AP Inter 1st Year Commerce Study Material Chapter 3 వ్యాపార వ్యవస్థ స్వరూపాలు

Andhra Pradesh BIEAP AP Inter 1st Year Commerce Study Material 3rd Lesson వ్యాపార వ్యవస్థ స్వరూపాలు Textbook Questions and Answers.

AP Inter 1st Year Commerce Study Material 3rd Lesson వ్యాపార వ్యవస్థ స్వరూపాలు

వ్యాసరూప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
సొంత వ్యాపారాన్ని నిర్వచించి, దానివలన కలిగే ప్రయోజనాలను, దానికి ఉన్న పరిమితులను చర్చించండి. [A.P. Mar. ’15]
జవాబు:
సొంత యాజమాన్యము, నియంత్రణ కలిగిన వ్యాపార సంస్థను సొంత వ్యాపార సంస్థ అంటారు. ఈ వ్యాపార వస్థలో మూలధనాన్ని ఒక వ్యక్తే సమకూర్చుకొని వ్యాపారానికి అవసరమయ్యే నిధులను స్నేహితుల నుండి, బంధువుల ఒంచి, బ్యాంకు నుంచి అప్పు తీసుకుంటాడు. వ్యాపార నిర్ణయాలు అతడు ఒక్కడే తీసుకుంటాడు. కొనుగోళ్ళు, మొదలైన కార్యకలాపాలన్నీ అతడే నిర్వహించుకొని వచ్చే లాభనష్టాలను అతడే భరిస్తాడు. అవసరమయితే బ సభ్యులను లేదా ఉద్యోగులను నియమిస్తాడు.

తన అభిప్రాయము ప్రకారము “ఎవరైతే వ్యాపార బాధ్యతను మోస్తారో, ఎవరైతే కార్యకలాపాలు నిర్వహిస్తారో, నష్టభం ఎవరైతే స్వీకరిస్తారో, ఆ వ్యక్తి నడిపే సంస్థ సొంతవ్యాపారము”.

జేమ్స్ స్టీఫెన్సన్ అభిప్రాయము ప్రకారము “సొంత వ్యాపారాన్ని ఒక వ్యక్తి తన సొంత నిధులు, నిర్వహణా సామర్థ్యముతో నిర్వహిస్తాడు. ఈ వ్యాపారానికి సంబంధించిన జయాపజయాలకు అతడే బాధ్యత వహించవలసి ఉంటుంది”.

ప్రయోజనాలు:
1. సులభముగా స్థాపించుట: సొంత వ్యాపార సంస్థను స్థాపించడానికి చట్టబద్ధమైన లాంఛనాలు ఉండవు కాబట్టి దీనిని సత్వరము ప్రారంభించవచ్చును. రద్దుపరుచుట కూడా తేలిక.

2. శీఘ్ర నిర్ణయాలు: వ్యాపార నిర్ణయాలు తీసుకోవడములో జాప్యము ఉండరాదు. ఆలస్యము వలన అవాంఛనీయమైన పరిస్థితులు ఏర్పడవచ్చు. సొంతవ్యాపారి తనకుతానే యజమాని, ఇతరులతో సంప్రదించవలసిన పనిలేదు. కాబట్టి వ్యాపార నిర్ణయాలు శీఘ్రముగా తీసుకోవచ్చు.

AP Inter 1st Year Commerce Study Material Chapter 3 వ్యాపార వ్యవస్థ స్వరూపాలు

3. వ్యక్తిగత శ్రద్ధాసక్తులు: వ్యాపారములో లభించే లాభమంతా సొంతవ్యాపారికి చెందుతుంది. అంతేగాక అతని ఋణబాధ్యత కూడా అపరిమితము. అందుచేత వ్యాపార కార్యకలాపాలలో అతనికి శ్రద్ధాసక్తులు ఉంటాయి. తన ప్రత్యక్ష పర్యవేక్షణలో వ్యవహారాలను సమర్థవంతముగా, ఆదాయపూర్వకముగా నడపవచ్చు.

4. మార్పులకు సౌలభ్యము: అవసరాలను బట్టి సంస్థను ఒక చోటు నుంచి మరొక చోటుకు మార్చవచ్చును లేదా వ్యాపార స్వభావాన్ని మార్చవచ్చును. దీనికి చట్టబద్దమైన ప్రతిబంధకాలు ఉండవు.

5. వ్యాపార రహస్యాలు: వ్యాపార సుస్థిరతకు, విజయానికి కొన్ని మెళుకువలు, కిటుకులు ఉంటాయి. వీటిని వ్యాపార రహస్యాలు అంటారు. సొంత వ్యాపారి ఒకడే కాబట్టి వ్యాపార రహస్యాలు బయటకు పొక్కవు. అంతేగాక లాభనష్టాలను ప్రచురించవలసిన అవసరములేదు.

6. వ్యక్తిగత సంబంధము: వ్యాపారము అభివృద్ధి చెందడానికి ఖాతాదారులతో మైత్రి అవసరము. సొంతవ్యాపారములో యజమానే అన్ని వ్యవహారములు స్వయముగా చూసుకుంటాడు. కాబట్టి ఖాతాదారుల మన్ననలను చూరగొంటాడు. ఖాతాదారులతో మైత్రిని ఏర్పరచుకొని, వారి అవసరాలకు అనుగుణముగా తన వ్యాపారములో మార్పులను చేయవచ్చు.

పరిమితులు:
1. పరిమిత నిధులు: సొంతవ్యాపారి ఆర్థికస్థోమత పరిమితముగా ఉండటము వలన అవసరమైనప్పుడు నిధులను సమకూర్చుకొనలేడు. కాబట్టి వ్యాపారాన్ని విస్తృతపరుచుట కష్టము.

2. అనిశ్చిత మనుగడ: న్యాయశాస్త్ర దృష్టిలో సొంతవ్యాపారము సొంతవ్యాపారి వేరుకాదు. కాబట్టి వ్యాపారములో అనుకోని పరిస్థితులు ఏర్పడి అతడు మరణించినా, దివాలా తీసినా సంస్థ మూతపడుతుంది.

3. అపరిమిత ఋణబాధ్యత: సొంతవ్యాపారి యొక్క ఋణబాధ్యత అపరిమితము. వ్యాపారములో నష్టాలు ఎక్కువగా వచ్చి అప్పులపాలయితే, అప్పులను తీర్చడానికి వ్యాపార ఆస్తులు చాలకపోతే, సొంత ఆస్తులను అమ్మి అప్పులను తీర్చవలెను. అందువలన సొంత ఆస్తులకు రక్షణ లేదు.

4. భారీతరహా కార్యకలాపాలకు అనువుగా ఉండదు: పరిమిత వనరులు, నిర్వహణా సామర్థ్యము వలన సొంతవ్యాపారము భారీ తరహా వ్యాపారాలకు అనువుగా ఉండదు.

5. పరిమిత నిర్వహణా సామర్థ్యము: వ్యాపారములో కొనుగోళ్ళు, అమ్మకాలు, ఆర్థిక వ్యవహారాలు మొదలైన అనేక విధులు ఉంటాయి. వీటన్నింటిని చూసుకొనే శక్తియుక్తులు, అనుభవము సొంతవ్యాపారికి ఉండకపోవచ్చు. నిపుణులను నియమించుటకు నిధులు సరిపోవు.

ప్రశ్న 2.
“అన్ని విషయాలను నిర్వహించుకోగల శక్తిమంతుడై ఉండాలేగాని, ప్రపంచములో సొంతవ్యాపారానికి మించినది మరొకటి లేదు” – వివరించండి.
జవాబు:
సొంతవ్యాపారము నాగరికత పుట్టినప్పటి నుంచి అమలులో ఉన్నది. ఇది అతిపురాతనమైనది. చరిత్రగతిని పరిశీలిస్తే వాణిజ్యము సొంత వ్యాపారముతోనే ఆరంభమైనట్లు కనిపిస్తున్నది. అన్ని దేశాలలోనూ ఈ రకం వ్యాపారమే అధికముగా ఉన్నట్లు గోచరిస్తున్నది. ఎవరైనా వ్యాపారము ప్రారంభించదలిస్తే మొదట కొద్దిపాటి మూలధనముతో సొంతవ్యాపారము ప్రారంభించి, అనుభవము గడించి క్రమేణ అభివృద్ధి చేసుకుంటూ ఉంటారు. చిన్నకార్లను తయారుచేసే ప్రఖ్యాతిచెందిన ఫోర్డు కంపెనీ ఒకనాడు సొంతవ్యాపారముగా స్థాపితమై, తరువాత అభివృద్ధి చెందినదే. ఈ రకముగా సొంతవ్యాపార సంస్థ అత్యంత ముఖ్యమైనది.

AP Inter 1st Year Commerce Study Material Chapter 3 వ్యాపార వ్యవస్థ స్వరూపాలు

ఒక వ్యక్తి యాజమాన్యము, నియంత్రణ కలిగి ఉండే వ్యాపార సంస్థను సొంతవ్యాపార సంస్థ అంటారు. వ్యాపారానికి కావలసిన మూలధనాన్ని అతడు ఒక్కడే సమకూర్చుకొని వ్యాపారానికి కావలసినవన్నీ ఏర్పాటుచేసుకుంటాడు. వ్యాపార నిర్ణయాలు తానొక్కడే తీసుకుంటాడు. తన కుటుంబసభ్యుల సహకారముతో లేదా ఉద్యోగులను నియమించుకొని తానే స్వయముగా వ్యాపారాన్ని నిర్వహించుకుంటాడు. సంస్థకు కావలసిన నిధులను అవసరమైతే తన బంధువులు, స్నేహితులు లేదా బ్యాంకుల నుంచి అప్పులు తెస్తాడు. కొనుగోళ్ళు, అమ్మకాలు మొదలగు వ్యాపార కార్యకలాపాలన్నీ తానే స్వయముగా నిర్వహించుకుంటూ మిక్కిలి పొదుపుతో అధిక లాభాలను పొందడానికి ప్రయత్నిస్తాడు. లాభాలను తానొక్కడే అనుభవిస్తాడు, కాబట్టి ఎక్కువ లాభాల కోసము అహర్నిశలు శ్రమిస్తాడు. తన పొరపాట్ల వలన సంస్థకు నష్టము వస్తే తానే భరించాలి కాబట్టి మిక్కిలి జాగురూకతతో నిర్వహణా బాధ్యతను చేపడతాడు. ఈ విధముగా ‘అన్నీ తానే, తనకే అన్నీ’ అనే తరహాలో సొంతవ్యాపారము నడుస్తుంది.

వ్యాపార రథానికి సారథిగా, వ్యాపార విజయానికి నాయకుడిగా నిలబడాలి అంటే సొంతవ్యాపారికి దూరదృష్టి, చొరవ, సరైన నిర్ణయాలు తీసుకునే శక్తి, వ్యాపార దక్షత, సామర్థ్యము, ఓర్పు, చిత్తశుద్ధి, ఆత్మవిశ్వాసము, లౌక్యము మొదలైన లక్షణాలు కలిగి ఉండవలెను.

ఈ విధముగా పైవిషయాలన్నీ నిర్వహించగల శక్తిమంతుడై వ్యాపారస్తుడు ఉన్నయెడల సొంతవ్యాపారానికి మించినది మరొకటి లేదు. అతడు స్వేచ్ఛగా, హాయిగా వ్యాపారము చేసుకుంటూ తాను సాధించదలచిన వ్యాపార విజయాన్ని, సంతృప్తిని పొందుతాడు.

స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
సొంత వ్యాపారము అంటే ఏమిటి ?
జవాబు:
ఒక వ్యక్తి యాజమాన్యము, నియంత్రణ కలిగి ఉండే వ్యాపార సంస్థను సొంత వ్యాపార సంస్థ అంటారు. వ్యాపారానికి కావలసిన మూలధనాన్ని అతడే సమకూర్చుకొని వ్యాపారానికి కావలసిన ఏర్పాట్లు అతడే చేసుకుంటాడు. వ్యాపార నిర్ణయాలు అతడు ఒక్కడే తీసుకుంటాడు. తన కుటుంబసభ్యుల సహకారముతో లేదా ఉద్యోగులను నియమించుకొని తానే స్వయముగా వ్యాపారాన్ని నిర్వహిస్తాడు. సంస్థకు కావలసిన నిధులను అవసరమయితే తన బంధువులు, స్నేహితులు లేదా బ్యాంకుల నుంచి అప్పులు తెస్తాడు. కొనుగోళ్ళు, అమ్మకాలు మొదలగు వ్యాపార కార్యకలాపాలన్నీ తానే స్వయముగా నిర్వహించుకుంటూ మిక్కిలి పొదుపుతో అధిక లాభాలను పొందడానికి ప్రయత్నిస్తాడు. లాభాలను తానొక్కడే అనుభవిస్తాడు, కాబట్టి ఎక్కువ లాభాల కోసము అహర్నిశలు శ్రమిస్తాడు. తన పొరపాట్ల వలన సంస్థకు నష్టమువస్తే తానే భరించాలి కాబట్టి మిక్కిలి జాగురూకతతో నిర్వహణా బాధ్యతను చేపడతాడు. ఈ విధముగా ‘అన్నీ తానే, తనకే అన్నీ’ అనే తరహాలో సొంతవ్యాపారము నడుస్తుంది.

ప్రశ్న 2.
సొంత వ్యాపారము లక్షణాలను వివరించండి.
జవాబు:
సొంత వ్యాపార సంస్థ లక్షణాలు:

  1. ఒకే యజమాని: సొంత వ్యాపారములో ఒకే యజమాని ఉండి, వ్యాపారానికి కావలసిన నిధులను అతడే సమకూర్చుకుంటాడు.
  2. యాజమాన్యానికి, నిర్వహణకు పొత్తు: సొంతవ్యాపారములో ఒకడే తన తెలివితేటలు, నైపుణ్యముతో వ్యాపారాన్ని నిర్వహిస్తాడు. కంపెనీల వలెకాక యాజమాన్యము, నిర్వహణ సొంతవ్యాపారి చేతిలో ఉంటుంది.
  3. చట్టబద్ధమైన లాంఛనాలు తక్కువ: సొంతవ్యాపార సంస్థ స్థాపనకు, నిర్వహణకు చట్టబద్ధమైన లాంఛనాలు తక్కువ. దీనిని స్థాపించుట తేలిక.
  4. ప్రత్యేక అస్థిత్వము ఉండదు: చట్టము దృష్టిలో సొంతవ్యాపారి, సొంతవ్యాపార సంస్థ ఒక్కటే. వ్యాపారములో జరిగే అన్ని విషయాలకు అతడే బాధ్యతను స్వీకరించాలి:
  5. లాభనష్టాలలో వేరేవారికి వాటా లేకపోవడం: లాభాలన్నీ సొంత వ్యాపారే అనుభవిస్తాడు. నష్టాలన్నీ అతడే భరించవలెను. లాభనష్టాలలో వేరేవారికి వాటా ఉండదు.
  6. అపరిమిత ఋణబాధ్యత: సొంతవ్యాపారి ఋణబాధ్యత అపరిమితము. నష్టము వచ్చినప్పుడు వ్యాపార అప్పులను తీర్చడానికి వ్యాపార ఆస్తులు సరిపోకపోతే సొంత ఆస్తుల నుంచీ అప్పులను చెల్లించవలెను.
  7. ఏకవ్యక్తి నియంత్రణ: సొంతవ్యాపారములో నియంత్రణ యజమాని చేతిలో ఉంటుంది. అతడు తన ఇష్టానుసారము. వ్యాపారాన్ని నిర్వహించవచ్చును.

AP Inter 1st Year Commerce Study Material Chapter 3 వ్యాపార వ్యవస్థ స్వరూపాలు

ప్రశ్న 3.
సొంత వ్యాపారి పరిమితులను వివరించండి.
జవాబు:
సొంత వ్యాపారము పరిమితులు:

  1. పరిమితమైన నిధులు: సొంతవ్యాపారి ఆర్థికస్థోమత పరిమితముగా ఉండుటవలన అవసరమైనప్పుడు నిధులను సమకూర్చుకొనలేడు. కాబట్టి వ్యాపారాన్ని విస్తృతపరచడము కష్టము.
  2. అనిశ్చిత మనుగడ: న్యాయశాస్త్ర దృష్టిలో సొంతవ్యాపార సంస్థ, సొంతవ్యాపారి వేరుకాదు. కాబట్టి వ్యాపారములో అనుకోని పరిస్థితులు ఏర్పడి అతడు మరణించినా, దివాలా తీసినా సంస్థ మూతపడుతుంది.
  3. అపరిమిత ఋణబాధ్యత: సొంతవ్యాపారి యొక్క ఋణబాధ్యత అపరిమితము. వ్యాపారములో నష్టాలు ఎక్కువగా వచ్చి, అప్పులపాలైతే, అప్పులను తీర్చడానికి వ్యాపార ఆస్తులు చాలకపోతే సొంత ఆస్తులను అమ్మి, అప్పులను తీర్చవలెను. అందువలన సొంత ఆస్తులకు రక్షణ లేదు.
  4. భారీ వ్యాపారానికి అనువుగా లేకపోవడం: పరిమిత వనరులు, పరిమిత నిర్వహణా సామర్థ్యము వలన సొంతవ్యాపారి భారీ తరహా వ్యాపారము చేయలేడు.
  5. పరిమిత నిర్వహణా సామర్ధ్యము.: వ్యాపారములో కొనుగోళ్ళు, అమ్మకాలు, ఆర్థిక వ్యవహారాలు మొదలైన అనేక విధులు ఉంటాయి. సొంతవ్యాపారికి అన్నింటిలోనూ ప్రావీణ్యము, అనుభవము ఉండకపోవచ్చు. నిపుణులను నియమించడానికి నిధులు సరిపోవు.