Students can go through AP Inter 1st Year History Notes 2nd Lesson ప్రాచీన నాగరికత – సంస్కృతులు will help students in revising the entire concepts quickly.
AP Inter 1st Year History Notes 2nd Lesson ప్రాచీన నాగరికత – సంస్కృతులు
→ ప్రాచీన భారతదేశ చరిత్ర క్రీ.పూ. 4,00,000 – 2,00,000 ల సంవత్సరాల శిలాయుగానికి విస్తరించింది.
→ ప్రాచీన శిలాయుగంలో మానవుడు ఉపయోగించిన పనిముట్లు రాజస్థాన్, గుజరాత్, బీహార్, దక్షిణ భారతదేశాల్లో లభించాయి.
→ కుల్లీ సంస్కృతి ప్రజలు. చిన్నచిన్న రాతిపెట్టెలను చేసి పైన రేఖలతో అలంకరించేవారు.
→ క్రీ.శ. 1921వ సంవత్సరములో మొదటిసారిగా పాకిస్థాన్ లోని పశ్చిమ పంజాబ్లో గల హరప్పా ప్రాంతంలో హరప్పా నాగరికత కనుగొన్నారు.
→ పాకిస్థాన్లోని పంజాబ్లో ఉన్న హరప్పా, సింధూలోని మొహంజోదారోలు రెండూ ప్రధానమైన నగరాలు.
→ హరప్పా లిపిని తొలిసారిగా క్రీ.శ. 1853లో కనుగొన్నారు.
→ సింధూ ప్రజల్లో నాలుగు జాతులు ఉండేవి.
→ హరప్పా ప్రజలు వ్యవసాయాన్ని చేసినప్పటికీ అధికంగా జంతువులను కూడా పోషించారు.
→ హరప్పా ప్రజలు కుమ్మని చక్రాన్ని ఉపయోగించడంలో సిద్ధహస్తులు.
→ క్రీ.శ. 1953వ సంవత్సరంలో సర్ మార్టిమర్ వీలర్ హరప్పా నాగరికత పతనానికి ఆర్యుల దండయాత్రలే కారణం అని కనుగొన్నాడు.
→ ఆర్యులు భారతదేశానికి రావడంతో వేదకాలం ప్రారంభమైనది.
→ ఆర్యులు అనే పదం ‘ఆర్య’ అనే సంస్కృత పదం నుండి ఉద్భవించింది.
→ వేద అనే పదమునకు జ్ఞానం అని అర్థం.
→ వేదాలు నాలుగు అవి.
- ఋగ్వేదం
- యజుర్వేదం
- సామవేదం
- అధర్వణ వేదం
→ తొలి ఆర్యులు ఏడు నదుల ప్రాంతమైన ‘సప్తసింధు’ ప్రాంతంలో నివసించారు.