Students can go through AP Inter 1st Year Physics Notes 9th Lesson గురుత్వాకర్షణ will help students in revising the entire concepts quickly.
AP Inter 1st Year Physics Notes 9th Lesson గురుత్వాకర్షణ
→ ప్రకృతిలోని ప్రాథమిక బలాలు మూడు.
- గురుత్వాకర్షణ బలం,
- విద్యుదయస్కాంత బలం,
- కేంద్రక బలాలు.
→ న్యూటన్ విశ్వ గురుత్వ సిద్ధాంతము : విశ్వములో ప్రతి వస్తువు మరియొక వస్తువుని (ప్రతి కణం మరియొక కణాన్ని) ఆకర్షిస్తుంది. ఈ బలం వాటి ద్రవ్యరాశుల లబ్దమునకు అనులోమానుపాతంలోను, వాటి కేంద్రాల మధ్యదూరం యొక్క వర్గానికి విలోమానుపాతంలోను ఉంటుంది.
→ కణాల మధ్య స్పర్శలేకున్నా వాటి మధ్య ఆకర్షణ బలానికి కారణం గురుత్వ క్షేత్రమని వివరించబడినది.
→ శూన్యంలో గురుత్వ క్షేత్రం కాంతి వేగంతో ప్రయాణిస్తుంది.
→ చీకటి రంధ్రాలు అనేవి అత్యధిక సాంద్రత గల వస్తువులు. వీటి గురుత్వాకర్షణ వలన కాంతి కూడా ఈ పరిధి నుండి దాటి బయటకు రాలేవు.
→ న్యూటన్ మొదటి నియమం లేదా జఢత్వ నియమాన్ని పాటించే నిర్దేశ చట్రాన్ని జఢత్వ నిర్దేశ చట్రం అంటారు. 7 త్వరణంతో పయనించే చట్రాన్ని అజఢత్వ చట్రం అని అంటారు.
→ గురుత్వ, జఢత్వ ద్రవ్యరాశులు సమానం.
→ జఢత్వ, అజఢత్వ నిర్దేశ చట్రాల సమానత్వాన్ని తుల్యతా నియమం అంటారు.
→ భూమి ఉపరితలం నుండి ఎత్తుతో గురుత్వ త్వరణంలో మార్పు gh = g(1 – \(\frac{2 h}{R}\))
→ భూమి ఉపరితలం నుండి లోతుతో గురుత్వ త్వరణంలో మార్పు gd = g(1 – \(\frac{d}{R}\))
→ అక్షాంశంతో గురుత్వ త్వరణంలో మార్పు gΦ = g – Rω2cos2Φ
→ భూమి ఆకారం వల్ల గురుత్వ త్వరణంలో మార్పు వస్తుంది.
→ స్థానిక పరిస్థితుల వల్ల కూడా g విలువలో మార్పు వస్తుంది.
→ ప్రక్షిప్తము గావింపబడిన వస్తువు ఎంత వేగంతో తన కక్ష్యలో పరిభ్రమణం చేస్తుందో దాన్ని కక్ష్యవేగం అంటారు.
V0 = \(\sqrt{g R}=\sqrt{\frac{G M}{R}}\) = 7.92 kms-1
→ భూమి యొక్క ఆకర్షణ బలాన్ని అధిగమించి అంతరాళంలోనికి పోవుటకు వస్తువుని ఎంత కనీస వేగంతో ప్రక్షిప్తం చేయాలో ఆ వేగాన్ని పలాయన వేగం అంటారు.
Ve = \(\sqrt{2 g R}=\sqrt{\frac{2 G M}{R}}\) = 11.2 kms-1
→ పలాయన వేగం V = √2 × కక్ష్యా వేగం (v0).
→ భూస్థావర ఉపగ్రహాలు భూమికి సుమారు 36,000 కి.మీ. ఎత్తున నిర్ణీత కక్ష్యలలో ఉంటాయి.
→ కక్ష్యల నియమం: అన్ని గ్రహాలు, సూర్యుడు ఏదో ఒక నాభి వద్ద ఉన్నప్పుడు దాని చుట్టూ దీర్ఘవృత్తాకార కక్ష్యలో తిరుగుతుంటాయి.
→ వైశాల్యాల నియమం : సూర్యుని నుంచి గ్రహానికి గీచిన వ్యాసార్థ సదిశ సమాన కాల వ్యవధుల్లో సమాన వైశాల్యాలు చిమ్ముతుంది.
→ ఆవర్తన కాలాల నియమం : ఒక గ్రహం కక్ష్యావర్తన కాలవర్గం ఆ గ్రహం దీర్ఘవృత్తాకార కక్ష్య అర్థగురు అక్షం ఘనానికి అనులోమానుపాతంలో ఉంటుంది.
T2 ∝ R3
→ గురుత్వ స్థితిజశక్తి (V) = \(\frac{-G m_1 m_2}{r}\)
→ ధ్రువీయ ఉపగ్రహాల ఆవర్తన కాలం 100 నిముషాలు.
→ ధ్రువీయ కృత్రిమ ఉపగ్రహాలు అల్ప ఉన్నతాంశ ఉపగ్రహాలు. ఈ ఉపగ్రహాలు భూధ్రువాల చుట్టూ ఉత్తర-దక్షిణ దిశలో పరిభ్రమిస్తాయి.
→ జోహాన్నెస్ కెప్లర్ (1571-1630):
జోహాన్నెస్ కెప్లర్ జర్మనీకి చెందిన శాస్త్రవేత్త. ప్రప్రథమంగా ఒక కాంతి కిరణం దూరదర్శనిలోకి ప్రవేశించిన తరవాత ఏమవుతుందో అభివర్ణించడం ద్వారా జ్యామితీయ దృశాశాస్త్రానికి వైద్యునిగా కెప్లర్ పేరు పొందాడు.