్రజాస్వామ్యాన్ని ప్రభుత్వ వికృత రూపంగా పరిగణించాడు. ప్రజాస్వామ్యమనేది ఒక రకమైన మూకపాలనగా భావించాడు. అతడి గురువైన ప్లేటో ప్రజాస్వామ్యాన్ని అజ్ఞానుల పాలనగా పిలిచాడు. ప్రజాస్వామ్యంలో ఓట్ల లెక్కింపు మాత్రమే జరుగుతుందని మరికొందరు విమర్శించారు. ప్రజాస్వామ్యంలో అనేక అంశాలపై నిర్ణయాలనేవి శాసనసభ, మంత్రివర్గ సమావేశాలలో మెజారిటీ సభ్యుల అభీష్టం మేరకు జరుగుతాయి. దాంతో యోగ్యులు, నిజాయితీ గల వ్యక్తులు దూరంగా ఉంచబడి, అజ్ఞానులు, మూర్ఖులు ప్రాధాన్యత కలిగి ఉంటారు.

2) ధనికులకు అనుకూలత (Favours the Rich): ఆధునిక ప్రజాస్వామ్య రాజ్యాలలో అధిక భాగం పెట్టుబడిదారీ స్వభావాన్ని కలిగి ఉన్నాయి. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రభుత్వాలు సంపన్న వర్గాల వారి పట్ల సానుకూలతను ప్రదర్శిస్తాయి. ఎన్నికలనేవి ఒక ప్రహసనంగా మారుతాయి. ప్రజాస్వామ్యంలో ఓటర్లను దైవంగా గుర్తించడమవుతుంది. ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థులు కులం, వర్ణం, మతం, పుట్టుక, ప్రాంతం వంటి అంశాల వారీగా ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు ప్రయత్నిస్తారు. వారికి భౌతిక, ధన, కనక వస్తువులను అందించడం ద్వారా ఆకర్షిస్తారు.

3) అధిక సంఖ్యాకుల పాలన అనేది ఒక భ్రమ (Majority rule-a Myth): ఒకప్పుడు 1980వ దశకం వరకు ప్రజాస్వామ్యాన్ని అధిక సంఖ్యాకుల పాలనగా పరిగణించడమైంది. ఆ తరువాత జాతీయ, అంతర్జాతీయ రంగాలలో సంభవించిన నాటకీయ పరిణామాల ఫలితంగా అనేక మార్పులు సంభవించాయి. విద్య, అక్షరాస్యత, విజ్ఞాన వికాసం, పత్రికలు, వార్తా దృశ్య సాధనాలు, ఫేస్బుక్, ట్విట్టర్, ఇతర సామాజిక మాధ్యమాలు రాజకీయ రంగంలో విప్లవాత్మకమైన మార్పులను తీసుకొచ్చాయి. సంకీర్ణ ప్రభుత్వ రాజకీయ సంస్కృతి సాధారణ రాజకీయ పరిణామంగా మారింది. ప్రాచీన పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థలుగా పేరుగాంచిన బ్రిటన్ వంటి రాజ్యాలలో సైతం సంకీర్ణ ప్రభుత్వాలు ఏర్పాటయినాయి. అలాగే అభివృద్ధి చెందుతున్న ఇండియా, బంగ్లాదేశ్, పాకిస్తాన్, నేపాల్ వంటి దేశాలలో కూడా సంకీర్ణ ప్రభుత్వాలు అనివార్యమవుతున్నాయి. అందుకు కారణం ఆయా దేశాలలో శాసనసభలలో ఏ ఒక్క పార్టీకి ప్రభుత్వాన్ని ఏర్పరచే సంపూర్ణమైన మెజారిటీ స్థానాలు లభించకపోవడంగా పేర్కొనవచ్చు. దాంతో శాసనసభలలో ఎక్కువ స్థానాలు (మెజారిటీ స్థానాలు కాకుండ) గెల్చుకున్న అతిపెద్ద పార్టీ మిగిలిన చిన్న పార్టీలతో కలసి సంకీర్ణ భాగస్వామ్యంగా ఏర్పడి, కనీస ఉమ్మడి కార్యక్రమాన్ని రూపొందించి ప్రభుత్వాలను ఏర్పాటు చేయడం సర్వ సాధారణమైంది. అటువంటి ప్రభుత్వాలు శాసనసభలలో మెజారిటీ సభ్యుల మద్దతును పొందక పార్లమెంటరీ ప్రమాణాల పతనానికి దారితీశాయి. భారతదేశంలో 1990వ దశకం ద్వితీయార్థం నుంచి 2014 ప్రథమార్థం వరకు జాతీయ స్థాయిలో ఏర్పడిన ఐక్య సంఘటన (United Front), జాతీయ ప్రజాస్వామ్య కూటమి (National Democratic Alliance), ఐక్య ప్రగతిశీల కూటమి (United Progressive Alliance) ఇందుకు ఉదాహరణగా పేర్కొనవచ్చు.

ప్రశ్న 7.
ప్రజాస్వామ్యాన్ని నిర్వచించి, ప్రజాస్వామ్య సుగుణాలను తెలపండి.
జవాబు:
నిర్వచనాలు:
1) “ప్రజాస్వామ్యం అంటే ప్రజల యొక్క ప్రజల చేత, ప్రజల కొరకు పరిపాలించే, నిర్వహించబడే ప్రభుత్వం” అని అబ్రహాం లింకన్ పేర్కొన్నాడు.

2) “ప్రభుత్వంలో ప్రతి ఒక్కరికి భాగస్వామ్యం ఉన్న ప్రభుత్వమే ప్రజాస్వామ్యం” అని జె.ఆర్.సీలీ పేర్కొన్నాడు.
1) సమర్థవంతమైన ప్రభుత్వం (Efficient Government): ప్రజాస్వామ్యాన్ని సమర్థవంతమైన, పటిష్టమైన ప్రభుత్వంగా ప్రొఫెసర్ గార్నర్ వర్ణించాడు. ప్రజాస్వామ్య వ్యవస్థలో సాధారణ సమయాలలోనూ, అత్యవసర పరిస్థితులలోనూ ప్రభుత్వ కార్యక్రమాలు సమర్థవంతంగానూ, పటిష్టంగానూ కొనసాగుతాయి. ప్రజలచే ఎన్నిక, ప్రజల నియంత్రణ, ప్రజలకు బాధ్యత అనే ప్రజాస్వామ్య సూత్రాలు గోచరిస్తాయి. అవి ఇతర ప్రభుత్వాలతో పోల్చినపుడు ఇందులో సమర్థతను చేకూర్చుతాయి.

2) వ్యక్తి స్వేచ్ఛల సమర్థన (Upholds Individual Liberties): ప్రజాస్వామ్య ప్రభుత్వం మాత్రమే వ్యక్తి స్వేచ్ఛలను సమర్థిస్తుంది. రాజ్యాంగపరమైన అనేక రక్షణల ద్వారా వ్యక్తుల హామీలకు హామీ ఇస్తుంది. ఈ అంశం ప్రాతిపదికపై జె. ఎస్. మిల్ ప్రజాస్వామ్యాన్ని సమర్థించాడు. ప్రజాస్వామ్యం ప్రజలకు వాక్, సభా, పత్రికా స్వాతంత్రాలు, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛలను ప్రసాదిస్తుందని అతడు ప్రకటించాడు.

3) సమానత్వానికి హామీ (Assures Equality): ప్రజాస్వామ్యం రాజకీయ, ఆర్థిక రంగాలలోని వ్యక్తుల యొక్క సమానత్వానికి హామీ ఇస్తుంది. రాజకీయ రంగంలో పౌరుల కుల, వర్ణం, పుట్టుక వంటి అంశాలతో ప్రమేయం లేకుండా వారికి ఓటు హక్కు, ఎన్నికలలో అభ్యర్థులుగా పోటీచేసే హక్కు, ప్రభుత్వ పదవులను చేపట్టే హక్కు వంటి రాజకీయ హక్కులను పౌరులకు ప్రసాదిస్తుంది. సమాజంలో ఇతర వర్గాలను విస్మరించి కొద్దిమంది వ్యక్తులకు ప్రత్యేక హక్కులను కల్పించడాన్ని వ్యతిరేకిస్తుంది.

AP Inter 1st Year Civics Study Material Chapter 9 ప్రజాస్వామ్యం

4) ప్రజలను విద్యావంతులను చేయడం (Educates the Masses): ప్రజలను విద్యావంతులుగా తీర్చిదిద్దేందుకు బృహత్తర ప్రయోగాలకు వీలు కల్పించే సాధనంగా ప్రజాస్వామ్యాన్ని కొందరు వర్ణించారు. వివిధ ప్రాతినిధ్య సంస్థలకు విభిన్న సమయాలలో జరిగే ఎన్నికలు, సంబంధిత ప్రచార ఉద్యమాలు ప్రజాస్వామ్యంలో పౌరులను విద్యావంతులుగా తీర్చిదిద్దుతుంది.

5) దేశభక్తిని పెంపొందించడం (Instills Patriotism): ప్రజాస్వామ్యం ప్రజలలో దేశభక్తిని పెంపొందిస్తుంది. ప్రజాస్వామ్యంలో వివిధ సంస్థల సభ్యుల ఎంపిక, ఎన్నికలలో ప్రజలకు ఎన్నో అవకాశాలు లభిస్తాయి. ప్రాతినిధ్య సంస్థలలో ప్రజలు పాల్గొని అవి విజయవంతంగా పనిచేసేటట్లు జాగ్రత్త వహిస్తారు. వీటి నిర్వహణలో పాల్గొనడాన్ని ప్రజలు ఎంతో గర్వంగా భావిస్తారు. దేశం క్లిష్ట పరిస్థితులలో ఉన్నప్పుడు ప్రజలు తమ సహాయ సహకారాలను అందించడంలో ఎంతో ఆసక్తిని చూపుతారు. గతంలో ఇండియాపై చైనా, పాకిస్తాన్లు దురాక్రమణ జరిపిన సందర్భాలలో భారతీయులు చూపించిన చొరవ, ప్రదర్శించిన దేశభక్తి ఇందుకు ఉదాహరణగా పేర్కొనవచ్చు.

6) స్థిరత్వానికి హామీ (Ensures Stability): ప్రజాస్వామ్యంలో ఎన్నికైన ప్రభుత్వం ఉండటం వల్ల విప్లవాల బారి నుంచి దేశాన్ని కాపాడేందుకు అవకాశం ఉంటుంది. ఈ.వ్యవస్థలో ప్రజలు ఎన్నికల సమయంలో వ్యతిరేక ఓటు (Negative Vote) వినియోగం ద్వారా ప్రభుత్వాన్ని మార్చివేయగలుగుతారు.

7) ఒకే సమయంలో శాంతి, ప్రగతి (Simultaneous Order and Progress): నియంతృత్వం దేశ ప్రగతిని నిర్లక్ష్యం చేసి భద్రతకు హామీ ఇస్తుంది. అందుకు విరుద్ధంగా ప్రజాస్వామ్యం రాజ్యాంగబద్ధమైన పాలన ద్వారా శాంతి భద్రతల నిర్వహణకు ప్రాధాన్యత ఇస్తుంది. వివిధ రంగాలలో ప్రజల ఔన్నత్యానికి కృషి చేస్తుంది. భారత
ప్రజాస్వామ్య వ్యవస్థలో దీనిని మనం గమనించవచ్చు. జవహర్ లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్, మౌలానా అబ్దుల్ కలామ్ అజాద్, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ వంటి ఆదర్శవంతమైన నాయకులు, రాజనీతిజ్ఞులు శైశవదశలో ఉన్న భారత ప్రజాస్వామ్యాన్ని జాతీయ, అంతర్జాతీయ రంగాలలో శక్తివంతమైన, సార్థకమైందిగా తీర్చిదిద్దేందుకు ఎంతగానో, కృషి చేశారు.

8) ప్రజలను బాధ్యతాయుతులుగా చేయడం (Makes the People Responsible): ప్రజాస్వామ్యం వ్యక్తి సామర్థ్యాన్ని గుర్తిస్తుంది. వ్యక్తులలో చొరవను ఏర్పరచేందుకు అనుకూలమైన వాతావరణాన్ని సృష్టిస్తుంది. ప్రజలలో బాధ్యతాయుత ప్రవర్తనను పెంపొందిస్తుంది. ఈ రకమైన పరిస్థితి ఇతర ప్రభుత్వ రకాలలో గోచరించదు. అంతేకాకుండా ప్రజాస్వామ్యం వ్యక్తుల వ్యక్తిత్వ వికాస సాధనకు దోహదపడి వారి ఔన్నత్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తుంది.

9) పౌరసత్వ శిక్షణ పాఠశాల (Training School for Citizenship): ప్రజాస్వామ్యపు మరొక సుగుణం ఏమిటంటే ఇది ఒక ఉత్తమ పౌరసత్వ పాఠశాలగా వ్యవహరిస్తుంది. ఎన్నికల సమయంలో ఓటుహక్కు, అభ్యర్థులను ఎన్నుకొనే హక్కు వంటి రాజకీయ హక్కులను పౌరులకు అందించడంలో హామీ ఇస్తుంది. అటువంటి హక్కులు, ఇతర రాజకీయ హక్కులలాగా, పౌరసత్వ పాఠాలను నేర్చుకొనేందుకు పౌరులకు సహాయకారిగా ఉంటాయి.

10) హేతుబద్ధమైన ప్రభుత్వం (A Rational Government): “ఏ ఒక్కరూ సంపూర్ణంగా దోషరహితులు ‘కారు’ అనే సూత్రంపై ప్రజాస్వామ్యం ఆధారపడి ఉంటుంది. అధికార దుర్వినియోగాన్ని అరికట్టేందుకు అవసరమైన చర్యలు, విమర్శలతో కూడిన ప్రక్రియను ప్రజాస్వామ్యం అనుసరిస్తుంది. అంతేకాకుండా రాజకీయ వ్యవస్థ హేతుబద్ద స్వభావాన్ని ప్రజాస్వామ్యం సంరక్షిస్తుంది.

అతి స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
ప్రజాస్వామ్యమనగానేమి ? రెండు నిర్వచనాలను రాయండి. [Mar. ’18, ’17, ’16]
జవాబు:
ప్రజాస్వామ్యాన్ని ఆంగ్లంలో ‘డెమోక్రసీ’ అంటారు. ఈ పదము రెండు గ్రీకు పదాలైన ‘డెమోస్’ మరియు ‘క్రటోస్’ ల నుండి గ్రహించబడింది. డెమోస్ అంటే ప్రజలు, క్రటోస్ అంటే అధికారం లేదా పాలన అని అర్థం. అంటే డెమోక్రసీ అంటే ప్రజల అధికారం లేదా ప్రజల పాలన.

  1. “ప్రజాస్వామ్యం అంటే ప్రజల యొక్క ప్రజల చేత, ప్రజల కొరకు పరిపాలించే, నిర్వహించబడే ప్రభుత్వం” అని అబ్రహాం లింకన్ పేర్కొన్నాడు.
  2. “ప్రభుత్వంలో ప్రతి ఒక్కరికి భాగస్వామ్యం ఉన్న ప్రభుత్వమే ప్రజాస్వామ్యం” అని జె.ఆర్.సీలీ పేర్కొన్నాడు.

AP Inter 1st Year Civics Study Material Chapter 9 ప్రజాస్వామ్యం

ప్రశ్న 2.
ప్రత్యక్ష ప్రజాస్వామ్యం గురించి నీకు తెలిసింది రాయండి.
జవాబు:
ప్రత్యక్ష ప్రజాస్వామ్యం: ఈ పద్ధతిలో ప్రజలు ప్రభుత్వ పాలన వ్యవహారాలలో ప్రత్యక్షంగా పాల్గొంటారు. శాసన సంబంధమైన అధికారాలన్నీ వారు చెలాయిస్తారు. ప్రజలే చట్ట సభలలో పాల్గొని చట్టాలను రూపొందిస్తారు. రాజ్య వ్యవహారాలలో ప్రజలు ప్రత్యక్షంగా భాగస్వామ్యం వహిస్తారు.

ప్రత్యక్ష ప్రజాస్వామ్య విధానం ప్రస్తుతం స్విట్జర్లాండ్లో కొన్ని కాంటన్ల (Cantons) లోనూ, అమెరికా సంయుక్త రాష్ట్రాలలోని కొన్ని ప్రాంతాలలోనూ నెలకొని ఉంది.

ప్రశ్న 3.
ప్రాతినిధ్య ప్రజాస్వామ్యం గురించి నీకు గల అవగాహన ఏమిటి ?
జవాబు:
ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రతినిధుల ద్వారా ప్రభుత్వ పాలన నిర్వహించబడటాన్ని ప్రాతినిధ్య ప్రజాస్వామ్యం లేదా పరోక్ష ప్రజాస్వామ్యం అని అంటారు. నిర్ణీత సమయానికి ఎన్నికైన ప్రజా ప్రతినిధులు తమ అధికార, విధుల నిర్వహణలో ప్రజలకు బాధ్యత వహిస్తారు. ప్రజా ప్రతినిధులు తమ అధికార విధుల నిర్వహణలో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా వ్యవహరించటంలో విఫలమైతే వారిని ప్రజలు ఎన్నికల సమయంలో పదవుల నుండి తొలగిస్తారు.

ప్రశ్న 4.
ప్రజాస్వామ్య లక్షణాలు ఏవి ?
జవాబు:
ప్రజా ప్రభుత్వం, ప్రజల నియంత్రణ, వ్యక్తి హుందాతనం, ఎన్నికలు, ప్రజలకు జవాబుదారీతనం, ప్రాథమిక స్వేచ్ఛలు, స్వతంత్ర న్యాయశాఖ మరియు సమానత్వం మొదలగు వాటిని ప్రజాస్వామ్య లక్షణాలుగా పేర్కొనవచ్చు.

ప్రశ్న 5.
ప్రజాస్వామ్య విజయానికి నాలుగు పరిస్థితులను రాయండి.
జవాబు:

  1. సరైన విద్య
  2. వికాసవంతమైన పౌరసత్వం
  3. స్వతంత్ర పత్రికలు
  4. దృఢమైన ప్రతిపక్షం.

ప్రశ్న 6.
ప్రత్యక్ష ప్రజాస్వామ్య సాధనాలను రాయండి. [Mar. ’18, ’17, ’16]
జవాబు:
ప్రత్యక్ష ప్రజాస్వామ్య సాధనాలు నాలుగు. అవి:

  1. ప్రజాభిప్రాయ సేకరణ
  2. ప్రజాభిప్రాయ నివేదన
  3. పునరాయనము
  4. ప్రజాభిప్రాయ నిర్ణయం.

ప్రశ్న 7.
ప్రజాభిప్రాయ సేకరణ గురించి నీకు తెలిసింది రాయండి.
జవాబు:
‘ప్రజాభిప్రాయ సేకరణ’ ని ఆంగ్లంలో ‘రిఫరెండమ్ (Referendum)’ అంటారు. ఒకానొక అంశంపై ప్రజల అభిప్రాయాన్ని ప్రత్యక్షంగా తెలుసుకొనే ప్రక్రియనే ప్రజాభిప్రాయ సేకరణ అంటారు. ఇటువంటి అంశం సాధారణమైనది కావచ్చు లేదా రాజ్యాంగపరమైనది కావచ్చు. ఆర్.సి. బ్రూక్స్ ప్రకారం ప్రజాభిప్రాయ సేకరణ అనేది శాసనసభ ఇప్పటికే ఆమోదించిన బిల్లు లేదా చట్టంపై నియోజకుల అభిప్రాయాన్ని తెలుసుకొనేందుకు ఉద్దేశించింది.

ప్రశ్న 8.
ప్రజాభిప్రాయ నివేదన అంటే ఏమిటి ?
జవాబు:
శాసన నిర్మాణ ప్రక్రియలో ప్రజలు పాల్గొనేందుకు తోడ్పడే ప్రక్రియనే ప్రజాభిప్రాయ నివేదన అని అంటారు. ఉదా: స్విట్జర్లాండ్లో 50,000 మంది పౌరులు ఏదైనా ఒక అంశంపై చట్టాన్ని రూపొందించాల్సిందిగా శాసనసభను కోరుతూ ఒక అర్జీపై సంతకం చేసినట్లయితే, వారి ప్రతిపాదనను ప్రజల అభిప్రాయానికి పంపబడుతుంది. మెజారిటీ ప్రజలు ఆ ప్రతిపాదనను ఆమోదించినట్లయితే ఆ అంశం చట్టంగా ఆమోదితమై అమల్లోకి వస్తుంది. ఇది రెండు రకాలు:

  1. విధాయక రూపంలో ఉన్న ప్రజాభిప్రాయ నివేదన
  2. విధాయక రూపంలో లేని ప్రజాభిప్రాయ నివేదన.

ప్రశ్న 9.
ప్రజాభిప్రాయ నిర్ణయం అంటే ఏమిటి ?
జవాబు:
ప్రజాభిప్రాయ నిర్ణయాన్ని ఆంగ్లంలో ‘ప్లెబిసైట్’ అంటారు. ఈ పదం లాటిన్ భాషలోని ‘ప్లెబిస్’ మరియు ‘సెటమ్’ అనే రెండు పదాల నుండి గ్రహించబడింది. ప్లెబిస్ అంటే ప్రజలు, సెటమ్ అంటే నిర్ణయం లేదా తీర్పు అని అర్థం. అంటే దీని అర్థం ప్రజా నిర్ణయం లేదా ప్రజాతీర్పు. ఒక ప్రభుత్వ విధానంపై ప్రజల అభిప్రాయాన్ని తెలుసుకునేందుకు అనుసరించే ప్రజాస్వామ్య సాధనమే ప్రజాభిప్రాయ నిర్ణయమని భావించవచ్చు.

AP Inter 1st Year Civics Study Material Chapter 9 ప్రజాస్వామ్యం

ప్రశ్న 10.
పునరాయనం అనగా ఏమిటి ?
జవాబు:
పునరాయనం అనేది ఒక ముఖ్యమైన ప్రత్యక్ష ప్రజాస్వామ్య సాధనం. ఈ పద్ధతిలో ఎన్నికైన ప్రజా ప్రతినిధులు లేదా అధికారులు ఉద్దేశ్యపూర్వకంగా తమ కర్తవ్యాలను నిర్వహించడంలో విఫలమైతే వారిని ఓటర్లు వెనుకకు పిలిచేందుకు వీలుంటుంది. దీనినే పునరాయనం అంటారు. ఈ రకమైన పద్దతి అమెరికాలోని అరిజోనా, మోంటానా, లూసియానా, కాన్సాస్, కాలిఫోర్నియా, నెవెడా, ఓరెగాన్ మొదలగు రాష్ట్రాలలో అమలులో ఉంది.