AP Inter 1st Year History Notes Chapter 9 భక్తి, సూఫీ సంప్రదాయాలు (క్రీ.శ. 8 – 16 శతాబ్ధాలు)

Students can go through AP Inter 1st Year History Notes 9th Lesson భక్తి, సూఫీ సంప్రదాయాలు (క్రీ.శ. 8 – 16 శతాబ్ధాలు) will help students in revising the entire concepts quickly.

AP Inter 1st Year History Notes 9th Lesson భక్తి, సూఫీ సంప్రదాయాలు (క్రీ.శ. 8 – 16 శతాబ్ధాలు)

→ ప్రాచీన కాలం నుండి భారతదేశం వివిధ మత విశ్వాసాలకు, ఉద్యమాలకు కేంద్ర బిందువు అయింది.

→ అత్యంత భక్తి శ్రద్ధలతో మోక్షసాధనకై చేసే దైవపూజనే భక్తి అంటారు.

→ ఉత్తర, దక్షిణ భారతదేశ భక్తి ఉద్యమకారులు జ్ఞానం పొందడం భక్తిలో భాగంగా చెప్పారు.

→ మధ్యమ భారతదేశంలో భక్తి ఉద్యమంలాగానే సూఫీ ఉద్యమం కూడా హిందూ ముస్లింలను ఒకే వేదికపైకి తేవడానికి ప్రయత్నించింది.

→ భక్తి, సూఫీ సన్యాసులు తమ నిరాడంబర జీవితం, పవిత్రమైన వ్యక్తిత్వం ద్వారా పరస్పరం ప్రభావితులయ్యారు అని ప్రముఖ చరిత్రకారులు అభిప్రాయపడ్డారు.