Students can go through AP Inter 1st Year Zoology Notes 4th Lesson జంతు వైవిధ్యం-II: కార్డేటాల క్లుప్త చరిత్ర will help students in revising the entire concepts quickly.
AP Inter 1st Year Zoology Notes 4th Lesson జంతు వైవిధ్యం-II: కార్డేటాల క్లుప్త చరిత్ర
→ కార్డేట్ లు పృష్ఠవంశంను ప్రదర్శిస్తాయి.
→ కార్డేటా వర్గమును 1880లో బాల్ఫోర్ ప్రతిపాదించెను.
→ ప్రపంచంలో దాదాపు 65,000 జాతుల కార్డేటాలు లభిస్తున్నాయి.
→ కార్డేటా జీవులలో అతి పెద్దది తిమింగలం, బెలనోపిరా మస్కులస్ (35 మీ. పొడవు ఉంటుంది).
→ కార్డేటా జీవులలో పృష్ఠవంశం, పృష్ఠనాళికాయిత నాడీ దండం, గ్రసనీ మొప్ప చీలికలు, పాయు పరపుచ్ఛం అనేవి మౌలిక లక్షణాలు.
→ ఇవి ద్విపార్శ్వ సౌష్ఠవమును ప్రదర్శిస్తాయి.
→ గార్ స్టాంగ్ సిద్ధాంతం ప్రకారం కార్డేట్లు శాబక రూప అరిక్యులేరియా డింభకం నుంచి ఆవిర్భవించినాయి.
→ ఇవి అన్నీ త్రిస్తరిత జీవులు.
→ ఇవి ఎంటిరోసీలిక్ సీలోమ్ను ప్రదర్శిస్తాయి.
→ వీటిలో అంతరాంగాస్థిపంజరం మృదులాస్థితో గాని, అస్థితో గాని నిర్మితమై ఉంటుంది.
→ ఇవి డ్యుటిరోస్టోమియమ్ జంతువులు.
→ గార్ స్టాంగ్ నియోటనీ లార్వా సిద్ధాంతంను ప్రతిపాదించెను. దీని ప్రకారం అరిక్యులేరియా డింభకం నుంచి ఉద్భవించినాయని చెప్పారు.
→ యన్. జె. బెర్రిల్ అసీడియన్ టాడ్పోల్ సిద్ధాంతంను ప్రతిపాదించెను.
→ యూరోకార్డేట్లు సముద్ర జీవులు. వీటి దేహమును కప్పుతూ కంచుకం ఉంటుంది. కనుక వీటిని ట్యూనికేటులు అని అందురు.
→ పృష్ఠవంశం ప్రౌఢజీవిలో ఉండదు. డింభక దశలో తోక ఉంటుంది.
→ లార్వేసియా విభాగంలోని జంతువులు ఏకాంత లేదా సహనివేశ జీవులు, ఇవి శాబకరూపాన్ని ప్రదర్శిస్తాయి. ఉదా : ఆయికోఫ్లూరా.
→ చేపలు మంచినీటిలోను, ఉప్పునీటి కయ్యలలోను, సముద్రపు నీటిలోను జీవిస్తాయి.
→ వీటిలో దాదాపు 40,000 జాతులున్నాయి.
→ ఇవి సైలూరియన్ యుగంలో ఆస్ట్రోకోడెర్మిల నుంచి ఉద్భవించినాయి. డివోనియన్ యుగంను చేపల స్వర్ణయుగంగా పరిగణిస్తారు.
→ సీలకాంతన్ను సజీవ శిలాజంగా వర్ణిస్తారు.
→ అతిచిన్న చేప పీడోసిప్రిస్ ప్రొజెనెటికా (7.9 మి. మీ. పొడవు).
→ ప్రపంచంలోనే అతి పెద్ద చేప రైనోడాన్ టైపస్ (20 మీ. పొడవు).
→ చేపలు మొట్టమొదటి దవడలు గల జంతువులు.
→ ఇవి శీతల రక్త జంతువులు.
→ వీటి శరీరంను కప్పుతూ అస్థిఫలకాలతో నిర్మితమైన పొలుసులు ఉంటాయి.
→ వీటిలో 4 – 7 జతల మొప్పలు ఉంటాయి.
→ పృష్ఠ, ఉదర (పాయువు) పుచ్ఛ వాజాలు మధ్యస్థ లేదా అద్వంద్వ వాజాలు. ఇవి ఈదేటప్పుడు దేహాన్ని స్థిరంగా ఉంచుతాయి. ఉరో, శ్రోణి వాజాలు పార్శ్వ లేదా ద్వంద్వ వాజాలు.
→ కశేరుకాలు ఉభయగర్తి రకానికి చెందినవి. ఉరోమేఖల, శ్రోణిమేఖల ఆయా వాజాలకు ఆధారాన్నిస్తాయి.
→ చేపల హృదయాన్ని సిరా హృదయం అని అందురు. గుండె కండరజనితం, సిరాశయం లయారంభకంగా ఉంటుంది.
→ శరీర పార్శ్వ భాగాలలో పార్శ్వరేఖా జ్ఞానేంద్రియాలు ఉంటాయి. ఇవి నీటిలో సంభవించే మార్పులను గ్రహిస్తాయి.
→ దంతవిన్యాసం బహువార దంద, అగ్రదంత, సమదంత రకానికి చెందినవి.
→ శ్వాసక్రియ ప్రధానంగా మొప్పల ద్వారా జరుగుతుంది. తలకు ఇరువైపులా మొప్ప చాపాలుంటాయి. వీటిపై మొప్ప తంతువులుంటాయి.
→ ఆంఫీబియన్లు నీటిలోను, నేలమీదను జీవించగలవు.
→ కప్పలు, టోడ్లు, సాలమాండర్లు, సిసీలియన్లు, మొదలైనవి ఆంఫీబియాలో ఉంటాయి.
→ సుమారు 2500 జాతులు ఉన్న ఈ తరగతి సకశేరుకాలలో అతి చిన్నది.
→ పురాజీవ శాస్త్రజ్ఞుల ప్రకారం వీటి పూర్వజాలు ఆస్టియోలెపిడ్స్ ఉండవచ్చు.
→ ఇవి శీతల రక్త జంతువులు.
→ వీటి చర్మం నునుపుగా ఉంటుంది. బాహ్యస్థిపంజరం లోపిస్తుంది. (ఎపోడా జీవులు మినహా).
→ ఆన్యురా జీవులలో మధ్య చెవిలో కర్ణస్తంభిక అనే కడ్డీ వంటి నిర్మాణం చేపలలోని హైయోమాండిబులార్గా మార్పు చెందుతుంది.
→ లాలాజల గ్రంధులు ఉండవు.
→ పుర్రెలో రెండు అనుకపాల కందాలుంటాయి. కనుక వీటిని డైకాండైల్ జీవులు అని అంటారు.
→ మూడు గదుల గుండె ఉంటుంది.
→ సిరాశయం లయారంభకంగా ఉంటుంది.
→ రక్తప్రసరణ అసంపూర్ణ ద్వంద్వ ప్రసరణ.
→ ఇవి ఏకలైంగికాలు. లైంగిక ద్విరూపకత ఉండవచ్చు.
→ సంపర్కావయవాలు ఉండవు. (ఎపొడా జీవులు మినహా).
→ బాహ్యఫలదీకరణ జరుగుతుంది. (ఎపొడా జీవులు మినహా).
→ జీవించి ఉన్న ఉభయచర జీవులను మూడు క్రమాలుగా విభజించడం జరిగినది.
- ఎపొడా,
- యూరోడీలా,
- ఏన్యురా.
→ ఎపోడా జీవులలో చరమాంగాలు లోపిస్తాయి. ఇవి బొరియల్లో ఉంటాయి.
→ శరీరం పొడవుగా పాము మాదిరిగా ఉంటుంది.
→ మిసోజోయిక్ యుగమును సరీసృపాల స్వర్ణయుగం అంటారు.
→ సరీసృపాల అధ్యయనాన్ని హెర్పటాలజీ అంటారు.
→ సరీసృపాల పుర్రెలో ఒక అనుకపాలకందం ఉంటుంది. శంఖ ఖాతాలు లేదా కణతిఖాతాలు ఉంటాయి.
→ ఉరోమేఖలలో ‘T’ ఆకారపు అంతరజతృక ఉంటుంది.
→ దవడలకు గల దంతాలు ఎక్రోడాంట్ రకమునకు చెందినవి.
→ నేత్రాలు రంగులను కనిపెట్టగలవు.
→ మగజీవులలో సంపర్క అవయవాలుంటాయి. వీటిని హెమిపెనిస్ అందురు.
→ అభివృద్ధిలో పిండత్వచాలు ఏర్పడతాయి. కొన్ని జీవులు శిశూత్పాదకములు.
→ రెష్ట్రీయాలో 4 క్రమములుంటాయి.
- కిలోనియా,
- రింకోసె ఫాలియా,
- స్క్వామేటా,
- క్రొకడీలియా.
→ అతిపురాతన క్రమము కిలోనియా. ఇందు తాబేళ్ళు చేర్చబడినవి.
→ రింకోసెఫాలియా క్రమంలో జీవించియున్న ఒకే ఒక జీవి స్పీనోడాన్. దీనిని సజీవశిలాజం అందురు.
→ స్క్వామేటా క్రమంలో 2 ఉపక్రమాలున్నాయి.
- లెసర్సీలియా-బల్లులు, తొండలు
- ఒఫీడియా – సర్పాలు.
→ సర్పాలు ప్రపంచంలో మొత్తం 2500 జాతులు. వీటిలో సుమారు 216 జాతులు భారతదేశంలో ఉన్నాయి. సర్పాలు 2 రకాలు.
- విషసర్పాలు
- విషరహిత సర్పాలు.
→ పక్షులు ఈకలు కలిగిన ద్విపాద సకశేరుకాలు.
→ ఇవి అనేక ఉడ్డయిన అనుకూలనాలను చూపే దివ్యమైన సరీసృపాలు.
→ ఇవి థైరాపోడ్ డైనోసార్ల నుంచి జురాసిక్ యుగంలో ఉద్భవించినాయి.
→ ఇవి క్రిటేషియస్ యుగంలో ఆధునీకరణ చెందాయి.
→ టి. హెచ్. హక్స్ లీ వీటిని దివ్యమైన సరీసృపాలుగా అభివర్ణించాడు.
→ జె.జడ్. యంగ్ వీటిని మాస్టర్స్ ఆఫ్ ఎయిర్గా అభివర్ణించాడు.
→ ఇవి దాదాపుగా 9100 పక్షి జాతులు ఉన్నాయి.
→ పూర్వాంగాలు రెక్కలుగా రూపాంతరం చెందినవి.
→ వీటిలో వివిధ రకాలైన ఈకలుంటాయి.
- దేహ పిచ్చాలు,
- రోమ పిచ్చాలు,
- క్విల్ ఈకలు,
- నూగుటీకలు.
→ అతి ప్రాచీన శిలాజము ఆర్కియోప్టెరిక్స్.
→ పక్షులను రెండు ఉపవిభాగాలుగా విభజిస్తారు.
- ఆర్కియోర్నిథెస్,
- నియోరిథెస్.
→ సముద్ర పక్షులను ఒడాంటోనేతే అనే అధిక్రమంలో చేర్చారు. ఇవి విలుప్తమైన పక్షులు.
→ పరిగెత్తే, ఎగరలేని పక్షులను పేలియోనేతే అనే అధిక్రమంలో చేర్చారు.
→ పెంగ్విన్లను ఇంపెన్నే అనే అధిక్రమంలో చేర్చినారు.
→ అధిక్రమం నియోనేతేలో ఎగిరే పక్షులను చేర్చారు. వీటిని 23 క్రమాలుగా విభజించినారు.
→ చర్మంలో ఉండే ఒకే ఒక పెద్ద గ్రంథి తోక ఆధారంలో ఉంటుంది. దీనినే ప్రీస్ గ్రంథి అందురు. పక్షి దీని నుంచి ముక్కుతో తైలాన్ని గ్రహించి ఈకలను శుభ్రం చేసుకుంటుంది.
→ ముక్కుపై ఉండే కొమ్ము స్వభావం గల తొడుగు (రాంఫోథీకా) ఉంటుంది.
→ క్షీరదాలు బాగా అభివృద్ధి చెందిన వెన్నెముక గల జీవులు.
→ ఇవి థైరాప్సిడ్ సరీసృపాల నుంచి ట్రయాసిక్ యుగంలో ఉద్భవించినాయి.
→ ఆధునిక జీవ మహాయుగాన్ని క్షీరదాల యుగం అని అంటారు.
→ రోమర్ చెప్పిన ప్రకారం క్షీరదాలు సరీసృపాల మధ్య ఉన్న ఖాళీని థెరాప్సిడ్ సరీసృపాలు పూర్తిచేసినాయి.
→ లిన్నేయస్ వీటికి క్షీరదాలు అని నామకరణం చేసినాడు.
→ రోమాలు, క్షీరగ్రంథులు, చర్మవసా గ్రంథులు క్షీరదాలలో మాత్రమే ఉంటాయి.
→ సీసోజాయిక్ యుగంను క్షీరదాల యుగం అందురు.
→ వీటిలో దాదాపు 6000 జాతులుంటాయి. వీటిలో ఉపజాతులు దాదాపుగా 12,000 గా ఉన్నాయి.
→ అతి చిన్న క్షీరదం ఎట్రస్కన్ పిగ్మీషూ. (30-40 మి.మీ. 1.5-2. మీ.గ్రా). అతి పెద్ద క్షీరదం నీలి తిమింగలం (బెలనోపిరా మస్కులస్).
→ వీటి శరీరంను కప్పుతూ బాహ్యచర్మం నుంచి ఏర్పడే రోమాలుంటాయి.
→ చర్మం మీద స్వేద గ్రంథులు ఉంటాయి. ఇవి విసర్జనకు, ఉష్ణోగ్రతాక్రమతకు సహాయపడతాయి.
→ ఇవి ఉష్ణరక్త జీవులు.
→ ప్రోటోథీరియాలో తప్ప మిగిలిన వాటిలో క్లోయకా ఉండదు.
→ వృక్క నిర్వాహక వ్యవస్థ ఉండదు.
→ మెటాథీరియన్లను ప్రథమ క్షీరదాలు అందురు.
→ క్షీరదాలలో ఏడు గ్రీవ కశేరుకాలు ఉంటాయి. రెండు కాలి వేళ్ళ స్లాత్లలో ఆరు, మూడు కాలివేళ్ళ స్లాత్లలో తొమ్మిది గ్రీవ కశేరుకాలు ఉంటాయి.
→ వీటిలో దంత విన్యాసం థీకోడాంట్ రకానివి. ఎక్కువగా విషమదంత, ద్వివారదంత రకానికి చెందినవి.
→ కార్టేటా ఏట్రియం : హృదయంలోని గదులలో ఒకటి, చెవిలోని కర్ణభేరి కుహరం; అధిక శాతం ట్యునికేట్లు, సెఫాలో కార్డేటాలలో బాహ్యచర్మం ఆవరించిన విశాలమైన గ్రసనీ వెలుపలి కుహరం.
→ క్రియాటిన్ ఫాస్పేట్ : ఇది అధికశక్తి గల ఫాస్ఫేట్ సమ్మేళనం. ఇది సకశేరుకాలు, కొన్ని అకశేరుకాల కండరాలలో ఉండి ATP పునరుత్పత్తికి ఉపయోగపడుతుంది.
→ అంతరీలితం / ఎండో స్టైల్ : గ్రసని ఉదరకుడ్యంలో శ్లేష్మాన్ని స్రవించే ఆయత శైలికాగాడి ట్యునికేట్స్, సెఫాలో కార్డేట్స్లో, దవడలు లేని చేపల డింభకాలలో ఉంటుంది. ఇది ఆహార పదార్థాలను సేకరించి ఆహారవాహికలోకి తరలించడానికి తోడ్పడుతుంది.
→ గాలన (Filter feeding) భక్షణ : నీటిలో ఉన్న ప్రోటోకార్డేటాలు, ద్వికర్పర జీవులలో శైలికల చర్యలతో ఆహార రేణువులను గాలనం ద్వారా సేకరించి గ్రహిస్తాయి. ఈ విధనమైన భక్షణ విధానాన్ని గాలన భక్షణ అంటారు.
→ మధ్యవృక్కం / మీసోనె : ప్రౌఢ చేపలు, ఉభయచరాలు, ఉల్బధారులు పిండాలలో క్రియాత్మక మూత్రపిండం.
→ నీటిపై తేలియాడే జంతువులు : సముద్రాలు, మహాసముద్రాలలో ఉపరితలంపై జీవించే జంతువులు.
→ నిర్వాహక వ్యవస్థ : పెద్ద సిరల ప్రారంభ, అంత్యాలలో కేశనాళికా ప్లక్షంగా ఉన్న వ్యవస్థ. ఇది సకశేరుకాల కాలేయ, వృక్క నిర్వాహక వ్యవస్థగా ఉంటుంది.
→ తిరోగామి రూపవిక్రియ : అభివృద్ధి చెందిన లక్షణాలు గల డింభకం, రూపవిక్రియలో క్షీణించిన లక్షణాలు గల ప్రౌఢజీవిగా ఏర్పడుతుంది. ఉదా : ఎసిడియన్స్, సాక్యులినా.
→ సొలినో సైట్ : ప్రాధమిక వృక్కంలో గల నాళిక చివరలో గల జ్వాలాకణం లాంటి నిర్మాణం. దీనిలో ఒకటి లేదా ఎక్కువ కశాభాలు ఉంటాయి. ఇవి విసర్జక ద్రవాలను నాళికలోకి తరలిస్తాయి. ఇవి సెఫాలోకార్డేటాలో ఉంటాయి.
→ చేపలు
అగ్రదంతాలు : దవడల అగ్రంలో గర్తాలు లేకుండా అంటుకొని ఉన్న దంతాలు.
→ సంపర్కకంటకాలు : ఇవి మృదులాస్థి మగ చేపల శ్రేణివాజాల పరాంతభాగం నుంచి ఏర్పడతాయి. సంపర్క సమయంలో వీర్యాన్ని (Semen) స్త్రీ జీవి అవస్కరంలోకి ప్రవేశపెట్టడానికి తోడ్పడే అవయవాలు.
→ సీలకాంత్ : రెపిడిస్ట్రియా వర్గానికి చెందిన పురాతన అస్థి చేప. ఇది విలుప్తమైనదని భావించారు. అయితే 1938లో దక్షిణ ఆఫ్రికా సముద్రతీరంలో దీన్ని గుర్తించారు. దీని ప్రజాతి లాటిమీరియాలో రెండు జాతులు ఇప్పటికీ ఉన్నాయి.
→ టీనాయిడ్ పొలుసులు : చేప పొలుసుల అంచులు దువ్వెన దంతాల లాగా పొడుచుకొని ఉంటాయి. ఇవి చాలా టీలియోస్ట్ చేపలలో ఉంటాయి.
→ సైక్లాయిడ్ పొలుసులు : చేప పొలుసులు పలుచగా, ఏకకేంద్రక పెరుగుదల చారలతో ఉంటాయి. పొలుసు అంచులు రంపం లాగా ఉండవు. ఇవి ఊపిరితిత్తుల చేపలు, కొన్ని టీలియోస్ట్ చేపలలో ఉంటాయి.
→ డిప్నాయ్ : ఈ సమూహ చేపలను సాధారణంగా ఊపిరితిత్తులు చేపలు (Lung fishes) అంటారు. వీటి ఊపిరితిత్తులు గాలితిత్తులు మార్పు చెందగా ఏర్పడినవి. ఉదా : ప్రొటాప్టిరస్, నియోసెరాటోడస్, లెపిడోసైరన్.
→ గానాయిడ్ పొలుసులు : కొన్ని ప్రాథమిక అస్థి చేపలలో గల మందమైన అస్థి పొలుసులు. ఉదా : ఎసిపెన్సర్.
→ ఆస్ట్రకోడర్మ్ : విలుప్తమైన, చేపల లాంటి దవడలు లేని పేలియోజాయిక్ సకశేరుకాలు. ఇవి శరీరంపై అధికంగా కవచాలను కలిగి ఉంటాయి. వీటిని దవడల చేపల వంశకర్తలు (పూర్వీకులు) అంటారు.
→ ప్లాకాయిడ్ పొలుసులు : ఈ పొలుసులు మృదులాస్థి చేపలలో కనిపిస్తాయి. డెంటైన్ నిర్మిత ఆధారఫలకం చర్మంలో ఇమిడి ఉంటుంది. ఫలకం నుంచి వెనకకు వంగిన కంటకం, దీని చివర విట్రోడెంటైన్తో ఉంటుంది.
→ బహువార (polyphyodont) దంతాలు : ఈ విధమైన దంత విన్యాసంలో సకశేరుకాలు జీవితకాలంలో దంతాలు సహజంగా అనేకసార్లు ఊడిపోయి మళ్ళీ కొత్తవి ఏర్పడతాయి.
కిరణవాజ చేపలు : ఇవి అధిక వైవిధ్యం గల జలచర సకశేరుకాలు. జీవించి ఉన్న సకశేరుకాల జాతులలో సగం కంటే ఎక్కువ కిరణవాజ చేపలున్నాయి.
→ ఉభయచరాలు
వాయుకోశం (Alveolus) : ఇది ఊపిరితిత్తులలో సూక్ష్మమైన వాయుగోణి. ఇది చిన్న కుహరం లేదా గుంట రూపంలో ఉంటుంది. వాయుకోశ గ్రంథి చివరలో లేదా క్షీరదాలు, మొసళ్ళ దవడల అస్థిగర్తాలలో కూడా కనిపిస్తుంది.
→ సంపర్కం లేదా ఆంప్లెక్సస్ : స్త్రీ, పురుష కప్పలు లేదా గోదురుకప్పలు సంపర్క ఆలింగనంలో వాటి వాటి బీజకణాలను విడుదల చేస్తాయి.
→ కైమ్ : జీర్ణాశయంలో పాక్షికంగా జీర్ణమైన అర్ధద్రవ ఆహారం.
→ కర్ణస్తంభిక : కప్పలు, సరీసృపాలు, పక్షుల మధ్య చెవిలో ఉండే కడ్డి లాంటి ఎముక. ఇది శబ్దాన్ని లోపలి చెవిలోకి చేరవేస్తుంది. ఇది క్షీరదాల స్టేపిస్ / కర్ణాంతరాస్థికి సమజాత నిర్మాణం (చేపలలోని అధోహనువు మార్పు చెందిన రూపం).
→ ధమనీ శంకువు (Conus arteriosus) : ఇది అద్వంద్వ లేదా ఒకటిగా ఉన్న వెడల్పయిన ధమనీ నాళం. ఇది జరఠిక నుంచి వెలువడి ఉదరతలంగా కుడి కర్ణిక ఆట్రియం మీదుగా పయనిస్తుంది. ఉల్బధారులలో ధమనీ శంకువు ఉండదు.
→ వరాశిక (Duramater) : మెదడును, నాడీదండాన్ని ఆవరించి ఉన్న మూడు త్వచాలలో (మెనింజెస్) అత్యధిక తంతుయుత, అత్యంత ధృఢమైన, అన్నిటికన్నా వెలుపల ఉన్న త్వచం.
→ హార్డేరియన్ గ్రంథి : నేత్రంతో సంబంధం ఉన్న గ్రంథి. వివిధ జంతు సమూహాలలో దీని స్రావాలు వైవిధ్యాన్ని ప్రదర్శిస్తాయి. కొన్ని జంతువులలో అశ్రుగ్రంథికి (lacrimal gland) అనుబంధ గ్రంథిగా ఉంటుంది. దీని స్రావకం నిమేషక పటలానికి నేత్రగోళానికి మధ్య కందెనగా తోడ్పడుతుంది.
→ లాబరింథోడాన్షియా : అతికాయ (Heavy bodied) సాలమాండర్స్, మొసళ్ళను పోలిన విలుప్త ఉభయచరాల సమూహం. వీటి శంఖాకార దంతం ఆధారంలో ముడతపడిన ఎనామిల్, డెంటైన్ ను కలిగి ఉంటాయి. ఉదా : ఇరియాప్స్.
→ అశ్రుగ్రంథులు (lacrymal glands) : ప్రతీ నేత్రంలో ఒకటి చొప్పున ఒక జత గ్రంథులు ఉంటాయి. ఇవి లైసోజైమ్ గల నీటి ద్రవాలను (కన్నీరు) స్రవిస్తాయి.
→ పశ్చిమగర్తి కశేరుకాలు (Opisthocoelus vertebra) : వీటిలో కశేరుమధ్యం పూర్వభాగం కుంభాకారంగా, పరాంతం పుటాకారంగా ఉంటుంది. ఇవి యురోడీలా జీవులలో ఉంటాయి.
→ మృధ్వి (Piamater) : మెదడు, నాడీదండాన్ని కప్పిన మృదువైన, లోపలి ప్రసరణ త్వచం. ఇది రక్తపక్షాన్ని ఏర్పరుస్తుంది.
→ సిరాసరణి/సిరాకోశం (Sinus venosus) : మహాసిర, కుడికర్ణిక మధ్య ఉన్న విశాలభాగం, కప్ప హృదయంలో సిరాసరణి లయారంభకంగా పనిచేస్తుంది. (క్షీరద హృదయంలోని సిరాకర్ణికాకణుపు సిరాసరణి పరిణామ క్రమంలోని మిగిలిపోయిన గుర్తు).
→ సరీసృపాలు అళిందం (Allontois):
ఉల్బదారుల నాలుగు పిండ బాహ్యత్వచాలలో ఇది ఒకటి. ఇది సారాప్సిడాలో శ్వాసక్రియ, విసర్జనలో పాల్గొంటుంది. అంతేకాకుండా అనేక థీరియా క్షీరదాల జరాయువు నిర్మాణంలో పాల్గొంటుంది.
→ ఉల్బం (Amnion) : పిండ బాహ్యత్వచాలలో ఇది లోపలి త్వచం. ఇది ఉల్బధారులలో పిండాన్ని కప్పి ఉంచే ద్రవంతో నిండిన సంచి. ఇది రక్షణ కల్పిస్తుంది (కుదుపులు, ఎండిపోకుండా రక్షిస్తుంది).
→ పరాయువు (Chorion) : ఉల్బదారులలో పిండాన్ని కప్పి ఉంచే పిండ బాహ్యత్వచాలలో వెలుపలిది. జరాయు క్షీరదాలలో ఇది అందంతో కలిసి జరాయువును ఏర్పరుస్తుంది.
→ అర్ధమేహనం (Hemipenis) : పురుష స్క్వామాటా జీవులలో (పాములు, బల్లులు) సంపర్కానికి ఉపయోగపడే నిర్మాణం.
→ అంతర్భంజిత (Meroblastic) విదళనం : అధిక పీతక గుడ్లలో పాక్షిక విదళనం జరుగుతుంది. జాంతవధ్రువం వద్ద జీవ పదార్థ చక్రిక వరకు మాత్రమే విదళనం జరుగుతుంది. ఉదా : సారాప్సిడ్లు, మోనోట్రెమ్లు.
→ అంత్యవృక్కం : ప్రౌఢ ఉల్బదారులలో క్రియాత్మక మూత్రపిండం. ఇది అధిక సమర్ధత గల మూత్రపిండం.
→ శంఖ ఖాతాలు (Temporal fossae) : ఇది ఉల్బదారుల సమూహం. ఇందులో విలుప్త, జీవిస్తున్న సరీసృపాలు, పక్షులను చేర్చారు.
→ పక్షులు : అనేక సరీసృపాల పుర్రెలోని శంఖ భాగాలలో గుంతల లాంటి భాగాలు ఉంటాయి. ఇవి కండరాలు ఉండటానికి స్థానం కల్పిస్తాయి.
→ అల్ట్రీషియల్ పక్షిపిల్ల : ఇది ఎగిరే పక్షులలో అప్పుడే పొదగబడిన పిల్ల. పొదిగిన వెంటనే దానంతట అదే కదలలేదు.
→ కేరినేటి పక్షులు : వీటిలో ఉడ్డయన కండరాలు అంటి పెట్టుకోడానికి ద్రోణియుత ఉరోస్థి ఉంటుంది. ఉదా : ఎగిరేపక్షులు.
→ విషమగర్తి(Heterocoelous) కశేరుకాలు : ఈ కశేరుకానికి కశేరుమధ్యం సంధితలాలు గుర్రం జీను ఆకారంలో ఉంటాయి.
→ పెక్టిన్ : ఇది వర్ణక, ప్రసరణయుత దువ్వెన లాంటి కీలితం. ఇది పక్షులు, కొన్ని సరీసృపాలలోని కంటిలోనేత్ర పటలం నుంచి దృక్నడి ప్రవేశం వద్ద కచావత్ తర్పకం లోకి చొచ్చుకొని ఉంటుంది.
→ అకాల పక్వ(Precocral) పక్షిపిల్ల : ఎగరలేని పక్షులు అప్పుడే పొదగబడిన పిల్ల. పొదగబడిన వెంటనే ఇది దానంతట అదే కదులుతుంది.
→ ధీరోపాడ్స్ : ఇది విలుప్త, ద్విపాద, మాంసాహార డైనోసార్లు. జురాసిక్ యుగం ప్రారంభంలో ఇవి పక్షులను ఏర్పరచాయి.
→ కాచవత్ తర్పకం (Vitreoushumor): ఇది మానవులు, ఇతర సకశేరుకాల కనుగుడ్డులోని నేత్రపటలం, కటకం మధ్య స్థలంలోఉండే తేటజిగట పదార్థం.
→ క్షీరదాలు కర్ణావర్తం (Cochlea) : మొసళ్లు, పక్షులు, క్షీరదాలలో లోపల చెవిలో వినికిడికి తోడ్పడే నాళాకార కుహరం, ముఖ్య అవయవాలు ఉంటాయి. యూథీరియన్లలో ‘కొర్టీ అవయవంతో మెలితిరిగి ఉండే ప్రత్యేక శబ్దగ్రాహక ప్రాంతం.
→ ద్వివార దంత (Diphyodont) విన్యాసం : దంతాలు రెండుసార్లు ఏర్పడే దంత విన్యాసం. ఇవి తాత్కాలిక దంతాలు, శాశ్వత దంతాలు. ఒకటి తరువాత మరొకటి ఏర్పడతాయి.
→ విషమ దంత (Heterodont) విన్యాసం : ఈ దంత విన్యాసంలో కొరకడానికి, చీల్చడానికి, విసరడానికి తోడ్పడే విధంగా వైవిధ్యం చెందిన దంతాలు ఉంటాయి.
→ కూటకం (Malleus) : క్షీరదాల మధ్య చెవిలో కర్ణభేరికి అతికి ఉన్న వెలుపలి కర్ణాస్థి (వంశకర్తల ఆర్టిక్యులార్ ఎముక మార్పు చెందిన రూపం).
→ జరాయువు(Placenta) : తల్లి కణజాలం, పిండ కణజాలం నుంచి ఏర్పడిన ప్రసరణయుత నిర్మాణం. దీని ద్వారా పిండం, భ్రూణం గర్భాశయంలో ఉన్నప్పుడు పోషించబడుతుంది.
→ చర్మవసాగ్రంథులు (Sebaceous) : ఇవి క్షీరదాల రోమబాహ్యచర్మ గ్రంథులలో ఒక రకం. ఇవి రోమాలను నునుపుగా నిగనిగలాడించే సెబమ్ను స్రవిస్తాయి.
→ కర్ణాంతరాస్థి (Stapes) : క్షీరదాల మధ్యచెవి లోపలి రికాబు ఆకారపు అస్థి (అధోహనువు రూపాంతరం). క్షీరదాల శరీరంలో అతి చిన్న ఎముక.
→ సుడోరిఫెరస్ గ్రంథులు : చర్మంలోని బాహ్యచర్మగ్రంథులు, వీటి స్రావకాలు (చెమట) విసర్జనకు, ఉష్ణక్రమతకు తోడ్పడతాయి. ఇవి కేవలం క్షీరదాలలోనే ఉంటాయి.
→ థీరాప్సిడా : ఇవి క్షీరదాలు లాంటి విలుప్త సరీసృపాలు. ట్రయాసిక్ యుగంలో ఇవి క్షీరదాలను ఏర్పరచాయి.
→ ఆల్ఫ్రెడ్ షేర్ వుడ్ రోమర్
ఆల్ఫ్రెడ్ షేర్వడ్ రోమర్ ప్రఖ్యాత పురాజీవ శాస్త్రజ్ఞుడు. తులనాత్మక అంతర శరీరనిర్మాణ శాస్త్రజ్ఞుడు. సకశేరుకాల పరిణామ అధ్యయనంలో ప్రత్యేకత కలిగినవాడు.