AP Inter 1st Year History Notes Chapter 10 క్రీ.శ. 10వ శతాబ్దం నుంచి 19వ శతాబ్దం వరకు దక్కన్, దక్షిణ భారతదేశ చరిత్ర

Students can go through AP Inter 1st Year History Notes 10th Lesson క్రీ.శ. 10వ శతాబ్దం నుంచి 19వ శతాబ్దం వరకు దక్కన్, దక్షిణ భారతదేశ చరిత్ర will help students in revising the entire concepts quickly.

AP Inter 1st Year History Notes 10th Lesson క్రీ.శ. 10వ శతాబ్దం నుంచి 19వ శతాబ్దం వరకు దక్కన్, దక్షిణ భారతదేశ చరిత్ర

→ క్రీ.శ 10వ శతాబ్దం నుంచి క్రీ.శ. 19వ శతాబ్దం మధ్యకాలంలో దక్కన్ దక్షిణాపథాన్ని కాకతీయ, విజయనగర, బహమనీ కుతుబ్షాహి, ఆసఫ్జాహి పాలకులు పాలించారు.

→ మధ్యయుగంలో ఆంధ్రదేశాన్ని పరిపాలించిన కాకతీయుల పరిపాలనా కాలానికి ఎంతో చారిత్రక ప్రాముఖ్యత ఉంది.

→ హనుమకొండ వేయిస్తంభాల గుడి శాసనము రుద్రమదేవుని పాలనా విశేషాలను వివరిస్తుంది.

→ కాకతీయ వంశ పాలకుల్లో గణపతిదేవుడు అత్యంత శక్తిసామర్థ్యాలు గల పరాక్రమవంతుడు.

→ మధ్యయుగ ఆంధ్రప్రదేశ్ చరిత్రలో రుద్రమదేవి సింహాసనం అధిష్ఠించడం ఒక ప్రధాన ఘట్టం.

→ హరిహర బుక్కరాయలు 1336 సం॥లో విజయనగర రాజ్యస్థాపన చేసినారు.

AP Inter 1st Year History Notes Chapter 10 క్రీ.శ. 10వ శతాబ్దం నుంచి 19వ శతాబ్దం వరకు దక్కన్, దక్షిణ భారతదేశ చరిత్ర

→ శ్రీకృష్ణదేవరాయలు తుళువ వంశ చక్రవర్తుల్లోనే కాక విజయనగర రాజ్యాన్ని పాలించిన చక్రవర్తులందరిలో కెల్లా గొప్పవాడు.

→ శ్రీకృష్ణదేవరాయలు సాధించిన సైనిక విజయాలను “ఆముక్తమాల్యద” వివరిస్తుంది.

→ 1347 సం॥లో అల్లావుద్దీన్హాసన్ – గంగ్ బహమనీ రాజ్యాన్ని స్థాపించాడు. దీని రాజధాని గుల్బార్గా.

→ గోల్కొండ రాజధానిగా స్వతంత్ర కుతుబ్షాహీ వంశాధికారాన్ని క్రీ.శ 1512లో సుల్తాన్ కులీ – కుతుబ్-ఉల్-ముల్క్ స్థాపించాడు.