AP Inter 1st Year Physics Notes Chapter 8 డోలనాలు

Students can go through AP Inter 1st Year Physics Notes 8th Lesson గురుత్వాకర్షణ will help students in revising the entire concepts quickly.

AP Inter 1st Year Physics Notes 8th Lesson గురుత్వాకర్షణ

→ ఒక వస్తువు మార్గము నిర్ణీత కాలము పిదప పునరావృతమైనచో ఆ చలనము ఆవర్తన చలనము.

→ వస్తువు తన మార్గములో గల ఒక స్థిర బిందువునకు అటు ఇటు చలనములో ఉన్న, దానిని హరాత్మక చలనం అందురు.

→ వస్తువునకు గల త్వరణము, మార్గములో గల స్థిర బిందువు నుండి గల స్థానభ్రంశానికి అనులోమానుపాతంలో ఉండి, స్థిరబిందువుకు అభిముఖంగా ఉంటే ఆ చలనాన్ని సరళ హరాత్మక చలనం అంటారు.

→ వస్తువు ఒకసారి ముందు, వెనుకలకు ప్రయాణించిన ఒక డోలనము అగును.

→ గరిష్ట స్థానభ్రంశంను కంపన పరిమితి అంటారు.

→ సెకనుకు జరిగే డోలనాల సంఖ్యను పౌనఃపున్యం అంటారు.

AP Inter 1st Year Physics Notes Chapter 8 డోలనాలు

→ సరళ హరాత్మక చలనంలో వేగం స్థానభ్రంశాన్ని బట్టి మారుతుంది. దానికి సమీకరణం V = ω\(\sqrt{A^2-y^2}\). మాధ్యమిక స్థానంవద్ద వేగం గరిష్ఠంగానూ, చరమస్థానం వద్ద శూన్యంగానూ ఉంటుంది. Vగరిష్టం = Aω.

→ కణం త్వరణం కూడ స్థానభ్రంశాన్ని బట్టి మారుతుంది. దానికి సమీకరణం a = -ω2y. త్వరణం మాధ్యమిక స్థానం వద్ద శూన్యంగానూ, చరమస్థానం వద్ద గరిష్ఠంగాను ఉంటుంది. aగరిష్టం = Aω2

→ సరళ హరాత్మక చలనంలో ఉన్న కణం వేగం, త్వరణం కాలంతో కూడా ఆవర్తకంగా మార్పు చెందుతాయి. v = Aω cos ωt, a = Aω2sin ωt వాటి మార్పును సూచిస్తాయి.

→ సరళ హరాత్మక చలనంలో ఉన్న కణం తత్కాల స్థానం, గమనదిశా పరంగా దాని కంపన స్థితిని “దశ” అంటారు. దీనిని నిర్దేశ వృత్తంపై కోణీయ స్థానభ్రంశం ‘9 ‘ రూపంలో తెలియచేయవచ్చు. 6 = (at ± Φ0) ఇక్కడ Φ0 తొలి దశ (t = 0 ఉన్నప్పుడు దశ) దీనిని “ముహూర్త దశ” (Epoch) అంటారు.

→ లఘులోలకం చిన్న చిన్న డోలన పరిమితులలో కంపించేటపుడు సరళ హరాత్మక చలనంలో ఉంటుంది. దాని డోలనావర్తన కాలము T = 2π\(\sqrt{\frac{l}{g}}\)

→ భారగ్రస్థ స్ప్రింగ్ చేసే నిలువు కంపనాలు కూడా సరళహరాత్మక డోలనాలే. స్ప్రింగ్ కొనకు వేలాడదీసిన వస్తువు ద్రవ్యరాశి ‘m’ అయితే డోలనావర్తన కాలం T = 2π\(\sqrt{\frac{m}{k}}\)

→ సరళ హరాత్మక చలనంలో ఉన్న కణం గతిశక్తి K.E = \(\frac{1}{2}\)mω2(A2 – y2).

→ సరళ హరాత్మక చలనంలో ఉన్న కణం స్థితిశక్తి P.E = \(\frac{1}{2}\)mω2y2

→ సరళ హరాత్మక చలనం చేస్తున్న కణం మొత్తం శక్తి E = \(\frac{1}{2}\)mω2A2

→ A కంపన పరిమితి, బ కోణీయ పౌనఃపున్యంతో సరళహరాత్మక చలనం
y = A sin (ωt ± θ0) (లేదా) y = A cos (ωt ± θ0)

→ సరళహరాత్మక చలనంలో కణం యొక్క వేగం మరియు త్వరణం
v(t) = -ωA sin (ωt + Φ)
a(t) = -ω2Acos (ωt + Φ) = -ω2x(t)

→ అవరుద్ధ డోలనం ఖచ్ఛితంగా సరళ హరాత్మకం కాదు.

→ శూన్య అవరుద్ధం ఉన్న సందర్భంలో అనునాదం వద్ద స.హ.చ. యొక్క కంపన పరిమితి అనంతం.

→ బలాత్కృత డోలనాలలో కణం యొక్క హరాత్మక చలనం దశ, చోదకబలం యొక్క దశ వేరు వేరుగా ఉంటుంది.

→ డోలకం యొక్క సహజ పౌనఃపున్యానికి, చోదకబలం యొక్క పౌనఃపున్యం దగ్గరగా ఉంటే దానిని అనునాదం

AP Inter 1st Year Physics Notes Chapter 8 డోలనాలు

→ ఒక పూర్తి డోలనానికి పట్టుకాలాన్ని ఆవర్తన కాలం అంటారు. T = \(\frac{2 \pi}{\omega}\)

→ స.హ.చ లో ఉన్న కణం యొక్క వేగం మరియు త్వరణాలు
v = Aω cos ωt మరియు a = Aω2 sin ωt.

→ ఆల్బర్ట్ ఐన్ స్టీన్ (1879-1955)
జర్మనీలోని ఉల్మ్ అనే ప్రదేశంలో (1879లో జన్మించిన ఆల్బర్ట్ ఐన్స్టీన్ న్ను ప్రపంచములోని అత్యంత విశిష్ట భౌతిక శాస్త్రజ్ఞుల్లో ఒకడిగా నభూతో నభవిష్యతి అన్నట్లుగా పరిగణిస్తారు. 1905వ సంవత్సరములో భౌతిక శాస్త్రానికి ఐన్స్టీన్ చేసిన బృహత్తర కృషికి గుర్తింపుగా, 2005 సంవత్సరా నికి భౌతికశాస్త్రపు అంతర్జాతీయ గా ప్రకటించారు.