AP Inter 1st Year Physics Notes Chapter 1 భౌతిక ప్రపంచం

Students can go through AP Inter 1st Year Physics Notes 1st Lesson భౌతిక ప్రపంచం will help students in revising the entire concepts quickly.

AP Inter 1st Year Physics Notes 1st Lesson భౌతిక ప్రపంచం

→ భౌతికశాస్త్రం ప్రకృతిలోని మూలనియమాలు, విభిన్న దృగ్విషయాలలో ప్రత్యక్షమయ్యే వాటి స్వయం వ్యక్తీకరణల అధ్యయనం.

→ ప్రకృతిలోని ప్రాథమిక బలాలు

  • గురుత్వాకర్షణ బలం
  • విద్యుదయస్కాంత బలం
  • ప్రబల కేంద్రకబలం
  • దుర్బల కేంద్రకబలం

→ రామన్ ఫలితం అనేది యానకంలోని అణువుల కంపనశక్తి స్థాయిల్లోకి ఉత్తేజితమైనప్పుడు జరిగే కాంతి పరిక్షేపణం గురించి వివరిస్తుంది.

→ శక్తి, ద్రవ్యవేగం, కోణీయ ద్రవ్యవేగం, ఆవేశం వంటి వాటి నిత్యత్వాలను భౌతికశాస్త్రంలో ప్రాథమిక నియమాలుగా పరిగణిస్తారు.

→ పరిశీలనలు, ప్రయోగాల ఆధారంగా ఏర్పడే ఒక పరికల్పనయే ఒక నిత్యత్వ నియమం.

AP Inter 1st Year Physics Notes Chapter 1 భౌతిక ప్రపంచం

→ ఐన్స్టీన్ సిద్ధాంతం ప్రకారం, ద్రవ్యరాశి m మరియు శక్తి E మధ్య సంబంధం E = mC2. ఇక్కడ C అనునది శూన్యంలో కాంతి వేగం.

→ దృశా తంతువులు కాంతి సంపూర్ణాంత పరావర్తనం అనే నియమంపై పనిచేస్తాయి.

→ రాకెట్ చోదనం, న్యూటన్ గమన నియమాలపై పనిచేస్తుంది.

→ విమానం బెర్నూలీ సూత్రంపై ఆధారపడి పనిచేస్తుంది.

→ ఎలక్ట్రాన్ సూక్ష్మదర్శిని ఎలక్ట్రాన్ల తరంగ స్వభావంపై ఆధారపడి పనిచేస్తుంది.

→ సత్యేంద్రనాధ్ బోస్ (1874-1974):
బోస్ 20వ శతాబ్దంలోని విజ్ఞానశాస్త్రం పురోగతికి ప్రాథమిక కృషిచేసిన గొప్ప భారతీయ శాస్త్రజ్ఞులలో ఒకరు