AP Inter 2nd Year Civics Study Material Chapter 8 రాష్ట్ర న్యాయశాఖ

Andhra Pradesh BIEAP AP Inter 2nd Year Civics Study Material 8th Lesson రాష్ట్ర న్యాయశాఖ Textbook Questions and Answers.

AP Inter 2nd Year Civics Study Material 8th Lesson రాష్ట్ర న్యాయశాఖ

వ్యాసరూప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
హైకోర్టు అధికార విధులను వివరించండి.
జవాబు:
భారత రాజ్యాంగం ప్రతి రాష్ట్రానికి ఒక హైకోర్టును ఏర్పాటు చేసింది. 1956వ సంవత్సరములో చేపట్టిన 7వ రాజ్యాంగ సవరణను అనుసరించి 2 లేదా 3 రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఉమ్మడి హైకోర్టును ఏర్పరిచేందుకు పార్లమెంటుకు అధికారం కల్పించబడింది. దేశంలోని చాలా రాష్ట్రాలలో హైకోర్టులు కలిగియున్నాయి.

భారత రాజ్యాంగంలోని ఆరో భాగంలో 214 నుండి 231 వరకు గల నిబంధనలు రాష్ట్ర హైకోర్టు నిర్మాణం, న్యాయమూర్తుల అర్హతలు, నియామకం, స్వతంత్ర ప్రతిపత్తి, న్యాయపరిధి, అధికారాలు, ప్రక్రియల గురించి పేర్కొన్నాయి. నిర్మాణం: ప్రతి హైకోర్టులో ఒక ప్రధాన న్యాయమూర్తి, కొందరు ఇతర న్యాయమూర్తులుంటారు. వీరిని భారత రాష్ట్రపతి నియమిస్తారు.

న్యాయమూర్తుల అర్హతలు: హైకోర్టు న్యాయమూర్తులుగా నియమించబడుటకు రాజ్యాంగంలో నిర్ధేశించిన విధంగా క్రింది అర్హతలు కలిగి వుండాలి.

  1. భారతీయ పౌరుడై వుండాలి.
  2. భారతదేశంలో కేంద్ర, రాష్ట్ర న్యాయ సర్వీసులలో కనీసం 10 సంవత్సరాలు న్యాయాధికారిగా అనుభవం కలిగి ఉండాలి. లేదా
  3. రెండుగాని అంతకన్నా ఎక్కువ హైకోర్టులలో 10 సంవత్సరాలు న్యాయవాదిగా అనుభవముండాలి.

AP Inter 2nd Year Civics Study Material Chapter 8 రాష్ట్ర న్యాయశాఖ

హైకోర్టు న్యాయమూర్తుల నియామకానికి రాజ్యాంగంలో ఎటువంటి కనీస వయోపరిమితి ప్రస్తావన లేదు. జీతభత్యములు: హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి నెలసరి వేతనంగా 90,000/- ఇతర న్యాయమూర్తులకు 3 80,000/- లభిస్తాయి. వేతనంతో పాటు వారికి ఉచిత నివాస సౌకర్యం, వైద్యం, టెలిఫోన్, కారు సౌకర్యాలు మరియు ఇతర అలవెన్సులు ఉంటాయి.

ప్రమాణ స్వీకారం: హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ఇతర న్యాయమూర్తులు సంబంధిత రాష్ట్ర గవర్నర్ సమక్షంలో పదవీ ప్రమాణ స్వీకారం చేస్తారు.

పదవీ కాలం: హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ఇతర న్యాయమూర్తులు 62 సంవత్సరముల వయస్సు నిండే వరకు పదవిలో కొనసాగుతారు.

తొలగింపు విధానం: హైకోర్టు న్యాయమూర్తుల నిరూపించబడిన అధికార దుర్వినియోగం, అవినీతి, అసమర్థత, అనైతిక ప్రవర్తనల ఆధారంగా భారత రాష్ట్రపతి సుప్రీంకోర్టు న్యాయమూర్తులను తొలగించే విధంగా హైకోర్టు న్యాయమూర్తులను తొలగిస్తారు.

హైకోర్టు అధికారాలు విధులు: భారత రాజ్యాంగం ప్రకారం హైకోర్టు ఈ క్రింది పేర్కొన్న అధికారాలను, విధులను కల్గి ఉంది. అవి:
1) ప్రారంభ అధికార పరిధి: భారతదేశంలోని ప్రతి హైకోర్టుకు క్రింది విషయాలలో ప్రారంభ అధికార పరిధిని భారత రాజ్యాంగం కల్పించింది. వాటిలో వీలునామా, వివాహము, విడాకులు, కంపెనీ చట్టము, కోర్టు ధిక్కరణ, రెవెన్యూ వివాదాలు మొదలైనవి ఉన్నాయి. ప్రతి హైకోర్టు కొన్ని సూచనలను, ఆదేశాలను లేదా ఆజ్ఞలను (రిట్) ప్రాథమిక హక్కుల అమలుకు జారీచేస్తుంది. పార్లమెంటు సభ్యుల, రాష్ట్ర శాసన సభ్యుల ఎన్నికల వివాదాలు హైకోర్టు పరిధిలోనే పరిష్కరించబడతాయి.

2) అప్పీళ్ళ విచారణ పరిధి: సబార్డినేట్ కోర్టు తీర్పులపై వచ్చే అప్పీళ్ళపై హైకోర్టుకు విచారణ చేసే అధికారముంది. హైకోర్టు సివిల్, క్రిమినల్ వివాదాలపై వచ్చే అప్పీళ్ళను విచారిస్తుంది.

సివిల్ కేసులు: హైకోర్టుకు వచ్చే సివిల్ వివాదాలు మొదటి అప్పీలు లేదా రెండవ అప్పీలుగా ఉంటాయి. సివిల్ వివాదాలలో హైకోర్టుకు వచ్చే అప్పీళ్ళు జిల్లా కోర్టు నిర్ణయంపై ఆధారపడి ఉంటాయి. ఏదైనా వివాదం విలువ కౌ 5,00,000/- లు లేదా అంతకు మించివుంటే అటువంటి వివాదాలపై సబార్డినేటు కోర్టులు ఇచ్చిన తీర్పులపై వచ్చే అప్పీళ్ళను హైకోర్టు విచారణకు స్వీకరిస్తుంది.

క్రిమినల్ కేసులు: జిల్లా సెషన్స్ కోర్టులు ఏడు సంవత్సరాల పైబడి కారాగార శిక్ష విధించిన సందర్భాలలో వచ్చే అప్పీళ్ళను హైకోర్టు విచారణకు స్వీకరిస్తుంది. అలాగే మరణ శిక్ష విధించిన జిల్లా సెషన్స్ కోర్టు తీర్పులన్నీ హైకోర్టు పరిశీలనకు, అంతిమ ఆమోదం కొరకు నివేదించబడతాయి.

3) కోర్టు ఆఫ్ రికార్డ్: రాష్ట్ర హైకోర్టు ‘కోర్ట్ ఆఫ్ రికార్డ్’గా వ్యవహరిస్తుంది. వ్యక్తులు గానీ, సంస్థలు కానీ, కోర్టు ధిక్కారానికి పాల్పడితే, హైకోర్టు వారిని విచారించి శిక్షిస్తుంది. హైకోర్టు ఇచ్చిన తీర్పులు, వెలువరించిన నిర్ణయాలు రికార్డుల రూపంలో భద్రపరుస్తుంది. ఆ రికార్డులకు చాలా ప్రాధాన్యత ఉంటుంది. హైకోర్టు ఇచ్చిన తీర్పులు రాష్ట్రంలోని క్రింది న్యాయస్థానాలకు మార్గదర్శకాలుగా ఉంటాయి.

4) న్యాయ సమీక్ష: సుప్రీంకోర్టు వలే హైకోర్టుకు న్యాయ సమీక్ష అధికారం ఉంటుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రూపొందించిన చట్టాలు లేదా జారీ చేసే ఆదేశాలు రాజ్యాంగ మూల సూత్రాలకు విరుద్ధంగా ఉంటే అవి చెల్లవని (Ultra vires) ప్రకటించే అధికారం హైకోర్టుకు ఉంటుంది.

5) సర్టిఫికేషన్ అధికారం: హైకోర్టు ఇచ్చిన తీర్పుల పట్ల సంతృప్తి చెందని వారు సుప్రీంకోర్టుకు అప్పీలు చేసుకోవచ్చు. అటువంటి అప్పీళ్ళను సర్టిఫై చేసే అధికారం హైకోర్టుకు ఉంది. కనుక సుప్రీంకోర్టుకు అప్పీలు చేసుకొనే వ్యక్తులందరూ చాలావరకు హైకోర్టు ధృవీకరణను తీసుకోవాల్సి ఉంటుంది.

6) సలహాపూర్వక విధులు: హైకోర్టు న్యాయసంబంధ విషయాలలో గవర్నరుకు సలహాలిస్తుంది. జిల్లా న్యాయమూర్తుల నియామకం, పదోన్నతి, బదిలీలు మొదలగు అంశాల విషయములో కూడా సలహాలు ఇస్తుంది. జిల్లా న్యాయస్థానాలలో జిల్లా జడ్జి మినహా ఇతర పదవులలో ఏర్పడే ఖాళీల భర్తీ విషయంలో రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమీషన్తో పాటు హైకోర్టు గవర్నర్కు సలహా ఇస్తుంది.

7) పరిపాలనా సంబంధమైన విధులు: హైకోర్టు తన ప్రాదేశిక పరిధిలో కొన్ని పాలనా సంబంధమైన విధులను నిర్వహిస్తుంది. అవి:

  • 227వ ప్రకరణను అనుసరించి హైకోర్టు రాష్ట్రంలోని అన్ని న్యాయస్థానాలు, ట్రిబునల్స్పై (మిలిటరీ కోర్టులు మినహా) పర్యవేక్షణాధికారాన్ని కలిగి ఉంటుంది.
  • దిగువ కోర్టులు సమర్థవంతంగా పనిచేయడానికి అవసరమైన నియమనిబంధనలను రూపొందించడంలో కీలక పాత్ర వహిస్తుంది.
  • రాజ్యాంగంలోని 228వ ప్రకరణ ప్రకారం హైకోర్టు కొన్ని ప్రత్యేక పరిస్థితులలో కేసులను ఒక కోర్టు నుండి మరొక కోర్టుకు బదిలీ చేస్తుంది.

ప్రశ్న 2.
జిల్లాస్థాయి న్యాయ వ్యవస్థలపై ఒక వ్యాసం రాయండి.
జవాబు:
ప్రతి రాష్ట్రంలో హైకోర్టుకు దిగువన సబార్డినేట్ కోర్టుల వ్యవస్థ ఉంటుంది. భారత రాజ్యాంగం అధీన న్యాయవ్యవస్థ స్వతంత్ర ప్రతిపత్తిని కాపాడుతుంది. రాజ్యాంగంలోని VIవ భాగంలో 233 నుండి 237 వరకు గల ప్రకరణలు సబార్డినేట్ కోర్టుల గురించి పేర్కొన్నాయి. 233వ ప్రకరణ రాష్ట్రంలోని జిల్లా జడ్జిల నియామకం, పదోన్నతి మొదలగు అంశాలను వివరిస్తుంది.

రాష్ట్రంలో రెండు రకాల సబార్డినేట్ కోర్టులుంటాయి. అవి:

  1. సివిల్ కోర్టులు
  2. క్రిమినల్ కోర్టులు

AP Inter 2nd Year Civics Study Material Chapter 8 రాష్ట్ర న్యాయశాఖ

1) సివిల్ కోర్టులు: సివిల్ సంబంధమైన వివాదంతో ముడిపడిన వివాహాలు, విడాకులు, వారసత్వం, వ్యాపారం మొదలగు సివిల్ కేసులను సివిల్ కోర్టులు విచారణకు స్వీకరిస్తాయి. జిల్లా అంతటికి జిల్లా కోర్టుంటుంది. జిల్లా జడ్జి సివిల్ కోర్టుకు అధిపతిగా వ్యవహరిస్తారు. జిల్లాలోని అన్ని సివిల్ కోర్టులపై జిల్లా జడ్జి నియంత్రణ, పర్యవేక్షణా అధికారాలను కలిగి ఉంటాడు. జిల్లా సివిల్ కోర్టుకు దిగువన సీనియర్ సివిల్ జడ్జి కోర్టులు ఉంటాయి. వీటితో పాటు జూనియర్ సివిల్ జడ్జి కోర్టులు ఉంటాయి. సబార్డినేట్ కోర్టులలోని క్రింద పేర్కొన్న న్యాయాధికారులు ఉంటారు.

  1. ప్రిన్సిపల్ జిల్లా జడ్జి.
  2. కుటుంబ కోర్టు జడ్జి.
  3. యస్.సి & యస్. టి. చట్టం కోర్టు జడ్జి.
  4. సీనియర్ సివిల్ కోర్టు జడ్జి
  5. జూనియర్ సివిల్ కోర్టు జడ్జి.

< 10 లక్షల అంతకు మించిన ఆస్థి విలువ కలిగిన వివాదాలపై ప్రిన్సిపల్ జిల్లాకోర్టు విచారణ జరిపి తీర్పునిస్తుంది. ప్రిన్సిపల్ జిల్లా జడ్జిని ప్రత్యక్ష భర్తీ విధానం లేదా పరోక్ష భర్తీ విధానం (పదోన్నతి) ద్వారా నియమించబడతారు. జిల్లా జడ్జి కేడర్ కలిగిన న్యాయాధికారులు కుటుంబ కోర్టులకు న్యాయమూర్తులుగా వ్యవహరిస్తారు.

సీనియర్ సివిల్ జడ్జి కోర్టులు లక్ష రూపాయలకు పైబడి పదిలక్షలలోపు ఆస్థి విలువ గల కేసులను విచారించి తీర్పునిస్తాయి. లక్ష రూపాయలలోపు ఆస్థివిలువ గల కేసులను జూనియర్ సివిల్ జడ్జి కోర్టు విచారించి తీర్పునిస్తుంది. స్థానిక న్యాయ వివాదాలను పరిష్కరించేందుకు జిల్లాలో క్రింది స్థాయిలో న్యాయ పంచాయితీలు, గ్రామ కచేరీలు, అదాలత్ పంచాయితీలు ఉంటాయి.

2) క్రిమినల్ కోర్టులు: జిల్లాలో సెషన్స్ కోర్టు అత్యున్నత క్రిమినల్ కోర్టు. క్రిమినల్ వివాదాలను జిల్లాస్థాయిలో విచారించేందుకు సెషన్స్ కోర్టు అత్యున్నత న్యాయస్థానంగా వ్యవహరిస్తుంది. ఇండియన్ పీనల్ కోడ్, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్లోని అంశాల ఆధారంగా సెషన్స్ జడ్జి తీర్పునిస్తాడు. జిల్లాస్థాయిలో క్రింద పేర్కొన్న న్యాయమూర్తులు క్రిమినల్ కేసులను విచారిస్తారు.

  1. జిల్లా సెషన్స్ జడ్జి.
  2. సీనియర్ అసిస్టెంట్ సెషన్స్ జడ్జి.
  3. జూనియర్ సివిల్ జడ్జి.
  4. స్పెషల్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్.

ప్రిన్సిపల్ జిల్లా న్యాయమూర్తే జిల్లా సెషన్స్ జడ్జిగా వ్యవహరించి హత్య, మోటారు వాహనాల చట్ట ఉల్లంఘన కేసులను విచారించి, దోషులకు జీవిత ఖైదు లేదా మరణశిక్ష విధిస్తాడు. అయితే అటువంటి శిక్షలను హైకోర్టు ధృవీకరించాల్సి ఉంటుంది. సీనియర్ అసిస్టెంట్ సెషన్స్ జడ్జి కేసు స్వభావాన్ని బట్టి ఐదు నుండి ఏడు సంవత్సరాల | వరకు కారాగార శిక్షను విధించవచ్చు.

జూనియర్ సివిల్ జడ్జి కోర్టు ఏదైనా పట్టణములో ఉన్నట్లయితే ఆ కోర్టు సివిల్ మరియు క్రిమినల్ కోర్టుగా వ్యవహరించి సంబంధిత కేసులను విచారించి మూడు సంవత్సరాలలోపు కారాగార శిక్ష విధించవచ్చు. సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టులు ఐదు వందల రూపాయల వరకు పెనాల్టీని లేదా ఒక సంవత్సరం కారాగార శిక్షను లేక రెండింటిని విధించవచ్చు.

స్పెషల్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ కోర్టును ప్రతి పట్టణములోను ఏర్పాటు చేయవచ్చు. ఇవి చిల్లర (పెట్టీ) కేసులను విచారించి ఐదు వందల రూపాయలలోపు జరిమానా, ఆరునెలలలోపు కారాగార శిక్షను విధించవచ్చు.

స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
హైకోర్టు నిర్మాణాన్ని గూర్చి సంక్షిప్తంగా వివరించండి.
జవాబు:
ప్రతి హైకోర్టులో ఒక ప్రధాన న్యాయమూర్తి, కొందరు ఇతర న్యాయమూర్తులుంటారు. వీరిని భారత రాష్ట్రపతి సందర్భానుసారంగా నియమిస్తాడు. హైకోర్టు న్యాయమూర్తి తాత్కాలికంగా శెలవుపై ఉన్నా లేదా విధులను నిర్వహించలేని పరిస్థితిలో ఉన్నా అతడు తన బాధ్యతలను తిరిగి చేపట్టేంతవరకు తాత్కాలిక న్యాయమూర్తిని రెండు సంవత్సరాల పదవీకాలానికి మించకుండా భారత రాష్ట్రపతి నియమించవచ్చు.

రాజ్యాంగం హైకోర్టు న్యాయమూర్తుల సంఖ్యపై ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. ఉదా: అలహాబాద్ హైకోర్టులో అత్యధికంగా 48మంది న్యాయమూర్తులు ఉండగా గౌహతి హైకోర్టులో అతి తక్కువగా 5గురు న్యాయమూర్తులు ఉన్నారు. రాష్ట్రపతి విచక్షణపై, హైకోర్టుల పనిభారాన్ని దృష్టిలోవుంచుకొని రాష్ట్రపతి కాలానుగుణంగా హైకోర్టు న్యాయమూర్తుల సంఖ్యను నిర్ణయిస్తాడు.

ప్రశ్న 2.
రాష్ట్ర హైకోర్టు ఏవైనా రెండు అధికార విధులను గూర్చి రాయండి. [Mar. 16]
జవాబు:
1) ప్రారంభ అధికార పరిధి: భారతదేశంలోని ప్రతి హైకోర్టుకు క్రింది విషయాలలో ప్రారంభ అధికార పరిధిని భారత రాజ్యాంగం కల్పించింది. వాటిలో వీలునామా, వివాహము, విడాకులు, కంపెనీ చట్టము, కోర్టు ధిక్కరణ, రెవెన్యూ వివాదాలు మొదలైనవి ఉన్నాయి. ప్రతి హైకోర్టు కొన్ని సూచనలను, ఆదేశాలను లేదా ఆజ్ఞలను (రిట్) ప్రాథమిక హక్కుల అమలుకు జారీచేస్తుంది. పార్లమెంటు సభ్యుల, రాష్ట్ర శాసన సభ్యుల ఎన్నికల వివాదాలు హైకోర్టు పరిధిలోనే పరిష్కరించబడతాయి.

226వ ప్రకరణను అనుసరించి ప్రాథమిక హక్కుల పరిరక్షణకు ఐదు రకాల రిట్లను హైకోర్టు జారీచేసే అధికారం కలిగి ఉంది. అవి హెబియస్ కార్పస్, సెర్షియోరరీ, మాండమస్, కో-వారంటో, ఇంజక్షన్ మొదలైనవి.

2) అప్పీళ్ళ విచారణ పరిధి: సబార్డినేట్ కోర్టు తీర్పులపై వచ్చే అప్పీళ్ళపై హైకోర్టుకు విచారణ చేసే అధికారముంది. హైకోర్టు సివిల్, క్రిమినల్ వివాదాలపై వచ్చే అప్పీళ్ళను విచారిస్తుంది.

సివిల్ కేసులు: హైకోర్టుకు వచ్చే సివిల్ వివాదాలు మొదటి అప్పీలు లేదా రెండవ అప్పీలుగా ఉంటాయి. సివిల్ వివాదాలలో హైకోర్టుకు వచ్చే అప్పీళ్ళు జిల్లా కోర్టు నిర్ణయంపై ఆధారపడి ఉంటాయి. ఏదైనా వివాదం విలువ 5,00,000/- లు లేదా అంతకు మించివుంటే అటువంటి వివాదాలపై సబార్డినేటు కోర్టులు ఇచ్చిన తీర్పులపై వచ్చే అప్పీళ్ళను హైకోర్టు విచారణకు స్వీకరిస్తుంది.

క్రిమినల్ కేసులు: జిల్లా సెషన్స్ కోర్టులు ఏడు సంవత్సరాల పైబడి కారాగార శిక్ష విధించిన సందర్భాలలో వచ్చే అప్పీళ్ళను హైకోర్టు విచారణకు స్వీకరిస్తుంది. అలాగే మరణ శిక్ష విధించిన జిల్లా సెషన్స్ కోర్టు తీర్పులన్నీ హైకోర్టు పరిశీలనకు, అంతిమ ఆమోదం కొరకు నివేదించబడతాయి.

AP Inter 2nd Year Civics Study Material Chapter 8 రాష్ట్ర న్యాయశాఖ

ప్రశ్న 3.
హైకోర్టు పాలన విధులను వివరించండి.
జవాబు:
హైకోర్టు తన ప్రాదేశిక పరిధిలో కొన్ని పాలనా సంబంధమైన విధులను నిర్వహిస్తుంది. అవి:
ఎ) 227వ ప్రకరణను అనుసరించి హైకోర్టు రాష్ట్రంలోని అన్ని న్యాయస్థానాలు, ట్రిబునల్స్పై (మిలిటరీ కోర్టులు మినహా) పర్యవేక్షణాధికారాన్ని కలిగి ఉంటుంది.

బి) దిగువ కోర్టులు సమర్థవంతంగా పనిచేయడానికి అవసరమైన నియమ నిబంధనలను రూపొందించడంలో కీలక పాత్ర వహిస్తుంది.

సి) రాజ్యాంగంలోని 228వ ప్రకరణ ప్రకారం హైకోర్టు కొన్ని ప్రత్యేక పరిస్థితులలో కేసులను ఒక కోర్టు నుండి మరొక కోర్టుకు బదిలీ చేస్తుంది.

డి) దిగువ న్యాయస్థానాల రికార్డులను, సంబంధిత పత్రాలను తనిఖీ చేసే అధికారం హైకోర్టుకు కలదు.

ఇ) హైకోర్టు తన పరిధిలోని పాలనాపరమైన ఉద్యోగులను నియమించి వారి జీతభత్యాలను నిర్ణయించే అధికారంతో పాటు దిగువ న్యాయస్థానాలలోని ఉద్యోగుల సర్వీసు నిబంధనలను రూపొందించే అధికారాన్ని కలిగి ఉంటుంది.

ఎఫ్) రాజ్యాంగ వ్యాఖ్యానానికి సంబంధించిన ఎటువంటి వివాదంపై విచారణ కొనసాగించేందుకు లేదా నిలిపివేసేందుకు అధికారాన్ని కలిగి ఉంటుంది.

జి) రాష్ట్రంలో హైకోర్టు అత్యున్నత న్యాయ వ్యవస్థ. రాష్ట్రంలోని అన్ని కోర్టులు, ట్రిబునల్స్ (మిలటరీ కోర్టులు మినహా) హైకోర్టు ప్రత్యక్ష పర్యవేక్షణ, నియంత్రణలో పనిచేస్తాయి.

ప్రశ్న 4.
జిల్లా కోర్టు అధికార విధులను వివరించండి.
జవాబు:
భారతదేశంలో రాష్ట్ర న్యాయ వ్యవస్థలో హైకోర్టుకు దిగువన సబార్డినేట్ కోర్టులు లేదా జిల్లా కోర్టులు ఉంటాయి. జిల్లా స్థాయి న్యాయపాలనలో జిల్లాకోర్టులు ప్రధానమైన పాత్రను పోషిస్తాయి. జిల్లాకోర్టులో జిల్లా జడ్జి, ఇతర జడ్జిలు ఉంటారు. వారు జిల్లాస్థాయిలోను, పట్టణ, మేజర్ పంచాయితీల స్థాయిలో అనేక కర్తవ్యాలను, బాధ్యతలను నిర్వహిస్తూ సివిల్, క్రిమినల్ కేసులను విచారిస్తారు. జిల్లా కోర్టులు పాలనా వ్యవహారాలలో రాష్ట్ర ప్రభుత్వ అధికారానికి, నియంత్రణకు లోబడి పనిచేస్తాయి. న్యాయ విషయాలలో హైకోర్టుకు లోబడి పనిచేస్తాయి.

రాష్ట్రంలో రెండు రకాల సబార్డినేట్ కోర్టులుంటాయి. అవి: 1) సివిల్ కోర్టులు 2) క్రిమినల్ కోర్టులు

1) సివిల్ కోర్టులు: సివిల్ సంబంధమైన వివాదంతో ముడిపడిన వివాహాలు, విడాకులు, వారసత్వం, వ్యాపారం మొదలగు సివిల్ కేసులను సివిల్ కోర్టులు విచారణకు స్వీకరిస్తాయి. జిల్లా అంతటికి జిల్లా కోర్టుంటుంది. జిల్లా జడ్జి సివిల్ కోర్టుకు అధిపతిగా వ్యవహరిస్తారు. జిల్లాలోని అన్ని సివిల్ కోర్టులపై జిల్లా జడ్జి నియంత్రణ, పర్యవేక్షణా అధికారాలను కలిగి ఉంటాడు. జిల్లా సివిల్ కోర్టుకు దిగువన సీనియర్ సివిల్ జడ్జి కోర్టులు ఉంటాయి. వీటితో పాటు జూనియర్ సివిల్ జడ్జి కోర్టులు ఉంటాయి. సబార్డినేట్ కోర్టులలోని క్రింద పేర్కొన్న న్యాయాధికారులు ఉంటారు.

  1. ప్రిన్సిపల్ జిల్లా జడ్జి.
  2. కుటుంబ కోర్టు జడ్జి.
  3. యస్.సి & యస్. టి. చట్టం కోర్టు జడ్జి.
  4. సీనియర్ సివిల్ కోర్టు జడ్జి.
  5. జూనియర్ సివిల్ కోర్టు జడ్జి.

< 10 లక్షల అంతకు మించిన ఆస్థి విలువ కలిగిన వివాదాలపై ప్రిన్సిపల్ జిల్లాకోర్టు విచారణ జరిపి తీర్పునిస్తుంది. ప్రిన్సిపల్ జిల్లా జడ్జిని ప్రత్యక్ష భర్తీ విధానం లేదా పరోక్ష భర్తీ విధానం (పదోన్నతి) ద్వారా నియమించబడతారు.

జిల్లా జడ్జి కేడర్ కలిగిన న్యాయాధికారులు కుటుంబ కోర్టులకు న్యాయమూర్తులుగా వ్యవహరిస్తారు. ఈ కోర్టు హిందూ వివాహ చట్టానికి సంబంధించి విడాకులు, మధ్యంతర భరణం, పిల్లల సంరక్షణలకు సంబంధించిన కేసులను విచారిస్తుంది. షెడ్యూల్డ్ కులాలు మరియు షెడ్యూల్డ్ తెగల వారి హక్కులను కాపాడటానికి యస్. సి & యస్. టి. చట్టాన్ని తు.చ. తప్పకుండా అమలు చేయుటకు జిల్లా మొత్తానికి ఒక న్యాయస్థానం ఉంటుంది.

సీనియర్ సివిల్ జడ్జి కోర్టులు లక్ష రూపాయలకు పైబడి పదిలక్షలలోపు ఆస్థి విలువ గల కేసులను విచారించి తీర్పునిస్తాయి. లక్ష రూపాయలలోపు ఆస్థివిలువ గల కేసులను జూనియర్ సివిల్ జడ్జి కోర్టు విచారించి తీర్పునిస్తుంది. స్థానిక న్యాయ వివాదాలను పరిష్కరించేందుకు జిల్లాలో క్రింది స్థాయిలో న్యాయ పంచాయితీలు, గ్రామ కచేరీలు, అదాలత్ పంచాయితీలు ఉంటాయి.

2) క్రిమినల్ కోర్టులు: జిల్లాలో సెషన్స్ కోర్టు అత్యున్నత క్రిమినల్ కోర్టు. క్రిమినల్ వివాదాలను జిల్లాస్థాయిలో విచారించేందుకు సెషన్స్ కోర్టు అత్యున్నత న్యాయస్థానంగా వ్యవహరిస్తుంది. ఇండియన్ పీనల్ కోడ్, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ లోని అంశాల ఆధారంగా సెషన్స్ జడ్జి తీర్పునిస్తాడు. జిల్లాస్థాయిలో క్రింద పేర్కొన్న న్యాయమూర్తులు క్రిమినల్ కేసులను విచారిస్తారు.

  1. జిల్లా సెషన్స్ జడ్జి.
  2. సీనియర్ అసిస్టెంట్ సెషన్స్ జడ్జి.
  3. జూనియర్ సివిల్ జడ్జి.
  4. స్పెషల్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్.

ప్రిన్సిపల్ జిల్లా న్యాయమూర్తే జిల్లా సెషన్స్ జడ్జిగా వ్యవహరించి హత్య, మోటారు వాహనాల చట్ట ఉల్లంఘన కేసులను విచారించి, దోషులకు జీవిత ఖైదు లేదా మరణశిక్ష విధిస్తాడు. అయితే అటువంటి శిక్షలను హైకోర్టు ధృవీకరించాల్సి ఉంటుంది. సీనియర్ అసిస్టెంట్ సెషన్స్ జడ్జి కేసు స్వభావాన్ని బట్టి ఐదు నుండి ఏడు సంవత్సరాల వరకు కారాగార శిక్షను విధించవచ్చు.

AP Inter 2nd Year Civics Study Material Chapter 8 రాష్ట్ర న్యాయశాఖ

జూనియర్ సివిల్ జడ్జి కోర్టు ఏదైనా పట్టణములో ఉన్నట్లయితే ఆ కోర్టు సివిల్ మరియు క్రిమినల్ కోర్టుగా వ్యవహరించి సంబంధిత కేసులను విచారించి మూడు సంవత్సరాలలోపు కారాగార శిక్ష విధించవచ్చు. సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టులు ఐదు వందల రూపాయల వరకు పెనాల్టీని లేదా ఒక సంవత్సరం కారాగార శిక్షను లేక రెండింటిని విధించవచ్చు.

స్పెషల్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ కోర్టును ప్రతి పట్టణములోను ఏర్పాటు చేయవచ్చు. ఇవి చిల్లర (పెట్టీ కేసులను విచారించి ఐదు వందల రూపాయలలోపు జరిమానా, ఆరునెలలోపు కారాగార శిక్షను విధించవచ్చు.

ప్రశ్న 5.
రాష్ట్ర అడ్వకేట్ జనరల్ అధికార విధులను గూర్చి చర్చించండి. [Mar. ’17]
జవాబు:
భారత యూనియన్లో ప్రతి రాష్ట్రంలో ఒక అడ్వకేట్ జనరల్ పదవి ఏర్పాటైంది. ఆ పదవి భారత అటార్నీ జనరల్ పదవిని పోలి ఉంటుంది. అందుచేత రాష్ట్ర అడ్వకేట్ జనరల్ భారత అటార్నీ జనరల్ నిర్వహించే విధులను కలిగి ఉంటాడు. అతడు రాష్ట్రంలో ఉన్నత న్యాయ అధికారిగా వ్యవహరిస్తారు.

నియామకం:
రాజ్యాంగంలోని 165వ ప్రకరణ అనుసరించి రాష్ట్ర అడ్వకేట్ జనరల్ను గవర్నరు నియమిస్తాడు. అడ్వకేట్ జనరల్ నియమించబడే వ్యక్తి ఈ క్రింది అర్హతలను కలిగి ఉండాలి.

  • భారత పౌరుడై ఉండాలి.
  • ఏదైనా న్యాయ వ్యవస్థలో ముఖ్య పదవిలో 10 సంవత్సరముల అనుభవం కలిగి వుండాలి. లేదా ఏదైనా హైకోర్టులో 10 సంవత్సరాల న్యాయవాదిగా పనిచేసియుండాలి.
  • హైకోర్టు న్యాయమూర్తిగా నియమింపబడుటకు కావలసిన అర్హతలను కలిగి ఉండవలెను.

అధికారాలు – విధులు:
రాష్ట్ర ప్రభుత్వ అత్యున్నత న్యాయాధికారి అయిన అడ్వకేట్ జనరల్ క్రింది విధులను నిర్వహిస్తాడు.

  1. గవర్నరు కోరిక మేరకు న్యాయపరమైన అంశాలపై రాష్ట్ర ప్రభుత్వానికి సలహాలిస్తాడు.
  2. న్యాయ సంబంధమైన ఇతర విధులను గవర్నరు కోరిక మేరకు నిర్వర్తిస్తాడు.
  3. రాజ్యాంగం నిర్దేశించిన విధులను నిర్వహిస్తాడు.
  4. తన బాధ్యతల నిర్వహణలో భాగంగా రాష్ట్రంలోని ఏ న్యాయ స్థానంలోనైనా అడ్వకేట్ జనరల్ రాష్ట్ర ప్రభుత్వం తరపున హాజరవుతాడు.
  5. రాష్ట్ర శాసనసభా కార్యక్రమాలలో పాల్గొని మాట్లాడే హక్కు అడ్వకేట్ జనరల్ కు కలదు. అయితే అతడికి సభలో బిల్లులపై ఓటింగ్ లో పాల్గొనే హక్కు మాత్రం లేదు.
  6. రాష్ట్ర శాసనసభ స్థాయీసంఘాల సమావేశాలకు హాజరవుతాడు.

అతి స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
హైకోర్టు జడ్జీల నియామకం. [Mar 17]
జవాబు:
సంబంధిత రాష్ట్ర గవర్నర్, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితో సంప్రదించిన తరువాత భారత రాష్ట్రపతి రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని, ఇతర న్యాయమూర్తులను నియమిస్తాడు. అదేవిధంగా ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తులను నియమించేందుకు సంబంధిత రాష్ట్రాల గవర్నర్లను సంప్రదిస్తాడు.

ప్రశ్న 2.
హైకోర్టు జడ్జీల అర్హతలు.
జవాబు:

  1. భారతీయ పౌరుడై ఉండాలి. [Mar. 16]
  2. భారతదేశంలో కేంద్ర, రాష్ట్ర న్యాయ సర్వీసులలో కనీసం 10 సంవత్సరములు న్యాయాధికారిగా అనుభవం కలిగి ఉండాలి.
  3. రెండు కాని లేదా అంతకన్నా ఎక్కువ హైకోర్టులలో కాని 10 సంవత్సరాలు న్యాయవాదిగా అనుభవం

ప్రశ్న 3.
హైకోర్టు కోర్టు ఆఫ్ రికార్డు.
జవాబు:
రాష్ట్ర హైకోర్టు కోర్టు ఆఫ్ రికార్డుగా వ్యవహరిస్తుంది. వ్యక్తులుకాని, సంస్థలు కానీ కోర్టు ధిక్కారానికి పాల్పడితే, హైకోర్టు వారిని విచారించి శిక్షిస్తుంది. హైకోర్టు ఇచ్చిన తీర్పులు, వెలువరించిన నిర్ణయాలు రికార్డుల రూపంలో భద్రపరుస్తుంది. ఈ రికార్డు దిగువ న్యాయస్థానాలకు మార్గదర్శకంగా పనిచేస్తుంది.

AP Inter 2nd Year Civics Study Material Chapter 8 రాష్ట్ర న్యాయశాఖ

ప్రశ్న 4.
హైకోర్టు సలహా రూపక విధులు.
జవాబు:
హైకోర్టు న్యాయ సంబంధ విషయాలలో గవర్నర్కు సలహాలిస్తుంది. జిల్లా న్యాయమూర్తుల నియమకం, పదోన్నతి, బదిలీలు మొదలగు అంశాలలో కూడా సలహాలిస్తుంది. జిల్లా న్యాయస్థానాలలో జిల్లా జడ్జి మినహా ఇతర పదవులలో ఏర్పడే ఖాళీల భర్తీ విషయంలో రాష్ట్ర పబ్లిక్ సర్వీసు కమీషన్ తోపాటు, హైకోర్టు గవర్నర్కు సలహా ఇస్తుంది.