Students can go through AP Inter 1st Year Zoology Notes 3rd Lesson జంతు వైవిధ్యం-I: అకశేరుక వర్గాలు will help students in revising the entire concepts quickly.
AP Inter 1st Year Zoology Notes 3rd Lesson జంతు వైవిధ్యం-I: అకశేరుక వర్గాలు
→ నిజమైన పిండ జనన స్తరాలు, నిజమైన కణజాలాలు లేని ఏకైక మోటాజోవా జీవులు స్పంజికలు.
→ కుల్యా వ్యవస్థ, ఎక్కువ టోటిపొటెంట్గా ఉండే కణాలు ఉండటం స్పంజికల ప్రత్యేకత.
→ పినకోడర్మ్, కొయనోడర్మ్ అనేవి శరీర కుడ్యంలోని రెండు ఉపకళాకృతి స్తరాలు.
→ ఆర్కియోసైట్లు టోటిపొటెంట్ కణాలు.
→ జీర్ణక్రియ కణాంతస్థంగా జరుగుతుంది.
→ నాడీ కణాలు లేని ఏకైక మోటాజోవన్లు స్పంజికలు.
→ ఎక్కువ స్పంజికలు అనుక్రమ ఉభయలైంగికాలు.
→ ఇవి పుంభాగ ప్రథమోత్పత్తి లేదా స్త్రీ భాగ ప్రథమోత్పత్తిని ప్రదర్శిస్తాయి.
→ ఫలదీకరణ మీసోహైల్లో జరుగుతుంది.
→ స్పంజికలలో పరోక్ష అభివృద్ధి జరుగుతుంది.
→ వీటిలో ఉండే కొయనోసైట్లు ప్రొటిరోస్పాంజియాకు చెందిన కొయనోసైట్లను పోలి ఉంటాయి.
→ వీటిని పేరాజోవా అనే ఉపరాజ్యంలో చేర్చినారు.
→ అంతరాస్థి పంజరంలో కంటకాలు, స్పాంజిన్ తంతువులు ఉంటాయి.
వర్గము : ప్లాటిహెల్మింథిస్
→ ప్లాటిహెల్మింథిస్ జీవులు త్రిస్తరిత, శరీరకుహర రహిత, బైలేటిరియా జీవులు.
→ బల్లపరుపు పురుగులు ద్విపార్శ్వ సౌష్టవం, శీర్షతను ప్రదర్శిస్తాయి.
→ ఇవి అవయవ – వ్యవస్థ స్థాయి వ్యవస్థీకరణను ప్రదర్శిస్తాయి.
→ నోరు అంతర్ద్రహణానికి, మల విసర్జనకు ఉపయోగపడుతుంది.
→ జీర్ణక్రియ కణాంతస్థంగాను, కణబాహ్యంగాను జరుగుతుంది.
→ ప్రాథమిక వృక్కాలు (జ్వాలా కణాలు) ప్రాథమికంగా ద్రవాభిసరణ క్రమతకు, ద్వితీయంగా విసర్జనకు ఉపయోగ పడతాయి.
→ టర్టలేరియన్లలో శైలికాసహిత బాహ్యచర్మం దేహాన్ని కప్పుతుంది. ఇది రాబ్జాయిడ్లు అనే కడ్డీ వంటి ఆకారపు నిర్మాణాలను స్రవిస్తాయి.
→ పెద్దపేగు టరలేరియన్లలో శాఖాయుతంగా ఉండే ఆహారనాళం పోషకాలను దేహంలోని అన్ని భాగాలకు సరఫరా చేస్తుంది.
→ ట్రిమటోడ్లు, సెస్టోడ్లలో సిన్సీషియల్ టెగ్యుమెంట్ అనే పలుచటి పొర దేహాన్ని కప్పుతుంది.
→ సెస్టోడ్లు మిథ్యా ఖండీభవనాన్ని ప్రదర్శిస్తాయి.
→ ప్రస్తుతం డా, సెప్టోడాను నియోడర్మెటా అనే వర్గీకరణ అంతస్థులో చేర్చినారు.
వర్గము : నిమటోడా
→ ఇవి ప్రతి జాతిలో కణాల సంఖ్య లేదా కేంద్రకాల సంఖ్య నిర్దిష్టంగా ఉంటుంది.
→ చలన శైలికలు వీటిలో ఉండవు.
→ వర్తుల కండరాలు వీటి శరీరంలో కన్పించవు.
→ శరీర కుహరం మిధ్యాశరీర కుహరం. ఈ కుహరాన్ని ఆవరిస్తూ మధ్యత్వచజనిత వేష్టనం ఉండదు.
→ జీర్ణక్రియ కణాంతస్థంగా, కణబాహ్యంగా జరుగుతుంది.
→ నాడీ వ్యవస్థ ఉపకళాంతస్థంగా ఆహారనాళంలోనూ బాహ్యచర్మంలోనూ ఉంటుంది.
→ ఆంఫిడ్లు పూర్వభాగంలో ఉంటాయి. ఇవి యాంత్రిక, రసాయనిక గ్రాహకాలు.
→ ఫాస్మిడ్లు పరాంతంలో ఉండే ఏకకణ గ్రంథులు. ఇవి రసాయన గ్రాహకాలుగా లేదా స్రావక సంబంధమైనవిగా లేదా విసర్జన సంబంధమైనవిగా ఉంటాయి.
→ నిమటోడ్లు ఏకలింగ జీవులు. చాలా జీవులు లైంగిక ద్విరూపకాలుగా ఉంటాయి.
→ యూటెలి అనే దృగ్విషయంలో కణ విభజనలు పిండాభివృద్ధి చివరలో స్తంభించిపోతాయి. కనుక కణాల సంఖ్య స్థిరంగా ఉంటుంది.
→ ఫాస్మీడియాలో ఆంఫిడ్లు రంధ్రాలలాగా ఉంటాయి.
→ విసర్జకవ్యవస్థలో విసర్జక గ్రంథులు లేదా “H” ఆకారపు విసర్జక కుల్యలు లేదా రెండూ ఉంటాయి.
వర్గము : అనెలిడా
→ అనెలిడాలు త్రిస్తరిత, ద్విపార్శ్వ సౌష్టవ, విభక్త కుహర ప్రొటోస్టోమ్లు.
→ ఖండీభవనం వల్ల బొరియలు చేసుకోవడం ప్రభావాత్మకంగా జరుగుతుంది.
→ వీటిలో శీర్షత ఎక్కువ ప్రస్ఫుటంగా ఉంటుంది.
→ వీటిలో ఖండీభవనం సమఖండ రకానికి చెందినది.
→ పైజీడియమ్ ముందుండే టీలోబ్లాస్టిక్ పెరుగుదల ప్రాంతం నుంచి కొత్త ఖండితాలు ఏర్పడతాయి.
→ అనేక పాలికీట్లలో పార్శ్వ పాదాలు మొప్పలుగా రూపాంతరం చెందుతాయి.
→ వీటిలో శ్వాసవర్ణకం ప్లాస్మాలో కరిగి ఉంటుంది. రక్తం ఎరుపు రంగులో కన్పిస్తుంది.
→ విసర్జకాంగాలు అంత్య వృక్కాలు, ఇవి వృక్క ముఖం ద్వారా శరీరంలోకి తెరుచుకుంటాయి. వృక్క రంధ్రం ద్వారా బయటకు తెరుచుకుంటాయి.
→ రూపవిక్రియలో డింభకం యొక్క ఎపిస్ఫియర్ ముఖ పూర్వభాగంగా ఏర్పడుతుంది.
→ పాలికీట్లలో నాడీ దండాలు నిచ్నెనలాగా ఉంటాయి.
→ జలగలో నిర్దిష్ట సంఖ్యలో ఖండితాలు ఉపరితలంపై ఆన్యులైను కలిగి ఉంటాయి.
→ జలగ ఖండితాంతర విభాజకాలు, ఆంత్రయోజనులు ఉండవు.
→ జలగలో శూకాలు, పారాపోడియాలు ఉండవు. కాని చూషకాలు ఉండి చలనంలో సహాయపడతాయి.
→ పోషకాలను నిల్వచేసే బాట్రాయిడల్ కణజాలం ఉండటం వల్ల శరీర కుహరం తగ్గించబడి ఉంటుంది.
→ జలగలు మేహనం ద్వారా (సిర్రస్) సంపర్కం జరిపే ఉభయలైంగిక జీవులు.
→ వానపాములు మేహనం లేకుండానే సంపర్కం జరిపే ఉభయలైంగిక జీవులు.
వర్గము : ఆర్థ్రోపొడా
→ ఆర్థ్రోపొడా అతి పెద్ద వర్గము.
→ ఖండీభవనం విషమఖండ రకానికి చెందినది. ఖండితాలు, ఉపాంగాలు వేర్వేరు విధుల కోసం ఉంటాయి.
→ ఆర్థ్రోపొడు టాగ్మాసిస్ ను ప్రదర్శిస్తుంది. తల, ఉరం, ఉదరం అనేవి టాగ్మాసిస్లు.
→ కీళ్ళు కలిగిన ఉపాంగాలు తులాదండాల లాగా పనిచేసే చలనానికి యాంత్రిక ప్రయోజనాన్ని ఇస్తాయి.
→ వీటిలో కైటిన్ అనే అవభాసిని ఉంటుంది. ఇది రక్షణను ఇస్తుంది. దేహం నుంచి నీరు వృధాగా పోకుండా అరికట్టబడుతుంది.
→ ద్రవరూప అస్థిపంజరం ఉంటుంది.
→ సీలోమ్ క్షీణించి బీజకోశాలు, కోశీయ వృక్కాలకు పరిమితమై ఉంటుంది.
→ జలచర ఆర్థ్రోపొడ్ల విసర్జకాంగాలుగా – కోక్సల్ గ్రంథులు, హరిత గ్రంథులు ఉంటాయి.
→ పిండాభివృద్ధిలో ఏర్పడే చిన్న సీలోమిక్ కుహరాలు బ్లాస్టోసీల్తో కలిసిపోయి హీమోసీల్ను ఏర్పరుస్తాయి.
→ భూచర ఆర్థ్రోపొడ్ల విసర్జకాంగాలు – మాల్ఫీజియన్ నాళికలు.
→ అండాల మధ్య పీతక రకానికి చెందినవి. విదళనం అసంపూర్ణభంజిత, ఉపరితల రకానికి చెందినవి.
→ ట్రైలోబైట్ లలో ఒక జత ఆయత అక్షీయ గాడులు శరీరాన్ని మూడు లంబికలుగా విభజిస్తాయి.
→ కలిసిరేట్లలో మొదటి జత ఉపాంగాలు తెలిసిరాలు. స్పర్శశృంగాలు ఉండవు.
→ అనేక మిలియన్ల సంవత్సరాల నుంచి జీవపరిణామ సంబంధమైన మార్పు లేకుండా జీవిస్తోంది. కనుకనే లిమ్యులస్ ను సజీవ శిలాజంగా పరిగణిస్తారు.
→ ఎర్నాడాలో ఉదర ఉపాంగాలు పుస్తకాకార ఊపిరితిత్తులు, స్పిన్నరెట్లలో పెడిపాల్లు, నాలుగు జతల నడిచే కాళ్ళు ఉంటాయి.
వర్గము : మలస్కా
→ గాస్ట్రోపడ్లు ద్వితీయ అసౌష్టవాన్ని ప్రదర్శిస్తాయి.
→ అంతరాంగ సముదాయంను సృష్టంగా కప్పుతూ ప్రావారం అనే చర్మపు పొర ఉంటుంది.
→ ప్రావార కుహరంలో మొప్పలు, ఆస్ట్రేడియం, పాయువు, వృక్క రంధ్రాలు, జనన రంధ్రాలు ఉంటాయి.
→ శరీర కుహరం హృదయం, బీజకోశాలు, మూత్రపిండాల చుట్టూ కుహరాలు ఉంటాయి.
→ ప్రధాన శరీర కుహరం హీమోసీల్, ఇది వివృత రక్త ప్రసరణ వ్యవస్థకు చెందుతుంది.
→ బైవాల్వియా, కొన్ని గాస్ట్రోపొడా జీవుల జీర్ణాశయంలో జీర్ణ ఎంజైములతో ఏర్పడిన స్ఫటిక దండం ఉంటుంది.
→ మలస్కా జీవుల మొప్పలను కంకభాంగాలు అని అందురు.
→ ప్రావార ఉపకళ ముడతలు పడటం వల్ల ద్వితీయ మొప్పలు ఏర్పడతాయి.
→ కొన్ని గాస్ట్రోపడ్లలో ప్రావార కుహరం ఊపిరితిత్తిగా మార్పు చెంది ఉంటుంది.
→ ఆస్ట్రేడియం అనేది నీటి స్వచ్ఛతను పరీక్షించే ఒక రసాయన గ్రాహకం.
→ ఏకోఫోరా జీవులలో పాదం ఉన్నట్లయితే పాద గాడిలో ఉండే ఒక ముడత రూపంలో ఉంటుంది.
→ పాలిప్లోకోఫోరా జీవుల నాడీ వ్యవస్థలో నాడీసంధులు ఉండవు.
→ నియోపిలైనాను సజీవ శిలాజంగా పరిగణిస్తారు.
→ మలస్కాలో అతి పెద్ద, అతి వైవిధ్యమైన విభాగం గాస్ట్రోపొడా.
→ గాస్ట్రోపోడా జీవులలో టార్షన్ ఫలితంగా ప్రావార కుహరం తలకు వెనుకగా, పైన పూర్వ భాగం వైపుకు వస్తుంది.
→ కాష్టాక్యులా ఆహారాన్ని పట్టుకోవడానికి ఉపయోగపడుతుంది.
→ డెంటాలియంలోని జీవులలో మొప్పలు, ఏట్రియమ్లు ఉండవు.
వర్గము : ఇకైనోడర్మేటా
→ఇవి స్వేచ్ఛగా జీవించే సాగర జీవులు.
→ ఇవి ప్రాథమికంగా ద్విపార్శ్వ సౌష్టవ జీవులు.
→ ప్రౌఢ జీవులు పంచభాగ వ్యాసార్థ సౌష్టవాన్ని కలిగి ఉంటాయి.
→ అంతరాస్థి పంజరంలో అంతశ్చర్మంలో ఉండే కాల్కేరియస్ అస్థిఖండాలు ఉంటాయి.
→ ఎకినాయిడియా జీవుల నోటిలో అరిస్టాటిల్ లాంతరు ఉంటుంది.
→ సముద్ర దోసకాయల చర్మం మృదువుగా, తోలులాగా ఉంటుంది.
→ పెడిసిల్లేరియాలు అనేవి ఆత్మరక్షణకు, దేహాన్ని శుభ్రపరచడానికి ఉపయోగపడే సంయుక్త అస్థిఖండాలు. జలప్రసరణ వ్యవస్థ శరీర కుహరం నుంచి ఏర్పడుతుంది. దీనిలో సముద్ర నీటితో నింపిన కుల్యలు ఉంటాయి.
→ నాళికా పాదాలు చలనానికి, ఆహారాన్ని పట్టుకోవడానికి, వాయువుల వినిమయానికి, విసర్జనకు ఉపయోగ పడతాయి.
→ కైనాయిడియా, ఏస్టరాయిడియాలలో అంబులేక్రల్ గాడులు తెరచుకుంటాయి.
→ హోలో దురాయిడియాలో శ్వాసవృక్షాలు ఉంటాయి.
→ ప్రత్యేకంగా విసర్జకావయవాలు ఉండవు. విసర్జక పదార్థాలు శ్వాస ఉపరితలాల ద్వారా బయటికి వ్యాపనం చెందుతాయి.
→ నాడీ వ్యవస్థలో నాడీ దండం లోపిస్తుంది.
→ అది ఆంత్రం యొక్క ద్వితీయ రంధ్రం నోరుగా ఏర్పడుతుంది.
→ కైనాయిడియా, ఏస్టరాయిడియాలలో నాళికా పాదాలు చూషకరహితంగా ఉంటాయి.
→ రక్త ప్రసరణ వ్యవస్థ తక్కువగా అభివృద్ధి చెంది ఉంటుంది.
వర్గము : హెమికార్డేటా
→ ఈ వర్గములో చిన్న సముదాయము కలిగి క్రిముల పురుగులలాంటి సముద్ర జీవులు.
→ శరీరము స్థూపాకారముగా ఉండి, పూర్వాంతంలో తుండం, కాలర్, పొడవైన మొండెం ఉంటాయి.
→ ఒక మధ్య ఆస్య అంధ బాహువు – స్టోమోకార్డ్ ఉండును. ఇది తుండములో విస్తరించి ఉండును.
→ శ్వాసక్రియ జతలు కలిగిన మొప్ప చీలికల ద్వారా జరుగును.
→ పరోక్ష అభివృద్ధి టార్నేరియా డింభకము కలిగి ఉండును.
→ విభాగము ఎంటిరోన్యూస్థానందు ఉన్న జీవులను ఎకార ్వరు అందురు.
→ టోరో బ్రాంకియా విభాగములో సహనివేశ రాజ్ఞోఫ్లూరా జీవులను చేర్చిరి.
→ ఆంఫిడ్లు : నిమటోడ్ నోటి చుట్టూగల పెదవులపై అవభాసిని నిర్మిత పల్లాలను ఆంఫిడ్లు అంటారు. ఇవి స్వేచ్ఛా నిమటోడ్లలో బాగా అభివృద్ధి చెంది, రసాయన గ్రాహకాలు (chemoreceptor) గా పనిచేస్తాయి.
→ ఆత్మచ్ఛేదనం : ఈ ప్రక్రియలో శరీరానికి ఏదైన గాయం అయినప్పుడు, ఆ భాగాన్ని జీవి తనంతట తాను పరిత్యజిస్తుంది (స్వయంవిచ్ఛిత్తి లేదా అవయవచ్ఛేదనం). శత్రువులు, పరాన్నజీవుల నుంచి దేహాన్ని రక్షించుకోవడానికి ఈ యంత్రాంగం ఇకైనోడర్మేటా జీవులలో అభివృద్ధి చెందింది.
→ బోత్రిడియమ్లు : ఆకు లాంటి అవయవాలు. కొన్ని సెస్టోడా జీవుల స్కోలెక్స్పై ఉంటాయి. ఇవి అతిథేయి దేహ భాగాలను అట్టిపెట్టుకోవడానికి ఉపయోగపడతాయి.
→ సర్కేరియా : ఇది లివర్ ఫ్లూక్ జీవితచరిత్రలో ఏర్పడే స్వేచ్ఛగా ఈదే డింభకం. దీని శరీరం అండాకృతిలో ఉండి తోకను కలిగి ఉంటుంది.
→ కొయనో సైట్లు ; ఇవి స్పంజికల దేహంలో ఉండే ప్రత్యేకమైన కశాభయుత కణాలు. వీటిని కాలర్ కణాలు అని కూడా అంటారు. శరీరంలోని నీటి ప్రవాహాన్ని ఇవి క్రమపరుస్తాయి.
→ కైటెల్లమ్ : ఇది అనెలిడా జీవుల దేహంలోని ఒక నిర్ధిష్ట భాగంలో ఏర్పడే మేఖల వంటి గ్రంథి సంబంధిత నిర్మాణం (ఫెరిటిమాలో 14-16 ఖండితాలు). ప్రజనన కాలంలో ఇది గుడ్లతిత్తిని, శ్వేతకాన్ని (పిల్ల జీవులకు ఆహారం సమకూరుస్తుంది) స్రవిస్తుంది. దీనిని సింగులం అని కూడా అంటారు.
→ గుడ్ల తిత్తి : ఇది అనెలిడా జీవులలోని క్లైటెల్లమ్ నుంచి స్రవించబడిన సంచి లాంటి నిర్మాణం. ఇందులో అండాలు, శుక్రకణాలు నిలువ ఉంటాయి. ఫలదీకరణం, పిండాభివృద్ధి గుడ్లతిత్తి లోపల జరుగుతుంది.
→ కంకాకార ఫలకాలు : ఇవి టీనోఫోరా జీవులలో ఉండే శైలికలు కలిగిన ఫలకాలు. ఇవి గమనానికి ఉపయోగపడతాయి.
→ కంకాభాంగాలు : మలస్కా జీవులలో ఇవి శ్వాసాంగాలు. ప్రతి కంకాభాంగం (మొప్ప) మధ్య అక్షాన్ని కలిగి, ఒకటి లేదా రెండు వరసలలో పటలికలు ఉంటాయి.
→ జ్వాలాకణాలు : ఇవి ప్లాటి హెల్మెంథిస్ జీవులలో విసర్జనకు తోడ్పడే ప్రత్యేక కణాలు. ఇవి విసర్జనతోపాటు ద్రవాభిసరణక్రమతను కూడా నిర్వహిస్తాయి. జ్వాలాకణాలు ప్రాథమిక రకానికి చెందిన విసర్జక అవయవాలు (ఆదిమ వృక్కాలు) గా పరిగణిస్తారు.
→ జెమ్యూల్స్ : కొన్ని స్పంజికలలో అలైంగిక ప్రత్యుత్పత్తికి సహాయపడే అంతర్గత మొగ్గలు. ఇవి ప్రతికూల పరిస్థితులను అధిగమించడానికి తోడ్పడతాయి.
→ రంధ్రఫలకం : ఇది అపరిపక్వ పిల్ల రూపం, ప్రౌఢజీవిని అన్ని విధాలా పోలి ఉంటుంది. : ఇకైనోడర్మేటాకు చెందిన చాలా జీవుల శరీరంపై వర్తులాకారంలో ఉన్న జల్లెడలాంటి ఫలకాన్ని రంధ్ర ఫలకం అంటారు. వీటిలోని రంధ్రాల ద్వారా సముద్రపు నీరు జల ప్రసరణవ్యవస్థలోకి ప్రవేశిస్తుంది.
→ ఆంత్రయోజకాలు : ఇవి సీ అనిమోన్లలో జఠర ప్రసరణ కుహరం (Coelenteron) లో నిలువు విభాజకాలు. ఇవి జఠర కుహరాన్ని గదులుగా విభజిస్తాయి. ఇవి అంతశ్చర్మం లోపలికి మడతలు పడటం వల్ల అభివృద్ధి చెందుతాయి. వీటిలో దంశకణాలు ఉంటాయి.
→ మిరాసీడియం : ఇది స్వేచ్ఛగా ఈదే లివరూక్ డింభకం. దీనికి శైలికాసహిత బాహ్యచర్మం, ప్రవేశక గ్రంథులు ఉంటాయి. ఈ డింభకం మంచినీటి నత్త శరీరంలో స్పోరోసిస్ట్గా మారుతుంది. లివరూక్కు నత్త అకశేరుక అతిథేయి.
→ లిబ్బీ హెన్రియోటా హైమన్
అకశేరుక జంతుశాస్త్రంలో ఎల్. హెచ్. హైమనకు చాలా గొప్ప పేరు ఉంది. హైమన్ 6 సంపూటాలుగా వెలువరించిన సిస్టమాటిక్స్ ఆఫ్ ది ఇన్వర్టిబ్రేట్స్ స్మృతిచిహ్నమైన ముద్రణలు – ఇది జంతుశాస్త్ర చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించ దగిన కృషి.