AP Inter 1st Year Physics Notes Chapter 6 పని, శక్తి, సామర్ధ్యం

Students can go through AP Inter 1st Year Physics Notes 6th Lesson పని, శక్తి, సామర్ధ్యం will help students in revising the entire concepts quickly.

AP Inter 1st Year Physics Notes 6th Lesson పని, శక్తి, సామర్ధ్యం

→ ఏవైన రెండు సదిశలు \(\vec{A}\) మరియు \(\vec{B}\) ల అదిశా లబ్దము లేక బిందు లబ్దములను \(\vec{A}\) . \(\vec{B}\) = AB cos B గా సూచిస్తారు.

→ \(\vec{A}\) మరియు \(\vec{B}\) ల బిందులబ్దము ఒక అదిశ.

→ బిందులబ్దము స్థిత్యంతర న్యాయాన్ని పాటించును. \vec{A} \cdot \vec{B}=\vec{B} \cdot \vec{A}

→ బిందులబ్దము విభాగ న్యాయాన్ని పాటించును. \vec{A} \cdot(\vec{B}+\vec{C})=\vec{A} \cdot \vec{B}+\vec{A} \cdot \vec{C}

→ జరిగిన పని అదిశరాశిని ఇస్తుంది. ఇది ధనాత్మకం లేదా రుణాత్మకం కావచ్చు.

→ వస్తువుపై ఘర్షణ బలం లేక స్నిగ్ధతా బలం చేయుపని రుణాత్మకము.

→ వస్తువుపై పనిచేయు నికరబలం, దాని గతిజశక్తిలోని మార్పుకు సమానము. దీనిని పని-శక్తి సిద్ధాంతంగా చెబుతాము. kf – ki = Wనికర

→ పని-శక్తి సిద్ధాంతం. న్యూటన్స్ రెండవ నియమముపై ఆధారపడదు.

→ పని-శక్తి సిద్ధాంతం ఆంతరిక బలాలకు వర్తిస్తుంది.

→ సంవృత పథంలో ఘర్షణ చేసిన పని సున్నాకాదు. స్థితిజశక్తి, ఘర్షణతో సంబంధాన్ని కలిగి ఉండదు.

→ వస్తువుకు, దాని స్థితి వలన లేక స్థానం వలన లభించే శక్తిని స్థితిజశక్తి అంటారు. h మారుతున్నట్లు తీసుకుంటే V(h) = mgh.

AP Inter 1st Year Physics Notes Chapter 6 పని, శక్తి, సామర్ధ్యం

→ వస్తువుకు చలనం వలన కలిగే శక్తిని, గతిజశక్తి అంటారు. K = \(\frac{1}{2}\)mv2

→ అస్థిర బలం చేయుపని W = \(\int_{x_1}^{x_2}\)F(x)dx

→ వస్తువుపై పనిచేయు బలాలు నిత్యత్వబలాలైతే, వ్యవస్థ మొత్తం యాంత్రిక శక్తి నిత్యత్వమగును.

→ స్ప్రింగ్ బలం నిత్యత్వమగును.

→ ద్రవ్యరాశి – శక్తి సంబంధము E = mc2
ఇచ్చట C = 3 x 108 m/s కాంతివేగము

→ పని జరిగే రేటును సామర్థ్యం అంటారు. Pసరాసరి = \(\frac{W}{t}\)

→ సామర్థ్యం ప్రాయోగిక ప్రమాణం, అశ్వ-సామర్థ్యం (HP). 1.H.P = 746 W

→ వస్తువుల మధ్య అన్యోన్య చర్య జరిగి ద్రవ్యవేగంలో మార్పు జరిగితే దానిని అభిఘాతం అంటారు.

→ స్థితిస్థాపక అభిఘాతంలో గతిజశక్తి మరియు రేఖీయ ద్రవ్యవేగంలు నిత్యత్వమవుతాయి.

AP Inter 1st Year Physics Notes Chapter 6 పని, శక్తి, సామర్ధ్యం

→ అభిఘాతంలో ద్రవ్యవేగం నిత్యత్వ నియమాన్ని పాటించి, గతిజశక్తి నిత్యత్వనియమాన్ని పాటించకపోతే, అటువంటి అభిఘాతాన్ని అస్థితిస్థాపక అభిఘాతం అంటారు.

→ ప్రత్యావస్థాన గుణకం
AP Inter 1st Year Physics Notes Chapter 6 పని, శక్తి, సామర్ధ్యం 1

→ సర్. సి. వి. రామన్ (1888-1970):
సర్ సి. వి. రామన్ 7, 1888లో జన్మించారు. ఈయన ఇండియన్ భౌతిక శాస్త్రవేత్త. 1930లో నోబెల్ బహుమతి లభించింది.

Leave a Comment