AP Inter 1st Year Physics Notes Chapter 2 ప్రమాణాలు, కొలత

Students can go through AP Inter 1st Year Physics Notes 2nd Lesson ప్రమాణాలు, కొలత will help students in revising the entire concepts quickly.

AP Inter 1st Year Physics Notes 2nd Lesson ప్రమాణాలు, కొలత

→ aTrue = నిజ విలువ = \(\frac{1}{n} \sum_{i=1}^n a_i\)

→ సాపేక్ష దోషం
AP Inter 1st Year Physics Notes Chapter 2 ప్రమాణాలు, కొలత 1

→ దోష శాతం = δa
AP Inter 1st Year Physics Notes Chapter 2 ప్రమాణాలు, కొలత 2

→ గుణకారంలో దోషం
\(\frac{\Delta x}{x}=\frac{\Delta a}{a}+\frac{\Delta b}{b}\)

→ భాగాహారంలో దోషం
\(\frac{\Delta x}{x}=\frac{\Delta a}{a}+\frac{\Delta b}{b}\)

→ x = an లో గరిష్ఠ దోషం
x = an లో గరిష్ఠ దోషం = \(\frac{\Delta \mathrm{x}}{\mathrm{x}}=n\left(\frac{\Delta \mathrm{a}}{\mathrm{a}^a}\right)\)

→ భౌతికశాస్త్రంలో కొలత అనేది ముఖ్యంగా భౌతిక రాశులను యదార్ధతతోను ఖచ్ఛితత్వంతోను నిర్ణయించడం మీద ఆధారపడి ఉంటుంది.

→ ఏ భౌతికరాశికి సంబంధించినదైనా ప్రతి కొలతలోను కొంత అనిశ్చితత్వం ఉంటుంది. ఈ అనిశ్చితత్వాన్నే మనం దోషం అంటాం.

AP Inter 1st Year Physics Notes Chapter 2 ప్రమాణాలు, కొలత

→ విస్తృత పరిధిలో విభజించినపుడు దోషాలను క్రమదోషాలు, యాదృచ్ఛిక దోషాలు అని రెండు రకాలుగా విభజిస్తాం.

→ క్రమ దోషాలను మరల పరిసర సంబంధిత దోషాలు, ప్రయోగవిధాన కౌశలం లేదా ప్రయోగ పద్ధతిలోని అసమగ్రతలకు సంబంధించిన దోషాలుగా విభజిస్తాం.

→ క్రమ దోషాలు (systematic errors) వివిధ రకాలు.

  • ప్రయోగ విధాన కౌశలం లేదా ప్రయోగ పద్ధతిలోని అసమగ్రత
  • పరిసర సంబంధిత దోషాలు
  • వ్యక్తిగత దోషాలు.

→ యాదృచ్ఛిక దోషాలను కనుక తొలగించగలిగితే ఆ కొలతలను ఖచ్చితమైన కొలతలు అనవచ్చు. అన్ని రకాలైన దోషాలను తొలగించగలిగితే ఆ కొలతను యథార్థమైన కొలత అని అనవచ్చును.

→ రెండు రాశులను కూడినపుడు గాని, తీసివేసినపుడు గాని వచ్చే ఫలితంలో వచ్చే గరిష్ఠ దోషం ఆ రెండు రాశులలోని పరమదోషాల యొక్క మొత్తానికి సమానం.

→ రెండు రాశులను గుణించినపుడు గాని లేదా భాగించినపుడు గాని, వచ్చే ఫలితంలోని సాపేక్ష దోషం అంశ రాశులలోని సాపేక్ష దోషాల మొత్తానికి సమానం.

→ ఒక కొలతను సూచించే సంఖ్యలో నిశ్చయంగా తెలిసిన అంకెలు, వీటికి తోడు అదనంగా అంచనా ప్రకారం చేర్చిన అంకె వీటినన్నింటిని కలిపి సార్థక అంకెలు లేదా సార్థక సంఖ్యలు అంటారు.

→ సార్థకం కానటువంటి అంకెలను వదిలిపెట్టి, కావలసిన సార్థక సంఖ్యల వరకు మాత్రమే పరిమితం అవుతూ, చివరి సార్థక అంకెకు అవసరమైన మార్పులను చేయడమే ఆ సంఖ్యను సవరించడం (Rounding off) అంటారు.

→ భౌతికరాశులను అన్నింటిని, ప్రాథమిక భౌతికరాశులు అని పిలువబడే కొన్ని కనిష్ఠ సంఖ్యలో ఉండే భౌతిక రాశుల నుంచి ఉత్పాదించవచ్చు.

→ ప్రమాణం అనేది ఒక భౌతికరాశిని నిర్దేశించే ప్రామాణిక నిర్దేశం. భౌతికరాశి యొక్క కొలతను ఈ ప్రమాణాలలో తెలియజేస్తారు.

→ ప్రాథమిక భౌతికరాశుల ప్రమాణాలను ప్రాథమిక ప్రమాణాలు అంటారు.

→ ఉత్పన్న భౌతికరాశుల యొక్క ప్రమాణాలను ఉత్పన్న ప్రమాణాలు అంటారు.

→ (అంతర్జాతీయ ప్రమాణ వ్యవస్థ) SIలో ఏడు ప్రాథమిక రాశులు, ఈ ఏడు ప్రాథమిక రాశులకు అనురూపంగా ఏడు ప్రాథమిక ప్రమాణాలు ఉన్నాయి. సమతల కోణం (ప్రమాణం రేడియన్) మరియు ఘనకోణం (ప్రమాణం స్టెరేడియన్)లను SI లో సంపూరక ప్రాథమిక రాశులుగా తీసుకున్నారు.

→ ఏదయినా ఒక ప్రాథమిక భౌతికరాశికి సంబంధించిన ప్రామాణికమయిన ప్రమాణంను దాని యొక్క రెండు ముఖ్య లక్షణాల మీద ఆధారపడి, అంతర్జాతీయ ఆమోదాన్ని అనుసరించి ఎన్నుకుంటారు.

AP Inter 1st Year Physics Notes Chapter 2 ప్రమాణాలు, కొలత

→ కావలసిన ఆ ముఖ్య లక్షణాలు

  • ఆధారపడతగినదిగా ఉండటం (reliability)
  • సులువుగా దొరకటం (availability).

→ ప్రాథమిక భౌతికరాశులను ఇంగ్లీషు అక్షరాలతో ఈ క్రింది విధంగా సూచిస్తారు. పొడవు (Length) – L, ద్రవ్యరాశి (Mass) – M, కాలం (Time) -T, విద్యుత్ ప్రవాహం (Current) – 1 (లేక A), పదార్థ రాశి (Mole) – mol, ఉష్ణోగ్రత (temperature) – K, కాంతి తీవ్రత (luminous intensity (candela)) – cd.

→ ఒక భౌతికరాశిని నిర్దేశించడానికి, అందులో ప్రాథమిక భౌతికరాశులు (M, L, T, అక్షరాలతో సూచింపబడినవి) ఏ ఘాతాంకాలకు హెచ్చింపబడినవో ఆ ఘాతాంకాలను (ఆ భౌతికరాశిలో) ఆయా ప్రాథమిక భౌతికరాశుల మితులు అంటారు.

→ ఇచ్చిన భౌతికరాశిలో ఏయే ప్రాథమిక భౌతికరాశులు, ఏయే ఘాతాంకములను కలిగి ఉన్నాయో తెలియజేసే ప్రకటనను ఆ భౌతికరాశికి సంబంధించిన మితిఫార్ములా అంటారు.

→ మితులు మరియు మితుల యొక్క సజాతీయత సూత్రం ఉపయోగించి మనం ఇచ్చిన సమీకరణాలు సరైనవో, కావో తెలుసుకోవచ్చు. ఒక వ్యవస్థలోని ప్రమాణాలను లేదా వ్యవస్థలోని ప్రమాణాలకు మార్చవచ్చు.

→ మితి విశ్లేషణా పద్ధతికి కొన్ని పరిమితులున్నాయి. అవి :

  • మితి రహిత స్థిరాంకాలను తెలుసుకోలేము. ఇచ్చిన సమీకరణం మితిపరంగా సక్రమమయినదో, లేదో మాత్రమే తెలుసుకోగలము. అది నిజంగా సరియైనదో, కాదో నిర్ధారించలేము.
  • పూర్తిగా భిన్నమయిన రెండు భౌతికరాశులు ఒకే మితులను కలిగియుండవచ్చు. ఇట్లాంటి సందర్భంలో మితి పద్ధతిని ఆ రాశులలో తేడా గమనించలేము.

→ మనం కొలిచే భౌతికరాశి నిజమైన విలువకు ఎంత దగ్గరగా ఉన్నది తెలియజేసే ఒక కొలమానమే మనం తీసుకున్న కొలత యొక్క యదార్థత.

→ భూమి నుంచి గ్రహం (లేదా) నక్షత్రం దూరాన్ని నేరుగా కొలవలేం. అలాంటి సందర్భాల్లో ఉపయోగించే ముఖ్యమైన పద్ధతి దృష్టి విక్షేప పద్ధతి.

→ ఒక మాపనపరికరంతో కొలవగలిగే అత్యల్పవిలువను కనీస కొలత అంటారు.

AP Inter 1st Year Physics Notes Chapter 2 ప్రమాణాలు, కొలత

→ వెర్నియర్ కాలిపర్స్ ఉపయోగించి పొడవును 10 m యధార్థతతో కొలవవచ్చు.

→ స్పెరామీటరును మరియు స్క్రూగేజిని ఉపయోగించి 10 m కన్నా తక్కువ పొడవులను కొలవవచ్చు.

→ 1n° = 10-10m = 108m

→ 1 కాంతి సంవత్సరం
= 9.46 × 10-15 m
1 పార్సెక్ 3.08 × 1016m

→ 1 ఏకీకృత పరమాణు ద్రవ్యరాశి ప్రమాణం = 1.66 × 10-27 kg.

→ 1 ఫెర్మీ = 10-15 m.