Students can go through AP Inter 1st Year Physics Notes 14th Lesson అణుచలన సిద్ధాంతం will help students in revising the entire concepts quickly.
AP Inter 1st Year Physics Notes 14th Lesson అణుచలన సిద్ధాంతం
→ ఒక అణువు రెండు వరుస అభిఘాతాల మధ్య సరళరేఖలో చలిస్తుంది. రెండు వరుస అభిఘాతాల మధ్య అణువు ప్రయాణం చేసిన దూరంను స్వేచ్ఛాపథ మధ్యమం అంటారు.
→ స్థిర ఉష్ణోగ్రత వద్ద, నియమిత ద్రవ్యరాశి గల వాయువు యొక్క ఘనపరిమాణం, దాని పీడనంనకు విలోమానుపాతంలో ఉండును.
V ∝ \(\frac{1}{p}\) (స్థిర ఉష్ణోగ్రత వద్ద)
→ చార్లెస్ నియమాలు :
- స్థిర పీడనం వద్ద, నియమిత ద్రవ్యరాశి గల వాయువు ఘనపరిమాణం, దాని పరమ ఉష్ణోగ్రతకు అనులోమానుపాతంలో ఉండును.
- స్థిర ఘనపరిమాణం వద్ద, నియమిత ద్రవ్యరాశి గల వాయు పీడనం, దాని పరమ ఉష్ణోగ్రతకు అనులోమానుపాతంలో ఉండును.
→ ఆదర్శ వాయువుల మిశ్రమం మొత్తం పీడనం, ఆ మిశ్రమంలోని వివిధ వాయువులు కలుగజేసే పాక్షిక పీడనాల మొత్తానికి సమానం. దీనినే డాల్టన్ పాక్షిక పీడనాల నియమం అంటారు.
→ వాయు అణువుల సగటు వేగ వర్గాల మొత్తం యొక్క వర్గమూలంను సగటువర్గ మధ్యమ మూలవడి (rms) అంటారు.
Vrms = \(\sqrt{\frac{3 K_B T}{m}}\)
→ జాన్ డాల్టన్ (1766-1844):
ఇతను ఇంగ్లీష్ రసాయన శాస్త్రజ్ఞుడు. వివిధ రకాల పరమాణువులు సంయోగం చెందినప్పుడు, అవి నిర్దుష్ట సరళ నియమాలను పాటిస్తాయి. డాల్టన్ పరమాణు సిద్ధాంతం, ఈ సూత్రాలను సరళమైన పంథాలో వివరించింది. ధత్వంకు సిద్ధాంతాన్ని ఆయన ఇచ్చాడు.