AP Inter 1st Year Civics Study Material Chapter 4 చట్టం

Andhra Pradesh BIEAP AP Inter 1st Year Civics Study Material 4th Lesson చట్టం Textbook Questions and Answers.

AP Inter 1st Year Civics Study Material 4th Lesson చట్టం

వ్యాసరూప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
చట్టం అంటే ఏమిటో నిర్వచించి, చట్టానికి గల వివిధ ఆధారాలను వివరించండి. (లేదా)
ప్రశ్న 2.
చట్టం అంటే ఏమిటి ? చట్టానికి గల వివిధ ఆధారాలను చర్చించండి.
జవాబు:
పరిచయం : రాజనీతిశాస్త్ర అధ్యయనంలో చట్టం అనేది ఒక ముఖ్యమైన భావన.

రాజ్యం శాసనాల ద్వారా ప్రజలను పరిపాలిస్తుంది. శాసనాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. రాజ్య సార్వ భౌమాధికారం శాసనాల ద్వారా వ్యక్తమవుతుంది. రాజ్యం ఆశించే సాంఘిక, ఆర్థిక, రాజకీయ మార్పులు శాసనం ద్వారానే సాధించగలవు. మానవుని బాహ్య ప్రవర్తనను క్రమబద్ధం చేసే నియమాలే శాసనాలు. వ్యక్తులు రాజ్యంలో చేయవలసినవి, చేయకూడనివి శాసనం చెబుతుంది. ప్రభుత్వంలోని శాసనశాఖ శాసనాలు చేస్తుంది.

అర్థం : శాసనాన్ని ఆంగ్లంలో ‘లా’ అంటారు. ‘లాగ్’ అనే ట్యూటానిక్ పదం నుండి ‘లా’ అనే మాట వచ్చింది. ‘లాగ్’ అంటే ‘సమమైన’ లేదా ‘స్థిరమైన’ అని అర్థం. శాసనాలు స్థిరమైన నిబంధనలు.

నిర్వచనాలు :
1) “సార్వభౌముడి ఆదేశమే చట్టం. ప్రజలందరూ సార్వభౌముడికి విధేయులుగా ఉండేందుకు చట్టం కొన్ని ఉమ్మడి నియమాలను రూపొందిస్తుంది” అని జాన్ ఎరిస్కిన్ పేర్కొన్నాడు.

2) “రాజకీయాధికారాన్ని పొందిన సార్వభౌముడిచే అమలు చేసే బాహ్య చర్యలకు సంబంధించిన సాధారణ నియమమే చట్టం” అని టి. ఇ. హాలండ్ పేర్కొన్నాడు.

3) న్యాయపాలనలో రాజ్యం ఉపయోగించే సూత్ర సముదాయమే చట్టం” అని జాన్ సాల్మండ్ పేర్కొన్నాడు.

శాసనానికి ఆధారాలు : హాలెండ్ అనే రచయిత సంప్రదాయాలు, మతము, ధర్మబద్ధత (సమత), న్యాయమూర్తుల తీర్పులు, శాస్త్రీయ వ్యాఖ్యానాలు, శాసనశాఖ అనేవి శాసనాలకు ఆధారాలని చెప్పాడు. శాసనాలు వివిధ రంగాలలో క్రమంగా రూపొందుతాయి. అనేక అంశాల ప్రభావం వాటిపై ఉంటుంది. రాజనీతి శాస్త్రజ్ఞులు చెప్పిన శాసనాల ఆధారాలు ఈ క్రింది విధంగా చెప్పవచ్చు.

1) ఆచార, సంప్రదాయాలు, వాడుకలు (Customs) : ఇవి శాసనానికి తొలి ఆధారాలు. ప్రజల ఆచారాలు, వాడుకలు, సంప్రదాయాలు శాసనాలకు మూలాధారము. సంప్రదాయాలు సంఘంలో ఒక అలవాటుగా, క్రమంగా రూపొందుతాయి. పూర్వం సంప్రదాయాలే సమాజ జీవితాన్ని క్రమబద్ధం చేసేవి. రాజ్యం వీటిని గుర్తించి, వాటిని ఆధారం చేసుకొని కొన్ని శాసనాలను రూపొందిస్తుంది. రాజకీయ ఆచారాలు కూడా రాజ్యంచే గుర్తించబడి అమలు చేయబడితే అవి శాసనాలవుతాయి. బ్రిటన్లో ‘సామాన్య న్యాయం’ సంప్రదాయబద్ధమైన శాసనానికి ఉదాహరణ. అదే విధంగా భారతదేశంలో వివాహ చట్టాలు, ఆస్తి పంపిణీ చట్టాలు మొదలగునవి సంప్రదాయాలు ఆధారంగా చేయబడ్డాయి.

AP Inter 1st Year Civics Study Material Chapter 4 చట్టం

2) మతం (Religion) : ఆచారానికి మతం సమాజాన్ని విపరీతంగా ప్రభావితం చేసే వ్యవస్థ. సంఘ జీవితం మత నియమాలకు అనుగుణంగా జరుపుకుంటారు. పూర్వం మతాధిపతులు చెప్పే నియమాలు శాసనాల వలె చెలామణి అయ్యేవి. ఆధునిక కాలంలో కూడా శాసనాలు చేయడానికి మతం ఒక ఆధారం. వారసత్వం, వివాహం, కుటుంబ ఆస్తి మొదలైన వాటి శాసనాలు మతం ఆధారంగా చేయబడ్డాయి. హిందువులు, క్రైస్తవులు, ముస్లిములకు గల శాసనాలు వారి మతాలు ఆధారంగా రూపొందాయి. ఇరాన్, పాకిస్థాన్ వంటి మత ప్రమేయ దేశాలలో సంఘ జీవనానికి మత నియమాలే ఆధారం.

3) న్యాయస్థానాల తీర్పులు (Judicial Decisions) : న్యాయస్థానాలలో న్యాయమూర్తులు ఇచ్చే తీర్పులు శాసన నిర్మాణానికి ఆధారాలు. న్యాయస్థానాలు చట్టాలను వ్యాఖ్యానిస్తాయి. ఈ విధి నిర్వహణలో న్యాయమూర్తులు తీర్పులిచ్చేటప్పుడు క్రొత్త న్యాయ సూత్రాలను సృష్టిస్తారు. ఈ తీర్పులు అదే విధమైన వివాదాలు తలెత్తినప్పుడు న్యాయసూత్రల వలె వర్తింపచేస్తారు. నేడు న్యాయమూర్తుల నిర్ణయాలు శాసనాలలో అంతర్భాగమవుతున్నాయి. ఉదా : భారతదేశంలో సుప్రీంకోర్టు తీర్పులిచ్చిన గోలక్నాథ్ కేసు, కేశవానంద భారతి కేసు, మినర్వామిల్స్ కేసు.

4) శాస్త్రీయ వ్యాఖ్యానాలు (Scientific commentories) : ప్రముఖ న్యాయశాస్త్ర కోవిదులు, రచయితలు, విమర్శకులు చేసే వ్యాఖ్యానాలు శాసన నిర్మాణానికి ఆధారమవుతాయి. ఇవి న్యాయస్థానాలలో న్యాయమూర్తుల వ్యాఖ్యానాలు, | వివరణలు, శాసనాలు చేయటానికి ప్రభుత్వానికి ఉపయోగిస్తాయి. న్యాయమూర్తుల నిర్ణయాలు, తీర్పులు, భవిష్యత్లో శాసన నిర్మాణానికి తోడ్పడతాయి. ఇంగ్లండ్లో కోక్, బ్లాక్టన్, అమెరికాలో స్టోరీ, కెంట్, భారతదేశంలో విజ్ఞానేశ్వర, ఆపరార్క వంటి వారి వ్యాఖ్యానాలు శాసన నిర్మాణానికి ఆధారాలు.

5) సమత లేదా సమబద్ధత (Equity) : ‘సమత’ అనే పదానికి నిష్పక్షపాతం, న్యాయంలాంటి సూత్రాలను పర్యాయపదాలుగా వాడుతున్నారు. సమత అంటే సహజన్యాయం. అమలులో ఉన్న చట్టాలు వివాదాల పరిష్కారానికి సరిపడని సందర్భాలలో న్యాయమూర్తులు తమ విజ్ఞతతో, సక్రమ అవగాహన ద్వారా వివాదాల పరిష్కారంలో కక్షిదారులకు
న్యాయం చేకూర్చేందుకు ప్రయత్నిస్తారు. సమత అనేది సహజన్యాయ భావన ద్వారా రూపొందింది. దానినే న్యాయమూర్తులచే నిర్మితమైన చట్టాలుగా పరిగణించడమైంది. ఈ సందర్భంలో హెన్రీమెయిన్ అనే పండితుడు సహజన్యాయం గురించి ప్రస్తావిస్తూ అది కొన్ని ప్రత్యేక సూత్రాల ఆధారంగా రూపొంది పౌరన్యాయంతో కూడిన నియమాల సముదాయంగా పేర్కొన్నాడు. పౌరన్యాయం కంటే సమత అనేది ఉన్నతమైనది. సమదృక్పథం, సహజన్యాయం లాంటి సూత్రాల ఆధారంగా పాత చట్టాల స్థానంలో కొత్త చట్టాలను రూపొందించే సాంప్రదాయకమైన పద్ధతికి సమత సంకేతంగా ఉంటుంది.

6) శాసనసభ (Legislature) : ప్రజాస్వామ్యంలో శాసన నిర్మాణశాఖ చట్టం ఆధారాలలో ముఖ్యమైనదిగా భావిస్తారు. ప్రభుత్వ సంస్థలలో ఒకటైన శాసనసభ, చట్టాలను ఆమోదిస్తుంది. అందుచేత శాసననిర్మాణ శాఖను చట్టం ఆధారాలలో ప్రత్యక్షమైన అంశంగా గుర్తించడమైంది. ఆధునిక కాలంలో చట్టాల రూపకల్పనలో శాసనసభలు ప్రముఖమైనవిగా భావించడమైంది. చట్ట నిర్మాణంలో శాసనసభలు సాధారణ ప్రజానీకం ఆకాంక్షలకు ప్రతీకగా ఉంటాయి. | శాసనసభలోని అధికార, ప్రతిపక్షాలు రెండూ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా వ్యవహరిస్తాయి.

ప్రశ్న 3.
మేకైవర్ పేర్కొన్న చట్టాల వర్గీకరణను వివరించండి.
జవాబు:
అర్థం : శాసనాన్ని ఆంగ్లంలో ‘లా’ అంటారు. ‘లాగ్’ అనే ట్యూటానిక్ పదం నుండి ‘లా’ అనే మాట వచ్చింది. ‘లాగ్’ అంటే ‘సమమైన’ లేదా ‘స్థిరమైన’ అని అర్థం. శాసనాలు స్థిరమైన నిబంధనలు.

నిర్వచనాలు :

  1. “సార్వభౌముడి ఆదేశమే చట్టం. ప్రజలందరూ సార్వభౌముడికి విధేయులుగా ఉండేందుకు చట్టం కొన్ని ఉమ్మడి నియమాలను రూపొందిస్తుంది” అని జాన్ ఎరిస్కిన్ పేర్కొన్నాడు.
  2. “రాజకీయాధికారాన్ని పొందిన సార్వభౌముడిచే అమలు చేసే బాహ్య చర్యలకు సంబంధించిన సాధారణ నియమమే చట్టం” అని టి. ఇ. హాలండ్ పేర్కొన్నాడు.
  3. న్యాయపాలనలో రాజ్యం ఉపయోగించే సూత్ర సముదాయమే చట్టం” అని జాన్ సాల్మండ్ పేర్కొన్నాడు.

చట్టం వర్గీకరణ : చట్టం వర్గీకరణ గురించి అనేకమంది రాజనీతి తత్త్వవేత్తలు భిన్నమైన ప్రతిపాదనలను చేశారు. అటువంటి వారిలో మేకైవర్ ప్రతిపాదించిన చట్ట వర్గీకరణ ప్రముఖమైనదిగా పరిగణించవచ్చు.

మేకైవర్ ప్రకారం చట్టం ప్రధానంగా రెండు రకాలుగా ఉంటుంది. అవి : 1) సహజ చట్టం (Natural Law), 2) సహేతుక చట్టం (Positive Law).

సహేతుక చట్టాన్ని (Positive Law), జాతీయ చట్టం (National Law), అంతర్జాతీయ చట్టం (International Law) అని రెండు రకాలుగా వర్గీకరించారు.

AP Inter 1st Year Civics Study Material Chapter 4 చట్టం

జాతీయ చట్టాన్ని (National Law), మరల రెండు రకాలుగా వర్గీకరించారు. అవి : రాజ్యాంగ చట్టం (Constitutional Law), సాధారణ చట్టం (Ordinary Law).

సాధారణ చట్టం (Ordinary Law), అనేది పబ్లిక్ చట్టం (Public Law), ప్రైవేట్ చట్టం (Private Law) అని రెండు రకాలుగా విభజించారు.

పబ్లిక్ చట్టాన్ని (Public Law), పరిపాలన చట్టం (Administrative Law), సార్వత్రిక చట్టం (General Law) అని తిరిగి రెండు రకాలుగా వర్గీకరించబడింది.

సార్వత్రిక చట్టాన్ని (General Law), శాసనాత్మక చట్టం (Statutory Law), ఉమ్మడి చట్టం (Common Law) అని రెండు రకాలుగా విభజించారు. పైన పేర్కొన్న వివిధ రకాల చట్టాలను కింది విధంగా వివరించవచ్చు.

1) సహజ చట్టం (Natural Law) : సహజచట్టాన్ని దైవిక న్యాయంగా కూడ వ్యవహరిస్తారు. సహజచట్టం అనేది ఏ ఒక్కరిచేత రూపొందినది కాదు. అది భౌతికశక్తి ఆధారంగా ప్రకృతిచేత ప్రసాదితమైనది. మానవ స్వభావాన్ని విశ్లేషించేందుకు హేతువును వినియోగించడాన్ని సహజ చట్టంగా పేర్కొనవచ్చు. భగవంతుని స్వహస్తాలతో మానవుల హృదయాలలో లిఖించబడినదే సహజ చట్టంగా కొందరు వర్ణించారు.

2) సహేతుక చట్టం (Positive Law) : మానవ సంస్థలచే రూపొందించబడేదే సహేతుక చట్టం. ఈ చట్టాన్ని రాజకీయ చట్టం అని కొందరు పేర్కొన్నారు. వర్తమాన, సామాజిక, రాజకీయ పరిస్థితుల ఆధారంగా ఈ చట్టం నిర్మితమైంది. సార్వభౌమత్వ రాజకీయ అధికారి ఈ చట్టానికి అనుమతిస్తాడు. ఈ చట్టాన్ని అతిక్రమించినవారు శిక్షకు గురి అవుతారు. ఈ చట్టాన్ని తిరిగి జాతీయ చట్టమని, అంతర్జాతీయ చట్టమని రెండు రకాలుగా పేర్కొన్నారు.

జాతీయ చట్టాన్ని మున్సిపల్ చట్టం లేదా రాజ్యచట్టం అని కూడ వ్యవహరిస్తారు.

జాతీయ చట్టం, రాజ్య భౌగోళిక ప్రదేశానికి పరిమితమవుతుంది. సార్వభౌమాధికారి ద్వారా అది అమలులోకి వస్తుంది. రాజ్యంలోని ప్రజలందరికీ వర్తిస్తుంది. ఇక అంతర్జాతీయ చట్టమనేది వివిధ రాజ్యాల మధ్య సౌహార్ధ సంబంధాలను నెలకొల్పి, నియంత్రణ చేసేందుకు ఉద్దేశించింది. అయితే ఈ రకమైన చట్టానికి వ్యక్తులను శిక్షించే అధికారం ఉండదు. ఐక్యరాజ్యసమితి ఆమోదించిన అంతర్జాతీయ చట్టాలు ఇందుకు ఉదాహరణలుగా పేర్కొనవచ్చు. అంతర్జాతీయ శాంతిభద్రతలను పెంపొందించేందుకై సభ్య రాజ్యాలచే పాటించబడే నియమనిబంధనల సముదాయమే అంతర్జాతీయ చట్టంగా పరిగణించవచ్చు.

జాతీయ చట్టాన్ని మరల రెండు రకాలుగా వర్గీకరించారు. అవి : 1) రాజ్యాంగ చట్టం 2) సాధారణ చట్టం. 3) రాజ్యాంగ చట్టం (Constitutional Law): రాజ్యాంగ చట్టమనేది సాధారణ చట్టం కంటే భిన్నంగా ఉంటుంది. రాజ్యంలో ఈ రకమైన చట్టం అత్యున్నతమైనది. ప్రభుత్వ నిర్మాణానికి ఇది వీలు కల్పిస్తుంది. ప్రభుత్వాంగాల మధ్య సంబంధాన్ని వివరిస్తుంది. ప్రభుత్వాంగాల అధికార పరిధిని నిర్ణయిస్తుంది. ఈ రకమైన చట్టం లిఖిత పూర్వకంగా ఉంటుంది. రాజ్యంలో నివసించే పౌరుల హక్కులు, బాధ్యతల గురించి వివరిస్తుంది. ప్రజాస్వామ్యంలో ఈ చట్టానికి ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. ఇది ప్రజాభీష్టానికి ప్రతీకగా ఉంటుంది.

4) సాధారణ చట్టం (Ordinary Law) : సాధారణ చట్టం అనేది రాజ్యాంగ చట్టానికి అనుగుణంగా ఉంటుంది. రాజ్యంలో నిర్దిష్ట అధికారాలు గల సంస్థచే రూపొందించబడి అమలవుతుంది. పౌరులకు సమాజం, ప్రభుత్వం, రాజ్యాలతో ఉండే సంబంధాలను అది వివరిస్తుంది. ఆచారాలు, సంప్రదాయాలు, మతం అనేవి ఈ రకమైన చట్టానికి ప్రాతిపదికగా ఉంటాయి. శాసనసభ అటువంటి చట్టాలను రూపొందించి, అవసరమైతే సవరణలు చేస్తుంది. సాధారణ చట్టాన్ని మరల పబ్లిక్ చట్టం, ప్రైవేట్ చట్టం అని రెండు రకాలుగా వర్గీకరించడమైంది.

5) పబ్లిక్ చట్టం (Public Law) : పబ్లిక్ చట్టం, రాజ్యం వ్యక్తుల మధ్య సంబంధాలను నియంత్రిస్తుంది. రాజ్యానికి సంబంధించిన మౌలిక నిర్మితి, విధులను పబ్లిక్ చట్టం వివరిస్తుంది. రాజ్యపు మితిమీరిన జోక్యానికి వ్యతిరేకంగా వ్యక్తులకు అవసరమైన హక్కులను అందిస్తుంది. పౌరులందరు ఈ చట్టాన్ని అనుసరించాల్సి ఉంటుంది. ఈ చట్టాన్ని అతిక్రమించడం శిక్షార్హమైన నేరంగా పరిగణిస్తారు.

6) ప్రైవేట్ చట్టం (Private Law) : ప్రైవేట్ చట్టం వ్యక్తుల మధ్య సంబంధాలను నియంత్రిస్తుంది. సమాజంలో వ్యక్తుల ప్రవర్తనలను క్రమబద్దీకరిస్తుంది. వ్యక్తులందరూ తమ హక్కులను అనుభవించేందుకు తగిన హామీ ఇస్తుంది. ప్రైవేట్ చట్టాన్ని కొన్నిసార్లు సివిల్ చట్టంగా వ్యవహరిస్తారు. వ్యక్తుల మధ్య ఉత్పన్నమయ్యే వివాదాలు విచారణలో దేశంలోని వివిధ న్యాయస్థానాలు ప్రైవేట్ చట్టాన్ని పరిగణనలోకి తీసుకుంటాయి.

AP Inter 1st Year Civics Study Material Chapter 4 చట్టం

పబ్లిక్ చట్టాన్ని పరిపాలన చట్టం, సార్వత్రిక చట్టం అని రెండు రకాలుగా వర్గీకరించడమైంది.

7) పరిపాలక చట్టం (Administrative Law) : పరిపాలన నిర్విఘ్నంగానూ, ప్రశాంతంగానూ కొనసాగే విషయంలో చట్టం కీలకపాత్రను పోషిస్తుంది. ప్రజలకు ప్రభుత్వాధికారులకు మధ్య సంబంధాలను ఈ రకమైన చట్టం నియంత్రిస్తుంది. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించిన సంస్కరణలను తీసుకురావడంలో ఇది దోహదపడుతుంది. పరిపాలక చట్టాలను అనుసరించడం ద్వారా ఈనాటి రాజ్యాలు అనేక దశలుగా శీఘ్రగతిన అభివృద్ధిని సాధించాయి. ప్రభుత్వ సిబ్బంది క్రమశిక్షణతో పనిచేసేటట్లు పరిపాలక చట్టం దోహదపడుతుంది.

8) సార్వత్రిక చట్టం (General Law) : రాజ్యం, సాధారణ పౌరుల మధ్య సంబంధాన్ని సార్వత్రిక చట్టం నిర్ణయిస్తుంది. ఈ చట్టం రాజ్యానికి – వ్యక్తులకు మధ్య ఉండే వ్యవహారాలకు సంబంధించినదై ఉంటుంది. వివాహం, విడాకులు, ఒప్పందాలు వంటి అనేక విషయాలకు సంబంధించిన వాటిని ఈ రకమైన చట్టాలకు ఉదాహరణగా పేర్కొనవచ్చు. సార్వత్రిక చట్టం తిరిగి శాసనాత్మక చట్టం, సామాన్య చట్టం అని రెండు రకాలుగా వర్గీకరించడమైంది.

9) శాసనాత్మక చట్టం (Statutory Law) : ఆధునిక చట్టంలోని అధిక భాగాన్ని శాసనాత్మక చట్టం అని పిలుస్తారు. దైనందిన పరిపాలన నిమిత్తమై రాజ్యంలోని శాసనసభ ఇటువంటి చట్టాన్ని రూపొందిస్తుంది. భారతదేశంలో పార్లమెంటు, అమెరికాలో కాంగ్రెసు, బ్రిటన్లో పార్లమెంటు ఈ రకమైన చట్టాన్ని రూపొందిస్తాయి.

10) సామాన్య చట్టం (Common Law) : సామాన్య చట్టాన్ని సంప్రదాయక చట్టంగా కొందరు వ్యవహరించారు. ప్రజానీకంలో బహుళవ్యాప్తి చెందిన ఆచార సంప్రదాయాల ఫలితమే సామాన్య చట్టం. ఈ రకమైన చట్టాన్ని న్యాయవ్యవస్థలో | భాగంగా న్యాయస్థానాలు తగిన గుర్తింపునిస్తాయి.

ప్రశ్న 4.
చట్టాన్ని నిర్వచించి, చట్టం – స్వేచ్ఛ మధ్య సంబంధాన్ని వర్ణించండి.
జవాబు:
నిర్వచనాలు :
1) “సార్వభౌముడి ఆదేశమే చట్టం. ప్రజలందరూ సార్వభౌముడికి విధేయులుగా ఉండేందుకు చట్టం కొన్ని ఉమ్మడి నియమాలను రూపొందిస్తుంది” అని జాన్ ఎరిస్కిన్ పేర్కొన్నాడు.

2) రాజకీయాధికారాన్ని పొందిన సార్వభౌముడిచే అమలుచేసే బాహ్య చర్యలకు సంబంధించిన సాధారణ నియమమే చట్టం” అని టి. ఇ. హాలండ్ పేర్కొన్నాడు.

చట్టం – స్వేచ్ఛ మధ్య సంబంధం (Relation between Law and Liberty) : రాజనీతి శాస్త్రంలో చట్టం, నైతికత అనేవి రెండు ప్రధాన భావనలు. రాజ్యం, ప్రభుత్వాలు పనిచేసేందుకు చట్టం ప్రాతిపదికగా ఉంటుంది. కొన్ని నియమ నిబంధనలను సూచించడం ద్వారా సమాజానికి స్థిరమైన పునాదిని చట్టం ఏర్పరుస్తుంది. చట్టం, స్వేచ్ఛ రెండూ పరస్పర ఆధారిత భావనలు. అయితే ఈ రెండు భావనల మధ్య ఉండే సంబంధం విషయంలో రాజనీతి శాస్త్రవేత్తల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. ఈ విషయంలో రాజనీతి శాస్త్రవేత్తలు రెండు విభిన్నమైన అభిప్రాయాలను వెల్లడించారు. వారిలో కొందరు ఈ రెండు భావనలు ఒకదానికొకటి పరస్పర విరుద్ధమైనవిగా పేర్కొన్నారు. మరి కొందరు ఈ రెండు భావనలు ఒకదానికొకటి సన్నిహిత సంబంధంగలవిగా భావించారు. ఈ రెండు భావనల గురించి కింది విధంగా వివరించవచ్చు.

1) చట్టం, స్వేచ్ఛ పరస్పరం విరుద్ధమైనవి (Law and Liberty are Antithetical) : చట్టం ఎల్లప్పుడు మానవుల కార్యకలాపాలపై నిర్బంధాలు విధిస్తుందని వ్యక్తి స్వేచ్ఛను సమర్థించేవారు భావిస్తారు. జె.ఎస్. మిల్, హెర్బర్ట్ స్పెన్సర్, ఆడమ్ స్మిత్, మార్షల్ వంటి వ్యక్తి స్వేచ్ఛావాదులు, ప్రౌధాన్, బకూనిస్, క్రొపోట్కిన్ వంటి అరాచకవాదుల ప్రకారం వ్యక్తి స్వేచ్ఛకు చట్టం ఆటంకాలను సృష్టిస్తుంది. వారి దృష్టిలో రాజ్యం వ్యక్తుల స్వేచ్ఛలకు భంగం కలిగించే ప్రధాన సాధనం. చట్టం అనేది ఎల్లప్పుడు వ్యక్తుల స్వేచ్ఛపై ఆంక్షలు విధిస్తుంది. రాజ్యం, ప్రభుత్వాలకు సంబంధించిన వ్యవహారాలలో వ్యక్తులు పాల్గొనేందుకు చట్టం అనుమతించదు. అలాగే రాజ్యానికి సంబంధించిన ఆర్థిక కార్యకలాపాల నిర్వహణలో చట్టం ఆటంకంగా పరిణమిస్తుంది. అయితే ఇటీవలి కాలంలో అనేక రాజ్యాలలో అమలులో ఉన్న సరళీకృత ఆర్థిక విధానాలు ఆ దేశాల ఆర్థిక వ్యవస్థలు శీఘ్రగతిన ప్రగతి దిశలో పయనించేందుకు అనుకూలంగా ఉన్నాయని చెప్పవచ్చు. ఈ విధానాలు ఆర్థిక వ్యవహారాలలో ప్రజలు స్వేచ్ఛగా పాల్గొనేందుకు వీలు కల్పించాయి. అవి జాతీయ, అంతర్జాతీయ మార్కెట్ల మధ్య ఏ విధమైన కఠినమైన ఆర్థిక చట్టాలతో ప్రమేయం లేకుండా పోటీకి అవకాశం ఏర్పరచాయి. రాజ్యమనేది ‘ఒక అవసరమైన చెడు’ (State is a necessary evil) గా వ్యక్తి స్వేచ్ఛావాదులు విశ్వసించారు. ఏ ప్రభుత్వమైతే అతి తక్కువగా పాలనగావిస్తుందో అదియే ఉత్తమమైన ప్రభుత్వంగా వారు వివరించారు. చట్టం వ్యక్తుల కార్యకలాపాలపై కొన్ని ఆంక్షలు విధిస్తుందని వారు పేర్కొన్నారు. అటువంటి ఆంక్షలు లేనప్పుడే వ్యక్తులు స్వీయవ్యక్తిత్వ వికాసానికి కృషి చేయగలుగుతారు. కాబట్టి చట్టం, స్వేచ్ఛ, ఒకదానికొకటి పరస్పరం విరుద్ధమైనవి.

AP Inter 1st Year Civics Study Material Chapter 4 చట్టం

2) చట్టం, స్వేచ్ఛ పరస్పర పోషకాలు (Law and Liberty are Complimentary) : సామ్యవాదులు, కమ్యూనిస్టుల ప్రకారం చట్టం, స్వేచ్ఛ ఒకదానికొకటి పరస్పర పోషకాలు. వారి దృష్టిలో రాజ్యం అనేది ఒక సంక్షేమ సంస్థ. రాజ్యం తన చట్టబద్ధమైన యంత్రాంగం ద్వారా మెరుగైన, న్యాయంతో కూడిన సామాజిక వ్యవస్థను సాధించవచ్చు. సామాజిక సంక్షేమానికి అవసరమైన ఆంక్షలను చట్టం విధిస్తుంది. పెట్టుబడిదారీవర్గం కార్మికవర్గాన్ని దోపిడీకి గురి చేస్తుందనే విషయం వాస్తవం. అటువంటి నేపథ్యంలో రాజ్యం దోపిడికి సంబంధించిన వర్గాలపై ఆంక్షలు విధించగలుగుతుంది. స్వేచ్ఛ అనేది అపరిమితమైనది కాదు. హక్కులను అనుభవించే రాజ్యం ప్రజలపై కొన్ని అవసరమైన ఆంక్షలను విధించేందుకు అధికారం కలిగి ఉంటుంది. ఈ సందర్భంలో లాస్కి కింది విధంగా పేర్కొన్నాడు. “మానవులు సామూహిక నాగరిక జీవనాన్ని గడిపేందుకు అవసరమైన ప్రవర్తనా నియమావళిని రూపొందించే విషయంలో చట్టం స్వేచ్ఛతో సన్నిహిత సంబంధం కలిగి ఉంటుంది. “రాజ్యాన్ని ఒక నైతిక సంస్థగా ఆదర్శవాదులు విశ్వసించారు. రాజ్యం సమాజంలోని జనేచ్ఛకు ప్రతీకగా ఉంటుంది. కాబట్టి ప్రజలందరూ చట్టాలను విధిగా పాటించవలసి ఉంటుంది. వ్యక్తులు రాజ్యానికి, చట్టాలకు విధేయత చూపడం ద్వారా స్వేచ్ఛగా జీవించగలుగుతారు. చట్టం, స్వేచ్ఛల మధ్య సంబంధం గురించి ఫాసిస్టులు ఆచరణాత్మకమైన సంబంధాన్ని వెల్లడించారు. రాజ్యానికి వ్యతిరేకంగానూ, విరుద్ధంగానూ ఏదీ ఉండదన్న నినాదాన్ని ముస్సోలిని ఈ సందర్భంగా ఇవ్వడమైంది. రాజ్యం ఎల్లప్పుడూ ప్రజా ప్రయోజనాలను పరిరక్షిస్తుంది కాబట్టి చట్టం, స్వేచ్ఛ అనే రెండు భావనలు పరస్పర పోషకాలని చెప్పవచ్చు.

స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
చట్టాన్ని నిర్వచించి, చట్టం లక్షణాలను పేర్కొనండి.
జవాబు:
పరిచయం : రాజనీతిశాస్త్ర అధ్యయనంలో చట్టం అనేది ఒక ముఖ్యమైన భావన.

రాజ్యం శాసనాల ద్వారా ప్రజలను పరిపాలిస్తుంది. శాసనాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. రాజ్య సార్వ భౌమాధికారం శాసనాల ద్వారా వ్యక్తమవుతుంది. రాజ్యం ఆశించే సాంఘిక, ఆర్థిక, రాజకీయ మార్పులు శాసనం ద్వారానే సాధించగలవు. మానవుని బాహ్య ప్రవర్తనను క్రమబద్ధం చేసే నియమాలే శాసనాలు. వ్యక్తులు రాజ్యంలో చేయవలసినవి, చేయకూడనివి శాసనం చెబుతుంది. ప్రభుత్వంలోని శాసనశాఖ శాసనాలు చేస్తుంది.

అర్థం : శాసనాన్ని ఆంగ్లంలో ‘లా’ అంటారు. ‘లాగ్’ అనే ట్యూటానిక్ పదం నుండి ‘లా’ అనే మాట వచ్చింది. ‘లాగ్’ అంటే ‘సమమైన’ లేదా ‘స్థిరమైన’ అని అర్థం. శాసనాలు స్థిరమైన నిబంధనలు.

నిర్వచనాలు :
1) “సార్వభౌముడి ఆదేశమే చట్టం. ప్రజలందరూ సార్వభౌముడికి విధేయులుగా ఉండేందుకు చట్టం కొన్ని ఉమ్మడి నియమాలను రూపొందిస్తుంది” అని జాన్ ఎరిస్కిన్ పేర్కొన్నాడు.

2) “రాజకీయాధికారాన్ని పొందిన సార్వభౌముడిచే అమలు చేసే బాహ్య చర్యలకు సంబంధించిన సాధారణ నియమమే చట్టం” అని టి.ఇ. హాలండ్ పేర్కొన్నాడు.

3) న్యాయపాలనలో రాజ్యం ఉపయోగించే సూత్ర సముదాయమే చట్టం” అని జాన్ సాల్మండ్ పేర్కొన్నాడు.

శాసనానికి ఆధారాలు : హాలెండ్ అనే రచయిత సంప్రదాయాలు, మతము, ధర్మబద్ధత (సమత), న్యాయమూర్తుల తీర్పులు, శాస్త్రీయ వ్యాఖ్యానాలు, శాసనశాఖ అనేవి శాసనాలకు ఆధారాలని చెప్పాడు. శాసనాలు వివిధ రంగాలలో క్రమంగా రూపొందుతాయి. అనేక అంశాల ప్రభావం వాటిపై ఉంటుంది. రాజనీతి శాస్త్రజ్ఞులు చెప్పిన శాసనాల ఆధారాలు ఈ క్రింది విధంగా చెప్పవచ్చు.

AP Inter 1st Year Civics Study Material Chapter 4 చట్టం

చట్టం ముఖ్య లక్షణాలు (Features of Law) : చట్టానికి కింద పేర్కొన్న లక్షణాలు ఉన్నాయి.

  1. సార్వభౌముడు ఆమోదించిన నియమ నిబంధనల సముధాయమే చట్టం.
  2. చట్టాన్ని రాజ్యం అమలుపరుస్తుంది. రాజ్యం అనుమతి పొందడంతో చట్టాన్ని యోగ్యమైందిగా పరిగణించవచ్చు.
  3. చట్టం నిర్దిష్టమైనది, ఖచ్చితమైనది, విశ్వవ్యాప్తమైనది.
  4. చట్టం ప్రజల అభీష్టాన్ని ప్రతిబింబిస్తుంది.
  5. చట్టం ఉల్లంఘన శిక్షకు దారితీస్తుంది.
  6. చట్టాలు నిర్బంధమైన, శిక్షాత్మక స్వభావాన్ని కలిగి ఉంటాయి.
  7. చట్టం వైయుక్తిక, సాధారణ సంక్షేమాన్ని సంరక్షించే ఉద్దేశ్యాన్ని కలిగి ఉంటుంది.
  8. చట్టం ప్రజల అవసరాల మేరకు మార్చబడుతుంది.

ప్రశ్న 2.
వివిధ రకాల చట్టాలను తెలపండి.
జవాబు:
చట్టం వర్గీకరణ : చట్టం వర్గీకరణ గురించి అనేకమంది రాజనీతి తత్త్వవేత్తలు భిన్నమైన ప్రతిపాదనలను చేశారు. అటువంటి వారిలో మేకైవర్ ప్రతిపాదించిన చట్ట వర్గీకరణ ప్రముఖమైనదిగా పరిగణించవచ్చు.

మేకైవర్ ప్రకారం చట్టం ప్రధానంగా రెండు రకాలుగా ఉంటుంది. అవి : 1) సహజ చట్టం (Natural Law), 2) సహేతుక చట్టం (Positive Law).

సహేతుక చట్టాన్ని (Positive Law), జాతీయ చట్టం (National Law), అంతర్జాతీయ చట్టం (International Law) అని రెండు రకాలుగా వర్గీకరించారు.

జాతీయ చట్టాన్ని (National Law), మరల రెండు రకాలుగా వర్గీకరించారు. అవి : రాజ్యాంగ చట్టం (Constitutional Law), సాధారణ చట్టం (Ordinary Law).

సాధారణ చట్టం (Ordinary Law), అనేది పబ్లిక్ చట్టం (Public Law), ప్రైవేట్ చట్టం (Private Law) అని రెండు రకాలుగా విభజించారు.

పబ్లిక్ చట్టాన్ని (Public Law), పరిపాలన చట్టం (Administrative Law), సార్వత్రిక చట్టం (General Law) అని తిరిగి రెండు రకాలుగా వర్గీకరించబడింది.

సార్వత్రిక చట్టాన్ని (General Law), శాసనాత్మక చట్టం (Statutory Law), ఉమ్మడి చట్టం (Common Law) అని రెండు రకాలుగా విభజించారు. పైన పేర్కొన్న వివిధ రకాల చట్టాలను కింది విధంగా వివరించవచ్చు.

1) సహజ చట్టం (Natural Law) : సహజచట్టాన్ని దైవిక న్యాయంగా కూడ వ్యవహరిస్తారు. సహజచట్టం అనేది ఏ ఒక్కరిచేత రూపొందినది కాదు. అది భౌతికశక్తి ఆధారంగా ప్రకృతిచేత ప్రసాదితమైనది. మానవ స్వభావాన్ని విశ్లేషించేందుకు హేతువును వినియోగించడాన్ని సహజ చట్టంగా పేర్కొనవచ్చు. భగవంతుని స్వహస్తాలతో మానవుల హృదయాలలో లిఖించబడినదే సహజ చట్టంగా కొందరు వర్ణించారు.

2) సహేతుక చట్టం (Positive Law) : మానవ సంస్థలచే రూపొందించబడేదే సహేతుక చట్టం. ఈ చట్టాన్ని రాజకీయ చట్టం అని కొందరు పేర్కొన్నారు. వర్తమాన, సామాజిక, రాజకీయ పరిస్థితుల ఆధారంగా ఈ చట్టం నిర్మితమైంది. సార్వభౌమత్వ రాజకీయ అధికారి ఈ చట్టానికి అనుమతిస్తాడు. ఈ చట్టాన్ని అతిక్రమించినవారు శిక్షకు గురి అవుతారు. ఈ చట్టాన్ని తిరిగి జాతీయ చట్టమని, అంతర్జాతీయ చట్టమని రెండు రకాలుగా పేర్కొన్నారు.

జాతీయ చట్టాన్ని మున్సిపల్ చట్టం లేదా రాజ్య చట్టం అని కూడ వ్యవహరిస్తారు.

జాతీయ చట్టం, రాజ్య భౌగోళిక ప్రదేశానికి పరిమితమవుతుంది. సార్వభౌమాధికారి ద్వారా అది అమలులోకి వస్తుంది. రాజ్యంలోని ప్రజలందరికీ వర్తిస్తుంది. ఇక అంతర్జాతీయ చట్టమనేది వివిధ రాజ్యాల మధ్య సౌహార్ధ సంబంధాలను నెలకొల్పి, నియంత్రణ చేసేందుకు ఉద్దేశించింది. అయితే ఈ రకమైన చట్టానికి వ్యక్తులను శిక్షించే అధికారం ఉండదు. ఐక్యరాజ్యసమితి ఆమోదించిన అంతర్జాతీయ చట్టాలు ఇందుకు ఉదాహరణలుగా పేర్కొనవచ్చు. అంతర్జాతీయ శాంతిభద్రతలను పెంపొందించేందుకై సభ్య రాజ్యాలచే పాటించబడే నియమనిబంధనల సముదాయమే అంతర్జాతీయ చట్టంగా పరిగణించవచ్చు.

AP Inter 1st Year Civics Study Material Chapter 4 చట్టం

ప్రశ్న 3.
చట్టానికి గల మూడు ఆధారాలను రాయండి. [Mar. ’18, ’17]
జవాబు:
1) ఆచార, సంప్రదాయాలు, వాడుకలు (Customs) : ఇవి శాసనానికి తొలి ఆధారాలు. ప్రజల ఆచారాలు, వాడుకలు, సంప్రదాయాలు శాసనాలకు మూలాధారము. సంప్రదాయాలు సంఘంలో ఒక అలవాటుగా, క్రమంగా రూపొందుతాయి. పూర్వం సంప్రదాయాలే సమాజ జీవితాన్ని క్రమబద్ధం చేసేవి. రాజ్యం వీటిని గుర్తించి, వాటిని ఆధారం చేసుకొని కొన్ని శాసనాలను రూపొందిస్తుంది. రాజకీయ ఆచారాలు కూడా రాజ్యంచే గుర్తించబడి అమలు చేయబడితే అవి శాసనాలవుతాయి. బ్రిటన్లో ‘సామాన్య న్యాయం’ సంప్రదాయబద్ధమైన శాసనానికి ఉదాహరణ. అదే విధంగా భారతదేశంలో వివాహ చట్టాలు, ఆస్తి పంపిణీ చట్టాలు మొదలగునవి సంప్రదాయాలు ఆధారంగా చేయబడ్డాయి.

2) మతం (Religion) : ఆచారానికి మతం సమాజాన్ని విపరీతంగా ప్రభావితం చేసే వ్యవస్థ. సంఘ జీవితం మత నియమాలకు అనుగుణంగా జరుపుకుంటారు. పూర్వం మతాధిపతులు చెప్పే నియమాలు శాసనాల వలె చెలామణి అయ్యేవి. ఆధునిక కాలంలో కూడా శాసనాలు చేయడానికి మతం ఒక ఆధారం. వారసత్వం, వివాహం, కుటుంబ ఆస్తి మొదలైన వాటి శాసనాలు మతం ఆధారంగా చేయబడ్డాయి. హిందువులు, క్రైస్తవులు, ముస్లిములకు గల శాసనాలు వారి మతాలు ఆధారంగా రూపొందాయి. ఇరాన్, పాకిస్థాన్ వంటి మత ప్రమేయ దేశాలలో సంఘ జీవనానికి మత నియమాలే ఆధారం.

3) న్యాయస్థానాల తీర్పులు (Judicial Decisions) న్యాయస్థానాలలో న్యాయమూర్తులు ఇచ్చే తీర్పులు శాసన నిర్మాణానికి ఆధారాలు. న్యాయస్థానాలు చట్టాలను వ్యాఖ్యానిస్తాయి. ఈ విధి నిర్వహణలో న్యాయమూర్తులు తీర్పులిచ్చేటప్పుడు క్రొత్త న్యాయ సూత్రాలను సృష్టిస్తారు. ఈ తీర్పులు అదే విధమైన వివాదాలు తలెత్తినప్పుడు న్యాయసూత్రల వలె వర్తింపచేస్తారు. నేడు న్యాయమూర్తుల నిర్ణయాలు శాసనాలలో అంతర్భాగమవుతున్నాయి. ఉదా : భారతదేశంలో సుప్రీంకోర్టు తీర్పులిచ్చిన గోలక్నాథ్ కేసు, కేశవానంద భారతి కేసు, మినర్వామిల్స్ కేసు.

4) శాస్త్రీయ వ్యాఖ్యానాలు (Scientific commentories) : ప్రముఖ న్యాయశాస్త్ర కోవిదులు, రచయితలు, విమర్శకులు చేసే వ్యాఖ్యానాలు శాసన నిర్మాణానికి ఆధారమవుతాయి. ఇవి న్యాయస్థానాలలో న్యాయమూర్తుల వ్యాఖ్యానాలు, వివరణలు, శాసనాలు చేయటానికి ప్రభుత్వానికి ఉపయోగిస్తాయి. న్యాయమూర్తుల నిర్ణయాలు, తీర్పులు, భవిష్యత్లో శాసన నిర్మాణానికి తోడ్పడతాయి. ఇంగ్లండ్లో కోక్, బ్లాక్టన్, అమెరికాలో స్టోరీ, కెంట్, భారతదేశంలో విజ్ఞానేశ్వర, అపరార్క వంటి వారి వ్యాఖ్యానాలు శాసన నిర్మాణానికి ఆధారాలు.

ప్రశ్న 4.
చట్టం, నైతికత మధ్య వ్యత్యాసాలను తెలపండి.
జవాబు:
చట్టం, నైతికతల మధ్య వ్యత్యాసాలను క్రింది విధంగా పేర్కొనవచ్చు.
చట్టం (Law)

  1. చట్టం వ్యక్తుల బాహ్య ప్రవర్తనకు సంబంధించినది.
  2. చట్టం రాజ్యానికి సంబంధించినది.
  3. చట్టం రాజ్యాధికారపు నిర్భంధిత శక్తిచే ముడిపడి ఉంటుంది.
  4. చట్టం నిర్దిష్టమైంది, ఖచ్చితమైంది.
  5. రాజ్య భూభాగంలో మాత్రమే చట్టం వర్తిస్తుంది.
  6. చట్టాన్ని ఒక నిర్దిష్ట లక్ష్యంతో రూపొందించడం అవుతుంది.
  7. సార్వభౌమాధికారి చట్టానికి అనుమతి ఇస్తాడు.
  8. చట్టం అనేది రాజనీతిశాస్త్ర విషయ పరిధిలోకి వస్తుంది.
  9. చట్ట అతిక్రమణ శిక్షకు దారితీస్తుంది.
  10. చట్టాన్ని రూపొందించి అమలులో ఉంచేందుకు యంత్రాంగం ఉంటుంది.

AP Inter 1st Year Civics Study Material Chapter 4 చట్టం

నైతికత (Morality)

  1. నైతికత అనేది వ్యక్తుల మొత్తం జీవనానికి సంబంధించినది.
  2. నైతికత వ్యక్తి అంతరాత్మకు సంబంధించినది.
  3. నైతికతకు ప్రజాభిప్రాయం, వ్యక్తుల అంతరాత్మలు ఆలంబనగా ఉంటాయి.
  4. నైతికత అస్పష్టమైంది, అనిశ్చితమైంది.
  5. నైతిక సూత్రాలు విశ్వ వ్యాప్తమైన స్వభావాన్ని కలిగి ఉంటాయి.
  6. నైతిక సూత్రాలు సమాజంలో అంతర్లీనంగా ఉంటాయి.
  7. సమాజం నైతిక సూత్రాలను ఆమోదిస్తుంది.
  8. నైతిక సూత్రాలనేవి నీతిశాస్త్రం పరిధిలోకి వస్తాయి.
  9. నైతిక సూత్రాల అతిక్రమణ ఎటువంటి శిక్షకు దారితీయదు.
  10. నైతిక సూత్రాల అమలుకు ఎటువంటి ప్రత్యేక రాజ్య యంత్రాంగం ఉండదు.

ప్రశ్న 5.
“చట్టం, స్వేచ్ఛ పరస్పర విరుద్ధాలు” విశ్లేషించండి.
జవాబు:
చట్టం, స్వేచ్ఛ పరస్పరం విరుద్ధమైనవి (Law and Liberty are Antithetical) : చట్టం ఎల్లప్పుడు మానవుల కార్యకలాపాలపై నిర్బంధాలు విధిస్తుందని వ్యక్తి స్వేచ్ఛను సమర్థించేవారు భావిస్తారు. జె.ఎస్. మిల్, హెర్బర్ట్ స్పెన్సర్, ఆడమ్ స్మిత్, మార్షల్ వంటి వ్యక్తి స్వేచ్ఛావాదులు, ప్రాధాన్, బకూనిన్, క్రొపోట్కిన్ వంటి అరాచకవాదుల ప్రకారం వ్యక్తి స్వేచ్ఛకు చట్టం ఆటంకాలను సృష్టిస్తుంది. వారి దృష్టిలో రాజ్యం వ్యక్తుల స్వేచ్ఛలకు భంగం కలిగించే ప్రధాన సాధనం. చట్టం అనేది ఎల్లప్పుడు వ్యక్తుల స్వేచ్ఛపై ఆంక్షలు విధిస్తుంది. రాజ్యం, ప్రభుత్వాలకు సంబంధించిన వ్యవహారాలలో వ్యక్తులు పాల్గొనేందుకు చట్టం అనుమతించదు. అలాగే రాజ్యానికి సంబంధించిన ఆర్థిక కార్యకలాపాల నిర్వహణలో చట్టం ఆటంకంగా పరిణమిస్తుంది. అయితే ఇటీవలి కాలంలో అనేక రాజ్యాలలో ‘అమలులో ఉన్న సరళీకృత ఆర్థిక విధానాలు ఆ దేశాల ఆర్థిక వ్యవస్థలు శీఘ్రగతిన ప్రగతి దిశలో పయనించేందుకు అనుకూలంగా ఉన్నాయని చెప్పవచ్చు. ఈ విధానాలు ఆర్థిక వ్యవహారాలలో ప్రజలు స్వేచ్ఛగా పాల్గొనేందుకు వీలు కల్పించాయి. అవి జాతీయ, అంతర్జాతీయ మార్కెట్ల మధ్య ఏ విధమైన కఠినమైన ఆర్థిక చట్టాలతో ప్రమేయం లేకుండా పోటీకి అవకాశం ఏర్పరచాయి. రాజ్యమనేది ‘ఒక అవసరమైన చెడు’ (State is a necessary evil) గా వ్యక్తి స్వేచ్ఛావాదులు విశ్వసించారు. ఏ ప్రభుత్వమైతే అతి తక్కువగా పాలనగావిస్తుందో అదియే ఉత్తమమైన ప్రభుత్వంగా వారు వివరించారు. చట్టం వ్యక్తుల కార్యకలాపాలపై కొన్ని ఆంక్షలు విధిస్తుందని వారు పేర్కొన్నారు. అటువంటి ఆంక్షలు లేనప్పుడే వ్యక్తులు స్వీయ ‘ వ్యక్తిత్వ వికాసానికి కృషి చేయగలుగుతారు. కాబట్టి చట్టం, స్వేచ్ఛ, ఒకదానికొకటి పరస్పరం విరుద్ధమైనవి.

ప్రశ్న 6.
చట్టం, స్వేచ్ఛ ఏ విధంగా పరస్పర పోషకాలో వివరించండి.
జవాబు:
చట్టం, స్వేచ్ఛ పరస్పర పోషకాలు (Law and Liberty are Complimentary) : సామ్యవాదులు, కమ్యూనిస్టుల ప్రకారం చట్టం, స్వేచ్ఛ ఒకదానికొకటి పరస్పర పోషకాలు. వారి దృష్టిలో రాజ్యం అనేది ఒక సంక్షేమ సంస్థ. రాజ్యం తన చట్టబద్దమైన యంత్రాంగం ద్వారా మెరుగైన, న్యాయంతో కూడిన సామాజిక వ్యవస్థను సాధించవచ్చు.
సామాజిక సంక్షేమానికి అవసరమైన ఆంక్షలను చట్టం విధిస్తుంది. పెట్టుబడిదారీవర్గం కార్మికవర్గాన్ని దోపిడీకి గురి చేస్తుందనే విషయం వాస్తవం. అటువంటి నేపథ్యంలో రాజ్యం దోపిడికి సంబంధించిన వర్గాలపై ఆంక్షలు విధించగలుగుతుంది. స్వేచ్ఛ అనేది అపరిమితమైనది కాదు. హక్కులను అనుభవించే రాజ్యం ప్రజలపై కొన్ని అవసరమైన ఆంక్షలను విధించేందుకు అధికారం కలిగి ఉంటుంది. ఈ సందర్భంలో లాస్కి కింది విధంగా పేర్కొన్నాడు. “మానవులు సామూహిక నాగరిక జీవనాన్ని గడిపేందుకు అవసరమైన ప్రవర్తనా నియమావళిని రూపొందించే విషయంలో చట్టం స్వేచ్ఛతో సన్నిహిత సంబంధం కలిగి ఉంటుంది. “రాజ్యాన్ని ఒక నైతిక సంస్థగా ఆదర్శవాదులు విశ్వసించారు. రాజ్యం సమాజంలోని జనేచ్ఛకు ప్రతీకగా ఉంటుంది. కాబట్టి ప్రజలందరూ చట్టాలను విధిగా పాటించవలసి ఉంటుంది. వ్యక్తులు రాజ్యానికి, చట్టాలకు విధేయత చూపడం ద్వారా స్వేచ్ఛగా జీవించగలుగుతారు. చట్టం, స్వేచ్ఛల మధ్య సంబంధం గురించి ఫాసిస్టులు ఆచరణాత్మకమైన సంబంధాన్ని వెల్లడించారు. రాజ్యానికి వ్యతిరేకంగానూ, విరుద్ధంగానూ ఏదీ ఉండదన్న నినాదాన్ని ముస్సోలిని ఈ సందర్భంగా ఇవ్వడమైంది. రాజ్యం ఎల్లప్పుడూ ప్రజా ప్రయోజనాలను పరిరక్షిస్తుంది కాబట్టి చట్టం, స్వేచ్ఛ అనే రెండు భావనలు పరస్పర పోషకాలని చెప్పవచ్చు.

AP Inter 1st Year Civics Study Material Chapter 4 చట్టం

ప్రశ్న 7.
చట్టం, నైతికతల మధ్య ఎటువంటి సంబంధం ఉంది ?
జవాబు:
చట్టం – నైతికత అనేవి సామాజిక సంస్థలకు ప్రధాన మూలాధారాలుగా పరిగణించవచ్చు. సమాజంలో శాంతి భద్రతల నిర్వహణలోనూ, ప్రగతి సాధనలోనూ ఈ రెండు అంశాలు ఎంతో కీలకపాత్రను పోషిస్తాయి. ఈ రెండు అంశాలు వేర్వేరు దృక్పథాలను కలిగి ఉన్నప్పటికీ ఒకే లక్ష్యాన్ని కలిగి ఉన్నాయి. అవి ఒకదానికొకటి పరస్పర సంబంధం కలిగి ఉంటూ పరస్పర ఆధారితాలుగా ఉంటాయి. కొందరు రాజనీతి తత్త్వవేత్తలు ఈ రెండింటినీ ఒకటిగా పరిగణించారు. ఈ సందర్భంలో ఆర్.జి.గెటిల్ కింది విధంగా ప్రకటించాడు. “చట్టం – నైతికత రెండూ ఒకే విధమైనవి. అవి రెండూ ప్రాచీన సామాజిక జీవనపు అలవాట్లు, అనుభవాల నుంచి ఉద్భవించాయి. ప్రాచీన సమాజంలో వ్యక్తుల నైతిక, సామాజిక వ్యవహారాలు అవిభాజ్యాలుగా ఉండేవి”. ఈ రెండింటి మధ్య కొన్ని నిర్దిష్టమైన వ్యత్యాసాలు ఉన్నప్పటికీ, శాసనం, నైతికత రెండూ ఉమ్మడి సంక్షేమాన్ని ఉద్దేశించి వాడుకలోకి వచ్చాయి.

అతి స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
చట్టం పదవృత్తాంతాన్ని వివరించండి.
జవాబు: ‘చట్టం’ అనే పదం టైటానిక్ భాష (జర్మన్) లోని ‘లాగ్’ అనే పదం నుండి గ్రహించబడింది. లాగ్ అనగా ‘స్థిరంగా ఉండటం’ అని అర్థం. పద అర్థాన్ని బట్టి సార్వభౌమత్వ రాజకీయ అధికారిచే ప్రతిపాదించబడి, అమల్లోకి వచ్చిన ప్రవర్తనా నియమావళియే చట్టం అని భావించవచ్చు. మరికొందరు రాజనీతిజ్ఞులు ‘చట్టం’ అనే పదం లాటిన్ భాషలోని ‘జస్’, ‘జంగేరి’ అనే రెండు పదాల నుండి గ్రహించబడిందని పేర్కొన్నారు. లాటిన్ భాషలోని ఈ రెండు పదాలకు ‘బంధం’ అనే అర్థం ఉంది.

ప్రశ్న 2.
చట్టానికి గల రెండు నిర్వచనాలను తెలపండి.
జవాబు:

  1. “రాజకీయాధికారాన్ని పొందిన సార్వభౌముడిచే అమలుచేసే బాహ్య చర్యలకు సంబంధించిన సాధారణ నియమమే చట్టం” అని టి. ఇ. హాలండ్ పేర్కొన్నాడు.
  2. “న్యాయపాలనలో రాజ్యం ఉపయోగించే సూత్ర సముదాయమే చట్టం” అని జాన్ సాల్మండ్ పేర్కొన్నాడు.

ప్రశ్న 3.
చట్టం లక్షణాలు ఏవీ ?
జవాబు:
చట్టం ఈ క్రింది ముఖ్య లక్షణాలను కలిగి ఉంటుంది.

  1. సార్వభౌముడు ఆమోదించిన నియమ నిబంధనల సముదాయమే చట్టం.
  2. చట్టం నిర్దిష్టమైనది, ఖచ్చితమైనది మరియు విశ్వవ్యాప్తమైనది.
  3. చట్టం ప్రజాభిప్రాయానికి అనుకూలంగా ఉంటుంది.
  4. చట్టం ఉల్లంఘన శిక్షకు దారితీస్తుంది.

AP Inter 1st Year Civics Study Material Chapter 4 చట్టం

ప్రశ్న 4.
సమన్యాయపాలన అంటే ఏమిటి ? [Mar. ’16, ’17 ]
జవాబు:
సమన్యాయపాలన అంటే చట్టం ఆధిక్యత అని అర్థం. సమన్యాయపాలన అమలులో ఉన్న దేశాలలో ప్రభుత్వాధికారాలు చట్టాల ద్వారా నిర్ణయించబడతాయి. ప్రభుత్వ చర్యలన్నింటికి చట్టసమ్మతి ఉండాలి. చట్టాన్ని ఉల్లంఘించినపుడు మాత్రమే వ్యక్తి శిక్షింపబడతాడు. ధనిక, పేద అనే విచక్షణ లేకుండా చట్టం అందరినీ సమానంగా చూస్తుంది. చట్ట ఆధిక్యత లేదా సమన్యాయ పాలన ఉండటం వలన వ్యక్తులకు స్వేచ్ఛా, స్వాతంత్ర్యాలు లభిస్తాయి.

ప్రశ్న 5.
సహజ చట్టం అంటే ఏమిటి ?
జవాబు:
సహజ చట్టం (Natural Law) : సహజచట్టాన్ని దైవిక న్యాయంగా కూడ వ్యవహరిస్తారు. సహజచట్టం అనేది ఏ ఒక్కరిచేత రూపొందినది కాదు. అది భౌతికశక్తి ఆధారంగా ప్రకృతిచేత ప్రసాదితమైనది. మానవ స్వభావాన్ని విశ్లేషించేందుకు హేతువును వినియోగించడాన్ని సహజ చట్టంగా పేర్కొనవచ్చు. భగవంతుని స్వహస్తాలతో మానవుల హృదయాలలో లిఖించబడినదే సహజ చట్టంగా కొందరు వర్ణించారు.

ప్రశ్న 6.
పరిపాలక చట్టం అంటే ఏమిటో తెలపండి. (లేదా) పరిపాలక న్యాయం గురించి నీకేమి తెలియును ?
జవాబు:
పరిపాలక చట్టం (Administrative Law) : పరిపాలన నిర్విఘ్నంగానూ, ప్రశాంతంగానూ కొనసాగే విషయంలో చట్టం కీలకపాత్రను పోషిస్తుంది. ప్రజలకు ప్రభుత్వాధికారులకు మధ్య సంబంధాలను ఈ రకమైన చట్టం నియంత్రిస్తుంది. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించిన సంస్కరణలను తీసుకురావడంలో ఇది దోహదపడుతుంది. పరిపాలక చట్టాలను అనుసరించడం ద్వారా ఈనాటి రాజ్యాలు అనేక దశలుగా శీఘ్రగతిన అభివృద్ధిని సాధించాయి. ప్రభుత్వ సిబ్బంది క్రమశిక్షణతో పనిచేసేటట్లు పరిపాలక చట్టం దోహదపడుతుంది.

ప్రశ్న 7.
చట్టానికి గల ఏ మూడు ఆధారాలనైనా రాయండి.
జవాబు:
చట్టానికి గల మూడు ఆధారాలు : i) ఆచారాలు ii) మతం iii) శాసనసభ.

ప్రశ్న 8.
రాజ్యాంగ చట్టం అంటే ఏమిటి ? [Mar. ’18]
జవాబు:
రాజ్యాంగ చట్టం (Constitutional Law): రాజ్యాంగ చట్టమనేది సాధారణ చట్టం కంటే భిన్నంగా ఉంటుంది. రాజ్యంలో ఈ రకమైన చట్టం అత్యున్నతమైనది. ప్రభుత్వ నిర్మాణానికి ఇది వీలు కల్పిస్తుంది. ప్రభుత్వాంగాల మధ్య సంబంధాన్ని వివరిస్తుంది. ప్రభుత్వాంగాల అధికార పరిధిని నిర్ణయిస్తుంది. ఈ రకమైన చట్టం లిఖిత పూర్వకంగా ఉంటుంది. రాజ్యంలో నివసించే పౌరుల హక్కులు, బాధ్యతల గురించి వివరిస్తుంది. ప్రజాస్వామ్యంలో ఈ చట్టానికి ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. ఇది ప్రజాభీష్టానికి ప్రతీకగా ఉంటుంది.

AP Inter 1st Year Civics Study Material Chapter 4 చట్టం

ప్రశ్న 9.
పబ్లిక్ చట్టాన్ని నిర్వచించండి.
జవాబు:
పబ్లిక్ చట్టం (Public Law) : పబ్లిక్ చట్టం, రాజ్యం వ్యక్తుల మధ్య సంబంధాలను నియంత్రిస్తుంది. రాజ్యానికి సంబంధించిన మౌలిక నిర్మితి, విధులను పబ్లిక్ చట్టం వివరిస్తుంది. రాజ్యపు మితిమీరిన జోక్యానికి వ్యతిరేకంగా వ్యక్తులకు అవసరమైన హక్కులను అందిస్తుంది. పౌరులందరు ఈ చట్టాన్ని అనుసరించాల్సి ఉంటుంది. ఈ చట్టాన్ని అతిక్రమించడం శిక్షార్హమైన నేరంగా పరిగణిస్తారు.

ప్రశ్న 10.
జస్, జంగేరి పదవృత్తాంతాలను వివరించండి.
జవాబు:
కొంతమంది రాజనీతిజ్ఞుల ప్రకారం ‘చట్టం’ అనే పదం లాటిన్ భాషలోని ‘జస్’, ‘జంగేరి’ అనే రెండు పదాల నుండి ఉద్భవించింది. లాటిన్ భాషలో ఈ రెండు పదాలకు ‘బంధం’ అనే అర్థం ఉంది. సాధారణంగా చట్టం అనేది రాజకీయ సార్వభౌమాధికారిచే వ్యక్తుల బాహ్య ప్రవర్తనను నియంత్రించేందుకై రూపొందించబడిన నియమావళి అని పేర్కొనవచ్చు.

ప్రశ్న 11.
చట్టం అధ్యయనానికి గల దృక్పథాలు ఏవి ?
జవాబు:
చట్టం అధ్యయనానికి గల ప్రధాన దృక్పథాలు నాలుగు. అవి : 1) నైతిక దృక్పథం 2) రాజకీయ దృక్పథం 3) శాస్త్రీయ దృక్పథం 4) సాంఘిక లేదా సామాజిక దృక్పథం.

ప్రశ్న 12.
సమత అంటే ఏమిటో నిర్వచించండి. [Mar. ’16]
జవాబు:
‘సమత’ అనే పదానికి నిష్పక్షపాతం, న్యాయం లాంటి సూత్రాలను పర్యాయపదాలుగా వాడుతున్నారు. సమత అంటే సహజ న్యాయం. అమలులో ఉన్న చట్టాలు వివాదాల పరిష్కారానికి సహాయపడిన సందర్భాలలో న్యాయమూర్తులు తమ విజ్ఞత, విచక్షణతో వివాదాలను పరిష్కరిస్తారు. ఈ పరిష్కారాలే రాజ్యముచేత గుర్తించబడి చట్టాలుగా ప్రకటించబడతాయి.

ప్రశ్న 13.
శాస్త్రవేత్తల వ్యాఖ్యానాలు అంటే ఏవి ?
జవాబు:
శాస్త్రవేత్తల వ్యాఖ్యానాలు చట్టానికి మరొక ముఖ్యమైన ఆధారం. ప్రఖ్యాత న్యాయమూర్తులు, న్యాయవాదులు వెల్లడించే అభిప్రాయాలు ఎనలేని ప్రాముఖ్యతను కలిగి ఉంటాయి. న్యాయవేత్తలు తమ వ్యాఖ్యానాల ద్వారా చట్టంలోని దోషాలను గుర్తించి, వాటి నివారణకు కొన్ని సూచనలు చేస్తారు. కాలక్రమంలో ఈ సూచనలే చట్ట నిర్మాణానికి ప్రధాన ఆధారాలవుతాయి.

AP Inter 1st Year Civics Study Material Chapter 4 చట్టం

ప్రశ్న 14.
శాసన నిర్మాణ ప్రక్రియలో శాసనసభ పాత్ర ఏమిటి ?
జవాబు:
ప్రజాస్వామ్యంలో శాసనసభ శాసన నిర్మాణ ప్రక్రియలో ప్రధానపాత్ర పోషిస్తుంది. కావున శాసనసభను చట్టం యొక్క ప్రత్యక్ష ఆధారంగా పేర్కొంటారు. చట్ట నిర్మాణంలో శాసనసభలు ప్రజానీకం ఆకాంక్షలకు ప్రతీకగా ఉంటాయి. శాసనసభలోని అధికార, ప్రతిపక్షాలు రెండూ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా వ్యవహరిస్తాయి.